
ఉపాధిహామీ కూలీలలకు కనీస సౌకర్యాలు కల్పించాలి
ఏఐకేఎంఎస్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఉపాధిహామీ కూలీలలకు కనీససౌకర్యాలు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) గుండాల మండల కార్యదర్శి బచ్చల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం గుండాల మండలం చెట్టుపల్లి గ్రామపంచాయతీలోని ఉపాధిహామీ కూలీలతో పని ప్రదేశంలో ఏర్పాటుచేసిన గ్రూప్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడారు. టెంటు,మంచినీళ్లు, మెడికల్ సదుపాయం కల్పించాలని, పలుగులు, పారలు,తట్టలు ఇవ్వాలని, అలవెన్స్లను పునరుద్ధరించాలని, రోజుకు750 రూపాయల కూలీ చెల్లించాలని,200 రోజులు పని కల్పించాలని, ఎన్ఎంఎంఎస్ ల నుండి ఏపీఓల…