10,859 Voters in Kohir Municipality
కోహీర్ పురపాలక సంఘంలో 10,859 మంది ఓటర్లు
◆-: మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన కోహీర్ పురపాలక సంఘం పరిధిలో మొత్తం 10,859 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పురపాలక సంఘం 16 వార్డులతో విస్తరించి ఉంది. ఓటర్ల సంఖ్యపై స్పష్టత రావడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కోహిర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్
కోహిర్ మున్సిపాలిటీ ఎన్నికలు తొలిసారి జరగనున్న నేపథ్యంలో, చైర్మన్ సీటును ఎస్సీ జనరల్ కు రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో ఆశావహుల ఆశలు వమ్మయ్యాయి. ఎస్సీ కేటగిరీకి చెందిన నాయకులు చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇక్కడ పోటీ తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
