తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా బాలసభ ఏర్పాటు చేసి విద్యార్థు. మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులై పాఠశాలల్లోని కొన్ని కొన్ని సబ్జెక్టులు తీసుకొని పాఠశాలలోని తరగతులకు ఉపాధ్యాయులై పాఠశాల బోధనలు చేయడం జరిగింది అలాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా దినోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
#బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి . నల్లబెల్లి, నేటి ధాత్రి:
కపాస్ కిసాన్ యాపను రద్దుచేసి ఎలాంటి నిబంధనలు లేకుండా సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని ప్రకృతి వైపరీత్యాల వలన తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి తేమ పేరుతో ఆంక్షలు విధించకూడదని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో రైతు సంఘ నాయకులు మామిళ్ల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై కుమారస్వామి మాట్లాడుతూ 1970లో ఏర్పాటు చేసిన సీసీఐ రైతు పండించిన పత్తిని కొనుగోలు చేస్తూ వస్తున్నది . మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చే ప్రయత్నం చేయడంతో రైతాంగం చేసిన తీవ్రమైన ప్రతిఘటనతో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసి నల్ల చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించినప్పటికీ రైతాంగం మీద కుట్రలు చేస్తూనే ఉన్నది అన్నారు. ఓపెన్ మార్కెట్లో పత్తి నీ అమ్ముకోకుండా కపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రైతాంగం స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ లో చూపించిన తేదీ సమయం ప్రకారం ఎకరానికి ఏడు క్వింటాళ్ల వరకు మాత్రమే అమ్ముకునే నిబంధనలు విధించడం ఎనిమిది శాతం కన్నా తేమ ఎక్కువగా ఉంటే ధరలో తేడాలు ఉంటాయని పేర్కొనడం రైతులకు అన్యాయం చేయడమే అన్నారు. కౌలు రైతులు పేద సన్నా చిన్నకారు రైతులు ఈ అకాల వర్షాలకు పంటలతో తీవ్రంగా నష్టపోయి పెట్టుబడి రానీ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు మండలంలో ఇప్పటివరకు అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగం యొక్క పంట వివరాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన పత్తి రైతులకు కనీసం ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు .రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రైతాంగానికి అండగా నిలవాలన్నారు లేనిచో రైతు సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతం చేయడం తప్పదని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ జన్ను జయరాజు సిపిఎం పార్టీ మండల నాయకులు బొడిగె సమ్మయ్య , గోనె సంజీవయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే ఫోర్ గడ్డ శాంతినగర్ కాలనీ సమీపంలో రామకృష్ణాపూర్ ఉపరితల గని రెండో దఫ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 3 రోజున ప్రజాభిప్రాయ సేకరణ ఉన్న సందర్భంగా శాంతినగర్ కాలనీవాసులు తమ అభిప్రాయాలను ముందస్తుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ లకు కాలనీవాసుల అందరి సంతకాలు సేకరించి వినతి పత్రాలు అందించారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడారు. మొదటి దఫా పనులు జరిగిన సందర్భంగా బాంబు బ్లాస్టింగ్ లతో కాలనీలలోని ఇల్లుల గోడలు పగిలిపోయాయని, దుమ్ముకు ప్రజలంతా అనారోగ్య బారిన పడ్డారని తెలిపారు. మళ్లీ రెండో దఫా పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలనీ వాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి ప్రస్తుతం ఉన్న ఇండ్లకు నష్టపరిహారం కేటాయిస్తే కాలనీ నుండి వెళ్లిపోతామని కలెక్టర్, ఆర్డిఓ ,మున్సిపల్ కమిషనర్, జిఎం లకు వినతి పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు.
వనపర్తి లో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా ఇండ్లు కూల గోట్టుకున్నారు
విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి
తెలుగుదేశం పార్టీ నేత కొత్త గొల్ల శంకర్
వనపర్తి నేటిదాత్రి
వనపర్తి పట్టణంలో వివేకానంద చౌరస్తా నుండి మర్రికుంట కొత్త బస్టాండ్ ఆర్డీవో ఆఫీస్ లైన్ కొందరు తమ ఇండ్లను స్వచ్ఛందంగా ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా తమ ఇండ్లను కులగోట్టుకున్నారని వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ నేత కొత్త గొల్ల శంకర్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు పానగల్ రోడ్డులో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా ఇండ్లు కూలగొట్టుకున్నారని ఆయన తెలిపారు గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిలో రోడ్ల విస్తరణ కొరకు నిధులు మంజూరు చేయించారని రాజీవ్ చౌక్ అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ పాత బజారు వరకు దాదాపు రోడ్ల విస్తరణ పూర్తి చేయించారని గుర్తు చేశారు .శ్రీ రామ టాకీస్ దగ్గర సెంటర్ డివైడరింగ్ పాత యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర ఏర్పాటు చేయాలని వాహనాలు ఎటు పోవాలని అర్థం కాక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఎమ్మెల్యే మెగారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారులు స్పందించి కర్నూల్ రోడ్ పాన్ గ ల్ ల రోడ్డు చిన్నగా ఉండడంవల్ల వెంటనే కులగొట్టాలని ఆయన డిమాండ్ చేశారు . రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోయే వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి ఆదుకోవాలని ఆయన కోరారు . వనపర్తి జిల్లా కేంద్రం విస్తరించి పోయిందని ప్రతి ఇంట్లో కార్లు ద్విచక్ర వాహనాలు ఉన్నాయని రోడ్లు ఇరుకుగా ఉండడంవల్ల నడపడానికి ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు స్వచ్ఛందంగా పానగల్ రోడ్డు కర్నూల్ రోడ్డు లో రోడ్ల విస్తరణ కొరకు ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా కుల గోట్టుకున్నందుకు వారికి వనపర్తి ప్రజల తరఫున కొత్త గొళ్ల శంకర్ కృతజ్ఞతలు తెలిపారు
జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు https://cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు.
నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీతో ఇక కాంగ్రెస్ కు తిరుగులేదు
అభివృద్ధికి డోకా లేదు
ఇక నుంచి ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే గెలుపు-కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన నవీన్ యాదవ్ కు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన వెలిచాల
కరీంనగర్, నేటిధాత్రి:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ సాధించడంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరుగులేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తారని తెలిపారు. శుక్రవారం వెలిచాల రాజేందర్ రావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని అక్కడి ప్రజలు నిరూపించారనీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ కు రాజేందర్ రావు హర్థిక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి సింపతి ఏమాత్రం పని చేయలేదని ప్రజలు ఆదరించలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం రికార్డని రాజేందర్రావు అన్నారు. నవీన్ యాదవ్ అతని తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ పై బీఆర్ఎస్ నేతలు విష ప్రచారం చేశారనీ, వాటిని జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పి కొట్టారని బీఆర్ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెప్పారని మండిపడ్డారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి రాజేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి జూబ్లీహిల్స్ లో అన్ని వర్గాల ప్రజలు మైనార్టీలు సినీ పరిశ్రమకు చెందిన వారు ప్రతి ఒక్కరు కృషి చేయడం అభినందనీ యమని పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తారని రాజేందర్ రావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఫలితాలు పునరావృతం అవుతాయనీ, ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపని రాష్ట్రంలో తిరుగులేదని రాజేందర్రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్
