°శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
శ్రీవారి ధనుర్మాస ప్రసాదాలు..
*భక్తులకు ప్రతి శనివారం భోజనాలు…
తిరుపతి(నేటిధాత్రి:
ధనుర్మాసోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఇచ్చేటువంటి ధనుర్మాస ప్రసాదాలను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం శ్రీవారి భక్తులు జగన్నాథం మిత్ర బృందం ప్రసాదాలను పంచిపెట్టారు. శనివారం శ్రీ కోదండరాముల వారి గుడి వెనక ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భజన మందిరం వద్ద ప్రతి శనివారం శ్రీవారి భక్తులు జగన్నాథం దూడల జయగోపాల్ ఆధ్వర్యంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈ శనివారం దాతగా డాక్టర్ రామబాన రమేష్ స్వామి అన్న ప్రసాదాలను పంచిపెట్టారు . ఈ సందర్భంగా టిడిపి బీసీ నాయకులు సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు మరియు శ్రీవారి భక్తులు జగన్నాథం మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతి పదమైన రోజున శనివారం రోజున శ్రీవారి ఆలయం నుంచి ధనుర్మాస ప్రసాదాలను తెప్పించి భక్తులకు పంచిపెట్టామని శ్రీవారి పాదాల చెంత ఉన్న భక్తులందరూ ఆకలితో ఉండకూడదని ఈ ఒక్క రోజైనా అందరికీ భోజనాలు అందించడం ఆ దేవుని అనుగ్రహంగా భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ గోవింద నామాలను జపిస్తూ ఆనందంగా అన్న ప్రసాదాలను స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జగన్నాథం మిత్రబృందం ప్రముఖ కళాకారులు శ్యాంబోల హరి, వారాహి డెవలపర్స్ ఏ.సునీల్ కుమార్ , శివాజీ , తదితరులు పాల్గొన్నారు .
