ప్రాణాపాయ పరిస్థితి లో ఉన్న ముంపు గ్రామవాసి కి మన చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

వేములవాడ, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ టాన గ్రామం. కల్మషం లేని మనిషి. తనతో పాటు అందరూ బాగుండాలని కోరుకునే అందరి ఆత్మీయుడు. తన పని తాను చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ. తన రెక్కల కష్టమే తన కుటుంబానికి ఓ పెద్ద దిక్కు. విధి వెక్కిరించింది. మొన్న సాయంత్రం ఓ ప్రమాదం ఎదురైంది. ఆ ప్రమాదమే తన ప్రాణాల మీదకు తెచ్చింది. మొన్న జరిగిన రోడ్డు ప్రమాదం లో తలకు తీవ్ర గాయాలై.ప్రాణాపాయ పరిస్థితి లో ఉన్నాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం హైదరాబాద్ యశోదా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. చాలా ఖర్చుతో కూడిన చికిత్స. దాదాపు 8 లక్షల నుండి 10 లక్షల ఖర్చు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. నిరుపేద కుటుంబం. తన కష్టంతో కుటుంబాన్ని నెట్టుకస్తున్నడు. ఆనాడు ముంపు కు గురై. ఇల్లు, భూములు కోల్పోయి. ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో బ్రతుకు జీవనం కొనసాగిస్తున్నారు. చికిత్స కు కూడా చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి వాళ్ళది. అని మన చారిటబుల్ దృష్టి కి రాగానే మా వంతు సహాయంగా 14,600 ట్రస్ట్ సభ్యుల సహాయంతో జమ చేసి మానవత్వంతో అందించడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో మన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *