Road Safety & Anti-Drugs Awareness Drive
డ్రగ్స్ తో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలి భూపాలపల్లి జిల్లా డిఎస్పి
సంపత్ రావు మొగుళ్ళపల్లి నేటి దాత్రి
ప్రయాణ సమయంలో ప్రమాదాల నుంచి బయటపడేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని భూపాలపల్లి జిల్లా డిఎస్పి సంపత్ రావు అన్నారు 90 రోజుల కార్యాచరణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మొగుళ్లపల్లి లోఅరైవ్ అలైవ్ లక్ష్మీ సాయి గార్డెన్ లో సాంస్కృతిక కళా బృందం వారితో రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు మద్యం సేవించి వాహనం నడప రాదని డ్రైవింగ్ చేసేటప్పుడు సీడ్ బెల్ట్ తప్పకుండా ధరించాలని తెలిపారు చిన్నచిన్న పొరపాటులతో జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరుకున్నారు స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలేని వినయ్ కుమార్ సాకారంతో వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు మత్తుకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలని మ దక ద్రవ్యాలు మత్తు పదార్థాలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని యువత వీటికి దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని వారు సూచించారు వాహనదారితో కలిసి లక్ష్మీ సాయి గార్డెన్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిట్యాల సిఐడి మల్లేష్ స్థానిక ఎస్సై సురేష్ మొగులపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ చిట్యాల మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ మొగుళ్లపల్లి మండలంలోని ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
