
ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావుకు శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర ఆహ్వానం
భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీలో కొలువై ఉన్న శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయంలో గత 14 సంవత్సరాలుగా వనదేవతల ఆశీస్సులు, కృపాకటాక్షాలతో భక్తులచే సాంప్రదాయంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవము ఆహ్వానమును భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావుకు ఆలయ ధర్మకర్తలు మరియు జాతర నిర్వాహకులు కుంజా ధర్మారావు, కుంజా సంతోష్ కుమార్, కుర్సం విశ్వశాంతి అందచేశారు. ఈ గిరిజనుల ఇలవేల్పుల జాతర ది. 22-04-2024…