రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకులకు.. ఎమ్మెల్యే నివాళి
దేవరకద్ర/ నేటి ధాత్రి.
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన యువకులు చరణ్ రెడ్డి, అనిల్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మంగళవారం చరణ్ రెడ్డి, అనిల్ భౌతిక దేహాలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరం అన్నారు. నివాళులర్పించిన వారిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.