RDO Inspects Tahsildar Office in Jaipur
తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ
రెవెన్యూ డివిజనల్ అధికారి డి.శ్రీనివాసరావు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి గూడూరి శ్రీనివాసరావు జైపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.ఈ సందర్భంగా కార్యాలయ పనితీరు,సిబ్బంది హాజరు,పెండింగ్ దరఖాస్తుల స్థితిని సమీక్షించారు.తనిఖీ సమయంలో,కార్యాలయ సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు.అలాగే, భూభారతి సంబంధిత పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.అదనంగా,సాదా బైనామా అప్లికేషన్లను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం సమగ్రంగా విచారణ చేసి,వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ తనిఖీ ద్వారా కార్యాలయ పనితీరు మెరుగుపర్చడంపై దృష్టి సారిస్తూ, ప్రజలకు వేగవంతమైన,పారదర్శక సేవలు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
