మడిపల్లిలో మహాయజ్ఞం
మడిపల్లిలో మహాయజ్ఞం మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం బొడ్రాయి ఉత్సవాల చివరిరోజు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు బొడ్రాయి వద్ద పూజలు చేసి మహాయజ్ఞం చేశారు. గ్రామస్తులంతా కలసివచ్చి గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రతిష్టించిన అమ్మవార్లకు కొత్తబట్టలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి తమతమ మొక్కులు తీర్చుకున్నారు. వేదపండితులతో ప్రతిఒక్కరు అమ్మవార్ల దీవెనెలు తీసుకున్నారు. గ్రామంలోని వారందరు చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులందరూ…