హస్తం విజయానికి పునాది, 10 సంవత్సరాలు కష్టంలో జై కాంగ్రెస్ అన్నది యువజన కాంగ్రెస్.
సొంత పార్టీలో చివాట్లు, సీనియర్ల కుట్రలకు తట్టుకొని హస్తం జెండా ఎగురవేసింది యువజన కాంగ్రెస్.
ఫ్రెండ్షిప్ డే సాక్షిగా తమకు అన్యాయం అంటూ భావోద్వేగాల స్టేటస్లు.
మండలంలో ఆరు నామినేషన్, సభ్యత్వం ప్రక్రియ మొదలు.
ఎన్నికలతో యువజన విభాగంలో మనస్పర్ధలు తెచ్చే పరిస్థితులు.
ఎన్నికల ప్రక్రియ సరే, మండలంలో యూత్ కాంగ్రెస్ ఒక్కటై ఒకే నామినేషన్, తో అధ్యక్షుని ఎన్నిక బలాన్ని చేకూరుస్తుంది.
ఆవేదనలో యువజన హస్తం సైనికులు, అధిష్టానం అన్యాయం చేయదు అన్న భరోసా.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా హస్తము సైనికుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ కాంగ్రెస్ యువజన విభాగం ఎన్నికల సందడి నెలకొంది, ఇదే క్రమంలో మహాదేవపూర్ మండలంలో యువజన విభాగం ఎన్నికలవేళ నామినేషన్ల దాఖలు అనంతరం పార్టీ క్రేశీల సభ్యులు నిరాశకు గురి కావడం జరుగుతుంది. మండలానికి సంబంధించిన యువజన కాంగ్రెస్ అధిపతి విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన ఒకవైపు ఉన్నప్పటికీ అధిష్టానం తమకు న్యాయం కూడా చేస్తుందని మరో నమ్మకాన్ని వెళ్ళబోస్తున్నారు యూత్ కాంగ్రెస్ సభ్యులు. ఇక మండలానికి సంబంధించిన యువజన కాంగ్రెస్ హస్తం సైనికులు వారి భావాలను వాట్సప్ స్టేటస్ పంచాయతీ లో కి తీసుకు వెళ్లడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది.
హస్తం పార్టీ కష్ట కాలంలోనూ అనేక నాయకులు పార్టీలు ఫిరాయింపు చేస్తున్న సమయంలో, యువజన కాంగ్రెస్ సైనికుల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే తమ పార్టీ జెండా ఎజెండాను ప్రజల్లోకి తీసుకు వెళ్ళింది, ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిన యువజన కాంగ్రెస్ వెనుకడుగు వేయకుండా పార్టీ బలోపేతానికి కృషి తమ లక్ష్యంగా ముందుకు సాగారు, అధికారం అంటే లెక్కలేదు అనే విధంగా తమ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ, తమ నాయకుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దుద్దిళ్ల శీను బాబు, అనేదే ఏకైక లక్ష్యంతో కష్టకాలంలో జెండాను ఊపిన సైనికులు యువజన కాంగ్రెస్ సభ్యులు, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధర్ బాబు ఓటమి పాలైనప్పటికీ అధికారం కోసం పార్టీలు మారకుండా జై శ్రీధర్ బాబు అని నాదాలతో కష్టకాలంలో పార్టీని వీడని సైనికులు మండల యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, అదే సమయంలో అనేక హస్తం నాయకులు పదవుల కోసం పార్టీలు మారిన, హస్తం దుద్దిల్ల కొరకే తమ జీవితం అంకితం అనే దిశగా ప్రయత్నిస్తున్న యువజన విభాగంలో సొంత పార్టీ నాయకులు చిచ్చుపెట్టిన, చివాట్లు పెట్టిన జండా మార్చకుండా తమ జెండా ఎజెండా “ఓన్లీ దుద్దిళ్ల” అనే విధంగా ముందుకు సాగిన ఏకైక విభాగం యువజన విభాగం. ఈరోజు మంథని నియోజకవర్గంలో హస్తం జెండా ఎగరవేయడం నిరంతర ప్రక్రియలో కీలకపాత్ర యువజన కాంగ్రెస్ దే అనడానికి ఏలాంటి సందేహం అవసరం లేదు.
ప్రస్తుతం మహదేవ్పూర్ మండలంలో యువజన కాంగ్రెస్ ఎన్నికల వేల పలు బాధాకరమైన సన్నివేశాలు సామాజిక మద్యం వాట్సప్ స్టేటస్ ద్వారా, తెరపైకి రాకపోవడం పలు ఆలోచనలకు దారి తీస్తుంది, అధిష్టానం నిర్ణయం రాహుల్ గాంధీ యువత హస్తం పార్టీ పునాదులుగా గుర్తించి యువజన కాంగ్రెస్ విభాగాన్ని దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా యూత్ కాంగ్రెస్ విభాగం పార్టీ బలోపేతానికి ఎంతో అవసరమని నిర్ణయించిన క్రమంలో, దేశంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఆదివారం రోజు జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒకవైపు స్నేహితుల శుభాకాంక్షలు మరోవైపు గత నెలలో నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తరుణంలో, మండల యువజన విభాగం తమకు అన్యాయం జరుగుతుందని ఫ్రెండ్షిప్ డే సాక్షిగా భావద్వేగంతో వాట్సప్ స్టేటస్ ల ద్వారా హస్తం నాయకులు పార్టీ కార్యకర్తలు అలాగే అధిష్టానం వరకు వెళ్లేలా ఒక చిరు ప్రయత్నం చేయడం కార్యకర్తలు నాయకులకు బాధ కలిగించేలా చేసింది. మండలంలో ఇప్పటికీ ఆరు నామినేషన్లు దాఖలు అయినప్పటికీ, మరికొందరు పోటీలో ఉండి కూడా తమ మనసులోని నిర్ణయాన్ని వ్యక్తపరచలేక ఆవేదనకు గురికావడం జరుగుతుందని తెలుస్తుంది.
మండల యువజన కాంగ్రెస్ విభాగం ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం సమంజసమైనప్పటికీ, ఓటింగ్ ప్రక్రియ మాత్రం యువజన విభాగం సభ్యత్వం పొందిన వారు కావడం, అంతర్గత మనస్పర్దలతో మెంబర్షిప్ ప్రక్రియ తమ అనుకూల సభ్యులు నామినేషన్ వేసిన వారికి సభ్యత్వం తీసుకోకపోవడం, వీటిలో పలు నాయకుల వైపు ఫిరాయింపు లాంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు, ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హస్తం పార్టీకి పునాదులైన యువజన కాంగ్రెస్ విభాగం మండల అధ్యక్షులు ఎన్నికల విషయంలో అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి సంవత్సరాలుగా పార్టీ కొరకై జండా మోసిన వారిని గుర్తించి, మండలంలో యువజన కాంగ్రెస్ విభాగంలో పనిచేస్తున్న వారిని అభిప్రాయాలు, వారి నిర్ణయాలను పరిగణంలోకి తీసుకొని యువజన విభాగం మండల అధ్యక్షుడు పార్టీ మరియు ప్రజలు అలాగే యూత్ కాంగ్రెస్ సభ్యులకు అందుబాటులో ఉండే వారిని మండలానికి సంబంధించిన యువజన విభాగం అందరూ ఒక్కటై వారి నామినేషన్ ప్రక్రియను కొనసాగించి ఎన్నికలు నిర్వహించడం వలన యువజన విభాగంలో ఇలాంటి మనస్పర్ధలు ఉండకుండా, రాబోయే పంచాయితీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడుతుందని యువజన కాంగ్రెస్ విభాగం లో ప్రస్తుతం చర్చించుకుంటున్న విషయం ఇది.
మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే యువజన విభాగానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం సెల్యూట్ కొట్టాల్సిందే, ఎందుకంటే ఒకవైపు పార్టీ జెండా మోసి తమకు న్యాయం జరగలేదని ఒకవైపు ఆవేదన చెందుతూ తమ భావాలను సామాజిక మాధ్యమం స్టేటస్ ద్వారా వ్యక్తపరుస్తూ మరోవైపు హస్తం పార్టీ అధిష్టానం దుద్దిళ్లపై తమకు నమ్మకం ఉందని, తమ అభిప్రాయాలను తప్పకుండా గౌరవిస్తారని, యువజన కాంగ్రెస్ విభాగాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి కార్యకర్తల నిర్ణయానికి అధిష్టానం ఎప్పుడు దాటి వేయలేదని, యువజన కాంగ్రెస్ విభాగానికి దుద్దిళ్ల గర్వంగా భావించడం జరుగుతుందని చెప్పుకుంటూ సభకు తమ నాయకులపై ఎంతో భరోసా ఉందని, ఇప్పటికీ యువజన కాంగ్రెస్లో దుద్దిళ్లపై నమ్మకం వ్యక్తపరచడం జరుగుతుందంటే నిజానికి యువజన విభాగానికి ప్రతి ఒక్కరు” సెల్యూట్ కొట్టాల్సిందే” యువజన విభాగం మండల అధ్యక్షు పగ్గాలు అధిష్టానం ఎవరి చేతుల పెడుతుందో వేచి చూద్దాం.