ముందస్తుగా గ్రీన్ వుడ్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు
మహాదేవపూర్ సెప్టెంబర్ 15 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రీన్ వుడ్ హైస్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ ముందస్తు వేడుకలలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి రంగురంగుల తీరోక్క పూలతో బతుకమ్మలను పేర్చి ముత్యాల ముగ్గులు రంగవల్లులతో ప్రాంగణాన్ని తీర్చిదిద్ది దానిలో బతుకమ్మను నెలకొల్పి కోలాటాలతో, బతుకమ్మ పాటలతో, నృత్యాలు చేస్తూ ఘనంగా గ్రీన్ వుడ్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో జరుపుకున్నారు తదనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మలోని రంగురంగుల పూలు మన జీవితం రంగుల మయంగా ఉండాలని, అందరితో కలిసి ఆడడం అంటే జీవితాంతం అందరితో కలిసి మెలిసి సుఖసంతోషాలతో ఎలా జీవించాలో నేర్పే పండుగనే బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాపు, పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ డైరెక్టర్ ఆకుతోట రాజకుమార్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పవన్ కుమార్, మాజీ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కటకం అశోక్, మండల ప్రచార కమిటీ అధ్యక్షుడు కడార నాగరాజు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాపకేతర బృందం పాల్గొన్నారు.