· నేడు ఏఐసీసీ ఆధ్వర్యంలో సమావేశం
· రేవంత్ పట్ల అధిష్టానం పూర్తి సానుకూలత
· సీనియర్ మంత్రుల్లో కొందరి పోర్ట్‌పోలియోలు మారే ఛాన్స్
· కొందరికి ఉద్వాసన తప్పదు
· కొత్త మంత్రివర్గంలో లంబాడా, ముస్లిం వర్గాలకు ప్రాధాన్యత
· మంత్రిపదవి రేసులో వెటరన్ నటి విజయశాంతి
· బీసీ మహిళగా ఆమెకు ప్రాధాన్యం దక్కే అవకాశం
· పార్టీ విధేయుల ఫిర్యాదుల పరిశీలన
· ఢిల్లీలో ఆశావహుల లాబీయింగ్
· మంత్రుల పనితీరుపై ఓ కన్నేసిన అధిష్టానం
· కోల్ బ్లాక్, మేడాడం జాతర టెంటర్ల వివాదంపై ప్రశ్నించే అవకాశం
· రిపోర్టుల తయారీలో మంత్రులు బిజీ
హైదరాబాద్, నేటిధాత్రి:
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అప్రతిహత విజయం సాధించిన నేపథ్యంలో, అధిష్టానంముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల అత్యంత సానుకూలతతో వున్నది. బీఆరఎస్, బీజేపీలను సమర్థ వంతంగా ఎదుర్కొని, అద్భుత వ్యూహాలతో పార్టీని విజయపథంలో నడిపించిన నేతగా రేవంత్ హైకమాండ్ దష్టిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆయన సమర్థ నాయకత్వాన్ని ఇతరరాష్ట్రాల నాయకులకు రోల్‌మోడల్‌గా అధిష్టానం పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ముఖ్యమంత్రి రేవంత్‌ను ప్రశంసించారు. 90కి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం కావడమంటే రేవంత్ అమలు చేస్తున్న ప్రజా ప్రాధాన్య కార్యక్రమాలు, ఆరు గ్యారంటీల అమలే ప్రధాన కారణమని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఈ వరుస విజయాలతో రేవంత్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడిక పార్టీలో అసమ్మతి వాదుల ఫిర్యాదులను పరిశీలించినా, అధిష్టానం పెద్దగా వాటిని పట్టించుకోదనేది సుస్పష్టం. రాబోయే జీహెచఎంసీ ఎన్నికల్లో కూడా ఇదేమాదిరి విజయం సాధించాలని రేవంత్‌ను అధిష్టానం కోరినట్టు తెలు స్తోంది. ఇక 2034 వరకు తన ముఖ్యమంత్రి పదవికి ఢోకాలేదన్న ధీమాతో రేవంత్ వున్నారు.
ఇదిలావుండగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులకు ఢిల్లీనుంచి పిలుపు వచ్చింది. వీరితో కాంగ్రెస్ అధిష్టానం గురువారం సమావేశం కానుంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న వివాదాలు ముఖ్యంగా నైనీ కోల్ బ్లాక్ కుంభకోణం, మంత్రుల మధ్య విభేదాలున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో మొత్తం రేవంత్ మంత్రివర్గ సభ్యులను ఢిల్లీకి పిలిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కోల్ బ్లాక్ కుంభకోణం పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందన్న అభిప్రాయం ఏఐసీసీ పెద్దల్లో నాటుకున్నట్టు తెలుస్తోంది. మేడారం జాతర టెండర్ల వివాదం కూడా పార్టీ ప్రతిష్ఠను మసకబార్చింది. ఈ రెండు అంశాలు ఈ సమావేశంలో కీలకం కానున్నాయి. అంతేకాదు ఎంతోకాలంగా పార్టీకి విధేయులుగా వుంటున్న తమను పక్కన పెట్టేశారని, కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే అన్నిరకాల ప్రాధా న్యతలిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు ఎప్పటినుంచో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు వీరి ఫిర్యాదులను కేంద్ర నాయకత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వీటిపై దష్టి సారించే అవకాశముంది. దీనికితోడు మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ వుంటుందన్న ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యం కూడా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం. తెలంగాణ మంత్రివర్గంలో ప్రాంతీయ సమతుల్యత లేదన్న ఆరోపణలు నిజం. ఎందుకంటే కొన్ని జిల్లాలకు అత్యధిక ప్రాతినిధ్యం వుండగా మరికొన్ని జిల్లాలకు అసలు మంత్రివర్గంలో స్థానమే దక్కలేదు. ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3, కరీంనగర్‌కు 3, నý£్గండజిల్లాకు 2, వ రంగల్ జిల్లాకు చెందిన ఇద్దరికి మంత్రివర్గంలో స్థానాలు లభించాయి. ఇక హైదరాబాద్, రంగా రెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్ జిల్లా కు జి.వివేక్ వెంకటస్వామి (చెన్నూరు)కు మంత్రివర్గంలో ఇటీవల స్థానం కల్పించినా, ఈ జిల్లా లోని ఇతర ప్రాంతాలను పట్టించుకోలేదు. ఈ వ్యత్యాసాలను భర్తీ చేసేరీతిలో అధిష్టానం ఈ సమావేశంలో తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇదిలావుండగా ఏఐసీసీ వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో ఢిల్లీలో సమావేశాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణకాంగ్రెస్ నేతలకు కూడా పిలుపు వచ్చిందన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. నిజానికి మం త్రుల పనితీరును అధిష్టానం ఎప్పటినుంచో నిశితంగా పరిశీలిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో 90కి పైగా మున్సిపాలిటీల్లో పార్టీ గెలిచిన నేపథ్యంలో ఆయా మంత్రులు తమ శాఖలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును, మున్సిపల్ ఎన్నికల్లో పనితీరుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని అధిష్టానం నుంచి ఆదేశాలందాయి. ఈ నివేదికల ఆధారంగా ఎవరిని మంత్రివర్గంలో కొనసాగించాలి లేదా పోర్టుఫోలియో మార్చాలి లేదా పూర్తిగా తొలగించాలన్న నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ బందానికి అధిష్టానం పిలుపుతో ఒక్కసారి గా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఢిల్లీ పిలుపుతో మంత్రులు ఈ రెండేళ్ల కాలంలో తమ ఆధీనంలోని మంత్రి త్వశాఖల పురోగతిపై నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ పై వచ్చిన ఆరోపణలు, వివాదాలకు సమాధానాలు రూపొందించుకొని అధిష్టానానికి సమర్పించే అవకాశముంది. ఇదిలావుండగా సీనియర్ మంత్రులు ఒక్కొక్కరి వద్ద చాలా మంత్రిత్వశాఖలున్న నేపథ్యంలో మంత్రి పదవులకు ఆశావహులు ఎప్పటినుంచో పట్టువదలని విక్రమార్కుల మాదిరిగా ఢిల్లీ స్థాయి లో లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావడం, లాబీయింగ్ వత్తిడి నేపథ్యంలో అధిష్టానం కేబినెట్ విస్తరణపై తక్షణం దష్టి పెట్టనున్నది.
ఇప్పటివరకు మంత్రుల పనితీరుపై దష్టిపెట్టిన అధిష్టానం తనకు అందిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశముండటంతో, మంత్రుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంనుంచి తొలగించే అవకాశాలున్న వారిలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ పర్యావణ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎక్సైజ్Ê పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కష్ణారావుల పేర్లు వినిపిస్తున్నాయి. రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడు మంత్రిపదవవి ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు మంత్రిపదవి ఇచ్చేందుకు వీలుగా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తప్పించవచ్చుని చెబుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు సోదరులు మంత్రిపదవుల్లో వుండరాదన్న పార్టీ విధానం మేరకు ఈ చర్య వుంటుందంటున్నారు. ఇక పొన్నం ప్రభాకర్‌ను పార్టీసేవలకు వినియోగించుకోవాలన్న ఆలోచన వున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గాల సమతుల్యతను పాటించేందుకు ఈ మార్పు చేసే అవకాశముంది. ఇక కొండాసురేఖ మొదట్నుంచీ పలు వివాదాýకు కారణమయ్యారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందన్న అభిప్రాయం వ్య క్తమవడం, పనితీరు సంతప్తికరంగా వుండకపోవడంతో ఆమె తొలగింపు తప్పదంటున్నారు. ఇక కొత్త వారికి అవకాశమిచ్చే ఉద్దేశంతో జూపల్లిని మంత్రిపదవినుంచి తొలగమని కోరవచ్చు. ముఖ్యంగా తక్కువ ప్రాతినిధ్యమున్న జిల్లాలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశమే ఇందుకు కారణం.ఏఐసీసీ ఈవిధంగా సర్జికల్ స్ట్రెíక్ చేయడానికి ప్రధాన కారణం, మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయడంతోపాటు, మున్సిపల్ ఎన్నికల్లో వారి సామర్థ్యాన్ని తెలుసుకోవ డం. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన మంత్రులు ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. హైకమాండ్ ఇప్పుడు లంబాడా (ఎస్టీ), ముస్లిం వర్గాల వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచనలో వుంది. వీరితో పాటు మంత్రివర్గంలో ప్రాతిని ధ్యం లభించని జిల్లాలకు ప్రాధాన్యతనివాలన్న ఉద్దేశం మరో కారణం. ఈ నేపథ్యంలో మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలు, పార్టీ విధేయులు ఇచ్చిన ఫిర్యా దులకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశించినట్టు తెలుస్తోంది.
శాఖలు మారే మంత్రుల్లో ముందుగా వినిపిస్తున్న పేరు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.ఆయన్ను ీVAంశాఖకు బదిలీచేసే అవకాశముంది. ఇక మంత్రుల్లో అద్భుతమైన పనితీరు ప్రద ర్శిస్తున్నారని పేరు సంపాదించుకున్న దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఇప్పుడు నిర్వహిస్తున్న ఐటీ శాఖ నుంచి ప్రమోషన్‌పై ఆర్థిక శాఖ అప్పగించే అవకాశాలున్నాయి. ప్రభుత్వంలో వివాదరహితుడు, సమర్థుడుగా శ్రీధర్‌బాబుకు పేరుంది. పస్తుతం నీటిపారుదల శాఖను చూస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని రెవెన్యూశాఖకు బదిలీచేయవచ్చు. ఇక రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికే మూలస్తంభంగా వున్న నేపథ్యంలో ఆయన్ను ప్రస్తుత రెవెన్యూ శాఖ నుంచి నీటిపారుదల లేదా పౌరసరఫరాల శాఖకు బదిలీచేయవచ్చు. ఇక కోయ సామాజిక వర్గానికి చెందిన ధనసరిఅనసూయ (సీతక్క) మంచి పాపులారిటీ సంపాదించుకున్న నేపథ్యంలో ఆమె పదవికి ఎటువంటిఢోకా లేదు. ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంత్రివర్గంలో కొనసాగే అవకాశాలే మెండు. మంత్రివర్గంలో అత్యంత సీనియర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు పోర్ట్‌పోలియో మారవచ్చు. ఇక ఇటీవల మంత్రివర్గంలో చేర్చుకున్న జి.వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణకుమార్, వాకిటి శ్రీహరిల పదవులకు భయం లేదు.
ఇక మంత్రిపదవుల ఆశావహుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), బి. మహేష్‌కుమార్ గౌడ్ (టీపీసీసీ ప్రెసిడెంట్), కె. మదన్మోహన్రావు (ఎల్లారెడ్డి), బాలూ నాయక్ (దేవరకొం డ), బీర్ల ఐలయ్య (ఆలేర్), ఆది శ్రీనివాస్ (వేములవాడ), అమర్ అలీఖాన్ (ఎమ్మెల్సీ), విజయ శాంతి (ఎమ్మెల్సీ) వున్నారు. ఇంకా పి. సుదర్శన్‌రెడ్డి (బోధన్), మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంప ట్నం), కె. ప్రేమ్‌సాగర్‌రావు (మంచిర్యాల్) కూడా వున్నారు. నిజానికి వెటరన్ సినీనటి విజయ శాంతిని 2025 జూన్‌లోనే మంత్రివర్గంలోకి తీసుకుంటారని బలమైన అంచనాలున్నప్పటికీ, కేవలం ఎమ్మెలేలు, సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిచ్చిన నేపథ్యంలో ఆమె చివరి నిముషంలో అవ కాశం కోల్పోయారు. ఇది ఇప్పుడు ఆమెకు గొప్ప సావకాశంగా మారనున్నదనేది అంచనా. ముఖ్యంగా మహిళా నాయకురాలిగా ఆమెకు అవకాశం దక్కవచ్చు. పార్టీలో చేరినప్పుడు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆమెకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చా యి. కానీ ఈ హామీ ఇప్పటివరకు అమలు కాలేదు. ఆవిధంగా రెండు సార్లు ఛాన్స్ మిస్ అయి న నాయకురాలిగా, మంత్రిపదవి రేసులో ముందు వరుసలో నిలిచారు. ప్రస్తుతం ఆమెకు హైకమాండ్ ఆశీస్సులు పుష్కలంగా వున్నాయి. అదీకాకుండా బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు తిరుగులేని అర్హతగా మారింది. కాగా ఆశావహులు, మంత్రుల భవితవ్యాన్ని 19వ తేదీన జరిగే సమావేశంలో పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు తేల్చనున్నారు. మంత్రిపదవుల్లో కొనసాగేవారికి ఈసారి పాలనాపరంగా మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా లక్ష్యాలు నిర్దేశించడం, ముఖ్యంగా విజన్`2047 సాధనకు వీలుగా తెలంగాణ రైజింగ్‌పై ప్రధానంగా దష్టి కేంద్రీకరించాలని ఆదేశించే అవకాశాలున్నాయి. 2027 నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యానికి అనుగుణంగా పాలన, అభివద్ధి కార్యక్రమాలను మంత్రులు అ మలు చేయాల్సి వుంటుంది. ఏఐ ఇన్నోవేషన్ హబ్, నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్స్ పాలసీ ప్రాజెక్టులనువిజయవంతం చేయడానికి మంత్రులు కషిచేయాలని అధిష్టానం నిర్దేశించవచ్చు.
