Congress Govt Supports Farmers: Ramu
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతులకు న్యాయం
కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము
నేటిధాత్రి మొగుళ్లపల్లి-
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే రైతులకు న్యాయం జరుగుతుందని మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాముఅన్నారు వారు
మాట్లాడుతూ, రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయం గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40 లక్షల మంది రైతుల ఖాతాలోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నస్తూర్ పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో ఆయన రైతు భరోసా నిధులను విడుదల చేశారు రైతు రుణమాఫీ అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మంది రైతులకు మొదటి విడతలో భాగంగా ఒక ఎకరం వరకు భూమి కలిగిన వారికి రూ.3,590 కోట్లను విడుదల చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. రైతు సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. రుణమాఫీ జరగక రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారువరి కొనుగోలు విషయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఎంఎస్పీ విధానంలో వడ్లు కొనుగోలు చేసి ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తోందని తెలిపారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి అధికారం చేపట్టిన ఏడాదిలోపే 25. 35 లక్షల మంది రైతుల కు రుణమాఫీ చేశారు గతంలో కేవలం 9 రోజుల్లోనే 9000 కోట్ల రూపాయల రైతు భరోసా అందించారు వ్యవసాయ దండగ కాదు పండగ కావాలన్నదే మా సంకల్పం రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే మా లక్ష్యం అందుకే సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాముతెలిపారు. పేదల గృహ కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయడం ప్రశంసనీయమన్నారు. 200 యూనిట్ల కరెంటు పేద ప్రజలకు సన్నబియ్యం పథకం 500 కే గ్యాస్ సిలిండర్ ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు
భూపాలపల్లినియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులు జరుగుతున్నాయని. గత ప్రభుత్వంలో భూకబ్జాలు, ఉద్యోగ నోటిఫికేషన్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నాయకులు అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సత్యనారాయణ రావు నాయకత్వంలో మొగుళ్ళపల్లి మండలం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు
