బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం
హసన్‌పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ భూదేవి, శ్రీదేవి అమ్మవార్లు గ్రామంలోని ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తారని, అమ్మవార్ల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. మడిపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు పాడిపంటలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ప్రతిష్టాపనలో గ్రామ సర్పంచ్ చిర్ర సుమలత విజయ్, ఎంపిటిసి ఆకుల ఇంద్రయ్య, అంచూరి విజయ్‌కుమార్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.