అన్ని దొంగ ఫార్మసిస్టులే కదా లైసెన్స్ రద్దు ఎందుకు చేయలేదు.
డ్రగ్ అధికారుల ఐదు గంటలు,నాలుగు మెడికల్ షాపుల తనిఖీలు చర్యలు ఏమిటో.

షోకాస్ నోటీసులతో సరిపెట్టుకునే పరిస్థితి, మరింత రెచ్చిపోయిన మెడికల్ మాఫియా.
ఫార్మసీ లైసెన్స్ నుండి ఫార్మసిస్ట్ వరకు అంతా దొంగలే చర్యలు ఎందుకు లేవు.

మెడికల్ మాఫియా నుండి పేద ప్రజల ప్రాణాలకు కాపాడేది ఎవరు. ఉన్నత అధికారులు చర్యల కు ఆదేశించాలి, మండల ప్రజలు.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
మెడికల్ మాఫియా ఆశామాషి వ్యక్తుల చేతుల్లో ఈ వ్యవహారం జరగడం లేదు కింది స్థాయి నుండి పై స్థాయి అధికారుల వరకు అంతా ఔషధ విక్రయాల్లో లోటుపాటుల వ్యవహారం అధికారులను ఎలా తమ వైపు తిప్పుకోవాలో అన్ని తెలిసి ఆరితేరిన వారు ప్రస్తుతం మహా మెడికల్ వాఫియా ముసుగులో ఔషధ విక్రయాలు జరుపుకున్న వారు. అధికారులు అంటే లెక్క చేసే పరిస్థితి ఉండదు ఈ అధికారి వచ్చిన దానికి ఎత్తుగడవేసి ఆ అధికారులను తమ వైపు తిప్పుకునే సత్తా కూడా మహా మెడికల్ మాఫియాకు కొత్తేమీ కాదు. మహా మెడికల్ మాఫియా చేస్తున్న ఆగడాలను అమాయక రోగులను ప్రజలను కనీస నిబంధనలు లేకుండా అధిక ధరలో ఔషధ విక్రయాల నుండి మొదలుకొని డాక్టర్ల అనుమతి డిస్క్రిప్షన్ లాంటి లేకున్నప్పటికీ కూడా సొంత తెలివితేటలతో ఔషధాలను అందించడం, మరోవైపు ప్రజలకు మరియు రోగులకు తమ వైపు తిప్పుకొనుటకు హై డోస్ ఇలాంటి ఔషధాలను అందించడం ప్రత్యేకంగా పలువురు రోగులకు స్వతగా ఔషధాలను తెప్పించి విక్రయించడం, మెడికల్ షాప్ రిటైల్ నిర్వహణలో కనీస నిబంధనలు కూడా లేకుండా ఔషధ విక్రయాలను జరపడం గత కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతంలోని మహాదేవపూర్ ఉమ్మడి మండలంలో మెడికల్ మాఫియాగా ఏర్పడి అమాయక ప్రజల నుండి వేల రూపాయలను దోచుకోవడం జరుగుతుంది. మహా మెడికల్ మాఫియా చేస్తున్న ఆగడాలను వరుస కథనాలుగా గత 20 రోజుల నుండి ప్రచురించడం డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. కానీ మెడికల్ షాపుల నిర్వాహణలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తనిఖీ జరిపిన అధికారులు ఎలాంటి నివేదికను శాఖకు అందించారు చర్యలు ఏమిటి అనే విషయాలు మాత్రం నేటికీ బయటకు రాలేని పరిస్థితి.
మెడికల్ మాఫియాపై డి సి ఏ, దాడులు సరే, చర్యలు ఎప్పుడు,
మహా మెడికల్ మాఫియాలో జరుగుతున్న అక్రమాలు దోపిడీ వ్యవహారాలను నేటి ధాత్రి మార్చి ఏడవ తేదీ నుండి మాఫియా గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే.
