జైపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

జైపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జైపూర్,నేటి ధాత్రి:

రాష్ట్ర కార్మిక,ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు జైపూర్ మండలంలో శనివారం రోజున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు – ఇల్లు అందరికీ పథకంలో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు మంజూరైన ఇండ్ల నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్,హౌసింగ్ శాఖ ఏఈ కాంక్ష,గ్రామ కార్యదర్శి ఉదయ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్,మాజీ ఉప సర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి,తడిసిన కల్కి రమేష్,ప్రశాంత్ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు ఇరిగిరాల శ్రావన్ కుమార్,అరిగేలా శ్రీనివాస్ గౌడ్,ఇరిగిరాల లింగయ్య  పాల్గొన్నారు.

చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ.

చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలికి ఘన నివాళులు

శంకర్ పల్లి, నేటిధాత్రి:
రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్ స్వామి సతీమణి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మరియు మాజీ ఎంపీపీ శ్రీమతి పడాల యాదమ్మ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామంలో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించబడిన సందర్భంగా, పలువురు నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ స్వర్గీయ యాదమ్మ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన పడాల వెంకట్ స్వామి మరియు కుమారుడు ప్రభాకర్ ని పరామర్శిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పెంట రెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ రెడ్డి, బాకారం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఫిషర్ మెన్ సంఘం అధ్యక్షుడు బిక్షపతి, తోల్కట్ట సత్యనారాయణ, బలవంత రెడ్డి, ముడిమ్యాల గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్, వివిధ గ్రామాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

చెత్తను తొలగించండి మహాప్రభో…..!

చెత్తను తొలగించండి మహాప్రభో…..!

మున్సిపల్ కమిషనర్ కు నగర వాసుల వినతి.

నెల రోజులుగా ఆటోలోనే పేరుకుపోతున్న చెత్త.. చోద్యం చూస్తున్న మున్సిపల్ సిబ్బంది..

ప్రధాన రహదారి పార్కింగ్ మయం.. ఆటోనగర్ రోడ్డు ఇరువైపుల ఇష్టారాజ్యంగా పార్కింగ్..

వరంగల్ రోడ్ల మీద గుంతలు.. ప్రయాణికుల ఇబ్బందులు

అసలే వర్షాకాలం.. ప్రధాన రహదారుల్లో గుంతలలోకి నీరు చేరి ప్రమాదాలు..

కమీషనర్ బయటకు వస్తేనే, కదులుతున్న మున్సిపల్ అధికారులు? లేదంటే ఏసీ రూములకే పరిమితం.

బల్దియా అధికారుల నిర్లక్ష్యం…?

పేరుకుపోయిన చెత్త ఓ వైపు.., రోడ్ల మీద గుంతలు మరోవైపు..

వరంగల్ నగర ప్రజల ఆవేదన.. పట్టించుకొని స్థానిక కార్పొరేటర్లు?

మృత్యు మార్గాలుగా ప్రధాన రహదారులు? నిర్వహణ లేక అధ్వాన్నంగా మారిన కొన్ని రోడ్లు.

“పోతననగర్ నుండి హంటర్ రోడ్డు” వైపు వెళ్ళే మార్గం మరి అధ్వాన్నంగా తయారయ్యింది

అడుక్కో గుంతతో భయంభయంగా వాహనదారుల రాకపోకలు.

ఇటీవల కురుస్తున్న వర్షాలతో చిధ్రమైన పలు రోడ్లు, కాగితాలకే పరిమితమైన మరమ్మతుల ప్రతిపాదనలు?.

గుంతలను పూడ్చండి, పేరుకుపోయిన చెత్తను తొలగించండి, ప్రాణాలను కాపాడండి. బల్దియా కమిషనర్ కు నగర ప్రజల వేడుకోలు.

 

❗❗సమస్య_1❗❗❗

వరంగల్ రోడ్ల మీద గుంతలు.. ప్రయాణికుల ఇబ్బందులు

వరంగల్, నేటిధాత్రి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రహదారులు అక్కడక్కడ గుంతలతో ఉండటం, ప్రయాణం చేస్తున్న వాహనదారులకు సడన్ బ్రేక్ వేయలేక అందులో నుండి వెళ్ళే క్రమంలో కింద పడటం , సడన్ బ్రేక్ వేయడం వలన ప్రమాదాలు జరుగుతున్న తీరు. ఎంజిఎం నుండి ములుగు రోడ్డు వెళ్లే ప్రధాన రహదారిలో కియా కార్ షో రూమ్ ముందు, పాత సిటీ గ్రాండ్ హోటల్ ముందు, గార్డెన్ ముందు రోడ్డు మధ్యలో గుంతలు ఉండటం వల్ల ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోతన నగర్ నుండి హంటర్ రోడ్డు వెళ్ళే మార్గం మరి అధ్వాన్నంగా తయారయిన పట్టించుకునే నాథుడు లేడు. ఈ ఏరియా నగర మేయర్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. పరిస్థితి చూస్తే అర్థం చేసుకోవచ్చు ప్రజా ప్రతినిధులకు వారి డివిజన్ లో రోడ్ల మీద ఎలాంటి నిర్లక్ష్యం ఉందో అని. అలాగే ములుగు రోడ్డు జంక్షన్ లో రోడ్డు గుంతల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పోచంమైదాన్ నుండి కాశీబుగ్గ వైపు వెళ్ళే దారిలో రోడ్డులో అక్కడక్కడా గుంతల వల్ల ఇబ్బందులు. మరికొన్ని చోట్ల రోడ్డు పనుల వల్ల ఇబ్బందులు జరుగుతున్న తీరు. తాత్కాలికంగా బోర్డు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. గుంతలు ఉన్న చోట తాత్కాలికంగా గుంతలు పూడ్చే అవకాశం ఉన్న కూడా పట్టించుకొని బల్దియా అధికారులు. స్థానిక కార్పొరేటర్లు సైతం వారికి ఏమి పట్టనట్లు ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రజలకు రోడ్డు ప్రమాదాల నుండి కాపాడే ప్రయత్నం అటు అధికారులు కానీ ఇటు నాయకులు కానీ చేయకపోవడం పట్ల నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

అడుక్కో గుంత.. ఆపై అడపాదడపా కురుస్తున్న వర్షాలతో బురదమయంగా మారిన రోడ్లు వాహనదారులను భయపెడుతున్నాయి. వాహనదారులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన రహదారులు మృత్యుఢంకా మోగిస్తున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు, కాలనీల్లోనీ రోడ్లు కూడా అధ్వానంగా మారాయి. గుంతలు పూడ్చడానికి తట్ట మట్టి కూడా వేసే వారు లేక పోవడంతో, రోడ్డెక్కాలంటే వాహన చోదకులు వణికిపోతున్నారు. పెద్దపెద్ద గోతులతో.. నీటితో నిండిన గుంతలతో రోడ్లు వాహన చోదకులను బెంబేలెత్తిస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లుకు ఇటీవల కురుస్తున్న చిన్న చిన్న వర్షాలు తోడవడంతో చిధ్రమై పోయాయి. ప్రమాదాలకు కేంద్రాలుగా నగరంలోని పలు రోడ్లు మారాయి. పగలు అష్టకష్టాలు పడి రాకపోకలు సాగిస్తున్నా.. రాత్రుళ్లు మాత్రం ఆయా రోడ్లపైకి వెళ్లేందుకు భారీ వాహన చోదకులు సైతం భయపడుతున్నారు. రోడ్లు బాగు చేయండి సార్‌ అని ఆయా ప్రాంతాల ప్రజలు చేసుకుంటున్న వేడుకోలు అటు అధికారులను.. ఇటు ప్రజాప్రతినిధులను కూడా కదల్చలేకపోతున్నాయి.

రోడ్ల మరమ్మతులు మరిచారు..

City residents

వర్షాకాలం మొదలైంది. దెబ్బతిన్న రోడ్లకు చేసే మరమ్మతులు కొన్ని రోజులుగా నిలిచిపోయాయి. బల్దియా కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ఉన్నారు కానీ, ఉన్న రోడ్లు, గుంతలు పడ్డ రోడ్లకు, మరమ్మతు పనులకు బడ్జెట్‌ని విడుదల చేయకపోతుండటంతో కొత్త రోడ్ల నిర్మాణం మాట అటుంచి, ఉన్న రోడ్ల మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. గతంలో వర్షాకాలంలో ధ్వంసమైన రోడ్లకు సంబంధించి తాత్కాలిక, శాశ్వత మరమ్మతుల పేరుతో తొలుత ప్రతిపాదనలు స్వీకరించి ఆ తర్వాత నిధులు మంజూరు చేసి రోడ్లకు రిపేర్లు చేయించేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏ కోశాన కనిపించడం లేదు.

 

❗❗సమస్య_2❗❗❗

 

చెత్తను తొలగించండి మహాప్రభో…

మున్సిపల్ కమిషనర్ కు నగర వాసుల వినతి.

నెల రోజులుగా ఆటోలోనే పేరుకుపోతున్న చెత్త.. చోద్యం చూస్తున్న మున్సిపల్ సిబ్బంది..

