జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ మహమ్మద్ గౌసోద్దీన్
జహీరాబాద్ నేటి దాత్రి:
మార్క్ పేడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రంను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము( పిఎసిఎస్ ) ఝరాసంగంలో ప్రారంభించిన. చైర్మన్ మొహమ్మద్ గౌసోద్దీన్ ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా. చైర్మన్ మాట్లాడుతూ, రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 3699/ పొందాలని చెప్పారు.మార్కెట్లో జొన్నలకు తక్కువ ధరలు ఉండటంతో రైతులు నష్టపోకుండా, దళారుల చేతుల్లో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతుల ప్రయోజనాల కోసమే ఈ కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు.రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని. చైర్మన్ కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, మార్కెట్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు రైతులు
కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ పి. సంజీవేరెడ్డి, సొసైటీ డైరెక్టర్, కృష్ణ, సుబాష్, మారుతీ రావు పటేల్, సర్పంచ్ మల్లారెడ్డి, టెంపుల్ డైరెక్టర్ జి. మల్లకార్డున్ పటేల్, మల్లన్న మరియు సీఈఓ సుకుమార్ సోసైటె సెక్రటరీ షేక్ నిస్సార్ ఆహ్మద్ సంఘ సిబ్బంది, రైతులు, టి. రాజెందర్ సింగ్, రాంరెడ్డి బషీరెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రవీణ్ కుమార్, రైతులు తదితరులు పాల్గోన్నారు
