నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా భీమారం మండలం భీమారం స్టేషన్ పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసిపి వెంకటేశ్వర్, శ్రీరాంపూర్ సీఐ మోహన్, భీమారం ఎస్ఐ రాములు, జైపూర్ ఎస్సై నాగరాజు, ఎక్సైజ్ అధికారులు మరియు 60 మంది పోలీసు సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజలతో మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 17 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, గుడుంబా తయారుకి సిద్ధంగా ఉన్న 1200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎసిపి వెంకటేశ్వర మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే ఏ సమయంలోనైనా 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరూ కలిగి ఉండాలి అన్నారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ, నిఘా కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ ,జైపూర్ ఎస్ఐ నాగరాజు, ఏఎస్ఐ శకుంతల, సంపూర్ణ, మాచర్ల, ముత్తయ్య, మహేష్ బాబు, సంతోష్ ఎక్సైజ్ సీఐ, ఎస్సై లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *