బ్రోకర్‌ రాజ్‌..?

`మంచిర్యాల జిల్లా ఆర్డీవో కార్యాలయం అడ్డా!

`తహసీల్దారులందరి ప్రోత్సాహం!

`మధ్యవర్తి లేనిదే ఆ జిల్లాలో ఏ పని జరగదు!

`ప్రతి పనికి రేట్‌ ఫిక్స్‌ చేసేది ఈ బ్రోకరే!

`పని సక్రమమైన, అక్రమమైన బ్రోకర్‌ చేతులు తడపాల్సిందే!

`ఫైల్‌ అతని చేతిలో పెట్టాల్సిందే!

`అడిగినంత ఇవ్వాల్సిందే!

`ముందే అంతా ముట్టజెప్పాల్సిందే!

`పనయ్యాక అన్న ముచ్చటే లే!

`ఆర్డీవో కార్యాలయంలో ఎలా దూరాడో గాని, అందరనీ చేతిలో పట్టుకున్నాడు!

`తీసుకున్న దానిలో అందరికీ పంచిపెడతాడు?

`ఆర్డీవో కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తి జోక్యం ఏమిటి?

`ప్రతి పనికి అతన్ని కలవడం దేనికి? 

`అధికారుల ప్రోత్సాహంలో మర్మమేమిటి?

`ఒకనాడు ఆటో నడిపిన వ్యక్తి ఆర్డీవో కార్యాలయంలో పెత్తనమేమిటి?

`ప్రభుత్వ కార్యాలయాలలో పనులు చక్కబెట్టడమేమిటి?

`ఏళ్లుగా ఈ తతంగం సాగుతున్నా ఉన్నతాధికారుల పట్టింపేది?

`ప్రైవేటు వ్యక్తులే పనులు చేసిపెట్టాక, అధికారులెందుకు…కార్యాలయాలెందుకు?

`అధికారుల ఇష్టారాజ్యామా! బ్రోకర్ల చేతికి పెత్తనమా!!

 హైదరాబాద్‌,నేటిధాత్రి:

చేసే పని మధ్యవర్తిత్వం… ఇంగ్లీషు లో బ్రోకరిజం..! పని చిన్నదని అనుకునేరు…ఆడి కార్లు కొనుక్కునేంత పెద్ద పెద్ద పనులు చక్కదిద్దేంతగా….అసలు ప్రభుత్వ కార్యాలయంలో మధ్యవర్తులేమిటి? ప్రజలు అధికారులను కలవాలంటే బ్రోకర్‌ పర్మిషన్‌ ఏమిటి? ప్రభుత్వం ఏమైనా అధికారులు అలా కార్యాలయానికి వచ్చే ప్రజలు బ్రోకర్‌ ను కలిశాకే లెక్క అనేమైనా ఆదేశాలు జారీ చేసిందా? జిల్లా ఉన్నతాధికారుల ఏమైనా తీర్మానం చేశారా? మంచిర్యాల జిల్లాలో ఏమిటీ వింత పరిస్థితి? ఇంతకీ ఆ మధ్యవర్తి అనే వ్యక్తి ఎవరు? ఆర్డీవో కార్యాలయంలో ఎలా చేరాడు? ఉద్యోగి కాకపోయినా, అతనెందుకు ప్రజల పనుల్లో వేలుపెడుతున్నాడు? ఒకప్పుడు ఆటో నడిపిన చేతులు…ఆ తర్వాత ఏదో కన్సల్టెంట్‌ పని…అక్కడ మొదలైంది….సుడి…అంతే మంచిర్యాల జిల్లా ఆర్డీవో కార్యాలయంలో అడ్డా పెట్టాడు…ఆనాటి నుంచి బ్రోకర్‌ రాజ్‌ మాటే చెల్లుబాటు… ఎవరికి ఏం పని కావాలన్నా అతన్ని కలవాల్సిందే…అతన్ని కలవకుండా ఏ పని కాదు…అతని చేతితో ఫైల్‌ అందితే తప్ప ఏ అధికారి పని చేయడు…ఫైల్‌ క్లియర్‌ చేయడు…అంతా బ్రోకర్‌ చేతిలో పని…అతని చేతికి ముట్టజెప్పితేనే పని పూర్తి… అక్కడ ఎలాంటి బేరసారాలకు కూడా తావులేదు…అతను ఎంత చెబితే అంత…మరో మాట వుండదు….తగ్గింపుకు తావులేదు…అది కూడా ముందే ముట్టజెప్పాలి. ఫైలు చేతికందించినప్పుడే మొత్తం చేతిలో పెట్టాలి…అడ్వాన్స్‌లు జాన్తా నై….తర్వాత మిగతా చెల్లింపులు అసలే నై…ఆర్డీవో కార్యాలయంలో అడుగు పెడుతూనే బ్రోకర్‌ వున్నాడా? లేడో తెలుసుకోవాలి…ఏ అధికారి కార్యాలయానికి వచ్చినా, రాకపోయినా పని కావాలంటే ఇతన్నే ముందు ప్రసన్నం చేసుకోవాలి. 

 మంచిర్యాల జిల్లా ఆర్డీవో కార్యాలయంలో అడ్డా ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి, తహసీల్దారులందరి ప్రోత్సాహం వుందని జనం అనుకుంటున్నారు.

 అధికారులను ప్రజలకు నేరుగా కలిసే అవకాశమే లేకుండా పోతోంది. ఆ జిల్లాలోని ఆర్డీవో కార్యాలయంలో మధ్యవర్తి లేనిదే ఏ పని జరగదు! ప్రతి పనికి అతనే….చక్కదిద్దాల్సింది…ఎవరు ఏ పని మీద వెళ్లినా ముందుగా అతన్ని కాలవాల్సిందే…తమ సమస్య చెప్పుకోవాల్సిందే….ఆ పని విషయంలో అతను ఏది చెబితే అది వినాల్సిందే…ఆ పనికి అతను ఎంత రేటు ఫిక్స్‌ చేస్తే అంత మారుమాట మాట్లాడకుండా తలూపాల్సిందే! ప్రతి పనికి రేట్‌ ఫిక్స్‌ చేసేది ఈ బ్రోకరే! పని చిన్నదైనా, పెద్దదైనా, పని సక్రమమైన, అక్రమమైన బ్రోకర్‌ చేతులు తడపాల్సిందే! ప్రజలు నేరుగా తమ అభ్యర్థనలు అధికారుల దాకా వెళ్లొద్దు. ఎవరైనా సరే ఫైల్‌ అతని చేతిలో పెట్టాల్సిందే!

 అడిగినంత ఇవ్వాల్సిందే! ముందే అంతా ముట్టజెప్పాల్సిందే! పనికి ముందు కొంత చేతిలో పెడితే సరిపోదు…అతనేం చెప్పాడో అది అప్పుడే అందజేయాలి… పనయ్యాక అన్న ముచ్చటే లే! పనయ్యాక…ఇస్తామన్న మాటకు కూడా తావుండదు..ఎంత మొత్తుకున్నా వినేది వుండదు…కనికరించడం అన్నది కుదరనే కుదరదు. ఏ పనైనా నస్పూర్‌ తహసీల్దారు కార్యాలయంలో కూడా ఇతనిదే హవా…ఆ కార్యాలయంలో కూడా ఏ పని కావాలన్నా ఇతన్ని కలవాల్సిందే…. ఆర్డీవో కార్యాలయంలో ఎలా దూరాడో గాని, అందరనీ చేతిలో పట్టుకున్నాడు! అధికారులను చేతిలో పెట్టుకొని ఆడిస్తున్నాడు…ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అంటున్నారు. అయినా జిల్లా అధికారులకు పట్టి లేదు…ఇతనెవరు? అని ప్రశ్నించింది లేదు..అతని గురించి ఆరా తీసింది లేదు. జిల్లాలో అధికారులు మారుతున్నారే గాని, ఇతను కార్యాలయానికి రాకుండా వుండదు…అదేదో సినిమాలో చంటిగాడు లోకల్‌.. అన్నట్లు ఆర్డీవోలు వస్తున్నారు పోతున్నారు…అందరూ ఇతని మాయలో పడుతున్నారు…గుడ్డిగా నమ్ముతున్నారు…ఇప్పటి వరకు నువ్వెవరు? అని అడిగిన అధికారి లేడు… అతన్ని రావొద్దని ఆదేశించింది లేదు…అందుకు కూడా కారణాలున్నాయంటున్నారు. పనుల కోసం వచ్చే వారు నేరుగా అధికారులకు చేతిలో పెట్టినట్లు కాకుండా, ముందు బ్రోకర్‌ చేతికి అందితే, వాటిని తీసుకున్న దానిలో అందరికీ పంచిపెడతాడు? అప్పుడు అధికారులు తప్పు చేస్తున్నట్లు కనిపించదు…అవినీతి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపించవు…అవినీతి నిరోధక శాఖ దృష్టిలో పడరు…ఇదీ అసలు సంగతి.

ఆర్డీవో కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తి జోక్యం ఏమిటి? 

అనే ప్రశ్నకు సమాధానం చెప్పేవారేరవరు. ఆర్డీవో ఎందుకు ప్రోత్సహిస్తున్నట్లు? అసలు ఇదెలా సాధ్యమౌతుందో సమాధానం కనిపించదు. ప్రభుత్వ కార్యాలయంలో అధికారుల విధి ప్రజలకు పని…మధ్యలో బ్రోకర్లకేం పని…అధి ప్రతి పనికి అతన్ని కలవడం దేనికి? ఈ విషయంలో మరి ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి? అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినా ప్రజా సంఘాల స్పందన లేకపోవడం విడ్డూరం. అసలు ఆర్డీవో కార్యాలయంలోకి సామాన్యుడు వెళ్లడానికి ఎవరో ఒకరిని ఆశ్రయిస్తే తప్ప కార్యాలయంలోకి రానివ్వరా? ఇదెక్కడి చోద్యం…ఇంతటి అన్యాయం మరెక్కడైనా వుంటుందా? అసలు అధికారుల ప్రోత్సాహంలో మర్మమేమిటి? అన్నది కూడా తేలాల్సిన అవసరం వుంది. ఒక బ్రోకర్‌ ప్రభుత్వ కార్యాలయంలో పనులు చక్కబెడుతున్నాడంటే అధికారుంతా నిజాయితీ వదిలేసుకున్నారా? కాసులకు కక్కుర్తి పడుతున్నట్లే అని చెప్పదల్చుకున్నారా? అసలు మన కార్యాలయంలో ఒక బ్రోకర్‌ కు పనేమిటి? అని ప్రశ్నించే ఉద్యోగే లేడా? మొత్తం కార్యాలయమంతా అవినీతి పరులే అని ఒప్పుకున్నట్లేనా? దీనికి అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. ఒకనాడు ఆటో నడిపిన వ్యక్తి ఆర్డీవో కార్యాలయంలో పెత్తనమేమిటి? అన్నది జనం చర్చించుకుంటారని, చీదరించుకుంటారన్న సోయి కూడా అధికారులలో లేదా? అయినా ఒక ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాలలో పనులు చక్కబెట్టడమేమిటి? ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం మరొకటి వుంటుందా? ఏళ్లుగా ఈ తతంగం సాగుతున్నా ఉన్నతాధికారుల పట్టింపేది? ప్రైవేటు వ్యక్తులే పనులు చేసిపెట్టాక, అధికారులెందుకు…కార్యాలయాలెందుకు? అధికారుల ఇష్టారాజ్యామా! బ్రోకర్ల చేతికి పెత్తనమా!! జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే అందరూ వాటాదారులే అని అనుకోవాల్సి వస్తుంది! ఉద్యోగ వ్యవస్థ మీద ప్రజలకు మరింత నమ్మకం పోతుంది. ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థ మీద ప్రజల్లో సరైన అభిప్రాయం లేదు…ఇక ఆయా కార్యాలయాలలో ప్రైవేటు వ్యక్తుల జోక్యం, అవినీతి ఇష్టారాజ్యం అనుకుంటే మాత్రం ఆ వ్యవస్థకే తీరని నష్టం… ప్రజలకు మరింత ఇబ్బందికరం! ఏ పార్టీ అధికారంలో వుంటే వారి అనుచరుడిగా ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకునే బ్రోకర్‌ రాజకీయ చిత్ర విన్యాసాలు మరో కధనం…వెయిట్‌ అండ్‌ సీ…!స్టడీ…అండ్‌ డిసైడ్‌!! ప్రజలారా మేలుకోండి…అధికారుల తప్పును ఎత్తి చూపండి…ప్రభుత్వ అధికారులతో పనులు చేయించుకోవడం మన హక్కు….లంచమిచ్చి పనులు చేయించుకోవద్దు…బ్రోకర్లను నమ్మి మోసపోవద్దు…అధికారులు పని చేయకపోతే నిలదీయండి…! పై అధికారులకు పిర్యాదు చేయండి…ముందు ఆర్డీవో కార్యాలయంలో వున్న బ్రోకర్‌ పని చెప్పండి….అధికారులు ఇప్పటికైనా బ్రోకర్ల వ్యవస్థను ప్రోత్సాహించకండి..!

వనంలో మానవమృగం?

 

`ఆ జిల్లాలో ఏళ్లుగా సాగుతున్న దారుణం!

`ఖాకి ముసుగులో కీచక తోడేలు!

`అరణ్యంలో అ(స)బలల ఆక్రందన!

`ఎవరికి చెప్పుకోలే ఆందోళన!

`పెద్దోళ్లకు చెప్పినా మిగిలేది అరణ్య రోధనే..నా!

`కీచకుడిని తప్పించుకోలేక విలవిలలాడుతున్నారు?

`పక్కనే వుండే మానవ మృగం నుంచి తప్పించుకోలేకపోతున్నారు.

`అరణ్యంలో జంతువులకు భయపడని వాళ్లు నరరూపజంతువును చూసి వణికిపోతున్నారు.

`నిత్యం కబలిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.

`మృగం నుంచి తప్పించుకోలేక, కొలువులు వదులుకోలేక, కుమిలిపోతున్నారు..

`ఎవరికి చెప్పుకోలేక కుంగి కృషించిపోతున్నారు.

`ధైర్యంగా ముందుకొచ్చిన మహిళా ఉద్యోగి పిటిషన్‌ ఇచ్చినా జాప్యమేనా?

`శాఖ పెద్దలున్నది సర్థుబాటు చేసేందుకేనా?

`మహిళా విద్యావంతులు, ఉద్యోగులకు కూడా వేధింపులు తప్పవా!

` అడవికాపాడే కొలువులో తనువు దహిస్తున్నా భరిస్తున్నారు!

`కాపురాలు కూలిపోయే ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నారు!

`ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దినదిన గండంగా బతుకుతున్నారు!

`దిక్కుమాలిన సమాజంలో బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నారు.

`ఆడవారిగా పుట్టినందుకు నరకం అనుభవిస్తున్నారు!

`కొలువులు చేస్తే బతుకు బంగారమౌతుందనుకుంటే, భ్రష్టు పట్టిస్తున్నారు?

`ప్రాణాలు కాపాడే కొలువులో వుండి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

మానవ సమాజమా! మృగాల రాజ్యమా? ఎక్కడ చూసినా ఆడవారికి వేధింపులేనా! చిత్రహింసలేనా! ఆకాశంలో సగం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప, ప్రభుత్వాలు చేస్తున్నదేమిటి? సమాజంలో జరుగుతున్నదేమిటి? ఆడవారికి మిగులుతున్నదేమిటి? ఎంతటి స్థాయిలో వున్నా ఆడవారికి స్వేచ్చ లేదు… రక్షణ లేదు. విద్యావంతమైన సమాజం మరీ దిగజారిపోతోంది. రేపటి తరాన్ని తయారు చేసే వ్యవస్థలో అదే జరిగి, రక్షణ కల్పించాల్సిన చోట కూడా ఆడవారికి వేధింపులే మిగిలితే, ఆక్రంధనలే నిత్యకృత్యమైతే ఇక సమాజం మనుగడెందుకు? మనం మనుషులమని చెప్పుకోవడం ఎందుకు? చట్టాలు చచ్చు బండలైపోతుంటే ఆడవారి జీవితాలకు భరోసా ఎప్పుడు? కంచె చేను మేసే అన్నట్లు ఆడపిల్ల అయితే చాలు కబలిస్తాం…అనే మృగాల మధ్య అబల బతికేదెలా? ఆమెకు మనసుండదా? తనువు దహించుకోవాల్సిందేనా! కామపు చూపులకు లొంగిపోవాల్సిందేనా? వెకిలి చేష్టలు దిగమింగుకోవాల్సిందేనా? లైంగిక చేష్టలకు తలొగ్గాల్సిందేనా! హృదయం కాలిపోతున్నా భరించాల్సిందేనా? ఏ శాఖలో చూసినా కీచక పైచాశికత్వం కనిపిస్తూనే వుంది. విద్యా బుద్దులు చెప్పాల్సిన చోట విపత్కర పరిస్థితులే…సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన వ్యవస్థలో కాటేసేవారే… ఎక్కడా మహిళా లోకానికి స్వేచ్చ లేదు…ఎక్కడా ఆడవారికి గౌరవం లేదు.

ఖాకీ దుస్తులేసుకున్న కామాంధుడు? 

 కార్యాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులను కాల్చుకుతింటుంటాడు?…చెప్పినట్లు వినకపోతే వేపుకుతింటున్నాడు?….వేధించి, వేధించి వారికి నరకం చూపిస్తున్నాడు?…అర్థరాత్రి, అపరాత్రి అనే తేడాలేకుండా రావాలంటాడు?…భర్త పక్కనుండగానే ఫోన్‌ చేసి రమ్మంటాడు?…లేకుంటే ఉద్యోగం ఊడుతుందని బెదిరిస్తుంటాడు!…ఏకంగా భర్తలకే చెప్పేస్తానని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంటాడు!!…వాళ్ల జీవితాలలో కల్లోలం సృష్టిస్తున్నాడు…ఎంత ఉన్నత చదువులు చదువుకుంటే ఏం లాభం? ఉద్యోగం చేస్తుంటే ఏం ప్రయోజనం… మగాడన్న అహంకారం ముందు, ఆడది నలిగిపోవాల్సిందే…నా?

ఉమ్మడి ఆదిలాబాదు నుంచి కొత్తగా ఏర్పాటైన జిల్లా అది. 

ఆ జిల్లాలో వున్న అడవి రక్షణలో వాళ్లంతా బాధ్యులు…ఉద్యోగులు. ఉన్నత విద్యావంతులు. అయితేనేమీ…ఆడ…మగ…తేడ! ఇక సమానానికి దిక్కెక్కడిది…మహిళా ఉద్యోగులకు విలువెక్కడిది…రక్షణ ఎక్కడిది..! ఉన్నతాధికారి పురుషుడైతే చాలు కిందిస్థాయిలో మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతోంది? స్వేచ్చ లేకుండా చేస్తున్నారు? మహిళా ఉద్యోగులు వున్నది..పై స్థాయిలో వున్న అధికారులు ఏం చెప్పినా చేయడానేకేనా? ఇదేనా…నవ సమాజం… ఎక్కడుంది మానవ సమాజం.

ఆ జిల్లాలో ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌ లో కీలక బాధ్యుడతను….కామానికి ప్రతిరూపం…

ఉద్యోగి రూపంలో కొనసాగిస్తున్న కిరాతకం… కనపడిన ప్రతి ఆడది కావాలనుకునే రకం…ఇక తన పరిధిలో పని చేసే మహిళా ఉద్యోగులకు నిత్య నరకం…అయినా పై స్థాయిలో లేదు చలనం…డిపార్ట్మెంట్‌ లో అందరికీ తెలిసిన నిజం…అయినా నోరు తెరిచేందుకు ఎవరూ ఇష్టపడని వైనం…పై వాళ్లంతా అతన్ని వెనకేసుకొస్తున్నారనేదే అందరిలో వున్న అనుమానం… ఎంత కాలానికి ఆగుతుందో ఈ ఘరోం…మాకు ఎప్పుడు మంచి రోజులొస్తాయా అని ఎదురుచూస్తున్న మహిళా ఉద్యోగలోకం…కనికరం లేని శాఖలో పని చేస్తున్నందుకు బతుకంతా చేదు అనుభవం… ఇది ఇప్పుడు మాత్రమే జరుగుతున్నది కాదు…కొన్నేళ్లుగా సాగుతున్న దారుణం…పాపం మహిళా ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తమను తాము సముదాయించుకోలేక, దారుణాలను దిగమింగుకోలేక, దినమొక గండంగా బతుకుతున్నారు. బలౌతున్నారు. చెప్పుకోలేని నిప్పుల సెగను అనుభవిస్తున్నారు. పడుతున్న ఇబ్బందులు ఇంట్లో కూడా చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. పేరుకే ఉద్యోగులు కానీ మహిళలైన పాపానికి నిత్యం చస్తూ బతుకుతున్నారు. పై స్థాయి అధికారులకు మొరపెట్టుకోలేక, చెప్పినా ప్రయోజనం లేక నరకం చూస్తున్నారు. బతుకును వెల్లదీయలేక తల్లడిల్లిపోతున్నారు. అడవిలో వుండే క్రూర మృగాలకు కూడా భయపడని ఆ మహిళా ఉద్యోగులు, ఆ కీచకుడిని చూస్తే వణికిపోతున్నారు. తమ జీవితాలను నాశనం చేస్తున్నా భరిస్తున్నారు. పురుషాధిక్య సమాజంలో ఆ తల్లులు సమిధలౌతున్నారు. ఎదురు తిరలేక, కాదనలేక కారడవిలో తనువు దహిస్తున్నా పంటి బిగువున, కంటి దారలు ఆవిరి చేసుకుంటున్నారు. కళ్లలో కరుగుతున్న ఆశలు, పరాయివాడి చేతిలో నలుగుతున్నందుకు విలవిలలాడుతున్నారు. 

కానీ ఒక్కరు ధైర్యం చేశారు.

ఇక భరించడం తన వల్ల కాదని ఎదురుతిగారు. హైదరాబాదు కు వెళ్ళి శాఖ పెద్దలను కలిశారు. తన గోడును వినిపించారు…న్యాయం చేస్తామని పెద్దలు చెప్పి పంపించారు. వారం గడుస్తోంది…అయినా పెద్దలు కదిలింది లేదు…ఆమెకు న్యాయం జరిగింది లేదు. పైగా ఆమెకు మరిన్ని వేధింపులు మొదలైనట్లు సమాచారం… ఈ విషయం ఇప్పటి వరకు బైటకు పొక్కకుండా అటవీ శాఖ మొత్తం గోప్యంగా వుంచారు. కానీ నేటిధాత్రికి ఈ విషయం తెలిసింది…దాంతో వివరాలు సేకరించేందుకు నేటిధాత్రి అనేక ప్రయత్నాలు చేసింది… ఆ శాఖ పెద్దలతో మాట్లాడాలని ప్రయత్నించింది. అధికారులు అందుబాటులోకి రాలేదు..కానీ విషయం నేటిధాత్రికి తెలిసిందని ఉన్న ఫలంగా జిల్లాలో ఆ శాఖ బాస్‌ హుటాహుటిన హైలెవల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి, చర్చించినట్లు సమాచారం… ఉన్నతాధికారి లైంగిక వేధింపులు తట్టుకోలేని మహిళా ఉద్యోగి చేసిన పిర్యాదు వెనక్కి తీసుకునేలా పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా శాఖ పెద్దలు స్పందించి, కీచకుడిపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇంకా అతని దుశ్చర్యలను ప్రోత్సాహిస్తున్నట్లే అవుతుంది. అక్కడ పని చేయాలంటే మహిళలు భయపడాల్సి వస్తుంది…కొలువులు వదిలేసుకొని వెళ్లిపోవాల్సి వస్తుంది. చట్ట ప్రకారం అలాంటి వారికి శిక్ష పడకపోతే, మరింత మంది తయారయ్యే ప్రమాదముంది.

ముత్తిరెడ్డికంతా వ్యతిరేకమే!?

`పార్టీ శ్రేణులలో గూడుకట్టుకొని వున్న అసంతృప్తి.

`బిఆర్‌ఎస్‌ బలంగా వుంది.

`ముత్తిరెడ్డి నాయకత్వం బలహీనంగా వుంది.

` ప్రతి చోట వివాదమే!

`నియోజకవర్గమంతా ఇబ్బందికరమే!

`ఏ మండల నాయకులను కదిలించినా ఇదే మాట!

`అభ్యర్థిని మార్చితేనే మనుగడ!

`లేకుంటే కష్టమేనట!

`ద్వితీయ శ్రేణిని ఎదగనివ్వని ముత్తిరెడ్డి!

`తాజాగా కడవేర్గులో ముత్తిరెడ్డిని యువకులు నిలదీత!

`చేర్యాల, మద్దూరు, నర్మెట్ట, బచ్చన్నపేట లలో తీవ్ర వ్యతిరేకత.

`జనగామ టౌన్‌ లో అదే పరిస్థితి!

`ఎక్కడ విన్నా ఇదే అనిశ్చితి!

`ఆరు నెలలు కిందటే నేటిధాత్రి హెచ్చరించింది?

`అయినా తీరు మారని ముత్తిరెడ్డి!

`పార్టీ ఆదేశాల మేరకే క్యాడర్‌ సైలెంట్‌ గా వుంది!

`ఎన్నికల నాటికి ఎటు మలుపు తిరుగుతుందో అన్నట్లే వుంది!

`గత ఎన్నికల సమయంలోనే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా గళం.

`పార్టీ ఆదేశాలతో అప్పుడు అందిన సహకారం.

`ఇప్పుడు ససేమిరా…అనేందుకే అందరూ సిద్ధం!

`నిరసన గళం ఎప్పటి నుంచో వినిపిస్తున్నారు!

`జనగామ గెలవాలంటే ముత్తిరెడ్డిని మార్చితే తప్ప అంటున్నారు!!

 హైదరాబాద్‌,నేటిధాత్రి:

జనగామ…ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పోరుగడ్డ. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ తొలి, మలి ఉద్యమాలకు ఊపిరిపోసిన అడ్డా. నిజాం కాలంలో తెలంగాణ విముక్తికోసం తెగించి కొట్లాడిన ప్రాంతం. ఉద్యమ వీరులకు, తెలంగాణ సాయధ పోరాటంలో వీరోచిత యోధులకు పుట్టినిల్లు. అలాంటి ప్రాంతంలో ప్రజా సేవ చేసే నాయకులను గుండెల్లో పెట్టుకొని దీవించే జిల్లా జనగామ. తెలంగాణ ఏర్పాటయ్యాక జిల్లాలు ఏర్పాటు జరిగినప్పుడు కూడా కొట్లాడి జిల్లా సాధించుకున్న మొదటి జిల్లా జనగామ. అలాంటి జిల్లాలో నాయకుల అవినీతి ప్రజల సహించరు. ఆశ్రిప పక్షపాతాన్ని అసలే అంగీకరించరు. అభివృద్ధి నిరోధకులకు స్ధానం కల్పించరు. జనగామ విద్యాపరంగా చైతన్యవంతమైన జిల్లా…అలాంటి జిల్లాలో భారత రాష్ట్ర సమితి బలమైన పార్టీ. ఉద్యమ కాలంలో చంద్రబాబు లాంటి వారికి చుక్కలు చూపించిన ప్రాంతం. అంతగా మమేకమైన ఉద్య మకారులే కాదు, బిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా వున్నాయి. తిరుగులేని శిక్తిగా బిఆర్‌ఎస్‌ వుంది. కాని జిల్లా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మీద ప్రజల్లోనే కాదు, పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. 

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిమీద పార్టీ శ్రేణుల్లో చాలా కాలంగా అసంతృప్తి గూడు కట్టుకొని వుందన్న సంగతి అందరికీ తెలుసు. 

గత ఎన్నికల సమయంలోనే ఆయనకు వ్యతిరేకంగా జిల్లాలోని సీనియర్‌ నాయకులెంతో మంది ఎక్కడికక్కడ సమావేశమై, టిక్కెట్టు ఇవ్వొద్దని కూడా గళమెత్తారు. కాకపోతే అప్పటి పరిస్ధితులను దృష్టిలో పెట్టుకొని ఎంత అసంతృప్తి వున్నా పార్టీ శ్రేణులు అంగీకరించాయి. ఎంతో సహకరించాయి. ప్రజలు కూడా కేవలం కేసిఆర్‌ నాయక్వమే చూశారు..అందుతున్న సంక్షేమ ఫలాలను చూసి బిఆర్‌ఎస్‌కు ఓట్లేశారు. దాంతో ముత్తిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అయ్యింది. అయినా ఆయన తీరులో మార్పు రాలేదన్నది చాలా మంది చెప్పే మాట. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడే ఆయన అధికార యంత్రాంగంతోపాటు, కొంత మంది పార్టీ నాయకులతో కూడా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అప్పటి కలెక్టర్‌ విషయంలో ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. పట్టణ సందర్శన సమయంలో నెక్కర్‌ మీద వెళ్లడం సర్వత్రా వివాదం ముసిరింది. ఆ తర్వాత ఓ మహిళా విఆర్‌ఓ విషయంలో బెదిరింపులకు దిగినట్లు వార్తలు వచ్చాయి. అవి అప్పటికప్పుడు సర్ధుమణిగినా ఎన్నికల సమయంలో మళ్లీ తెరమీదకు రావడం జరుగుతుంది. ఇక జనగామలో దుర్గమ్మ గుడి స్థల వివాదంపై పెద్ద రచ్చనే జరిగింది. ఇక పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు, డబుల్‌ బెడ్‌ రూంల ఇండ్ల కేటాయింపు కూడా ముత్తిరెడ్డిమీద జనం కోపంతోనే వున్నారు. ఇక చెరువుల కబ్జాలపై జనగామలో, చేర్యాలలో ఎంతగా వివాదాలు ముసిరాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఓట్లేయలేదని ఓ గ్రామానికి చెందిన చెరువులో నీళ్లు నింపడానికి అంగీకరించడకపోవడం కూడ వివాదాస్పదమైంది. కొమరవెళ్లి మల్లన్న గుడి వివాదంలో అందరూ ముత్తిరెడ్డిని వేలెత్తి చూపిన సంగతి తెలిసిందే…ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ విషయంలో ముత్తిరెడ్డి బాగానే మందలించినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక బచ్చన్న పేట మండలంలోని ఓ గ్రామంలో మహిళలు కూడా ఓసారి ముత్తిరెడ్డిని నిలదీసిన సందర్భం వుంది. తాజాగా కడవేర్గు అనే గ్రామంలో ముత్తిరెడ్డిని యువకులు అడ్డుకున్నారన్న వార్తలు పెద్దఎత్తున వైరల్‌ అయ్యాయి. 

జనగామ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ ఎంతో బలంగా వుంది. 

గ్రామాలకు గ్రామాలు పూర్తిగా బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులే వున్నాయి. అయినా ముత్తిరెడ్డి మీద వారికి నమ్మకం లేదు. ఆయన నాయకత్వం మీద విశ్వాసం లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ విషయం నేటిధాత్రి గత ఆరు నెలల క్రితమే హెచ్చరించింది. జనగామలో ముత్తిరెడ్డికి వ్యతరేకంగా జనం విపరీతంగా చర్చించుకుంటున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో జిల్లాలో కొంత ప్రజలతో సఖ్యత కనబర్చుతున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి నాయకుడుగా రావాలని కోరుకుంటున్నారన్న సంగతిని చెప్పడం జరిగింది. అయితే శ్రీనివాస్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ముత్తిరెడ్డి నాయకత్వాన్ని బలపర్చుతున్నట్లు ప్రకటించారు. కాని ఇప్పుడు ప్రజల్లో ముత్తిరెడ్డి మీద పెరుగుతున్న వ్యతిరేకతపై శ్రేణులు ఏం చెప్పుకుంటున్నాయో శ్రీనివాస్‌రెడ్డి తెలుసుకుంటే మంచిదని కూడా నేటిధాత్రితో చెబుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. జనగామ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల ప్రజలతో నేటిధాత్రి ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. బిఆర్‌ఎస్‌ మీద, ముఖ్య మంత్రి కేసిఆర్‌ నాయకత్వం మీద ప్రజలు ఎంతో నమ్మకంతో వున్నారు. సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఈసారి ముత్తిరెడ్డికి టిక్కెట్టు ఇస్తే మాత్రం కష్టమౌతుందని అంటున్నారు. అంటే ముత్తిరెడ్డి మీద ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేక వుందోఅర్ధం చేసుకోవచ్చు. 

ముత్తిరెడ్డిమీద జనగామ జిల్లా కేంద్రంతోపాటు, మద్దూరు, నర్మెట్ట, చేర్యాల, కొమరవెళ్లి జిల్లాలో మాత్రం పూర్తి వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

 అందుకు తాజాగా కడవేర్గులో జరిగిన సంఘటనే చెప్పుకోవచ్చు. ఇక చేర్యాల విషయంలో చెరువు వివాదం ఎంతో కాలం సాగుతున్నదే. ఏకంగా పోలీసు రక్షణతోనే స్థలానికి ఫెన్సింగ్‌ వేయించారన్న అపవాదు వుండనే వున్నది. ఇక చేర్యాల రెవిన్యూ డివిజన్‌ విషయంలో పార్టీలకు అతీతంగా పోరాటాలు సాగుతున్నాయి. అయినా ముత్తిరెడ్డి స్పందన కనబర్చడం లేదన్నది బిఆర్‌ఎస్‌ నేతలే అంటున్న మాట. అంతే కాదు గతంలో జిల్లా ఏర్పాటు విషయంలో పార్టీ శ్రేణులు చేసినంత ఒత్తిడి, ఏనాడు ముత్తిరెడ్డి చేయలేదని, ప్రజాసంఘాలే ముందుండి జిల్లాను సాధించుకున్నాయన్న సంగతి తెలిసిందే. జిల్లా ఏర్పాటులో ముత్తిరెడ్డి పాత్ర ఎంత అని అనేక మంది నాయకులను నేటిధాత్రి ప్రశ్నిస్తే నవ్వి…ఇదే సమాధనం అంటున్నారంటే ఆయన నాయకత్వం మీద పార్టీ శ్రేణులకు ఎంత నమ్మకం వుందో అర్ధమౌతోంది.                       

జనగామ జిల్లాలో ముత్తిరెడ్డి ద్వితీయశ్రేణిని ఎదగనీయకుండా చేశారు. 

జనగామలో తనంత స్ధాయి నేత లేకుండా చూసుకున్నాడు. దాంతో స్ధానిక నేతలు తము బరిలోవుంటామని గాని,పోరులో వుంటామని చెప్పకుండా ఎవరైనా బలమైన మరో నేత వస్తే చాలన్న మాటలు చెబుతున్నారు. ఈసారి ముత్తిరెడ్డికి కాకుండా ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా, గెలిపించుకుంటామంటున్నారు. ఒక వేళ పార్టీ ముత్తిరెడ్డిని బలవంతంతా బరిలో దింపినా, పార్టీ పరంగా ఎంత సపోర్టు చేసినా, ప్రజల్లో వున్న వ్యతిరేకత మాత్రం ఎవరూ ఆపలేరని అంటున్నారు. ప్రజల్లో ముత్తిరెడ్డి మీద కనబడుతున్న వ్యతిరేకత కేవలం ఆయన వ్యక్తిగతమైందే తప్ప, పార్టీకి దానికి సంబంధం లేదంటున్నారు. అందుకే బలంగా వున్న జనగామలో ముత్తిరెడ్డికి తప్ప…ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా సరే అన్న మాటలే సర్వత్రా వినిపిస్తన్నాయి. ఇలాంటి నియోజకవర్గంలో అభ్యర్ధిలను మార్చితే తప్ప లాభం లేదు. గెలిచేస్ధానాలలో ప్రజా విశ్వసం లేని నాయకుల మూలాంగా సీట్లు కోల్పోవాల్సివస్తుందనేమో అని పార్టీ శ్రేణులు అందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ముత్తిరెడ్డి ప్రజలకు చేరువౌతాడా…తాజాగా మంత్రి కేటిఆర్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం గురించి ఎమ్మెల్యేలందరికీ చేసిన సూచనల ప్రచారం వచ్చే ఏడెనమిది నెలలు ప్రజల్లో ముత్తిరెడ్డి వుంటాడా? వేచి చూడాలి…

హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం…..

నేటిధాత్రి హుజురాబాద్: 

కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గందె రాధిక నుపదవి నుంచి తొలగించవలసిందిగా కోరుతూ 25 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు పంపించారు. హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో 30 మంది కౌన్సిలర్లకు గాను వివిధ పార్టీలకు చెందిన 25 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పత్రంపై సంతకాలు చేసి కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం పంపించారు. తాము తమ ప్రాంతాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నామని,మున్సిపల్ చైర్ పర్సన్ భర్త తానే చైర్మన్గా వ్యవహరిస్తూ తన ఇష్టారాజ్యంగా బినామీ పేర్లతో కాంట్రాక్టు పనులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలుపుతూ అవిశ్వాస పత్రంలో పేర్కొన్నారు. తమ సమస్యల గురించి చైర్పర్సన్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఆమెలో మార్పు రావడంలేదని, వెంటనే ఆమెను పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ 25 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు

‘‘చారి’’ సాబ్‌ ‘‘ఇదేం కిరికిరి’’!

`భూపాలపల్లి రాజకీయాలలో ఈ లొల్లేమిటి?

`కల్వకుంట్ల కవిత జిల్లా పర్యటనలో ఆ గలాట ఏమిటి?

` అధికార పక్షంలోనే ప్రతిపక్షమేమిటి?

` బిఆర్‌ఎస్‌ లో ఇరుపక్షాలేమిటి?

`భూపాలపల్లిలో గందరగోళమేమిటి?

`ముసలం పుట్టించడం దేనికి?

`సాఫీగా వున్న చోట కవ్వింపులేమిటి?

` ఆదిపత్య పోరు తెచ్చి సాధించేదేమిటి?

`పార్టీ పరువు బజారుకీడ్చడం దేనికి?

`గత ఎన్నికలలో మూడో స్థానానికి పరిమితమైతిరి?

` వారసుల మూలంగా మొదటికే మోసం తెచ్చుకుంటిరి?

`పదవి లేకుండా వుండలేనని సిఎం కేసిఆర్‌ కు మొరపెట్టుకుంటిరి!

`దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎమ్మెల్సీని చేసిరి?

` అయినా ఆశ తీరడం లేకుంటిరి?

` ఇప్పుడు మళ్ళీ ‘‘సై’’ అని పార్టీలో కుంపటి పెట్టవడ్తిరి?

` ఉన్నది కాస్త ఊడేదాక చేయాలని చూడవడ్తిరి?

`పార్టీకి గడ్డురోజులు తేవడం కాక మరేమిటి?

`ఎమ్మెల్సీ చేసిన నాడు సిఎం. కేసిఆర్‌ చెప్పిందేమిటి, ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి?

`భూపాలపల్లిలో పార్టీకే చోటు లేకుండా పోతే భవిష్యత్తుకు దారేది?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అది భూపాల పల్లి నియోజకవర్గం. భారత రాష్ట్ర సమితికి అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజవకవర్గం. తెలంగాణ రాష్ట్రానికి తొలి స్పీకర్‌ను అందించిన నియోజకవర్గరం. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో వున్న ప్రాంతం. ఇప్పుడు జిల్లాగా అవతరించింది. అభివృద్ధిలో దూసుకుపోతోంది. అక్కడ బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంతో బలంగా వుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో కీలకభూమికపోషించిన ప్రాంతమది. అలాంటి జిల్లాలో ఇద్దరు ఉద్దండులైన నేతలున్నారు. ఒకరు మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూధనా చారి…మరొకరు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఇద్దరూ ఇద్దేరే…ఇద్దరూ ఉమ్మడి రాష్రంలో కూడా పేరెన్నిక గన్న నేతలే…ప్రజల హృదయాలలో స్ధానం సంపాదించుకున్నవారే..కాకపోతే ఎక్కువ సార్లు ఆ నియోజకవర్గం నుంచి గెలిచింది మాత్రం గండ్ర వెంకటరమణారెడ్డే. ఇద్దరూ ఇప్పుడు బిఆర్‌ఎస్‌ వున్నారు. కాని నియోజకవర్గంలో మాత్రం ఇద్దరిదీ చెరోదారి కావడంలో నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. ఇలాంటి పరిస్ధితికి కారణం మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనా చారి పేరునే ఎక్కువగా చెప్పుకుంటున్నారు. కారణాలు ఏవైనా కావొచ్చు కాని పార్టీని ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎవరూ తేవొద్దు. పైగా పార్టీ బలోపేతం విషయంలో ఎమ్మెల్సీ మధుసూధనా చారి మీద మరింత బాధ్యత వుందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన బిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటులో కీలకభూమిక పోషించిన నాయకుడు. తెలంగాణ ఉద్యమ రచనలో తనదైన పాత్ర పోషించిన నాయకుడు. అలాంటి నాయకుడి వల్లనే ఇప్పుడు భూపాల పల్లిలో ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయన్న మాటలు సర్వత్రా వినిపించడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో కూడా ఒకప్పుడు మంచి పేరున్న మధుసూధనా చారి 1994 ఎన్టీఆర్‌ ప్రభంజనంలో ఒకసారి శాయం పేట నుంచి గెలుపొందారు.

తర్వాత పరిణామాలలో ఆయన చంద్రబాబుకు దూరమయ్యారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాకపోతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమ రచన సాగించిన సమయం నుంచి ఆయన ఉద్యమానికి తోడుగా నిలుస్తూ వచ్చాడు. కాని ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన గెలవలేదు. మళ్లీ తెలంగాణ వచ్చాక 2014లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి, తెలంగాణ తొలి స్పీకర్‌ అయ్యాడు. 2018లో జరిగిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. 2014 ఎన్నికలంటే ఎక్కువ సీట్లు సాధించింది. స్పీకర్‌ మధుసూధనా చారి ఓడిపోయారు. భూపాల పల్లినుంచి గండ్ర గెలిచారు. అదే నియోజకవర్గం నుంచి సిరికొండ మీద గెలిచిన గండ్రవెంకటరమణారెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. బిఆర్‌ఎస్‌ భూపాల పల్లిలో తిరుగులేని శక్తిగా మారేందుకు గండ్ర దోహదపడ్డాడు. ఆ తర్వాత వచ్చిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు తిరుగులేని విజయం కట్టబెట్టడంలో వెంకటరమణారెడ్డి కీలక భూమిక పోషించారు. భూపాల పల్లిలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయగలిగారు.ఇదే సమయంలో మధుసూధనా చారికి పదవి లేకపోవడం ఒక లోటుగా తోచింది. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తనకు పదవి లేకపోవడం ఇబ్బంది కరంగా వుందని చెప్పడంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అది ఇంకా ఐదేళ్లు వుంది. మధుసధనా చారికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి కేసిఆర్‌ భూపాలపల్లి నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ జోక్యాలు చేసుకోవద్దని…ఇబ్బందికరమైన పరిస్ధితులు రావొద్దని సూచించారు. అంతే కాకుండా ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డిని ఒప్పించి, మధుసూధనా చారి భూపాల పల్లి రాజకీయాల్లో ఎలాంటి జోక్యం వుండదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఓ ఆరు నెలల పాటు ఎలాంటి సమస్యలేదు. కాని ఆ తర్వాత భూపాల పల్లి నియోజకవర్గంలో ముసలం మొదలౌతూ వచ్చింది. గత కొంత కాలంగా నివురుగప్పిన నిప్పులా ఆధిపత్య పోరు సాగుతూనే వుంది. అయినా అవి పెద్దగా వెలుగులోకి రాలేదు. ఎమ్మెల్యే గండ్ర కూడా వాటిని పట్టించుకోలేదు. పెద్ద మనిషి తరహాగానే సిరికొండను చూస్తూ వస్తున్నారు. ఇటీవల ఎమెల్సీ కల్వకుంట్ల కవిత జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సిరికొండ, గండ్ర వర్గీయులు బాహాబాహీకి దిగినంత పనిచేశారు. దాంతో కవిత కూడా అక్కడి పరిస్ధితులపై అసహనం వ్యక్తం చేశారు. నిజానికి జిల్లాలో అత్యంత సీనియర్‌ నాయకుడిగా వున్న సిరికొండ మూలంగా సమస్యలు ఎదురుకావడం అన్నది సరైంది కాదని, పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో సిరికొండ మూడో స్ధానంలో నిలిచారు. వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయినా ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో వున్నారు. పిట్టపోరు, పిట్టపోరు పిల్లితీర్చినట్లు అసలు ప్రతిపక్షానికి స్ధానం లేని చోట ఇద్దరు నేతల దూరం పెరగడంతో ప్రతిపక్షానికి తావిచ్చినట్లౌతుందని బిఆర్‌ఎస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటిదాకా అసలు ప్రతిపక్షమనేది లేకుండా ఎమ్మెల్యే గండ్ర చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు స్వపక్షంలోనే విపక్షం తయారు కావడం జిల్లా రాజకీయాల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం వుంది. అంతే కాకుండా ఇటీవల మీడియాలో కూడా మధుసూధనా చారి మళ్లీ భూపాల పల్లి నుంచి పోటీ చేస్తారన్న వార్తలు రావడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది. ఎవరు ఎటు వైపు నిలవాలన్నదానిపై పెద్దఎత్తున మల్లగుల్లాలు పడాల్సివస్తోంది. అంతేకాకుండా భూపాల పల్లిలో ఎలాంటి స్ధానం లేని చోట ప్రతిపక్షానికి అవకాశమిచ్చట్లైతుంది. ఈ విషయం సిరికొండకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పీకర్‌గా పనిచేసిన సమయంలో మధుసూధనా చారి కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడలేదు. స్పీకర్‌గా వున్నప్పటికీ ప్రజల్లోనే వుంటూ వచ్చారు. రాష్ట్రమంతా బిఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగినా సిరికొండ ఓటమిపాలయ్యారు. అంటే ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత వున్నట్లే…పైగా ఆయన ఎన్నికల ఫలితాలలో మూడోస్ధానంలో నిలిచారు.

ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అలాంటప్పుడు జిల్లా రాజకీయాలలో మరొకరు వేలుపెట్టకుండా, ప్రతిపక్షాలకు తావు లేకుండా, అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం వుంది. పైగా పార్టీలోని నాయకులు ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్ధితులు సృష్టిస్తే మందలించే స్ధానంలో వున్న మధుసూధనా చారి వల్లనే పార్టీలో ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురుకావడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పైగా ఈ విషయాలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్‌ సిట్టింగులకే సీట్లు అన్నది తేల్చేశారు. భూపాల పల్లిలో ఎమ్మెల్యే గండ్ర నాయకత్వం బలంగానే వుంది. జిల్లాలో పట్టున్న సీనియర్‌ నాయకుడు. అలాంటి నియోజకవర్గంలో లేని పోని చిచ్చు పెట్టుకుంటే, బిఆర్‌ఎస్‌కే నష్టం జరుగుతుంది. ఇప్పుడు పార్టీ అధికారంలో వుంది. భూపాల పల్లిలో బలంగా వుంది. ఇలాంటి సమయంలో సఖ్యతతో, మరింత సమర్ధవంతగా పార్టీని కాపాడుకుంటూ, అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా ఇరు నేతలు పెద్దఎత్తున జిల్లాను అభివృద్ధి చేయొచ్చు. కాని నిత్యం కీచులాడుకునే పరిస్ధితి వస్తే అభివృద్ది అన్నది పక్కకు వెళ్తుంది…రాజకీయం రాజ్యమేలుతుంది. అధిపత్యం అడుగడుగునా పార్టీకి నష్టం చేకూర్చుతుంది. ఇప్పటికైనా సిరికొండ మధుసూదనా చారి పెద్ద మనిషిగా, పెద్దన్న పాత్ర పోషిస్తే బాగుంటుందనే అందరూ కోరుతున్నారు. మరి భవిష్యత్తు కాలం ఎలా వుంటుందో చూడాలి.

కొసరు నేతలే కోవర్టులా!

 

`అసలు కన్నా కొసరుకే విలువెక్కువ…

`ఉన్నట్టుండి బిజేపిలో గందరగోళానికి కారణం ఏమిటి?

`అద్దెకొచ్చిన నేతలే అతలాకుతలం చేస్తున్నారా!

`తనకెదురు లేకుండా చేసుకునేందుకే బండి సంజయ్‌ రాజకీయం చేస్తున్నాడా?

`ఇంతకీ కోవర్టులెవరు? ఎందుకు పేర్లు చెప్పలేకపోతున్నారు!

`ఎవరికి వారు మధనపడితే సమస్య తీరుతుందా?

` బండి సంజయ్‌ ని కొనసాగిస్తారా?

` కేంద్ర మంత్రిని చేస్తారా?

`బండి కొనసాగితే కొసరు నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారా?

`కొసరు నేతలకు పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చని నిర్ణయానికొచ్చారా?

` కొత్తగా చేరిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటే బిజేపి మళ్ళీ మొదటికే రాదా?

`బిజేపిని గట్టెక్కించే నాయకులున్నారా?

` కనిపించే నలుగురు నాయకుల్లోనే సఖ్యత లేదు!

` తెలంగాణలో బిజేపిలో అసంతృప్తి ఆగదు!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ రాష్ట్ర బిజేపిలో అసలు నేతలెవరు? కొసరు నేతలెవరు? అసలు కోవర్టు నేతలెవరు? కోవర్టులను ప్రోత్సాహిస్తున్నదెవరు? కోవర్టుల గురించి ప్రస్తావిస్తున్నదెవరు? చర్చకు పెట్డిందెవరు? దానిని విపరీతంగా ప్రచారం చేస్తున్నదెవరు? బిజేపిని ముంచుతున్నదెవరు? తమకు తాము మునుగుతున్నదెవరు? పార్టీకి దిక్కులేకుండా చేస్తున్నదెవరు? ఎవరి వారు మేమే గొప్ప ప్రచారం చేసుకుంటున్నదెవరు? బండి సంజయ్‌ ని ఈసారి మార్చుతున్నారని ప్రచారం మొదలుపెట్టిందెవరు? బండి సంజయ్‌ ని కేంద్ర మంత్రిని చేస్తారని చెప్పిందెవరు? ఎన్నికల దాకా నేనే వుంటా! అని బండి ఎలా ఎవరితో చెప్పారు? నాకు అధ్యక పదవి కావాలని అడుగుతుందెవరు? అడిగి చిన్న బుచ్చుకున్నదెవరు? ఇటీవల పార్టీకి దూరంగా వుంటున్నదెవరు? అసమ్మతి రాగం ఆలపిస్తున్నదెరు? ఆ చిచ్చు రాజేసిందెవరు? నాకిచ్చిన మాట ప్రకారం అధ్యక్షుడిని చేయండని అడిగిన నేత ఎవరు? ఏం …పీకారని ఆయన అధ్యక్ష పదవి కావాలని కోరుతున్నాడని అసలైన బిజేపి నేతలతో అన్నదెవరు? నా వెంట నలభైమంది ఎమ్మెల్యేలున్నారని చెప్పిందెవరు? ఒక్కరిని కూడా తీసుకురాలేకపోయావ్‌? అని మొహం మీదే అడిగిన నేత ఎవరు? నీతో వచ్చే వాళ్లు కార్పోరేటర్లుగా కూడా గెలుస్తారా? అని సందేహం వ్యక్తం చేసిన జాతీయ నేత ఎవరు? వాళ్ల రాజకీయ అవసరాల కోసం వచ్చే వాళ్లే తప్ప, పార్టీ కోసం వచ్చే వాళ్లేరి అని ఎందుకు విసుక్కున్నాడు? మీరు కూడా ఊగిసలాడి, కేంద్రంలో అధికారంలో వుండడం వల్ల చేరిందే కాని, అభిమానంతో కాదని ముఖం మీదే అన్నదెవరిని? కోవర్టులు, కోవర్టులు అని పదే, పదే పలవరించడం ఎందుకు? పేర్లు చెప్పలేనప్పుడు చెప్పుడెందుకు? అంత ధైర్యం లేనప్పుడు పార్టీ కోసం ఏం త్యాగం చేస్తావని నిలదీసిందెవరు? ఈ వివాదాలన్నింటికీ కేంద్ర బిందువెవరు? అసలు సూత్రదారులెవరు? పాత్ర దారులెవరు? ఎవరిని పారద్రోలేందుకు ఇదంతా చేస్తున్నదెవరు? ఏ చెట్టు మీద వాలాలని దీనికి ఆజ్యం పోస్తున్నదెవరు? అసలు నేతలతో బిజేపి బలపడిరదెంత? వలస నేతల మూలంగా పెరిగిన బలమెంత? బండి సంజయ్‌ ఇలాకాలో బిజేపి ఎదురులేకుండా ఎదిగిందా? హుజూరాబాద్‌ లో బిజేపిలో హుషారు నిండిరదెంత? దుబ్బాకలో ఎదురులేకుండా బిజేపి పెరిగిందా? బిజేపి ఈ మాత్రం పుంజుకోవడానికి కారణం బండి సంజయా? వలస నేతలు తెచ్చిన ఊపా? వాళ్లు వెళ్లిపోతే బిజేపిని కాపాడుకునే సత్తా బండికి వుందా? అసలు నేతలను నమ్మి జనం కలిసొస్తారా? బిజేపిని నెత్తిన పెట్టుకుంటారా? కోవర్టు నేతలు సాధిస్తున్న విజమేమిటి? అసలు నేతలు కాపాడుతున్నదేమిటి? ఒకటే పార్టీలో అసలు, కొసరు అన్న తేడాలేమిటి? ఎన్ని రోజులైనా వలస నేతలకు అంతంత ప్రాధాన్యతేనా? వారికి బాధ్యతలు అప్పగించేదేమైనా వుందా? వారిని గుర్తించే అవకాశం వుందా? వలస నేతలు కొత్త దారి ఎంచుకుంటే బిజేపి పేక మేడౌతుందా? కేంద్ర పెద్దలు పెట్టుకున్న అవకాశాలు అడియాసలౌతాయా? కొత్తగా చేరిన నేతలకు అసలే గుర్తింపు లేకుండా పోతోందా? వారిని పట్టించుకోకపోవడం వల్లనే దాసోజు శ్రవణ్‌, స్వామి గౌడ్‌ లాంటి వాళ్లు సొంత గూటికి చేరారా? అసలు నేతల వ్యవహారశైలి వల్లనే వాళ్లు వెళ్లిపోయారా? ఇప్పుడు ఈటెల రాజేందర్‌ కు అదే పరిస్థితి తెస్తున్నారా? పొమ్మనలేక ఈటెలకు పొగబెడుతున్నారా? కొత్త కొత్త ఎపిసోడ్లు తెరమీదకు తెచ్చి ఈటెల మనోభావాలను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారా? నిజంగా ఈటెల రాజేందర్‌ అసంతృప్తితో వున్నారా? ఈటెలను అసంతృప్తికి గురిచేస్తున్నారా? ఈటెల ఏది చేసినా తప్పు పడుతున్నారా? ఈటెలను ఒంటరి చేసే కుట్ర జరుగుతోందా? ఈటెల రాజేందర్‌ వేరే దారి చూసుకుంటాడన్న ప్రచారం ఎందుకొస్తోంది? ఎవరు మొదలు పెట్టారు? దాని వెనుక వున్నదెవరు? మొత్తంగా బిజేపిని ముందట పడకుండా చేస్తున్నదెవరు? బిజేపిలో బండి సంజయ్‌ కు, ఈటెల రాజేందర్‌ కు పొసగడం లేదన్న దాంట్లో నిజమెంత? ఈటెల మద్దతుదారులు బండికి వ్యతిరేకమా? కోవర్టుల పేరుతో ఈటెల రాజేందర్‌ ఒక వేలు చూపితే, ఆయన వైపు నాలుగు వేళ్లు చూపుతున్నదెవరయ? ఇదే ఇప్పుడు బిజేపిని అయోమయంలో పడేస్తున్న అంశాలు…ఇందుకు అందరికీ కారణాలు తెలుసు! ఎవరు బాధ్యులో తెలుసు!! కానీ అందరూ రాజకీయమే చేస్తున్నారు…బిజేపిని నిండా ముంచే పనిలో పడ్డారు.  

అసలు కన్నా కొసరుకే విలువెక్కువ…

అని ఏ వర్గం విపరీతమైన ప్రచారం చేస్తోందన్నదే ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మేం ఆ పార్టీలో గండరగండులం…మేం వేరు..మా స్థాయి వేరు…మాకిక్కడ సరైన ప్రాధాన్యత లేదు…అని ఇప్పుడు అనుకోవడం ఎందుకు? ఏదో ఆశించే బిజేపిలో చేరిన నేతలే అందరు? చేరిన నాడు ఎలాంటి షరతులు లేవని చెప్పినా ఎవరూ నమ్మే సంగతులు కాదు…ఏదీ అవసరం లేదనుకున్నప్పుడు రాజకీయంగా పుట్టి పెరిగిన పార్టీలను వదిలేసుడెందుకు? ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? అసంతృప్తులుగా ముద్ర వేసుకోవడం ఎందుకు? ఎంత కాదన్నా బిజేపి కేంద్రంలో అధికారంలో వుంది. ఏ నాయకుడిని బిజేపి భుజ్జగించే పని పెట్టుకోదు…వెళ్తామంటే ఆపేందుకు కూడా ఆలోచించదు…తన దొడ్లో కట్టిపెట్టుకునేందుకు కాదనదు…అలా అని కొత్త నేతలకు అన్ని విషయాలు కూడా బిజేపి వివరించదు…ఎంత నమ్మకంతో వచ్చిన నేతలనైనా అంత తొందరగా ఏ పార్టీ నమ్మదు…అదే బిజేపి కూడా అనుసరించేదే! రాత్రికి రాత్రే కిరీటం పెట్టమంటే బిజేపిలో అసలే సాధ్యం కాదు. అయినా ఆశలు పెంచుకోవడంలో తప్పు లేదు. కానీ అత్యాశ పడడమే అసలుకే మోసం తెస్తుంది. ఎటూ కాని రాజకీయ సుడిగుండంలోకి నెట్టేయబడుతుంది. 

ఉన్నట్టుండి బిజేపిలో గందరగోళానికి కారణం ఏమిటి? అనేది ఎవరికి ఒక పట్టాన అంతుపట్టడం లేదు.  

ఒక్కసారిగా విజయశాంతి లాంటి వాళ్లు కూడా తెరమీదకు వచ్చారు. కోవర్టుల అంశం మీద స్పందించారు. కానీ ఈటెల చెప్పిన విషయంపై కొంత విభేదించారు. పార్టీ మీద నిజంగా ప్రేమ వున్న వాళ్లు పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లు బైట పెట్టాలని ఈటెలకే విజయశాంతి హితవు పలికారు. ఏదో చీకట్లో రాయి విసిరి నాకేం సంబంధం అనకూడదని సూచించారు. ఒకవేళ కోవర్టుల పేరు ఈటెల రాజేందర్‌ బైట పెడితే పార్టీ వారిని బైటకు పంపే అవకాశం వుందన్నారు. ఎందుకంటే విజయశాంతి లాంటి వాళ్లు రాజకీయంగా ఎలాంటి ఆశలు లేకుండా సేవచేస్తారు. కేవలం తెలంగాణ కోసమే ఉజ్వలమైన సినీ భవిష్యత్తును వదులుకొని, కన్న తల్లి లాంటి ప్రాంతం మీద మమకారం పెంచుకున్నారు. సొంతగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆస్థులు కోల్పోయారు. తెలంగాణ కోసం నిలబడ్డారు. అంతే కాకుండా ఇక సినిమాలు చేయనని చెప్పి అదే మాట మీద నిలబడ్డారు. తెలంగాణ ఇచ్చిందనే విశ్వాసంతో కాంగ్రెస్‌ లో చేరినా, అక్కడ పరిస్థితులు ఆమెను కొనసాగనివ్వలేదు. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఏనాడు బిజేపి మీద అసంతృప్తి వ్యక్తం చేయలేదు. తనకు ప్రాధాన్యత కరువైందనలేదు. పదవుల కోసం పాకులాడలేదు. తన శక్తి మేరకు పార్టీకి సేవ చేస్తూవస్తున్నారు. కోవర్టుల అంశం తెరమీదకు రావడంతో పార్టీకి నష్టం జరగొద్దని సూచిస్తున్నారు. కోవర్టుల నుంచి పార్టీని రక్షించుకోవాలంటున్నారు. 

అద్దెకొచ్చిన నేతలే అతలాకుతలం చేస్తున్నారా! అన్నదే బైట ఎందుకు చెవులు కొరుక్కుంటున్నారు.

తనకెదురు లేకుండా చేసుకునేందుకే బండి సంజయ్‌ రాజకీయం చేస్తున్నాడా? అని కూడా ఎందుకు చెప్పుకుంటున్నారు. ఇంతకీ కోవర్టులెవరు? ఎందుకు పేర్లు చెప్పలేకపోతున్నారు! ఈ మధ్య జరుగుతున్న ప్రచారంలో ఈటెల రాజేందర్‌ కోవర్టుల ప్రస్తావన తేవడం చర్చనీయాంశమైంది. నిజానికి ఈటెల రాజేందర్‌ అన్న మాటలకు, మీడియా తెచ్చిన హైప్‌ కు సంబంధం లేదు. ఎవరికి వారు మధనపడితే సమస్య తీరుతుందా? నిజంగా పార్టీకి నష్టం చేసే కుట్ర ఎవరు చేసినా తప్పే… బండి సంజయ్‌ ని కొనసాగిస్తారా?

 కేంద్ర మంత్రిని చేస్తారా? బండి సంజయ్‌ కి మరో సారి అధ్యక్షుడుగా అవకాశం ఇస్తారా? మార్చితో అతని పదవీ కాలం పూర్తి కానున్నది. ఈ లోపే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. మంత్రులుగా సరిగ్గా పని చేయని కొందరిని పక్కనపెట్టే అవకాశం వుంది. దానికి తోడు త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించాల్సిన ఆవశ్యకత వుంది. గతంలో కూడా ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యత కల్పించారు. ఈసారి తెలంగాణలో పాగా వేయాలని బిజేపి చూస్తోంది. దాంతో తెలంగాణకు మంత్రి వర్గంలో చోటు కల్పించవచ్చు. బండికి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవచ్చు. ఈ మధ్య ప్రధాని మోడీ బండి సంజయ్‌ ని పలుమార్లు మెచ్చుకున్న సందర్భాలున్నాయి. అవి మంత్రిని చేసేందుకా లేక అధ్యక్షుడుగా కొనసాగించేందుకా? అన్నది తేలాల్సివుంది. బండి సంజయ్‌ కు మాత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా వుండడానికే మొగ్గు చూపుతున్నాడట. కాకపోతే బండికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కితే మాత్రం మరొకరికి అధ్యక్షుడు అయ్యే అవకాశం దొరుకుతుంది. బండిని ఎన్నికల దాకా కదిలించొద్దని కేంద్ర పెద్దలు నిర్ణయానికి వస్తే కొనసాస్తారు. అదే జరిగితే బండి అధ్యక్షుడుగా కొనసాగితే కొసరు నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారా? అన్నదానిపై కూడా పార్టీలో బాగానే చర్చ జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే కొసరు నేతలకు పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చరనే నిర్ణయానికి వచ్చి కొత్త దారి చూసుకుంటారా? అన్న చర్చ కూడా కొనసాగుతోంది. కొత్తగా చేరిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటే బిజేపి మళ్ళీ మొదటికే రాదా? బిజేపిని గట్టెక్కించే నాయకులున్నారా? పైకి కనిపించే నలుగురు నాయకుల్లోనే సరైన సఖ్యత లేదు! తెలంగాణలో బిజేపిలో అసంతృప్తి ఆగదు!

నేటిధాత్రికే నోటీసులా!

 

`నేటిధాత్రి ఇచ్చే 25 లక్షలు పోలీసు సంక్షేమానికి ఇస్తారా?

`రెవెన్యూ శాఖలో ఉద్యోగుల సంక్షేమం అవసరం లేదా?

`అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అనే సామెత లాగే లేదా!

`కోర్టు తీర్పు అమలు చేయని వారే, న్యాయం కోసం నోటీసులు పంపడం విడ్డూరం కాదా?

`ప్రజల పక్షాన నిలిచే మీడియాపైనే పెత్తనమా?

`18 సంవత్సరాల అక్షర ప్రయాణం నేటిధాత్రిది…

`సామాన్యుడి గొంతుకై, తెలంగాణ ఉద్యమ పిడికిలై సాగింది.

`తెలంగాణ సాధనలో ముందుండి నడిచింది.

`తెలంగాణ ఉద్యోగులకు జీతాలు, ప్రమోషన్లకు కారణం తెలంగాణ సాధించడం. ఉద్యమానికి తోడు నిలిచిన మీడియాలో నేటిధాత్రి ది ప్రధాన భూమిక.

`అవినీతి అధికారుల బండారం బైటపెట్టింది…

`నిజాయితీ అధికారులను ప్రజలకు మరింత చేరువచేసింది.

`ఆదర్శవంతమైన ఉద్యోగ సమాజ నిర్మాణం కోసం పాటుపడిరది. 

`నేటిధాత్రి అక్షరం అంటే నిజానికి ప్రతిరూపం…ప్రజా గళం.

`అడిగితే అధికారులకు కోపాలా!

`మీడియాకు నోటీసులా!?

`ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటూ జనానికి పని చేయకపోతే మీడియా ప్రశ్నించదా?

`ప్రజల పక్షాన వార్తలు అధికారులకు కంటకింపులా? అడ్డంకులా!

`పని చేస్తే ప్రశంసించేది మీడియానే…పని చేయకపోతే ఎండగట్టేది మీడియానే!

`అది తెలిసి కూడా మీడియా మీద బురజల్లితే జనం నవ్వుకుంటారు.

`పని చేసి ప్రశంసలు అందుకోండి…

`ప్రజల చేత శాపనార్థాలు పెట్టించుకోకండి…

`జనం వెతలు, పడుతున్న ఇబ్బందులు తీర్చి శభాష్‌ అనిపించుకోండి…

`ఏ అధికారికైనా నేటిధాత్రి చెప్పేది ఇదే…

` స్పందన లేకుంటే అక్షరాలు సందించడం మీడియా కర్తవ్యం.

నేటిధాత్రికే నోటీసులా!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అనేది కొందరు అధికారులకు అలుసుగా మారిపోయింది. ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అంటే ప్రభుత్వాధికారులు, ప్రజలతో స్నేహ భావంతో వుండాలన్న అంతరార్థం విస్మరించి, ప్రభుత్వం మాకు అనుకూలంగా వుందనే అపోహలో వుంటున్నారు. కొత్తగా వచ్చిన తెలంగాణలో అభివృద్ధి మీద రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, అధికారుల విషయంలో కొంత మెతకవైఖరి అనుసరిస్తోంది. ఇది కొందరు అధికారులకు వరంగా మారిపోయింది. దాంతో అధికారుల విధులు గుర్తు చేసే మీడియాను కూడా బ్లాక్‌ మెయిల్‌ చేయొచ్చన్న అపోహలో పడిపోతున్నారు. సరిగ్గా మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలానికి చెందిన తహసీల్దారు తన విధుల నిర్వహించడంలో నిర్లిప్తత, నిర్లక్ష్యం వహిస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నది నేటిధాత్రి దినపత్రిక కు అందిన సమాచారం. తహసీల్దారు మూలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాళ్లు వారికి ఎదురౌతున్న సమస్యలు నేటిధాత్రి దినపత్రిక దృష్టికి తీసుకొచ్చారు. పైగా ఒక ప్రత్యేకమైన విషయం కూడా నేటిధాత్రి సవివరంగా వివరించడం జరిగింది. ఓ వ్యక్తికి చెందిన భూమి విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేయమని సదరు వ్యక్తి తహసీల్దారును రిక్వెస్ట్‌ చేశారు. హైకోర్టు ఆదేశాలు, వాటి అమలు విషయంలో జిల్లా కలెక్టర్‌ ఆర్డీవో కు, ఆర్డీవో సంబంధిత తహసీల్దారు కు జారీ చేసిన ఆదేశాలు గుర్తు చేయడం జరిగింది. అయినా ఆ వ్యక్తి వేదన అరణ్య రోధనైంది. ఎన్నో రోజులుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ కాళ్లు జరిగేలా తిరుగుతున్నాడు. అతను ఎన్ని సార్లు తహసీల్దారు ను వేడుకున్నా న్యాయపరంగా కావాల్సిన పని కావడం లేదు. పని గట్టుకొని కక్ష్య కట్టినట్లు తహసీల్దారు కావాలనే సదరు వ్యక్తి పని చేయడం లేదన్నది అతని ప్రధాన అభియోగం. అదే విషయం ఆయన నేటిధాత్రి దినపత్రిక దృష్టికి తెచ్చారు. అతనికి చెందిన భూమిని అప్పగించడంలో తహసీల్దారు చొరవ చూపడం లేదు. ఇప్పటికే ఆ వ్యక్తికి చెందిన భూమిలో అక్రమ నిర్మాణాలు కూడా వెలుస్తున్నాయి. అయినా తహసీల్దారు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన వ్యక్తి నేటిధాత్రిని ఆశ్రయించడం జరిగింది. సమాజంలో ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా ముందు తమ సమస్యలను మీడియా దృష్టికి తీసుకెళ్లడం ఆనవాయితీ… అంతెందుకు ఉద్యోగులకు సమస్యలు ఎదురైనా ముందు మీడియా దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వానికి తెలిసేలా చూసుకుంటారు. అలాగే అధికారులు కూడా స్పందించాల్సిన సమయంలో స్పందించకపోయినా, సరైన సమయంలో ప్రజల పనులు చేయకపోయినా, జాప్యం జరిగినా, ఎలాంటి విపత్కర పరిస్థితులను అధికారులు సృష్టించినా ప్రజలు ఆశ్రయించేది మీడియానే…ఈ విషయం తహసీల్దారుకు తెలియంది కాదు…అయినా తహసీల్దారు నేటిధాత్రి దినపత్రిక మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేశారు. నేటిధాత్రి దినపత్రికలో వచ్చిన వార్త ఏమిటి? తహసీల్దారు ప్రతిస్పందన ఏమిటి? తహసీల్దారు స్పందనకు పొంతన లేదు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని నేటిధాత్రి దినపత్రిక ఇచ్చిన సూచన మాత్రం తహసీల్దారుకు కనిపించలేదు. అర్థం చేసుకోలేదు. పెడర్థం తీసుకుంటే దానికి నేటిధాత్రి దినపత్రిక బాధ్యత కాదు. 

 నేటిధాత్రి ఇచ్చే 25 లక్షలు పోలీసు సంక్షేమానికి ఇస్తారా? 

నేటిధాత్రి తహసీల్దారు వార్తలో పోలీసుల ప్రస్తావన తెచ్చింది లేదు. అక్కడ ప్రస్తావించే అంశం కూడా కనిపించలేదు. కేవలం తహసీల్దారు వరకే వార్తా కథనం పరిమితం. అందులో పోలీసుల మనోభావాలు ఎందుకొచ్చాయో తహసీల్దారే చెప్పాలి. ఇదిలా వుంటే నేటిధాత్రి ఇచ్చే డబ్బు పోలీసు శాఖ సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పడంలో ఔచిత్యమేమిటో కూడా తహసీల్దారే చెప్పాలి. రెవెన్యూ వ్యవస్థలో కింద స్థాయి ఉద్యోగులైన విఆర్‌ఓ, విఆర్‌ఏలు చాలీ చాలని జీతాలతో జీవితాలను గడుపుతున్నారు. వాళ్ల మీద తహసీల్దారుకు జాలి లేదని ఒక్క మాటతో తేల్చేశారు. కనీసం మానవత్వం చూపించేందుకు కూడా సోదాహరించలేదు. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల సంక్షేమం ఆవశ్యకత తహసీల్దారుకు లేదా?

అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అనే సామెత లాగే లేదా! రెవెన్యూ శాఖలో ఉద్యోగుల కోసం ఒక తహసీల్దారుగా అండగా నిలబడతానన్న మాట మాట్లాడిన బాగుండేదోమో! చిత్తశుద్ధి, త్రికరణ శుద్ది అనేది అందరిలో వుండదు. ఆ మధ్య సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి పదెకరాలకు పైగా సాగు భూమి వున్న రైతులకు రైతుబంధు ఇవ్వొద్దని ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. స్పందన ఇలా వుండాలి. అలా ఆందోళన చేసిన రెవెన్యూ ఉద్యోగుల పక్షాన నస్పూర్‌ తహసీల్దారు ఏనాడైనా మాట్లాడారా? అయినా ఒక ఉద్యోగిగా బాధితులకు న్యాయం చేయాలని నేటిధాత్రి సూచించింది. అందులో మనోభావాలు దెబ్బతినే అవకాశం ఎక్కడుంది! ఎందుకుంటుంది? నస్పూర్‌ తహసీల్దారుగా అక్కడ ఎవరున్నా ఇదే నేటిధాత్రి ప్రశ్నిస్తుంది…అంతే తప్ప వ్యక్తిగతమైన ప్రశ్నకు తావెక్కడిది. అనవసరంగా వివాదం పెద్దది చేసుకోవడం, తన కర్తవ్యం విస్మరించడమే అవుతుంది. ఇక్కడ మరో విచిత్రం చోటు చేసుకున్నది. సాక్ష్యాత్తు హైకోర్టు ఉత్తర్వులే నస్పూర్‌ తహసీల్దారు అమలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఒక రకంగా కోర్టు ధిక్కరణ చేస్తున్నారు. ఇతరులు న్యాయం చేయాలని తెచ్చిన తీర్పును పక్కన పెట్టి, తనకు న్యాయం కావాలని కోర్టును తహసీల్దారు ఆశ్రయిస్తున్నారు. అంటే న్యాయం ఎవరికైనా ఒకటే…తనకో న్యాయం, ఇతరులకో న్యాయం వుంటుందా? కోర్టు తీర్పు అమలు చేయని వారే, న్యాయం కోసం నోటీసులు పంపడం విడ్డూరం కాదా?

ప్రజల పక్షాన నిలిచే మీడియాపైనే పెత్తనం చేయాలని చూడడం బాగా అలవాటైంది. 

ఏ మీడియాకైనా వ్యక్తిగత ఇష్టాఇష్టాలు వుండవు. మీడియా అనేది ఒక వ్యవస్థ. ఉద్యోగిలాగా వ్యక్తిగతమైనది కాదు. మీడియాలో ఏక వ్యక్తి స్వామ్యం వుండదు. సమిష్టి వ్యవహారం…ప్రజల పక్షాన అక్షర సమరం… 18 సంవత్సరాల అక్షర ప్రయాణం నేటిధాత్రిది…సామాన్యుడి గొంతుకై, తెలంగాణ ఉద్యమ పిడికిలై సాగింది. తెలంగాణ సాధనలో ముందుండి నడిచింది. తెలంగాణ ఉద్యోగులకు జీతాలు, ప్రమోషన్లకు కారణం తెలంగాణ సాధించడం. తెలంగాణ ఉద్యమానికి తోడు నిలిచిన మీడియాలో నేటిధాత్రి ప్రధాన భూమిక పోషించింది. ఉద్యోగులకు ఫిట్‌ మెంటు ఇవ్వడం స్వాగతించింది. అలా అని అధికారులు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోదు. అనేక సందర్భాలలో అవినీతి అధికారుల బండారం బైటపెట్టింది…నిజాయితీ అధికారులను ప్రజలకు మరింత చేరువచేసింది. ఆదర్శవంతమైన ఉద్యోగ సమాజ నిర్మాణం కోసం పాటుపడిరది. అధికారుల మెరుగైన సేవల కోసం కృషి చేసింది. అదీ నేటిధాత్రి విశ్వసనీయత. ప్రజల పక్షాన నిలవడమే నేటిధాత్రికి తెలుసు. నేటిధాత్రి అక్షరం అంటే నిజానికి ప్రతిరూపం…ప్రజా గళం. ప్రజలకు సేవ చేయడానికి కుర్చీలో కూర్చున్న వాళ్లు మనోభావాల పేరుతో చేయాల్సిన పనిని తప్పించుకునే ప్రయత్నం చేయడం అసంబద్ధమైనది. హై కోర్టు తీర్పు కూడా అమలుచేయకపోతే మీడియా ప్రశ్నించదా? అడిగితే అధికారులకు కోపాలా!

 మీడియాకు నోటీసులా!? నేటిధాత్రికి ఇలాంటి నోటీసులు కొత్త కాదు…

ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటూ జనానికి పని చేయకపోతే మీడియాగా ప్రశ్నించడం నేటిధాత్రి హక్కు.. ప్రజల పక్షాన వార్తలు అధికారులకు కంటకింపులా? నేటిధాత్రికి నోటీసులు పంపడం అంటేనే తమ కర్తవ్యం నుంచి పక్కకు తప్పుకోవడం… పని చేస్తే ప్రశంసించేది మీడియానే…పని చేయకపోతే ఎండగట్టేది మీడియానే!

 అది తెలిసి కూడా మీడియా మీద బురజల్లితే జనం నవ్వుకుంటారు.

పని చేసి ప్రశంసలు అందుకోండి…ఇదే నేటిధాత్రి ఎప్పుడూ చెప్పేది… ప్రజల చేత శాపనార్థాలు పెట్టించుకోకండి…అని మంచి మాటలే నేటిధాత్రి చెబుతుంది. జనం వెతలు, పడుతున్న ఇబ్బందులు తీర్చి శభాష్‌ అనిపించుకోండి…అని సూచనలు చేస్తుంది.. ఏ అధికారికైనా నేటిధాత్రి చెప్పేది ఇదే…అయినా స్పందన లేకుంటే అక్షరాలు సందించడం మీడియా కర్తవ్యం.

తెలంగాణ రాష్ట్ర అర్ టి సి విజిలెన్స్ విభాగానికి ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ బదిలీ 

ములుగు జిల్లా ఎస్పీ గౌస్ అల్లం గారికి బాధ్యతలు అప్పగించిన ఎస్పీ సంఘం సింగ్ జి పాటిల్

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం

సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ బాధ్యతలను గౌస్ అలం గారికి అప్పగించిన డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

నూతనంగా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గౌస్ అలం

ములుగు జిల్లా ఓఎస్డి గా భాద్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ ఐ. పి. ఎస్ 

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా ఎస్పీగా గత నాల్గు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ కు జిల్లా పోలీస్ యావత్ యంత్రాంగం ఘనంగా వీడుకోలు పలికారు. శనివారం డిటిసి జాకారంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కు నూతన ఎస్పీ గౌస్ ఆలం, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఓఎస్డి అశోక్ కుమార్, మంచిర్యాల డిసిపి గా బదిలీపై వెళ్తున్న ఏఎస్పీ సుదీర్ అర్ కేకన్, ఏటూర్ నాగారం నూతన ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిరి శెట్టి సంకీర్త్ గౌడ్, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది గజమాల, శాలవలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గారు మాట్లాడుతూ కింది స్థాయి అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేశారని, వారి సేవలకు వెలకట్ట లేమని, వారి శ్రమతోనే జిల్లాకు, పోలీసు యంత్రాంగానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించామని అన్నారు. ఇదే తరహాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులు కూడా సహకరించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గౌస్ ఆలం గారు మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న ఎస్పీ అడుగుజాడల్లో పయనిస్తూ జిల్లాకు మంచి సేవలందిస్తూ విద్రోహ శక్తులను అరికట్టడంలో ముందు ఉంటామన్నారు. బదిలీపై వెళ్తున్న ఎస్పీ గారికి ఘన వీడ్కోలు , బాధ్యతలు స్వీకరిస్తున్న నూతన ఎస్పీ గారికి ఘన స్వాగతం పలికారు

ఓరుగల్లులో వీరయ్య విజయ విహారం

జన సంద్రంగా మారిన Arts and Science College Grounds

కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర మంత్రి దయాకర్ రావు,మెగాస్టార్ చిరంజీవి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్,హీరో రాంచరణ్, ఎమ్మెల్యేలు రమేష్, నరేందర్,శంకర్ నాయక్,మేయర్ సుధారాణిలతో కలిసి అతిథిగా హాజరయ్యారు*

ఓరుగల్లులో వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ “వీరయ్య వీర విహారం” పేరుతో ఘనంగా జరిగింది.నగరంలో పేరొందిన Arts and Science College Grounds లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పోటెత్తారు,మైదానం జనసంద్రంగా మారింది.ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మెగాస్టార్ చిరంజీవి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, హీరో రాంచరణ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్,శంకర్ నాయక్, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి తదితర ప్రముఖులతో కలిసి అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులలో ఉత్సాహం ఉరుకలెత్తింది,చప్పట్లు,ఈలలు, కేరింతలతో మైదానం హోరెత్తింది.దీంతో,చిరంజీవి,ఆయన కుమారుడు రాంచరణ్ లు ఆనందభాష్పాలు రాల్చారు, వారి హృదయాలు పులకించిపోయాయి.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర చిరంజీవికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు.కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ, ఓరుగల్లు ప్రాంత వాసులు తన పట్ల గతంలో చూపిన, ఇప్పుడు చూపుతున్న స్వచ్ఛమైన ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు.వాల్తేరు వీరయ్య సినిమా అద్భుత విజయం సాధించడానికి సహకరించిన అభిమానులు,ప్రేక్షకులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కడియమే ఆదుకుంటాడని ఆశ!

 

`తొలగింపబడిన గృహ నిర్మాణ శాఖ బాధిత ఉద్యోగుల ఆవేదన.

`ఆయన మీదే భరోసా.

`ఆది నుంచి ఎక్కువగా అండగా వున్నది కడియమే…

`వాళ్ల కొలువులు ఓ కొలిక్కి వచ్చేదాకా శ్రమించింది ఆయనే…

`తమ జీవితాలను నిలబెట్టేది కడియమే అని నమ్మకం.

`మంత్రి కేటిఆర్‌ దృష్టికి మరోసారి తీసుకెళ్లాలని బాధితుల విజ్ఞప్తి.

`పెద్దన్న పాత్ర పోషించి ఆదుకోవాలని వేడుకోలు.

`స్టేషను ఘనపూర్‌ బాధితులే వారిలో ఎక్కువ.

`51 మందిలో 17 మంది స్టేషను ఘనపూర్‌ వాసులే…

`కరుణించి కణికరించండని కోరుతున్నారు.

`తమ జీవితాలను నిలబెట్టాలని ప్రాదేయపడుతున్నారు. 

`ఒక్కసారి ప్రయత్నించి చూడండి…

`నేటిధాత్రి తో బాధితులు.

వాళ్లు కొలువులు పోయిన బాదితులు…ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకంతో బతుకుతున్న అభాగ్యులు…ఆరేళ్లుగా చకోర పక్షుల్లా తమ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిర్భాగ్యులు…వారిని ఆదుకోవాలన్న మనసు అందరికీ వున్నా, ఎక్కడో తేడా కొడుతోంది…అందరూ సానుభూతి చూపించినా ఇంత వరకు వారికి న్యాయం జరగలేదు. కొలువులు రాలేదు. వాళ్లు చేసింది చిన్నాచితకా ప్రయత్నం కాదు…పెద్ద స్ధాయిలో కూడా చేయాల్సినంత ప్రయత్నం చేశారు. అందరి చేత అయ్యో అనిపించుకున్నారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఇంత కాలం వేచి చూస్తున్నారు. రోజులు గడిచే కొద్ది వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎదురు చూసి, ఎదురు చూసి కాలం కరిగిపోతోంది… వయసు పెరిగిపోతోంది…కొలువులు వస్తాయన్న నమ్మకంతో మరో అదే ప్రయత్నంలో ఏకంగా ఆరేళ్లు గడిచిపోతున్నాయి. పదేళ్లపాటు చేసిన ప్రభుత్వానికి చేసిన సేవలు వృధాగాపోయాయి…ఇప్పటికైనా దయతలచండి…కరుణించికాపాడండి…మా జీవితాలను నిలబెట్టండని అంటూ వేడుకుంటున్నారు…నేటిధాత్రితో తమ గోడు వెల్లబోసుకుంటున్నారు…

 ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖలో పదేళ్ల పాటు విధులు నిర్వర్తించిన ఉద్యోగులు వాళ్లు…అప్పటికి వాళ్లది ఒప్పంద ఉద్యోగాలైనా, ప్రభుత్వ కొలువు కావడం వల్ల జాబ్‌ గ్యారెంటీ వుంటుందని ఆశ పడ్డారు.

 చాలీ చాలని జీతమైనా అడ్జస్టు అయ్యారు. జీతాలు పెంచమని ఏనాడు కోరింది లేదు. వచ్చిన జీతంలో అన్నీ సర్ధుకొని బతికారు. కాని ఒక్కసారిగా తమ జీవితాలు తల కిందులౌతాయని ఊహించలేదు. కలలో కూడా అలాంటి పరిస్దితులు వస్తాయన్న ఆలోచన లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు మరింతగా బాగుపడతాయని అనుకున్నారు. జీతాలు పెరుగుతాయనుకున్నారు. పర్మనెంటు కూడా కావొచ్చన్న నమ్మకం బలపడిరది. కాని అంతా తలకిందులైంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అప్పటికే నిండా అవినీతి మయమైన గృహనిర్మాణ శాఖను ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో వీరి జీవితాలు వీధినపడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖలో జరిగిన అవినీతికి ఈ ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. కాకపోతే కొన్నిసార్లు జరిగే పరిణామాలలో ఎలాంటి సంబంధం లేకపోయినా నష్టం జరగొచ్చు. అయినా నష్టనివారణ చర్యలు కూడా చేపట్టొచ్చు. ఇదే ఇక్కడ కూడా జరిగింది. కొలువులు కోల్పోయిన వాళ్లంతా తమ తప్పేం లేదన్న సంగతి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ప్రభుత్వ పెద్దలనుంచి కూడా సానుభూతిని పొందారు. తమ కొలువులు ఇతర ఏ శాఖలోనైనా కల్పించమని వేడుకున్నారు. అందుకు ప్రభుత్వ వర్గాలు కూడా అంగీకరించాయి. అక్కడి నుంచి వారికి ఆశలు ఎంత పెరిగినా, ఎన్ని మలుపులు తిరిగినా, ఇంత వరకు కొలువులు రాలేదు. వారి ఆశలు తీరలేదు.

అండగా ఆది నుంచి తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి , ఎమ్మెల్సీ కడియం శ్రీహరివారి తోడుగా వుంటూ వచ్చారు.

 వారి గురించి అనేక సార్లు పట్టించుకున్నారు. ఒకదారైతే చూపారు. కాని ఆయన కూడా పూర్తిగా వీరి సమస్యనే పట్టించుకుంటూ వుండలేరు. ఒక దారిలో పెట్టే ప్రయత్నం చేశారు… ఇప్పటికే ఆయన కూడా చేయాల్సినంత సాయం చేసినప్పటికీ ఉద్యోగుల అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. దేవుళ్ల చుట్టూ తిరిగారు. నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కాని పని కాలేదు. ఆఖరుకు మున్సిపల్‌ శాఖ మంత్రి దృష్టికికూడా కడియం శ్రీహరే వీళ్ల విషయం తీసుకెళ్లారు. దాంతో ఆయన కూడా వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని సూచించారు. దాంతో ఒకటికి రెండుసార్లు వరంగల్‌ మహానగర పాలక సంస్దలో తీర్మానాలు కూడ చేశారు. వారికి ఉద్యోగం ఇస్తున్నట్లే చేశారు. కాని ఇవ్వలేదు. ఆ మధ్య కొత్తగా మున్సిపల్‌ కార్పోరేషన్‌లో 450 మందికి చోటు కల్పించారు. ఆ ఉద్యోగాలలో వీరికి చోటు కల్పిస్తామని చెప్పారు. కాని ఎందుకో వారికి న్యాయం చేయలేదు. అటు ఉద్యోగ సంఘాల నాయకులు, ఇటు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఇలా అందరూ తలా ఓ చేయి వేసినా పని కాలేదు. కాని ఉప ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కడియం శ్రీహరి చూపిన దారి మూలంగానే ఇంత దూరం వచ్చింది. వారికి ఓ ఆ భరోసా కల్గింది. ఇప్పుడు కూడా మంత్రి కేటిఆర్‌కు అసలు విషయం మరోసారి చెప్పాలంటే అది శ్రీహరి వల్లనే అవుతుందనేది ఆ భాధితుల ఆశ…వారి ఆశలను శ్రీహరి నిలబెడతాడని అనుకుంటున్నారు. అయితే ఈ 51 మందిలో 17 మంది స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన వారు కావడం గమనార్హం. దాంతో వాళ్లంతా కడియం శ్రీహరిని నమ్ముకున్నారు. ఎలాగైనా దారి చూపిస్తారన్న విశ్వాసంతో వున్నారు. ఎలాగైనా మంత్రి కేటిఆర్‌ దృష్టికి తమ విషయం తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నేటిధాత్రితో వారి గోడు వెళ్లబోసుకున్నారు.

Outstanding performance of students at 2K cultural fest “good morning grammar high school “

Good morning 2K Bhesh in demonstrating student excellence.

Performance of  72 teams from Nursery to Class X students.

Parents are overjoyed to see their children’s skills. At Good morning Grammar High school.