ప్రధాన రహదారి పార్కింగ్ మయం.. ఆటోనగర్ రోడ్డు ఇరువైపుల ఇష్టారాజ్యంగా పార్కింగ్..

వరంగల్, నేటిధాత్రి.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొన్ని డివిజన్లలో రోడ్లపై చెత్త వేయడం వాటిని నెలల తరబడి తీయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరు. అసలే వర్షాకాలం మొదలైంది. చెత్తను ఇంటింటి నుండి సేకరించి ఆటోల్లో తరలించే విధానం ఉన్న కూడా అక్కడక్కడా కొందరు సిబ్బంది నిర్లక్యం వల్ల చెత్త రోడ్డు మీద వేయడం, అక్కడి చెత్తను రోజుల తరబడి తీయకపోవడం జరుగుతుంది. హనుమకొండ నగరంతో పోల్చుకుంటే వరంగల్ లో పారిశుధ్యం పనులు వెనుకబడే ఉన్నాయి. నగరంలోని 23వ డివిజన్ వార్డులో, ఎంజిఎం సర్కిల్ నుండి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రోడ్డు మార్గంలో, యూనివర్సిటీ ముందు, ప్రభుత్వ కంటి దవాఖాన పక్కన, ప్రధాన రహదారిపై, ఆటోలోనే చెత్త వేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా చెత్తను తొలగించడం లేదని అటు వైపుగా వెళ్తున్న వాహనదారుల ఆవేదన. ఆ చెత్తవల్ల దోమలు చేరి విష జ్వరాలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. చెత్తను తొలగించండి మహాప్రభో అంటూ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ను వేడుకుంటున్నారు.

రోడ్ల మీద చెత్తను వెంటనే తొలగించాలి.

రోడ్ల మీద చెత్త వేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, అలాగే పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి, చెత్తను రోడ్లపై వేయకుండా ఉండటానికి, ప్రతి ఒక్కరూ తమ చెత్తను చెత్త కుండీలలో వేయాలి. మరియు, చెత్తను సేకరించే సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ ఉండాలి. రోడ్ల మీద చెత్త వేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వాటిలో కొన్ని ఆరోగ్య సమస్యలు, రోడ్ల మీద పేరుకుపోయిన చెత్తలో దోమలు, ఈగలు మరియు ఇతర క్రిములు వృద్ధి చెందుతాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. రోడ్ల మీద చెత్త వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తాయి మరియు దుర్వాసన వస్తుంది. ఆటోనగర్ లో కొందరు రోడ్ల మీదే చెత్తను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. వర్షం వచ్చినప్పుడు, రోడ్లపై ఉన్న చెత్త మురుగునీటి వ్యవస్థను అడ్డుకుంటు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు ప్రజలు అటు అధికారులు చెత్త తొలగింపు విషయంలో కఠినంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక కార్పొరేటర్లు కూడా చొరవ తీసుకొని పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చి చెత్తను తొలగించాలని, స్థానిక నాయకులు చొరవ తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలి.

పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలి

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలోని పోస్టుమెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న నైట్ వాచ్మెన్,డే వాచ్మెన్,కుక్,స్లీపర్,స్కావెంజర్స్ వేతనాలు గత ఏడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు.ఈ వేతనాలను తక్షణమే చెల్లించాలని కార్మికులను ఆదుకోవాలని శనివారం రోజున భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో దళిత అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్.దుర్గ ప్రసాద్ కి మెమోరండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మానందం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా పరిధిలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే కుక్,స్వీపర్ అండ్ స్కావెంజర్,నైట్ వాచ్మెన్,డే వాచ్మెన్ లకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు.మంచిర్యాల జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పని చేసే వర్కర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల తీవ్ర జాప్యం జరుగుతుంది.రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసిన అనంతరం కంటిన్యూషన్ లెటర్ రాలేదని బిల్లులు పెట్టకుండా పెండింగ్ లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది.అనంతరం సంబంధిత శాఖ నుంచి ట్రెజరీ కి బిల్లులు పెట్టాల్సి ఉంటుంది.ఈ బిల్లులు పెట్టే కోణంలో ప్రొఫెషనల్ టాక్స్, టి.డి.ఎస్ కట్టకుండా బిల్లులు పంపించడం వల్ల ట్రెజరీ లో బిల్లులు చేయకుండా పెండింగ్ లో పెడుతున్నారు.బిల్లులు రిటర్న్ చేస్తున్నారు.ఒకవేళ ట్రెజరీ నుంచి బిల్లులు చేసి ప్రభుత్వ ఖజానాకు పంపిస్తే ఈ కుబేర్ అని,బ్రీజింగ్ అని నెలలు గడిచి పోతుంటాయి.ఈ విధానం వల్ల దళిత అభివృద్ధి శాఖ పోస్టుమెట్రిక్ హాస్టల్ లో పనిచేసే వర్కర్స్ కు వేతనాలు రాకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు.కనుక ఇప్పటికైనా ప్రభుత్వం,ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ విధానాన్ని మార్చి కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు కలెక్టర్ ఖాతా నుంచి చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్ టియు) డిమాండ్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సంపత్,సునీత, మల్లేశ్వరి,హేమ,పద్మ,లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలు అభినందనీయం.

సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలు అభినందనీయం…

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి పేదవాడికి అండగా ఉండి,వారికి చూపును అందించే ప్రయత్నమే ఈ కార్యక్రమం.. సుంకిరెడ్డీ రాఘవేందర్ రెడ్డి ప్రారంభమైన ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు ముఖ్య అతిథులుగా హాజరైన కల్వకుర్తి కోర్టు సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి ప్రముఖ డా.దామోదర్ రెడ్డి మొదటి రోజు 800 మందికి పైగా శిబిరానికి హాజరుకాగా 600 మందికిపైగా కంటి పరీక్షలు, 35 మందిపేషెంట్లు కంటి శుక్లాల సర్జరీలకి ఎంపిక. 300 పైగా ఉచిత కంటి అద్దాల పంపిణి… శనివారం కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని CKR ఫంక్షన్ హాల్లో…ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు& TASK-C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో ఐక్యత ఫౌండేషన్& శంకర నేత్రాలయ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు స్థానిక ప్రముఖ డా.దామోదర్ రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా,సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి శిబిరాన్ని సందర్శించి ఉచిత కంటి వైద్య శిభిరం సేవలను పరిశీలించి,అద్దాల పంపిణి,కంటి సర్జరీలకు సంబంధించిన పలు విషయాలు వైద్యుల బృందంతో చర్చించి వారిని అభినందించారు.ఈ సందర్భంగా సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి గారు మాట్లాడుతూ… సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలు అభినందనీయం అని,గత కొన్ని నెలలుగా నేను ఎక్కడ చూసినా సుంకిరెడ్డి సామాజిక సేవలు గమనిస్తున్నానని,వాటికి సంబంధించిన పలు గురించి కూడా నేను తెలుసుకున్నానని,వారికి సమాజం పట్ల,ప్రజలకు ఏదో చెయ్యాలనే సేవా దృక్పథానికి అభినందిస్తున్నానని, సుంకిరెడ్డి లాగే ప్రతి ఒక్కరు సమాజం పట్ల ఎంతో కొంత సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలని,పేదలకు ఉచిత కంటి సర్జరీలు,అద్దాల పంపిణి వంటి వ్యయంతో కూడుకున్న సేవలను పేద ప్రజలకి అందిస్తున్నందుకు వారిని ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తు,ఒక గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు…డా.దామోదర్ రెడ్డి మాట్లాడుతూ… కల్వకుర్తి ప్రాంతంలో ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి,పేదలకు ఉచితంగా సర్జరీలు చేసి,వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని వారి గొప్ప సేవలు కల్వకుర్తి ప్రజలకు అందిస్తున్నందుకు ఈ సందర్భంగా సుంకిరెడ్డి అభినందనలు తెలియజేస్తు,గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు…సుంకిరెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలు తమ తమ ఆర్థిక ఇబ్బందులు,పలు కారణాల వలన కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, నియోజకవర్గంలో కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రతి పేదవాడికి తన వంతు ప్రయత్నంగా అండగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టానని,మా కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసి,తమ విలువైన సమయాన్ని కేటాయించి,పలు సూచనలు అందించిన సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి మేడమ్ స్థానిక సీనియర్ డా.దామోదర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు…ఈ కార్యక్రమంలో…కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పవన్ కుమార్ రెడ్డి గారు,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బీస బాలరాజు,యువజన నాయకులు పర్శపాకుల రమేష్,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వర్షాకాలం గ్రామ సమస్యలపై శ్రద్ధ వహించాలి.

