కేంద్ర మంత్రులను కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల,నేటి ధాత్రి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఇతర ఎంపీలతో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,నితిన్ గడ్కరీ,మరియు ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించారు.కిషన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్రంలో కొత్త మైనింగ్ అనుమతులు,గనుల నిర్వహణ,పర్యావరణ అనుమతులు మరియు ప్రాంతీయ ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రస్తావించారు.నితిన్ గడ్కరీ తో జాతీయ రహదారుల విస్తరణ,గ్రామీణ రహదారుల అభివృద్ధి మరియు ప్రాజెక్టుల ఆమోదం…