అనుచిత ఉచితాలతో అనర్థాలు

ఈ ‘ఉచిత’ సంస్కృతి మానకపోతే రాష్ట్రాలు నిండా మునగడం ఖాయం

అయోగ్య ‘ఉచితాల’నుంచి ప్రభుత్వాలు బయటపడాలి

ఉచితాలు కావాలని ప్రజలు కోరడంలేదు

అలవాటు చేసి తలకు రోకలి చుట్టుకుంటున్న పార్టీలు

పరాన్న భక్కులను తయారుచేస్తున్న ఉచితాలు

అధికారం మత్తులో పట్టించుకోని పార్టీలు

పార్టీల నిర్వాకానికి అప్పుల ఊబిలో రాష్ట్రాలు

హైదరామాద్‌,నేటిధాత్రి:
ఎన్నికలముందు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న ‘ఉచిత’ హామీలు ప్రజలను సోమరిపోతుల్లాగా, పరాన్నభుక్తులుగా మారేలా చేస్తున్నాయంటూ బుధవారం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యం. ఈ అనుచిత ఉచితాలతో ప్రజలు ఇక పనిపై దృష్టిపెట్టరు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పడం రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక వంటిదే. ఈ ఉచితాల వల్ల మనుషులు పనిచేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఉచిత రేషన్లు, పనిచేయకుండానే డబ్బులు చేతిలో పడుతుండటంతో ఎవరు పనిచేయడానికి ఇష్టపడతారు? ఈవిధంగా దేశంలో ‘పరాన్నభుక్తుల’ వర్గాన్ని మనం చేజేతులారా తయారుచేస్తున్నామని కోర్టు వ్యా ఖ్యానించింది. నిజానికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న చాలా సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను నిరుపేదల ఖాతాల్లోకి నేరుగా జమచేస్తున్నారు. అర్హులకు ఇది అందితే ఫర్వాలేదు. కానీ అనర్హుల ఖాతాల్లోకి కూడా ఇవి వెళితే వారిక పనిచేయడం మానేస్తారు. ఆవిధంగా పనిచేసే సామర్థ్యమున్నవారి విషయంలో ఇది ఎంత మాత్రం శ్రేయస్కర ఫలితాలనివ్వదు. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయపార్టీలకు ఆయా పథకాలు ఉపకరిస్తాయేమో కాని, ప్రభుత్వ ఆర్థికవ్యవస్థతో పాటు శ్రామిక మార్కెట్లు దారుణంగా దెబ్బతింటాయన్న సంగతిని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా రు.
అన్నీ ఉచితంగా లభిస్తున్నప్పుడు ఎవ్వరూ పనికెళ్లరు. ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రతికూల ప్రభావం ఎక్కువ. ఉచితరేషన్‌ను చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా చాలా గ్రామాల్లో వ్యవసాయ సీజన్‌లో శ్రామికులు దొరకని పరిస్థితి! అన్నీ ఉచితంగా లభిస్తుంటేపనికెళ్లేవారెవరు? పొట్ట నింపుకోవడానికే పనికెళ్లడం! ఇంటివద్దే పొట్ట నిండుతుంటే పనినెవరు పట్టించుకుంటారు? సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో, రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల వాగ్దానాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈవిధంగా ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే రీతిలో హామీలివ్వడం, నగదు ప్రోత్సాహకాల పంపిణీ వంటివి ఎన్నికల చట్టాల పరిధి లో నేరంగా పరిగణించే విషయంలో సుప్రీంకోర్టు మరింత కఠినంగా వ్యవహరించాలి. ఈ నేప థ్యంలో, ఇటువంటి హామీలు ఎన్నికల చట్టాల ఉల్లంఘనకిందికి రాదని 2013లో తానిచ్చిన తీ ర్పును సరిదిద్దే అవకాశం వుంది. అయితే ఇటువంటి అంశాలపై న్యాయవ్యవస్థ కల్పించుకోవడంఎంతవరకు సమంజసం? వీటికి సంబంధించి తగిన ఆదేశాలు జారీచేయవచ్చా? లేక ఇటువంటి విధానాలను నియంత్రించేందుకు ఒక ప్రత్యేక ‘బాడీ’ని ఏర్పాటు చేయాలా? అనే అంశాలపై విచారణ 2022నుంచి సుప్రీకోర్టు వద్ద పెండిరగ్‌లో వుంది.
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ నిత్యావసరాలను అందుబాటు ధరల్లో అందించేఉద్దేశంతో కొన్ని వస్తువులపై సబ్సిడీలు ప్రకటించడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు సబ్సిడీ స్థాయిని దాటి ఉచితాల దశకు చేరుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సబ్సిడీకి,ఉచితాలకు మధ్య ఉన్న విభజనరేఖను రాజకీయ పార్టీలు చెరిపేశాయనే చెప్పాలి. ఇందుకు కారణం రాజకీయపార్టీల మధ్య వుండే నిర్లక్ష్యపూరిత పోటీ!
ఈ ఉచితాల ప్రభావంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చే సింది. దీని ప్రకారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తాము రాయితీ ఇవ్వాలనుకుంటున్న వాటిల్లో కొ న్నింటిని ఉచితంగా ప్రజలకు అందించడానికి ముందుకొస్తున్నాయి. అయితే ఈ ఉచితాలకు ఒక స్పష్టమైన నిర్వచనం లేదు. ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేవి అయితే అటువంటి సబ్సి డీలవల్ల ఇబ్బంది వుండదు. ఉదాహరణకు ప్రజాపంపిణీ వ్యవస్థ, ఉపాధి హామీ పథకాలు, విద్య, ఆరోగ్య అంశాలకు ప్రభుత్వ మద్దతు వంటివి సామాజిక ప్రయోజనానికి, ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి. కానీ ఉచిత విద్యుత్‌, ఉచితంగా మంచినీటి సరఫరా, ఉచిత రవాణా సదు పాయం, పెండిరగ్‌లో వున్న రుణాలను రద్దు చేయడం వంటివి ‘ఉచితాలు’గా చెప్పవచ్చు. ఇవి రుణాలు తీసుకునే సంస్కృతినే దారుణంగా దెబ్బతీస్తాయి. ఎట్లా అంటే ఒక వ్యక్తి తన స్థాయికి తగిన రుణాన్ని తీసుకొని తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తాడు. అదే ప్రభుత్వమే ఆ చెల్లింపు జరిపితే రుణాలు తీసుకోవడంలో ప్రజలు బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తారు. ఇక క్రాస్‌`సబ్సిడైజేషన్‌ ( అంటే ఒక వర్గానికి ప్రయోజనం కలిగించేందుకు మరో వర్గంవారిపై ఎక్కువ ధరలు విధించడం) ప్రైవేటు పెట్టుబడులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఇక వర్తమాన ధరల ప్రకారం ఎటువంటి ప్రోత్సాహకాలు లేని పనివల్ల, శ్రామికుల భాగస్వామ్యం దారుణంగా పడిపోతుందని ఈ పరిశోధనా పత్రం వెల్లడిరచింది.
కొన్ని రకాల ఉచిత పథకాలు తక్కువ లీకేజ్‌లతో నిజమైన లబ్దిదారులకు ప్రయోజనం కలిగించవచ్చు. అయితే ఇందుకు వెచ్చిస్తున్న పెద్దమొత్తం నిధులవల్ల కలుగుతున్న ప్రయోజనాలను కచ్చి తంగా అంచనా వేయాలి. లేకపోతే ఈ ఉచితాలవల్ల ధరల్లో వచ్చే వికృత మార్పులు, ప్రజల్లో పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే కాదు వనరుల దుర్వినియోగం కూడా సాధ్యం. ఉచిత విద్యుత్‌, ఉచిత నీటి సరఫరా వల్ల ఒకపక్క పర్యావరణం దెబ్బతింటే మరోపక్క విచ్చలవిడి నీటి వినియోగం వల్ల నీటితావులు ఎండిపోయే ప్రమాదముంది. ఉదాహరణకు గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేస్తామని ప్రకటించింది. ఇది అప్పట్లో పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతినడమే కాదు, నెలవారీ జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. ఇటువంటి పరిస్థితిలో అభివృద్ధి మాట ఎత్తడం సాధ్యమా? విచిత్రంగా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు పరచడానికి ఆసక్తి చూపాయి. ఈ నేపథ్యంలో ‘‘స్టేట్‌ ఫైనాన్సెస్‌: ఎ స్టడీ ఆఫ్‌ బడ్జెట్‌ 2023`24’ పేరిట రిజర్వ్‌ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో, ఈ పథకాన్ని అమలు చేయడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు ఆత్మహత్యా సదృశం వంటిదని పేర్కొంది. దీని అమ లు రాష్ట్రాల అభివృద్ధిని పరిమితం చేస్తుందని కూడా హెచ్చరించింది. ప్రస్తుతం అమల్లో వున్న జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) స్థానంలో గతంలో రద్దుచేసిన ఓల్డ్‌ పింఛను విధానాన్ని అమల్లోకి తెస్తే ఎన్‌పీఎస్‌ కింద చెల్లించే మొత్తం కంటే 4.5శాతం అధిక మొత్తాన్ని ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సి వుంటుంది. 2060 నాటికి దేశ జీడీపీలో ఈ చెల్లింపులు వార్షికంగా 0.9%కు చేరుకుంటాయని కూడా పేర్కొంది. పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాలు కూడా అలవిమాలిన ఉచితాలు ప్రకటించి ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాయి.
కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ వంటి విపక్ష పార్టీలు విద్యుత్‌ సబ్సిడీపై హామీలు గుప్పిస్తున్నాయి. పరి శీలిస్తే వివిధ రాష్ట్రాలు కొన్ని యూనిట్ల వరకు విద్యుత్‌ సబ్సిడీని అమలు చేస్తున్నాయి. ఈ సబ్సిడీల చెల్లింపుకు తమ ఆదాయంలో 8 నుంచి 9శాతం వరకు ఖర్చుచేయాల్సి వస్తుండటంతో ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఇబ్బందులకు గురవుతోంది. ఇటువంటి అయోగ్య సబ్సిడీలు ఆయా రాష్ట్రాల పెట్టుబడి వ్యయాలకు పెద్ద అడ్డంకిగా మారాయని ఆర్‌.బి.ఐ. నివేదిక స్పష్టం చేసింది.
ఫాలే ఇండియా ఫౌండేషన్‌ విడుదల చేసిన నివేదిక కూడా ఉచిత విద్యుత్‌ వల్ల ఆర్థికంగా రాష్ట్రాలకు అనర్థదాయకమని స్పష్టం చేసింది. పంజాబ్‌ వంటి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఈ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయడమే ఉచితమని కూడా సూచించింది.
కేవలం అధికారమే పరమావధిగా, నిర్లక్ష్య పూరిత వైఖరితో పార్టీలు అనుసరిస్తున్న ఈ ఉచితాల సంస్కృతివల్ల ప్రధానంగా నష్టపోయేది పన్ను చెల్లింపుదార్లు. తామిచ్చిన ఉచితహామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను కేవలం పన్నుల విధింపు ద్వారానే ప్రజల జేబులకు చిల్లులు పెట్టి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. అభివృద్ధికి పెద్దమొత్తంలో పెట్టుబడి వ్యయం అవసరం. కానీ వచ్చిన ఆదాయంలో సింహభాంగా ఈ ఉచితాలకే పోతుంటే, ఇక అభివృద్ధి మాటెక్కడ? పన్నుల పెంపుకూడా ఒక స్థాయి వరకే చేపట్టగలవు. ఆ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చే యక తప్పడంలేదు. ఒక్కసారి అప్పు తీసుకోవడం మొదలైతే ఆ ఊబినుంచి బయటపడటం ఎవ్వరి వల్లా కాదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయాయంటే ప్రధాన కారణం ఈ అనుచిత ఉచితాలే! నిర్లక్ష్య రాజకీయ పార్టీలు, ఆలోచన లేని ఓటర్లు ఈ ఉచితాల మాయలో పడి అభివృద్ధిని పట్టించుకోకపోవడం వర్తమాన విషాదం!

వెలుగులోకి సోమనాథ క్షేత్ర నిజ శివలింగ భగ్నావశేషం

సోమనాధ దేవాలయంలో ప్రతిష్టకు సన్నాహాలు

ప్రతిష్ట బాధ్యతలు స్వీకరించిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అధినేత శ్రీశ్రీ రవిశంకర్‌

ప్రత్యేక అయస్కాంత లక్షణాన్ని కోల్పోని శివలింగం

అప్పట్లో భూమిపై రెండడుగుల ఎత్తులో శివలింగం వుండేది

శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘజనీ

కొన్ని అవశేళాలను భద్రపరచిన అగ్నిహోత్రీయ బ్రాహ్మణులు

వెయ్యేళ్ల తర్వాత వెలుగులోకి

హైదరాబాద్‌,నేటిధాత్రి:
దాదాపు వెయ్యేళ్ల క్రితం ఇస్లామిక్‌ చొరబాటు దారుడు మహమ్మద్‌ ఘజనీ ధ్వంసం చేసిన పవిత్రసోమనాథ జ్యోతిర్లింగాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘజనీ ధ్వంసం చేసిన నిజ శివలింగ భగ్నశకలాలను ప్రస్తుత సోమనాథ దేవాలయంలో ప్రతిష్టించడం ద్వారా ఈ జ్యోతిర్లిం గాన్ని పునరుద్ధరించనున్నారు. స్వాతంత్య్రానంతరం ఈ దేవాలయాన్ని ఉపప్రధాని సర్దార్‌ వల్ల భాయ్‌పటేల్‌, ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ నేతృత్వంలో అరేబియా సముద్రతీరంలోనిర్మించారు. నాడు మహమ్మద్‌ ఘజనీ ధ్వంసం చేసినట్టు చెబుతున్న ఆలయ ప్రదేశానికి స మీపంలోనే ఈ నూతన సోమనాథ దేవాలయం వుంది. ఇదిలావుండగా అప్పట్లో ఘజనీ దండ యాత్ర సందర్భంగా, జ్యోతిర్లింగ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే కాదు, అక్కడి శివలింగాన్ని ముక్కలుగా పగులగొట్టి, అప్పటికీ కసి తీరక, అందులో ఒక ముక్కను నేటి ఆఫ్ఘనిస్తాన్‌లోని జామా మసీదుకు మెట్టుగా ఉపయోగించాడని చారిత్రక కథనం. అయితే ఆ భగ్న శివలింగానికి చెందిన కొన్ని భాగాలను అప్పటి అగ్నిహోత్రిక బ్రాహ్మణులు తమ ఇళ్లల్లో భద్రపరచినట్టు తెలుస్తోంది. అయితే ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆవిధం గా భద్రపరచిన భగ్నావశేషాలను ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ నేతృత్వంలో సోమనాధ ఆలయంలో ప్రతిష్టించడానికి యత్నాలు జరుగుతున్నాయి.
మనదేశంలోని పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో సోమనాథ క్షేత్రం ఒకటి. జ్యోతిర్లింగ స్తోత్రంలో మొట్టమొదట ప్రస్తావించేది కూడా ఈ సోమనాధ క్షేత్రాన్నే! వెయ్యేళ్ల క్రితం మనదేశంలో ఇ స్లామిక్‌ చొరబాటుదార్ల దాడులు విపరీతంగా జరిగాయి. ఈ దాడులకు ప్రధానంగా గురవడమే కాదు పూర్తిగా ధ్వంసమైన క్షేత్రం కూడా ఈ సోమనాథ క్షేత్రమే! ఆలయాల్లో బంగారం, ఇతర విలువైన ఆభరణాలు,రత్నాలు వుంటాయన్న సంగతి తెలుసుకున్న ఈ ఇస్లామిక్‌ చొరబాటుదార్లు ఆలయాలే లక్ష్యంగా దారుణ విధ్వంసానికి పాల్పడేవారు. అడ్డువచ్చిన హిందువులను దారుణంగా వధించి ఆలయాల్లో నిక్షిప్తమైన నిధులను దోచుకుపోయేవారు. ఇందులో భాగంగానే క్రీ.శ. 1024లో మహమ్మద్‌ ఘజనీ సోమనాథ క్షేత్రంపై భయంకరమైన దాడికి దిగాడు. అతని ముఖ్య లక్ష్యం ఆలయంలో నిక్షిప్తమైన అపారమైన ధనరాశులను కొల్లగొట్టుకుపోవడమే! అతని దాడినుంచి ఆలయాన్ని రక్షించడానికి హిందువులు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారు. కానీ ఘజనీ నిర్ద యగా 50వేల మంది హిందువులను ఊచకోతకోసి మరీ ఆలయాన్ని లూటీ చేశాడు. అప్పట్లో శివలింగం కింద కూడా నిధులు దాచిపెడతారన్న ప్రచారం వుండేది. ఇందుకోసం అతను శివలింగాన్ని ముక్కలుగా పగులగొట్టాడు. ఆ ముక్కల్లో కొన్నింటిని నేటి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఘజ్నావీలో ని ర్మించిన జామా మసీదుకు మెట్లుగా ఉపయోగించినట్లు చెబుతారు. మధ్యయుగాల చరిత్రలో ముస్లిం రాజులు జరిపిన విధ్వంసానికి విషాదపు గుర్తుగా మిగిలిన వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది సోమనాథ క్షేత్రమే!
ఘజనీ దండయాత్ర సమయంలో ఇక్కడి పాలకుడు మొదటి చాళుక్య భీముడు. ఘజనీని ఎదిరించలేక పారిపోయి కంఠ్‌కోటలో ఆశ్రయం పొందుతాడు. మహమ్మద్‌ ఘజనీ ప్రధాన లక్ష్యం లూటీ మాత్రమే! రాజ్యస్థాపన కాదు! దీంతో అతగాడు వెళ్లిపోయిన తర్వాత చాళుక్య భీముడు తిరిగి వచ్చి రాజ్య పాలన చేపట్టినప్పటికీ, ధ్వంసమైన ఆలయాన్ని పునర్‌నిర్మించలేకపోతాడు. ఫలితంగాచాలాకాలం వరకు సోమనాథ ఆలయం శిథిలావస్థలోనే కొనసాగింది. తర్వాత రాజ్యాధికారాన్ని చేపట్టిన చాళుక్య రాజు కుమారపాల ఆలయ పునర్‌నిర్మాణానికి ఉపక్రమిస్తాడు. ఆయన ఆల యాన్ని అద్భుతమైన రీతిలో రత్నాలు తాపడం చేసిన రాతితో నిర్మించినట్టు క్రీ.శ.1169 నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. మహమ్మద్‌ ఘజనీ ధ్వంసం చేసిన తర్వాత ఆలయం దాదాపు వందేళ్ల పాటు శిథిలావస్థలోనే కొనసాగిందనేది ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. కుమారపాలుడు అంత కష్టపడి ఆలయం నిర్మించినప్పటికీ, తర్వాతి కాలంలో దీనిపై దాడులు ఆగలేదు. క్రీ.శ. 1299లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ, క్రీ.శ.1395లో ముజాఫర్‌ షా, క్రీ.శ.1665లో ఔరంగజేబ్‌లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు.
విచిత్రమేమంటే దాడికి గురైన ప్రతిసారి ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో సోమనాథ ఆలయా న్ని పునర్‌నిర్మిస్తూ రావడం విశేషం. అయితే ఘజనీ దండయాత్ర తర్వాత ఆలయాన్ని ఘనమైన రీతిలో పునరుద్ధరించిన ఘనత కుమారపాలుడికే దక్కుతుంది. ఇన్ని విధ్వంసాలకు గురైనా శతాబ్దాల ఆధ్యాత్మిక, సాంస్కృతికకు ప్రతీకగా నిలిచిన ఈ దివ్యక్షేత్రం తన గుర్తింపును ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ వస్తోంది. అయితే ఇంతటి చరిత్రలో చాలామందికి తెలియని విషయం ఒకటుంది. నాడు ఘజనీ ధ్వంసం చేసిన సోమనాథ శివలింగ భగ్నశకలాల్లో చాలా వాటిని అప్పటి హిందూ పండితులు రహస్యంగా తీసుకెళ్లి తమ ఇళ్లలో వుంచి భక్తి ప్రపత్తులతో పూజిస్తూ వస్తున్నారు. ఈ రహస్యం దాదాపు వెయ్యేళ్లుగా ఎవ్వరికీ తెలియకుండా, ఆయా కుంటుంబాల వారు, తమ కింది తరాలవారికి ఈ శివలింగ శకలాలను అప్పగిస్తూ వచ్చారు. దాదాపు వెయ్యేళ్ల తర్వాత ఆ పవిత్ర శకలాలు వెలుగులోకి రావడం విశేషం.
ఇన్ని సంవత్సరాలుగా ఈ పవిత్ర శివలింగ భగ్న శకలాలను భద్రపరుస్తూ వచ్చింది, అగ్నిహోత్రీయ బ్రాహ్మణులు. ఈ శకలాలను భక్తిప్రపత్తులతో ఇన్ని తరాలుగా పూజిస్తూ వస్తున్నారు. ఆవి ధంగా ఈ భగ్నశకలాలను భద్రపరచిన వారిలో సీతారామ శాస్త్రి ఒకరు. ఆయన అగ్నిహోత్రీ య బ్రాహ్మణ పండితుడు. ఇటీవల ఆయన ఈ భగ్నావశేషాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవి శంకర్‌కు అప్పగించారు. గత 21 ఏళ్లుగా ఈ అవశేషాలు శాస్త్రి సంరక్షణలో కొనసాగుతున్నాయి. ఇవి తన మామగారి వద్దనుంచి ఈయనకు అందాయి. ఆయన దాదాపు 60ఏళ్ల పాటు వీటికి భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించారు. ప్రవీంద్ర సరస్వతిజీ అనే గురువు ఆయనకు ఈభగ్నశకలాలను అప్పగించారు.
నిజానికి 1924లో అప్పటి కంచికోటి పీఠాధిపతి పరమాచార్య వద్దకు ఈ భగ్నశకలాలను తీసుకెళ్లిన అగ్నిహోత్రి పండిత కుటుంబీకులు, వీటిని ఏం చేయాలంటూ ఆయన్ను ప్రార్థించారు. అ ప్పుడు ఆయన ఈ భగ్నశకలాల పవిత్రతను గుర్తించి, మరో వెయ్యి సంవత్సరాల వరకు వీటిని భద్రపరచండి. అప్పుడు సోమనాథ దేవాలయంలో వీటి ప్రతిష్ట జరుగుతుందని సెలవివ్వడంతో ఆ పండిత కుటుంబం వాటిని తమ ఇంటిలో భద్రంగా వుంచి పూజాదికాలు నిర్వహిస్తూ వచ్చా రు. తర్వాత సీతారామ శాస్త్రి మళ్లీ ఈ భగ్నశకలాలను కంచికోటి పరమాచార్య జగద్గురు శ్రీ జయేంద్రసరస్వతిశంకరాచార్య స్వాముల వారికి చూపించి పరిష్కారం కోరగా, అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాతనే వీటి ప్రతిష్ట జరుగుతుందని సెలవిచ్చారు. ఇది జరగక ముందే పరమాచార్య శివైక్యం చెందారు. దీంతో సీతారామశాస్త్రి వీటి భవితవ్యంపై మళ్లీ అయోమయంలో పడ్డారు. తర్వాత ప్రస్తుత శంకరాచార్య సలహామేరకు ఆయన శ్రీశ్రీ రవిశంకర్‌ను కలిసి పరిస్థితి వివరించడంతో, వీటిని సోమనాథ దేవా లయంలో ప్రతిష్టించడానికి హామీ ఇచ్చారు. దీంతో అమితానందం పొందిన శాస్త్రి, ‘నిజంగా నా జీవితం ధన్యమైంది. ఎట్టకేలకు ఈ భగ్నావశేషాలను సోమనాథ దేవాలయంలో ప్రతిష్టించాలన్న పెద్దల ఆకాంక్ష నెరవేరింది’ అన్నారు.
ఇప్పుడు సోమనాథ దివ్యక్షేత్రానికి చెందిన శివలింగ భగ్నావశేషాలను సోమనాథ దేవాలయంలో పున్ణప్రతిష్టించే బాధ్యతను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అధినేత శ్రీశ్రీ రవిశంకర్‌ స్వీకరించారు. వీటి ప్రశ స్త్యాన్ని వివరిస్తూ, ఇవి ఇప్పటికీ తమ అయస్కాంత శక్తిని ప్రదర్శిస్తూనే వున్నాయని, వీటి పవిత్రత లేశమాత్రం కూడా నష్టం కాలేదన్నారు. నిజానికి ఇది భారత చరిత్రలోని ఒక భాగాన్ని పున రుద్ధచించడం కాదు. భారతీయ ఆధ్యాత్మిక, నాగరికతలోని చైతన్య పునరుద్ధరణగా భావించాలి.
పురాతన గ్రంథాల ప్రకారం నిజమైన సోమనాథ శివలింగం మూడడుగుల ఎత్తుండేది. భూమిపై రెండడుగులు పైకిలేచి గాల్లో తేలియాడుతుండేది. అంటే భూమ్యాకర్షణ శక్తి దీనిపై పనిచేసేది కాదు. అప్పట్లో సోమనాథ దేవాలయం సంపదకు ప్రసిద్ధి. బంగారం, రత్నాల తాపడాలతో నిర్మి తమై ఆధ్యాత్మిక శోభను వెదజల్లేది. 1024లో ఘజనీ కేవలం దేవాలయంపై దాడికి మాత్రమే పాల్పడలేదు. హిందువుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపును ధ్వంసం చేయడానికి యత్నించా డు. ఈ దాడిలో గాల్లో తేలియాడే శివలింగాన్ని ముక్కలు చేయడమే కాదు, వేలాదిమంది హిందవులను ఊచకోత కోసి, ఆలయంలోని అపార సంపదను దోచుకెళ్లాడు.
ఎన్నిసార్లు పునరుద్ధరించినా వరుస దాడులకు గురవుతూ రావడం ఈ ఆలయ చరిత్ర! చివరకు 19వ శతాబ్దం వరకు ఇది శిథిలావస్థలోనే కొనసాగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951లోనాటి ఉపప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో నేటి కొత్త దేవాలయం రూపుదిద్దుకుంది.

ప్రజల ‘మూడ్‌’ ఎన్డీఏ కూటమి వైపే

స్వీయ తప్పిదాలతో మరింత దిగజారుతున్న కాంగ్రెస్‌ పలుకుబడి

ఏడాదిలో పుంజుకున్న బీజేపీ

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి మెజారిటీ ఖాయం

ఎన్డీఏ కూటమి సీట్లు 353కు పెరిగే అవకాశం

ఇండీ కూటమి 188కే పరిమితవవచ్చన్న సర్వే

99 నుంచి 78కి పడిపోనున్న కాంగ్రెస్‌ బలం

తమిళనాడులో బీజేపీ ఇంకా ఖాతా తెరవలేకపోవచ్చు

డీఎంకేదే హవా

ఒరిస్సాలో నవీన్‌ పట్నాయక్‌కే ప్రజల మద్దతు

ఉత్తరప్రదేశ్‌లో పుంజుకోనున్న ఎన్డీఏ

బిహార్‌లో కూటమిదే అధికారం

తేల్చిన మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎన్నికల్లో ప్రజల మూడ్‌ ఏవిధంగా వుంటుందనేది ఆ సమయానికి చోటుచేసుకున్న పరిణామాలు, స్థానిక, జాతీయ సమస్యలపై ఆధారపడివుంటుంది. అది కూడా ఒక్కో రాష్ట్రంలోని పరిస్థితులు కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల దేశం మొత్తంమీద ప్రజల్లో ఒకేరకమైన మూడ్‌ వుంటుందని చెప్పడానికి వీల్లేదు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవి స్థానిక సమస్యలు, భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకునే వ్యూహాల ను అనుసరిస్తాయి. జాతీయ ఎన్నికల్లో తామే కింగ్‌మేకర్‌గా వుండి, కేంద్రంలో అధికారంలో ఉ న్న ప్రభుత్వాన్ని తమ కనుసన్నల్లో వుంచుకోవాలన్న దృక్పథం కూడా వాటికి వుంటుంది. ఇవి సంకీర్ణ ప్రభుత్వాలకు దారితీసి కేంద్ర ప్రభుత్వం బలహీనంగా మారిన సంవత్సరాలు కూడా మనం చూశాం. దేశ స్వాతంత్య్రం వచ్చినదగ్గరినుంచి ఛరిష్మా వున్న నాయకులపై ఆధారపడి రాజకీయ పార్టీల మనుగడ సాగిందనేది సుస్పష్టం. నెహ్రూ, ఇందిరాగాంధీలు ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్‌ను అధికారంలో నిలిపారు. వారి తర్వాత కేంద్రంలో అంతటి ఛరిష్మా వున్న నాయకులులేకపోవడంతో ఇతర పార్టీల మద్దతో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కానీ కలగూరగంప లాంటి పార్టీల సహకారం నేపథ్యంలో మన విదేశాంగ విధానం, రక్షణ, ఆర్థిక తదితర కీలక అంశాల పై ఆయా ప్రభుత్వాలు తగిన నిర్ణయాలు తీసుకోలేకపోయేవి. ఒకరకంగా చెప్పాలంటే సంకీర్ణ శకం మనదేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇక 2014 నుంచి నరేంద్రమోదీ దేశ ప్రధాని అయ్యాక, ఆయన తన ఛరిష్మాతో మాత్రమే కాదు, పటిష్టమైన విదేశాంగ, ఆర్థిక, రక్షణ విధానాలతో దేశాన్ని అంతర్జాతీయ యువనికపై ఒక కీలకస్థానంలో నిలిపారనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. విచిత్రమేమంటే గత పదేళ్లుగా అధికారంలో వున్నప్పటికీ ఆయన ఛరి ష్మా ఎక్కడా తగ్గకపోవడం గమనార్హం. అంతర్జాతీయంగా అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. భిన్న ధృవాలైన రష్యా`అమెరికాలను సమతుల్య రీతిలో ని ర్వహించగల సామర్థ్యం ఆయన నేతృత్వంలోని టీమ్‌కే సాధ్యమైంది. నేడు సమస్యా పరిష్కారకర్త దేశంగా అంతర్జాతీయంగా భారత్‌ తన పేరు ప్రఖ్యాతులను సుస్థిరం చేసుకుంది. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ స్థానాలు గెలుచుకోకపోయినా, కూటమి పరంగా మెజారిటీ సాధించి అధికారంలో వున్న ఎన్డీఏపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇంఇయాటుడే`సీఓటర్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు ఒకింత ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే రీతిలో వుండటం విశేషం. 

సర్వసాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఐదేళ్ల పాలనాకాలం తర్వాత ప్రజల్లో ప్రభుత్వవ్యతిరేకత వ్యక్తం కావడం సహజం. కేంద్రంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతోంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏ కూటమి బలం 293. ఇందులో భారతీయ జనతాపార్టీవి 240 స్థానాలు. 2014 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 38.5% ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. అప్పటివరకు అంటే 2004`2014 వరకు పాలించిన యు.పి.ఎ. కూటమి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మొట్టమొదటి సారి ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత 2019 ఎన్నికల్లో 45.43% ఓట్లతో 353 స్థానాల్లో గెలిచిన ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. రెండోసారి నరేంద్రమోదీ ప్రధాని అయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ప్రచారం సాగించినప్పటికీ కూటమి 293 స్థానాలకే పరిమితం కా వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏడాది కాలం ఎన్డీఏ కూటమి పాలనపై ప్రజాభిప్రాయం, ఓట్ల రూపంలో మారితే ఎన్ని స్థానాలు గెలుచుకోగలదన్న అంశంపై ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరుతో ఇండియా టుడే`సీ ఓటర్‌ నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చినప్పటికీ అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే సంతృప్తికరమైన పనితీరు ప్రదర్శించని ఎన్డీఏ ఇప్పటికిప్పు డు ఎన్నికలు జరిగితే 353 స్థానాల్లో తిరుగులేని విజయం సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. ఇందులో బీజేపీ సొంతంగా 280కి పైగా స్థానాలను కైవసం చేసుకొని సాధారణ మెజారిటీ సాధి స్తుందని కూడా పేర్కొంది. ఇక లోక్‌సభలో 243గా ఉన్న ఇండీ కూటమి బలం ఏకంగా 188కి పడిపోతుందని కూడా స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9వరకు దేశం లోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు.

ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో 39 రాజకీయ పార్టీలు భాగస్వాములుగా వుండగా వీటిల్లో బీజేపీ, నేషనలిస్ట్‌ పీపుల్స్‌ పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా ఎన్నికల కమిషన్‌ చేత గుర్తింపు పొందా యి. మిగిలినవన్నీ ప్రాంతీయపార్టీలే. ఎన్నికలు జరిగితే భారతీయ జనతాపార్టీ 281 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. అంటే ప్రస్తుతం వున్న 240 స్థానాలతో పోలిస్తే మరో 41స్థానాలను కైవసం చేసుకోగలుగుతుంది. ఏడాది కాలంలో బీజేపీ తిరిగి పుంజుకుందన్నది స్పష్టమవుతోంది. ఇక కాంగ్రెస్‌ ప్రస్తుత బలం 99 నుంచి 78కి పడిపోతుంది. వ్యక్తిగతంగా భాజపా ఓట్ల శాతం గతంతో పోలిస్తే మూడు శాతం పెరిగి 41%కు పెరుగుతుంది. ఇక కాంగ్రెస్‌ ఓట్ల షేరు 20శాతానికి పడిపోవడం గమనార్హం.

మొత్తంమీద పరిశీలిస్తే పదేళ్లకాలం పరిపాలించినా నరేంద్రమోదీ ఛరిష్మా చెక్కుచెదరలేదన్నదని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్‌ తన తిరోగమన విధానాలను ఇప్పటికైనా సరిదిద్దుకోపోతే పతన తప్ప ఉత్థానం వుండదని సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తాను ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను పున్ణసమీక్షించుకోవాలి. మితిమీరిన మైనారిటీ బుజ్జగిం పు, మెజారిటీ వర్గాలను నిర్లక్ష్యం చేయడం, అధికారంకోసం అలవికాని హామీలివ్వడం, ప్రతి అంశాన్ని ప్రతికూల ధోరణితో ఆలోచించడం వంటి పద్ధతులను మార్చుకోకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్‌ మనుగడ కష్టం. ఇప్పటికే కీలక నాయకులను కోల్పోయి, కేవలం గాంధీ కుటుంబంపై ఆధారపడి రాజకీయాల్లో కొనసాగే స్వయం ప్రకాశం లేని నాయకులే పార్టీలో అధికం. ఇదే పార్టీని దారుణంగా దెబ్బతీస్తోంది. గత ఎన్నికల్లో నరేంద్రమోదీ ‘400 సీట్లు’ నినాదాన్ని కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మలచుకుంది. ముఖ్యంగా అన్ని సీట్లు ఎన్డీఏకి వస్తే, రాజ్యాంగాన్ని మార్చేస్తా రని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని తప్పుడు ప్రచారాలను విపరీతంగా చేపట్టడం ప్రజల్లో ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో అనుమానాలు పెరిగి, భాజపాను 240 వద్దే నిలిపేశారు. విచిత్రంగా ఆరునెలలు తిరగకుండానే మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి ఎన్నికల్లో విజయం సాధించి పడిలేచిన బంతిలాభాజపా తన సత్తా ఏంటో చూపింది.

తమిళనాడులో మళ్లీ డీఎంకోకాంగ్రెస్‌ కూటమి 39 స్థానాలను స్వీప్‌ చేస్తుందని సర్వే స్పష్టం చేసింది. కాకపోతే బీజేపీ ఓట్ల శాతం పెరిగినా, అవి సీట్లను గెలిపించే స్థాయిలో వుండవని పే ర్కొంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే డీఎంకే కూటమి 52% ఓట్ల షేరు సాధిస్తుందని పేర్కొంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే ఇది ఐదుశాతం ఎక్కువ. గత ఎన్నికల్లో తమిళనాడులో 18% ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 21% వరకు పొందగలుతుగుందని సర్వే పేర్కొంది. ఇక ఏ.ఐ.డి.ఎం.కె గతంలో 20% ఓట్లు పొందగా 3శాతం పెరిగి 23%కు చేరుతుంది.

ఇక ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో భాజపా 43`45 స్థానాల్లో గెలిచే అవకాశ మున్నదని సర్వే పేర్కొంది. బీజేపీ ఓట్ల శాతం గతంతో పోలిస్తే 4% పెరగుతుందని, ఇండీ బ్లాక్‌ఓట్లు 2% తగ్గుతాయని సర్వే తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండీ కూటమికి 43 సీట్లు వచ్చాయి. వీటిల్లో 37 సమాజ్‌వాదీ పార్టీవి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇండీ కూటమి సీట్లు 34`36 వరకు మాత్రమే పరిమితమవుతాయి. భాజపా కేవలం 33 సీట్లలోనే విజయం సాధించింది. అయితే ఎన్డీఏ కూటమికి ఇప్పుడు రాష్ట్రం నుంచి 36 స్థానాలున్నాయి. ఇక బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 33`35 స్థానాల్లో విజయం సాధిస్తే, ‘మహాఘట్‌బంధన్‌’ కూటమికి 5`7 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీఏకు 47% ఓట్లు రాగా ఇప్పుడు అవి 52%కు పెరగనున్నాయి. బిహార్‌ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్డీఏ కూటమిలో చీలిక లేకుండా, ఉమ్మడిగా పోటీచేస్తే ప్రభుత్వానికి ఢోకాలేదని ఈ సర్వే తెలియజేస్తోంది. ఎందుకంటే ఢల్లీిలో మాదిరిగా బిహార్‌లో ఓట్ల చీలిక సాధ్యం కాదు. బీజేపీ, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీల కూటమి బలంగా వుంటే వీరిని ఓడిరచడం సాధ్యంకాదు. విచిత్రమేమంటే గత ఏడెనిమిది సంవత్సరాలుగా నితిష్‌కుమార్‌ హవా రాష్ట్రంలో అప్రతిహతంగా సాగుతూ వచ్చింది. ఈసారి ఆయన గతంలో మాదిరిగా ఓటర్లను ఆకట్లుకోలేక పోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు భిన్నంగా బీజేపీ ఓట్లశాతాన్ని గణనీయంగా పెంచుకొని మరింత బలంగా రూపొంది అధికారంపై పట్టు సాధించవచ్చుననేది స్థానిక విశ్లేషకుల అంచనా. ఒరిస్సా విషయానికి వస్తే ఈ సర్వేలో 52% మంది ఓటర్లు నవీన్‌ పట్నా యక్‌ను తిరుగులేని నే తగా పేర్కొన్నారు. 

మొత్తంమీద జాతీయ స్థాయిలో సర్వే ఫలితాలను పరిశీలిస్తే ఎన్డీఏ కూటమి మరింత బలపడే అవకాశాలే మెండుగా వున్నట్టు తోస్తున్నది. ప్రజలు ఊరికే పట్టం కట్టరు…పనితీరుకే ప్రాధాన్యమి స్తారన్న సంగతిని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.

పవన్‌లో ఇజం లేదు!నిజం అసలే కాదు!!

`పదవీ కాంక్ష తప్ప పరోపకారం లేదు!

 `జనంలో లేని సేనకు సేనాని!?

 `తనకు తానే అప్రకటిత జ్ఞాని?

`యంత్రాంగం లేని పార్టీని డుపుకుంటున్నాడు.

`టిడిపి నీడలో గెలిచి నేనే గొప్ప అనుకుంటున్నాడు.

`తెలుగు తమ్ముళ్ల దయతో గెలిచి నా వల్లే కూటమికి బలిమనుకుంటున్నాడు!

`పక్కదారి పడుతున్న పవన్‌ అత్యాశ!

`పవన్‌ గెలుపే టిడిపి పుణ్యం!

`పవన్‌ పేరాశ పదవికి చేటు

`జనసేనకు జనంలో ఆదరణ లేదు

`పవన్‌ కళ్యాణ్‌ను జనం నాయకుడుగా ఇంకా గుర్తించలేదు

`తెలుగు దేశం బలంతో జనసేన గెలిచింది

`ఎన్నికల నాటికి జనసేనకు అభ్యర్థులే లేరు

`జగన్‌ వద్దనుకున్న ఎమ్మెల్యేలను అద్దెకు తెచ్చుకున్నారు

`పార్టీకి పని చేసిన వారికి పక్కకు పెట్టి టిక్కెట్లిచ్చాడు

`2019 నుంచి పవన్‌ చేసిన పోరాటం లేదు

`అసలు జనసేన పార్టీ నిర్మాణమే జరగలేదు

`లోకేష్‌ పాదయాత్ర కూటమి గెలుపుకు కారణమైంది

`చంద్రబాబు మీద నమ్మకంతో జనం ఓట్లేసి గెలిపించింది

`పొత్తు ధర్మంలో చంద్రబాబు స్నేహానికి విలువిచ్చారు

`దానిని పవన్‌ విచ్చిన్నం చేసుకోవాలని చూస్తున్నారు

`ఇప్పటికీ అన్న నాగబాబు రాజకీయ భవిష్యత్తు కోసం పవన్‌ ఆరాటపడుతున్నాడు

`పెద్దన్న చిరంజీవికి పెద్ద పోస్ట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నడు

`జనసేన నాయకుల కోసం పవన్‌ ఆలోచించడం లేదు

`కూటమి గెలుపులో కీలక భూమిక తెలుగు తమ్ముళ్లు

`ఐదేళ్లలో కేసులు ఎదుర్కొన్నది తమ్ముళ్లు

`వైసిపి మీద అలుపెరుగని పోరాటం చేసింది తమ్ముళ్లు

`నిర్భంధాలను ఎదుర్కొని నిలబడిరది తమ్ముళ్లు

`సుదీర్ఘమైన పాదయాత్ర చేసింది లోకేష్‌

`ఇక్కడ పవన్‌ పాత్రేముంది?

`పవన్‌ బలం ఎక్కడ పనికొచ్చింది

`పంట చేతికొచ్చాక కుప్ప మీద కూర్చున్నది పవన్‌

`కూటమిలో పెత్తనం కోసం ఆరాటపడుతున్నది పవన్‌

`చెరపకురా చెడేవు అన్న సామెత మర్చిపోయినట్లున్నాడు

`స్వయంకృతాపరాధంతో మొత్తం చెడగొట్టుకుంటున్నాడు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలుపుకు కారణం ఎవరు? ఇది ఇప్పుడు ఏపిలో జరుగుతున్న చర్చ. నిజంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మూలంగానే కూటమికి అంత మెజార్టీ వచ్చిందా? లేక తెలుగుదేశం బలం వల్లనే జనసేనకు ఉనికి ఏర్పడిరదా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మూలంగానే జనసేనకు ఊపిరి పోసినట్లైందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే జనసేనాని పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల్లో గెలిచింది లేదు. గత ఎనికల్లో రెండు చోట్ల పోటీచేసినా ఒక్క సీటులో కూడా కనీసం ప్రభావం చూపలేదు. అలాంటి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వల్ల తెలుగుదేశానికి ఊపు వచ్చిందనేదానిలో అర్దమే లేదు. ఎందుకంటే వైసిపి ప్రభుత్వ హయాంలో జనసేన చేసిందేమీ లేదు. తన ఉనికి కోసం పడిన ఆరాటం లేదు. వైసిపి మీద చేసిన జనసేనాని ప్రత్యక్షంగా చేసిన పోరాటమేమీ లేదు. ఏనాడు ఏ ఒక్క సమాజం కోసం ఉద్యమం చేసింది లేదు. అసలు ప్రజల్లో వున్నదే సరిగ్గా లేదు. అప్పుడప్పుడు సీజనల్‌ నాయకుడిగా వచ్చిపోవడం తప్ప ఆయన నిబద్దతలో రాజకీయాలు చేయలేదు. అటు సినిమాలు చేసుకుంటూ, ఆ గ్యాప్‌లో రాజకీయాలు చేస్తూ వచ్చారు. కాని ఎన్నికలకు ఆరు నెలల ముందు వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడం, ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ కలిసి రావడంతో జనసేన దశ తిరిగింది. తెలుగుదేశం నీడలో ఆ పార్టీకి వెలుగు సంతరించుకున్నది. ఎంతో గొప్ప మనసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హుందాగా పవన్‌ కల్యాణ్‌ సహాకారాన్ని కొనియాడారు. ప్రభుత్వ ఓటు చీలిపోకుండా వుండేందుకు, కూటమి అద్భుతమైన విజయం సాదించేందుకు పవన్‌ కృషి గొప్పదని అనేక సార్లు చెప్పారు. నిజానికి ఆ సమయంలో పొత్తు లేకపోకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది. ఇది ముమ్మాటికీ నిజం. కాని జగన్‌ రాజకీయాన్ని తుడిచిపెట్టాలంటే జనసేన కూడా కలిసి వస్తే అద్భుతమైన విజయాన్ని చూడొచ్చని తన రాజకీయ చాణక్యంతో చంద్రబాబు ముందుకు సాగారు. అది జనసేనకు బాగా కలిసి వచ్చింది. అసలు ఉనికిలో లేని జనసేనకు జవసత్వాలు వచ్చేలా చేసింది. ఎన్నికల మందుకు పవన్‌ కల్యాణ్‌కు కూడా తన బలమెంతో తెలియదు. అంతే కాదు తాను గెలుస్తానో లేదో..అని చెప్పిన సందర్భాలు కూడా అనేకం వున్నాయి. అలాంటి పవన్‌ కళ్యాణ్‌కు ఆ పొత్తు పొడిచినప్పుడే అడిగిన 50 సీట్లకు తగ్గేవారు కాదు. కాని ఆయనకు పది సీట్లు ఇస్తే ఎక్కువ అనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయకుడు ఎంతో ఉదారతతో 21 సీట్లు ఇచ్చారు. అయినా పవన్‌ కల్యాణ్‌ ఎంత మంది జనసేన నాయకులకు టిక్కెట్లు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో తన అన్న నాగబాబుకు కూడా టికెట్‌ ఇచ్చిన పవన్‌ ఈ ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేదు. ఎందుకంటే తన గెలుపు మీదనే ఆయనకు నమ్మకం లేదు. దాంతో నాగబాబును రంగంలోకి దింపలేదు. లేకుంటే తప్పకుండా అన్నకు టికెట్‌ ఇచ్చేవారు. గత ప్రభుత్వం వైసిపి మీద నిరంతరం పోరాటం చేసింది చంద్రబాబు నాయుడు, లోకష్‌, తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు నాయుడు నుంచి, తమ్ముళ్లదాకా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు ఏకంగా జైలు పాలయ్యారు. లోకేష్‌ సుధీర్ఘమైన పాదయాత్ర చేపట్టారు. ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలను చైతన్యం చేశారు. ఇలా ఐదేళ్ల పాటు నిరంతరం వైసిపికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాని వైసిసికి వ్యతిరేకంగా పోరాటం చేసిన జనసైనికులు ఎవరైనా వున్నారా? అసలు ఇప్పటి వరకు ఆ పార్టీకి యంత్రాంగమే లేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయకుడు 21 టికెట్లు ప్రకటిస్తే కూడా అందులో జనసేన నుంచి పోటీ చేసేందుకు అభ్యర్దులే దొరకలేదు. జగన్‌ టికెట్లు ఇవ్వకుండా వదిలేసిన నాయకులను జనసేనలోకి తీసుకొని పవన్‌ టిక్కెట్లు ఇచ్చారు. వైసిపి పనికి రారని వదిలేసిన వారికి పవన్‌ టిక్కెట్లు ఇచ్చారు. అది కూడా ఆ నాయకులు పవన్‌ను చూసి రాలేదు. కూటమిని చూసి వచ్చారు. చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వచ్చారు. ఈ విషయం పవన్‌కు ఇప్పటికీ అర్ధం కాకుండా వుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు వుండరు. శాశ్వత మిత్రులు వుండరు. 2019లో ఆయన తెలుగుదేశానికి దూరంగా వున్నారు. తర్వాత మళ్లీ దగ్గరయ్యారు. జగన్‌ మీద కలిసి పోరాటం చేశారు. ఇది కూడా పవన్‌ కల్యాన్‌ వ్యూహంలో భాగమే. ఒకరికొకరు అన్నట్లు ఉభయ కుశలోపరిగా సహకరించకుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకున్నారు. కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నారు. ఇంత వరకు బాగానేవుంది. కాని ఎప్పటికైనా తెలుగుదేశం పొత్తుతో ఈ ఐదేళ్ల కాలంలో ఏదైనా జరగొచ్చని పవన్‌కు తెలియంది కాదు. మంత్రి లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రతిపాదనలు వస్తాయని పవన్‌కు తెలియక కాదు. పవన్‌కు అన్నీ తెలుసు. తెలిసే పొత్తుకు అంగీకరించారు. ముందు ఏరు దాటాలి. అప్పుడు కదా? ఏ నిర్ణయం తీసుకునేది అనుకున్నారు. అనుకున్నట్లుగా ఆది నుంచి వ్యవహరిస్తూనే వస్తున్నారు. హోం మంత్రిత్వ శాఖ మీద చేసిన వ్యాఖ్యలైనా, ఇతర చర్యలైనా ఆయన కావాలనే చేస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు తనపై రాకుండా చూసుకుంటూ జాగ్రత్తపడుతున్నారు. అయితే లోకేష్‌కు ప్రాధాన్యత ఇంత తొందరగా ఇచ్చే రాజకీయం మొదలౌతుందని పవన్‌ కూడా ఊహించలేదు. దాంతో తన ప్లాన్‌కు పవన్‌ మరింత పదును పెట్టారు. ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా దూరం దూరంగా వుంటున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అయితే ఈ మధ్య ఆయనకు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. తర్వాత తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లు వార్తలువచ్చాయి. కాని మరునాడే దక్షిణభారత దేశ సనాతన ధర్మ యాత్ర మొదలు పెట్టారు. దేవాలయాల సందరర్శను వెళ్లిపోయారు. ఇది తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడాలనుకున్నా సాధ్యం కాలేదు. అంటే దూరం పెంచుకోవాలని పవన్‌ అనుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నట్లే లెక్క. దీని వెనకాల బిజేపి వుందన్న వాదనలు కూడా వున్నాయి. బిజేపి దక్షిణాదిలో పాగా వేసేందుకు పవన్‌ను ఒక వారదిగా వాడుకోవాలని చూస్తోందనేది కనిపిస్తూనే వుంది. ఎందుకంటే ఒకప్పటి పవన్‌ వేరు..ఇప్పుడు పవన్‌ వేరు. ఒకప్పుడు తాను ఎర్రరంగు వాదినని ఆయనే చెప్పుకున్నారు. ఇప్పుడు కాషాయదారిగా మారారు. అందువల్ల పవన్‌ రాజకీయాలు రకరకాల మార్గాలను ఎంచుకొని సాగుతోంది. కూటమిలో కటకట మొదలైందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు అందులో పెద్దగా విబేధాలు కనిపించకపోయినా, కుంపటిలో నివురుగప్పిన నిప్పులా పొగ మాత్రం అప్పుడపప్పుడూ కనిపిస్తుంది. అందుకే పవన్‌ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన రాజకీయాన్ని విస్తరించాలనుకుంటున్నాడు. అందువల్ల తెలుగుదేశం పార్టీ కూడా పవన్‌ రాజకీయానికి ఆది లోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది. పెద్దలు కీలెరెగి వాతలు పెట్టాలన్నారు. ఇప్పుడు జనసేన విషయంలో టిడిపి ఆ పద్దతి అనుసరించాల్సిన పరిస్ధితి వస్తుందనే చెప్పాలి. రెండు బలమైన జోడెట్లు బండి లాగుతుంటే దాని కింద నడుస్తున్న మేక నేనే లాగుతున్నాను అన్నట్లు వుంది ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆలోచన. రాజకీయాలలోకి రాకుముందు పవన్‌ కల్యాణ్‌పై రకరకాల ఆరోపణలు వుండేవి. ఆయన ఆవేపరుడని అంటూ రకాల మాటలు వినపడేవి. అవి ఆయన ప్రత్యక్ష్యంగా తెలిసిన వ్యక్తులు చేసిన వ్యాఖ్యలే. కాని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనలో కొంత మార్పువచ్చిందని అంటారు. కాని గతంలో ఎన్నికల ముందు ఆయన ఊగిపోతూ చేసిన వ్యాఖ్యలు చూసిన వారికి ఇంకా ఆయనలో అలాంటి ఆవేశం వుందనేది కాదనలేనిది. కాకపోతే పవన్‌ కల్యాన్‌ను బాగా అభిమానించే వారంత ఆయన వ్యక్తిత్వమే పవనిజమంటూ గొప్పగా చెప్పుకునేవారు. ఆ పవనిజంలో నిజమెంత వుంది? అన్నది ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులతోనే తేలిపోతోంది. ఒకప్పుడు ఆయన ఆలోచనలు వేరు. ఆయన చెప్పిన మాటలు వేరు. తాను బీఫ్‌ తినాల్సివస్తే అంటూ ఒకరి మనోభావాలను, వారి ఆచార వ్యవహారాలను తప్పు పట్టొద్దని చెప్పిన సందర్బాలు అనేకం వున్నాయి. కాని ఇప్పుడు అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోతున్నాయి. ఇప్పుడు ఆయన ఎత్తుకున్న సనాతన ధర్మంలో గతం తాలూకు ఆలోచనలన్నీ తుడిచేశారా? సమాధి చేశారా? అన్నది ఆయన వ్యక్తిగతం. కాని ఆయన ప్రజల్లో వుంటున్నారు. ప్రజానాయకుడుయ్యారు. రాజ్యాంగబద్దమైన పదవిలో వున్నారు. దాంతో ఆయన గతంలో చెప్పిన మాటలను, ఇప్పడు ఆచరిస్తున్న విధానాలను అనేక మంది ప్రశ్నిస్తున్నారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌లో పెరుగుతున్న విభేదాలు

మమత వర్సెస్‌ అభిషేక్‌గా సాగుతున్న రాజకీయాలు

వృద్ధులు తప్పుకోవాలని పెరుగుతున్న డిమాండ్‌

ఇప్పటివరకు మమత నియంత్రణలోనే పార్టీ

భవిష్యత్తు ఎట్లావుంటుందో చెప్పడం కష్టం

పార్టీపై పట్టు బిగిస్తున్న అభిషేక్‌ బెనర్జీ

విభేదాలు పెరిగితే పుట్టి మునగక తప్పదు

మమత తగ్గుతారా? లేక దూకుడుగా వుంటారా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి 2026 ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫి బ్రవరి 11న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ ఒక ప్రకటన చేస్తూ, రాబోయే ఎన్నికల్లో ఎవ్వరితో పొత్తు పె ట్టుకునే ప్రసక్తే లేదని, తమ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని స్పష్టం చేయడంలో పెద్దగా విశేషమేమీ లేనట్టు కనబడుతున్నా, ఇటీవల జరిగిన ఢల్లీి ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న ఆప్‌, జవసత్వాలు ఉడికి కాలు,చెయ్యి కదపలేని స్థితిలో వున్న కాంగ్రెస్‌తో కూడిన ‘ఇండీ’ కూటమితో జట్టు కడితే ఎటువంటి ప్రయోజనం వుండబోదన్న సత్యం ఆమెకు మరోసారి బోధపడినట్టు భావించాలి. తనకు రాజకీయ లబ్దిని కలిగించే ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టని దీదీ నిర్ణయం ఎవ్వరికీ పెద్దగా ఆశ్చర్యపరదనే చెప్పాలి. మితిమీరిన ఉచితాలు వికటిస్తాయన్న మరో స త్యాన్ని ఢల్లీి ఎన్నికలు రాజకీయపార్టీలకు బాగా బోధపరచి వుంటాయి. ప్రధాని పదవికి పోటీలో ఉన్నానని చెప్పుకునే మమతాబెనర్జీకి పశ్చిమ బెంగాల్‌ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఎంతమాత్రం పలుకుబడిలేదన్న సత్యాన్ని గుర్తించాలి.

పెరుగుతున్న ఆధిపత్యపోరు

బయటి రాజకీయాలు ఒక ఎత్తయితే పశ్చిమబెంగాల్‌ అంతర్గత రాజకీయాలు ముఖ్యంగా తృణ మూల్‌ కాంగ్రెస్‌లో మమతాఅభిషేక్‌ బెనర్జీల మధ్య క్రమంగా పెరుగుతున్న ఆధిపత్యపోరు రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. దీన్నే ‘‘ఓల్డ్‌ గార్డ్స్‌’’ వర్సెస్‌ ‘‘యంగ్‌ టర్క్స్‌’’ మధ్యపోటీగా అక్కడి రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో తిరుగులేని అధినేత్రిగా మమతా బెనర్జీ బయటి వారికి కనిపిస్తున్నా ఒక వయసు దాటిన వృద్ధులు రాజకీ యాలనుంచి తప్పుకొని యువకులకు ఛాన్స్‌ ఇవ్వాలన్న వాదనలు పార్టీలో క్రమంగా బలం పుం జుకోవడం, అభిషేక్‌ బెనర్జీకి పట్టం కట్టాలన్న వర్గం బలపడుతున్న సంగతిని స్పష్టం చేస్తున్నది. అయితే మమతా బెనర్జీ మాత్రం ‘‘సీనియర్‌ నాయకులను గౌరవించాల్సిందే’’నని స్పష్టం చేస్తున్నారు.‏

‘ఓల్డ్‌’ వర్సెస్‌ ‘యంగ్‌’

గత నెలలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ అధికార భవనం ‘నబన్న’లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రవాణా శాఖమంత్రి స్నేహశీష్‌ చక్రవర్తినుద్దేశించి ‘‘సరైన సంఖ్యలో బస్సులు లేకపోవడంవల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బం దులను గురించి వాకబు చేయడానికి ఏనాడైనా బస్టాండ్‌కు వెళ్లారా? అసలు రవాణాశాఖలో ఏంజరుగుతున్నదో ఏమీ తెలియడంలేదు’’ అని అనడంతో మంత్రి నీళ్లు నమలడమే సమాధానమైంది. ఇక విద్యాశాఖ సమీక్షలో ‘‘నాకు తెలియకుండా ప్రాథమిక పాఠశాలల్లో సెమిస్టర్‌ వ్యవస్థను ఎట్లా ప్రవేశపెడతారు? అటువంటి కీలకమైన నిర్ణయాలను నన్ను సంప్రదించకుండా ఎట్లా తీసుకుంటారు? దినపత్రికల్లో చదివి తెలుసుకోవాల్సి వచ్చింది’’ అని ప్రశ్నిస్తే ఆయనవద్ద కూడా స మాధానం లేదు. పిల్లల మీద భారం తగ్గించాలి కానీ, పెంచకూడదని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి స్నేహశీష్‌ చక్రవర్తి, విద్యామంత్రి బ్రత్యబసులు, ముఖ్యమంత్రి మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి నమ్మిన బంట్లు కావడం గమనార్హం! ఈ సమీక్ష ద్వారా ఒక్క విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కొన్ని కీలక నిర్ణయాలు మమతా బెనర్జీకి తెలియకుండానే జరుగుతున్నాయి.ముఖ్యంగా ఇటువంటి నిర్ణయాలకు డైమండ్‌ హార్బర్‌ (ఇది అభి షేక్‌ బెనర్జీ స్థానం) కేంద్రస్థానంగా వున్నదన్నది పశ్చిమ బెంగాల్‌లో బహిరంగ రహస్యమే. అంతేకాదు ఈ సమీక్షపై రాష్ట్రంలోని టెలివిజన్‌ ఛానళ్లు తృణమూల్‌ పార్టీలో పెరుగుతున్న ‘‘ప్రబీణ్‌’’ (ప్రావీణ్యత) వర్సెస్‌ ‘‘నబీన్‌’’ (నవ్యత) మధ్య జరుగుతున్న సంఘర్షణగా పేర్కొన్నాయి. అంతేకాదు వృద్ధులు మమతా బెనర్జీవైపు, యువకులు అభిషేక్‌ వైపు మొగ్గు చూపుతుండటం ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామం.

కళాకారుల వివాదం

కొందరు సెలబ్రిటీ కళాకారులు, ఈ ఏడాది నూతన సంవత్సరం వేడుకల్లో తాము పాల్గనాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలు రద్దుచేశారని ప్రకటించారు. వీరంతా గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీకర్‌ ఆసుపత్రిలో యువ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడం లో ముందు వరుసలో నిలవడం గమనార్హం. కొందరు తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుల నిర్దేశం మేరకే ఈ రద్దు జరిగిందని వారు పేర్కొన్నారు. అంతకు ముందు టీఎంసీ సీనియర్‌ నాయకు డు, అధికార ప్రతినిధి కుణాల్‌ ఘోష్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘అధికారపార్టీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కళాకారులను బాయ్‌కాట్‌ చేయాలి’’ అన్నది ఈ పోస్టు సారాంశం. మరుసటిరోజే అభిషేక్‌ బెనర్జీ ఒక ప్రకటన చేస్తూ ‘‘ప్రజాస్వామ్యంతోనిరసనహక్కు ప్రతి ఒక్కరికి వుంటుంది. మా ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మాదిరిగా కాదు’’ అని స్పష్టం చేశారు. అంతేకాదు అధినేత్రి మమతా బెనర్జీ తరపున ఎవ్వరూ ఎటువంటి పోస్ట్‌ లు పెట్టకూడదని కూడా హెచ్చరించారు. కుణాల్‌ ఘోష్‌ దీనికి స్పందిస్తూ ‘‘మమతా బెనర్జీకి తెలియకుండా, ఆమె చెప్పకుండా తానెటువంటి పోస్ట్‌లు పెట్టనని’’ సమాధానమిచ్చారు. ఇక్కడ కూ డా మమత, అభిషేక్‌ల మధ్య వున్న విభేదాలు స్పష్టమయ్యాయి.

సస్పెన్షన్లు

ఇటీవల రాజ్యసభ మాజీ సభ్యుడు శంతన్‌ సేన్‌ను టీఎంసీ సస్పెండ్‌ చేసింది. విచిత్రమేమంటే ఈయన అభిషేక్‌ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. రాజకీయుడిగా మారిన ఈ డాక్టర్‌, ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటనపై చేసిన ప్రకటనలు, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. దీనికి తోడు ‘‘సే వాశ్రయ’’ పేరుతో, అభిషేక్‌ లోక్‌సభ నియోజకవర్గం డైమండ్‌ హార్బర్‌లో అనేక మెడికల్‌ క్యాం పులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆయన్ను సస్పెండ్‌ చేసింది. ఇదిలావుండగా గత నవంబర్‌ నెలలో హుమాయూన్‌ కబీర్‌ అనే పార్టీ ఎమ్మెల్యే, అభిషేక్‌ బెనర్జీకి హోమ్‌ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. అంతటితో ఆగకుండా మమత చుట్టూ వున్న వృద్ధ నాయకు లు నిజంగా ముఖ్యమంత్రికి, పార్టీకి శ్రేయోభిలాషులుగా వున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేయడం, పార్టీ ఆయన్ను సస్పెండ్‌ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.

పార్టీలో ‘సీనియర్లు’ వర్సెస్‌ ‘జూనియర్లు’ మధ్య జరుగుతున్న సంఘర్షణకు సాక్ష్యంగా మరో సంఘటనను కూడా ఉదహరించవచ్చు. 2022, ఫిబ్రవరి నెలలో పార్టీ అత్యున్నతస్థానాల్లో ఉన్న నా యకులను తొలగిస్తూ అధిష్టానం నిర్ణయించింది. విచిత్రమేమంటే ఆవిధంగా తొలగింపునకు గు రైనవారంతా అభిషేక్‌ మద్దతుదారులే! అయితే అభిషేక్‌ను కట్టడి చేయడానికే ఈ చర్య తీసుకున్నారని భావించినా తర్వాత ఆయన్ను పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించడం గమనార్హం. అంటే మమతా బెనర్జీ తన మేనల్లుడి విషయంలో ‘‘బ్రెడ్‌ అండ్‌ స్టిక్‌’’ పాలసీని అనుసరిస్తున్నార నుకోవాలి.

2023లో అభిషేక్‌ బెనర్జీ ‘‘తృణమూల్‌ ఎర్‌ నబజోవర్‌ యాత్ర’’ పేరుతో రాష్ట్రం లో 3500 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. తనపై వస్తున్న ఆశ్రిత పక్షపాతం, అవినీతి ఆరోపణలను తిప్పికొట్టే ఉద్దేశంతో ఆయన 60రోజుల పాటు ఈ యాత్రను నిర్వహించారు. ఫలితంగా తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 49స్థానాల్లో 29సీట్లు టీఎంసీ గెలుచుకోగలిగింది. ఈ ఎన్నికల్లో గట్టిపోటీదారుగా వుంటుందనుకున్న భాజపా 12సీట్లకే పరి మితం కాగా, కాంగ్రెస్‌ ఒక్క సీటు దక్కించుకుంది. ఇక కమ్యూనిస్టులు ఒక్కసీటూ గెలుచుకోలేదు. మరి ఇవే ఎన్నికల్లో అభిషేక్‌ బెనర్జీ పార్టీ వృద్ధనాయకులైన సుదీప్‌ బందోపాధ్యాయ్‌, కళ్యాణ్‌ బందోపాధ్యాయ్‌లు పోటీచేస్తున్ననియోజకవర్గాలో ప్రచారం చేయలేదు. వీరిద్దరూ పార్టీలో యువ నాయకత్వాన్ని ఎప్పుడూ విమ ర్శిస్తుండటం గమనార్హం.

ఇన్ని పరిణామాల నేపథ్యంలో పార్టీలో రెండు అధికార కేంద్రాలు కొనసాగుతున్నాయన్న వార్తలు జోరందుకున్నాయి. గత డిసెంబర్‌లో మమతా బెనర్జీ తన మేనల్లుడితో సమావేశమై, పార్టీలో మార్పులు చేపట్టడానికి అనుమతివ్వడం గమనార్హం! అంతేకాదు వచ్చే ఏడాది జరుగబోయే అ సెంబ్లీ ఎన్నికల్లో పోరుకు పార్టీని సిద్ధం చేయాలని కూడా ఆమె కోరడం విశేషం! పార్టీలో వ్యక్త మవుతున్న ఆగ్రహావేశాలను, నాయకత్వం ఇప్పటివరకు సమర్థవంతంగా నియంత్రణలో వుంచ గులుతోందనేది అక్షరసత్యం. కాకపోతే పార్టీ మమతా బెనర్జీ ఛరిష్మాపైనే నడవడం పెద్ద బలహీనత! అభిషేక్‌ బెనర్జీకి పార్టీపై పట్టున్నప్పటికీ, ప్రజల్లో ఛరిష్మా ఎంతవరకు ఉన్నదనేది ఇంకా స్పష్టం కాలేదు! వ్యక్తి ఛరిష్మాపై ఆధారపడిన పార్టీల చరిత్ర ఎట్లా ముగిసిందో మనం చూస్తూనే వున్నాం.

ప్రచారంలో పై చేయి నాదే : కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వి. నరేందర్‌ రెడ్డి.

`మంచి మెజారిటీతో గెలుస్తున్నాను.

`పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి జీవితంలో మర్చిపోలేను.

`ప్రత్యర్థులు పట్టభద్రులకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు.

`విద్యా వేత్తగా నేను అందరికీ సుపరిచితం.

 

`పట్టభద్రుల స్పందన చాలా బాగుంది.

`పట్టభద్రులు బ్రహ్మ రథం పడుతున్నారు.

`నరేందర్‌ రెడ్డి ప్రచారంలో మహిళామణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.

`ప్రజలు నరేందర్‌ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు.

`అందరికీ అందుబాటులో వుంటారు అనే పేరు నాకు మాత్రమే వుంది.

`విద్యావేత్తగా అందరికీ తెలిసిన వ్యక్తిని కావడం నాకు కలిసొచ్చే అంశం.

`రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలనపై యువతలో మంచి స్పందన.

`ఉద్యోగాల కల్పన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యం.

`పదేళ్లలో పట్టుమని గత పాలకులు పది కొలువులు ఇచ్చింది లేదు.

`బిజేపికి మాటలు ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు.

`బిజేపి మాటలు నీటి మీద రాతలని తరలిపోయింది.

`దేశంలో బిజేపి వల్ల నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది.

`పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిపోయింది.

`బిజేపి చేతగాని తనం వల్ల అమెరికాలో మన యువత ఇబ్బందులు పడుతున్నారు.

`కాంగ్రెస్‌ పాలనలో దౌత్య సంబంధాలు చాలా మెరుగ్గా వుండేవి.

`మన దేశం నుంచి వెళ్లిన యువతకు మంచి గౌరవం వుండేది.

`బిజేపి దౌత్యపరమైన అవగాహన రాహిత్యం దేశానికి తీరని నష్టం జరుగుతోంది.

`కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులలో ఒక భరోసా కలిగింది.

`కాంగ్రెస్‌ ప్రభుత్వంమే ఉద్యోగాలు ఇస్తుందని బలమైన నమ్మకం ఏర్పడిరది.

`ఒక్క ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక చరిత్ర.

`రిటైర్‌ అయిన ఉద్యోగుల స్థానంలో వెంటనే ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తాను.

`ప్రైవేటు రంగంలో కూడా తెలంగాణ యువతకు ప్రాధాన్యత కలిగేలా చూస్తాను.

`రాష్ట్ర ప్రభుత్వం ఐటి విస్తరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.

`ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.

`ఎంతో మంది నిరుద్యోగుల కల నెరవేరేందుకు మంచి రోజులు రానున్నాయి.

`కొన్ని లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దాను.

`వారి సహకారంతో గెలిచి, నిరుద్యోగ యువతకు సేవ చేస్తాను.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నిత్యం ప్రజల్లో వుంటా..ప్రజలతో వుంటా…ప్రజల జీవన విదానంలో వుంటా..ప్రతి నిమిషం ప్రజలతోనే గడుస్తుంది. రోజులో ఏ కొద్ది సమయమే నా కోసం వుంటుంది. మిగతా సమయమంతా ప్రజలోనే వుంటుంది. నిత్యం ఎంతోమందిని కలుస్తుంటాను. సమాజాన్ని దగ్గరుండి చూస్తుంటారు. సామాజిక సమస్యలు ప్రతి క్షణం అద్యయనం చేస్తుంటాను. పేదరికంలో మగ్గుతున్న జీవితాలను చాలా దగ్గరగా వుండి చూస్తుంటారు. నేను వ్యాపార వేత్తను కాదు. విద్యా వేత్తను. ప్రతి ఏటా కొన్ని వేల మందిని సమాజంలోకి పంపిస్తుంటారు. పసి వయసు నుంచి నా విద్యా సంస్ధలతో వారు పెనవేసుకున్న అనుబంధం, వారిని ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే వరకు వారితో నా ప్రయాణం సాగుతుంది. ఇది ఒక్క ఉపాద్యాయుడికి మాత్రమే దక్కుతుంది. అందులో విద్యా సంస్దల నిర్వహణతో నేను అనేక పాఠాలు నేర్చుకుంటాను. వాటిని మా విద్యాలయాల ద్వారా విద్యార్దులకు, పరోక్షంగా సమాజానికి నేర్పిస్తుంటాను. దేశ విదేశాలలో విద్యా వ్యవస్దల మీద నిరంతరం అధ్యయనం కొనసాగుతుంది. మన పిల్లల ఉత్తమ భవిష్యత్తుకు మార్గలు వేయడం జరుగుతుంది. సమాజంలో చైతన్యాన్ని నింపేందుకు నిరంతరం కృషి చేస్తుంటారు. అనేక సభలు, సమావేశాలకు హజరౌతుంటాను. సామాజిక స్ధితిగతుల మీద నిరతంరం ఉపన్యాసాలు ఇస్తుంటాను. ఇలా నా జీవితమంతా ప్రజలతోనే ముడిపడి వుంటుంది. తెలంగాణలో నన్ను గుర్తు పట్టని వారుండరు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నాతో పరిచయం లేని వాళ్లంటూ వుండరు. నా విద్యా సంస్దల్లో చదువుకున్న వాళ్లు, వారి తల్లిండ్రులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇలా అన్ని రంగాల ప్రజలతో నాకు వున్నంత సత్సంబందాలు మరెవరికీ వుండవు. అందువల్ల కాంగ్రెస్‌ పార్టీ నుంచి నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. నాపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటాను. కాంగ్రెస్‌ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాను. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వ విజయాలలో ప్రధాన భూమిక ఉద్యోగ కల్పనపై ప్రజలకు వివరిస్తాను. వారికి మెరగైన ఉపాది కల్పన కోసం కృషి చేస్తాను. నా మాటల మీద నమ్మకంతో, కాంగ్రెస్‌ పార్టీపై వున్న విశ్వాసంతో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అంటున్న ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి, ఆల్‌ఫోర్స్‌ విద్యా సంస్దల అదినేత డాక్టర్‌. వి. నరేందర్‌ రెడ్డితో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు చెప్పిన విషయాలు, వివరాలు ఆయన మాటల్లోనే…

సమాజంలో ఉన్నత లక్ష్యాలు, వ్యక్తిగత ఆశయాలు, వాటిని నిజం చేసుకునే అవకాశం కల్పించే ఏకైక వారధి విద్య. ఆ విద్యను కొన్ని లక్షల మందికి ముప్పై సంవత్సరాలకు పైగా అందిస్తున్నాను. అలా ప్రజలతో నా ప్రయాణం ఇప్పటి వరకు ఎంతో గొప్పగా సాగుతోంది. అందుకు కారణం నా అంకితభావమే కారణం. ఒక విద్యా వేత్త సమాజం గురించి ఆలోచించినంతగా మరెవరూ ఆలోచించరని ఆ నా అభిప్రాయం. ఈ సమాజం నాది. నా సమాజం ఎప్పుడూ ఉన్నతంగా వుండాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. అంతే కాకుండా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, దేశంలో పంచవర్ష ప్రణాళికలు రూపొందిం చి,ఐదేళ్లకోసం లక్ష్యాలను నిర్ధేశించుకొని దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపించింది కాంగ్రెస్‌ పార్టీ. బిజేపి పార్టీకి అలాంటి లక్ష్యాలు ఏమీ లేవు. దేశాబివృద్దికి ప్రధాన్యతలు లేవు. ప్రణాళికలను ఎత్తి వేసినప్పుడే బిజేపి అంతరంగం అర్దమైంది. కేవలం రాజకీయం తప్ప ప్రగతి దారి మూసేయమే బిజేపి లక్ష్యంగా మారింది. అలాంటి ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు తప్ప ఉఫాది కల్పించింది లేదు. ప్రజల జీవితాల్లో వెలుగు నిందింది లేదు. వికసిత్‌ భారత్‌ అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉపాధి కల్పనలో మహాత్మాగాంధీ ఉపాధి హమీ పధకం తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఆ పధకం వల్ల పల్లె ప్రజలకు నిత్యం ఉపాది కలుగుతోంది. ఆ పధకాన్ని కూడా అటెకెక్కించే కుట్ర బిజేపి చేస్తోంది. ఈసారి బడ్జెట్‌లో ఈ పదకం ప్రస్తావన కూడా తేలేదు. ఉపాధి పథకం కూలీ పెంచలేదు. పైగా రెండు కోట్ల మందిని ఆ ఉపాధి నుంచి తప్పించే కుట్ర చేస్తోంది. ఇలా పేదల జీవితాలను చిద్రం చేస్తూ, పారిశ్రామిక వేత్తలకు తొత్తుగా మారింది బిజేపి. అలాంటి బిజేపి పాలనతో పేదలకు మేలు కన్నా, శాపమే ఎక్కువైంది. ఏ రంగంలో చూసినా అవరోహనమే కనిపిస్తోంది. మధ్య తరగతి మీద పన్నుల మీద పన్నుల వడ్డిస్తూ వారి జీవితాలన చిదిమేస్తున్న పార్టీ బిజేపి. 2014 ఎన్నికల ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది. యువత జీవితాలలో ఆశలు రేపింది. ఈ పదకొండేళ్ల కాలంలో ఉద్యోగాలు ఇచ్చిందిలేదు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చింది లేదు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోంది. దేశంలోనే అతి పెద్దదైన రైల్వే వ్యవస్ధను నిర్వీర్యం చేసి, ప్రైవేటు రంగానికి అప్పగించే కుట్రలు చేస్తోంది. ప్రధాన మంత్రి మోడీ స్వయంగా ప్రభుత్వం వ్యాపారాలు చేయదని చెప్పినప్పుడే ఆయన అంతరంగం పూర్తిగా అర్ధమైపోయింది. మన దేశ స్వామ్య వాద ఆర్ధిక వ్యవస్ధను పూర్తిగా వ్యక్తి ఆర్ధిక వ్యవస్ధగా మార్చి, ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఎల్‌ఐసి లాంటి సంస్ధలను కూడా ప్రైవేటు పరం చేసి, ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్యం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి సాగిస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సివుంది. విద్యా వైద్య రంగాలను పూర్తిగా భ్రష్టు పట్టించి, ప్రజల జీవితాలను ఆగం చేస్తోంది. మన దేశ సగటు ఆయు ప్రమాణమే 69 సంవత్సరాలు. అలాంటిది 70 సంవత్సరాలకు పై బడిన వారికే ఉచిత వైద్యం అని చెప్పి ఇలా కూడా ప్రజలను మోసం చేయొచ్చని నిరూపించిన ఏకైక పార్టీ బిజేపి. బిజేపి ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్ధ విధానాల వల్ల విదేశీ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ట్రంప్‌ మన విద్యార్ధులను, ప్రజలకు బేడీలు వేసి, తిరిగి పంపిస్తున్నారు. ఒక దేశానికి చెందిన సైనిక విమానం మరో దేశం అనుమతి లేకుండా వాలడం అంటే మనపై ఆధిపత్యాన్ని చూపించినట్లే లెక్క. అయినా స్పందన లేని ప్రధాని మోడీ అమెరికా మందు సాగిలపడడం మన దౌర్భాగ్యం. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాల కాలంలో ఇలాంటి పరిస్దితులు దేశం చూసిందా? ఇతర దేశాల ముందు సాగిలపడడం జరిగిందా? అందువల్ల దేశ ప్రజల్లో చైతన్యం రావాలి. అది ముందు తెలంగాణ నుంచే మొదలవ్వాలి. తెలంగాణలో బిజేపి పార్టీకి చోటులేదు. ప్రజల ఆదరణ అంతకాన్న లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు కూడా పడదు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రత్యర్ధి పార్టీలకు చెందిన వ్యక్తులు ఎవరూ ప్రజలు తెలిసిన వాళ్లు కాదు. ప్రజల్లో వుండేవాళ్లు కాదు. అందుకే ఎక్కడికెళ్లినా నన్ను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముఖ్యంగా మంత్రి శ్రీధర్‌బాబు, సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ నా గెలుపు కోసం ఎంతో శ్రమిస్తున్నారు. వారి కృషి వృదా కాదు. వ వారి ఆశీస్సులతో నేను గెలవడం పక్కా…అది కూడా మంచి మెజార్టీతో గెలుస్తాను. గతంలో ఏ పార్టీ కూడా అదికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే మొత్తంగా ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర లేదు. అది ఒక్క కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజా పాలనకే దక్కుతుంది. అందుకే ప్రజా ప్రభుత్వం మీద ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడిరది. నిరుద్యోగులు తమ ఆశలు, కలలు నెరవేరుతాయన్న విశ్వాసం వారిలో బలంగా ఏర్పడిరది. తాను ఎమ్మెల్సీగా గెలిచిన మరు క్షణం నుంచి నిరుద్యోగుల ఆశల నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తాను. అటు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇటు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తాను. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇస్తూ, యువత భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తోడ్పడతాను..ఇది నా హమీ…

పాపం పిరాయింపు ఎమ్మెల్యేలు!

­

`తెగిన గాలిపటాలైపోయారు

`పిరాయింపు ఎమ్మెల్యేల విచిత్ర వైఖరి?

`జై కాంగ్రెస్‌ అనలేకపోతున్నారు

`బీఆర్‌ఎస్‌ ను నోటి నిండా తిట్టలేకపోతున్నారు

`కాంగ్రెస్‌ లో చేరినా బిఆర్‌ఎస్‌ పార్టీని ఉతికి ఆరేయలేకపోతున్నారు

`మరి కొందరు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు

`రెండు వైపులా దారులు మూసుకుపోయే పరిస్థితి తెచ్చుకున్నారు

`అటు ఎన్నికలంటే భయం..ఇటు పదవీ గండం!

`కాంగ్రెస్‌కు దగ్గర కాలేక, దూరంగా వుండలేక సతమతమౌతున్నారు

`నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ నాయకుల ఆదరణ లేదు

`నియోజకవర్గాలకు వెళ్తే జేజేలు కొట్టే వారు లేరు

`అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారు

`ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామన్న విశ్వాసం కనిపించడం లేదు

`రాజీనామా చేసినా వెంటనే ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు

`ఆరు నెలల పాటు ప్రజల్లో వుంటూ ప్రచారం అంత సులువు కాదు

`ఏ రకంగా చూసినా కష్టకాలమే!

`సుప్రీం కోర్టు ఎమ్మెల్యేలను భర్తరఫ్‌ చేస్తే కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని రూలేం లేదు?

`ఇప్పుడు మళ్ళీ యూటర్న్‌ తీసుకున్నా కారుకే ప్రమాదం

`రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోతారు

`భవిష్యత్తు రాజకీయానికి తమకు తామే చరమగీతం పాడుకున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

పిరాయింపులు ఎమ్మెల్యేలకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. నిజానికి ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. గతంలో ఎమ్మెల్యేలు పార్టీలు పిరాయించిన సందర్బాలు అనేకం వున్నాయి. అప్పుడు వారికి ఈ పరిస్దితి ఎదురుకాలేదు. కాని ఇప్పుడు ఎదురౌతున్న సమస్యతో పిరాయింపు దారులంతా తలలు పట్టుకుంటున్నారు. ఎరక్కపోయి వచ్చామా? తొందరపడ్డామా? అని మధనపడుతున్నారు. తెగిన గాలిపటాలైపోయే పరిస్దితి ఎదురుకానుందా? అన్న ఆందోళనలో వున్నారు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా, లోలోన వారు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అటు కాంగ్రెస్‌లో వున్నట్లు లేదు. ఇటు గెలిచిన పార్టీకి తిరిగి వెళ్లిపోయే పరిస్ధితి లేదు. రెంటికీ చెడిన రేవడిగా తమ రాజకీయం మారుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. మూలుగుతున్న నక్కమీద తాటి పండు పడ్డట్టు సుప్రింకోర్టు నోటీసులు జారీ చేయడంతో వారి ఆందోళన మరింత ముదురుతోంది. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసకోవాలో అర్ధం కాని పరిస్ధితి ఎదురౌతోంది. ఒక వేళ సుప్రింకోర్టులో ఊరట లభిస్తే అన్న చిరు ఆశతో వున్నారు. స్పీకర్‌ నిర్ణయంపై సుప్రింకోర్టు ఇప్పటికే కొన్ని ప్రశ్నలు సంధించింది. ఇంకా స్పీకర్‌కు సమయం ఇవ్వకపోవచ్చు. ఆ లోపు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పరిస్ధితి ఎలా వుంటుందా? అన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ సుప్రింకోర్టు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఆ ఎమ్మెల్యేలపై ప్రజల్లో మరింత తీవ్రత పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. కండువాలు మార్చినా జై కాంగ్రెస్‌ అనలేకపోతున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలకు దగ్గర కాలేకపోతున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కొంత మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆదరించడం లేదు. ముఖ్యంగా పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డిని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేగా అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. అభివృద్ది పనులపై ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌ నాయకులే ఆయనను అడ్డుకుంటున్నారు. అలాంటి ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడితే ఇక కాంగ్రెస్‌ కూడా ఆయనను ఆదరించదు. ఆయనకు టికెట్‌ ఇవ్వదు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసినా సరే కాంగ్రెస్‌ నాయకులు వినే పరిస్దితి వుండదు. ఎందుకంటే గెలిపించాల్సింది ప్రజలు, నాయకులు, కార్యకర్తలే. వారిని ఒత్తిడి తెచ్చి గూడెంకు మళ్లీ టికెట్‌ ఇచ్చి గెలిపించుకోవడం కుదిరేపని కాదు. కచ్చితంగా ఆయన స్ధానంలో మరొకరికి టికెట్‌ ఇవ్వకతప్పదు. కార్యకర్తలే తిరుగుబాటు చేస్తుంటే జై కాంగ్రెస్‌ అనలేకపోతున్నాడు. అలా అని బిఆర్‌ఎస్‌ మీద విమర్శలు చేయలేకపోతున్నాడు. సహజంగా పార్టీ మారిన తర్వాత ప్రత్యర్ధి పార్టీని టార్గెట్‌ చేయకుండా రాజకీయాలు చేస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించరు. గుంపులో చేరిన తర్వాత ఆ పార్టీ నినాదాలను అందుకోవాలి. కాని పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరూ అటు కేసిఆర్‌ను గాని, ఇటు ఇతర నాయకులపై గాని ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. పార్టీ మారడానికి తొలి అడుగు వేసిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే తొలి రోజుల్లో కొంత దూకుడు ప్రదర్శించాడు. సాక్ష్యాత్తు అసెంబ్లీలోనే బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై నోరు పారేసుకున్నారు. తర్వాత ఆయన కూడా బిఆర్‌ఎస్‌ మీద మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. అంతే కాదు ఇటీవల కాలంలో కేసిఆర్‌ గొప్ప నాయకుడు. భోళా శంకరుడు అంటూ కితాబిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులనేద్దేశించిన వ్యాఖ్యలపై కేటిఆర్‌ను కలిసి వివరణ కూడా దానం నాగేందర్‌ ఇచ్చుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక హైడ్రా విషయంలో దానం నాగేందర్‌ తీవ్ర అసంతృప్తితో వున్నారు. కాంగ్రెస్‌లో చేరినా తన మాట చెల్లుబాటు కావడం లేదని మధనపడుతున్నాడు. బిఆర్‌ఎస్‌ నుంచి వచ్చి, సికింద్రాబాద్‌ ఎంపిగా పోటీ చేసి కాంగ్రెస్‌ కోసం త్యాగం చేస్తే తనను గుర్తించేవారు లేకుండాపోయారని అనుకుంటున్నారట. ఇదిలా వుంటే సుప్రింకోర్టు ఒక వేళ దానం నాగేందర్‌ ఎమ్మెల్యే పదవిని భర్తరఫ్‌ చేస్తే రాజకీయ జీవితానికి పుల్‌ స్టాప్‌ పడినట్లే అని చెప్పకతప్పదు. పది మంది ఎమ్మెల్యేల భర్తరఫ్‌ జరిగితే మాత్రం టికెట్‌ రాని వారిలో దానం నాగేందరే మొదటి వ్యక్తి అవుతారని చెప్పడంలో సందేహం లేదు. సరే మంచో చెడో పార్టీ మారడం జరిగింది. పరిరిస్దితి చేయి దాటిపోయింది. కాంగ్రెస్‌ పార్టీలోనైనా పూర్తిగా కలిసిపోతున్నారా? అంటే అదీ లేదు. తమకు ఎలాంటి ప్రాదాన్యత లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నా బిఆర్‌ఎస్‌పై ఇప్పటి వరకు పల్లెత్తు మాట అనని నాయకులు మళ్లీ తమకు కారులో చోటు దక్కుతుందన్న ఆశతో వున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. అదే జరిగితే ప్రజలు కాంగ్రెస్‌కన్నా ముందు బిఆర్‌ఎస్‌నే చీదరించుకుంటారు. ఉప ఎన్నికలే వస్తే బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదు. అప్పుడు బిజేపికి బంగారు పళ్లెంలో ఎమ్మెల్యేలను అందించినట్లౌవుంది. నిజం చెప్పాలంటే రెండు వైపులా దారులు మూస్తే తప్ప భవిష్యత్తులో ఇలా పార్టీ మారడానికి ఎమ్మెల్యేలు ముందుకు రారు. ప్రజా ప్రభుత్వాలను అసి ్దరపర్చాలనుకోవడం రాజకీయ పార్టీల అనైతిక రాజకీయాలకు పరాకాష్ట. అలాంటి రాజకీయాలను ఎవరూ సహించకూడదు. సమర్ధించకూడదు. పార్టీ మారారు.. కాంగ్రెస్‌లో ప్రాధాన్యత దక్కకపోయినా పదవి ఊడిపోకుండా వుంటే చాలని కోరుకుంటున్నారు. పొరపాటున ఉప ఎన్నికలు వస్తే మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చుక్కలు చూడడం తప్పదు. ఎందుకంటే ఇప్పటికప్పుడు సమీపంలో ఎన్నికలు లేవు. ఓ ఆరు నెలల సమయంలో కేరళ రాష్ట్ర ఎన్నికలున్నాయి. అప్పటి వరకు ఉప ఎన్నికలు రాకపోవచ్చు. అప్పటి వరకు పార్టీ మారిన ఎమ్యెల్యేలు ప్రజల్లో వుండాలంటే దూల తీరిపోతుంది. ప్రజలు ఎన్నికల వాగ్ధానాల మీద నిలదీస్తుంటారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ అంటూ వెళ్తే అడుగడుగునా సమాధానం చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. ఏ మాత్రం బ్యాలెన్స్‌ తప్పినా మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలే ఆదరించడం లేదు. ఇక ప్రజలు కూడా దూరం కొడితే వారి రాజకీయం శంకగిరి మాన్యాలే. ఆరు నెలల పాటు కార్యకర్తల సాధకబాధకాలు చూసుకోవాలి. ఎమ్మెల్యేగా వున్నప్పుడు నాయకులు, కార్యకర్తలు ఇంటి ముందు వచ్చి వాలుతారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలే పార్టీ కార్యకర్తల ఇంటి ముందుకు వెళ్లాల్సిన పరిస్ధితి ఎదురౌతుంది. సరే ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడైనా మూడు నెలుల వుంటేనే ఊపిరి సలపకుండాపోతుంది. అలాంటిది ఆరు నెలల కాలమంటే ఇక ఎమ్మెల్యే అభ్యర్ధులు ఆస్దులమ్ముకొవాల్సిందే. రాజకీయాలు చేయాల్సిందే. వారి కష్టాలు తీర్చేవారు కూడా ఎవరూ వుండరు. ప్రజల్లో వుంటూ, ప్రజలకు సేవ చూస్తూ, వారి మాటల పడుతూ, అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొంటూ వెళ్లినా, ఆఖరు నిమిషంలో టికెట్‌ దక్కకపోతే ఆ బాధ ఊహిస్తేనే భయంకరంగా వుంటుంది. ఈ సంగతి వాళ్లకు కూడా తెలుసు. అయినా తప్పదు. తన నాయకత్వాన్ని రుజువు చేసుకోవాల్సి వుంటుంది. ప్రత్యర్ధి పార్టీలు నిత్యం వేసే నిందలను భరించాలి. ప్రజలను రెచ్చగొట్టి చేసే రాజకీయాలను ఎదుర్కొవాలి. ఎటు చూసినా మద్దెల వాయింపు తప్పదు. ఆరు నెలల పాటు కడుపు నిండా తిండి వుండదు. కంటి నిండా నిద్ర వుండదు. ఎప్పుడు ఏ సమస్య వచ్చి నెత్తి మీద పడుతుందో తెలియదు. ప్రజలు కూడా తమ సమస్యల పరిష్కారానికి వస్తే సమయం ఇవ్వకపోతే ప్రజల నుంచి ఎదురయ్యే వ్యతిరేకత మామూలుగా వుండదు. అసలే సోషల్‌ మీడియా కాలం. ఆ పది మంది ఎమ్మెల్యేల చుట్టూ నిత్యం వందలాది సోషల్‌ మీడియా ప్రతినిధులు వుంటారు. ఎమ్మెల్యేలను వెంటాడుతుంటారు. వారు ఎక్కడికెళ్లితే అక్కడికి వాలిపోతారు. ఎమ్మెల్యేల ఇంటి వద్ద కూడా కొంత మంది ఎప్పుడూ సిద్దంగా వుంటారు. ప్రతి నిమిషాన్ని వివాదం చేయడానికి సిద్దంగా వుంటారు. పిరాయింపు ఎమ్మెల్యేలు పొరపాటున ఎవరి మీద నైనా అసహనం వ్యక్తం చేసినా, ఆ ఎమ్మెల్యే మీద ప్రజలు ఏవైనా వ్యాఖ్యలు చేసినా ఇక సోషల్‌ మీడియాలో కనిపించే వాయింపు ఓ రేంజ్‌లో వుంటుంది. ఇన్ని రకాల అవరోధాలును ఎదుర్కొని, సమస్యల వలయాన్ని చేధించుకొని నిలిచేదెవరో..గెలిచేదెవరో.. చూడాలి.

కేరళను కుదిపేస్తున్న రూ.వెయ్యి కోట్ల స్కాం

‘హాఫ్‌ ప్రైజ్‌’ స్కాంగా ప్రసిద్ధి

అన్ని పార్టీలకు చెందిన కొందరు నాయకుల మెడకు చుట్టుకుంటున్న వైనం

ఎా3గా మాజీ హైకోర్టు న్యాయమూర్తి

30వేల మంది బాధితులు

నిఘా నీడలో రాష్ట్రంలోని ప్రముఖులు

నేటిధాత్రి డెస్క్‌:  

‘‘నన్ను మోసం చేశాడు’’ అని అనడం తప్పు. ఎందుకంటే నువ్వు మోసపోయే అవకాశం పక్కవాడికి ఇచ్చావు కనుక మోసంచేసాడు. అంటే లోపం నీదగ్గరే వుంది. అందువల్ల మోసపోయేవాడున్నప్పుడు మోసం చేసేవాడు ఎప్పుడూ వుంటాడు! మోసపోవడానికి ప్రధాన కారణం ‘ఆకర్షణ’. సహేతుకంగాలేని ‘ఆకర్షణ’కు లోబడటం మానవుల సహజ బలహీనత! దీన్నే మోసగాళ్లు సావ కాశంగా తీసుకుంటున్నారు. ఇటువంటి ప్రలోభపూరిత ‘ఆకర్షణలకు’ మహిళలే తేలిగ్గా ఎరగా మారుతుంటారు. ఇందుకు ఉదాహరణగా ప్రస్తుతం కేరళలో స్వచ్ఛంద సంస్థ ముసుగులో 26ఏళ్ల యువకుడు మొత్తం 14 జిల్లాలకు చెందిన ప్రజలను రూ.వెయ్యికోట్ల మేర మోసం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విచిత్రమేమంటే అతనికి ప్రచారం విపరీతంగా వస్తున్న నేపథ్యంలో, అతనితో కలిసి ఫోటోలు దిగిన లేదా సన్నిహితంగా మెలిగిన రాజకీయ నాయకులల మెడకు కూడా ఇది చట్టుకోవడంతో కేరళను ఈ స్కాం కుదిపేస్తోంది. కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సి.ఎన్‌. రామచంద్రన్‌ పేరు ఈ కేసులో మూడో నిందితుడిగా వుండటం మరో విచిత్రం! అయితే రాజకీయ నాయకులు, ఈ మాజీ న్యాయమూర్తి తమకు ఈ స్కాంతో ఎటువంటి సంబంధంలేదని చెబుతున్నారు. ఈ మొత్తం స్కాంకు మూలకారకుడు 26 సంవత్సరాల యువకుడు అనందు కృష్ణన్‌. మువ్వత్తుప్ఫూజ సామాజిక`ఆర్థిక అభివృద్ధి సొసైటీ పేరుతో ఇతను నడిపిన స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీఓ)కు సంబంధించిన 21 బ్యాంకు ఖాతాలను ఇప్పుడు కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రారంభంలో 34 కేసులు క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేసినప్ప టికీ ఇవి 30వేలు దాటవచ్చని, బాధితుల సంఖ్య లక్షవరకు వుండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ స్కాం విలువ రూ.వెయ్యికోట్లు దాటడంతో కేరళ స్టేట్‌ పోలీస్‌ చీఫ్‌ (ఎస్‌పీసీ) షేక్‌ దర్వేష్‌ సాహెబ్‌ కేసును క్రైమ్‌ బ్రాంచ్‌కి అప్పగించారు. 

సగం ధరకే వస్తువులు

మొదట్లో సగం ధరకే స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, కుట్టుమిషన్లు అందజేస్తానని అనందు కృష్ణన్‌ విపరీతంగా ప్రచారం చేశాడు. ‘‘తనవద్ద కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్‌ (సీఎస్‌ఆర్‌)లు వున్నాయని, మీరు సగం ధర చెల్లిస్తే, మిగిలిన సగం ధరను తనవద్ద ఉన్న సీఎస్‌ఆర్‌ నిధులనుంచి చెల్లిస్తానని నమ్మబలికాడు. దీనికి విపరీత ప్రచారం కల్పించడంతో జనాలు తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఇతని చేతిలో పెట్టి చివరకు నిండా మునిగినట్టు తెలుసుకొని ఇప్పుడు లబోదిబో మంటున్నారు. ఇప్పుడు అనందు కృష్ణన్‌ స్కామ్‌ కేరళలోని ప్రధాన రాజకీయ ఫ్రంట్‌ల మెడకూ చుట్టుకుంది. అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడీఎఫ్‌ మరియు బీజేపీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులకు అనందు కృష్ణన్‌ నుంచి నిధులు అందాయని ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఆయా పార్టీల్లో కలకలం రేగింది. ఇప్పుడు కృష్ణన్‌తో బహిరంగ కార్యక్రమాల్లో పాల్గన్న ఆయా పార్టీల నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ చందంగా మారింది. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివరణ

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మ్యాథ్యూ కుజల్‌నందన్‌కు ఏకంగా రూ.7లక్షలు కృష్ణన్‌ నుంచి అందాయని మళయాలం టీవీ ఛానల్‌ సోమవారం కథనాన్ని ప్రసారం చేయడంతో అసెంబ్లీలో దుమారం రే గింది. దీంతో ఆయన టీవీ ఛానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అసెంబ్లీలో ప్రకటించారు. ‘‘ఈ సంస్థలో కొంత మొత్తం డిపాజిట్‌ చేశామని, దీనికి సంబంధించి సంస్థ ఇచ్చిన హా మీ మేరకు తమకు వస్తువులు అందలేనది, నా సన్నిహితుడు తెలిపాడు. ఆయనతో పాటు మరి కొందరు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని నాకు చెప్పాడు’’, నాకు ఇంతవరకే తెలుసని ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ఇక కేరళలో సాయి ట్రస్ట్‌ ఛైర్మన్‌ కె.ఎన్‌. ఆనంద్‌కుమార్‌కు అనందు కృష్ణన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆయనపై నిఘా పెట్టాయి. ఈయన కేరళలో చాలా పేరున్న సామాజికవేత్త! ‘‘నేనెక్కడికీ పారిపోలేదు. వచ్చిన నిధులన్నింటికీ సక్రమంగా లెక్కలున్నాయి. అన్నీ చట్టపరిధిలోనే జరిగాయి’’ అని ఆయన తెలిపారు. ఇక ఈకేసులో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సి.ఎన్‌. రామచంద్రన్‌ నాయర్‌ పేరుకూడా వుండటంతో, ‘‘కృష్ణన్‌ సంస్థకు తాను ప్యాట్రన్‌గా ఎప్పుడూ వ్యవహరించలేదని, ఒకప్పుడుసంస్థకు సలహాదారుగా వ్యవహరించినప్పటికీ, ఆ పోస్ట్‌కు ఎప్పుడో రాజీనామా చేశాను’’ అని చెప్పారు.

హాఫ్‌ ప్రైజ్‌ాస్కామ్‌ 

కేరళను కుదిపేసిన ఈ రూ.1000కోట్ల స్కామ్‌ను ఇప్పుడు ‘‘హాప్‌ ప్రైజ్‌ాస్కామ్‌’’గా పిలుస్తున్నా రు. సగంధరకే వస్తువులు అందిస్తామని ప్రచారం చేయడంతో దీనికి ఈ పేరు స్థిరపడిపోయింది. స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలను సగం ధరకే ఇస్తామని, మిగిలిన సగం మొత్తా న్ని కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ఫండ్‌ (సీఎస్‌ఆర్‌)నుంచి చెల్లిస్తామని ప్రచారం చేయడంతో ప్రజలు నమ్మారు. ప్రజలను నమ్మించడానికి కృష్ణన్‌ రాష్ట్రంలోని ఇతర ఎన్‌.జి.ఒ.ల పలుకుబడినికూడా చక్కగా ఉపయోగించుకోవడం, ప్రజల్లో విశ్వసనీయత రావడానికి ప్రధాన కారణం. అసలు సీఎస్‌ఆర్‌ నిధులు లేనేలేవని విచారణాధికార్లు స్పష్టం చేశారు. 

ఎవరీ అనందు కృష్ణన్‌

అనందు కృష్ణన్‌ ఇడుక్కి జిల్లా తొడుప్పుజాకు చెందినవాడు. ప్రస్తుతం అతనిపై అనేక కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృష్ణన్‌కు గతంలో మోసపూరిత చరిత్ర వున్నదని, ఇప్పుడు దాదాపు 30వేల మంది బాధితులనుంచి డబ్బును సేకరించేందుకు రెండు డజన్లకు పై గా బ్యాంకు ఖాతాలు ఉపయోగించినట్టు విచారణాధికార్లు నిర్ధారించారు. మీడియా కథనాల ప్ర కారం ఇడుక్కిలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అనందు కృష్ణన్‌, తన స్థానిక పరిచయాల నేపథ్యం లో కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఒక పంచాయతీ సభ్యుడు చెప్పిన ప్రకారం కృష్ణన్‌ తన స్వచ్ఛంద సంస్థలకు సర్దార్‌ పటేల్‌, అబ్దుల్‌ కలాం వంటి ప్రముఖుల పేర్లు పెట్టేవాడు. ఇతని తండ్రి కార్పెంటర్‌. తల్లి రాష్ట్ర పౌరసరఫరా విభాగంలో పనిచేస్తున్నారు. ఎన్‌.జి.ఒ.ను ప్రారంభించిన తర్వాత కృష్ణన్‌ జీవనశైలి ఒక్కసారిగా మారిపోయింది. లగ్జరీ కార్లు, ఆ స్తులు కొనుగోలు చేశాడు. ఒక్క డిసెంబర్‌ నెలలోనే అనందు కృష్ణన్‌ ఢల్లీి ప్రయాణాలకు రూ.338,000, అక్కడ విలాసవంతమైన హోటళ్లలో బసకు రూ.366,000 ఖర్చు చేసినట్టు విచారణ అధికార్లు వెల్లడిరచారు. కృష్ణన్‌, అతని సంస్థలకు సంబంధించిన 21 బ్యాంకు ఖాతాలను అధికార్లు గుర్తించారు.

తన గ్రామంలోని వారికి స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు అందజేశాడు. ఆవిధంగా ఒకపక్క పెరుగుతున్న సంపదతో పాటు ఫిర్యాదులు కూడా పెరగడం మొదలైంది. కృష్ణన్‌ స్కీమ్‌ ప్రాథమికంగా ‘సీడ్‌ సొసైటీలు’, ‘కన్సల్టెన్సీల’ ద్వారా జరిగింది. మొదట్లో కొత్త అప్లికేషన్ల ద్వారా వచ్చిన మొత్తంతో ఏకమొత్తంగా స్కూటీలు, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశాడని, ఈ కొనుగోళ్లకు అతనికి కమిషన్‌ కూడా ముట్టిందని పోలీసులు తెలిపారు. 

నేషనల్‌ ఎన్జీఓస్‌ ఫెడరేషన్‌కు తాను కొఆర్డినేటర్‌గా కొనసాగడం కూడా ప్రజల్లో అతనిపట్ల వి శ్వాసం పెరగడానికి మరో కారణం. ఈ హోదాలోనే సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ తనకు వస్తాయని ప్రజలకు నమ్మబలికాడు. అందుకనుగుణంగా తొలినాళ్లలో అందరికీ వారికి కావలసిన ఉత్పత్తులను సరఫరా చేసి స్కీమ్‌ పట్ల నమ్మకాన్ని కలిగించాడు. క్రమంగా కృష్ణన్‌ ప్రజలకు ఉత్పత్తులను అందించలేకపోవడంతో, ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూ పోయింది. ఇదిలావుండగా స్థానిక రాజకీయ నాయకులతో ఇతనికున్న సంబంధాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. కృష్ణన్‌ దెబ్బకు రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులు, నేషనల్‌ ఎన్జీవో కాన్ఫిడరేషన్‌ సభ్యులు, రాజకీయనాయకులు ప్రస్తుతం పోలీసుల నిఘాలో వున్నారు. విచారణలో తాను రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చానని కృష్ణన్‌ ఒప్పుకోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇందులో సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ను వినియోగించామని చెప్పినప్పటికీ, వీరు చెబుతున్న కంపెనీలకు అసలీవిషయమే తెలియకపోవడం విశేషం. చివరకు అసలు సీఎస్‌ఆర్‌ నిధులనేవే లేవని పోలీసులు తేల్చారు.

డి.ఎం.కె. మెడకు స్కంథమలై ఉచ్చు!

మరో అయోధ్యగా మారనున్న తిరుపరన్‌కుండ్రం ఆలయ వివాదం

తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు

ప్రజలకు సెంటిమెంట్‌ పెరిగితే డిఎంకె అధికారానికి ముప్పే

సెంటిమెంట్‌ సునామీని నాస్తికవాదం ఎదురొడ్డటం కష్టం

 

హిందువులపై కఠినచర్యలు ప్రభుత్వానికి ఆత్మహత్యా సదృశమే

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని, ఒక ప్రాంతానికే పరిమితమైనవని భావించే కొన్ని సంఘటనలు ఒక్కసారి విస్ఫోటం చెంది చరిత్రగతిని మార్చిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. అయితే అవి కొన్ని వర్గాల విశ్వాసాలను ప్రభావితం చేసేవిగా వుంటే వాటి పరిణామం చాలా తీవ్రం గావుంటుందనేది అక్షరసత్యం. ఇందులో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేవలం ప్రజలే నాయకులుగా తమ విశ్వాసాలను కాపాడుకుంటారు. ఇప్పుడు తమిళనాడులో సరిగ్గా ఇదే జరుగు తోంది. ఇప్పటివరకు దేశంలోని ఇతర ప్రాంతాలకు పెద్దగా పరిచయంలేని తిరుపరన్‌కుండ్రం మురుగన్‌ దేవాలయం వివాదం ఒక్కసారిగా పతాక శీర్షికలకెక్కింది. ఉత్తరాదిలో అయోధ్య ఉద్యమంలాగా దక్షిణాది రాజకీయాలను సమూలంగా మార్పుచేసే దిశగా ఈ ఉద్యమం రూపుదిద్దు కుంటుందేమోనని తమిళనాడు డి.ఎం.కె.సర్కార్‌ భయపడుతోంది. పూర్తి నాస్తిక వాదులుగా చె ప్పుకునే డి.ఎం.కె నాయకులు ఎన్నికలప్పడు మాత్రం మురుగన్‌ దేవాలయాల చుట్టూ తిరిగి, వేలాయుధాన్ని చేతుల్లో పట్టుకొని ఫోటోలకు ఫోజులిస్తూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. కానీ ద్రవిడవాదం ముసుగులో మైనారిటీల బుజ్జగింపు, హిందువుల పట్ల వివక్ష కొనసాగిస్తూరావడం వీరి ప్రవృత్తి. దక్షిణాది రాజకీయాలను ఇప్పుడు తిరుపరన్‌కుండ్రం ప్రభావితం చేయనున్నదని ద్రవిడవాదాన్ని భుజాన వేసుకున్న డి.ఎం.కె నాయకులే చెబుతున్నారు. తిరుపరన్‌కుండ్రం దేవాలయ వివాదం తమిళనాడు వ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం కలిగిస్తే తమ పుట్టి మునగడం ఖా యమనివారు భయపడుతున్నారు. ఫిబ్రవరి 4న మదురైలోని పాలంగనాథమ్‌ కూడలివద్ద ఈ ఆలయవివాదంపై 50 హిందూ సంస్థల ఆధ్వర్యంలో పెద్ద నిరసన ప్రదర్శన జరిగింది. లక్షలాది మంది స్వచ్చందంగా ఈ నిరసనలో పాల్గనడం ఇప్పుడు డి.ఎం.కె. ప్రభుత్వానికి మింగుడు పడటంలేదు. ముఖ్యంగా వేల సంవత్సరాలకాలంగా తిరుపరన్‌ కుండ్రం కొండపై మురుగన్‌ దేవాలయం వుంది. ఇప్పుడు ఈ కొండను కొందరు ఇస్లామిస్టులు తమకు చెందినదిగా వాదిస్తుండ టం ఉద్రిక్తలకు కారణమవుతోంది. ప్రస్తుతం ఈ వివాదాన్ని తమిళనాడు వ్యాప్తంగా ఉధృతం చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ ముందుకెళుతోంది. మరో ఏడాదిన్నర కాలంలోగా తమిళనాడులో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో స్కంధమలై వివాదం డిఎంకె మెడకు ఉరితాడు కాబోతున్నదా లేక పూలహారం కాబోతున్నదా అనేది కాలమే చెబుతుంది.

 అసలు వివాదమేంటి?

2024 డిసెంబర్‌ చివరివారంలో మలైయదిపట్టికి చెందిన సయ్యద్‌ అబు దహీర్‌ (53) అనే వ్యక్తితన కుటుంబంతో సహా దర్గావద్దకు మొక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చాడు. ఒక గొర్రె, రెండు కోడిపుంజులను ఇక్కడ బలివ్వడానికి తనతో కూడా తీసుకువచ్చాడు. అయితే కొండ దిగువభా గంలో పోలీసులు వారిని అడ్డుకొని, జంతువులను బలివ్వడానికి పైకి తీసుకెళ్లకూడదని చెప్పారు.సరిగ్గా అప్పుడే స్థానిక 20 ముస్లిం కుటుంబాలు అక్కడికి చేరుకొని, సయ్యద్‌ అబు దహీర్‌కు మద్దతుగా నిరసనకు దిగారు. జంతువులను బలిచ్చి, వాటి మాంసాన్ని వండుకొని తినడం తమ సంప్రదాయమని వారు వాదించారు. ఇందుకోసం ఒక ఫిర్యాదు ఇచ్చినట్లయితే తగిన నిర్ణయం కోసం ప్రభుత్వానికి పంపుతామని అధికార్లు నచ్చజెప్పినా వారు వినకుండా తమ నిరసనను కొ నసాగించారు. చివరకు పోలీసులు ఆ జంతువులను తెచ్చినవారితో సహా పదిమందిని అదుపులోకి తీసుకొని తర్వాత విడుదల చేశారు. అయితే ఈ సంఘటన ఈ ప్రాంతంలో ఉద్రిక్తలకు దారి తీసింది. ముస్లింలెవరూ బలివ్వడానికి కొండపైకి తీసుకెళ్లడానికి వీల్లేదని జనవరి 22న మదురై పోలీసులుకచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. వండిన మాంసాన్ని తీసుకెళ్లి దర్గావద్ద భుజించవ చ్చునని వారు స్పష్టం చేశారు. ఆ తర్వాత కొండపై కొందరు వ్యక్తులు మాంసాహారాన్ని తింటున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మళ్లీ వివాదం రగిలింది. ఈ నేపథ్యంతో తమిళనాడులో బలంగా వున్న హిందూ మున్నాని సంస్థ తిరుపరన్‌ కుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద ఫిబ్రవరి 4ననిరసన ప్రదర్శనలుచేపట్టాలని నిర్ణయించింది. అధికార్లు ఇందుకు అనుమతినివ్వలేదు సరికదా ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలో నిషేధాజ్ఞలు విధించారు. దీంతోమదురై ప్రాంత హిందూమున్నాని గ్రూపు ప్రధాన కార్యదర్శి ఎస్‌. కళానిధిమారన్‌ మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై బెంచ్‌కు ఒక పిటిషన్‌ దాఖలు చేస్తూ ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3గంటలనుంచి రాత్రి 9.45 గంటలవరకు ‘‘16 కాల మండపం’’ వద్ద తాము నిర్వహించ తలపెట్టిన నిరసనకుఅనుమతినివ్వాలని అభ్యర్థించారు. హైకోర్టు బెంచ్‌ ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని పాలంగనాథమ్‌ కూడలివద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యకాలంలో నిరసనలు తెలుపుకోవడానికి అనుమతించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు చేయకూడదని కోర్టు హెచ్చరించింది. అనుకున్న ప్రకారమే లక్షలాది హిందువులు పాలంగనాథమ్‌ కూడలివద్ద తమనిరసనలనుతెలియజేశారు. కాగా ఈ నిరసరన ప్రదర్శనల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ ము న్నాని, హిందూ ఫ్రంట్‌, విశ్వహిందూ పరిషత్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గన్నారు.తిరుపరన్‌ కుండ్రం కొండను ఇస్లామీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా వీరు నినా దాలిచ్చారు. ఈ నిరసన ప్రదర్శన సాయంత్రం ఆరుగంటలకు ముగిసింది. ఈ సందర్భం గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమిళనాడు ప్రభుత్వం సుమారు నాలుగువేలమంది పోలీసులను మోహరించింది. 

డీఎంకే వర్సెస్‌ బీజేపీ

ప్రస్తుతం ఈ ప్రదర్శన వివాదంపై తమిళనాడులో డిఎంకె వర్సెస్‌ బీజేపీ రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడులో హిందూ ముస్లింలు సహోదరుల్లాగా మెలుగుతున్నారని, బీజేపీ మత విద్వేసాలను రెచ్చగొడుతున్నదంటూ రాష్ట్ర హిందూ రిలిజియస్‌ అండ్‌ చారిటీస్‌ ఎండోమెంట్‌ మంత్రి పి.కె. శేఖర్‌బాబు ఆరోపించారు. 1931నాటి బ్రిటిష్‌ ప్రీవీ కౌన్సిల్‌ ఇచ్చిన తీర్పుతో పా టు ప్రస్తుతం 2023 నుంచి రెండు కేసులు కోర్టులో పెండిరగ్‌లోవున్న విషయాన్ని గుర్తుచేశారు.తమ ప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై ర్యాలీ శాంతియుతంగా జరిగిందని, ఎక్కడా అల్లర్లు లేదా బస్సు దహనాలు, వి ధ్వంసం వంటివి చోటుచేసుకోలేదన్న సంగతిని గుర్తుచేశారు. 1931నాటి బ్రిటిష్‌ ప్రీవీ కౌన్సిల్‌ హిందువులకు అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతిని గుర్తుచేస్తూ, (అప్పటి ప్రీవీకౌన్సిల్‌ కొండపై మాంసాహారాన్ని వండటం, తినడం, జంతువుల బలి ఇవ్వడం నిషేధమని స్పష్టంగా తీర్పు చె ప్పింది. స్వాతంత్రానంతరం ద్రవిడ ప్రభుత్వాలు కొండపైకి మాంసాన్ని తీసుకెళ్లడాన్ని అనుమతి స్తూ వచ్చాయి) ప్రభుత్వం అసలు విషయాన్ని మరుగున పరచవద్దని చురకలంటించారు. ర్యాలీ లో పాల్గనకుండా తమిళనాడు వ్యాప్తంగా 350ప్రదేశాల్లో బీజేపీ నాయకులను అరెస్ట్‌ చేశారని, ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. రామనాథపురం ఎం.పి. నవాజ్‌ఖని గ్రూపుకు చెందినవారే ఈ వివాదానికి కారణమని ఆయన ఆరో పించారు.అయితే ఖని ఈ ఆరోపణలను ఖం డిరచారు.ఇదిలావుండగా కలెక్టర్‌ ఎం.ఎస్‌. సంగీత మాట్లాడుతూ, స్థానిక ప్రజలు శాంతియుతంగానే వున్నారని, బాహ్య శక్తులవల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఆలయం ఎగువన కొండపై వున్న దర్గావద్ద ‘కందూరి’ (జంతుబలి)కి అనుమతినివ్వాలని గతంలో రెండు సార్లు ముస్లింలు కోరినా అందుకు అనుమతించలేదన్న సంగతి గుర్తుచేశారు. మాతా నల్కినక్క అమైప్పుగళ్‌(మతసామరస్యానికి కృషిచేస్తున్న గ్రూపు) సంస్థ మతసామరస్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు అప్పీల్‌ చేసింది. కాగా అడ్వకేట్‌ ఎస్‌. ముత్తుకు మార్‌, 2012లో కొండపైబాంబులు దొరికిన కేసుతో సహా జంతుబలి, మాంసాహర సేవనానికి సంబంధించిన అన్ని కేసులను ఎన్‌.ఐ.ఎ.కు బదిలీచేయాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు. ఇక బీజేపీ సీనియర్‌ నాయకుడు సుబ్రహ్మహణ్యస్వామి మాట్లాడుతూ కొండపైనుంచి దర్గానుమరో ప్రదేశానికి తరలించడమే సమస్యకు పరిష్కారమన్నారు. నమాజ్‌ ఎక్కడైనా చేయవచ్చునని, ప్రజాప్ర యోజనార్థం ప్రభుత్వం మసీదులను వేరేచోటికి తరలించడానికి లేదా కూలగొట్టడానికి షరియాచట్టం అనుమతిస్తుందన్న సంగతిని గుర్తుచేశారు. అంతేకాదు దర్గాను ఎక్కడికి తరలి స్తే బాగుంటుందో సలహా ఇచ్చే బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించాలని కూడా ఆయన కోరారు. రామనాథపురం ఎం.పి. నవాజ్‌ఖని మాట్లాడుతూ ‘దశాబ్దాలు గా ముస్లిం భక్తులు గొర్రెలు, మేకలు, కోళ్లను కొండపైకి తీసుకెళ్లి బలిస్తుండటం కొనసాగుతోంది. వండిన మాంసం తీసుకెళ్లడమనేది కేవలం తాత్కాలిక ఆదేశాలు మాత్రమే. నేను మదురై పోలీసులతో మాట్లాడతాను. అదీకాకుండా కొండ పై ఉన్న ఈ దర్గా వక్ఫ్‌ ఆస్తి’ అని స్పష్టం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ముస్లింలు ఈ కొండపేరును ‘‘సికిందర్‌ మలై’’గా మార్చాలన్న తమ డిమాండ్‌ను మళ్లీ పైకి తీసుకొచ్చారు. 

తిరుపరన్‌కుండ్రం చరిత్ర

తిరుపరన్‌ కుండ్రం లేదా తిరుప్పరన్‌ కుండ్రం దేవాలయం మదురై నగరానికి సమీపంలో వుంది. మదురైలోని పెరియార్‌ సెంట్రల్‌ బస్టాండ్‌కు సరిగ్గా ఏడుకిలోమీటర్ల దూరం. తిరుపరన్‌కుండ్రం 1028 అడుగుల ఎత్తైన ఏకశిలతో ఏర్పడిన కొండ. ఈ పర్వతాన్ని హిందువులు అతి పవి త్రమైనదిగా పరిగణిస్తారు. ఇక్కడ ప్రాచీన శైవమతానికి చెందిన గుహలున్నాయి. ఈ కొండను హిందువులు ‘స్కందమలై’గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో శైవం ప్రాచుర్యంలో ఉన్న కాలంలో క్రీ.శ.7 నుంచి క్రీ.శ15వ శతాబ్దం మధ్యకాలంలో ఈకొండ ఉత్తరభాగంలో మండపాలు, ఆలయాలను పలు హిందూ రాజవంశాలు నిర్మించాయి. ఆవిధంగా నిర్మితమైన అతిపెద్ద దేవాయలయ సముదాయం తిరుపరన్‌కుండ్రం మురుగన్‌ ఆలయంగా ప్రసిద్ధిపొందింది. తమిళనాడులోని ఆరు ప్రముఖ మురుగన్‌ దేవాలయాల్లో (అరుపడై వీడు) దీన్ని మొట్టమొదటిగా పరిగణిస్తారు. మదురై వెళ్లినవారు మీనాక్షి అమ్మవారి దర్శనం తర్వాత తప్పకుండా ఈ మురుగన్‌ ఆలయాన్ని దర్శిస్తారు. ఇదే కొండ పై క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీ॥శ. 2వ శతాబ్దం మధ్యకాలం నాటి జైనుల తమిళ బ్రహ్మీలిపి శాసనాలు కూడా ఇక్కడ వున్నాయి. కొండకు దక్షిణాన సరస్వతీ తీర్థం వుంది. ఇక్కడే తిరుప్పరన్‌కుండ్రం రాతి గుహాలయాలున్నాయి. ఇక్కడ ప్రాచీన జైనదేవాలయాన్నే క్రీ॥శ ఏడవ శ తాబ్దంలో శివాలయంగా మార్చి, 13వ శతాబ్దం నాటికి దీన్ని పూర్తిగా విస్తరించారని చెబుతారు. కొందరు హిందువులు ఈ కొండచుట్టూ ప్రదక్షిణం చేయడం సర్వపాపాలను హరిస్తుందని నమ్ముతారు. 

ఢల్లీి సుల్తానులు తిరుపరన్‌కుండ్రరామదురై ప్రాంతాల్లో లూటీలుాదహనాలకు పాల్పడి విచ్చల విడి విధ్వంసం సృష్టించారు. 14వ శతాబ్దం తర్వాత తమిళనాడులో ఇస్లామిక్‌ సుల్తానేట్‌ను ఏ ర్పాటు చేయాలని ఢల్లీి సుల్తానులు ప్రయత్నించారు. దీన్నే మదురై సుల్తానేట్‌గా వ్యవహరించారు.అయితే ఈ సుల్తానేట్‌ ఎక్కువకాలం మనుగడలో లేదు. ఈ సుల్తానేట్‌కు చెందిన చివరి పాలకుడు సికిందర్‌ షా అతని సైనికాధికార్లను 1377లో విజయనగర రాజులు తిరుపరన్‌కుండ్రమ్‌లో వధించి, వారి పాలనకు అంతం పలికారు. అయితే సికిందర్‌ షాకు ఇక్కడ సమాధిని నిర్మించు కోవడానికి విజయనగర పాలకులు అప్పట్లో అనుమతించారు. దీంతో ఈ సమాధి నిర్మాణం తి రుపరన్‌ కుండ్రం ఉత్తరభాగంలో 14, 15శతాబ్దాల్లో జరిగింది. క్రమంగా 17, 18 శతాబ్దాల కాలంలో ముస్లింలు ఈ సమాధిని క్రమంగా దర్గాగా మార్పుచేసి మరింత విస్తరించారు. దీన్నే ఇప్పుడు తిరుపరన్‌కుండ్రం దర్గా అని పిలుస్తున్నారు. 

కార్తీకదీపానికీ అనుమతి లేదు

ఇక్కడ కాశీవిశ్వనాథర్‌ దేవాలయం వద్ద వున్న స్థూపంపై కార్తీకదీపాన్ని పెట్టే సంప్రదాయానికి అనుమతివ్వాలని హిందువులు డిమాండ్‌ చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధకాలానికి ముందు వరకు ఇక్కడి స్థూపంపై కార్తీకదీపం పెట్టేవారు. ఆ యుద్ధకాలంలో దీపం పెట్టడం కొన్ని కారణాలవల్ల నిలిచిపోయింది. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న కారణంగా తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ దీపం పెట్టడానికి అనుమతించలేదు. మరెక్కడైనా పెట్టుకోవచ్చని చెప్పినా అది ఆగమశాస్త్ర విరుద్ధమని హిందువుల వాదన. అయితే ఈ విశ్వనాథర్‌ దేవాలయానికి వెళ్లే దారిలో నమాజ్‌లు చేసిన సంఘటనలు కూడా పెరిగాయి. ఆవిధంగా ఆలయానికి వెళ్లే దారిలో నమాజ్‌లు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వడానికి మద్రాస్‌ హైకోర్టు ఇటీవల తిరస్కరించింది. ఇదిలావుండగా, క్రమంగాకొండపై ఆక్రమణలు పెరుగుతున్నాయని హిందువులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా శివగంగలోని కరైక్కుడికి చెందిన అన్నానగర్‌ల ఫిబ్రవరి 3న జరిగిన ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో కొందరు ముస్లిం మహిళలు పాల్గనడం విశేషం. ‘‘లలితా ముత్తుమారియన్‌ ములైకొట్టు తిన్నై’’ దేవాలయంలో ‘‘సీర్‌వారిసై’’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గనడం వీరికి హిందువులు ఆహ్వానం పలకడం కొసమెరుపు!

తెలంగాణ బిజేపికి!

ఆంద్ర జనసేనకు!!

`బిజేపి, జనసేన రహస్య ఒప్పందం?

`అన్నతో తెలంగాణలో ఆట!

`తమ్ముడుతో ఆంద్రాలో వేట!!

`బిజేపి వెనకుండి రాజకీయం?

`ఇదే అదునుగా మళ్ళీ ఒకసారి చిరు ప్రయత్నం!

`మరోసారి రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటం.

`అటు సినిమాలు..ఇటు రాజకీయాలు.

`ప్రజా రాజ్యానికి కొనసాగింపే జనసేన అన్నారు.

`కాంగ్రెస్‌ కు ఇంత కాలం ఎందుకు రాజీనామా చేయలేదు?

`ప్రజా రాజ్యం ఏర్పాటు తర్వాత ఇక సినిమాలు చేయను అన్నారు!

`జెండా పీకేసిన తర్వాత ఇక సినిమానే నా ప్రపంచం అన్నారు.

`ఇక రాజకీయాల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని ప్రకటించారు.

`మళ్ళీ ఆశలు చిగురించినట్లున్నాయి.

`ప్రజా రాజ్యం కలలింకా కదులుతున్నట్లే వున్నాయి.

`జనసేన తో మళ్ళీ తన ప్రయాణం మొదలుపెట్టనున్నారు.

`దక్షణాదిన బిజేపికి వెన్నుదన్నుగా నిలువనున్నారు.

పార్లమెంటు చరిత్రలో 1985 తర్వాత పూర్తి స్దాయి మెజార్టీతో 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా, మూడోసారి కూడా దాదాపు పూర్తి మెజార్టీకి దగ్గరగా గెలిచిన భారతీయ జనతాపార్టీకి దక్షిణాదిలో బలపడేందుకు ఏదో ఒక ప్రాంతీయ పార్టీ తోడు కావాలా? ఆ పార్టీ దక్షిణాదిలో ఒంటరిగా బలపడే అవకాశమే లేదా? గతంలో సంగతి వదిలేద్దాం..ఇప్పుడు కూడా ఏదో ఒక పార్టీ తోడుగా నిలిస్తే తప్ప ఉనికిని చాటుకోలేదా? ఇలా అయితే ఇంకా ఎంత కాలానికి బిజేపి దేశమంతా విస్తరించగలదు? అనే ప్రశ్నకు సమాదానం ఎవరి వద్దా లేదు. దక్షిణాదిన బిజేపి ఇప్పటికీ ఎందుకు బలపడడం లేదన్నదానిపై నిజానికి ఇప్పటి వరకు ఆ పార్టీలో పూర్తి స్ధాయి అధ్యయనం జరగలేదన్నది ముమ్మాటికీ వాస్తవం. పైగా ఆ పార్టీ పూర్తి స్ధాయిలో ఉత్తరాదినే ఎక్కువగా దృష్టిపెట్టిందనే చెప్పాలి. కనీసం ఈ పదేళ్లలో దక్షిణాది అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టిపెడితే బాగుండేది. ఎంత సేపు ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలో ఎలా బలపడాలన్నదానిపైనే బిజేపి దృష్టిపెడుతూ వచ్చింది. అందుకే దక్షిణాదిన కొంత వెనుకబాటులోవుంది. కాకపోతే ఉత్తరాధి రాజకీయ పరిస్దితులు వేరు. దక్షిణాది రాజకీయాలు వేరు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా దక్షిణాది ప్రజలు ఎంతో చైతన్య వంతులు. ప్రతి అంశాన్ని శ్రాస్త్రోత్తరంగా కాకుండా శాస్త్రీయంగా ఆలోచిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు. అందుకే బిజేపి లాంటి పార్టీలకు దక్షిణాదిలో చోటు పూర్తి స్ధాయిలో దక్కకుండా పోయింది. ఇప్పుడిప్పుడే దిక్షిణాదిలో కూడా బిజేపికి అనుకూలమైన పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. వాటిని ఆసరాగా చేసుకొని బిజేపి ఎదగాలనుకుంటోంది. అయితే జనసేన లాంటి పార్టీని నమ్ముకొని బిజేపి ఎదగడం అన్నది అంత ఈజీ కాదు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు తన మనుగడ కోసం ఆలోచిస్తాయే గాని, జాతీయ పార్టీల ఎదుగుదలను ఎక్కడా అంగీకరించిన దాఖలాలు లేవు. ఒక్కసారి జాతీయ పార్టీ పాగా వేస్తే ప్రాంతీయ పార్టీలకు చోటు లేకుండా చేస్తాయన్నది అందరూ అంగీకరించాల్సిన అంశం. కాని ప్రాంతీయ పార్టీలు కూడా ఇటీవల కాలంలో స్వంత బలాన్ని నమ్ముకొని రాజకీయం చేయడం లేదు. ఉభయ కుశలోపరిగా జాతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాయి. గతంలో ప్రాంతీయపార్టీలు కలిసి రాజకీయం చేసేవి. కాని ఇప్పుడు ప్రాంతీయపార్టీలలో ఏకచ్చత్రాధిపత్యం ఎక్కువైంది. అసలు మరో ప్రాంతీయపార్టీ పుట్టుకనే అంగీకరించలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలకు, జాతీయపార్టీలకు మధ్య సయోధ్య ఎక్కువైంది. అంత మాత్రాన జాతీయ పార్టీలను పూర్తిగా పాగా వేసేందుకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇష్టపడదు. అందులోనూ జనసేన లాంటి పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ను నమ్ముకొని బిజేపి రాజకీయం చేయాలనుకోవడం కూడా అంత కరక్టు కాదు. కాని అవసరం రెండు పార్టీలకు వుంది. పైగా మరో అవకాశం లేని కారణంగా ఇద్దరూ సర్ధుకుపోతున్నారు. బిజేపికి దక్షిణాది రాష్ట్రాలలో కర్నాటకలో తప్ప, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలలో పార్టీని నడిపించేంత శక్తి వున్న నాయకులు ఎవరూ లేరు. గతంలో కూడా అంత బలమైన నాయకత్వాలు ఇక్కడ ఎదగలేదు. పార్టీ పేరు చెప్పుకొని మాత్రమే రాజకీయం చేస్తే తప్ప మనుగడలో వుంటారు. రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఆ పార్టీకి అనుకూల పవనాలు వీస్తే బిజేపి నాయకులు గెలుస్తారు. ఏదొ ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే సీట్లు సాధిస్తారు. అంతే తప్ప బిజేపి తలరాత మార్చే నాయకులు దక్షిణాదిలో ఎవరూ లేరు. ముఖ్యంగా తెలంగాణ, ఏపి రాష్ట్రాలలో పార్టీని నడిపించి ఓట్లు పొంది, సీట్లు సాధించి, అధికారంలోకి తీసుకొచ్చేంత శక్తి వంతమైన నాయకులు లేకపోవడం మూలంగానే ఇతర పార్టీలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. ఏపి కన్నా, తెలంగాణ కొంత బెటర్‌. ఇక్కడ కొంత మంది బలమైన నాయకులు వున్నారు. కాని వాళ్లు కూడా జాతీయ స్ధాయిలో వున్న స్దితిగతుల ఆధారం చేసుకొని గెలిచే నాయకులు మాత్రమే. అందుకే ఏపి, తెలంగాణలలో బిజేపి ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాన్‌ను అక్కున చేర్చుకున్నది. ఇప్పుడు ఆయన అన్నయ్య చిరంజీవిని దగ్గరకు తీసుకుంటోంది. జనసేనను తెలంగాణలో విస్తరింపజేసేలా సహకరిస్తే, తమకు లాభం చేకూరుతుందని బిజేపి బావిస్తోంది. అందుకు బిజేపి, జనసేనల మధ్య రహస్య ఒప్పందం జరిగినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. కాని అది సాధ్యమా? అన్నది కూడా బిజేపిలో చర్చ జరగాల్సిన అవసరం వుంది. అయితే తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ జనసేన గ్రాఫ్‌ బాగా పెరిగినట్లు సంకేతాలు అందుతున్న వేళ, తాను కూడా మళ్లీ ఒకసారి తన రాజకీయ జీవితంపై జాతకం ఎలా వుంటుందో చూసుకోవాలనుకుంటున్నారు. ఆ విషయం ఈ మధ్య ప్రజారాజ్యం కొనసాగింపే జనసేన అంటూ కీలక వ్యాఖ్య చేశారు. అంటే తాను రాజకీయాలకు దూరంగా లేను అని చెప్పకనే చిరంజీవి చెప్పినట్లైంది. కాని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు. 180సీట్లు గెల్చుకుంటున్నామని గొప్పలకు పోయారు. 18 సీట్లతో సరిపెట్టుకున్నారు. అయినా చిరంజీవిలో పోరాట పటిమ వుంటుందని అందరూ అనుకున్నారు. కాని ఆయన కనీసం ఓ ఐదేళ్లపాటు కూడా పార్టీని నడపలేకపోయారు. ఎన్టీఆర్‌ చరిత్రను తిరగరాయాలని కలలు గన్నారు. కాని కుదరలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సామాజిక తెలంగాణ అంటూ తనకు తెలియని రాగం అందుకున్నారు. అసలు సామాజిక న్యాయం అంటే ఏమిటని ఓ రిపోర్టుర్‌ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. అయినా కాలం కలిసిరాలేదు. కాని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. జెండా పీకేశాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశాడు. ప్రతిగా రాష్ట్ర క్యాబినేట్‌లో తన అనుచరుడైన గంటా శ్రీనివాస్‌రావును మంత్రిని చేశారు. తాను రాజ్యసభ సభ్యత్వం స్వీకరించి, కేంద్రంలో స్వతంత్ర హోదాలో మంత్రి పదవి తీసుకున్నారు. తాను సినిమాలు వదిలి, రాజకీయ ప్రవేశం చేసిన సమయంలో ఇక తన జీవితం ప్రజలకే అంకితం. ఇకపై ముఖానికి రంగు వేసుకునేది లేదని ప్రకటించారు. రాజకీయాలకే తన పూర్తి సమయం కేటాయిస్తానని, సినిమాలను వదిలేస్తున్నట్లు చెప్పారు. అయితే పరిస్ధితులు అనుకూలించలేదు. చిరంజీవి చెప్పిన మాట మీద నిలబడలేదు. రాజకీయాలు అచ్చి రాలేదని మళ్లీ సినిమాలు మొదలు పెట్టారు. కాని అక్కడ కూడా అనుకున్నంత సక్సెస్‌ కనిపించడం లేదు. సినిమాలైతే చేస్తున్నాడే గాని, ఒకప్పటి ఆదరణ ఇప్పుడు ఆయన సినిమాలకు లేదు. గతంలో చిరంజీవి సినిమా ముందు ఏ ఇతర హీరోల సినిమాలు నిలిచేవి కాదు. ఇప్పుడు ఆ హీరోల సినిమా ముందు చిరంజీవి సినిమాలు ఆడడం లేదు. ఇతర హీరోల సినిమా రేంజ్‌ను చిరంజీవి సినిమాలు అందుకోవడం లేదు. అటు రాజకీయం లేక, ఇటు సినిమాల్లో విజయాలు లేక కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కాకపోతే ఆయనకు వున్న మెగాస్టార్‌ కుర్చీ మాత్రం అలాగేవుంది. ఇలాంటి సమయంలో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ జీవితం ఒక దారిలో పడిరది. ఆయన సినిమాలతోపాటు, రాజకీయం కూడా సక్సెస్‌ బాటలోనే నడుస్తోంది. ఇప్పుడు అన్నకు తమ్ముడి జనసేన బాటలు వేస్తోంది. మొన్నటి వరకు నువ్యు ఒక పార్టీలో ,నేను ఒక పార్టీలో అంటూ ఒకే ఇంటి మీద రెండు జెండాలు ఎగిరే రాజకీయం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నానాటికీ తీసి కట్టు నాగం బొట్టు అన్నట్లు ప్రయాసపడుతోంది. అందవల్ల కాంగ్రెస్‌లోవుండడం కన్నా, జనసేనలో చేరడం ఉత్తమమని చిరంజీవి బావిస్తున్నారు. పైగా బిజేపి కూడా తోడు కోరుతోంది. ఈ సయోధ్య రెండు పార్టీలకు కలిసి వస్తుందన్న నమ్మకం రెండు పార్టీలలో వుంది. కాని తెలంగాణలో చిరంజీవి వల్ల బిజేపికి ప్రయోజనం కలుగుతుందని మాత్రం చెప్పలేం. ఈ తరానికి చిరంజీవి గురించి తెలిసిన యువతరం తక్కువ. వారికి తెలంగాణలో వున్న బిజేపి నాయకుల కన్నా, చిరంజీవి వారి దృష్టిలో పెద్ద నాయకుడు కాదు. పాలల్లో మజ్జిగ చుక్కలా కలిసి ఘనతంతా నాదే అని చెప్పుకునేందుకు చిరంజీవి ఏ మాత్రం వెనుకాడడు. అయినా చిరంజీవి ఎప్పుడో సమైక్య వాదిగా తనుకుతానుగానే ముద్రవేసుకున్నారు. తెలంగాణను ఆయనే కాదనుకున్నారు. జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఏర్పాటును స్వాగతించలేదు. సమైక్యాంద్ర కోసం రాజీనామా చేసి, తెలంగాణ ప్రజా రాజ్యం నాయకుల ఆత్మగౌరవం దెబ్బ తీశాడు. అలాంటి నాయకుడిని పొరపాటును బిజేపి తెలంగాణ మీద రద్దితే మొదటికే మోసం వస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

2009లో కాంగ్రెస్‌ చేసిన తప్పే కొంప ముంచింది!

`మన్మోహన్‌ సింగ్‌ను రెండోసారి ప్రధాని చేయడం తీరని నష్టం చేసింది.

`దేశంలో కాంగ్రెస్‌ కు గడ్డుకాలం ఎదురైంది.

`2009లో ప్రణబ్‌ ముఖర్జీని ప్రధాని చేస్తే కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరోలా వుండేది.

`గతంలో రాజీవ్‌గాంధీ చేసిన తప్పే తర్వాత సోనియా గాంధీ చేశారు.

`1984లో రాజీవ్‌ గాంధీ ప్రధాని కాకుండా అడ్డుకున్నారని అపవాదు ఎదుర్కొన్నారు.

`రాష్ట్రీయ సమాజ్‌ వాదీ పార్టీ ఏర్పాటు చేశారు.

`1989 అసలు విషయం తెలిసిన తర్వాత రాజీవ్‌ గాంధీ తో కలిసి పనిచేశారు.

`కాంగ్రెస్‌ పార్టీ కోసం జీవితమంతా కృషి చేశారు.

`ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకమైన నాయకుడు.

`రాజకీయ దురంధరుడు.

`ప్రధాని కావాలన్నది ప్రణబ్‌ బలమైన కోరిక.

`ప్రణబ్‌ ముఖర్జీ వల్ల రాజకీయ నష్టం జరుగుతుందని భయపడ్డారు.

`ఇప్పుడు కాంగ్రెస్‌ కోలుకోకుండా పోవడానికి కారకులయ్యారు.

`చరిత్రలో రాజకీయ తప్పటడుగులు సహజమే.

`చెప్పుడు మాటలు విని రాజకీయ పార్టీ తమ పార్టీ కోలుకోకుండా చేసుకోవడమే

మునగడం తేలడం కాంగ్రెస్‌కు కొత్తకాదు. తనను తానే ముంచుకోవడం కూడా కాంగ్రెస్‌కు కొత్తేమీకాదు. కాని మునిగినా తేరుకోవడం ఇంత కాలం పట్టడం అన్నది ఇప్పుడే ప్రధమం. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం చెందింది 1889లో..అప్పటి నుంచి దేశంకోసం పోరాటం చేస్తూనే వుంది. అసలు దేశం కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో రాజకీయం నెరపడమే ఎంతో దైర్యంతో కూడుకున్న పని. అయినా దేశం కోసం తెగించి పోరాటం చేసింది ఒక్క కాంగ్రెస్‌ పార్టీయే. ముఖ్యంగా మహాత్మాగాందీ 1917లో దక్షిణాప్రికా నుంచి వచ్చి స్వాతంత్య్రం సంగ్రామంలో అడుగు పెట్టక ముందు ఒకచరిత్ర..తర్వాత ఒక చరిత్ర. ఎందుకంటే కాంగ్రెస్‌లో 1910కి ముందు మితవాదులు ఎక్కువగా వుండేవారు. దాదాబాయి నౌరోజీ లాంటి వారు ఎలాగైనా సాతంత్య్రం సముపార్జనకోసం అర్జించండి అన్న తరహాలో ఉద్యమాలు చేశారు. 1910 తర్వాత లాలాలజపతి రాయ్‌, బాల గంగాదర్‌ తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌ లాంటి వారు స్వాతంత్య్ర సంగ్రామాన్ని అతి వాద దశకు తెచ్చారు. దాంతో దేశంలో కొంత హింసాత్మక ఉద్యమ వాతారణం నెలకొన్నది. అదే సమయంలో ఇండియాకువచ్చిన గాందీజీ సత్యాగ్రహంతో ఉద్యమం మొదలైంది. అప్పట్లో గాంధీజీ అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టిన వారున్నారు. కాని చివరకు గాంధీ మార్గమే.. గెలిచింది. అయితే మన దేశంలో మొదటిసారిగా 1934 ఎన్నికలు జరిగాయి. ఈ సంగతి చాలా మందికి తెలియదు. అప్పటికే నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వం మొదలైంది. 1947 స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆయనే స్వాతంత్య్రం జెండా ఎగురవేశారు. ఇది నేటి తరానికి చెప్పడంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమౌతోంది. భారతీయ జనతాపార్టీ రకరకాల ప్రచారాలు సాగిస్తోంది. నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ దేశ విభజనకు కారణమైతే, వల్లభాయ్‌ పటేల్‌ దేశాన్ని ఏకం చేశారంటూ చరిత్రను వక్రీకరిస్తున్నారు. నాటి ప్రధాని నెహ్రూ ఆదేశాల మేరకు మాత్రమే హోం మంత్రిత్వ బాద్యతలు నిర్వహించారన్న విషయాన్ని కాంగ్రెస్‌ చెప్పుకోవడం లేదు. నిజానికి ఆ ప్లేస్‌లో ఏ నాయకుడు వున్నా, అదే పనిచేసేవారు. కాని స్వాతంత్రోద్యమంలో నెహ్రూ కాకుండా మరో నాయకుడు వుండేవారేమో? అనడానికి ఆస్కారమే లేదు. అంతటి బలమైన పునాదులున్న కాంగ్రెస్‌ పార్టీ ఇందిరాగాందీ వున్నంత వరకు ఆ పార్టీ తిరుగులేని శక్తిగా, ఎదురులేని రాజకీయం చేసింది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ మరణించిందో అప్పటి నుంచే కాంగ్రెస్‌ పార్టీ పతనం అంచులకు చేరుకున్నది. ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. కాని ఆ గెలుపును, ఆ బలాన్ని నిలుపులేకపోయింది. అప్పటికి బిజేపి కూడా అంత బలంగా లేదు. బోఫోర్స్‌ కుంభకోణం కాంగ్రెస్‌ను పట్టి పీడిరచింది. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి కారణమైంది. బిజేపి బలపడేందుకు మార్గం వేసినట్లైంది. తర్వాతనైనా పార్టీని కాపాడుకునే ప్రయత్నం బలంగా జరగలేదనే చెప్పాలి. పివి. నర్సింహారావును పూర్తిగా నమ్మలేదు. ఆయన నాయకత్వాన్ని బలపర్చలేదు. తర్వాత 2004లో కాంగ్రెస్‌ పార్టీ ఊపియే1 గెలిచింది. అప్పుడు సోనియాగాంధీ ప్రధాని అవుతారని అనుకున్నారు. కాని మన దేశ సార్వభౌత్వం విషయంలో రాజ్యాంగ సూత్రాలు అడ్డు తగిలాయి. సోనియాగాందీ ప్రధాని కాలేకపోయారు. అప్పుడే బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుండేది. రాజనీతి తెలిసిన నాయకుడికి ప్రధాని బాద్యతలు అప్పగిస్తే ఎంతో బాగుండేది. అప్పటికి బిజేపిలో బలమైన నాయకులు లేరు. ఆ పార్టీకి క్ష్రేత్ర స్దాయి నిర్మానం పూర్తిగా లేదు. మౌన మునిగా పేరున్న మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానిని చేస్తే, తన రాజకీయానికి ఇబ్బందులు వుండవన్న ఆలోచనతో సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. కాని ఆ స్దానంలో ఎవరున్నా సోనియాగాందీకి ఎదరు చెప్పే అవకాశం వుండేది కాదు. కాని సోనియాగాందీ ఎవరినీ నమ్మలేదు. సరే 2004లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని చేశారు. తర్వాత 2009లోనైనా మరో నాయకుడిని ప్రధాని చేసినా కాంగ్రెస్‌కు ఈ పరిస్ధితి వచ్చేది కాదు. ఆ సమయంలో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసినా పెద్దగా పార్టీలో అభ్యంతరాలు వుండేవి కాదు. కాని చేయలేదు. 2004లో రాహుల్‌ గాంధీకి మంత్రి వర్గంలో చోటు కూడా కల్పించలేదు. అది సోనియాగాందీ చేసిన మొదటి తప్పు. ఆ సమయంలో రాహుల్‌ గాంధీని కేంద్ర మంత్రిని చేస్తే పాలన మీద ఆయనకు కొంత పట్టు వచ్చేది. 2009లో ఆయన ప్రధాని అయ్యేందుకు ఇబ్బంది వుండకపోయేది. సరే తర్వాత 2009లో కూడా మంత్రిని చేయలేదు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ను రాజీనామా చేయించి, రాహుల్‌ను ప్రధానిని చేసినా బాగుండేది. అ పని చేయలేదు. 2009 ఎన్నికల తర్వాత మన్మోహన్‌ సింగ్‌ను కాకుండా ఎంతో రాజకీయ అనుభవం వున్న చాణక్యుడు ప్రణబ్‌ ముఖర్జీని ప్రధానిని చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఈ పరిస్దితి అసలే వుండేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీకి ఆ సమయంలో ప్రణబ్‌ ముఖర్జీ లాంటి మరో చాణక్యుడు లేడు. కాని ఆయనను ప్రధానిని చేస్తే ఎక్కడ తన చేతుల్లో పవర్‌ వుండకుండాపోతుందో అన్న భయంతో సోనియా గాందీ నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఇప్పుడు ఇంత కాలం పార్టీ అధికారానికి దూరమయి వుండేది కాదు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే ఆలోచన ఆనాడు చేయలేదు. ఇప్పుడు పదవి కోసం ఎంత ప్రయత్నం చేసినా కాలం కలిసిరావడం లేదు. ప్రణబ్‌ ముఖర్జీ ఇందిరాగాంధీకి ఎంతో నమ్మకమైన నాయకుడు. ఆమె హాయాంలోనే ఆయన ఆర్ధిక శాఖ నిర్వహించారు. రాజకీయ వ్యూహాలు పన్నడంలో ఆయనను మించిన వారు లేదు. పివి.నర్సింహారావు హాయాంలో కూడా ఆయన నెరిపిన విదేశీ వ్యవహరాల మూలంగా దేశానికి, ఆర్ధికాభివృద్దికి ఎంతో మేలు జరిగింది. అయితే ఇందిరాగాందీ మరణం తర్వాత రాజీవ్‌ గాందీని ప్రదాని చేయడం కొంత మందికి నచ్చలేదు. ఎలాంటి పాలనానుభవం లేని రాజీవ్‌ గాందీ వల్ల కాంగ్రెస్‌ నష్టపోతుందని అనుకున్నారు. అందులో ప్రణబ్‌ ముఖర్జీవున్నారనేది అప్పుడు ప్రచారం జరిగింది. దాంతో రాజీవ్‌గాంధీ ఆయనను పక్కన పెట్టారు. ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారు. ఇక పార్టీలో వుండి లాభం లేదనుకున్న ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రీయ సమాజ్‌వాదీ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే కొంత కాలానికి రాజీవ్‌ గాంధీకి అసలు నిజం తెలిసింది. ప్రణబ్‌ ముఖర్జీ అంటే గిట్టని వాళ్లు చేసిన ప్రచారం మూలంగానే అపోహపడినట్లు గ్రహించి, మళ్లీ ప్రణబ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో అండగా వుంటూ వచ్చారు. పివి. నర్సింహారావును ప్రధాని చేయడంలో కూడా కీలకభూమిక పోషించారు. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఇంకా బతికి వుందంటే ప్రణబ్‌ ముఖర్జీ లాంటి నాయకులే కారమని చెప్పకతప్పదు. 2004 ప్రధాని అయ్యే అవకాశం వున్నా సోనియాగాంధీ ఆయన పేరు ప్రస్తావించలేదు. ఇందుకు కూడా కొన్ని కారణాలున్నాయి. ఆనాడు రాజీవ్‌ గాంధికి లేనిపోనివి చెప్పినట్లే, తర్వాత సోనియా గాందీకి కూడా అదే నూరిపోశారు. దాంతో ఆమె ప్రణబ్‌ను ప్రదాని చేయడానికి ముందుకు రాలేదు. కాని తాను ప్రధాని కావలన్నా కోరికను ప్రణబ్‌కు ఎంతో వుండేది. గాంధీ కుటుంబాన్ని కాదని ఆయన ప్రదాని పదవి కోరలేదు. ఆ కుటుంబంలో రాహుల్‌ ప్రధాని కానప్పుడు తనకు అవకాశం వస్తుందని ఆశించారు. అయినా సోనియాగాంధీ కనికరించలేదు. కాకపోతే 2012లో ఆయనను రాజకీయాలను నుంచి దూరం చేసి, రాష్ట్రపతి పదవిని ఇచ్చారు. నిజానికి ఆ పదవి ప్రణబ్‌కు ఇష్టం లేదు. ఆనాడు ప్రణబ్‌కు రాష్టపతి చేయకుంటే కూడా కాంగ్రెస్‌ పార్టీ పరిస్ధితి మరోలా వుండేది. రాష్ట్రపతిని చేసి పార్టీ కోసం పనిచేసేనాయకుడు లేకుండా చేసుకున్నారు. స్వయంకృతాపరాధంతో పార్టీని చెడగొట్టుకున్నారు. రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయడం, నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పందించడం, స్పెక్ట్రమ్‌ లాంటి కేసులపై ముందూ వెనుకు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం కూడా కాంగ్రెస్‌ కొంప ముంచింది. చివరికి ఏం తేలింది? స్పెక్రమ్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రింకోర్టు కేసు కొట్టి వేసింది. అప్పటికే కాంగ్రెస్‌కు జరగాల్సినంతనష్టం జరిగిపోయింది. ఇలా మన్మోహన్‌ సింగ్‌ హయాంలో వేసిన తప్పటడుగులు, కాంగ్రెస్‌కు శాపాలుగా మారాయని చెప్పడంలో సందేహం లేదు.

‘ఆప్‌’ను ముంచిన అవినీతి వరద!

ఢల్లీి ఎన్నికల్లో కాషాయ ప్రభంజనం

అవినీతి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆప్‌ అగ్రనేతలు

ఓడి గెలిచిన రాహుల్‌

ఆప్‌ ఓటమికి ఆరు కారణాలు

ఉద్యమ నేత నియంతగా మారితే ఫలితం ఇదే

ఆప్‌ ఓటమితో విపక్షాల్లో నైరాశ్యం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

శనివారం జరిగిన ఢల్లీి ఎన్నికల ఫలితాల్లో 48 స్థానాల్లో తన బలాన్ని నిరూపించుకున్న భారతీ యజనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఢల్లీి పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితం కాగా రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‘సున్నా’ సీట్లతో మరో చెత్త రికార్డు సృష్టించింది. ఆప్‌ అగ్రనేతలైన కేజ్రీవాల్‌, సిసోడియా, సత్యేంద్రజైన్‌ వంటి నాయకులు ఓడిపోయారు. వీరుముగ్గురూ లిక్కర్‌ స్కామ్‌లో జైలుకెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఓటమితో ఆప్‌కు ఊహించని దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అతిశి, కల్కా నియోజకవర్గం నుంచి గెలవడం గుడ్డిలో మెల్ల. ఢల్లీి ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీపార్టీ ఓటమి నేపథ్యంలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢల్లీి సచివాలయాన్ని సీజ్‌ చేయాలని నిర్ణయించారు. ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులు తరలించవద్దని ఆదేశాలు వెళ్లాయి. 

ఆప్‌ ఉత్థాన పతనాలు

ఆమ్‌ ఆద్మీ పార్టీ స్థాపన జరిగిన కొద్ది నెలల్లోనే అంటే 2013లో ఢల్లీి అసెంబ్లీకి జరిగిన ఎన్నిక ల్లో 28 సీట్లు గెలుచుకొని అందరినీ ఆశ్చర్య పరచింది. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసినా కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం కూలిపోవడంతో, 2015లో ఢల్లీి అసెంబ్లీ 70 స్థానాల కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏకంగా 68 సీట్లు గెలుచుకోవడంతో మిగిలిన రాజకీయపార్టీలు ఆశ్చర్యంతో పాటు అయోమయంలో వుండిపోయాయి. 2020 ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకుంది. ఈసారి తమదే విజయం అన్న విశ్వాసంతో వున్న ‘ఆప్‌’కు ఓటమి రూపంలో గట్టి దెబ్బ తగిలింది. అసలు ఆప్‌ పార్టీ ఓటమి పాలవడం రాజకీయాల్లో సహజమనుకు న్నా, ఈసారి ఆప్‌ అగ్రనాయ కులంతా ఓటమిపాలవడం కోలుకోలేని దెబ్బ! రాహుల్‌ చద్దా పార్టీలో ఉన్నారో లేదో తెలియదు. ఈ ఓటమి దెబ్బకు ఇప్పటివరకు కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ సమకూర్చి చేతులు కట్టుకొని నిలబడిన పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌్‌ మాన్‌ ఇక ముందు మాట వింటారా? ఇప్పుడు ఎన్నికైన వారు, ఓటమిపాలైన అగ్రనాయత్వం మాట ఎంతవరకు వింటారనేవి పెద్ద ప్రశ్నలు.

అగ్రనేతల ఓటమి

ఢల్లీి మాజీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఢల్లీి స్థానం నుంచి భాజపా అభ్యర్థి పర్వేశ్‌ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియా జంగ్‌పూరలో 675 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి తర్వీందర్‌ సింగ్‌ చేతిలో ఓడిపోయారు.ఢల్లీి ముఖ్యమంత్రి అతిశి కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి 3521 ఓట్ల మెజారిటీలో భాజపా అభ్యర్థి రమేష్‌ బిదూరీపై విజయం సాధించారు. మొదటి రౌండ్‌ నుంచీ వెనుకంజలో వున్న ఆమె చివర్లో పుంజుకొని విజయబావుటా ఎగురవేశారు. ఆప్‌ సీనియర్‌ నేత సత్యేంద్ర జైన్‌ షాకూరి బస్తీలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కర్నాల్‌ సింగ్‌ 20998 ఓట్ల తేడాతో గెలిచా రు. మరో ఆప్‌ ముఖ్య నేత సౌరభ్‌ భరద్వాజ్‌ గ్రేటర్‌ కైలాష్‌ స్థానంలో పరాజయం పాలయ్యారు.ఇక్కడ బీజేపీ అభ్యర్థి శిఖారాయ్‌ 3188 ఓట్ల తేడాతో గెలిచారు. బిజ్వాసన్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కైలాష్‌ గెహ్లోత్‌ విజయం సాధించారు. ఆప్‌ అభ్యర్థి సురేందర్‌ భర ద్వాజ్‌పై 9833 ఓట్ల తేడాతో గెలిచారు. గాంధీనగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అర్వీందర్‌సింగ్‌ లవ్లీ, ఆప్‌ అభ్యర్థిపై 12748 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఓడి గెలిచిన రాహుల్‌

ఒకవిధంగా చూసుకుంటే ఢల్లీి ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ఓడి గెలిచారనుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థిగా రాహుల్‌కు పోటీగా కేజ్రీవాల్‌ సు స్థిరమయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన ఒకపక్క ఇండీ కూటమితో మరోపక్క కాంగ్రెస్‌తో అవసరానికి అనుగుణంగా డబుల్‌గేమ్‌ ఆడుతూ వస్తున్నారు. దీనికితోడు మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి వంటి రాష్ట్రాల్లో వరుస ఓటములతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌ పార్టీకిరాహుల్‌ గాంధీ ప్రధాని అభ్యర్థిగా పెద్ద ‘గుదిబండ’గా మారారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇండీ కూటమిలోని ప్రాంతీయ పార్టీల నేతల్లో ప్రధానిపదవిపై ఆశలు పెరిగాయి. వీరిలో మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్‌ ఓటమి పుణ్యమాని రాహుల్‌కు ఒక పోటీదారు రంగంనుంచి తప్పుకున్నట్లయింది.

ఆదినుంచీ ప్రధాని పదవిపైనే కన్ను

ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుంటూ, తర్వాత దేశ ప్రధాని అయ్యా రు. ఆయన పేరును భాజపా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దేశం ఒక్కసారి ఆయనవైపుచూడటం మొదలుపెట్టింది. గుజరాత్‌ అభివృద్ధి నమూనా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమం త్రులకు ఒక దిక్సూచిగా మారింది. ఇదిలావుంటే కేజ్రీవాల్‌ కూడా ఢల్లీి పీఠం అధిష్టించిన దగ్గరి నుంచి ప్రధానిపదవికి అభ్యర్థిగా ఎదగాలన్న బలీయమైన ఆకాంక్షతో ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే తన పార్టీలో మరొకరిని ఎదగనివ్వలేదు, మహారాష్ట్ర, గోవా, పంజాబ్‌, హర్యానా వం టి రాష్ట్రాల్లో బలమైన నాయకుడుగా ఎదుగుతారని అనుమామున్నవారినల్లా తొక్కేసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌ను గాంధీల కుటుంబం ఎట్లా శాసిస్తుందో, ఆప్‌ను ‘అతడే ఒక సైన్యం’ మాదిరిగా శాసించాలనుకున్నారు. ఈ కలలన్నీ ఇప్పుడు కల్లలైపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే దేశాధినేతగా ఎదగాలన్న ఆతృతలో పార్టీలో నాయకులను ఎదగనీయకుండా తన గొంతు తానే కోసుకున్నారని చెప్పాలి. ఆప్‌ పార్టీకి ప్రారంభంలో విద్యావంతులు విపరీతంగా మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ సభ్యులుగా గర్వంగా చెప్పుకునేవారు. ఉద్యోగులుగా ఉన్న యువత తమ జీతాల్లో కొంత శాతం పార్టీ ఫండ్‌గా ఇచ్చిన రోజులున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ మారిపోయారు. అవకాశాలు దొరకనంతవరకు ‘నీతి’గా వుంటూ, అవకాశం దొరికినతర్వాత ‘అవినీతికి’ తెరలేపారు. ఏటా మీడియా మేనేజ్‌మెంట్‌కు సుమారు రూ.400కోట్లు ఖర్చుచేయడం, సం క్షేమం పేరుతో పరిధికి మించి ‘ఉచితాలు’ ప్రకటించడం వంటివి ఆయనకు మొదట్లో మద్దతి చ్చిన విద్యావంతులను దూరం చేశాయి. ‘సంక్షేమం’ కూడా ఒక పరిమితి వరకే అధికారానికి దోహదం చేస్తుంది. మితిమీరితే వికటిస్తుంది. ఇప్పుడు జరిగిందిదే! చివరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తనవిగా ప్రచారం చేసుకోవడానికి వెనుకాడలేదు. ఆవిధంగా అన్నీ తానే చేసానని చెప్పుకోవడానికి తహతహలాడారు. మరి నిజాలెప్పుడూ నిప్పుమాదిరిగానే వుంటాయి. ఏది నిజమో తెలిసొచ్చిన ప్రజలు ఇప్పుడాయన్ను పక్కనపెట్టారు. 

మోదీ బ్రహ్మాస్త్రం

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆశలకు ఏవిధంగానైనా గండికొట్టాలన్న వ్యూహంతో బీజేపీ ముందుకెళ్లింది. ప్రధాని నరేంద్రమోదీ ఢల్లీి ఎన్నికల్లో తన చివరి ‘బ్రహ్మాస్త్రాన్ని’ ప్రచారం చివరిదశలో గురిచూసి వదిలారు. బడ్జెట్‌లో ఆదాయపుపన్ను మినహాయింపు 12లక్షలకు పెంచడమే ఆ బ్రహ్మాస్త్రం. ఢల్లీిలో మూడొంతులవరకు వేతనజీవులే వుండటం విశేషం. ఇంతస్థాయిలో ఐ.టి. మినహాయిం పునిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇది మోదీ వదిలిన తురుపు ముక్కగా అప్పుడే రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. గత శనివారం అంటే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్‌ ఈమేరకు చేసిన ప్రకటన ఎన్నికల్లో తప్పక ప్రభావం చూపుతుందన్న అందరి అంచనా నిజమైంది. నిజానికి కేజ్రీవాల్‌ మధ్యతరగతిని ప్రధానంగా ఆకర్షించే ఉద్దేశంతో ఐ.టి.ని రూ.10లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కానీ మోదీ ప్రభుత్వం దీన్ని ఏకంగా రూ.12లక్షలకు పెం చింది. ఆవిధంగా కేజ్రీవాల్‌ కంటే రెండాకులు ఎక్కువగానే చదివానని భాజపా నిరూపించుకుంది.

మధ్యతరగతివారే అధికం

ఢల్లీిలో ఎగువ మధ్యతరగతి పదిశాతం, దిగువ మధ్యతరగతి 48 నుంచి 50శాతం వరకు వుంటే మిగిలినవారు ఇతర వర్గాల ప్రజలు. వీళ్లను ఆకట్టుకోవడానికి ఆప్‌, భాజపాలు తీవ్రంగా ప్రయత్నించాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయవర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభివృద్ధి పథ కాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్‌ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణల తో సతమతమైంది. ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు కాకుండా కాంగ్రెస్‌ కు పడటం ఆప్‌ దారుణంగా దెబ్బ తినడానికి మరో కారణమని చెబుతున్నారు. దేశ రాజధాని నగరంలో వెయ్యికి పైగా మురికివాడలున్నాయి. గతంలో బంగ్లాదేశ్‌నుంచి, పాక్‌నుంచి వలసలు వచ్చి వివిధ ప్రాంతాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వర్గాల పూర్తి మద్దతుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపు సాధిస్తూ వచ్చింది. ఈ వర్గాలకే కేజ్రీవాల్‌ వెన్నుదన్నుగా నిలిచారు. రాయితీలు, ప్రయోజనాలు ఈ వర్గాలకే కల్పిస్తూ వచ్చారు. ఈ వర్గాల మతపెద్దలను ఎప్పటికప్పుడు సంతృప్తిపరచే విధంగా ప్రవరిస్తూ, హిందువులను తీవ్ర వివక్షకు గురిచేసిన చరిత్ర కేజ్రీవాల్‌ది. కరోనా కాలంలో కూడా ఆయా మతవర్గాలకే ప్రాధాన్యం ఇచ్చాడు తప్ప హిందువులకు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు. చివరకు దీపావళి కూడా జరుపుకోకుండా ఆంక్షలు విధించి ఘనత కేజ్రీవాల్‌ది. నూతన సంవత్సర వేడుకల్లో, విజయోత్సవాల సందర్భంగా, ఇతర మతాల వేడుకల్లో బాణాసంచా కాల్చుకోవచ్చు. అదే హిందువులు బాణాసంచా కాలిస్తే కేసులు నమోదయ్యేవి. పౌర సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ వద్దంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూవర్గాలను చీల్చి మైనారిటీల పేరుతో నడిపిన రాజకీయం నేపథ్యంలో ఢల్లీిలో భాజపా భవితవ్యం ఒక దశలో ప్రశ్నార్థకంగా మారిన మాట నిజం! కేజ్రీవాల్‌ పాలన క్రమంగా ఢల్లీిని మినీ పాకిస్తాన్‌, మినీ బంగ్లాదేశ్‌గా మారుస్తున్న విషయాన్ని గ్రహించిన ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. 

చెప్పిందొకటి చేసింది మరొకటి

కేజ్రీవాల్‌ ఓటమికి లిక్కర్‌ స్కామ్‌ ప్రధాన కారణమన్న వాదన బాగా వినబడుతున్నప్పటికీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓటమికి అదొక్కటే కాదు, అధికారంలో వుండగా కేజ్రీవాల్‌ చెప్పిన మాటలకు, చేసినచేతలకు పొంతన లేకపోవడం మరో కారణం. పైకి నీతులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవినీతి భయంకరంగా తాండవమాడటానికి కేజ్రీవాల్‌ వైఖరే కారణం. సంక్షేమ పథకాలకు మేధావి వర్గం ఎప్పుడూ వ్యతిరేకమే. కేజ్రీవాల్‌ వాళ్లకు అనుకూలంగా వున్నప్పటికీ, ఆయన ప్రకటించిన సంక్షేమ పథకాలే అధికారాన్ని కట్టబెట్టాయి. ఇప్పుడు భాజపా ఎంతో సంయమనంతో, సమ తుల్యంతో వ్యవహరించాల్సివుంటుంది. తానిచ్చిన సంక్షేమ వాగ్దానాలను అమలు పరుస్తూనే, ఢల్లీి పాలనను అట్టగుస్థాయి నుంచి మరింత క్రమబద్ధీకరించాల్సి వుంటుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో భాజపా ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఇది గుర్తెరిగి పాలన సాగించాలి. 