Hundreds of people gathered on the occasion of Republic Day, happy vibes at  school premises

Good Morning’s aim is to bring out the skills of the students along with education, says Shashi…

MAHADEVPUR – NETI DHATRI:

(MINNU’BHAI,REPORTER,8499999294)

Good Morning Grammar High School has already been blessed with the success of many students who have reached many heights for the bright future of the students. It can be said that Good Morning Grammar High School has taken another step forward in bringing out the skills of the students along with their education. On the occasion of  74th Republic Day, a historic event in the field of education, “Ecose, Cultural, Event 2K 23”, Good Morning appreciated the performance of the management and teachers of the school for performing artistic skills with the students studying from nursery to class 10.

Cultural festival 2K, performance to Good morning students are king. 

Good Morning Grammar School private school in Mahadevpur mandal center of Bhupalapally district has achieved many success in imparting English education to the students throughout the district and taking their future to higher heights. In Maharashtra also a strong impression is made among the people/parents . There is no doubt that such a program of Good Morning Grammar School aims to create a great feeling of happiness among the people as well as the parents of the students in the district as well as the mandal where the school has undertaken it. Recently on the occasion of 74th Republic Day on Thursday, a program was organized with the students studying in the school called Cultural Festival 2K Run in order to bring the skills of the students to the public. Finally, the students’ performances showed that the students of GMGHS School are king in academics as well as in the display of skills.

Good morning 2K, Bhesh in demonstrating student excellence.

 In today’s society, students are not limited to education but skill also makes it easier to study. Good Morning Grammar High School to Kiran Cultural Program can understand that the skill of students removes mental pressures and makes it easier for students to study. In the cultural event arranged in the school, performances like Kuchipudi and film music were performed, and the parents say that they have to say well done to the Good Morning school management for finding the ability to show their feelings and skills regardless of age. It is not a small matter to look for the skills of the students studying in the school along with their education. It can be said that the effort of the school owner and the teachers to bring the education to the people and put the skill in front of the people before their parents is Bhesh. Many students go to great lengths to demonstrate their skills and hide their desires in people. But in Good Morning School, the school does not hold back in recognizing the students’ skills as well as the attention given to education, by recognizing the mental skills of the students and bringing out the skills in them, on the other hand, they pay attention to education and take care in shaping the future of their school students.

Formed into 72 groups and performing from Nursery to Class X students.

There is no doubt that the 2k cultural event organized by Good Morning Grammar School is indeed a match for the school owner to bring out the talent in the students. Because it can be said that Good Morning has the honor of letting the bully students know that there is skill in them even among those children who are bullying students on the one hand while bringing out the skills on the one hand. Good morning school has brought a surprise to the level where even those students who do not speak well can prove that they are capable. Their performance at the Aa Bulli Kachit Aa Paditu event, which is just learning alphabets, was not only a delight but also a surprise. Those students who have been correcting letters in Montessori Kindergarten since the tenth grade and have been correcting their letters in Bharatanatyam, Kuchipudi, Music, Singing and performing in 72 groups with all the classes of the school must have surprised the surrounding mandals as well as the people of the local mandal expressing their happiness.

Parents are overjoyed to see their children’s skills in Good morning.

The parents had a strong belief that their children would get a quality education in the school and enrolled their children in Good Morning. Also, although their children currently had a lot of faith in the school, they could not imagine that the school would bring out the skills of their children. Because in Good Morning Grammar High School’s 74th Republic Day cultural event Two Kay Run program, children studying from nursery to class 10, according to their skills, 72 groups of 600 students in Kuchipudi music and movie-like performance were interestingly watched by the parents. They never remembered that their children have such talent, sometimes children spend their happy time dancing and immersing themselves in movie songs, but parents have such great performance skills and their joy knows no bounds when they see their children’s performances.

Hundreds of people attended the function on the occasion of Republic Day, packed school premises.

Good morning is a cultural program of the students in the school but along with other cultural programs organized by the school the good morning school is filled with fans along with the parents. Because Good Morning School over the years has left a strong impression on the minds of parents as well as people for the major role played in shaping the future of students with English education. And the cultural event program i.e. the program of setting up a school for the people of the mandal as well as the surrounding mandals, because the entire public is aware of the school management arrangements, hundreds of students’ parents and people must also attend, it is also known as good morning specialty. A large number of fans of Good Morning School from surrounding mandals and mandal center district also joined the cultural event To K Run program organized on Thursday. The many roads going to the school in the center of the mandal are crowded with vehicles, but all the people are going towards the school good morning and the school premises is already crowded with people on one side and parents on the other side. A festive atmosphere was evident with the overwhelming crowd.The school is moving forward with the aim of bringing out the skills of the students along with their education. Due to covid, the school has not been able to organize public programs for the last two years. For the first time after two years, To K Run event has been organized. Along with the mandal center, villages from other mandals and also from distant areas have come to this program for the children as well as the school teachers. Correspondent MM Shashi and School Principal MM thanked all the parents as well as fans of the school for their encouragement. Parents of students and fans of the school have been requested to provide their support as the school is going to switch to digital education soon.

పథకాల సృష్టి, అమలు ఒక్క కేసిఆర్‌ తోనే సాధ్యం…

`మానవత్వం చూపిన మహనీయుడు…. దైవత్వం నిండిన కరుణామయుడు.

` ప్రజల శ్రేయస్సు కాంక్షించే నాయకత్వం కూడా దైవత్వమే…

`రెండు వందల పెన్షన్‌ ఇచ్చిన వాళ్లనే ఇప్పటికీ గుర్తు చేస్తే…రెండు వేల పెన్షన్‌ ఇస్తున్న కేసిఆర్‌ ను వెయ్యేళ్లు గుర్తు చేసుకోవాలి….గుండెల్లో పెట్టుకోవాలి.

`దేశానికి కేసిఆర్‌ నాయకత్వం కావాలి.

`దేశమంతా సస్యశ్యామలం కావాలి.

`తెలంగాణ పథకాలన్నీ అమలు కావాలి. 

`తెలంగాణ వెలుగుల వలే దేశం వెలిగిపోవాలి.

`సాగులో విప్లవాలు తేవాలి.

`ప్రగతిలో ప్రపంచం ఆశ్చర్యపోవాలి.

`పారిశ్రామిక గతి మారాలి. అభివృద్ధికి భారత్‌ దిక్సూచి కావాలి.

`దేశంలో సమానత్వం వెల్లివిరియాలి.

`అసమానతలు లేని సమాజం నిర్మింపబడాలి.

`అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించాలి.

`భారత్‌ స్వేచ్ఛ, శాంతికి నిలయమని ప్రపంచమంతా పొగడాలొలి.

` రైతు రాజ్యం తేవాలి.

`తెలంగాణలో ఎనమిదేళ్ల అధ్భుతాలు దేశమంతా విస్తరించాలి.

` రెండు వందల రూపాయల పెన్షన్‌ నిన్న…రెండు వేల పెన్షన్‌ నేడు…ఏది గొప్ప!

`తెలంగాణలో చుక్క జాడలేదు నిన్న…

`ఎక్కడ చూసినా నీటి ఊటలే నేడు…

`తెలంగాణ రాకపోతే, కేసిఆర్‌ సిఎం కాకపోతే కరంటు వచ్చేదా!

`సాగుకు నీరందేదా!

` ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే…

హైదరాబాద్‌,నేటిధాత్రి: దేశం తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ లాంటి నాయకుడు మన రాష్ట్రంలో వుంటే బాగుండు అని ప్రతి రాష్ట్రం ఆలోచిస్తోంది. కేసిఆర్‌ దేశ నాయకుడైతే తెలంగాణ లాగా దేశమంతా సుబిక్షమౌతుందని ఆశ పడుతోంది. కాని తెలంగాణలో వున్న కొంత మంది నాయకులకు మాత్రం ఇది కంటగింపుగా వుంది. ప్రతిపక్షాలకు ప్రతిబంధకంగా మారుతోంది. తమ పార్టీలకు రాజకీయ మనుగడ లేకుండాపోతోందని మధనపడుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు అందకారమౌతోందని ఆందోళన చెందుతున్నారు. కాని ప్రజలకు మేలు జరుగుతోందన్న ఆలోచన ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు చేయడం లేదు. దేశమంతా కొనియాడేటువంటి పథకాలు అమలు జరుగుతున్నా, తెలంగాణలో అరాజకీయాలు చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్ధిర పర్చాలని కొందరు చూస్తున్నారు. అబాసు పాలు చేయాలని మరి కొన్ని పార్టీలు చూస్తున్నాయి. ప్రజలు మేలు జరగడం కూడా ఓర్చుకోలేనంత దుష్టరాజకీయం చేస్తున్నారు. ఎప్పుడో దశాబ్ధంన్నర కిందట రెండు వందల రూపాjల పెన్షన్‌ ఇచ్చిన నాయకుడిపేరు ఇప్పటికీ తలుచుకుంటూ భజన చేస్తున్నారు. అదే తెలంగాణ సాధకుడు, విధాత కేసిఆర్‌ ప్రజలకు రెండు వేల రూపాయలు పెన్షన్‌ ఇస్తుంటే చూసి ఓర్వ లేకపోతున్నారు. కళ్లుండి చూడలేకపోతున్నారు. ప్రజలకు మేలు జరుగుతుంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఎలాంటి ఆసరా లేని ప్రజలకు ఆసరా ఫించన్‌ ఇచ్చి ఆదుకుంటున్నందుకు వారి ఓట్లు బిఆర్‌ఎస్‌కే పడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మునుగోడులో కూడా ఓడిపోయాక ఇంకా అక్కసు మరింత పెంచుకున్నారు. ప్రజల మెప్పు పొందే ఆలోచన మర్చి, ప్రభుత్వ పనులును చూసి కుళ్లు కుంటున్నారు. కుత్సిత రాజకీయాలు చేస్తున్నారు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. దేశమంతా కేసిఆర్‌ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. 

గత ఐదేళ్లుగా రైతులకు రైతు బంధు అందుతోంది.

 అప్పటినుంచే రైతు భీమా కూడా అమలు జరుగుతోంది. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా చూసింది లేదు. విన్నది లేదు. కాని కొత్తగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలకు రూపంగా అందజేయబడుతోంది. తెలంగాణ రైతుల గోస తెలిసిన నేతగా వారి కష్టం పంచుకునే ప్రయత్నం ప్రభుత్వం తరుపన చేయడం జరుగుతోంది. ఇదంతా దేశమంతా అమలు జరిగితే రైతుకు ఎంతో మేలు. వ్యవసాయం చేయడానికి ఏ రైతు వెనుకాడడు. ఎందుకంటే సమయానికి అప్పులు పుట్టక, ఒక వేళ అప్పు దొరికినా విత్తనాలు వేసినా, ఆరుగాలం శ్రమించినా పంట చేతికొస్తుందో లేదో అన్న అపనమ్మకం మీద ప్రయాణమే వ్యవసాయం. ఇలాంటి పరిస్ధితులు గతంలో తెలంగాణ ఎదుర్కొన్నది. కాని ఇప్పుడు కాదు…ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు సాగు అంటే ఎంతో బాగు..బాగు…బహుబాగు అన్నంత పండగయ్యింది. ప్రతి రైతు కళ్లలో అనందం నింపింది. అంత గొప్పదైన రైతు బంధు అమలు అన్నది దేశం మొత్తం మీద అమలు చేస్తే ప్రతి రైతు కళ్లలో సంతోషం…కళ్లాలలో పంటలు..రైతు ఇంట సిరులు కురుస్తాయి. 

 ఇక రైతు భీమా.

.ఒకనాడు రైతుకు ఏలాంటి ప్రమాదం జరిగినా ఆదుకునేవారు లేరు. కాని ఇప్పుడు ప్రభుత్వమే జరగకూడని ప్రమాదం జరిగి, రైతు ప్రాణాలుపోతే, ఆ కుటుంబం వీధినపడకుండా రైతు భీమా కాపాడుతోంది. ఇలాంటి పధకం కూడా దేశంలో ఎక్కడా లేదు. కేవలం ఒక్క తెలంగాణలోనే అమలు జరుగుతోంది. తెలంగాణలో కాళేశ్వరం అన్నది ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. ఇంత త్వరిగ గతిని ఒక ప్రాజెక్టు నిర్మాణం అన్నది పాలకులకు ఎంతో చిత్తశుద్ది వుంటే తప్ప పూర్తి కాదు..ప్రజలకు పలాలు అందించదు. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అపరభగీరదుడు. తెలంగాణలో నీట సిరులు ఎలా పారవో చూద్దామని పట్టుదలతో సాధించి చూపించారు. కాళేశ్వరం నిర్మాణం చేసి తెలంగాణ అంతటా గోదారి పరవళ్లు దుంకిస్తున్నాడు. పొలలకు ఆ నీళ్లను మళ్లిస్తున్నాడు. తెలంగాన సస్యశ్యామలం చేశాడు. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాలలో తెలంగాణ చేరిపోయింది. ఒక్కసారిగా తెలంగాణలో సాగు విప్లవం వచ్చింది. దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌…ఇలా చెప్పుకుంటూ పోతే పాలమూరు రంగారెడ్డి వడివడిగా పనులు పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే పలుగురాళ్లు తప్ప, పంటలులేక, ఎండిన బీళ్లు తప్ప, నీటి జాడలు లేక, వలసలు తప్ప ఉపాధి లేని పాలమూరు జిల్లాలో ఇప్పుడు పచ్చబడిరది. పసిడి పంటలు పండిస్తోంది. పచ్చదనంతో మురిసిపోతోంది. దానికి కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌…ఆయన సాధించిన తెలంగాణ. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరధ. మిషన్‌కాకతీయ ఊరంతటికీ నీళ్లును పంచుతోంది. మిషన్‌ భగీరధ ఇంటింటికీ నీళ్లు మోసుకెళ్తోంది. ఒకప్పుడు ఆడబిడ్డలు మైళ్ల దూరం వెళ్లి తెచ్చుకునే మంచినీరు ఇప్పుడు వారి చేతికి అందుబాటులోకి తెచ్చింది. ఇంటింటికీ దేశంలోనే సురక్షితమైన మంచినీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ కీర్తికెక్కింది. ఇదందా ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. ఒకనాడు వైద్యం అంటే పల్లెలకు ఆమడ దూరం…కాని నేడు పల్లె పల్లెలో దవఖానాలు…బస్తీ. బస్తీలో వెలిసిన బస్తీ దవఖానాలు…ఎక్కడ చూసినా ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రజల ఆరోగ్యంపై భరోసా కల్పించింది. తెలంగాణను చూసి దేశం మురుస్తోంది. దేశమంతా ఆచరించాలని కోరుకుంటోంది. ఒకప్పుడు మెడికల్‌ కాలేజీ అనే పదమే వినడానికి వింతగా వుండేది. డాక్టర్‌ సదువు ఏ కొందరికో అందుబాటులో వుండేది. కాని ఇప్పుడు తెలంగాణలో ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయడంతో, ఏటా వేలాది మంది వైద్యులు ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారు. తెలంగాణ చదువుకొని, తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. పాలన ప్రజల వద్దకు మరింత చేరువ చేశారు. గతంలో ఏదైనా పని కోసం సామాన్యుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఎంతో గగనమయ్యేది. పది సార్లు తిరగాలంటే ఎంతో శ్రమపడాల్సివచ్చేది. కాని ఇప్పుడు జిల్లా కార్యాలయాలు చాలా దగ్గరయ్యాయి. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. పైగా అన్ని జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేసి, సమీకృత భవనాలు నిర్మాణం చేశారు…దాంతో ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలు ఒకే చోట అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. తెలంగాణలో సరైన గుర్తింపు లేక, పట్టాలు అందక, ఎవరి భూమి హద్దులు వారికి సరైన అవగాహన లేక, గెట్టు పంచాయతీలతో నిత్యం సతమతమయ్యే రైతులకు ధరణి ఒక దారి చూపించింది. కొత్త పట్టాదారు పుస్తకాలు అందిచింది. ఉచితంగా ఆ సేవలు తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గతంలో పట్టాదారు పుస్తకాలు కావాలంటే రైతుల పడిన వేదన అంతా ఇంతా కాదు…కాని వాటికి కాలం చెల్లింది. అందరికీ పట్టాలు అందాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల రకాల సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు దేశమంతా ఈ పథకాలు అమలు కావాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. తెలంగాలో అమలౌతున్న పథకాలన్నీ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇన్నేళ్లయినా ఏ నాయకుడు ఆలోచించని, ఆచరించని , అమలు చేయని పధకాలు తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే అమలు చేస్తున్న సందర్భం చూస్తున్నారు. అయినా అక్కడి పాలకుల్లో చలనం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సోయి లేదు. తెలంగాణ ప్రజలు అందుకుంటున్న సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశ్యం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. దాంతో ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. దేశం సస్యశ్యామలం కావాలని కోరుకుంటున్నారు…దేశంలో కేసిఆర్‌ కొత్తవెలుగులు నింపాలని ఆశపడుతున్నారు.

కెనడా టొరంటో లో అంబరాన్ని అంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

కెనడా టొరంటోలో హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ 49వ వార్షికోత్సవ వేడుకలు మరియు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగినది. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను చవిచూపించాయి. 1000 మంది కి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్న ఈ వార్షిక వేడుకలు మరియుసంక్రాంతి సంబరాలలో వంద మంది కళాకారులు సంగీతం,నృత్యం, వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ప్రదర్శనలు సాగుతున్నంత సేపు ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు. హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ సభ్యులు ముగ్గురు యోగా,ధ్యానం వాటి ఉపయోగాలను వివరించారు. ప్రేక్షకులను పది నిముషాల పాటు కళ్ళు మూసుకోమని అందరిచేత ధ్యానం చెయ్యించారు. ధ్యానం ముగిసిన వెంటనే హాల్ ప్రేక్షకుల చప్పట్లతో మార్మోగింది. పది నిముషాల ధ్యానం తో తమకు ఎంతో రిలాక్స్ గా ఉన్నట్లు, మనసు తేలిక అయినట్లు అనుబూతి పొందామని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కెనడా లోని హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ ప్రధాన నిర్వాహకులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా బిర్చ్‌మౌంట్ ఫ్రెండ్స్ క్లబ్(BFC), ఒంటారియో తెలుగు ఫౌండేషన్, దుర్హం తెలుగు క్లబ్ సంస్థలు . ముఖ్యం గా సూర్య కొండేటి, మురళి రెడ్డి చెర్ల, వెంకట్, సర్దార్ ఖాన్ గార్లు ఎంతో స్ఫూర్తి నిచ్చారు.

