ఎస్ఆర్కే పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు.
రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణం లో గల ఎస్ఆర్కే పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ పెద్దపల్లి ఉప్పలయ్య కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం సర్వ మతాలకు నిలయమని, మతాల భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రతి పండుగను ఘనంగా జరుపుకోవడం మన ఆనవాయితని పేర్కొన్నారు. దసరా, దీపావళి, రంజాన్ క్రిస్మస్ ఇలా ప్రతి పండుగను పాఠశాలలో సాంప్రదాయ పద్ధతిలో…