కేజ్రీవాల్‌ ఆరు తప్పులు 

నిజం చెప్పాలంటే కర్ణుడు చావుకు ఆరు కారణాలు అన్నట్టు, కేజ్రీవాల్‌ పతనానికి ఆయన చేసిన ఆరు తప్పులు ప్రధాన కారణం. కేజ్రీవాల్‌ నిజానికి అన్నాహజారే మొదలుపెట్టిన అవినీతి వ్యతి రేక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు, నాయకుడిగా ఎదిగారు. జన్‌లోక్‌పాల్‌ వ్యవస్థను తీసుకురావాలన్నది అన్నాహజారే ఆకాంక్ష. అయితే కేజ్రీవాల్‌ పార్టీ పెట్టాలని ఉత్సాహం చూపి నప్పుడు అన్నాహజారే వారించారని చెబుతారు. ఆయన మాట వినకుండా కేజ్రీవాల్‌ ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ (సామాన్యుల పార్టీ)ని స్థాపించారు. కానీ రెండోసారి ఎన్నికైన తర్వాత ఆయన నియంతగా వ్యవహరించడం మొదటి తప్పు. ఆయన పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో 70శాతం మందికి ఆయన్ను కలవడం సాధ్యమయ్యేది కాదు. కేజ్రీవాల్‌ పి.ఎ. విభవ్‌కుమార్‌ వద్దకు మాత్రమే వారికి అవకాశం వుండేది. ఇందుకు ఉదాహరణ స్వాతీ మాలివాల్‌. ఆమె కేజ్రీవాల్‌ ను కలవడానికి వస్తే చావుదెబ్బలు బహుమానంగా లభించాయి. ఇటువంటి కారణాలవల్ల కేజ్రీవాల్‌ పార్టీ నాయకులకు, కేడర్‌కు దూరమైపోయారు. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు ఏడు గురు ఆప్‌ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారంటే, కేజ్రీవాల్‌ నియంతృత్వం ఏస్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. తనకు పార్టీలో ఆప్తమిత్రులుగా వున్న వారిని ఒక్కొక్కరిగా దూరం చేసుకున్నారు. స్వాతీ మాలివాల్‌కు మహిళల్లో గట్టి పట్టుంది. ఈమె మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు. ఈమెను శీష్‌మహల్‌లో కేజ్రీవాల్‌ పి.ఎ. విభవ్‌కుమార్‌ చితకబా దారు. దీంతో ఆమె పార్టీకి దూరమైంది. ఆమె పట్టుపట్టి మరీ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉద్యమం రూపంలో చేసింది. కుమార్‌ బిశ్వాస్‌ తొలి టర్మ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన గొప్పకవి, వ్యంగ్యంగా చతురోక్తులు విసరడంతో దిట్ట. ఈయన్ను కూడా దూ రం పెట్టడంతో ఆయన తన కవిసమ్మేళనాలు, సమావేశాల ద్వారా మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలకు ఎంతో చేరువయ్యారు. తన సమావేశాల్లో ఆయన కేజ్రీవాల్‌ను వ్యంగ్యోక్తులతోచేసిన విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. స్వాతీమాలీవాల్‌, కుమార్‌ బిశ్వాస్‌లు ఆప్‌కు కంచు కోటగా వున్న మధ్యతరగతి ఓటర్లను దూరం చేయడంలో కీలకపాత్ర పోషించారు. వీరిని దూరంచేసుకోవడం కేజ్రీవాల్‌ రెండో తప్పు. ఇక మూడోతప్పేమిటంటే, తనపై లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణ లు వచ్చినప్పుడు తక్షణం రాజీనామా చేసివుండాల్సింది. అలా చేయలేదు సరికదా, ముఖ్యమంత్రిపదవిలో కొనసాగుతూనే జైల్లోకి వెళ్లి చరిత్ర సృష్టించారు. ఈ స్కామ్‌లో కేజ్రీవాల్‌తో పాటు కొందరు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా జైలుకెళ్లారు. దీంతో ఆయనతో పాటు మంత్రుల అవినీతి ప్రజలకు బాగా తెలిసొచ్చింది. ఇది ఆయన ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. ఇక నాల్గవ తప్పు శీష్‌మహల్‌ విషయంలో ఆ యనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంలో విఫలం కావడం. ఆయన కట్టుకున ్నశీష్‌మహల్‌ వైభవంపై ఆరోపణలు వచ్చినప్పుడు, మీడియాను తీసుకెళ్లి మొ త్తం చూపించి వుండాల్సింది. అట్లా చేయలేదు. రూ.33కోట్ల ప్రజాధనం ఖర్చుచేసి శీష్‌మహల్‌కు మరమ్మతులు చేయించారని కాగ్‌ నివేదిక పేర్కొనడంతో దుమారం చెలరేగింది. భాజపా దీ న్ని ప్రధాన ఆయుధంగా మలచుకుంది. మధ్యతరగతి ప్రజల్లోకి ఇది బాగా వెళ్లింది. ఫలితంగా కేజ్రీవాల్‌పై ఢల్లీివాసుల్లో అనుమానాలు పెరిగాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీయే అవినీతిలో కూరుకుపోవడం అప్పట్లో మీడియాలోవిపరీతంగా చర్చలకు దారితీసింది. ఐదో ప్రధాన తప్పిదం ముస్లింల ఓట్లు ఎక్కడ కాంగ్రెస్‌, ఎం.ఐ.ఎం.లు చీల్చుకుంటాయన్న భయంతో ఈసారి ఆయన పూర్తిగా హిందూ ఓటర్లను విస్మరించడం. గతంలో బీజేపీ జై శ్రీరామ్‌ అంటే ఆయన జై హనుమాన్‌ అని నినాదమిచ్చి హిందువులకు తాను అనుకూలమని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన పూర్తిగా ముస్లింల భజనకే పరిమితమయ్యారు. ఆయన చేసిన తప్పుల్లో అత్యంత కీలకమైందిగా దీన్ని పరిగణించాలి. దీంతోపాటు ఢల్లీి ఓటర్లలో క్రమంగా పెరుగుతున్న మతపరమైన పోలరైజేషన్‌ను గుర్తించడంలో ఆయన విఫలమయ్యారు. ఇక ఆరవ తప్పు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం. ఆవిధంగా ప్రకటించిన తర్వాత వీరిని మార్చటం సాధ్యంకాదు. అట్లాచేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతా యి. లాక్కోలేని, పీక్కోలేని దుస్థితి ఇది. ప్రకటించిన వారిలో కొందరు ఓటమి పాలవుతారన్నది ఖాయంగా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో 20మందిని మార్చడంతో, అసంతృప్తి చెలరేగింది. ఇక భాజపా తన అభ్యర్థులను అందరికంటే చాలా ఆలస్యంగా ప్రకటించింది. ముఖ్యంగా ఆమ్‌ఆద్మీ పార్టీలో పరిణామాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు గెలుపు అచంనాలు వేస్తూ, అభ్యర్థులనుఎంపిక చేసింది. ఒకరకంగా కేజ్రీవాల్‌ ముందుగా అభ్యర్థులను ప్రకటించి భాజపాకు మేలు చేశారనే చెప్పాలి. దీంతో పాటు తాను అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ముందుగానే ప్రకటించడం, బీజేపీ, కాంగ్రెస్‌లు తాము మరింత ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని ప్రకటించడానికి దోహదం చేసింది.

గెలిచేది నేనే: నరేందర్‌ రెడ్డి.

`నాకు ఎవరూ పోటీ కాదు.

`కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌ రెడ్డి తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్వూ..

`సమాజాన్ని ,సామాజిక స్థితిగతులు అధ్యయనం చేశాను.

`ఉన్నత విద్యావంతుడిగా తెలంగాణలో విద్యాభివృద్ధికి కృషి చేస్తాను.

`నిరుద్యోగులకు అండగా వుంటూ ఉద్యోగ కల్పన కోసం శ్రమిస్తాను.

`సామాజిక సమస్యలపై అవగాహన వుంది.

`విద్యా వ్యవస్థ మీద పూర్తి అవగాహన వుంది.

`రేపటి తరం గురించి ఆలోచించే శక్తి వుంది.

`రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వం

`ఉద్యోగులకు మెరుగైన జీతాలను సకాలంలో అందించేది కాంగ్రెస్‌ ప్రభుత్వం.

`బిజేపి తో గతంలో ఒరిగింది లేదు.

`ఇప్పుడు కొత్తగా జరిగే మేలు లేదు.

`పదేళ్ల క్రితం 2 కోట్ల ఉద్యోగాలిస్తామని దేశ ప్రజలను మోసం చేసింది బిజేపి.

`తెలంగాణ రాష్ట్రమంటేనే బిజేపికి చిన్న చూపు.

`బడ్జెట్‌ లో తెలంగాణ ప్రస్తావన కూడా వుండదు

`తెలంగాణకు అదనంగా రూపాయి ఇచ్చేది వుండదు.

`తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపిలను గెలిపిస్తే రూపాయి తెచ్చింది లేదు.

`తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇచ్చింది లేదు.

`తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌.

`తెలంగాణ అభివృద్ధి చేసేది కాంగ్రెస్‌.

`ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.

`తొలి ఏడాదిలో 60 వేల ఉద్యోగాలిచ్చాం.

`జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఏటా ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తాం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది నేనే..ఇది అతి విశ్వాసంతో చెబుతున్న మాట కాదు…పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట. ఎందుకంటే ఇప్పటికే నేను నాలుగు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల ప్రచార పర్యటనల్లో తెలిసిన అంశం. తెలుసుకున్న విషయం. పైగా నేను దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా సుపరిచితమైన విద్యావేత్తను. నా విద్యా సంస్దలు నా గెలుపుకు ఒక కారణమైతే, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలనపై ప్రజల్లో వున్న నమ్మకం మరో కారణం. దానితోపాటు అంకితభావం కల్గిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు కలిగిస్తున్న విశ్వాసం కూడా నాలో మరింత నమ్మకాన్ని పెంచింది. ఎక్కడికెళ్లినా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆదరణ మర్చిపోలేనది. నాలుగు జిల్లాల్లో వున్న పట్టభద్రులు స్పందన కూడా నాకు ఎంతో బలాన్ని ఇస్తోంది. అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు నాదే..గెలిచేదినేనే అనే నమ్మకం మరింత నాలో బలపడిరది. అయితే ఇంకా నేను మరింత ప్రచారం కొనసాగించాల్సిన అవసరం వుంది. ప్రత్యర్ధులకు అవకాశమివ్వకుండా ముందుకు సాగాల్సి వుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగాల కల్పన నా విజయానికి బాటలు వేస్తుందని బలంగా నమ్ముతున్నానంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ది డాక్టర్‌. వి. నరేందర్‌ రెడ్డి నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుకిచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో అనేక అంశాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
తెలంగానలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా వుంది. కాంగ్రెస్‌ పార్టీకి సమీపంలో కూడా ఏ పార్టీలేదు. పైగా తెలంగాణ యువతకు కాంగ్రెస్‌ పార్టీ మీద అచెంచలమైన విశ్వాసం వుంది. గత పదేళ్ల కాలంలో పది ఉద్యోగాలు కూడా కల్పించలేని బిఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడిరచి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు. ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే నిలబెట్టుకుంటూ వస్తోంది. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు 60వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వాలు దేశంలోనే ఎక్కడా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూడలేదు. గత పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో అసలే చూడలేదు. గత ఏడాదే ఇంకా అనేక ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రయత్నం చేశారు. కాకపోతే తర్వాత వెంటనే వచ్చిన పార్లీమెంటు ఎన్నికల సమయానికే మూడు నెలల సమయం పట్టింది. అయినా ఇంత తక్కువ సమయంలోనే 60వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడం అంటే మాటలు కాదు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వల్లనే ఇన్ని ఉద్యోగాలు ఇంత తక్కువ సమయంలో ఇచ్చేందుకు దోహడపడిరది. అందువల్ల తెలంగాణలో యువత, నిరుద్యోగులు అంతా కాంగ్రెస్‌ మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాలు ఇస్తారని ఎదురుచూస్తున్నారు. ఇంకా కొన్ని వేలకుపైగా ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా వేయడం జరిగింది. ఇలా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం యువతకు పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన చేస్తూ నిరుద్యోగ సమస్యను లేకుండా చేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం. అందువల్ల ఈ ఎన్నికల్లో తన గెలుపు పెద్ద కష్టం కాదు. పైగా నా ప్రత్యర్ధులెవరూ నాకు సమీపంలో కూడా వుండే అవకాశం లేదు. బిజేపి పార్టీకి తెలంగాణలో చోటు లేదు. బిజేపి కేంద్ర నాయకత్వానికి తెలంగాణ మీద ప్రేమే లేదు. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణకు బిజేపి చేసిందేమీ లేదు. ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు. కనీసం బడ్జెట్‌లలో తెలంగాణ పదానికి కూడా చోటు వుండడం లేదంటే తెలంగాణ ప్రజలు బిజేపిని ఎందుకు నమ్మాలి? తెలంగాణ నుంచి గత పార్లమెంటు ఎన్నికల్లో 8 మంది ఎంపిలను గెలిపిస్తే, అందరూ కలిసి 8 రూపాయలు కూడా తీసుకురాలేదు. అలాంటి పార్టీని తెలంగాణ పట్టభద్రులు నమ్మడం అనేది కల. 2014 ఎన్నికల్లో బిజేపి గెలిస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. అంటే ఈ పదేళ్ల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కాని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏనాడో మర్చిపోయింది. రైటైర్‌ అయిన ఉద్యోగాలను కూడా నింపలేకపోతోంది. దేశంలో నిరుద్యోగ సమస్యను పెంచింది. పదేళ్ల క్రితం వున్న నిరుద్యోగ సమస్యకు ఇప్పటికీ పొంతన లేదు. బిజేపి పాలిత రాష్ట్రాలలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఆ మధ్య ఉత్తర ప్రదేశ్‌లో రెండు ఉద్యోగాలకు 2లక్షల మంది ధరఖాస్తులు చేసుకున్నారన్న వార్త విన్నాం. అది కూడా ప్యూన్‌ పోస్టు అని అందరం ముక్కున వేలేసుకున్నాం. అంటే దేశంలో బిజేపి పాలిత రాష్ట్రాలలో నిరుద్యోగ సమస్య ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కనీసం ప్రైవేటు రంగంలోనైనా ఉద్యోగ కల్పన చేపట్టారా? అదీ లేదు. దేశంలో బిజేపి పార్టీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. జిఎస్టీని తెచ్చిన పారిశ్రామిక రంగాన్ని మొత్తం దివాళా తీయించారు. చిన్న చిన్న వ్యాపారులను నిలువునా ముంచారు. ప్రజల మీద పన్నుల భారం వేసి ప్రజలను హడలగొడుతున్నారు. కష్టపడి రోజూ కూలీ సంపాదించుకునే సామాన్యుడు బతకలేని పరిస్దితులు తెచ్చిపెడుతున్నారు. అయినా బారత్‌ వెలిపోతోందని, వికసిత్‌ భారత్‌ అంటూ ప్రజలను మతం మత్తులో మభ్యపెడుతూ రాజకీయం చేయడం తప్ప బిజేపి ప్రజలకు చేస్తున్నదేమీ లేదు. యువత భవష్యత్తుకుబాటలు వేస్తున్నదేమీ లేదు. అందుకే తెలంగాణలో బిజేపికి చోటు లేదు. ఇతర పార్టీలకు అసలే చోటు లేదు. ఇక వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే నాకు సమాజం తెలుసు. సామాజిక సమస్యలు తెలుసు. ప్రజల జీవన విధానం తెలుసు. పల్లె జీవితాలు ఎలా వుంటాయో తెలుసు. పల్లెలో జీవనోపాధి ఎంతవరకు వుంటుందోతెలుసు. నిజానికి ఉపాధి, ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎదరుచూసేది గ్రామీణ విద్యావంతులే. వారికి గ్రామంలో సరైన ఉపాది వుండదు. ఎలాగైనా మంచి ప్రభుత్వ ఉద్యోగమో..లేక అంతకు సమానమైన ప్రైవేటు ఉద్యోగమైనా పొందాలని ఎంతో కష్టపడుతుంటారు. వారికి భరోసా ఇచ్చేవారు వుండరు. వారి ఆశలను గత ప్రభుత్వం నెరవేర్చింది లేదు. దాంతో పల్లె యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది. వారికి ఒక దారి చూపాల్సిన అవసరం వుంది. పల్లె యువతకు ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేయడంలో స్వయం ఉపాధి రంగాలలో వారిని ప్రోత్సహించాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూసే వారికి ఉద్యోగాలు వేసేలా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు సంప్రదించే ప్రయత్నం నిరంతరం చేయాలి. ఇక ప్రైవేటు రంగంలో కూడా అనేక అవకాశాలు వస్తుంటాయి. అందులో ప్రతి పరిశ్రమలోనూ తెలంగాణ వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించేలా చూడాల్సి వుంటుంది. ఇవన్నీ వాటిపై అవగాహన వున్న నాలాంటి వారికి మాత్రమే సాద్యమౌతుంది. నా విద్యా సంస్దల్లో కూడా ఎంతో మందికి ఉపాది అవకాశాలు కల్పిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఎంతో మందికి ఉపాధి కల్పించేందుకు వీలు కూడా వుంది. విద్యారంగం, వ్యవస్ద మీద కూడా పూర్తి అవగాహన వుంది. పరిజ్ఞానం వుంది. ప్రపంచ విద్యా విధానంలో వుస్తున్న మార్పులను ఎప్పటికిప్పుడు అద్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం, మన విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టడం వంటివి చేయాలంటే నా లాంటి విద్యావేత్తకు కొంత వెసులుబాటు వుంటుంది. మిగతా వారికి ఈ అవకాశం వుండదు. ఎందుకంటే విద్యా సంస్ధల అదినేతగా వున్నందున దేశంలోని విద్యా విదానం, విదేశాలలో విద్యా విధానాలపై ఎప్పటికప్పుడు సమాచారం వుంటుంది. మన విద్యార్ధులకు ప్రపంచ పరిజ్ఞానం అందించే విద్య అందించేందుకు ఎలా ముందుకు సాగాలన్నదానిపై ప్రభుత్వానికి నివేదికలు, సూచలునలు ఇచ్చేందుకు వీలుంటుంది. ఇలా ఏ రకంగా చూసినా ఈ ఎమ్మెల్సీ ఎంపికకు తాను మాత్రమే అర్హుడనని చెప్పగలను. విద్యావంతులైన నిరుద్యోగులు రేపటి వారి భవిష్యత్తు కోసమే కాకుండా, వచ్చే తరాలకు సంబంధించిన మేలు కూడా కోరుకోవాల్సిన అవసరం వుంది. అందువల్ల పట్టభద్రులంతా తనను గెలిపించి, రేపటి తెలంగాణ భవితకు నా తోడ్పాటును అందించేందుకు వీలు కలగాలంటే, నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను.

మైలేజీ మాయం..డ్యామేజీ ఖాయం.!

 

`పడిపోయిన పవన్‌ ర్యాంకు!

`ఆర్భాటమెక్కువ..ఆచరణ తక్కువ!

`ఆవేశమెక్కువ..ఆలోచన తక్కువ

`పవన్‌తో మేలు కన్నా, నష్టమే ఎక్కువ?

`కొంత మంది మంత్రుల కన్నా తగ్గిన పని పవన్‌ పనితనం

`రాజకీయం వేరు..పరిపాలన వేరు

`రోజూ రాజకీయాలే చేస్తామంటే జనం ఒప్పుకోరు

`పవన్‌ దూకుడులో ఇప్పటికీ నోటి దురుసు

`రాజ్యాంగ బద్దమైన పదవిలో వుంటూ అడ్డగోలు వ్యాఖ్యలు

`ప్రభుత్వానికి మైలేజ్‌ తేకపోగా డ్యామేజ్‌ అవుతోంది

`పదే పదే డబ్బులు లేవంటూ పవన్‌ మాటలు ప్రభుత్వానికి ఇబ్బందికరం

`సాటి మంత్రులు ఇరుకున పడేలా పవన్‌ వ్యాఖ్యలు

`మొదటి సారి ర్యాంకుతో రెచ్చిపోయిన పవన్‌

`పదో ర్యాంకుతో అంతా సైలెన్స్‌

`దూకుడు ఎన్నికలలో మేలు చేసింది

`ఎల్లకాలం పని చేయదని పవన్‌కు తెలిస్తేనే మంచిది

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పాత్రపై రకరకాల సందేహాలు, అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల కాలంలో పవన్‌ తన పంథాను మార్చుకొని తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారన్న సంగతి స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. ఎందుకంటే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాన్ని ఆది నుంచి గమనిస్తే, మొదట్లో ఆయన చెప్పిన మాటలకు, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతనవుండదు. ఎప్పటికప్పుడు తన మార్గం మార్చుకోవడంలో పవన్‌ కళ్యాన్‌ను మించిన నాయకుడు లేడని చెప్పొచ్చు. పవన్‌ కళ్యాన్‌ రాజకీయం మొదలు పెట్టినప్పుడు చెగువేరా సిద్దాంతం అన్నాడు. తిరుగుబాటు విధానంతో ముందుకు సాగాడు. తన అభిమానులంతా చెగువేరా టీషర్టులు వేసుకునేదాకా వచ్చింది. మోటార్‌ సైకిళ్లు,కార్లమీద చెగువేరా బొమ్మతోపాటు పవన్‌ ఫోటోలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో తనలో కమ్యూనిజం బావాలున్నాయన్నారు. గద్దర్‌ పాటలంటే తాను చెవికోసుకుంటానన్నారు. గద్దర్‌ లాంటి వారి బావజాలంతో తాను చైతన్యం పొందానన్నారు. పవన్‌ కల్యాణ్‌ తండ్రి ఓసారి నెల్లూరు గద్దర్‌ వచ్చినప్పుడు వెళ్లి ఆయన పాటలు వినమని చెప్పారని కూడా చెప్పుకున్నారు. అలా సాగినంత కాలం పవన్‌ కళ్యాన్‌ రాజకీయం ముందుకు సాగలేదు. దాంతో ఆయన తన రాజకీయ పంధాను మార్చుకున్నారు. ఒక్కసారిగా బిజేపికి దగ్గరయ్యారు. 2014 ఎన్నికల్లో బిజేపితో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ, బిజేపి, జనసేన మూడు పార్టీలు కలిసి విజయంసాదించాయి. కాని ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కాని కూటమికి మద్దతు పలికి ఆనాడు తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదరపడ్డారు. కాకపోతే అతి కొద్ది రోజుల్లోనే ఆయన తన మద్దతుతోనే తెలుగుదేశం గెలిచిందని అంటూ వచ్చారు. కొద్దికాలానికి బిజేపితో కూడా తెగదెంపులు చేసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తును బిజేపి నాశనం చేసిందంటూ విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి మోసం చేశారని ఎలుగెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించారు. తనపార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసుకున్నారు. కాని అటు సినిమాలు, ఇటు పార్టీ రెండిరటినీ ఏక కాలంలో మేనేజ్‌ చేయలేకపోయారు. పార్టీని పటిష్టం చేయలేకపోయారు. కాని పవన్‌ ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా వచ్చారు. దాంతో 2019 ఎన్నికల్లో పవన్‌ ఒంటరిగా పోటీ చేశారు. స్వయంగా ఆయన రెండు చోట్ల పోటీ చేశారు. కాని ఆయన గెలవలేదు. పార్టీ మాత్రం ఒక్కటే సీటు గెలిచింది. దాంతో పవన్‌కు జ్ఞానోదయమైంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్దితులకు తిరుగుబాటు సిద్దాంతం కరక్టు కాదని తెలుసుకున్నాడు. దేశ వ్యాప్తంగా బిజేపికి పెరుగుతున్న ఆదరణ చూసి తన పంథాను అటు వైపు మల్చుకున్నారు. సనాతన ధర్మంలో గొప్ప దనం గుర్తించారు. అటు వైపు అడుగులేశారు. వైసిపిని బిజేపికి దూరం చేయగలిగారు. తర్వాత కొంత కాలానికి తెలుగుదేశాన్ని బిజేపితో కలిపి, మళ్లీ తన రాజకీయం మొదలు పెట్టారు. తన ప్రాదాన్యత పెంచుకుంటూ వచ్చారు. జనంలో ఆకాంక్షల కన్నా, రాజకీయంలో సరికొత్త ఆలోచనలకు పదునుపెట్టారు. ఎన్నికల్లో గెలవడమే రాజకీయం అనుకున్నారు. సిద్దాంతాలను నమ్ముకుంటే సీట్లు రావని తెలుసుకొని పొత్తుతో పోతే తప్ప జనసేన గెలవలేదని గ్రహించి తెలుగుదేశం పార్టీకి గొడుగు పట్టుకున్నారు. మళ్లీ 2014 నాటి రోజులను ఆవిష్కరించారు. కాకపోతే ఆయన ఎంచుకున్న దారిని మార్చుకున్నారే గాని, తనలోని ఆశలకు రెక్కలు తొగడం మాత్రం వాయిదా వేసుకోలేదు. వేసుకునేందుకు సిద్దంగా లేరు. నిజం చెప్పాలంటే లక్ష్యం లేకుండా ఏ నాయకుడు రాజకీయాలు చేయలేడు. అధికారం సాధించాలన్న కోరిక లేకుండా ఏ నాయకుడు రాజకీయ పార్టీని నడపలేడు. ఇప్పుడు పవన్‌ చేస్తున్నది అదే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన రాజకీయాన్ని విస్తరించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక వేళ తాను ఆదమరిచి వున్న సమయంలో ఎక్కడ లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తారో అన్న భయం పవన్‌లో పట్టుకున్నది. తన స్దానంలో మార్పు వస్తుందేమో అన్న ఆలోచన మొదలైంది. చంద్రబాబు నాయకత్వంలో ఇంకా పదిహేనేళ్లయినా పనిచేస్తానని అన్నారు. అంటే చంద్రబాబు నాయకుడుగా వుండే పాలనలోనే తాను వుంటానని స్పష్టం చేసినట్లైంది. కాని లోకేష్‌ నాయకత్వం, తనపై పెత్తనాన్ని అంగీకరించని పవన్‌ సూటిగానే చెప్పినట్లైంది. అసలు పవన్‌ అసలైన స్వరూపం అదే. అందులో తప్పులేదు. పొత్తు దర్మం కుదుర్చుకున్నది చంద్రబాబు కోసమే కాని, లోకేష్‌ కోసం కాదు. అందువల్ల పవన్‌ ఆలోచన తప్పు కాదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పు పట్టాల్సిన పనిలేదు. కాని లోకేష్‌కు ప్రమోషన్‌ను అడ్డుకునే హక్కు పవన్‌కులేదు. లోకేష్‌ పార్టీ వేరు. పవన్‌ పార్టీ వేరు. తెలుగుదేశం పార్టీకి ఏపిలో సంపూర్ణమైన మెజార్టీ వుంది. పవన్‌కు ప్రతిపక్ష హోదాకు అవరమైన సీట్లు మాత్రమే వున్నాయి. అంతకు మించి సీట్లు లేవు. అయినా ఆయన కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే తన మనసులోని మాట చెప్పేశారు. జనసేన చూపించిన దారిలో కూటమి ప్రయాణం సాగని పక్షంలో ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషిస్తామని ముందే చెప్పేశారు. దాన్ని గత కొంత కాలంగా అనుసరిస్తూనే వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే తిరుమల తిరుపతిలో లడ్డూ వివాదాన్ని పూర్తిగా తన భుజాల మీద మోసి, క్రెడిట్‌ కొట్టేయాలనుకున్నాడు. నానా యాగీచేశారు. తిరుమలలో అపవిత్రం జరిగిపోయిందని గత ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా సనాతన దర్మానికి విఘాతం కల్గిందని అగ్రహోదగ్రుడయ్యాడు. కాని అదే సమయంలో చంద్రాబాబుగాని, లోకేష్‌ గాని తమ పని తాను చేసుకుంటూపోయారు. ఎందుకుంటే అది అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు వెళ్తుందో చెప్పలేమని ముందే చంద్రబాబు అంచనా వేశారు. కాని పవన్‌ కళ్యాణ్‌ అంత దూరం ఆలోచించలేదు. ఎందుకంటే సహజంగా ఆయనకు ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. క్రెడిట్‌ అంతా తన ఖాతాలో వేసుకుందామనుకుంటే కుదరలేదు. సుప్రింకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాదానం లేకపోవడంతో, భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పడంతో పవన్‌ దూకుడుకు కళ్లెం వేసినట్లైంది. తర్వాత రాష్ట్రంలో కూటమి పాలన సాగుతున్నా వైసిపీ నాయకుల ఆగడాలు ఆగడం లేదంటూ హోంశాఖ మంత్రి పనితీరును ప్రశ్నించారు. తాను హోం మంత్రిని అయి వుంటే పరిస్ధితి మరో రకంగా వుండేదంటూ కొత్త బాష్యాలు చెప్పారు. అయినా తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్ధుకుపోయారు. కొత్తలో ఇలాగే వుంటుంది లే అనుకున్నారు. ఇక కాకినాడ పోర్టు విషయంలో షిప్‌ద సీజ్‌ అన్నది కొంత కాలం బాగా ట్రెండిరగ్‌ అయ్యింది. ఎందుకంటే మన దేశం నుంచి ఇతర దేశాలకు బియ్యం రవాణ వాణిజ్యం అనేది సర్వసాదారణం. అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా వుంటాయి. అయితే ఆ షిప్‌లలో డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో విచారణ కూడా జరిపించారు. సముద్ర వ్యాపారమంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో వుంటుంది. అవసరమైతే డిల్లీకి వెళ్లి నేను మాట్లాడతా? అన్నారు. వెళ్లారు. అసలు విషయం తెలుసుకొని సైలెంట్‌ అయ్యారు. తన మంత్రిత్వ శాఖలో పనులు వదిలేసి, ఇతర మంతిత్వ శాఖలలో వేలు పెట్టుడం మొదలు పెట్టారు. తన శాఖ ఫైళ్ల క్రియరెన్స్‌ పక్కనపెట్టారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో పదో ర్యాంకుతో సరిపెట్టుకున్నారు. మొదటిసారి ర్యాంకు మొదటిర్యాంకును సాధించిన పవన్‌ ఇప్పుడు పదో ర్యాంకు తెచ్చుకున్నారు. దీనంతటికీ ఈ మధ్య ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా రాజకీయాల మీద కేంద్రీకృతం చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్‌ మొదలైందో అప్పటి నుంచే పవన్‌ తన పంధాకు మరింత పదును పెట్టారు. తనకు తానుగానే ప్రత్యేకతను సంతరించుకునేలారాజకీయం చేయాలనుకున్నాడు. లోకేష్‌ మూలంగా కాలం కలిసొసొచ్చేలా వుందని అనుకుంటున్నాడు. లోకేష్‌కు ప్రమోషన్‌ ఇవ్వడాన్ని సాకుగా చూపి పక్కకు తప్పుకోవాలన్నదే పవన్‌ ఆలోచన. అదే సమయంలో ప్రభుత్వం మీద విమర్శలు చేసి, లక్కి బాస్కర్‌ సినిమాలో బాస్కర్‌ తప్పుకొని సానుభూతిని పొందినట్లు పొందాలని చూస్తున్నారు. ఇదే పవన్‌ నయా రాజకీయం. ఎప్పుడైనా ఆయన వేరు కుంపటి ఖాయం. అందువల్ల ముందే తెలుగుదేశం తేరుకోవడం అవసరం.

అంకెల గారడీలు తప్ప తెలుగు రాష్ట్రాలకు తప్పని వివక్ష

రైల్వే బడ్జెట్‌లో కొత్తగా తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు లేవు

కొన్నేళ్లుగా సాగుతున్న ప్రాజెక్టులకే కేటాయింపులు

నూటికి నూరుశాతం విద్యుద్దీకరణ సాధించిన ద.మ.రైల్వే

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ విస్తరణకు మొండి చేయి

అవసరాలకు అనుగుణంగా లేని కేటాయింపులు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఈసారి రైల్వే బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వేకి (రెండు తెలుగు రాష్ట్రాలు) రూ.14,754కోట్లు కేటా యింపులు జరిగాయి. వీటిలో రూ.9417కోట్లు ఆంధ్రకు, రూ.5337కోట్లు తెలంగాణకు కేటా యించారు. రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులకు పెట్టుబడులు రూ.84,559కోట్లకు చేరుకోగా అదే తెలంగాణలో రూ.41677 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలపడం గమనార్హం. దక్షిణమధ్య రైల్వే పరిధి ఆంధ్ర, తె లంగాణ రాష్ట్రాల్లో విస్తరించింది. ఇప్పటివరకు నూటికి నూరుశాతం విద్యుద్దీకరణ పూర్తికావడమే కాదు, కవచ్‌ అమలు చేయడంలో దేశంలోనే మిగిలిన రైల్వేలతో పోలిస్తే లీడర్‌గా కొనసాగు తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఐదు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఇవి ఏడు జిల్లా లను అనుసంధానిస్తూ 9 స్టాపేజ్‌లు కలిగివున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు

ఈసారి రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఏకంగా రూ.9417కోట్లు కేటాయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ విలేకర్లకు చెప్పడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇందులో అంకెల గారడీ తప్ప కొత్తగా రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్టులు లేదా రైల్వే లైన్లు లేవని, గతంలో కొనసాగుతున్న వాటి ఖర్చును కలిపి ఇంతమొత్తం కేటాయించామని చెప్పినట్టు బాగా పరిశీలిస్తే అర్థమవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న నంబూరు`ఎర్రుపా లెం రైల్వేలైన్‌ నిర్మాణానికి రూ.2245కోట్ల ఖర్చుతో కేంద్రం ఆమోదం తెలిపిందని ఎంతగానో ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే. విచిత్రంగా ఈ బడ్జెట్‌లో దీనికి కేటాయింపుల ఊసే లేదు. అంటే కేంద్రం ఈ రైల్వేలైన్‌ పట్ల సానుకూలంగా లేదన్న సత్యం అవగతమవుతుంది. వచ్చే నాలుగేళ్ల కాలంలో ఈప్రాజెక్టు పూర్తవుతుందని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఊదరకొడుతోంది.మరి కేటాయింపుల దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కేదీ స్పష్టం కావడంలేదు. నిజం చెప్పాలంటే దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న ప్రాజెక్టులకే నిధులు కేటాయించలేదు..ఇక కొత్త ప్రాజెక్టులకు దిక్కెక్కడ అనేది స్పష్టమవుతోంది.

విజయవాడాఖరగ్‌పూర్‌, విజయవాడానాగ్‌పూర్‌ ఫ్రైట్‌ డెడికేటెడ్‌ కారిడార్లు, తిరుపతి కేంద్రంగాబాలాజీ డివిజన్‌ ఏర్పాటు, విజయవాడాగూడూరు నాలుగోలైన్‌, కడపాబెంగళూరు రైల్వేలైన్‌ అలైన్‌మెంట్ల గతేంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి! ఇక విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి రైల్వేస్టేషన్లను రూ.1132.43కోట్లతో ఆధునికీకరిస్తున్నట్టు చెప్పారు. నిజమే ఇవి నేటి బడ్జె ట్‌కు సంబంధించినవి కావు. రెండేళ్ల క్రింతం నుంచే వీటి ఆధునికీకరణ పనులు కొనసాగుతు న్నాయన్న సత్యం గుర్తించాలి. రాష్ట్రంలో 1700 కిలోమీటర్ల పరిధిలో కవచ్‌ ప్రాజెక్టులు చేపడతామని, ఇప్పటికే 130 కిలోమీటర్ల పరిధిలో కవచ్‌ పూర్తిచేసినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు కూడా గతకాలం నుంచి అమలు చేస్తున్నదే. ప్రస్తుతం రూ.85వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను కొనసాగిస్తున్నందువల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఇక కొత్త ప్రాజెక్టులేవీ ఇవ్వడంలేదన్న సత్యాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన రూ.9417కోట్లు 2024ా25 రైల్వే బడ్జెట్‌లో కేటాయించిన రూ.9138 కోట్లతో పోలిస్తే కేవలం రూ.279 కోట్లు అదనం అంతే! నిజానికి ఈ మొత్తం ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను ఈ ఏడాది కొనసాగించేందుకు సరిపోతాయి అంతే!

కాకినాడాపిఠాపురం, మాచర్లానల్గండ, కంభరాప్రొద్దుటూరు, గూడూరుాదుగ్గరాజపట్నం, కొండపల్లిాకొత్తగూడెం, భద్రాచలరాకొవ్వూరు, జగ్గయ్యపేటామేళ్లచెర్వు లైన్లకు కేటాయింపులు ఎక్కడ? కడపాబెంగళూరు (255కి.మి.) రైల్వేలైన్‌ విషయంలో కూడా కేంద్రం ముఖం చాటేసింది. కోటిపల్లిానర్సాపురం, నడికుడిాశ్రీకాళహస్తి, డోన్‌ాఅంకోలా రైల్వేలైన్ల ఊసేలేదు. ఇక రైల్వే మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్‌భారత్‌ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నా మని చెప్పారు. నిజమే కాని ఇవి కూడా గత రెండేళ్లుగా కొనసాగుతున్నవే. ఏతావాతా చెప్పాలం టే ఈఏడాది రైల్వేబడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచెయ్యి చూపిందనే చెప్పాలి.

తెలంగాణ పరిస్థితి అంతే…

గత ఏడాది రైల్వే బడ్జెట్‌తో పోలిస్తే తెలంగాణకు కేవలం ఒక్క కోటి రూపాయలు అదనంగా కే టాయింపు జరిగింది. అంటే గత ఏడాది రూ.5336 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.5337కోట్లు కేటయించి చేతులు దులుపుకుంది. ఆంధ్రప్రదేశ్‌కే గుడ్డిలో మెల్ల అన్నట్లు గత ఏడాదితో పోలిస్తే రూ.279కోట్లు అదనంగా కేటాయిస్తే, తెలంగాణకు ఘోరంగా రూ.కోటి మాత్రమే అదనంగా కేటాయించింది. రాష్ట్రంలో నూటికి నూరుశాతం విద్యుదీకరణ పూర్తయిందని చెబుతూనే గత కొన్నే ళ్లుగా తెలంగాణకు కేటాయింపులు స్థిరంగా పెరుగుతున్న సంగతి గుర్తుచేశారు. కానీ పెరుగు తున్న జనాభా అవసరాలకు ఈ కేటాయింపులకు ఎంతమాత్రం పొంత వుండటంలేదు. మంత్రి చెప్పిన ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల విస్తరణకు ఇప్పటివరకు రూ.41677 కో ట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఈ మొత్తాలు గత కొన్నేళ్లుగా చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించినవి తప్ప కొత్తవి కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం తెలంగాణలో 627 కిలోమీటర్ల మేర కవచ్‌ అమలు జరుగుతుండగా మరో 1100 కిలోమీటర్లకు టెండర్లను ఆహ్వానించగా, ఇంకా 1326 కిలోమీటర్లకు కవచ్‌ మంజూరైంది. తెలంగాణలో 2529 కిలోమీటర్ల మేర, 22 ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. వీటికి అయ్యే ఖర్చు రూ.39,300 కోట్లు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి రూ.1992కోట్లతో కొనసాగుతోంది. 7వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను ఆధునికీకరించారు. ఇవన్నీ గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టులే. కానీ రాష్ట్రానికి ఈ బడ్జెట్‌ లో కొత్త ప్రాజెక్టులకు ఆమోదం లభించిందేమీ లేదు. బడ్జెట్‌ కేటాయింపులు కూడా ఆయా ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో భాగంగానే ఈ మంజూరయ్యాయి.

పుణ్యక్షేత్రాలకు అనుసంధానత ఏదీ?

భద్రాచలం, మేడారం, రామప్ప వంటి పుణ్యక్షేత్రాలున్న జిల్లాలకు, వనపర్తి, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, కొడంగల్‌, పరిగి, నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ వంటి వెనుకబడిన ప్రాంతాలకు, నిర్మల్‌, ఇచ్చోడ వంటి అటవీ ప్రాంతాలకు ఇంతవరకు రైలు అనుసంధానతే లేదు. రాష్ట్రంలో లక్షకు పైగా జనాభా వున్న పట్టణాలను రైల్వేలతో అనుసంధానిస్తానని కేంద్రం గతంలో చేసిన ప్రకటన ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక కేంద్రం మంజూరు చేసిన ఫైనల్‌ లకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) ప్రాజెక్టుల సంఖ్య గత పదేళ్లలో చాలా పెరిగింది. నిధుల కేటాయింపులు పెరుగుతున్నా పెరుగుతున్న అవసరాలకు వీటికి అసలు పొంతనే వుండటంలేదు.

2010లో వికారాబాద్‌ాకృష్ణా (నారాయణపేట జిల్లా) 121 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టుకు స ర్వే మంజూరైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.787కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2012మార్చిలో రైల్వే బోర్డుకు నివేదిక ఇచ్చారు.2023 సెప్టెంబర్‌ 23న సర్వే మంజూరైంది. ఇప్పుడు ప్రాజెక్టు ప్రాథమిక అంచనా రూ.2196కోట్లకు చేరుకుంది. ఇది పూర్తయితే దక్షిణ తెలంగాణ లోని కొత్త ప్రాంతాలకు రైలు అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్‌కు ప్రయాణ సదుపాయం, తాండూరు సిమెంట్‌ పరిశ్రమకు సరఫరాలు సులభతరం కాగలవు. అంతేకాదు వికారాబాద్‌ నుంచి హుబ్లి, కొల్హాపూర్‌, గోవాలకు దూరం తగ్గుతుంది. మంజూరై ఇంతకాలమైనా ఇంకా సర్వేకు అతీగతీ లేదు. శంషాబాద్‌ావిజయవాడ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌కు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఇది పూర్తయితే రైళ్లు గరిష్టగా రూ.220కి.మీ వేగంతో ప్రయాణించగలవు. దీని సర్వే కొనసాగుతోంది. కరీంనగర్‌ాహసన్‌పర్తి రైల్వేలైన్‌ (62కి.మీ) కొత్త రైల్వే మార్గం కోసం 2011లో మంజూరైతే 2013లో రైల్వే బోర్డుకు చేరింది. అప్పటి అంచనా వ్యయం రూ.464 కోట్లు. మరి ఇప్పుడు రూ.1116 కోట్లకు పెరిగింది. ఇదెప్పుటకి పూర్తయ్యేనో తెలియదు. రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు అనుబంధంగా రీజినల్‌ రింగ్‌ లైన్‌ను కేంద్రం ప్రకటించింది. దీని సర్వే కోసం రూ.14కోట్లు కేటాయింపు కూడా జరిగింది. ఇది ఇంకా మొదలు కాలేదు. 564 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు ంచనా వ్యయం రూ.12408కోట్లు!

హైద్రాబాద్‌ రెండోదశ మెట్రో ఆశలపై నీళ్లు

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైదరాబాద్‌ రెండో దశ మెట్రో ఊసే లేకపోవడంతో తెలంగాణ వాసులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత బడ్జెట్‌లో చెన్నై మెట్రో విస్తరణకు నిధులు కేటాయించారు. ఈసారి హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు నిధులు,అనుమతులు వస్తాయనుకున్న వారి ఆశ లపై నీళ్లు చల్లుతూ ఎటువంటి కేటాయింపులూ జరపలేదు. రాష్ట్ర ప్రభుత్వం 74.6 కిలోమీటర్ల మెట్రో కేరిడార్‌తో డి.పి.ఒ. రూపొందించింది. దీని తర్వాత ఫోర్త్‌ సిటీ, నార్త్‌సిటీల ప్రాజెక్టులను కూడా రెండో దశలో బాగంగా చేర్చి 161.4 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్లు రూపకల్పన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌ కింద ఈ ప్రాజెక్టులను ప్రారంభించాల్సి వుంది. మొదటి ఐదు కారిడార్లకు రూ.24వేల కోట్లు (సుమారుగా) ఖ ర్చు కాగలదని అంచనాలు వేశారు. వీటికి కేంద్రం సావరిన్‌ గ్యారంటీతో పాటు రూ.4230కోట్లు తన వాటాగా కేటాయించాల్సి వుంది. కానీ రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు. గతంలో చెన్నైకి అడగకుండానే నిధులు కేటాయించిన కేంద్రం, ఇప్పుడు తెలం గాణ పట్ల తీవ్ర వివక్షను చూపుతున్నదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అయితే అధికార్లు చెప్పే ది మరోలా వుంది. మెట్రో గురించి కేంద్రం ప్రత్యేకంగా బడ్జెట్‌లో ప్రస్తావించాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక్కసారి కేంద్రం ఆమోదం లభిస్తే అన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయంటున్నారు. రెండోదశ కేరిడార్‌ నిధులు సమస్యే కాదని, కేవలం సావరిన్‌ గ్యారంటీ రావడమే కష్టమని చె బుతున్నారు. నిజానిజాలు బయటపడాలంటే వేచి చూడాల్సిందే!

సజావు పాలనకు ప్రధాన అడ్డంకిగా స్వార్థపూరిత ఎమ్మెల్యేలు

పార్టీల కొంప ముంచుతున్న ఫిరాయింపులు

ప్రజాస్వామ్యానికి జాడ్యంగా మారిన ఫిరాయింపులు

ప్రజల పేరు చెప్పి అడ్డగోలు రాజకీయం

ఉన్న ప్రశాంతతను ధ్వంసం చేయడంలో సిద్ధహస్తులు

నడిచేవారికి కాళ్లడ్డం పెట్టే రాజకీయం

రాష్ట్ర ప్రగతికి వీరే ప్రధాన అడ్డంకి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దగ్గరినుంచి ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపులు యదేచ్ఛగా కొనసా గుతుండటం గమనార్హం. చేరికలు కొనసాగిన పార్టీ మరింత బలంగా, వలసలకు గురైన పార్టీ బలహీనపడటం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఈ ఆయారాం గయారాంల సమస్య మన రాష్ట్రానికే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న తంతే! అ యితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన బి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి మారడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నిజానికి కె.సి.ఆర్‌.అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వలసనలనుబాగా ప్రోత్సహించి తెలుగుదేశం ఆనవాళ్లు రాష్ట్రంలో లేకుండా చేయగలిగారు. అదేవిధంగా కాంగ్రెస్‌నుంచి కూడా తమపార్టీలోకి పెద్దసంఖ్యలో నాయకులను చేర్చుకోవడం ద్వారా ఆపార్టీని దెబ్బతీయాలనుకున్నారు కానీ, దీని ఫలితం బి.జె.పి.రూపంలో కనిపించింది. కాంగ్రెస్‌ పూర్తిగా బలహీనపడిన స్థితిలో బి.ఆర్‌.ఎస్‌.కు. ఆశ్చర్యకరంగా భారతీయ జనతాపార్టీ బలమైన ప్రత్యర్థిగా ఎదగడం చూశాం. తర్వాత అనూహ్య పరిణామల్లో రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ పుంజుకో వడమే కాదు ఏకంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, బి.ఆర్‌.ఎస్‌. తీవ్రంగా నష్టపోవడం కూడా తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామాలు.

ఇక గతంలో కె.సి.ఆర్‌. అనుసరించిన వైఖరినే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ కూడా అనుసరిం చారు. ఫలితంగా బి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో కేవలం నలుగురు ఎమ్మెల్యేల మెజారిటీ వున్న కాంగ్రెస్‌ తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. ఏపార్టీ అధికారంలో వున్నప్పటికీ అవకాశ వాద ఎమ్మెల్యేల కారణంగా ఆయా పార్టీల సుస్థిరతకు, సజావుపాలనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీరివల్ల ప్రభుత్వాన్ని ఏర్పరచిన పార్టీ అధికారం నిలబెట్టుకోవడానికే ఎక్కువ గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడి పాలన కుంటుపడటం సర్వసాధారణమైపోయింది. ఇదిలావుండగా ఈవిధంగా ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసం పార్టీలు మారడం ఎంతవరకు సబబు అన్నది ప్రశ్న. తాము ఎన్నికల్లో పాల్గన్నప్పుడు ఒక పార్టీ తరపున పోటీచేసి తర్వాత మరో పార్టీలోకి చేరిపోవడమంటే నియోజకవర్గ ప్రజలను మోసం చేయడమే! ఎందుకంటే ప్రజలు ఒక పార్టీపట్ల అభిమానంతో ఓట్లు వేస్తే, వారి విశ్వాసాన్ని వమ్ము చేయడం తప్ప మరోటి కాదు. ఎన్నికల్లో ప్రతి పార్టీ ప్రజలకు కొన్ని హామీలనిస్తుంది. ఏ పార్టీ హామీలు నచ్చుతాయో దానికి ప్రజలు ఓట్లేస్తారు. మరిక్కడ జరుగుతున్నదేంటి? తాము గెలిపించిన ఎమ్మెల్యే వేరే పార్టీలోకి జంప్‌ అయితే తాము వేసిన ఓట్లకు విలువెక్కడుంది? తమ అభిప్రాయాన్ని తుంగలో తొక్కినట్టే కదా అన్న భావన ప్రజల్లో తప్పక కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని 1985లో ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం, ఒక పార్టీనుంచి రాజీనామా చేసిన, పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు చేసి నా, ఇండిపెండెంట్‌గా ఎన్నికై వేరే పార్టీలో చేరినా అటువంటి ప్రజాప్రతినిధులు తమ పదవులకు అనర్హులవుతారు. ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో 1/3వ వంతుమంది వేరే పార్టీలో చేరాలనుకుంటే అప్పుడు వారికి ఈ చట్టం నుంచి మినహాయింపు లభిస్తుంది.వీరి విషయంలో స్పీకర్‌దే నిర్ణయాధికారంగా షెడ్యూలు పేర్కొంది. ఈ ‘మినహాయింపు’ను అడ్డం పెట్టుకొని అధికారం లో వున్న పార్టీలు స్పీకర్‌ సహాయంతో విపక్షాలనుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండటం ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలోనే బి.ఆర్‌.ఎస్‌.నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఈ చట్టం యొక్క ప్రభావశీలత చర్చనీయాంశంగా మారింది. మొత్తంమీద చెప్పాలంటే ఫిరాయింపుల చట్టంలోని లసుగులు, చర్యలు తీసుకోలేని విపక్షాలబలహీనత, కోర్టు తీర్పుల్లో విపరీత జాప్యం వెరసి ఈ ఫిరాయింపులు యదేచ్ఛగా కొనసాగడానికిదోహదం చేస్తున్నాయి.

ప్రజాప్రతినిధులు ఎవరైనా తాను ఏ ‘వేదిక’ (పార్టీని) ఆధారంగా చేసుకొని ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తారో ఆ పార్టీకే కట్టుబడి వుండాలన్నది ప్రజాస్వామ్య సూత్రాల్లోని కీలక అంశం. కానీ ఈ ఫిరాయిపులు ఓటర్ల నమ్మకాన్ని, ప్రజాస్వామిక విలువలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. ఒక పార్టీనుంచి మరో పార్టీకి అలవోకగా మారిపోయే ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరించేలా చట్టాలకు మరింత పదును పెట్టాలని ఇటు పౌరులు, పౌరసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా తమకు ఒక పార్టీపట్ల విశ్వాసాన్ని లేదా నమ్మకాన్ని తామెన్నుకున్న ఎమ్మెల్యేలు పూర్తిగా ధ్వంసం చేస్తున్నారన్న ఆగ్రహావేశాలు ఆయా నియోజకవర్గాల పౌరుల్లో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇది నిజంగా ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం. 

పార్టీలు మారేసమయంలో, తమన నియోజకవర్గ అభివృద్ధికోసమే పార్టీ మారుతున్నామంటూ గంభీర ప్రకటనలు ఇవ్వడం రివాజుగా మారింది. కానీ అసలు కారణం మాత్రం, వ్యక్తిగత కాంట్రా క్టులు, వ్యాపారాలను రక్షించుకోవడం, తమ దందాలను నిరాటంకంగా కొనసాగించుకోవడం. ఇదే వారి దృష్టిలో నియోజకవర్గ అభివృద్ధి! తమ వ్యక్తిగత లాభనష్టాలను బేరీజు వేసుకొని పార్టీలు మారేవారిని ప్రజలు ఎన్నుకోకూడదు. ఎందుకని అది జరగడంలేదంటే…చాలామంది తమ ఓటును అమ్ముకోవడంవల్ల! ఓటు అమ్ముకున్నవాడికి ఎమ్మెల్యేను ప్రశ్నించే అధికారం వుండదన్న కొత్త సిద్ధాంతం పుట్టుకొచ్చింది. అంటే ఓట్లకోసం ఖర్చురూపంలో పెట్టిన పెట్టుబడిని, ఎన్నికైన త ర్వాత లాభంతో సహా రాబట్టుకోవాలి. ఇది చాలామంది ఎమ్మెల్యేల వైఖరి! ఇక్కడ సిద్ధాంతం లే దా పార్టీ అనేది ముఖ్యం కాదు. తాము పెట్టిన పెట్టుబడిపై ఇబ్బడి ముబ్బడి లాభాలు ఎట్లా పొందాలనేది కీలకం. ఇంకెక్కడి ప్రజాస్వామ్య విలువ? ఆవిధంగా అది ‘పెట్టుబడి`లాభం’ అనే సి ద్ధాంతం కింద భూస్థాపితమైపోయింది. 

1967లో హర్యానాకు చెందిన గయారాం లాల్‌ అనే ఒక ఎమ్మెల్యే పదిహేను రోజుల్లో మూడు పార్టీలు మారి రికార్డు సృష్టించాడు! అప్పటినుంచి ‘ఆయారాం గయారాం’ అనే నానుడి ప్రచా రంలోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల రాజకీయాల్లో కులాలు బలమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ అంతిమంగా డబ్బుదే ఆధిపత్యం. దీనిముందు తన`పర అనే భేదం వుండటంలేదు. కులం అధికారా న్ని తెచ్చిపెడితే, డబ్బుపై వ్యామోహం, స్వార్థపరత్వం, అధికారంతో వచ్చిన కిరీటానికి ‘అవినీతి`అక్రమాలు’ కలికితురాయిగా వున్నాయి! ఒకరకంగా చెప్పాలంటే ఈ పార్టీ ఫిరాయింపులు, ప్రజాస్వామ్యమనే పొట్లకాయకు పట్టిన ‘బచ్చుపురుగు’ (గొంగళిపురుగు) మాదిరిగా తయారయ్యాయి. ఇది ఒక్క తెలంగాణకే పరిమితం కాదు మిగిలిన రాష్ట్రాలు/దేశ రాజకీయాల్లో కూడా జరుగుతున్నదిదే. కొందరు ఎమ్మెల్యేలు తమ స్వార్థంకోసం లేదా తమ స్వప్రయోజనాల పరిరక్షణకోసం, నియోజకవర్గ అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించినప్పుడు, సదరు పార్టీ అధికారాన్ని కోల్పోతే పరిస్థితేంటి? అప్పటివరకు ఆ పార్టీ అమలు జరుపుతున్న సంక్షేమ/అభివృద్ధి పథకాలు, విధానాలు ఒక్కసారిగా నిలిచిపోతాయి. ఈ కప్పదాటు ఎమ్మెల్యేల పుణ్యమాని మరోపార్టీ అధికారంలోకి వస్తేఆపార్టీ తనవంటూ కొత్త విధానాలు మొదలుపెడుతుంది. అప్పుడు పరిపాలనకు ఒక అర్థమం టూ వుండదు. ప్రజాస్వామ్యంలో వున్న ప్రధాన లోపమిది. ‘తోక శరీరాన్ని ఊపిన చందంగా’ ఇటువంటి ఫిరాయింపుదార్లు ప్రభుత్వాలను శాసించే స్థితి కొనసాగడాన్ని మించిన దౌర్భాగ్యస్థితి మరోటుండదు!

ప్రజలకోసమే, అభివృద్ధి కోసమే పార్టీలు మారుతున్నామని చెప్పుకునే ఇటువంటి ఎమ్మెల్యేలకు ఎప్పుడు ఏ పార్టీ అధినేత దేవుడవుతాడో లేక దయ్యమవుతాడో వాళ్లకే తెలియదు. తమకు ఇబ్బంది లేకుండా చూసుకునే పార్టీ అధినేత వీరికి దేవుడు! మరి అదే నాయకుడు కొంచెం కఠినమైన విధానాలు తీసుకొస్తే రాత్రికి రాత్రే ఆయన వీరి దృష్టిలో ‘దయ్యమై’పోతాడు. ప్రస్తుతం తెలంగాణ లో ఇష్టంవచ్చినట్టు పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు ఇందుకు గొప్ప ఉదాహరణ. బీఆర్‌ఎస్‌లో ఉన్నంతకాలం ‘కె.సి.ఆర్‌’ వీరికి దేవుడు! ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత ‘రేవంత్‌’ దేవుడు. మరి రేవంత్‌ దేవుడు హైడ్రాను తీసుకొచ్చి కచ్చితంగా విధానాలను అమలు చేస్తుంటే వీరికి ‘ఎక్కడో’ గుచ్చుకుంది. ఇంకేం ఇక ముంచుడు రాజకీయాలు షురూ! ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఇదే రాజకీయం నడుస్తోంది! మరి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళతారా? అది తప్ప మరోపార్టీ దిక్కులేదు! ఒకప్పుడు కె.సి.ఆర్‌.ను దేవుడని పొగిడి, కాంగ్రెస్‌లో చేరినతర్వాత ఆయనపై దుమ్మెతిపోసి, ఇప్పుడు మళ్లీ ‘నువ్వు తప్ప దిక్కులేదు’ అని ఏ ముఖం పెట్టుకొని వెళతారు? ఇదిలావుండగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి హుటాహుటిన ఢల్లీికి వెళుతున్నారు. అధిష్టానం ఏం చెబుతుందో, వీరేం వింటారో అక్కడే తేలుతుంది. అధిష్టానం చెప్పుడు మాటలకే ప్రాధాన్యమిస్తే పార్టీ పుట్టిమునగడం ఖాయం! రేవంత్‌ వంటి సమర్థ నాయకుడు పార్టీలో లేడు! చెప్పుడు మాటలు మోసే నాయకులకు పార్టీని నడిపే సత్తా అసలు లేదు. 

ఇక కె.సి.ఆర్‌. విషయానికి వస్తే కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు నిద్రబోతున్న సింహాన్ని తట్టిలేపాయి. ఆయన చిన్నగా జూలు విదిల్చి దెబ్బకొడితే తిరుగుండదని హెచ్చరించడమే కాదు, బహిరంగ సభలకు ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నారు. మాటల మాంత్రికుడు రంగంలోకి దిగితే పరిస్థితి వేరుగా వుంటుంది! రేవంత్‌ కూడా సమర్థవంతమైన మడమతిప్పని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఢీ అంటే ఢీ అంటూ వచ్చే స్థానిక ఎన్నికల్లో తమ మంది మార్బలంతో రంగంలోకి దిగితే తెలంగాణ రాజకీయాల్లో ఆ కిక్కే వేరబ్బా!

సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

అరెస్ట్ లు ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనం

నర్సంపేట,నేటిధాత్రి:

తాజా మాజీ సర్పంచులు గ్రామాల అభివృద్ధి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సర్పంచ్ ల ఫోరం వరంగల్ జిల్లా నాయకులు తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఆ బిల్లులు ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ లో సచివాలయం వద్ద శాంతియుతంఘా జరిగే నిరసన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమానికి హైదరాబాద్ మాజీ సర్పంచ్లు బయలుదేరారు.ఈ నేపథ్యంలో వారిని దుగ్గొండి పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్, తొగర్రాయి సర్పంచ్ ఓడేటి తిరుపతి రెడ్డి, ముద్దునూర్ సర్పంచ్ రేవూరి సురేందర్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. సర్పంచులను ముందస్తు అరెస్ట్ చేసి గొంతును నొక్కిపట్టి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా పోలీసులు వ్యవహరించడం తీరు మంచిది కాదని అన్నారు.ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే పెండింగ్ బిల్లు చెల్లిస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేసి నేడు మంత్రి సీతక్క కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 12,000 మంది సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తూ రోజుకు ఒకచోట ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఏర్పడుతున్న పట్టింపు లేనట్టు ముసలి కన్నీరు కారుస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

క్రమంగా పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు

`ఇప్పటికీ మహిళల ఆత్మహత్యలే అధికం

`స్త్రీపురుషుల ఆత్మహత్యలు పెరిగితే సమాజానికి నష్టం

`గృహహింసను అరికట్టేందుకు మరో మార్గం అవసరమేమో?

`మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరం

`ఆధిపత్య ధోరణే అనర్థాలకు మూలం

`ఆనందం కావాలంటే కుటుంబంలో ప్రేమ అవసరం

`ప్రేమ మాత్రమే కుటుంబాన్ని బంధించే బలీయమైన బంధం

`అహంకారాన్ని వదిలేస్తే మిగిలేది సంతోషమే

`దీన్ని గుర్తిస్తే జీవితం స్వర్గమయం లేదంటే నరక ప్రాయం
హైదరాబాద్‌,నేటిధాత్రి:
వైవాహిక సంబంధాల సమస్యల కారణంగా ఏటా సగటున మనదేశంలో లక్షమంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండు నెలల క్రితం బెంగళూరులో అతుల్‌ సుభాష్‌ (35) ఆ త్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సోషల్‌మీడియామరియు టెలివిజన్‌ యాంకర్లు పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కథనాలు రూపొందించడం, ప్రసారం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా పురుష హక్కుల కా ర్యకర్తలు (మెన్స్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌) ఈ పెరుగుతున్న ఆత్మహత్యలకు దేశంలో లింగ వివక్షతో కూడి, స్త్రీ అనుకూల చట్టాలే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ న్యాయసం హిత (బీఎన్‌ఎస్‌)లోని 85, 86 సెక్షన్లను (పూర్వపు ఇండియన్‌ పీనల్‌కోడ్‌లోని 498ఎ సెక్షన్‌)ను ‘లింగ తాటస్త్యం’ (జండర్‌ న్యూట్రల్‌)గా మార్పు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మహిళలపై, భర్త మరియు అతని కుటుంబ సభ్యులు పాల్పడే గృహహింసకు సంబంధించి ఈ సెక్షన్లను రూపొందించారు. ‘స్త్రీవాదం’, ‘మహిళా సాధికారత’ అనేవి ఇప్పుడు వికృతస్థాయికి చేరుకొని,ఏకంగా భార్యలే, భర్తలను ఆత్మహత్యలు చేసుకునేలా పురిగొల్పే దశకు సమాజాన్ని తీసుకెళ్లాయని వారు గగ్గోలు పెడుతున్నారు.
అయితే భారత ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వీరు చెబుతున్న అంశాలకు భిన్నంగా వుండటం గమనార్హం. ఇప్పటికీ దేశంలో సింహభాగం మహిళలు తీవ్ర వివక్షకు గురవుతూనే వున్నారని ప్ర భుత్వం వాదిస్తోంది. లైంగిక దాడులు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, బహిరంగ ప్రదేశాల్లోమహిళల వేధింపులు, గృహహింస, వరకట్నహత్యలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే దేశంలో మహిళలపై జరిగే హింసాత్మక సంఘటల్లో పెద్దగా మార్పు లేదన్న సంగతి స్పష్టమవు తుంది.
ఆత్మహత్యలకు కారణాలు
పరిశీలిస్తే సాధారణంగా ఆత్మహత్యలకు ఏదో ఒక్క బలీయమైన అంశం మాత్రమే కారణంగా వుంటుంది. సామాజిక, సాంస్కృతిక, వ్యవస్థీకృత మరియు ఆర్థిక కారణాలు ఇందుకు ప్రేరేపిస్తా యి. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌.సి.ఆర్‌.బి) రికార్డులను పరిశీలిస్తే పై కారణాల్లో ఏదో కొటి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్‌.సి.ఆర్‌.బి. డేటాను పరిశీలిస్తే ఈ ఆత్మహత్యల సంఘటనల విషయంలో విభిన్న పోకడలు కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
2015-22 మధ్య కాలంలో అంటే ఎనిమిదేళ్ల కాలంలో ఏటా సగటున 1,01,188 మంది పు రుషులు ఆత్మహత్యలకు పాల్పడితే, 43,314 మంది మహిళలు మాత్రమే బలవన్మరణాలకు గురికావడం గమనార్హం. ప్రతి లక్షమంది పురుషుల్లో ఈ ఆత్మహత్యల రేటు 14.2% వుంటే, మహిళల్లో ప్రతి లక్షమందికి 6.6%గా వుంది. భారత్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం కుటుంబ సమస్యలే! మొత్తం ఆత్మహత్యల్లో ఈ కారణంగా జరిగే ఆత్మహత్యలు 23.06%గా వుంటున్నాయి. అయితే ఈవిధంగా ప్రేరేపిస్తున్న కుటుంబ సమస్యలేంటో ఎన్‌.సి.ఆర్‌.బి. స్పష్టంగా నిర్వచించలేదు. ఫలితంగా వీటిపై ఎవరికి అనుకూలమైన వ్యాఖ్యలు వారు చేస్తున్నారు. ఆత్మహత్యలకు రెండో అతిపెద్ద కారణం అనారోగ్యం. దీనివల్ల 23% ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
వైవాహిక సంబంధాలు
ఇక ఆత్మహత్యలకు కారణాల్లో వైవాహిక సంబంధాలు మూడోస్థానం ఆక్రమిస్తున్నాయి. వీటివల్ల పురుషుల్లో 3.28%, మహిలల్లో 9.66% ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. ఈ వైవాహిక సంబంధ ఆత్మహత్యలను ఎన్‌.సి.ఆర్‌.బి ఐదు సబ్‌గ్రూపులుగా విడగొట్టింది. అవి వరుసగా పెళ్లి కు దరకపోవడం, వరకట్న వివాదాలు, వివాహేతర సంబంధాలు, విడాకులు మరియు ఇతరాలు. ఈ సమస్యల కారణంగా ఈ ఎనిమిదేళ్ల కాలంలో (2015`22) 26,588మంది పురుషులు, 33,480మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీటిల్లో మహిళల్లో అత్యధిక సంఖ్యాకులు (14,250) మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం వరకట్నం! ఇక పురుషుల్లో పెళ్లి కుదరకపోవడం అత్యధిక ఆత్మహలకు (10,119) కారణమవుతోంది. ఇక్కడ పెళ్లి కుదరక పోవడం అనేదానికి స్పష్టమైన నిర్వచనం లేదు. అంటే అవివాహితులని అర్థం. తప్పుడు వాగ్దానాలు, మోసం లేదా ఆర్థికపరమైన దోపిడీ, వరకట్న డిమాండ్‌లు, బెదిరిపుంలు లేదా వేధింపులు వంటి కారణాలవల్ల వివాహం కాకపోవడం లేదా రద్దు జరిగినప్పుడు ఈ పెళ్లి కుదరక పోవడం అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. 2015`22 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 8,09,506 మందిపురుషులు ఆత్మహత్యలు చేసుకో గా వీరిలో రైతులు, రైతు కూలీల సంఖ్య 10%అంటే81,402. రైతుల్లో ఆత్మహత్యలకు ప్రధాన కారణం పంటలు దెబ్బతినడం. ఇక ఇందులో సబ్‌ కేటగిరీలేమీ లేవు.
ప్రమాదకరమైన పద్ధతులు
ఒక పరిశోధనా పత్రం ప్రకారం పురుషులు ఆత్మహత్యలకు అత్యంత ప్రమాదరకరమైన పద్ధతు లు అనుసరిస్తే, స్త్రీలు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ ఉన్నంతలో త్వరగా, తక్కువ క ష్టంతో ప్రాణంపోయే పద్ధతులను అనుసరిస్తున్నట్టు తేలింది. పురుషులో ఎంచుకునే ప్రమాదకర మైన విధానాల్లో రైలుకింద పడటం, సజీవదహనం వంటివి వుంటున్నాయి. ఇటువంటి కేసుల్లో తిరిగి బతికే అవకాశాలు చాలా తక్కువ. ఆత్మహత్యలకు పాల్పడానికి స్త్రీపురుషులు అనుసరించే విధానాల్లో తేడాలను స్పష్టంగా అవగాహన చేసుకుంటే, ఆత్మహత్యలనుంచి వారిని కాపాడే వ్యూ హాల్లో మార్పుల తేవడం లేదా కొత్త వ్యూహాలను అనుసరించడం చేయవచ్చు. నిద్రమాత్రలు, నీళ్ల లో దూకడం, విషం తాగడం వంటి ప్రక్రియల ద్వారా పదిమంది మహిళల్లో మరణాలు సంభవిస్తే, ఇవే పద్ధతుల్లో మరణించే పురుషుల సంఖ్య 21గా (10:21)గా వుంటోంది. ఇక వాహనాల కింద మరణించేవారి నిష్పత్తి 10:65 కాగా విద్యుత్‌ షాక్‌ వల్ల సంభవించే మరణాలు 10:35గా వుంటున్నాయి. ఈ నిష్పత్తులను పరిశీలిస్తే అధికశాతం మంది పురుషులు ఆత్మహత్యలకు మరింత హింసాత్మక పద్ధతులను అనుసరిస్తున్నట్టు తెలుస్తుంది. వీరిలో మరణాలరేటు అధికంగా నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో పురుషుల్లో ఆత్మహత్యలను నివారించ డం ఒక సవాలుగా మారింది.
498ఎ సెక్షన్‌
ఇండియన్‌ పీనల్‌కోడ్‌లో 498ఎ సెక్షన్‌ను ప్రభుత్వం 1983లో చేర్చింది. వైవాహిక పరమైన హింసనుంచి మహిళలకు రక్షణ కల్పించడమే ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టడం యొక్క ముఖ్యోద్దేశం. ముఖ్యంగా మహిళలపై భర్త, అతని కుటుంబ సభ్యులు, వేధింపులకు పాల్పడటం, భౌతిక హిం సలనుంచి రక్షణకల్పించడానికి ఈ సెక్షన్‌ను చేర్చారు. మరోరకంగా చెప్పాలంటే పితృస్వామ్య వ్య వస్థలో మహిళలకు రక్షణ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. తర్వాత ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లో ఈ సెక్షన్‌ను రెండుగా అంటే 85,86గా విడగొట్టారు. 85వ సె క్షన్‌ భర్త లేదా అతని బంధువు, హింసకు పాల్పడటాన్ని పేర్కొంటే, 86వ సెక్షన్‌ పాల్పడే వివిధ రకాల హింసల వివరాలను తెలియజేస్తుంది. ఏటా 498ఎ సెక్షన్‌ కింద లక్ష కేసులు నమోదవు తున్నాయి. ఎన్‌.సి.ఆర్‌.బి. డేటా ప్రకారం కేవలం 2022లో దేశంలో 1,40,019 కేసులు నమోదయ్యాయి. ఈ ఎనిమిదేళ్ల కాలంలో మహిళలపై భర్త అతని బంధువులు పాల్పడే హింస క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం. అయితే నేర నిరూపణ కేవలం 15.7% కేసుల్లో మాత్రమే జరుగుతోంది. మహిళా హక్కుల కార్యకర్తలకు ఈ 498ఎ సెక్షన్‌ ఆనందం కలిగించినా, నేర ని రూపణ కేసులు చాలా స్వల్పంగా వుండటం నిరుత్సాహం కలిగిస్తోంది. వ్యవస్థలో లోపమే ఇందుకు ప్రధాన కారణమన్నది వారి వాదన. అయితే పురుష హక్కుల కార్యకర్తలు చెప్పేదేమంటే, చాలా తక్కువ కేసుల్లో నేర నిరూపణ కావడం, పురుషులపై మహిళలు పెడుతున్న తప్పుడు కేసులు,వారిని వేధింపులకు గురిచేస్తున్నారనడానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.
సాక్ష్యాధారాల లేమి
నేర నిరూపణ కాకపోవడానికి ప్రధాన కారణం స్పష్టమైన సాక్ష్యాధారాలు లేకపోవడం. ముఖ్యం గా మానసిక హింసకు సంబంధించిన ఆధారాలు వుండటంలేదు. ఇతర సెక్షన్లు హత్య (సెక్షన్‌ 302), వరకట్న హత్య (సెక్షన్‌ 304బి)కు సంబంధించిన కేసుల్లో మాత్రమే నేర నిరూపణ జరుగుతోంది. 498ఎ సెక్షన్‌ కింద మహిళలు కేసు పెట్టాలంటే, వారికి సామాజికపరమైన సమస్య లు మరో అడ్డంకిగా వున్నాయి. ప్రధానంగా వీరిని అత్తగారింటికి రానీయరు. ఆర్థికపరమైన మద్దతు, ప్రత్యామ్నాయ వసతి లేనప్పుడు వారు నిలువనీడలేని దుస్థితిని ఎదుర్కొనాల్సి వుంటుంది. మరికొన్ని కేసుల్లో విడాకులు తీసుకోవడం ద్వారా వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నా రు. దీనివల్ల తమకు జరిగిన అన్యాయంపై పోరాడే పరిస్థితిలేకుండా పోతున్నది. ఇటువంటి పరిస్థితులు మహిళలను ముందుకెళ్లనీయడంలేదు.
కుటుంబాన్ని బంధించేది ‘ప్రేమ’ మాత్రమే
మొత్తంమీద చెప్పాలంటే భారతీయ సమాజంలో ఆలోచనా ధోరణులు, పోకడల్లో మార్పులు వస్తు న్నాయి. స్త్రీ లేదా పురుషుడు ఎవరికి అవకాశాలు వుంటే వారు తమ ఆధిపత్యాన్ని, హింసాత్మక ధోరణిని ప్రదర్శించడానికి వెనుకాడటంలేదు. వైవాహిక బంధంలో ప్రేమకు బదులు ఆధిపత్యం, అహంకార ధోరణులు పెరుగుతుండటం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మానసిక బలహీనులు, మానసికంగా దృఢంగా వుండేవారు స్త్రీపురుషులిద్దరిలో వుంటారు. సమాన ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన వైవాహిక జంటల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, విడాకులు, పరస్పర హింస అనేవి క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం. పితృస్వామ్యంలో పురుషులవల్ల, మాతృస్వా మ్యంలో మహిళల వల్ల హింసాత్మక ధోరణులు పెరుగుతుంటాయి. ఇక్కడ ఎవరు గొప్ప లేదా ఎవరి వల్ల ఎవరు బాధపడుతున్నారనేది కాదు ప్రశ్న! ఇద్దరిలో ఎవరు బలీయంగా, మానసికంగా దృఢంగా వుండి విపరీత ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తారో వారివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో స్త్రీ పురుషుడు అనే తేడా లేదు. మానసిక పరమైన భావోద్వేగాలు ఇద్దరికీ సమా నమే! జీవితంపై దృఢవిశ్వాసం వున్నవారు ఎదుటివారిని లెక్కచేయరు. ఫలితం సంఘర్షణ. ప్రస్తుతం వైవాహిక సంబంధాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం ఇదే! ‘ప్రేమ’, ‘కుటుంబం పట్ల మమకారం’, ఒకరి సంతోషంలో మరొకరు ఆనందం పొందే ప్రవృత్తి మాత్రమే ఈ హింసా ప్రవృత్తికి విరుగుడు. ఆధిపత్యం స్థానాన్ని సమర్పణభావం, హింస స్థానాన్ని అహింస, కోపం స్థానాన్ని ప్రేమ ఆక్రమిస్తే కుటుంబాలు శాంతిగా, ఆనందమయంగా కొనసాగుతాయి.

