Ensure Smooth Maize Procurement
మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి
మద్దతు ధర చెల్లింపులు సమయానికి చేయాలి
సంబంధిత అధికారులకు కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాలు
మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టరేట్లో సమీక్ష
నర్సంపేట, నేటిధాత్రి:
ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నర్సంపేట ప్రాంతానికి సంబంధించిన మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లు, నిల్వలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న పంట అధిక దిగుబడి వచ్చిందని తెలిపారు. సుమారు 72 వేల ఎకరాలలో సాగు జరగగా, దాదాపు 2.25 మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదైందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిల్వ సదుపాయాలపై సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ సంబంధిత శాఖలతో స
రైతుల నుండి మొక్కజొన్నను ఆలస్యం లేకుండా కొనుగోలు చేయాలని, మద్దతు ధర చెల్లింపులు సమయానికి జరిగేలా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాముల్లో సురక్షితంగా నిల్వ చేయడంతో పాటు నాణ్యత పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, అగ్రికల్చర్ జేడీ అనురాధ, డిసిఓ నీరజ, డీఎం మార్క్ఫెడ్ రంజిత్ రెడ్డి, సంబంధిత మండలాల తహసిల్దార్లు రవిచంద్రారెడ్డి,నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