ఇక మహాదేపూర్ మెడికల్ మాఫియా కు సంబంధించి రాష్ట్ర డ్రగ్ ఉన్నత అధికారుల దృష్టికి రావడంతో ఈనెల 18వ తేదీ సోమవారం రోజున ట్రక్ అధికారులు మహాదేవపూర్ మండల కేంద్రంలోని. మెడికల్ షాపుల్లో తనిఖీలు చేయడం జరిగింది. డ్రగ్ కంట్రోల్ అధికారుల బృందం ఔషధ విక్రయాల దుకాణాల్లో తనిఖీలు చేసిన అనంతరం చర్యలు ఏమి తీసుకున్నారనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఔషధ విక్రయాల విషయానికొస్తే అనేక ప్రజల జీవితాలతో ముడిబడి ఉన్నటువంటి ఔషధ అభిప్రాయాల దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒక మాఫియాగా ఏర్పడి డ్రగ్ కంట్రోల్ అథారిటీ అలాగే కాస్మోటిక్ యాక్ట్ మరియు రూల్స్ లను తుంగలో తొక్కి అమాయకుల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ రోగుల జేబులను ఖాళీ చేస్తూ మహదేవ్పూర్ మండల కేంద్రంలో మెడికల్ మాఫియా రెచ్చిపోవడం డ్రగ్ కంట్రోల్ అధికారుల తనఖి రోగులకు మరియు ప్రజలకు డ్రగ్ కంట్రోల్ వ్యవస్థపై కాస్త నమ్మకాన్ని కలిగించింది.
కానీ ఆ ప్రజల నమ్మకం ఒక కలగానే మిగిలిపోయే పరిస్థితి. డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించి వారి బాధ్యతలను ప్రజలకు ఔషధ విక్రయాల కొనుగోలు నుండి అని కలుగకుండా జాగ్రత్తలు మాత్రం తీసుకునేలా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ అధికారులు తనిఖీ చేసిన మెడికల్ షాపులు డ్రగ్ కంట్రోల్ అథారిటీ డ్రగ్ కాస్మోటిక్ యాక్ట్ పరిధిలో విక్రయాలు జరపడం లేదన్న విషయం నగ్న సత్యం అయినప్పటికీ అధికారులు తక్షణ చర్యలకు ఆదేశించకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. మరోవైపు మహదేపూర్ లోని 4 ఔషధ విక్రయాల కేంద్రాలను తనిఖీలు చేసి పది రోజులు గడుస్తున్నప్పటికీ డ్రగ్ కంట్రోల్ అధికారుల నుండి చర్యలు లేకపోవడం అనుమానాలకు దారితీస్తున్నాయి.
అన్ని దొంగ ఫార్మసిస్టులే కదా లైసెన్స్ రద్దు ఎందుకు చేయలేదు.
ఇక మహా మండలంలో మెడికల్ మాఫియా దోపిడి వ్యవహారాన్ని గుట్టు రక్ష చేసినప్పటికీ నేటికీ మహదేవ్పూర్ మెడికల్ మాఫియాల లైసెన్స్ రద్దు ఎందుకు కావడం లేదు ప్రశ్నార్ధకంగా మిగిలింది. ప్రస్తుతం మహదేవ్పూర్ మండల కేంద్రంలో 8 మెడికల్ షాపులు అలాగే మండలంలోని సూరారం గ్రామంలో రెండు షాపులు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం 10 షాపుల నిర్వహణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు మహాదేవపూర్ మండల కేంద్రంలోని నాలుగు మెడికల్ షాపులను తనిఖీ చేయడం జరిగింది. మెడికల్ నిర్వహణలో డి సి జి ఐ పేర్కొన్న ఫార్మసీ సెక్షన్ 1947 సబ్ సెక్షన్ 42 క్లాస్ కి రూల్ 65 ప్రకారం ఫార్మసిస్ట్ ఔషధ కేంద్ర నిర్వహణలో అమ్మకాలు నిర్వహించే బాధ్యత గుర్తింపు పొందిన ఫార్మసిస్ట్ అలాగే అమ్మకాలు జరిపినటువంటి ఔషధాలకు సంబంధించిన డాక్టర్ సూచించిన ప్రిస్క్రిప్షన్లు తనిఖీలు జరిపిన అధికారులకు డి సి జి ఐ నిబంధనలకు లోబడి ఆ నాలుగు ఔషధ కేంద్రాలు కొనసాగుతున్నాయా ఆ ఔషధ కేంద్రాల్లో ఫార్మసిస్టులు లేనప్పటికీ ఫార్మసీ రూల్ 42 ప్రకారం తక్షణమే మెడికల్ షాప్ యొక్క అనుమతి రద్దు చేసే అధికారం అధికారులకు ఉంది. కానీ అధికారులు తనిఖీలు చేస్తున్న క్రమంలో అక్కడ ఫార్మసిస్టులే లేకుండా కేవలం మెడికల్ షాప్ యజమానులు వివరించడం వెనుక రాగి ఉన్న రహస్యం అర్థం కాని పరిస్థితి. గతంలో డిసి జిఐ ఔషధ విక్రయాల కు సంబంధించి ప్రధానంగా ఔషధ అమ్మకాలకు సంబంధించి గుర్తింపు పొందిన ఫార్మసిస్ట్ ఆధ్వర్యంలోనే ఔషధాల విక్రయాలు జరపాలని కఠిన ఆదేశాలు జారీ చేసిన విషయం డ్రగ్ కంట్రోల్ అధికారులకు గుర్తు లేకపోవచ్చు అని అనుకోవచ్చా, అది కేవలం అధికారులు విధి నిర్వహణ లో మరి మైన చట్టాల తదుపరి చరి అయిన కావచ్చు ఏమో అనే విధంగా ఇంకొక తప్పడం లేదు.
డ్రగ్ అధికారుల ఐదుగంటలు,నాలుగు మెడికల్ షాపుల తనిఖీలు చర్యలు ఏమిటో.
మండలంలో నిర్వహించబడుతున్న ఎనిమిది ఔషధ కేంద్రాల్లో ఈనెల 18వ తేదీ సోమవారం రోజున డ్రగ్ కంట్రోల్ అధికారులు నాలుగు మెడికల్ షాపులను సుమారు 5 గంటల పాటు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అధికారులు తనిఖీలు చేపట్టిన మండల కేంద్రంలోని 4 మెడికల్ షాపులు ఔషధాలను విక్రయించేవారు ఫార్మసిస్ట్ అర్హత కలిగి ఉన్నారా అనే విషయానికొస్తే కేవలం ఒకే వ్యక్తి ఫార్మసిస్ట్ అర్హత కలిగి ఉండి విక్రయాలు చేయడం జరుగుతుంది కానీ మిగతా ఎవరు కూడా ఫార్మా వ్యవస్థకు కనీస అనుభవం కూడా లేనివారు. సుమారు అధికారులు ఐదు గంటల పాటు క్షుణంగా తనిఖీలు చేపట్టడం జరిగింది కానీ డ్రగ్ కంట్రోల్ ఆక్ట్ ప్రకారం శాఖ పరమైన నిబంధనలకు ఔషధాలకు సంబంధించి వివరాలను కూడా పరిశీలించడం జరిగింది. కానీ అధికారులు తనిఖీ చేసిన ఔషధ కేంద్రాలు డ్రగ్ కంట్రోల్ ఆక్ట్ 1940 రూల్ 45 తోపాటు డిసిజిఐ కఠిన ఆదేశాల్లో ఏ ఒక్కటైనా తనిఖీ చేయబడిన మెడికల్ షాపులు పాటిస్తున్నాయా అనే విషయం అధికారులకు కనబడిందో లేదో తెలవదు కానీ వారి బాధ్యతను తనిఖీల రూపంలో చేయడం మాత్రం జరిగింది. కానీ చర్యలకు సంబంధించి నేటికీ ఆ మెడికల్ షాపులపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయడం జరిగిందో తెలియలేని పరిస్థితి. మరోవైపు అధికారులు తనిఖీలు చేస్తున్నారని మిగిలిన నాలుగు మెడికల్ షాపులు దుకాణాలకు తాళం వేసి వెళ్లిపోవడం జరిగింది.
షోకాస్ నోటీసులతో సరిపెట్టుకునే పరిస్థితి, మరింత రెచ్చిపోయిన మెడికల్ మాఫియా.
మహా మెడికల్ మాఫియా కు సంబంధించి అధికారులు కేవలం మహదేవ్పూర్ మండల కేంద్రంలోని 4 మెడికల్ షాపులను తనిఖీలు చేసి మండల కేంద్రంలోని మిగిలిన నాలుగు మెడికల్ షాపులతోపాటు సూరారం గ్రామంలోని రెండు మెడికల్ షాపులను తనిఖీలు చేయకుండానే వెళ్లిపోవడం జరిగింది. కానీ తనిఖీలు చేపట్టిన మండల కేంద్రంలోని నాలుగు మెడికల్ షాపులకు షో కాస్ నోటీసులు జారీ చేసినట్లు విశ్వనీయ సమాచారం. కానీ షోకస్ నోటీసులకు సంబంధించి మెడికల్ మాఫియాకు పెద్ద లెక్క ఇవి కాదని వివరాలు సమర్పణలో రోజులు నెలలు సంవత్సరాల కూడా గడవడం మామూలు గానే అని మెడికల్ మాఫియా చర్చించుకుంటూ అధికారుల తనిఖీల కార్యక్రమం ఇంతే అని సంకలు గుద్దుకుంటున్నారు. కానీ వాస్తవానికి అధికారులు తనిఖీలు చేసిన ఔషధ కేంద్రాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నుండి మొదలుపెట్టుకొని ఔషధ విక్రయాల వరకు స్టేట్ మరియు సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ మరియు యాక్ట్ రూల్స్ లను తుంగలో తొక్కి నిర్వహిస్తున్న మెడికల్ షాపులకు అధికారులు ముందుగా లైసెన్సును రద్దుచేసి మూడు నుండి ఆరు నెలల వరకు షాపులను మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉండేది కానీ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు జరిపిన ఆ నాలుగు మెడికల్ షాపులకు సంబంధించి డి సి జి ఐ తోపాటు డ్రగ్ కంట్రోల్ మరియు కాస్మోటిక్ చట్టాల కింద ఎలాంటి చర్యలకు ఆదేశాలు జారీ చేస్తారు అనేది వేచి చూడాలి. మరోవైపు అధికారుల తనిఖీల అనంతరం కేవలం సూకాష్ నోటీసులు జారీ చేస్తారు అంతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని అనుకుంటున్న మెడికల్ మాఫియా మండలంలో అలాగే మండల కేంద్రంలో ఇతర మెడికల్ షాపుల నిర్వాహకులకు మాఫియా వ్యవహారాలపై మరింత భరోసా కలిగించేలా చర్చించుకుంటున్నారని సమాచారం.
ఫార్మసీ లైసెన్స్ నుండి ఫార్మసిస్ట్ వరకు అంతా దొంగలే చర్యలు ఎందుకు లేవు.
ఇక మహా మండల కేంద్రంలోని మెడికల్ మాఫియా ఇంత అంత రెచ్చిపోయే పరిస్థితిలో లేదు అధికారులు కానీ వార్తా కథనాలు కానీ వారికి పెద్దగా పట్టింపు అనేది ఉండదు ఎందుకంటే మెడికల్ మాఫియా లో ఆరితేరి అందరికీ తమ వైపు తిప్పుకొని అనేక సంవత్సరాలుగా పేదల రక్తాన్ని తాగుతున్న ఈ మాఫియా సదాసీదాగా గారికి వచ్చే పరిస్థితి ఉండదు. డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇతర వైద్య శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైనా సరే వారి ఊబిలో దించుకోవడమే వారికి ఉన్న వెన్నెలతో పెట్టిన విద్య. ప్రస్తుతం మహదేపూర్ మండల కేంద్రం తో పాటు సూరారం లోని రెండు మెడికల్ షాపులు కేవలం కిరాయి ఫార్మసీ సర్టిఫికెట్ తో లైసెన్సును పొంది అదే ఫార్మసిస్ట్ పేరుతో ఔషధాలను విక్రయాలు చేయడం జరుగుతుంది. ఇన్బిబిఎస్ అర్హత కలిగిన డాక్టర్ మండల కేంద్రంలో ఎవరు లేకపోవడం కేవలం ఇతరులు అందించిన తెల్ల కాగితాలపై ఔషధాల పేర్లను చూసి పేద రోగుల దగ్గర నుండి వందల రూపాయలను దోచుకోవడమే ఈ మాఫియా పని. మరి అధికారులకు వీళ్ళందరూ ఫార్మసిస్టులే వీళ్ళు చదివిన యూనివర్సిటీ పట్టా ఆయా మెడికల్ షాపుల్లో వేలాడి ఉందేమో అది అధికారులకు చూపించడం జరిగిందేమో తెలవదు కానీ తీసుకున్న లైసెన్స్ కూడా వేరే వ్యక్తి పేరుతో దొంగ లైసెన్స్ ఫార్మసిస్ట్ లేకుండా దోపిడీ వ్యవస్థలో దొంగలే ఔషధాలను విక్రయాలు చేస్తుంటే అధికారులకు వారు ఫార్మసిస్టుల కనబడ్డారేమో తెలవదు కానీ తక్షణమే లైసెన్సులు రద్దుచేసి మెడికల్ షాపులను 6 నెలల వరకు సెక్షన్ 65 క్లాస్ 42 ఏ క్రింద మెడికల్ షాపులను మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.కానీ మరి అధికారులు ఏలాంటి చట్టాన్ని అమలు చేస్తారు ఈ దొంగ ఫార్మసిస్టులపై అనేది వేచి చూడాలి.
మెడికల్ మాఫియా నుండి పేద ప్రజల ప్రాణాలకు కాపాడేది ఎవరు. ఉన్నత అధికారులు చర్యలకు ఆదేశించాలి, మండల ప్రజలు.
రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం మారుమూల మండలం ఇప్పుడిప్పుడే మండలానికి సంబంధించిన ప్రజానీకం చైతన్యమవుతూ పలు రకాల ఉపాధి విద్య లాంటి వాటిలో తమ పావులను కుదుపుతున్నారు. ఇలాంటి సందర్భంలో అమాయక ఆ పేద ప్రజల ఆరోగ్యాలకు గురిపెట్టిన మెడికల్ మాఫియా పేద రోగులు ప్రజల రక్తాన్ని పీడించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులకు అర్హత కలిగిన ప్రభుత్వ వైద్యులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చే మందులకు విలువ లేకుండా జ్వరం దగ్గు లాంటి వాటికి 500 నుండి 600 ఎంజి మెడిసిన్ లను దగ్గు జలుబు లాంటి సిరప్లను హైడోస్ ఉండే వాటిని విక్రయాలు చేస్తూ ఉచితంగా డిస్క్రిప్షన్ తో పాటు మందులను ఇస్తున్న అనుభవం కలిగిన వైద్యులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకుండా మెడికల్ మాఫియా కనీస వైద్యపరమైన అవగాహన లేకున్నా కాగితంపై రాసి ఇచ్చే విధంగా పలువురుని ఏర్పాటు చేసుకొని కొందరు తామే వైద్యులు వారే ఫార్మసిస్ట్ “రాసేది వారే ఇచ్చేది వారే” వింటేనే విచిత్రంగా ఉంది కదా ఇది మెడికల్ మాఫియా వాస్తవం. తెల్ల కాగితంపై మెడికల్ షాప్ పేరు తెల్ల కాగితం ఎటు చూసినా “అక్కరకు రాని ఆంగ్ల భాష” ప్రపంచంలో ఆంగ్ల భాషను పుట్టించినవాడు సిగ్గుపడేలా ఆ రాతలు రాసి అమాయకులను వైద్యులుగా సృష్టించుటకు ఆంగ్ల భాషను పిచ్చి రాతలను ఉపయోగిస్తూ తెల్ల కాగితం ఎటు చూసినా గీతలే అవే ఔషధాల పేర్లు తీసుకోండి ఇంకేముంది తెల్ల కాగితం రాగానే 800 నుండి 1200 రూపాయల వరకు బిల్లు రెడీ అంటే మెడికల్ షాపులు బిల్లు ఇవ్వడం కాదు అదే తెల్ల కాగితం వెనుక చిన్న పెన్నుతో 1200 రూపాయల బిల్లును రాసి ఇవ్వడం జరుగుతుంది. ఇంత ఘోరంగా మెడికల్ మాఫియా ఇలాంటి అనుభవం అనుమతులు షరతులను పాటించకుండా తక్కువ ధరకు జిఎంపి లో రిజెక్ట్ అయిన కంపెనీలు తాత్కాలిక లైసెన్స్ పొంది ఉన్న కంపెనీల మందులు ఓకే కాకుండా ధర నిర్ణయించడంలో పక్కకు పెట్టినటువంటి కంపెనీల మందులను కూడా మెడికల్ మాఫియా విక్రయాలు చేయడం జరుగుతుంది. ఎవరికి తెలవదు కదా రోగం నయమైతే చాలు అని పేద రోగులు ప్రజలు అడ్డగోలుగా నమ్మి తమ ఆరోగ్యం బాగుండాలని ఆలోచనతో పైసలను లెక్కచేయకుండా మహా మెడికల్ మాఫియా ముసుగులో పడి వందల రూపాల ఔషధాలను కొనుగోలు తీసుకోవడం జరుగుతుంది. ఇలా అనేక సంవత్సరాలుగా మెడికల్ మాఫియా పేదల రక్తాన్ని తాగుతుంటే డ్రగ్ కంట్రోల్ అధికారులపై ప్రజలకు ఉన్న కాస్త నమ్మకాన్ని కూడా అధికారులు చర్యలు తీసుకోకుండా ఉండడంపై ప్రజలకు ఆ నమ్మకాన్ని కూడా కోల్పోయి పరిస్థితి కనబడుతుంది. మహా మెడికల్ మాఫియా కు సంబంధించి రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు తక్షణమే చర్యలకు ఆదేశాలు జారీ చేయాలని మహదేవ్పూర్ మండల ప్రజలు కోరడం జరుగుతుంది.