హార్ట్ ఫుల్ నెస్ సంబరాల నిర్వహణను తమ బుజస్కంధాలపై వేసుకుని కనుల పండువగా రక్తి కట్టించిన నిర్వాహకులు ప్రవాస భారతీయులైన విశ్వనాథన్ శ్రీనివాసన్, మోహన్ బోండా, సూర్య కొండేటి ,మురళి రెడ్డిచర్ల, వెంకట్ చిలువేరు లను ఆయా సంస్థల సభ్యులు అభినందించారు.థార్న్‌హిల్‌ ,ఎంపీపీ లారా స్మిత్, ఎంపీపీ దీపక్ ఆనంద్ ,థోర్న్‌హిల్ ఎంపీ మెలిస్సా లాంట్స్‌మన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.కార్యక్రమానికి హాజరయిన అతిధులందరికి నిర్వాహకులు చక్కటి ఆతిద్యం విందు ఏర్పాటు చేశారు. టొరంటో హార్ట్ ఫుల్ నెస్ నిర్వాహక కార్య దర్శకులు విశ్వనాథన్ మరియు మోహన్ బోండా మాట్లాడుతూ హార్ట్ ఫుల్ నెస్ హృదయపూర్వక లక్ష్యం- నమ్మకం, సహనం, ప్రేమ, ఓర్పు, క్రమశిక్షణ. అంగీకారం వంటి మంచి లక్షణాలను పెంపొందించడంలో మన బావి తరాలకు అందించే ఏర్పాట్లు చేస్టున్నామని మరిన్ని తెలుగు ఔన్నత్యాన్ని ఉన్నత స్థితికి పెంచే మంచి తెలుగు కార్యక్రమాలతో ముందుకు వస్తామని తెలిపారు

ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు హాజరయ్యారు.రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆయన మొట్టమొదటి సారి ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.త్రివిధ,పారా మిలటరీ దళాల కవాతు, విన్యాసాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శనను తిలకించారు.ఈ సందర్భంగా రవిచంద్ర దేశ ప్రజలకు, విదేశాలలో స్థిరపడిన,నివాసం ఉంటున్న భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రైతును బతకనివ్వరా? సాగును చిదిమేస్తారా?

`అప్పులతో, అర్థాకలితో బతుకుతున్న రైతులు బిజేపి కళ్లకు సంపన్నులుగా కనిపిస్తున్నారా?

` ప్రపంచంలోనే సంపన్న రైతులు మన దేశంలోనే వున్నారా?

` అందుకే వ్యవసాయం మీద పన్నా!?

`వ్యవసాయం రాష్ట్ర జాబితాలో అంశం…దాని మీద కేంద్రం పెత్తనమేమిటి?

` బిజేపిపై మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ధ్వజం.

`రైతులపై బలవంతంగా పన్నులు వేసేకా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తారా?

`ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయం!

`రైతు సంక్షేమమే బిజేపికి గిట్టదా?

`అంబానీ, ఆదానీల మీద వున్న ప్రేమ బిజేపికి రైతుల మీద లేదు!

`దేశ రైతు అత్యంత దయనీయమైన పరిస్థితిలో వున్నాడు.

`ప్రకృతిని నమ్ముకొని బతుకుతున్నాడు.

` దేశానికి అన్నం పెడుతున్నాడు.

` 1860లో బ్రిటిష్‌ ప్రభుత్వం చేసిన చట్టం అమలు చేస్తారా?

`అప్పుడు భూస్వాములు, జమిందారులు, జాగీర్థారులున్నారు. రైతులు లేరు!

` బిజేపి నేతలకు చరిత్ర కూడా సరిగ్గా తెలియదు!

`భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాలు బిజేపికి తెలియవా?

` అదే నిజమైతే దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నట్లు?

`ఇప్పుడిప్పుడే తెలంగాణలో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

`వారిని మళ్ళీ నిప్పుల్లోకి తోస్తారా?

`ఇప్పటికే మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారు.

`రైతులకు ఉచిత విద్యుత్‌ అందకుండా కుట్ర చేస్తున్నారు.

నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ కేంద్రంపై ధ్వజమెత్తారు.

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

బిజేపి పార్టీకి రైతులంటే ఎందుకంత పగ? రైతు పచ్చగా వుంటే చూడలేరా? రైతులు బాగుపడుతుంటే భరించలేరా? తెల్లారిలేస్తే దేశంకోసం…ధర్మం కోసం అని నీతులు చెబుతారు…దేశం కోసం కోసం అంటే అందులో రైతులు లేరా? ధర్మం కోసం చెప్పే మాటల్లో రైతులుండరా? ఏమిటీ విపరీతమైన పోకడ. కడుపు కట్టుకొని, అర్ధాకలితో పగలనక, రాత్రనక, ఎండనక,వాననక, చలనక కష్టపడి చెమట చుక్కలతో సాగు చేసే రైతుల మీదనా బిజేపి పార్టీ ప్రతాపాలు… ఇప్పటిదాకా రైతుల మీద ప్రకృతి ప్రకోపాలు చూశాం…ఇప్పుడు బిజేపి దుర్మార్గాలు చూస్తున్నాం… రైతులు పచ్చగా వుంటే చూడలేరా? రైతు సాగు చేయడం చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారా? రైతులు ఆ మాత్రం బతకొద్దా? ఎద్దేడిచి ఎవుసం…రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. అన్న సంగతి బిజేపి నేతలకు తెలియదా? ఉల్లిగడ్డ ధర ఎంతో తెలియదు…రైతులకు ఎంత గిట్టుబాటు అవుతుందో తెలియదు…ప్రజల వద్దకు చేరేవరకు ఎంత ఖరీదౌతుందో తెలియదు….మేం ఉల్లిపాయ తినం అని సమాధానం మాత్రం చెబుతారు…రైతుల మీద పన్నులేయాలన్న యోచన చేస్తారు…ఇంత దుర్మార్గమా? ప్రపంచంలో కూడా ఎక్కడా ఇలాంటి నీతి మాలిన పాలన కనిపించదేమో! రైతు కంట కన్నీరొలికించిన పాలకులు బాగుపడలేదు! పూర్వం రాజుల పాలనలో రైతులు అన్నమో రామచంద్రా! అనుకునేవారని విన్నాం…కాని ప్రజాస్వామ్య వ్యవస్ధలో మొదటిసారి కేంద్రం రైతులను గోసపెడుతుండగా చూస్తున్నామని ధ్వజమెత్తుతున్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోతు శంకర్‌ నాయక్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో…సంబాషణ ఆయన మాటల్లోనే…

 రైతు మీద 2014 ఎన్నికల మందు మొసలి కన్నీరు కార్చి, అధికారంలోకి వచ్చి ఆ రైతుకు కన్నీరు తెప్పిస్తారా?

 రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తారా? దీనిని తల్లిపాలు తాగి విషం కక్కడమనకపోతే ఏమంటారు… మొన్నటి దాకా డిల్లీలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. పదమూడు నెలల పాటు దేశ రాజధానిలో బిజేపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ఎదుర్కొన్నారు. వందలాది మంది రైతలు మరణించారు. అలాంటి రైతులను, కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆ కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించారు. కాని కేంద్ర బిజేపి ప్రభుత్వం మాత్రం వారి గురించి కూడా ఆలోచించలేదు. ఆఖరకు రైతులను నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతుందన్న ఆందోళనతో పంజాబ్‌ ఎన్నికల ముందు ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామంటూ ప్రకటించారు. ప్రధాని మోడీ కన్నీళ్లు పెట్టుకొని క్షమాపణ వేడుకున్నాడు. కాని ఆ చట్టాలను రద్దు చేయలేదు. ఇప్పటికీ ఆ కత్తి రైతుల తలల మీద వేళాడుతూనే వుంది. రైతులు బిజేపి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ చట్టాలు అమలు చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే…అది మరువక ముందే మళ్లీ కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సలహా మండలి చైర్మన్‌ ఓ దినపత్రికలో రాసిన వ్యాసం ఇప్పుడు దేశ రైతాంగాన్ని కలవరపెడుతుంది. ఎందుకంటే ఆ వ్యాసం రాసింది సాధాసీదా వ్యక్తి కాదు. ప్రధానమంత్రి మోడీకి తెలియకుండా ఇలాంటి వ్యాసం రాస్తాడని ఎవరూ ఊహించలేం. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆలోచనే అన్నది స్పష్టమౌతోంది.  

అప్పులతో అర్ధాకలితో బతికే రైతును మరింత ఆదుకోవాలన్న ఆలోచన చేయాల్సిందిస పోయి, రైతు బాగా సంపాదించుకుంటున్నాడన్న దుర్మార్గమైన ఆలోచన ఈ కేంద్ర ప్రభుత్వ హయాంలోనే వింటున్నాం…

గతంలో ఎప్పుడైనా రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వాలే ఎక్కువగా వుండేవి…కాని ఇప్పుడు మాత్రం రైతులు, సామాన్యులను ఇబ్బందులు పెట్టి, పెద్దవారికి పెట్టే కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాం…రైతు గోస చెప్పుకుంటే తీరేది కాదు…రైతు బాధలు, వ్యధలు తెలిసిన ఏకైక నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌. అందుకే ఆయన తెలంగాణ ఉద్యమం చేశాడు…తెలంగాణ సాదించాడు. ఏడేళ్లులో తెలంగాణ రూపు రేఖలు మర్చాడు. తెలంగాణ సస్యశ్యామలం చేశాడు…ఎండిన పల్లెలను పచ్చగా మార్చాడు…ఎండిన బీళ్లుకు గోదావరి జలాలు మళ్లించాడు…చెరువులు బాగు చేయించాడు. ఒర్రెలు, వాగులల్లో కూడా నీళ్లు చూపిస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించాడు. అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టాడు. రైతుకు నిరంతరం కరంటు ఇస్తున్నాడు. కాలువల ద్వారా నీళ్లు అందిస్తున్నాడు. ఏటా రెండు పంటలకు సరిపడ సమృద్ధి కరమైన నీటిని సరఫర చేస్తున్నాడు. భూగర్భ జలాల మట్టాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా పెంచాడు. ఎక్క చూసినా ఎండాకాలంలో కూడా నీటి చెరువులు కూడా నిండుగా వుండేలా చేశాడు. రైతును రాజు చేశాడు….ఇది కేసిఆర్‌ విజన్‌…ఆయన కలలు గన్న తెలంగాణ. ఇది రైతు నాయకుడికి మాత్రమే సుసాధ్యం. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడికే సాధ్యం. ఇదే సాగు పండగ దేశమంతా కావాలని ఓ పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ కోరుకుంటుంటే, రైతులపై పన్ను వేయాలని దుష్టపన్నాగం కేంద్ర ప్రభుత్వం పన్నుతోంది…దీన్ని రైతులే కాదు…ప్రజలంతా వ్యతిరేకించాల్సిన అవసరం వుంది. 

దేశంలో రైతులంతా సంపన్నంగా వున్నారంటూ వ్యాసం రాసిన వ్యక్తికి అసలు పల్లె అంటే ఏమిటో తెలుసా? పల్లె జీవనం తెలుసా? 1860 చట్టం అమలు చేయాలా? చెప్పడానికి కనీసం ఇంగితం కూడా లేకుండా ఆర్ధిక నిపుణుడు అని చెప్పుకోవడం సిగ్గు చేటు. 

ఏ ప్రభుత్వమైనా దేశానికి అన్నం పెట్టే రైతు సుఖంగా వుండాలని కోరుకోవాలి. కాని రైతును ఏడిపించాలని చూడ చూడకూడదు. రైతును పీడిరచిన రాజులందరూ చరిత్ర హీనులుగానే మిగిలిపోయారు. బిజేపి కూడా ఆ పరిస్ధితి తెచ్చుకుంటోంది. మన దేశంలో బ్రిటీష్‌ పాలనకు ముందుగాని, బ్రిటీష్‌ పాలకుల కాలంలో గాని సాగు చేసింది మాత్రమే రైతులు…కాని అవి వారి భూములు కాదు..కేవలం రైతులు కూలీలు మాత్రమే. రాజులు, వారి సామాంత రాజులకు, ఆ తర్వాత జమిందారులకు మాత్రమే భూములు వుండేది. దాంతో వారు భూమి శిస్తు చెల్లించేవారు. అంతే కాని రైతులు చెల్లించే అవకాశం లేదు. రైతులు ఆరుగాలం కష్టపడి ఎంత పనిచేసినా, నాటి జమిందారులు ఇచ్చే కూలీ చాలక, తాము చేసిన కష్టం భూస్వాములు దోచుకుంటున్నారనే దున్నేవాడికే భూమి అన్న నినాదం తెచ్చారు. దేశంలో అనేక చోట్ల ఇలాంటి ఉద్యమాలు చేశారు..ముఖ్యంగా తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం…నిజాం వ్యతిరేక పోరాటం ఒక చరిత్ర. ఒక్క తెలంగాణలోనే కాదు…దేశమంతా ఈ పోరాటాలు సాగాయి. అప్పుడు రైతుల చేతుల్లోకి భూములు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చాక సాగు మీద సుంకం వసూలు చేయడం ఆగిపోయింది. ఇక రైతుల మీద పన్నులు వేయడం అంటే…పూర్వ కాలంలో హిందువులు కాని వారి మీద మొగలులు వేసినట్లు జిజియా పన్నులు తెలిసిందే…మహారాష్ట్రను ఏలిన శివాజీ లాంటి వారు దేశ్‌, సర్ధేశ్‌ ముఖ్‌ అనే పన్నులు వసూలు చేశారు…ఇక శ్రీకృష్ణ దేవరాయల లాంటి వారు గర్భిణీ పన్నులు వేశారు..ఆఖరుకు వ్యభిచారం మీద పన్నులేసి రాజ్య పాలన చేశారు..ఇది అప్పటి నియంతృత్వ పాలనలు…కాని ఇప్పుడు ప్రజాస్వామ్యం… దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడిపోతున్నా, నదీ జలాలను పొలాలకు మళ్లించే ఆలోచన చేయడం లేదు. కేంద్రంలో బిజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనమిదేళ్లవుతోంది. ఒక్కటంటే ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం చేసింది లేదు. రైతు గురించి ఆలోచించింది లేదు. రైతులకు చేసిన మేలు ఒక్కటి కూడా లేదు…ఎరువులు ధరలు పెంచారు…కరంటు మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారు…వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు లేకుండా చేద్దామనుకుంటున్నారు. ఇప్పుడు ఆఖరుకు రైతులను నుంచి పన్నులు వసూలు చేద్దామనకుంటున్నారు. అసలు వ్యవసాయం అన్నది రాష్ట్ర జాబితాలోని అంశం…దీనిపై కేంద్ర పెత్తనం ఏమిటి? రాష్ట్రాల ఇష్టం లేకుండా ఎలాంటి చట్టాలు చేయడానికి వీలు లేదు. కాని రాష్ట్రాల భుజాల మీద తుపాకి పెట్టి, పన్నుల భారం వసూలు చేయాలని చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఊరుకుంటాడా…దేశమంతా ఒక్కటి చేస్తాడు..దేశ రైతాంగాన్ని కదిలిస్తాడు…ఉప్పెన సృష్టిస్తాడు…బిజేపిని ప్రజల్లో లేకుండా చేస్తాడు…ఇది తధ్యం…కనిపించే దేశ భవితవ్యం!! ఇదే…ఇదే! రైతుతో గోక్కొని ఆనాడు చంద్రబాబుకు పట్టిన గతే….ఈసారి బిజేపికి తప్పదు. ఇది శంకర్‌ నాయక్‌ ఒక రైతుగా చెబుతున్న మాట…

కంటి వెలుగు కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డులో నమోదు చేయాలి…

హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్….

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)కమలాపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మంగళవారం పరిశీలించారు.కంటి పరీక్షకు వచ్చిన ప్రజలతో సరైన పద్ధతిలో చూస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డులో ఎక్కించాలని ఈ సందర్భంగా అన్నారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని గడపగడపకు చేరేలా ప్రజాప్రతినిధులు అంతా కృషి చేస్తున్నారని,

 ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ తడక రాణి,జడ్పీటీసీ లాం డిగే కల్యాణి,ఎంపీడీఓ పల్లవి,ఎంపీఓ విమల,గ్రామ సర్పంచ్ కట్కూరి విజయ, వైద్యాధికారిణి హర్షిని ప్రియ,ఎంపీటీసీలు మాట్ల వెంకటేశ్వర్లు,రామస్వామి తదితరులు పాల్గొన్నారు…

పద్మశాలిల అభివృద్ధికి తెరాస కట్టుబడి ఉంది… ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి….

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తానని, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం కమలాపూర్ లోని కమ్యూనిటీ హాలులో శ్రీ మార్కండేయ ఋషి జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మార్కండేయ ఋషి చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను ప్రారంభించారు. ఎమ్మెల్సీ ని ఈ సందర్భంగా పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన పద్మశాలి కులస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇన్నేళ్ల పాలనలో ఏ రాజకీయ నాయకుడు పద్మశాలి కులస్తులను గాని కుల సంఘ భవనం, మార్కండేయ గుడి నిర్మాణం కు ముందుకు రాలేదని టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి కృషి చేసేందుకు మీ బిడ్డగా ముందుకు వచ్చానని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని తెలిపారు. మీకు ఏ సమస్య ఉన్న నాకు చెబితే చాలు చేసి పెట్టే బాధ్యత నాదని, ఈనెల 31న మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పద్మశాలి కుల సంఘ భవనం, మార్కండేయ గుడి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయిస్తానని ముందుగా ఈ రెండింటి పనులు ఏడు నెలల్లో పూర్తి చేయించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. కడు పేదరికంలో ఉన్న పద్మశాలి కులస్తులను ఆదుకునేందుకు చొరవ చూపుతా నని, చేనేత రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే దిశగా పాటుపడతానన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన కు పద్మశాలి కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పద్మశాలి కుల సంఘం నిర్మించబోయే స్థలాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పద్మశాలి కుల సంఘం అధ్యక్షులు బైరి దశరథం, ప్రధాన కార్యదర్శి పులికంటి రాజేందర్, ఉపాధ్యక్షులు దాసి శంకరయ్య, చేరాల సారంగం, సభ్యులు వావిలాల మురళి, తౌటం సుధాకర్, వెల్ది రాము, కూచన దుర్గాప్రసాద్, ఆడెపు విజయ, అభివృద్ధి కమిటీ సభ్యులు బొప్ప శివ శంకర్, మెండు రమేష్, మార్గం బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

వలసవాదుల ముందు చులకనౌతున్నాం!

