bukabzadarulapia pd act, భూకబ్జాదారులపై పీడీ యాక్ట్‌

భూకబ్జాదారులపై పీడీ యాక్ట్‌

తెలంగాణలో అత్యంత ప్రాధాన్యమున్న, వేగంగా వద్ధి చెందుతూ స్మార్ట్‌ సిటీగా ఎంపికైన కరీంనగర్‌ పట్టణంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలని సామాన్యులు కలలు కనడం సహజం. ఈ కారణంగా, ఇటీవల కరీంనగర్‌ పట్టణంలో, శివారు ప్రాంతాల్లో భూమి విలువ అమాంతంగా పెరగడం వల్ల ఆ డిమాండ్‌ను తమకు లాభాలుగా మార్చుకోవాలని స్వార్థంతో, దురుద్దేశంతో భూకబ్జాదారుల కన్ను భూములపై పడింది. ప్రభుత్వ ఉద్యోగులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు తమ పిల్లల భవిష్యత్తు, చదువులు, పెళ్లిళ్ల కోసం ఉపయోగపడుతుందని ఎంతో కొంత భూమి కొనుగోలు చేసి భవిష్యత్‌ అవసరాల కోసం పెట్టుకోగా ఆ భూములపై కన్నేసిన కొంతమంది భూకబ్జాదారులు తమకు ఉన్న పరిచయాలు, అనుభవంతో తప్పుడు కాగితాలు సష్టించి, దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఆ భూములను కబ్జాలకు ప్రయత్నిస్తూ, నిజాయితీగా భూమి కొనుగోలు చేసిన యజమానులను, భూకబ్జాదారులు నానా ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు ఇటీవల పోలీసుల దష్టికి వచ్చింది. సామాన్య ప్రజానీకానికి నిజమైన యజమానుదారులకు ఇబ్బందులు కలుగజేస్తూ భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలని వారి ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నడుం బిగించారు. ఏప్రిల్‌ 25వ తేదీన కరీంనగర్‌ పట్టణంలోని రామచంద్రాపూర్‌ కాలనీలో సర్వే నంబర్‌ 965లో కేశవపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చింతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి 2010లో రెండు గంటల స్థలాన్ని కొనుగోలు చేసినాడు. ఆ భూమిని అప్పటినుండి తన స్వాధీనంలోనే ఉండగా అతను 25 ఏప్రిల్‌ 2019 రోజున ఉదయం గహ నిర్మాణం కోసం శ్రీనివాస్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి నిర్మాణ పనులు చేసే ప్రయత్నం చేస్తుండగా ఆ భూమిపై కన్నేసిన భూమాఫియాకు చెందిన భూకబ్జాదారులు 1) సర్దార్‌ రాజ్‌బీర్‌సింగ్‌ 2) రాపల శంకర్‌ 3) సర్దార్‌ యశ్పాల్‌సింగ్‌ 4) బొంతల ప్రవీణ్‌కుమార్‌లు దాడిచేసి అతడిని తీవ్రంగా గాయపరచడమే కాకుండా అడ్డువచ్చిన కుటుంబసభ్యులపై కూడా దాడిచేశారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీస్‌ కమీషనర్‌ ఇటువంటి మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. చింతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి భూమిని కబ్జా చేయడమే కాకుండా బాధితులపై దాడి చేసినందుకు భూమాఫియా సభ్యులను వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు. భూబాధితులను బెదిరిస్తూ అక్రమంగా కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కళ్లెం వేసేందుకు కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహారించి సామాన్యులకు, భూబాధితులకు భరోసా కలిగించాలనే లక్ష్యంతో పోలీసులు ముందుకు నడుస్తున్నారు. అందులో భాగంగానే చింతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై దాడికి పాల్పడిన నలుగురు నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేయడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. అంతేకాకుండా భూకబ్జాలకు పాల్పడుతూ సామాన్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్న భూ మాఫియాదారులు, భూకబ్జాదారుల వివరాలను సేకరించి వారితో ఇటీవల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీస్‌ కమీషనర్‌ కమలాసన్‌రెడ్డి భవిష్యత్తులో భూ ఆక్రమణలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *