Electricity Workers Strike Enters 9th Day
9వ రోజుకు విద్యుత్ ఉద్యోగుల ధర్నా
భూపాలపల్లి నేటిధాత్రి
ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా యాజమాన్యం,ప్రభుత్వం కృషి చేసేలా నేటి రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం లో చర్చలు జరగాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ నాయకులు తెలిపారు.గురువారం జిల్లాలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న విద్యుత్ ఆర్టిజన్, ఆన్మ్యాన్ కార్మికుల నిరవధిక సమ్మె 9వ రోజుకు విజయవంతంగా కొనసాగింది.ఈ సందర్భంగా టీవీ ఏ ఈ జెఎసి నాయకులు మాట్లాడుతూ, ఆర్టిజన్, ఆన్మ్యాన్ కార్మికుల డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవని పేర్కొన్నారు.చర్చల్లో ప్రభుత్వం,యాజమాన్యం కార్మికుల డిమాండ్లను అంగీకరిస్తే సమ్మె విరమిస్తామని,లేనియెడల కార్మికుల ఐక్యత,పోరాట స్ఫూర్తితో నిరవధిక సమ్మెను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమ టీవీ ఏఈ జెఏసి కన్వీనర్లు మోతుకూరి కోటి,టీ రాజు,యాళ్ల సురేందర్ రెడ్డి,ఒంటెరు మల్లయ్య నాతోపాటు సుమారు 130 మంది కార్మికులు పాల్గొని తమ ఐక్యతను చాటారు.
