ఎస్బిఐలో భీమా పొందండి నిశ్చింతగా ఉండండి

ఆర్కేపి ఎస్బిఐ మేనేజర్ గోపాల్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఆధ్వర్యంలో జనరల్ ఇన్సూరెన్స్ తీసుకొని ఇన్సూరెన్స్ లో వర్తించే ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇన్సూరెన్స్ డబ్బులు పొంది నిశ్చింతగా ఉండొచ్చని రామకృష్ణాపూర్ ఎస్బిఐ మేనేజర్ గోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రామకృష్ణాపూర్ ఎస్బిఐ బ్యాంకులో ఇన్సూరెన్స్ కలిగిన రమేష్ యొక్క కుమారుడు సాయిరాం కు తీవ్ర జ్వరం రావడంతో మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాడనీ, ఆసుపత్రిలో 27 వేల బిల్ అయ్యిందని, అట్టి బిల్ ను ఎస్బిఐ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరు చేయడం జరిగిందని, బిల్ చెక్ ను గురువారం సాయిరాం తండ్రి అయిన రమేష్ కు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ మేనేజర్ అరుణ్, బ్యాంక్ సిబ్బంది ప్రశాంత్, రమాదేవి, కార్తీక్, రాజేంద్రప్రసాద్, వెంకటేష్, తిరుపతి, చందు, లక్ష్మీ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *