Facial Recognition Issues Hit MGNREGA Workers
ముఖ గుర్తింపుతో ముప్పు తిప్పలు
ఉపాధి పనికి చేసిన ఫోటో రాదు హాజరు పడదు కూలీల పరిస్థితి ఆగం
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల. మండలంలోని అన్ని గ్రామాలలో ఉపాధి పని చేసిన కూలీలకు
ఉపాధి పనికి చేసిన ఫోటో రాదు హాజరు పడదు కూలీల పరిస్థితి ఆగం
సంబంధిత టెక్నికల్ అధికారుల నిర్లక్ష్యం
సాంకేతిక వైఫల్యాలకు అధికారులే కారణం తక్షణమే వారి పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మండలంలోనీ గ్రామాల్లో జాబ్ కార్డులను ఏ కారణం లేకుండా ఆ కారణంగా తొలగించినారు తొలగించిన జాబ్ కార్డులను తిరిగి ఒకటి కూడా నమోదు చేసిన దాఖలు కానరావడం లేదు . అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది పనిచేసిన కూలీలకు వారానికి ఒకసారి వేతనం ఇవ్వాలని చట్టం చెప్తుంది కానీ మూడు నెలలుగా పని చేసిన కూలీలకు ఒక పైసా కూడా ఇచ్చిన దాఖలు లేవు వేతనం లేక కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు పనిచేసే చోట కనీసం మంచినీళ్ల సౌకర్యం కల్పించడం లేదు . ఉపాధి హామీ కూలీలకు ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం ప్రమాద బీమా సౌకర్యం లేదు మండుతున్న ఎండలో పనిచేస్తున్న కూలీలకు అదనంగా వేసవి అలవెన్స్ ఇవ్వాలి అవే 300 రూపాయలు కట్టిస్తున్నారు గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి పనిచేసిన కూలీలకు వేతనాలు అందక ఒకపక్క ఫోటో గుర్తింపు రాక మండుతున్న ఎండలో ఫోటో కోసం గంటల తరబడి నిలబడి వేచి ఉంటున్నారు సాంకేతిక నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం . పాత పద్ధతిలోనే హాజరు వేసి కూలీలను ఆదుకోవాలని కోరుతున్నాం కూలీలను సమీకరించి ఆందోళనలకు పోరాటాలు సిద్ధం చేస్తామని తెలియజేస్తున్నాం
