Gurukul Admissions Open for 2026
సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
హసన్పర్తి కళాశాల ప్రిన్సిపల్ పి.సుధాకృష్ణ
హన్మకొండ, నేటిధాత్రి:
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ 2026 -27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశానికి ఈనెల 6వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని హాసన్ పర్తి గురుకుల కళాశాల ప్రిన్సిపల్ పి. సుధా కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు హాజరైన విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సిఓఈ వృత్తి విద్యలు సైనిక కళాశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అంతేగాక జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ,ఎంఈసి, సీఈసీ, హెచ్ఈసి మొదలైన గ్రూపులలో ప్రవేశం పొందవచ్చు అని తెలిపారు పూర్తి వివరాల కోసం సమీపంలోని గురుకుల కళాశాలలో సంప్రదించవచ్చని హసన్పర్తి ప్రిన్సిపల్ పి .సుధాకృష్ణ తెలిపారు.
