ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలి

ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలి.

ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్ డిమాండ్ చేశారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని చట్టాన్ని అమలు పూర్తిగా అమలు చేయకపోవడంతో ప్రైవేట్ స్కూలు యజమానాలు యజమానులు మితిమీరిన ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాక అధిక ఫీజులను అరికట్టాలని, స్కూల్లో యూనిఫామ్స్ బుక్స్ అత్యధిక ధరలకు అమ్మకుండా చూడాలన్నారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్లలో సరియైన వసతులు లేవని, వాటిని గుర్తించి బెస్ట్ అవలేబుల్ స్కీం పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. అదేవిధంగా బెస్ట్బి అవలేబుల్ స్కీం పిల్లలకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని వాటిని అరికట్టాలన్నారు. ఈ విషయంలోడీఈఓ పూర్తి పర్యవేక్షణ చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వమే ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి స్కూల్ బస్సు పిల్లలకు గనుక వేస్తే వాళ్లు తప్పకుండా డ్రాప్స్ కాకుండా పిల్లలందరూ తూర్పు వస్తారు
ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేశారు. ఇక సాంఘిక సంక్షేమ గురుకులాలలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి మరి గౌల్దొడ్డి లో అత్యధిక ప్రతిభ కనబరిచే అక్కడ బైపీసీ గ్రూపు వాళ్ళు లేక వాళ్లకు అనేక ఇబ్బందులు పడుతున్నారు 60 మంది స్టూడెంట్స్ దాన్ని కూడా ప్రభుత్వమే పరిశీలించాలి దీని మీద రేవంత్ రెడ్డి కూడా స్పందించాలి ఖచ్చితంగా నీటు, ఐఐటి కోచింగ్ తప్పకుండా ఇవ్వాలి. విద్యార్థులకు ఇదంతా చేయాలంటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడని విద్యాశాఖ మంత్రి పదవీ తన దగ్గరే ఉంచుకున్నాడని వెంటనే విద్యాశాఖ మంత్రిని నియంచాలని కేటాయించాలని అన్నారు. అంతేకాక విద్య సమస్యలు పరిష్కరించని పక్షంలో రాబోయే
రోజుల్లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున
ధర్నా రాస్తా రోకో చేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని గౌలిదొడ్డి గురుకుల ఇంటర్ ద్వితీయ సంవత్సరం చెందుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి బొజ్జపల్లి మహర్షి, లాపాక అరబిందో, శనిగరపు గణేష్ బోయిని ప్రసాద్ లాపాక శేషి పాల్గొన్నారు.
ఫొటోస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!