పరకాల,నేటిధాత్రి
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందిన సందర్బంగా పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా కాల్చి,స్వీట్లు పంచి సంబరాలను జరుపుకున్నారు.ఈ గెలుపు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనమని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలుపుతూ గెలుపొందిన నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలే కాక తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని ఎన్నిక ఏదైనా గెలుపు ఇకనుండి కాంగ్రెస్ పార్టీ దే అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,ఏఎంసీ వైస్ చైర్మన్ బుజ్జన్న,రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మడికొండ శ్రీను,సమన్వయ కమిటీ సభ్యులు,చిన్నాల గోనాథ్ ఈర్ల చిన్ని,పంచగిరి జయమ్మ,చందుపట్ల రాఘవరెడ్డి,దుబాసి వెంకటస్వామి,పసుల రమేష్,మార్క రఘుపతి గౌడ్,సదానందం గౌడ్,పోరండ్ల సంతోష్,మడికొండ సంపత్ కుమార్,మంద నాగరాజు,రఘు నారాయణ,దార్నా వేణుగోపాల్,బొమ్మ కంటి చంద్రమౌళి,దుప్పటి సాంబశివుడు,బొచ్చు భాస్కర్,దావు పరమేశ్వర్,దుగ్గేల వినయ్,బాసాని సుమన్,సురేష్,బండారి కృష్ణ,మచ్చ సుమన్,నాగరాజు,సదన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏజెన్సీలో ఆదివాసీల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్
గుండాల,నేటిదాత్రి:
గుండాల మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల ముఖ్య నాయకుల సమావేశం పూనెం రమణ బాబు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశనికి ముఖ్య అతిధిగా ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు వి సి దొర పాల్గొని మాట్లాడుతూ గుండాల మండల కేంద్రం లొకి 1970 తర్వాత నుంచి నేటి వరకు విచ్చలవిడిగా వలస గిరిజనేతరలు వస్తున్నా కానీ స్థానిక పంచాయతీ అధికారులు కానీ మండల స్థాయి అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరించడం ఏజెన్సీ ప్రాంతంలో ఎవరి కొరకు మీరు ఇక్కడి నియమించబడ్డారు అని తెలుసుకోవాలని అన్నారు. నేటి తెలంగాణకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుల రాష్ట్రాల నుంచి మరియు తెలంగాణలోని మైదన ప్రాంతాల నుంచి గిరిజనేతరులు మరియు లంబాడీలు గుండాలకు విచ్చలవిడిగా 1/70 చట్టానికి విరుద్ధంగా వలసలు వచ్చి, ఏదేచ్చగా అధిక ధరలు వెచ్చించి భూములు కొని, బహుళ అంతస్తులు నిర్మించుకొని వ్యాపారాలు,వడ్డీ వ్యాపారాలు యదేచ్ఛగా చేస్తున్న కానీ పంచాయితీ అధికార్లు కాని రెవిన్యూ అధికార్లు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇక్కడ 1/70 చట్టం ఉందా లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.గుండాల మండల పరిధిలోని వలస గిరిజనేతరుల ఆదీనంలో ఉన్న భూలను ప్రభుత్వం వెంటనే హస్తంగతం చేసుకొని,ఎల్టీఆర్ కేసులు నమోదు చేసి,బహుళ అంతస్తులు వ్యాపార గిడ్డంగులను నేలమట్టం చేయాలనీ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. దీని కొరకు వచ్చే నెల డిసెంబర్ 2న గుండాల తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేయాలి అని సన్నాహక సమావేశం నిర్వహించారు. దానికి ఆదివాసులు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లొ ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు పెండెకట్ల మహేష్,గోగ్గేలా సుధాకర్,పూనెం వసంత్, జబ్బ సుధాకర్ ,తాటి పాపారావు,తెల్లం కిరణ్, చీమల ప్రశాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్ లో నవంబర్ 14 చాచా నెహ్రూ పుట్టిన దినోత్సవం సందర్భంగా బాలల దినోత్సవం విద్యార్థినీ విద్యార్థులు చాచా నెహ్రూ వేశాధారణ లో పాల్గొని ఆటపాటలతో మరియు ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు వి శ్వేత ఉపాధ్యాయులు సాయి కుమార్ పవన్ కుమార్ మల్లయ్య ఈశ్వరమ్మ సుస్మిత నాగజ్యోతి స్రవంతి మరియు పాఠశాల కరస్పాండెంట్ బి నాగన్న గారు పాల్గొన్నారు,
వారసత్వ సంపదలను కాపాడుకోవడం మన బాధ్యత- తల్లోజు ఆచారి.
కల్వకుర్తి / నేటి ధాత్రి :
కల్వకుర్తి పట్టణంలోని గచ్చుబావి శుద్ధి కార్యక్రమం గత మూడు రోజులుగా దిగ్విజయంగా కొనసాగుతుంది మూడవరోజు మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి పాల్గొన్నారు.ముందుగా శివాలయం దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పూజలో పాల్గొన్న అనంతరం సేవా కార్యక్రమంలో పాల్గొని కాసేపు మట్టికుప్పల తట్టలు మోశారు తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన తల్లోజు ఆచారి కల్వకుర్తి పట్టణంలో పెద్ద ఎత్తున యువత స్వచ్ఛందంగా తరలిరావడం శుభపరిణామం వారసత్వ సంపద అయినటువంటి గచ్చుబావి పరిరక్షణ కోసం ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయించి కాపాడుకోవాలనే ఆలోచన చాలా గొప్పదని వారసత్వ సంపదలు మన సంస్కృతికి సాంప్రదాయానికి మూల స్తంభాలని హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఒక ఆధ్యాత్మిక కేంద్రం అలాంటి కేంద్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉందని ఇంతటిపాల్గొన్నారు. మాహాత్కార్యంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ శివయ్య కృపను పొందాలని ఇకపై తరచూ గచ్చుబావిని సందర్శిస్తుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు యువత పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.
సన్ వాల్లీ హై స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సన్ వాల్లీ హై స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. పిల్లల పట్ల నెహ్రూ కి ఉన్న ప్రేమను స్మరించుకుంటూ, 1954 నుండి ఆయన జయంతిని బాలల దినోత్సవం గా జరుపుతున్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రీడా పోటీలు, నాటికలు, నృత్యాలు, పాటలు, వక్తృత్వ వికాస పోటీలు, వ్యాసరచన వంటి ఎన్నో రంగుల కార్యక్రమాలు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించాయి. ప్రత్యేక ఆకర్షణగా చిన్నారులు తమ భవిష్యత్ కలలను ప్రతిబింబించే విధంగా వివిధ వేషధారణల్లో హాజరయ్యారు. డాక్టర్, లాయర్, పోలీస్, ఐఏఎస్ ఐపీఎస్ బిజినెస్‌మ్యాన్, సైంటిస్ట్, టీచర్ మొదలైన వృత్తుల వేషధారణలో విద్యార్థులు అందంగా ప్రదర్శన ఇచ్చారు. పిల్లలు ఈ విధంగా పాల్గొనడం ద్వారా, “ఇదే మా కల… రేపు నిజంగానే ఈ స్థానాల్లో మెరిసే వ్యక్తులమవుతాం” అని తమ ఆశయాలను స్పష్టంగా తెలియజేశారు. ఈ సందర్భంగా సన్ వాల్లీ హై స్కూల్‌లో ప్రిన్సిపాల్ వేముల శేఖర్ మాట్లాడుతూ నేటి చిన్నారులే రేపటి భారత పౌరులు. పిల్లల కలలు చిన్నవైనా, పెద్దవైనా—ప్రతి కలకు విలువ ఉంది. పిల్లలకు మంచి విద్య, సత్సంకారాలు, ధైర్యం, మార్గనిర్దేశనం ఇవ్వడం ద్వారా వారిని సమాజానికి ఉపయోగపడే నాయకులుగా తయారుచేయాలి. స్కూల్ విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి గర్వకారణం అవుతారని నాకు నమ్మకం” అని తెలిపారు. తరువాత విద్యార్థులకు చాక్లెట్లు, స్వీట్లు, బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఇన్‌చార్జీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోవిద్యార్థుల చైతన్య సదస్సు ఏర్పాటు
పరకాల,నేటిధాత్రి ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు బొచ్చు ఈశ్వర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్వీ కాలేజ్ చైర్మన్ శ్రీనివాస్ చారి మరియు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సంతోష్ హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు దేశంలో విద్యార్థులు మత్తుకు బానిసలావుతున్నారని చదువుకు దూరం అవుతూ మత్తుకు బానిస అవుతూ చదువుని దూరం చేసుకుంటు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చకుండా మత్తుకు బానిసై వారి నాశనం చేసుకుంటున్నారని విద్యార్థులు చదువుకొని తల్లిదండ్రులకు మరియు గురువులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షులు కార్యదర్శులు చెన్నూరు సాయికుమార్, బీరెడ్డి జస్వంత్,జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొజ్జ హేమంత్, విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ధాన్యంకొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పెండెం రామానంద్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని గల కమలాపురం శ్రీ వెంకటేశ్వర రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ అభిబ్, కిసాన్ కాంగ్రెస పట్టణ అధ్యక్షులు ముత్తినేని వెంకన్న, జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ వర్కింగ్ పంబి వంశీకృష్ణ, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, ప్రధాన కార్యదర్శి గద్ద జ్యోతి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, శ్రీ వెంకటేశ్వర రైతు సంఘం అధ్యక్షులు ముత్తినేని వీరయ్య, ప్రధాన కార్యదర్శి కోరే మల్లేష్, కార్యదర్శి కంచు రవి, కోశాధికారి లోడె పెద్దరాజు, పూజారి సారంగం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
పంచరక్ష ప్రణాళికతో స్వాతంత్ర భారత సర్వతోముఖాభివృద్ధికి బాటలను వేసిన ఘనుడు భారత ప్రధమ ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రు అని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అన్నారు.పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ ఆయన వద్ద ఘనంగా నిర్వహించారు.విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ముందుగా పిల్లలకు జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు మాదాసి రవి, పంబి వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళీ, నర్సంపేట మాజీ సొసైటీ వైస్ చైర్మన్ పాలాయి రవికుమార్, నర్సంపేట నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు డిష్ బాబా, కిసాన్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ముత్తినేని వెంకన్న, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గద్ద జ్యోతి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్,మాజీ వార్డు సభ్యులు గండి గిరి, 9వ వార్డు అధ్యక్షులు పిన్నింటి కిరణ్ కుమార్ రెడ్డి, 20వ వార్డు అధ్యక్షులు రామగోని శ్రీనివాస్, 17వ వార్డు అధ్యక్షులు అప్పాల శ్రీకాంత్, 5వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రతన్ కుమార్, వేల్పుల కృష్ణ, నాగేల్లి సారంగం గౌడ్, గోపు వేద ప్రకాష్, పూల్గుల మాధవరెడ్డి, దేశి సాయి పటేల్, లైన్ నితిన్, చేన్నబోయిన సాయి శ్రావణ్ దాస్, కేదారి, తదితరులు పాల్గొన్నారు.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
– జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ “వి”క్టరీ.. – సోమాజిగూడ డివిజన్ 288లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన కాంగ్రెస్. – సెంటిమెంట్ తో బిఆర్ఎస్ ఎన్ని రాజకీయాలు చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. – ఉప ఎన్నిక గెలుపు ద్వారా కాంగ్రెస్ లో నయా జోష్..
హుజురాబాద్, నేటి ధాత్రి:
జూబ్లిహిల్ ఎన్నికల్లో గెలవడం ద్వారా అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ మా పై మరింత బాధ్యత పెరిగిందని,రాష్ట్రంలో అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని మరోసారి రుజువైందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ,రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించామని,ఇలాంటి తీర్పు ద్వారా అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తామని అన్నారు.ఉప ఎన్నికల్లో రామగుండం శాసన సభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రణవ్ సోమాజిగూడ 288 బూత్ లో మంచి మెజారిటీ సాధించారు,ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీగా జూబ్లిహిల్స్ ఎన్నికల్లో ఒక బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ను నిలబెట్టడం ద్వారా బీసీలపై నిజమైన కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉందని మరోసారి రుజువైందని అన్నారు.నూతనంగా ఎమ్మెల్యే గా ఎన్నికైన నవీన్ కుమార్ యాదవ్ కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ,హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.ప్రధాన కూడళ్లలో బాణాసంచా కాలుస్తూ,మిఠాయిలు తినిపించుకున్నారు.ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అబద్ధపు ప్రచారాలతో,సెంటిమెంట్ తో ఎన్ని రాజకీయాలు చేసినా జూబ్లిహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు.ఇదే జోష్ లో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎగసిన యువ కెరటం.. బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ సూపర్ షో..
బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అసాధారణ పోరాటం చేసింది. ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌జేపీ దాదాపు 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
ఊహించినట్టుగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. 200కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే కూటమిని బలంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ హేమాహేమీల మధ్య ఓ యువ కెరటం కూడా బలంగా తన ఉనికిని చాటుకుంది. తాజా ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అసాధారణ పోరాటం చేసింది. ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించింది
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌జేపీ దాదాపు 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాలనూ ఈ పార్టీ గెలుచుకుంది. బీహార్ రాజకీయాల్లో ఒక గొప్ప నాయకుడైన రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని ఆయన తనయుడు చిరాగ్ నిలబెట్టుకునే దిశగా సాగుతున్నారు. ప్రధాని మోదీ, సీఎం నితీశ్‌తో సమానంగా 43 ఏళ్ల చిరాగ్ కూడా బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. అయితే చిరాగ్ రాజకీయ ప్రస్థానం అనుకున్నంత సులభంగా సాగలేదు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 130 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌జేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. ఓట్ల షేర్ అంశంలో మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ సీట్లు మాత్రం సాధించలేకపోయింది. అయితే ఆ ఎన్నికల్లో అనేక సీట్లలో జేడీయూ ఓట్లను దెబ్బతీసింది. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ తరహాలో చిరాగ్ పాశ్వాన్‌కు చర్మిషా లేదంటూ రాజకీయ నేతలు, ప్రజలు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ చిరాగ్ వెనకడుగు వేయకుండా కష్టపడ్డారు. ప్రజలతో మమేకయ్యారు (Bihar election performance).
2024 లోక్‌సభ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది . పోటీ చేసిన 5 స్థానాల్లోనూ గెలిచింది. అంత విజయం సాధించినప్పటికీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ 20 స్థానాలకు మించి ఎల్‌జేపీకి ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో చిరాగ్.. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీతో చర్చలు ప్రారంభించారు. చివరకు ఎన్డీయే పక్షాలు దిగి వచ్చి చిరాగ్ పార్టీకి 29 స్థానాలు కేటాయించాయి. ఎన్డీయే ప్రభుత్వంలో చిరాగ్ పాశ్వాన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత స్పందించారు.
జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది అని ఆమె అభివర్ణించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో మాగంటి సునీత తనదైన శైలిలో స్పందించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసి గెలిచిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం (ఈసీ) విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ది అసలు గెలుపే కాదని.. నైతికంగా తానే గెలిచానని ఈ సందర్భంగా మాగంటి సునీత స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్.. 24, 658 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతయింది.
ఈ ఏడాది జూన్ 8వ తేదీన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నేత మాగంటి గోపినాథ్ తీవ్ర అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో నవంబర్ 11వ తేదీన ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం అంటే.. నవంబర్ 14వ తేదీన జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ ఘన విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలో సైతం కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని వెల్లడించిన విషయం విదితమే.
అన్ని వయస్సుల వారిలోనూ మధుమేహం వ్యాధి సోకుతున్నదని, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించాలని కామినేని ఆస్పత్రి ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ బి.శ్రావ్య, డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని సూచించారు.