`బిజేపిలో పెరుగుతున్న అంతర్గత పోరు…ఆధిపత్యాల తీరు

`రాజకీయ పునరావాసం గందరగోళం!

`పరాకాష్ఠకు చేరిన పంచాయతి?

`వలసవాదుల ఆధిపత్యంపై అసలు నాయకుల విసుగు?

`అవకాశాలు తన్నుకుపోతున్నారని ఆందోళన.

`ఇంతకాలం పార్టీ చేసిన ఊడిగం ఉత్తదేనా?

`కొత్తగా వచ్చిన వారి పెత్తనంలో పని చేయాలా?

`వారి అనుచరులకున్న ప్రాధాన్యత మాకు లేదా?

`ఎవరిబలమెంత? 

`నాయకులతో చేరిన కార్యకర్తలెంత మంది?

` బిజేపి మీద అభిమానం ఎంతమందికి వుంది?

`పదవుల కోసం వచ్చిన వాళ్లే కాని, సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వారెంత మంది?

`పాతవారికి పదవులిస్తే కొత్తవారితో తంటా!

`కొత్త వారికి ప్రాధాన్యత పెరిగితే పాతవారు కలవరంట!

`సఖ్యత లేని సంసారం…

`సర్థి చెప్పలేని నాయకత్వం…

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 ఇది అసలైన బిజేపి నేతలు పడుతున్న ఇబ్బంది. పార్టీ బలోపేతమౌతోందని సంతోష పడాలో, తమ ప్రాధాన్యత తగ్గుతున్నందుకు మధనపడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా పార్టీని పట్టుకొని, ఇంత దూరం వచ్చారు. ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పని చేశారు. పదవులకు ఆశపడలేదు. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా దేశం కోసం, ధర్మం కోసమంటూ పార్టీకి అండగా నిలబడ్డారు. కొత్త నీరు వచ్చినా, పాత నీరు పోయినా బిజేపి సిద్దాంత పరమైన పార్టీ అన్నది అందరూ చెప్పుకునే మాట. అలాంటి బిజేపి దక్షణాన ప్రాభవం కోసం పాకులాడుతోంది. ఎనిమిదేళ్ళుగా ఉత్తర భారతంలో అప్రతిహతంగా వెలుగుతున్నా, దక్షణానదిలో గుడ్డి దీపమైపోయింది. ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు. కానీ దక్షిణాన ఎలాగైనా పాగా వేయాలి. బాలం పెంచుకోవాలి. బలపడాలి. గెలవాలి. ఇదంతా ఇప్పట్లో అయ్యే పని కాదు…ఎదురు చూసుకుంటూ పోతే ఇంకా ఎన్నేళ్లైనా బిజేపి తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావడం కలే….అందుకే ఎలాగైనా అధికారంలోకి రావాలి. ఎలా వచ్చామన్నది కాదు…వచ్చామా లేదా? అన్నది ముఖ్యం. సహజంగా ఏ పార్టీ అయినా ప్రజల్లో నమ్మకం పెంచుకొని, విశ్వాసం కలిగించి ఎన్నికలలో గెలవాలని చూస్తుంది. కానీ బిజేపి ఇటువల కాలంలో వేస్తున్న అడుగులపై ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని లెక్క చేయడం లేదు. అధికారం లోకి వచ్చామా? లేదా! అన్నదే ముఖ్యమైతోంది. ఇదే బిజేపి బలపడడానికి మార్గం అనుకుంటోంది. అందుకే ఇతర పార్టీలలోని నేతలు ఎవరు వచ్చినా బిజేపి రెడ్‌ కార్పెట్‌ వేస్తోంది. ఇది అసలైన బిజేపి నేతలకు కొంత కంటగింపుగా కూడా మారుతోంది. వారి ఆవేధనలో కూడా న్యాయముంది. ఇంత కాలం పార్టీలో అంతో ఇంతో సీనియర్లుగా చెలామణి అవుతున్న నాయకులు, వలస నేతల ముందు, వారి అనుచరుల ముందు తమ వాదనలు చెల్లుబాటు కావడం లేదు. వలస నేతలలో ఆయా ప్రాంతాలలో వారికి వున్న ఇమేజ్‌ దృష్ట్యా మీడియా కూడా వారికే ప్రాధాన్యతనిస్తోంది. అటు పార్టీలోనూ సరైన ప్రాధాన్యం లభించక, ఇటు మీడియాలోనా వారి ప్రస్తావన అంతగా లేకపోవడంతో చాలా మంది నేతలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడక్కడ మీడియా ముందు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. కొన్ని సార్లు పార్టీ పరమైన విషయాలలో కూడా సరైన సమాచారం వుండడం లేదని వాపోతున్నారు. కొత్తగా చేరిన నేతలు కొంత అంగ బలం, అర్థ బలం వుండడం కూడా వారికి అదనపు గౌరవం అందుతోంది. సీనియర్లు మాత్రం ఉత్సవ విగ్రహాలుగా నిలబడి చూడాల్సి వస్తుందంటున్నారు. 

బిజేపిలో పెరుగుతున్న అంతర్గత పోరు…ఆధిపత్యాల తీరు. 

పార్టీ యంత్రాంగంలో రోజు రోజుకు అంతర్గత పోరు, ఆధిపత్య సమస్యగా రూపాంతరం చెందుతోంది. వలస నేతలు ఏది చేసినా వివాదాల మయమౌతోంది. అందుకు ఆది నుంచి పార్టీలో వున్న నేతలు రాజకీయ పునరావాసం పొందిన నేతల మధ్య పొసగడం లేదు. ఇది చాలా కాలం నుంచి వినిపిస్తోంది. నిజం చెప్పాలంటే రాష్ట్ర స్థాయిలో వున్న చాలా మంది నేతల్లో వలస నేతలే ఎక్కువ వున్నారు. అంతో ఇంతో ఛరిష్మా వున్న వాళ్లు…అవసరమైతే పార్టీకి రూపాయి ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నారు. అలాంటప్పుడు పార్టీ కూడా వారికి కొంత ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. దాంతో అసలు నేతలు దూరం జరగాల్సి వస్తోంది. ఇంటి కోడి పప్పుతో సమానమని పెద్దలు చెప్పినట్లు, అసలు బిజేపి నేతలు ఎటూ వెళ్లరు. పార్టీలోనే వుంటారు. కానీ వలస నేతలు ఏ మాత్రం అసంతృప్తికి లోనైనా ఎగిరిపోవచ్చు…దాంతో కరవ మంటే కప్పకు కోపం…విడవమంటే పాముకు కోపం… అన్న చందంగా బిజేపి అధిష్టానం పరిస్థితి తయారైంది. అందుకే వలస నేతలను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆలోచన అధిష్టానం చేస్తోంది. ఇది అసలుకే మోసం వస్తుందని బిజేపి అసలు సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. 

రాజకీయ పునరావాసం గందరగోళం! 

అసలు ఈ పంచాయతీకి అసలైన కారణం… బిజేపి దర్వాజాలు బార్లా తెరిచి ఆహ్వానించడమే అని కూడా అంటున్నారు. ఎవరు ఖాళీగా వున్నారు….ఎవరు బిజేపి వైపు చూస్తున్నారు…అనేదానికి ప్రాధాన్యతనివ్వడంతో ఏదో ఒక వేధిక కావాలనుకునే వారికి బిజేపి కనిపిస్తోంది. వలస వాదులు, ఆ కోవకు చెందిన వారికే సహజంగా మద్దతు ప్రకటిస్తారు. అలాంటి వారే అందరూ అక్కడ ఏకమై వున్నారు. బిజేపిలో ఇప్పుడు కొంత క్రియాశీలకంగా వున్న ఓ మాజీ మంత్రి తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నికల ఖర్చంతా నాదే? అన్నారట…ఆమె ఒక్కరే కాదు…అలా బిజేపికే ఆఫర్లు ఇస్తున్న నేతలు మరి కొందరు కూడా వున్నారట. వాళ్ల వైపు ఒక వేళ అధిష్టానం మొగ్గితే అసలైన నేతలు పదవుల మీద పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే…ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు కాంగ్రెస్‌ లో అందరూ సిఎం. అభ్యర్థులే అని ప్రచారం చేసుకున్నట్లే ఇప్పుడు బిజేపి లో కనిపిస్తోంది. దాంతో పంచాయతి పరాకాష్ఠకు చేరుకున్నట్లే కనిపిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బిజేపిలో కూడా సిఎం జాబితా పెరిగిపోతోంది. పైకి అబ్బే అలాంటిదేమీ లేదంటూనే ఎవరికి వారు, తమ తమ ఆలోచనల్లోనే వున్నారు. ముఖ్యంగా ఓ నలుగురైదుగురు పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. అందులో ఇద్దరు మాత్రమే పాత నేతలు. మిగతా వాళ్లంతా కొత్త నేతలే…పాత వారిలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా వున్న కిషన్‌ రెడ్డి ఒకవేళ అధికారంలోకి వస్తే…అనే అంశంలో గంపెడాశ పెట్టుకున్నట్లే చెప్పుకుంటున్నారు…ఎందుకంటే ఆయనే ఇప్పుడు సీనియర్‌…కానీ ఇంత కాలం లేని ఊపు తెచ్చిన బండి సంజయ్‌ కు మరింత ప్రాధాన్యతనిస్తారా? అన్నది అర్థం కాక అందరూ తలలుపట్టుకుంటున్నారు. తాము ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పెవరిదీ కాదు. ఏ రాజకీయ నాయకుడైనా కనే కలే…ప్రాంతీయ పార్టీలలో మంత్రులు కావాలన్న కోరిక వరకే పరిమితమౌతారు. కానీ జాతీయ పార్టీలలో ముఖ్యంగా బిజేపి లాంటి పార్టీలలో ఎంత దూరమైనా కలగనొచ్చు. నెరవేరొచ్చు కూడా….అందుకే అందరూ ఆశలు పెంచుకుంటున్నారు…ఎవరి కోటరీ వాళ్లు నడుపుకుంటున్నారు…గ్రూపులుగా విడిపోతున్నారు. పైకి మాత్రమే అంతా ఒకటే అని చెబుతున్నారు. ఇక వలస నేతల విషయంలో రఘునందన్‌ రావు కూడా అసలైన బిజేపి నేత కాదనే మాటలు వింటున్నవే….దుబ్బాక నుంచి ఆయన ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ అది బిజేపి గెలుపు కాదనేది అందరూ చెప్పే మాటే…అయితే బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ను తొలగించి కొత్త అధ్యక్షుడి నియామకం సమయంలో రఘునందన్‌ పేరు కూడా బలంగా వినిపించింది. కానీ ఆయన కాలేదు. బండి సంజయ్‌ ని అధ్యక్షుడిని చేస్తారని ఎవరూ ఊహించలేదు. అనుకోకుండా వచ్చిన అదృష్టమో…వరమో కానీ బండి సంజయ్‌ అధ్యక్షుడు అయ్యారు. ఆయన వల్ల పార్టీ బలపడిరదని చెప్పలేం కానీ, ఒక కదలిక మాత్రం వచ్చిందని అందరూ అంగీకరిస్తున్నారు. పార్టీకి ఇంత ఊపు తెచ్చిన బండి సంజయ్‌ కూడా రేసులో వుండడం సహజం. కాకపోతే ఆయనకు ఎంత మంది సపోర్ట్‌ గా నిలుస్తారనేది మాత్రం చెప్పలేం…ఇక అందరి దృష్టి వున్న నేత ఈటెల రాజేందర్‌. ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ అందరికీ తెలిసిందే… ఆయన గెలుపు అందరి నోట్లో నానిందే…చేరికల కమిటీ అనే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెలకు సమయం వచ్చినప్పుడు ఎంత మంది అండగా వుంటారనేది కూడా ఇప్పుడే చెప్పలేం…అంత క్లారిటీ కూడా వుందనుకోలేం…అందరూ ఆకాశంలో మబ్బులను చూసి నీళ్లు ఒలకబోసుకునే వారే…అందుకే అసలైన నేతలెవరనేది తేలితే తప్ప ఓ కొలిక్కి రాదు…అంతేకాదు బిజేపిలో ఏదైనా సాధ్యమే…కావాలనుకుంటే నెత్తిన పెట్టుకుంటారు…వద్దనుకుంటే పక్కన పెట్టేస్తారు…లాల్‌ కృష్ణ అద్వానీ కే తప్ప లేదు…వెంకయ్య నాయుడు పరిస్థితి చూస్తున్నదే…ఎవరికి వారు యమునా తీరే…అయినా మొదటి నుంచి పార్టీలో వున్న వారికి వున్నంత నోరు కొత్త వాళ్లకు బిజేపిలో వుండదు…అదే వలస నేతలకు వచ్చిన అసలైన చిక్కు…ఇప్పుడు తాత్కాలికంగా వారి మాట చెల్లుబాటు అయనట్లే కనిపించొచ్చు…దీర్ఘకాలంలో వారిని దూరం పెట్టొచ్చు. పైగా వచ్చే ఎన్నికలలో బిజేపి బలపడకపోతే వలస నేతలందరు ఎవరిదారి వాళ్లు చూసుకోవచ్చు…

 వలసవాదుల ఆధిపత్యంపై అసలు నాయకుల విసుగు చెందుతున్నారు. 

  అవకాశాలు తన్నుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం పార్టీ చేసిన ఊడిగం ఉత్తదేనా? అని కూడా ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. కొత్తగా వచ్చిన వారి పెత్తనంలో పని చేయాలా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. వారి అనుచరులకున్న ప్రాధాన్యత మాకు లేదా? అని కూడా అక్కడక్కడా నిలదీస్తున్నారు. ఎవరిబలమెంతో? చూసుకుందామని కూడా సవాలు విసురుకుంటున్నట్లు సమాచారం. వలస నాయకులతో చేరిన నాయకులే ఎక్కువ. కార్యకర్తలు తక్కవ. దాంతో ఇంత కాలం బిజేపి తామే నాయకులుగా చెలామణి అయిన వాళ్లు కార్యకర్తల స్థాయిని దాటలేకపోతున్నారు. ఒకవేళ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా వలస నేతలే పదవులు తన్నుకుపోతారని చర్చించుకుంటున్నారట.అందుకే పార్టీలో చేరిన వారిలో బిజేపి మీద అభిమానం ఎంతమందికి వుంది? అనేదానిని వెలుగులోకి తేవాలని చూస్తున్నారట. తాము సైలెంట్‌ గా వుంటే తమ రాజకీయ జీవితాలు గుమ్మం దాటవని అనుకుంటున్నారట. వచ్చిన వాళ్లలో పదవుల కోసం వచ్చిన వాళ్లే కాని, సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వారెంత మంది? అనేది కూడా పార్టీ కచ్చితంగా బేరీజు వేసుకోవాలని అసలైన సీనియర్లు సూచిస్తున్నారట. 

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దగ్గర ప్రస్తావిస్తున్నారట…ఆయన అన్ని విషయాలు వినడం తప్ప, స్పందన లేదట…దాంతో జరుగుతున్న ప్రచారంలో తన భవిష్యత్తు ఏమిటో ఆయనకు కూడా అర్థం కావడం లేదనే తెలుస్తోందనుకుంటున్నారట. అయితే కొత్తగా పార్టీలోకి వలసలు వస్తున్న నేపథ్యంలో పాతవారికి పదవులిస్తే కొత్తవారితో తంటా! వచ్చిపడేలా వుంది. అందుకే ఎన్నికలు దగ్గరపడుతున్నా పార్టీ బలపడాలని చెబుతున్నారే తప్ప పదవులు పంచడం లేదు.కొత్త వారికి ప్రాధాన్యత పెరిగితే పాతవారు కలవరంట! అనే ప్రచారం కూడా మొదలైంది. గతి లేని సంసారమైనా చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేరంటు…బిజేపి సఖ్యత లేని సంసారం…కూడా అలాగే వుంది. ఇదంతా చూస్తున్నా సర్థి చెప్పలేని నాయకత్వం…ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని ఎదురుచూస్తున్నారు.

ముహూర్తం ఫిక్స్

నూతనంగా నిర్మించిన..డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 

ప్రారంభోత్సవానికి ముందు, ఉదయం.. వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో…తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్, ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జెడియు జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ముఖ్యులు పాల్గొంటారు.

సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత.. మధ్యాహ్నం, సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సచివాలయ ప్రారంభోత్సవం లో పాల్గొన్న పైన పేర్కొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

సామాజిక కార్యకర్త సతీమణి జన్మదినం సందర్బంగా నిరుపేదలకు అన్నదానం

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త ముద్దం భాస్కర్ సతీమణి జన్మదినం సందర్బంగా పట్టణంలోని నిరుపేద కుటుంబాలకు 40 కుటుంబాలకు అన్నదానం చేసి మానవత్వం చాటాడు. తను నివసిస్తున్న గ్రామంలో నిరుపేదలు అకలితో అలమటిస్తారని వారికి ఏదో విధంగా సహయం చేయాలని భావించిన ముద్దం భాస్కర్ తన సతీమణి జన్మదినం సందర్బంగా అన్నదానం చేసి వారి చిరునవ్వు లకు కారణం అయ్యాడు. అలాగే వారిని దాతలు వస్తు రూపేణా, ధన రూపేణా అదుకోని వారి జీవితానికి దారి చూపాలన్నారు. అన్నదానం చేసిన ముద్దం దంపతులకు మేలు జరిగాలని ఆశీర్వదించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version