వర్షాకాలం గ్రామ సమస్యలపై శ్రద్ధ వహించాలి

డిపిఓ డి.వెంకటేశ్వరరావు

జైపూర్,నేటి ధాత్రి:

శనివారం రోజున జిల్లా పంచాయితీ అధికారి డి.వెంకటేశ్వర రావు జైపూర్ మండలంలోని కుందారం గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.వీధులన్నీ తిరుగుతూ గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి, రోడ్డు ప్రక్కన,షాపుల ముందు ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి పంచాయితీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రతీరోజూ తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని,గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు,ఇతర వ్యర్థాలు లేకుండా జాగ్రత్తగా శుభ్రపరచాలని తెలిపారు,షాపుల యజమానులు ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను రోడ్డు ప్రక్కన పడవేయవద్దని,డస్ట్ బిన్ వాడాలని సూచించారు.సెగ్రిగేషన్ షెడ్ లో కంపోస్టు ఎరువు తయారు చేయాలని,స్మశాన వాటిక పరిశుభ్రంగా ఉంచాలని,పల్లె ప్రకృతి వనం మొక్కలను సంరక్షించాలన్నారు.త్రాగునీటి వాటర్ ట్యాంకు లను పరిశీలించి క్లోరినేషన్ చేయించి శుభ్రమైన నీటిని మాత్రమే సరఫరా చేయాలని, కురుస్తున్న వర్షాకాల దృష్ట్యా సరిపడా బ్లీచింగ్ పౌడర్,బై లార్వా నిల్వ ఉంచుకోవాలని,నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని,వర్షాకాలం గ్రామ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయితీ కార్యదర్శికి సూచించడం జరిగింది.అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు.ఈ పర్యటనలో డిపిఓ వెంకటేశ్వరరావు,జైపూర్ మండల పంచాయితీ అధికారి శ్రీపతి బాపురావు,పంచాయతి కార్యదర్శి ఎం.విష్ణువర్ధన్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచాలి

బారసా జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్

వనపర్తి నేటిదాత్రి :

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ పిలుపుమేరకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో వనపర్తి పట్టణ బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ అధ్యర్యములో వనపర్తి పట్టణం లో 6 వ వార్డు మెట్టుపల్లి లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు వారు చేసిన అభివృద్ధి పై ప్రజలను అడిగి తెలుసుకున్నామను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తెలిపారు మెట్టుపల్లి ప్రజాలు ప్రజలు మాజీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకరముతో వనపర్తి అభివృద్ధి జెరిగిందని ప్రజలు తెలిపారని శ్రీధర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనె అమలు పరచాలని బీ ఆర్ ఎస్ నేతలు డిమాండ్ చేశారు మెట్టుపల్లి 6 వార్డు పర్యటన లో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ప్రధాన కార్యదర్శి గందం పరంజ్యోతి మాజీ కౌన్సిలర్లు బండారు కృష్ణ నాగన్న యాదవ్ ఉంగ్లం తిరుమల్ ప్రేమ్ నాథ్ రెడ్డి స్టార్ రహీం మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు భాగ్యరాజ్ కవిత సింగనమణి గోపాల్ సునీల్ వాల్మీకి డి దానేలు జహంగీర్ రామకృష్ణనాయుడు అలీమ్ ముని కుమార్ బొడ్డుపల్లి సతీష్ అనుపటి రాము వెంకట్ రఘు బంగాలే వజ్రాల సాయిబాబా గొర్ల బాలయ్య తోట శ్రీను జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు

నష్టం కలిగించే నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలి.

కార్మికులకు నష్టం కలిగించే నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలి..

కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

భూపాలపల్లి నేటిధాత్రి

కార్మికులకు నష్టాన్ని కలిగించే నాలుగు నల్ల చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఏఐటీయూసీ మధుగాని విజయేందర్, ఐఎన్టీయూసీ జోగబుచ్చయ్య, సి ఐ టియు కంపేటి రాజయ్య, టీబీజీకేఎస్ బడితల సమ్మయ్య లు డిమాండ్ చేశారు. కేటీకే ఓసి-3 యూజీ గని లో పిట్ సెక్రటరీ ఎల్ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్లో జాతీయ సంఘాల జేఏసీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు విభజించి కార్మిక హక్కులను కాల రాసిందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వo బీజేపీ చట్టాలు సవరణ చేసి 4 నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయబోతుందని వాపోయారు. ఈ నాలుగు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను భూపాలపల్లి ఏరియాలోని అన్ని మైన్స్, డిపార్ట్మెంట్లలో పనిచేసే కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘాల నాయకులు నూకల చంద్రమౌళి, కార్మికులు పాల్గొన్నారు.

జై బాపు, జై భీం, జై సంవిధాన్ సభ ఘన విజయం..

జై బాపు, జై భీం, జై సంవిధాన్ సభ ఘన విజయం

ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన నవాబుపేట మండల ఓబీసీ శాఖ అధ్యక్షులు

శంకర్ పల్లి,నేటి ధాత్రి జూలై 5:
శుక్రవారం ఎల్బి స్టేడియంలో నిర్వహించిన “జై బాపు – జై భీం – జై సంవిధాన్” సభకు ప్రజలు భారీగా హాజరై సభను ఘనవిజయంతో ముగించేందుకు తోడ్పడినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నవాబుపేట మండల ఓబీసీ శాఖ అధ్యక్షులు జూలకంటి శ్రీధర్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
“సాంఘిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి, మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు, యువతకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన రాజ్యాంగ మూల్యాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో ఈ సభ ఒక గొప్ప మాదిరిగా నిలిచింది” అని అన్నారు. సభ విజయవంతం కావడంలో ముఖ్యపాత్ర వహించిన యువత సంఘాలు, స్థానిక నాయకులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సభ అనంతరం ప్రజల్లో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపించిందని పేర్కొన్నారు.

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి.

9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు

నర్సంపేట,నేటిధాత్రి:

ఈ నెల తొమ్మిదోతేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ
బిఆర్టియు, సిఐటియు , ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ న్యూ, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ అధికారి,మున్సిపల్ కమిషనర్ లకు వేరువేరుగా సమ్మె నోటీసు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం,బిఆర్టియు రాష్ట్ర నాయకురాలు నల్ల భారతి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునీశ్వర్,సిఐటియు జిల్లా నాయకులు హన్మకొండ శ్రీధర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ బహుళ జాతి కంపెనీలకు ఉపయోగపడే విధంగా కార్మిక చట్టాలను సవరణ చేసి నాలుగు లేబరు కోడ్ లను తీసుకురావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నెల 9న జరిగే సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పనిని ప్రాథమిక హక్కుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం 26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్, హమాలి యూనియన్ డిజైనర్ అధ్యక్షుడు బొల్లం ప్రసాద్, అన్నం రాజు, మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సారయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం సమ్మయ్య, అల్వాల రాజు, గజ్జల మహేందర్,హమాలి పెద్ద మనుషులు జనార్ధన్, మంద మల్లయ్య, గాండ్ల రాములు,ఎడ్ల నాగులు తదితరులు పాల్గొన్నారు.

వినతులను సకాలంలో పరిష్కరించాలి.

#వినతులను సకాలంలో పరిష్కరించాలి*

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఆర్టిఐ యాక్ట్,ప్రజావాణి దరఖాస్తుల పరిష్కరణపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వివిధ సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు సమర్పించిన వినతులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో
ఆర్టిఐ యాక్ట్, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతి,శాఖల వారిగా కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీఐపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,చట్టం అమలు..ఎదురయ్యే సవాళ్లు చట్టాన్ని సమర్ధవంతంగా ఉపయోగించడం వంటి అంశాలపై కలెక్టర్ అధికారులకు కూలంకషంగా వివరించారు.పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో సరైన రూపంలో అందించాలని అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత జవాబుదారీతనం పెంచడానికి ఆర్టీ ఐ చట్టం అమలు చేయడం జరుగుతున్నదని అన్నారు.ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షిస్తూ ప్రతివారం స్వీకరించిన సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఆ వారంలోనే ఖచ్చితంగా పరిష్కరించాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వారి శాఖల ద్వారా అమలు చేసే కార్యాచరణ ప్రణాళిక వెంటనే సమర్పించాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాములను పరిశీలించిన..

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జిల్లా గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా,ఆదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలసి శనివారం పరిశీలించారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేసి,ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు,సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీలో తహసీల్దార్ ఇక్బాల్,నాయబ్ తహసీల్దార్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

జవహర్‌ నవోదయ విద్యాలయంలో.

జవహర్‌ నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ ప్రకటన విడుదల

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా మామూనూరులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు 13 డిసెంబర్‌ 2025 నాడు ఎంపిక పరీక్ష నిర్వహించబడుతుందని ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ 2014 మే 1, నుండి 2016 జూలై 31 మధ్య జన్మించిన విద్యార్హులు ఎంపిక పరీక్షకు అర్హులు అని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3,4వ తరగతులు చదివి ఉండాలని పేర్కొన్నారు.ఆసక్తి కలిగిన విద్యార్థులు జూలై 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో www.navodaya.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.మిగతా వివరాలకు 94910 34552 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ తెలిపారు.

ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా మేరుగు.

ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా మేరుగు. మోహన్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడుగా మేరుగు మోహన్ ఎన్నికయ్యారు. శనివారం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడి పదవికి ఎన్నికలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో గతేడాది అధ్యక్షులుగా ఉన్న మేరుగు మోహన్ మరోమారు అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వహణ భాద్యులు తెలిపారు. నూతన కమిటీలో అధ్యక్షులు మేరుగు. మోహన్,ఉపాధ్యక్షులు ఆకారపు స్వామి,ప్రధాన కార్యదర్శి సౌడారపు మధు,సహాయ కార్యదర్శి సంగినేని. ప్రశాంత్,కోశాధికారి ఎర్రబెల్లి. విద్యా సాగర్ లు ఎన్నికయ్యారు.

ముదిరాజులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.

ముదిరాజులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ‌ ముదిరాజ్ సంఘ ఉపాధ్యక్షులు. ‌ దేవనూరి కుమార్.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ముదిరాజ్ సంఘ ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్ మాట్లాడుతూ ‌ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ముదిరాజులకు ఇచ్చిన హామీల వెంటనే నెరవేర్చాలని మండల ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్ డిమాండ్ చేశారు ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ముదిరాజుల రిజర్వేషన్ మార్చిందని దుయ్యపట్టారు నామినేట్ పదవులను జనాభా ప్రాతిపదికన ముదిరాజులకే ఎక్కువ పదవులు కేటాయించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభాలో ముదిరాజులు సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉన్నారు విశ్వశనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతం ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన కులగనన సర్వేలో తేలిందని తెలిపారు

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు..

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలం కొత్తూర్ బి గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి గారి మాతృమూర్తి స్వర్గస్తులైనరు విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గ్రామానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించి ,కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు జహీరాబాద్ ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ యువ నాయకులు మిథున్ రాజ్, చిన్న రెడ్డి,దీపక్,శ్రీకాంత్, పాప్ నాథ్, విజయ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.

డిసిసి బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటిన.

డిసిసి బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని డిసిసి బ్యాంక్ ఆవరణలో శనివారం రోజున ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొక్కలు నాటడం జరిగింది, పచ్చని చెట్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని చెట్టును రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని గ్రామంలోని ప్రజలందరూ ఇంటికి నాలుగు మొక్కలు చొప్పున పెంచాలని అందరు మొక్కలు నాటినప్పుడే రాష్ట్రం పచ్చదనంగా ఉంటుందని కాలుష్య బారిన పడకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు, అనంతరం బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటారు, అలాగే మొక్కలు నాటడమే కాదని వాటిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో డిసిసి బ్యాంక్ మేనేజర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, రాయకమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య ,కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు అలకొండ కుమారు, మరియు కాంగ్రెస్ నాయకులు బుర్ర శ్రీనివాసు అల్లం రాజు గంగాధర్ రవి, బ్యాంక్ సిబ్బంది కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్న.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్న మహాదేవపూర్ బాలికల పాఠశాల విద్యార్థిని
మహాదేవపూర్ జులై 5( నేటి ధాత్రి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో జడ్పీ హెచ్ ఎస్ బాలికల పాఠశాల నుండి మాడిగ అక్షిత ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఇటీవల భూపాలపల్లిలో అథ్లెటిక్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి జిల్లా స్థాయి సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిజవహర్ లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండ లో జరగబోయే సబ్ జూనియర్ అండర్ 14 ట్రై అత్లాన్ విభాగంలో పాల్గొంటుందని,ఆ పాఠశాలపిడి గురుసింగ పూర్ణిమ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న MEO ప్రకాష్ బాబు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సరిత మాట్లాడుతూ విద్యార్థిని అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో రాణించాలనిఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ఉపాధ్యాయలు మడక మధు,సుధారాణి,సరితా దేవి,హోలీ పాషా, శ్రీనివాస్,వసుదప్రియ,వీరేశం,సమ్మయ్య,లీలారాణి,రజిత,సాహెదా బేగం,ప్రసూన, దీపిక,ఆంజనేయులు, అజ్మత్ పాషా లు విద్యార్థినిఅభినందించారు

వైద్య ఖర్చులకోసం నిరుపేద ఎదురుచూపు..

వైద్య ఖర్చులకోసం నిరుపేద ఎదురుచూపు,
నేటి ధాత్రిమొగుళ్లపల్లి:
విద్యుత్ షాక్ తో ఒళ్లంతా కాలి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఒక యువకుడు వైద్య ఖర్చులకోసం అప్పన్న హస్తం అందించే మహానుభావుడు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన జన్నే అనిల్ అలియాస్ అంజి. ముట్లపల్లి సబ్ స్టేషన్ లో అన్ మ్యాన్డ్ కార్మికుడిగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు గత రెండు రోజుల క్రితం విద్యుత్తు పోలుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలపాలు అయ్యాడు తొలుతగా వరంగల్లోని గార్డెన్ హాస్పిటల్ తరలించగా అక్కడి నుండి ఎంజీఎం కు పంపించారు మళ్లీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని యశోద హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. రికార్డ్ అయితే డొక్కాడని అంజి కుటుంబం వైద్య ఖర్చులకోసం తెలిసిన బంధువుల వద్ద అప్పులు తెచ్చి చికిత్స అందిస్తున్నారు అయితే అవి సరిపోక మరిన్ని డబ్బులు కావాలని హాస్పటల్ సిబ్బంది తెలుపగా వైద్య డబ్బుల కోసం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు గాయపడిన అంజికి భార్య తల్లి తండ్రి ఉన్నారు తండ్రి అనారోగ్యంతో మంచంలో పడి గత కొన్ని సంవత్సరాలుగా లేవలేని స్థితిలో ఉండగా ప్రస్తుతం గాయపడిన అంజి కన్న తండ్రికి సేవలు అందించేవాడు ప్రస్తుతం అంజి వెన్నుముక దెబ్బతిని లేవనెల స్థితిలో దావకానలో మెరుగైన వైద్యం కోసం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు భార్య కూలి పని చేసుకుంటూ ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న దిన స్థితిలో అంజి కుటుంబం తల్లడిల్లుతుంది యశోద హాస్పిటల్ లో మెరుగైన వైద్యం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడి ప్రజల నుండి ఆర్థిక సహాయం అర్జిస్తున్నాడు మనసున్న మహారాజులు నిరుపేద దళిత కుటుంబానికి చెందిన జన్నే అంజి వైద్యం కోసం సహాయం అందించాలని అంజి కుటుంబ సభ్యులు ప్రజలను వేడుకుంటున్నారు, అంజికి ఆర్థిక సహాయం అందించాలనుకునేవారు ఈ క్రింది నెంబర్ కు ఫోన్ పే ద్వారా పంపించగలరు 8790519548.

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి.

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వడానికి జీవన్ దాన్ మహాదానమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.శనివారం తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ, టీ 9 ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలోని ఆబ్నుస్ ఫంక్షన్ హాల్ లో నేత్ర అవయవ శరీరదానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ముఖ్య అతిధిగా పాల్గొని అతిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కలగాలని, అవయవ దానంతో మరికొందరి జీవితాలలో వెలుగు నింపవచ్చునని, దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన కలగాలని చెప్పారు.కొన్ని మత ఆచారాలు అవయవ దానం చేస్తే జీవుడు దైవంలో ఐక్యం కాదన్నా అపోహ ఉందని, కానీ మనిషి ప్రాణం నిలబడితే ఆ దైవం కూడా అనుగ్రహిస్తాడని తెలిపారు. అవయవదానం చేసిన వారు మహాత్ములని, చిరంజీవులుగా మిగిలిపోతారని సూచించారు.మనిషి చనిపోతే ఇక తిరిగి రారు,ఇక లేరు అనుకుంటారని,కానీ ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి 8 మందికి కొత్త జీవితాన్ని ఇస్తుందన్నారు.వేల మంది రోగులు తమకు అవసరమైన అవయవాలు సరైన సమయంలో లభించకపోవడంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాబట్టి రక్తదానం చేసే విధంగానే ప్రతి ఒక్కరూ అవయవనానికి సైతం ముందుకు రావాలని కోరారు. జీతే జీతే రక్తదానం జాతే జాతే నేత్రదాన్, దేహ్ దాన్ చేయాలన్నారు.రోగిని బ్రతికించే వాళ్ళు డాక్టర్లు దేవతలైతే అయితే దానం చేసిన వారు దైవదూతలన్నారు.అవయవ దానం పై అవగాహన కార్యక్రమాలను ఉదృతం కలెక్టర్ చేయాలని కోరారు.
దాతలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లు, నిర్వాహకులకు అధికారులు వైద్య సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు, వక్తలు మాట్లాడుతూ
అవయవ దానం యొక్క
ప్రాముఖ్యతను వివరించారు
చనిపోయిన తర్వాత అవయవాలను కాల్చడం ద్వారా బూడిద పాలు మట్టిలో పాతడం ద్వారా మట్టి పాలు చేయకుండా అవయవ దానం చేసి చిరంజీవులుగా మిగిలిపోవాలని తెలిపారు.ఈ సందర్భంగా అవయవ దానం చేయుటకు అంగీకరించిన వారికి శాలువాలతో కలెక్టర్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు
కేఎంసీ, ఎంజీఎం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ లు డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, డాక్టర్ చిలుక మురళి,డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్ కూరపాటి రమేష్,ప్రభుత్వ సూపర్డెంట్ డాక్టర్ భరత్ కుమార్, మైదం రాజు, తహసీల్దార్ ఇక్బాల్, నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version