Maize Procurement Center Launched
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఎమ్మెల్యే గండ్రసత్యనారా యణరావు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మార్క్ ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం మొక్కజొ న్నలను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేం ద్రంలో అమ్ముకోవాలని రైతు లు తమ పంటను మధ్యవ ర్తుల వద్ద అమ్మకుండా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాలనే విక్రయించు కోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేసుకోవాలని రైతులకు సూచించారు అలాగే రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు

ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుం దని మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందన్నారు ఇది రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ కార్యక్ర మంలో గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు ,ప్రజలు పాల్గొన్నారు.
