మంచిర్యాల నేటిదాత్రి
ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించిన రజక, అంబేద్కర్ సంఘం నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు కుంటాల శంకర్ మాట్లాడుతూ చిట్యాల(చాకలి) ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ వీర వనిత,1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలు నాలుగో సంతానముగా చాకలి ఐలమ్మ జన్మించింది. పాలకుర్తి కి చెందిన చిట్యాల నర్సయ్య తో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది అప్పటికి ఆమె వయస్సు 13 ఏడ్లు, వీరికి 5 గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తి వారికి జీవనాధారం 1940-1944 మధ్యకాలంలో విస్నూర్ లో దేశ్ ముఖ్ రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది. ఐలమ్మ భూ పోరాటంతో మొదలుకొని సాయుధ రైతాంగ పోరాటంలో చివరి వరకు పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10-1985 న అనారోగ్యంతో పరమ వధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు కుంటాల శంకర్,రజక సంఘం నాయకులు నిమ్మరాజుల సత్యనారాయణ, శ్రీనివాస్,కుమార్, కటుకూరి శంకర్, మెరుగు అశోక్, రాజలింగు, రావుల తిరుపతి,నిమ్మ రాజుల సతీష్, పాల్గొన్నారు..