బాధిత కుటుంబాలకు అండగా కొడారి రమేష్ యాదవ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
ఇటీవల మరణించిన బాధిత కుటుంబాలకు చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, వరంగల్ జిల్లా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పిన్నింటి వెంకట్ రావులు అండగా నిలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కొడారి కుమారస్వామి యాదవ్ తల్లి కొడారి ఎల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కాగా తన సన్నితుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పిన్నింటి వెంకట్ రావులు శనివారం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. అనంతరం బంగ్లాపల్లి గ్రామంలో ఆర్ఎంపి వైద్యుడు డాక్టర్ సంతోష్ అన్నయ్య కరాబు బాపూజీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా..వారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన నేర్పటి లింగమ్మ, నేర్పటి పోచమ్మ శనివారం మృతి చెందగా వారు చనిపోయిన మృతదేహాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని, ఏ ఆపద వచ్చిన వారికి అండగా ఉంటామని భరోసాను కల్పించారు. మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి స్వర్గలోక ప్రాప్తిరస్తు కలగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మొగుళ్ళపల్లి టౌన్ ప్రెసిడెంట్ గుడిమల్ల రమేష్, వార్డు నెంబర్ హర్షం మహేష్ బీఆర్ఎస్ నాయకులు దేవునూరి కుమారస్వామి, చెక్క శ్రీధర్, పాత ఇస్సిపేట గ్రామ ఉపసర్పంచ్ నేర్పటి శ్రీనివాస్, పసుల తిరుపతి, పసరగొండ లక్ష్మయ్య, జన్నె కమలాకర్, జన్నె సదయ్య, బొచ్చు రమేష్, నేర్పటి ప్రశాంత్, రఘు, కరాబు మలహల్ రావు, అన్న బోయిన కుమార్, నేతాజీ, అరికాంతపు అన్నారెడ్డి, రాస ప్రశాంత్, కొడారి శ్రీనివాస్, బండారి బిక్షపతి, బండారి కుమారస్వామి, బాషిక కుమారస్వామి, కొడారి ఓదెలు, నల్లబీమ్ సత్యం తదితరులు పాల్గొన్నారు.
