రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థిని వడ్లూరి వంశీక రాష్ట్రస్థాయి వాలీబాల్ అండర్ 14 పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్ గ్రామంలో జరిగిన ఎస్జిఎఫ్ అండర్ 14 విభాగంలో పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపిక కావటం జరిగింది. ఈసందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థిని అభినందించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.