Special Pujas on Second Saturday of Brahmotsavams
బ్రహ్మోత్సవాలలో రెండవశనివారం పూజలు.
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలోని తాళ్ల పూసపల్లి గ్రామంలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ శనివారం లక్ష పుష్పాలతోలతో సహస్ర నమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు గంప లక్ష్మణాచార్యులు, గంప శ్రావణ్ కుమారాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామీ వారికి తెలుగు నామ సంవత్సరం ఉగాదికి ముందు నాలుగు శనివారాలు బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామం నుండే కాకుండా మండలం చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి పూజలు నిర్వహిస్తారాన్నారు. గతంలో ఇక్కడ స్వామీ వారి దేవాలయం చుట్టూ ఎడ్ల బండ్లు కూడ తిరిగేవని, నాలుగు వారాలు పండుగ వాతావరణం ఉండేదని, కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రజలు కొలుస్తారని అన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని, పాలకులు దేవాలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు,
