వీణవంక: నేటి ధాత్రి
కరీంనగర్ జిల్లా డిసిసి కార్యదర్శిగా గూటం హరిప్రసాద్ రెడ్డి
వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గూటంహరిప్రసాద్ రెడ్డిని కరీంనగర్ జిల్లా డిసీసీ కార్యదర్శిగా.
నియమిస్తూ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేయగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు నియామకపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, శ్రీమతి సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్కు, జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగల కొండల్ రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, శివరాత్రి రాజు, కట్కూరి రాజేందర్ రెడ్డి, గుటం సమ్మిరెడ్డి, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.