కోదాడలో దారుణం: తమ్మర వాగు వద్ద ఎక్స్పైరీ బిస్కెట్ ప్యాకెట్ల కుప్పలు.. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పై ఆగ్రహం.
చిరు వ్యాపారస్తులతో తమ్మర వాగు చెత్త డంపింగ్ యార్డ్ గా మారి కంపు
చూసి చూడనట్టు మున్సిపాలిటీ అధికారుల పనితీరు
కోదాడ, నేటి ధాత్రి :
కోదాడ పట్టణంలోని తమ్మర వాగు వద్ద ఎక్స్పైరీ అయిన బిస్కెట్ ప్యాకెట్లను పడిసిపోవడంతో పరిసరాలు దారుణంగా తయారయ్యాయి. మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని ప్రతిరోజు చెత్తను సేకరించే ప్రక్రియ ఉన్నప్పటికీ వాగుల వద్ద ఇలా వ్యర్ధాలు పడేయడం మున్సిపాలిటీ అధికారులు పర్యవేక్షణ లోపాన్ని స్పష్టం చేస్తోంది. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న, ముందస్తు నిబంధనలను జారీ చేయడంలో గాని, జరిమానాలను విధించడంలో గాని అధికారులు విఫలమవుతున్నారు. మున్సిపల్ మరియు ఆహార భద్రతాధికారులు పట్టణంలోని దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. మున్సిపల్ అధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవడంలో అశ్రద్ధ వహిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