అన్ని వయస్సుల వారిలోనూ మధుమేహం(Diabetes) వ్యాధి సోకుతున్నదని, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించాలని కామినేని ఆస్పత్రి ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ బి.శ్రావ్య, డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కొన్ని దశాబ్దాల క్రితం మధుమేహం 40-50 ఏళ్ల పైబడిన వారిలో కనిపించేదని, అయితే ఇప్పుడు 15-20 ఏళ్ల వయస్సు ఉన్న వారిలో కూడా మధుమేహ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతీ రోజు తమ అవుట్‌పేషెంట్ విభాగానికి 20-30 మంది మధుమేహ రోగులు వస్తున్నారని, వారిలో 10-15 ఏళ్ల వాళ్లూ ఉంటున్నారన్నారు. స్థూలకాయంతో బాధపడుతున్నవారూ ఉన్నారని తెలిపారు. గర్బిణులు కూడా జెస్టేషనల్ డయాబెటీస్ కోసం తరచుగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మధుమేహ రోగులు తమ బరువును నియంత్రించుకోవడం చాలా అవసరమన్నారు. ప్రతిరోజూ నడక వంటి వ్యాయామం చేయడం, వైద్యులు సూచించిన మందులను తీసుకోవడం తప్పనిసరి అన్నారు.
కర్ణాటకలోని బీదర్ నుండి మధ్యప్రదేశ్ కు అక్రమంగా పాన్ మసాలాను తరలిస్తున్న ఓ లారీని.. మేము పోలీసుల మంటూ పట్టపగలె చోరీకి పాల్పడ్డ దుండగులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇద్దరు దుండగులను జైలుకు తరలించగా.. పరారీలో ఉన్న మరికొందరి దుండగుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశం మేరకు గురువారం సాయంత్రం జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. బీదర్ లోని ఆర్ కే ప్రొడక్ట్స్ కర్మాగారం నుండి పాన్ మసాలాను ఈ నెల 10న మధ్యాహ్నం జహీరాబాద్ బీదర్ రోడ్డు, న్యాల్ కల్ మండలంలోని గంగువార్ గ్రామ శివారు వద్ద రూ:19.59 లక్షల విలువచేసే పాన్ మసాలాను లారీలో తరలిస్తుండగా.. కొందరు దుండగులు మాటువేసి. మేము పోలీసులమంటూ, భయభ్రాంతులకు గురిచేసి పాన్ మసాలాను తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకొని పరారయ్యారు. లారీలో ఉన్న ఓ వ్యక్తివద్ద నుండి రూ:42 వేల నగదును దోచుకున్నారు. రవి సూర్యకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి వెంటనే ముమ్మర గాలింపు చేపట్టారు. జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు పర్యవేక్షణలో.. స్థానిక ఎస్సై సుజిత్, రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్, ఝరాసంఘం ఎస్సై పాటిల్ క్రాంతి, జహీరాబాద్ రూరల్ పోలీసుల బృందం సుభాష్, రాజశేఖర్, అశోక్, సాయికిరణ్, మహేష్, శ్రీకాంత్, అప్రోచ్, సాయికుమార్, తదితరులు పాన్ మసాలా తోపాటు లారీని అపహరించిన దుండగుల కోసం మూడు రోజుల పాటు ముమ్మర గాలింపు చేపట్టారు. ఇద్దరు నిందితులు, లారీని పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు.
మమ్మద్ ఖరీం, సక్లేన్ల అరెస్ట్, జైలుకు తరలింపు…
పట్టపగలే చోరీకి పాల్పడ్డ పలువురి నిందితుల్లో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం స్థానిక హద్దునూర్ పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి వివరాలను వెల్లడించారు. జహీరాబాద్ చెందిన మమ్మద్ ఖరీం (32), బీదర్ కు చెందిన సక్లెన్ (26) లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు, అతి త్వరలోనే అదుపులోకి తీసుకొని.. అరెస్టు చేసి, జైలుకు తరలించినట్లు డి.ఎస్.పి వెల్లడించారు. రూ:19.59 లక్షల విలువగల పాన్ మసాలా, రూ:15 లక్షల విలువగల లారీని అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. రూ:42 వేలను దొంగలించిన దుండగుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. పట్టపగలే చోరీకి పాల్పడ్డ దుండగుల (ఇద్దరు)ను, లారీని త్వరితగతిన అదుపులోకి తీసుకోవడం పట్ల.. స్థానిక సీఐ, ఎస్సైలు, పోలీసుల బృందాన్ని డి.ఎస్.పి అభినందించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.