40 రోజుల కోడి..రోగాల పుట్ట!

`40రోజుల కోడీలో నాణ్యతఎంత? దానితో ఆరోగ్యమెంత?

`ఆరు నెలలకు ఎదగాల్సిన కోడి 40 రోజులకే కోతకొస్తోంది.

`జనాలకు రోగాలను మోసుకోస్తోంది.

`భయంకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తోంది.

`ఒకప్పుడు బయిలర్‌ కోడి దశ 180 రోజులు.

`తర్వాత కొంత కాలానికి 120 రోజులు.

`మరింత కాలం గడిచాక 80 రోజులు.

`ఇప్పుడు కేవలం 40 రోజులు.

`అదెలా సాధ్యం? ప్రాణాలతో చెలగాటం?

`గుడ్డు నుంచి కోడి వచ్చే కాలం పోయింది.

`గుడ్డే లేని పిల్ల తయారౌతోంది.

`భయంకరమైన మందుల వాడకంతో నెలకే కోతకు రెడీ అవుతోంది.

`ఆ మందుల ప్రభావం మన మీద పడుతోంది.

`ముఖ్యంగా ఆడ పిల్లల జీవితాలపై అధిక ప్రభావం చూపుతోంది.

`హార్మోన్ల సమతూకాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.

`క్లినికల్‌గా నిరూపణ అయ్యింది.

`అయినా మనమెందుకు ఊరుకుంటాం!

`కోడి కూర కొనుక్కొని తెచ్చుంటూనే వుంటాం.

`బిపి, షుగర్‌ల బారిన చిన్న వయసులోనే పడుతున్నాం.

`ఫ్యాట్‌ లెస్‌ వైట్‌ మీట్‌ అనుకుంటున్నాం!

`క్యాన్సర్‌ బారిన పడిపోతున్నాం!

`పేర్లు కూడా తెలియని రోగాలను తెచ్చుకుంటున్నాం.

`మటన్‌ ధరకు భయపడి చికెన్‌ అలవాటు చేసుకున్నారు.

`తక్కువ ధరకు వస్తోందని చికెన్‌ కోసం ఎగబడిపోతున్నాం.

`పౌల్ట్రీ లో చిరు రైతులు ఎప్పుడో చితికిపోయారు.

`కార్పోరేట్‌ పౌల్ట్రీకి భయపడి కోళ్ల పెంపకమే మానేశారు.

`ఏవి వైరస్‌ సోకిన కోళ్లో, ఏవి మంచి కోళ్లో కూడా చూసుకోకుండా కొంటున్నాం?

`షాపు వాడు ఇచ్చిందే చికెన్‌ అని రోజూ లొట్టలేసుకొని తింటున్నాం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  నాకు ముక్కలేనిదే ముద్ద దిగదు..ఈ మాట చాలా అనడం వింటుంటాం. అది ఎంతో గొప్పగాచెప్పుకుంటారు. సంపాదన దండిగా వున్నవారే కాదు,జిహ్వ చాపల్యం వున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి మాటలను చెబుతూవుంటారు. ఈ ముక్క చాలప్యంలో రకరకాలుంటాయి. మాంసాలలో రకరకాలు వున్నాయి. కాని వచ్చిన చిక్కల్లా కోడి మాంసంతోనే వస్తోంది. తంట అంతా ఆ ఫౌల్ట్రీ చికెన్‌తో వుంటోంది. చికెన్‌ మంచిది కాదనుకునేవారు ఎక్కువగా ఆది వారాలలో మటన్‌ తెచ్చుకుంటారు. కాని ఎక్కువ మంది చికెన్‌ ప్రియులుంటారు. ధర మటన్‌తో పోలిస్తే తక్కువ. ఒక్కసారి మటన్‌ తెచ్చుకునే ఖర్చుతో వారంలో మూడు రోజులు చికెన్‌ తినొచ్చనే ఆలోచన వున్నవారు కూడా చాలా మంది వుంటారు. ఆ మూడు రోజులతోపాటు మిగతా నాలుగు రోజులు కూడా ముక్కను భోజనంలోకి చేర్చుకుంటున్నారు. ఒకప్పుడు బంధువులొస్తేనో..లేక పంగడలొస్తేనో..గ్రామ దేవతలకు మొక్కుల కోసమో కోడి కూర తినేవారు. కాకపోతే అది నాటు కోడి. కాని ఇప్పుడు ఆ నాటు కోళ్ల జాడలేదు. పల్లెలు పెరిగి, పట్నాలు విస్తరించిన తర్వాత ఇంట్లో కోళ్లను పెంచుకునే పరిస్దితి లేదు. ప్రజలు వుండడానికే చోటు లేక అంతస్దుల మీద అంతస్తులతో నిర్మాణాలు చేసే అప్పార్టుమెంట్లలో జీవిస్తున్నారు. ఇలాంటి వారికి కోళ్లను పెంచుకోవడమేమో కాని, చూడడం కూడా కుదరదు. అలాంటి వాళ్లు ఖచ్చితంగా పౌల్ట్రీ చికెన్‌ మీద ఆదారపడతప్పదు. అదే తినక అసలే తప్పదు. నగరాల్లో నాటు కోళ్లు అమ్మకాలు ఎంత సాగినా, వాటి ధర కూడా మేక మాంసంతో సమానంగా వుంటుంది. అందువల్ల చికెన్‌ ప్రియులంతా పౌల్ట్రీ చికెన్‌ తినకతప్పదు. మరి మనం తింటున్న చికెన్‌ ఎంత మేలైంది. ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడేది. రుచి కోసం తింటున్నామా? లేక తినాలని తింటున్నామా? అన్నదికూడా తెలియకుండానే రోజూ ముక్క మీద ముక్క లాగిస్తున్నాం. కాని ఆ చికెన్‌ మూలంగా ఎన్ని అనర్ధాలు ఎదురౌతున్నాయో తెలిసిన వాళ్లే ఎక్కువా తింటున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు పౌల్రీ కోడి కూడా షెడ్డులలో ఆరు నెలలకు కోతకు వచ్చేది. ఆరు నెలల కాలం పాటు అది అన్ని రకాల జాగ్త్రత్తలో పెంచేవారు. కాని ఆ రైతులకు అది గిట్టుబాటు పెద్దగా లేకుండాపోయింది. పైగా డిమాండ్‌ అండ్‌ సప్లయ్‌లో వెనుకబడి పోయింది. దాంతో ఎప్పటికప్పుడు జరిగే పరిశోధనల్లో నాలుగు నెలల కోడి తయారైంది. దాంతో పౌల్ట్రీ షెడ్లను వ్యాపారులు పెంచుకున్నారు. పెట్టుబడికి తగిన లాభం వస్తుండడంతో చాలా మంది పౌల్ట్రీ వ్యాపారంలోకి దిగారు. తర్వాత కొంత కాలానికి మూడు నెలల కోడి పుట్టుకొచ్చింది. ఇంకేముంది రోగాలను కొంచెంకొంచెం మోసుకొచ్చే కోడి మన ఇంటికొచ్చింది. మన ఒంట్లోకి చేరడం మొదలైంది. ఒక దశలో మార్కెట్‌లో పప్పుదరల కన్నా చికెన్‌ధర తగ్గింది. ఆఖరురు ఉల్లి పాయల ధరకనా, కొన్ని సార్లు టమాట దరలకన్నా చికెన్‌ తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చింది. బ్లాక్‌ మార్కెట్‌ దారులు ఉల్లిపాయలు, టమాటలను బ్లాక్‌ చేయడమేమో కాని, ప్రజలకు చికెన్‌ తినడం మరింత అలవాటుగా మారింది. మూడు నెలల కోడి కాస్త రెండు నెలలకు వచ్చేసింది. రెండు నెలల్లో పెరిగి తినడానికి వీలుగా ఎదిగింది. ఇంకేముంది చికెన్‌ మార్కెట్‌ల్లో కార్పోరేట్‌ శక్తులు దూరిపోయాయి. కోడి పదిరోజుల్లో పెరిగే అవకాశం వున్నా పెంచే దుర్మార్గపు ప్రయత్నాలు చేసేందుకు గిజగారుతున్నారు. ఒకప్పుడు కోడి గుడ్డు నుంచి వచ్చే కోడి, ఇప్పుడు కృత్రిమంగానే పుడుతోంది. పెరిగిపెరక్క ముందే మార్కెట్‌లో మాయమైపోతోంది. వ్యాపారుల పంట పండిస్తోంది. జనం ప్రాణాల మీదకు తెస్తోంది. కోడి పిల్ల వ్యాపారుల చేతికి రాకముందు నుంచే మందులతో దాని జీవనం, పెంపకం మొదలౌతోంది. హోలిస్టిన్‌ అనే ఆంటి బయాటిక్‌ విపరీతంగా వినియోగించడం వల్ల మూడు నాలుగు నెలల్లో పెరగి, కోతకు రావాల్సిన కోడి నెలకే చేతికొస్తుంది. నలభై రోజుల్లో అమ్మకం జరిగిపోతుంది. ఇలాంటి చికెన్‌లకు బర్డ్‌ ఫ్లూ అనే భయంకరమైన జబ్బులు వస్తుంటాయి. కాని వాటిని వ్యాపారులు కప్పివుంచుతారు. బైట ప్రపంచానికి తెలియకుండా చేస్తారు. వాటిని తక్కువ ధరలకు మార్కెట్‌లోకి పంపిస్తారు. రిటైల్‌ వ్యాపారులు మనకు అంటగడుతూనే వుంటారు. మనం మటన్‌ షాపుల్లో మనకు ఎలాంటి మటన్‌ ఇస్తున్నారో మన కళ్లముందే కనిపిస్తుంది. దాని వాలకం చూసి కొనుక్కొవాలో వద్దో కూడా తేల్చుకునే అవకాశం వుంటుంది. ఎదురుగా వేళాడదీసిన మటన్‌కు చెందిన అవయవాలను మనం చూసి, అవసరమైతే క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేసుకుంటాం. కాని చికెన్‌లో ఆ అవకాశం వుండదు. ఆ చికెన్‌ ఎలా వుందనేది ఇంటికెళ్లి చూసుకుంటే కాని కనిపించదు. అందులోనూ లోపాలు మనకు అసలు తెలియవు. ఇలా ఆంటిబయాటిక్స్‌ విచ్చలవిడిగా కోళ్లకు ఇప్పించి పెంచే చికెన్‌ తినడం వల్ల మనలో అనేక అనారోగ్య సమస్యలు తయారౌతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అనేక అనర్దాలు జరుగుతున్నాయి. క్లినికల్‌గా రుజువు కూడా చేశారు. ఆడపిల్లల్లో హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌ ఎక్కువగా జరుగుతుందని తేలింది. అయినా మా పిల్లలకు చికెనే తింటారు. మటన్‌ తెస్తే తినరు అంటూ కొత్త కథలు కూడా చెబుతుంటారు. తాజాగా మన తెలుగు రాష్ట్రాలలో బర్డ్‌ ఫ్లూ విపరీతంగా పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపిలో ఉభయగోదావరి జిల్లాలో లక్షల కోళ్లను చంపేసి పూడ్చిపెడుతున్నారు. కొంత మంది వ్యాపారులు పంట కాలువల్లో వదిలేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వ్యాపారులు తీరని నష్టం ఏర్పడిరదని అంటున్నారే గాని, తమ వక్ర బుద్ది మూలంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నామని మాత్రం అనుకోడం లేదు. లాబాపేక్ష తప్ప, ప్రజల ప్రాణాలు పౌల్ట్రీ వ్యాపారులకు పట్టడం లేదు. కార్పోరేట్‌ పౌల్ట్రీ రంగం విస్తరించడంలో చిన్న చిన్న పౌల్ట్రీ రైతులు కనుమరుగయ్యారు. ఆ వ్యాపారం మీద బతికిన వాళ్లంతా దివాలా తీశారు. ఇతర వ్యాపారాలను ఎంచుకొని బతుకులీడుస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో గత పది రోజులుగా కోళ్లకు కొక్కెర వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. కొన్ని లక్షల కోళ్లు మృత్యు వాతపడ్డాయంటున్నారు. చికెన్‌ ప్రియులు జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది. ఎందుకంటే పాలకులు ఏదైనా శృతి మించేదాకా మేలుకొనరు. అనర్ధాలు జరిగేదాకా జాగ్రత్తపడరు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు. జనం ప్రాణాల మీదకు వచ్చినప్పుడే స్పందిస్తారు. వ్యాపారుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు మన ముందు చికెన్‌ తింటూ వారికి మేలు చేసే ప్రయత్నాలు చేస్తారు. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చూస్తూనే వున్నాయి. రాష్ట్రంలో కొక్కెర వ్యాధి తీవ్రంగా ప్రబలినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని లక్షల కోళ్లు చనిపోతున్నాయి. అయితే సహజంగా కోళ్లను రాత్రిళ్లు మాత్రమే రవాణా చేస్తుంటారు. చికెన్‌సెంటర్లుకు చేర్చుతుంటారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఏపిలోని ఉభయగోదావరి జిల్లాలతో సంబందం వుంటుంది. దాంతో అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు కొక్కెర వ్యాధి సోకిందంటున్నారు. కొన్ని కిలోమీటర్ల దూరంలో వున్న పామ్‌లకు కూడా ఈ వైరస్‌ సోకుతుంది. ఆ చికెన్‌ తినడం ఎంత మాత్రం మంచిది కాదు. మీడియా కూడా ఫౌల్ట్రీకి నష్టం జరుగుతుందనే చెబుతుందేతప్ప, ప్రజలను చైతన్యం చేయాలని చూసే రోజులు పోయాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా వుండడం ఎంతో మంచిది. కొంత కాలం చికెన్‌ తినపోతే జరిగే నష్టమేమీ లేదు. ఇప్పటికే చికెన్‌ మూలంగా సర్వ దరిద్రాలు మన ఒంట్లోకి వచ్చి చేరుతున్నాయి. గతంలో ఎవరికైనా బిపిలు, షుగర్‌లువుండేవి కాదు. మన వైద్యులు కూడా వైట్‌ ఆహార పదార్దాలు తినకూడదంటారు. అసలు బియ్యం, గోదుమలే తినకూడదంటారు. కాని రకరాల మందులతో తయారైన చికెన్‌ తినడం వల్ల కొలెస్ట్రాల్‌ రాదంటారు. కాని ఆ చికెన్‌ వల్లనే చిన్న వయసుల్లోనే బిపిలు, షుగర్‌లు వస్తున్నాయన్న సంగతిని దాచి పెడతారు. ఇలాంటి వారికి ఫార్మ కంపనీలు తోడౌతాయి. ఆ మందుల అమ్మకాలను పెంచుకుంటాయి. శరీరాలను గుళ్ల చేసే చికెన్‌ లాంటి ఆహారం తినమని నిపుణులే చెబుతుంటారు. రోగాలువచ్చాక ఫలానా మందులు తీసుకోవాలని సూచిస్తుంటారు. ప్రజల జీవితాలతో అందరూ కలిసి ఆడుకుంటారు. ఇదే మన ఖర్మ.

‘‘డాలర్‌’’ కలలు ‘‘ఢమాల్‌’’!

ఆవిరైన ఆశలు..కరిగిపోయిన కలలు.

-అమెరికా కలల్లో చేదు నిజాలను మిగిల్చుకున్నారు.

usa trump effect on Indians

-బరువెక్కిన గుండెలతో దేశం తిరిగి వస్తున్నారు.

-ఇష్టంగా కష్టాలు పడినా మిగిలిన కన్నీళ్లు.

-సప్త సముద్రాలు ఆవల సంపాదన.

-దూరపు కొండల నునుపు ఆలోచన.

-చెల్లా చెదురైన యువత భవిష్యత్తు.

-కడుపు కట్టుకొని తల్లిదండ్రులు రూపాయి రూపాయి పోగేసుకున్నారు.

-అప్పులు చేసి పిల్లలను అమెరికా పంపించారు.

-పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలలుగన్నారు.

-మా పిల్లలు అమెరికాలో వున్నారని గొప్పగా చెప్పుకున్నారు.

-గంపెడాశలతో వెళ్ళిన పిల్లలు వట్టి చేతులతో వస్తున్నారు.

-అమెరికాలో జీవితం అని కలల్లో తేలియాడారు.

-ఒక్కసారిగా కలలు చెదిరి తిరిగి వస్తున్నారు.

-ట్రంప్‌ వస్తే మరింత మేలనుకున్నారు.

-మొదటికే మోసం తెచ్చాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  ఓ మనిషి ఏమిటి నీ ఆలోచన. ఎక్కడికి నీ ప్రయాణం. అంటూ ఎవరి మనసైనా ఎప్పుడైనా అడుగుతూనే వుంటుంది. నా మనసలు అమెరిక చుట్టూ తిరుగుతుంది. నా ప్రయాణం అమెరికా వైపు వెళ్లమంటోందని సమాధానం చెప్పుకుంటూ జీవితం గడిపేవారు కొంత మంది. తమకు జీవితంలో దక్కని అవకాశం తన పిల్లల ద్వారా నైనా నెరవేర్చుకొని వారి సంతోషంలో తన ఆనందాన్ని చూసుకోవాలనుకునే ప్రతి తల్లిదండ్రులు అనుభవిస్తున్న సమస్యే. కాకపోతే ఒక దశలో తండ్రి ఆలోచన..చివరి దశలో అదే తండ్రి ఆవేదన ఎలా వుంటుందో కూడా అందరూ తెలుసుకోవాలి. గత ఓ ముప్పై సంవత్సరాల కాలంగా అమెరికా పిచ్చి అందరికీ పట్టుకున్నది. అది అన్ని వర్గాలకు పాకింది. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే అమెరికా వెళ్లడానికి ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇంజనీరింగ్‌ అయిపోయింది. ఎంఎస్‌ చేయాలనుకుంటున్నాడు. అమెరికాకు వెళ్లే ఏర్పాట్లుచేస్తున్నాం అని కొందరు. మా అబ్బాయిని ఎలాగైనా అమెరికా పంపించాలి. మా పక్కింటి వాళ్ల పిల్లలు ఇద్దరూ అమెరికాలోనే వుంటున్నారు. మా ముందు వాళ్లు ఫోజులు కొడుతున్నారు. మా పిల్లలను కూడా పంపించి వారికంటే మేమే గొప్ప అనిపించుకోవాలి అనుకుంటున్న తల్లిదండ్రులు. ఇక పిల్లల మందు బాగా చదువుకో…మన ఆ బంధువులు పిల్లలు అమెరికా వెళ్లారు. ఈ బంధువుల పిల్లలు అమెరికా వెళ్తున్నారు. వాళ్లను చూసైనా బుద్ది తెచ్చుకో..బాగా చదవుకో..నా పరువు నిలబెట్టు..అంటూ పిల్లలను చిన్నప్పటి నుంచే అమెరికా ఆశల పల్లకిని ఎక్కిస్తున్నాం. వాళ్లను చూసి మరి కొందరు…ఇలా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అందరూ అమెరికా జపం తప్ప, ఇక్కడే వుంటాం..ఇక్కడే చదువుకుంటాం..ఇక్కడే గొప్పగా బతుకుతాం అనేవారు లేకుండాపోతున్నారు. ఇక్కడ ఎంత గొప్పగా బతుకున్నా అది బతుకు కాదన్నంతగా జనం మారిపోతున్నారు. అమెరికాలో అంట్లు తోముకుంటూ బతికినా సరే అంత బంగారమైన బతుకు మరొకటి లేదన్నంతగా గొప్పలకు పోతున్నారు. రూపాయిలకన్నా, డాలర్‌ కలలు గొప్పగా వుంటాయనుకుంటారు. కనిపించని దేశాల వెంట పరుగులు తీస్తున్నారు. ఓ నలభై సంవత్సరా క్రితం అమెరికా అంటే అబ్బో అనుకునేవారు. కాని ఇప్పుడు గ్లోబలైజేషన్‌ మూలంగా అమెరికా కూడా మన పక్క ఊరే అన్నంత మాటల దూరం తగ్గిపోయింది. ఇబ్బంది కర కాలం మళ్లీ వచ్చింది. ట్రంప్‌ రూపంలో మళ్లీ చిక్కులు ఎదురౌతున్నాయి. ఇప్పుడు మీ ఊరు మాకు ఎంత దూరమో..మా వూరు మీకు అంతే దూరం అన్న లాజిక్‌ మొదటికి వచ్చింది. మన దేశం నుంచి లక్షలాది మంది వెళ్లి అమెరికాలో చదువుకునే వారు చదువుకుంటున్నారు. వ్యాపారాలు చేసే వారు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు వున్నారు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద కంపనీలు పెట్టిన వారున్నారు. కాని చదువుకోవడానికి వెళ్లినా ఇక్కడి నుంచి పంపే సొమ్ము సరిపోక, అమెరికాలో బారీ బతుకులు బతకాలంటే కూలీ పనులు చేసుకోవాల్సిందే. ఇంట్లో వున్నప్పుడు ఇటు పుల్ల తీసి అటు పెట్టని వాళ్లయినా సరే..అంట్లు కడిగైనా అక్కడ బతకాల్సిందే. ఆ పని కోసం బతిమిలాడుకొని ఆ పని చేసుకొని సంపాదించుకొని బతకాల్సిందే..ఇదే అమెరికా జీవితం కాని..దూరపు కొండలు నునుపు. అక్కడ సంపాదించి విదేశీ మారకద్రవ్యం చెల్లించి, పన్నుల మీద పన్నులు అటూ, ఇటు కట్టి చివరకు చేతిలో కనిపించేది ఎంతైనా సరే అమెరికాలోనే బతకాలనుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. ఇండియాలో తరతరాలు కూర్చొని సరిపడ ఆస్దులున్నా సరే అమెరికాకే వెళ్లాలి. అక్కడే బతకాలి. అక్కడే ఎంజాయ్‌ చేయాలని అనుకునే వారి కధ వేరు. కాని రెక్కాడితే గాని డొక్కాడని పేదలు కూడా అమెరికా వైపు చూసుకుంటూ మబ్బుల్లో నీరు ఒలకబోసుకుంటున్నారు. తమ పిల్లలను కూడా అమెరికా పంపాలన్న ఆలోచనలతో అందిన కాడికి అప్పులు చేస్తున్నారు. కడుపు కట్టుకొని కూడబెట్టుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు కూడా మిగతా సమయాల్లో మరో పని చేస్తున్నారు. ప్రతి రూపాయిని ఆదా చేసుకుంటున్నారు. ఇలా రూపాయి రూపాయి కూడబెట్టి అమెరికా పంపిస్తే తమ తల్లిదండ్రుల మీద ప్రేమ వున్న పిల్లలు ఎంత మంది వున్నారు. అసలు తమను అమెరికా పంపించిన తల్లిదండ్రులను గుర్తుంచుకుంటున్న పిల్లలు ఎంత మంది వున్నారు. తల్లిదండ్రులు బతికి వున్నారా..లేదా అని తెలుసుకుంటున్న వాళ్లు ఎంత మంది వున్నారు. రోజూ కాకపోకపోయినా వారానికో..నెలకో తల్లిదండ్రులను పలకరిస్తున్నారా? అంటే అదీ లేదు. ఎప్పుడూ బీజీ..బిజీ..అన్న సమాదానలతో సరిపెట్టుకుంటున్నారు. తమ పిల్లలు అమెరికా వెళ్తే ప్రయోజకులౌతారు. గొప్పవాళ్లవుతారు. గొప్పగా బతుకుతారు. మమ్మల్ని కూడా గొప్పగా చూసుకుంటారని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కాని తమను తల్లిదండ్రులను మర్చిపోతున్న పిల్లలు వున్నారని తెలిసినా తల్లిదండ్రులు అమెరికా కలలు కనకుండా వుండడం లేదు. తమ పిల్లలను అమెరికా పంపించకుండా వుండలేకపోతున్నారు. కష్టాలు కొని తెచ్చుకుంటూనే వున్నారు. కష్టాలు వస్తాయని తెసినా దైర్యం చేస్తున్నారు. సమస్య తమ దాకా వచ్చేవరకు తల్లిదండ్రులు బోరు మంటున్నారు. అమెరికా వెళ్లిన పిల్లల వల్ల ఎదురయ్యే సమస్యలపై సీతారామయ్య మనవరాలు అని ఓ సినిమా వచ్చింది. కంటే కూతుర్నే కనాలి అనే సినిమా తీశారు. ఇలాంటివి అనేకం వచ్చాయి. అయినా సినిమా చూస్తారు. కాసేపు కళ్ల నీళ్లు పెట్టుకుంటారు. మర్చిపోతారు. తమ పిల్లల్ని అమెరికా పంపేందుకు రకరకాల కష్టాలు పడుతూనే వుంటారు. అవసాన దశలో పదిహేను నిమిషాలు సినిమా చూస్తూ పెట్టుకున్న కన్నీళ్లు జీవితాంతం పెట్టుకుంటున్నారు. అయినా ఎవరూ ఆగడం లేదు. ఇప్పటికైనా మనలో మార్పు వస్తుందని ఆశించాద్దాం. విదేశాలలో గొప్ప గొప్ప చదవులు చదువుకొని దేశానికి సేవ చేయడం పక్కన పెడితే, కనీసం కన్న తల్లిదండ్రులకు అవసాన దశలో చూసుకునే దిక్కులేకుండాపోతోంది. కడసారి చూపులు చూడడానికి కూడా వీలు లేకుండాపోతోంది. అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు బిడ్డలు కాదన్న సామెతలు నిజం చేస్తున్నారు. అయినా ఫరవాలేదని, తమ పిల్లలుతమను చూసుకోకపోయినా సరే..ఆఖరి దశలో తమ వద్దకు రాకపోయినా సరే అని కూడా పిల్లల్ని అమెరికా పంపించాలనే తల్లిదండ్రులే పెరుగుతున్నారు. అందుకే ఈ పరిస్దితి వస్తోంది. ఇప్పుడు ట్రంప్‌ ఆమెరికాకు వెళ్లిన వారిని తిరిగి పంపించేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకొని అమెరికా వెళ్లిన వారిని దోషులుగా చూస్తున్నారు. దొంగలుగా ముద్రలు వేసి పంపిస్తున్నారు. నిజానికి మన దేశం నుంచి వెళ్లిన వాళ్లెవరూ అక్రమ మార్గల ద్వారా వెళ్లిన వారు కాదు. కాకపోతే అక్కడికి వెళ్లిన తర్వాత అక్రమంగా అక్కడ నివాసముంటున్నారు. అది కూడా తప్పే..ఆ దేశ చట్టాల ప్రకారం నేరమే..అందుకే అమెరికా నుంచి తిరిగి పంపిస్తున్నారు. అమెరికాలో వుండడానికి వారికి అర్హత లేదని బలవంతంగా పంపిచేస్తున్నారు. ఇది మంచి పరిణామమేనా కాదా? అన్నది ఇప్పటికిప్పుడు తెలియపోయినా రేపటి తరం ఆశల ఆవిరయ్యాయనే చెప్పాలి.. కన్నకలలు కల్లలయ్యాయనే అనుకోవాలి. అమెరికా ఆశల మీద ఇంకెవరు మోజు పెంచుకోవద్దని కూడా గుణపాఠంగా తీసుకోవాలి. అమెరికా కలల్లో చేదు నిజాలున్నాయని గమనించాలి. ఆ చేదు గుళిక ఇప్పటికప్పుడు గొంతు దిగకపోయినా, ఇక్కడ సంపాదించి అమెరికా అప్పుడప్పుడూ చూసి వచ్చే కల నెరవేరేందుకు ఉపయోపడాలని కోరుకోవాలి. అక్కడే వుండాలి. అక్కడే బతకాలి. అక్కడే భవిష్యత్తు వెతుక్కొవాలి అనేది ఆశే అయినా, అత్యాశ కాకుండా చూసుకోవాలి. స్ధోతమను ఇక్కడ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ కూడా అవకాశాలు వెతుక్కోవచ్చు. ఇక్కడ కూడా ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. బరువెక్కిన గుండెలతో దేశం వస్తున్నామని అనుకోకండి. బరువు దించుకొని వస్తున్నామని సంతోషంగా రండి. లక్షలాది రూపాయలు వృధా అయ్యాయని అనుకోకండి. అంతకు మించి సంపాదించుకునేందుకు కూడా ఇక్కడ అవకాశాలు వెతుక్కొండి. లేకుంటే నిపుణులులైన విద్యావంతులుగా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లు అవకాశాలు సృష్టించండి. మీరే పది మందికి ఉపాది కల్పించేలా ముందుకు సాగండి. అందుకు బ్యాంకులు కూడా సహకారం అందించే అకాశాలున్నాయి. సంపద మీరే సృష్టించండి. ఎవరిమీదో ఆధారపడుకుండా మీ కాళ్ల మీద నిలబడి, దేశానికి ఆదాయం సమకూర్చండి. ఆల్‌దిబెస్ట్‌.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version