హీట్‌…హీట్‌ గా… ఈటెలా…ఏమిటిలా!

 

అటా, ఇటా, ఎటు?

హాట్‌ …హాట్‌ గా ఈటెల ఎపిసోడ్‌..!

`బడ్జెట్‌ మీద చర్చ కన్నా ఈటెల మీదే చర్చ!

`అందరూ మా రాజేందరే అన్నారు! ఎందుకు!?

`అంతుపట్టని వ్యూహం… తెరపైకి ఈటెల వ్యవహారం.

`అసెంబ్లీలో కేటిఆర్‌… మాటా మంతి.

`హరీష్‌ రావు పదే పదే ఈటెల ప్రసక్తి!

`సిఎం. కేసిఆర్‌ అదే ప్రస్తుతి….

`ఇంకేముంది …ఏదో జరుగుతోందనేది మీడియా లోకం కోడై కూస్తోంది!

`లోగుట్టు వున్నట్టా! లేనట్టా!!

`బట్టకాల్చి మీదేసినట్టా!

`బురదంటించి కడుక్కోమన్నట్టా!

`ఈటెల గర్‌ వాపసీ ఉత్త ఊహలేనా?

`ఈటెల మనసులో ఏముంది?

`పైకి చెప్పేదానిలో నిజమెంతుంది?

` బిజేపిలో ఈటెల కలత…మీడియాలో నలత?

`ఈటెల ఖండిరచినా ఆగని ప్రచారం…

`నమ్మడానికి సిద్ధంగా లేని జనం!

`మీడియా లోకం…నేతల చేతుల్లో లేని రాజకీయం!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాలలో కనిపించలేదు. ఇది నిజంగానే కావాలని జరిగిందా? లేక కల్పితమా? అన్నది కాసేపు పక్కన పెడితే ఈటెల రాజేందర్‌ అంశం మాత్రం మరి కొంత కాలం నానడం ఖాయం. ఈ విషయంలో ఈటెల రాజేందర్‌ ఎన్ని ప్రకటనలు చేసినా, దానికి ప్రాధాన్యత దక్కకపోవచ్చు…పైగా ఈటెల రాజేందర్‌ తనకు తానుగా బిఆర్‌ఎస్‌ నుంచి బయటకు రాలేదు…అని ఆది నుంచి అంటూ వస్తున్న మాటనే ఇప్పటికీ చెబుతూవస్తున్నారు. అందులో మార్పేమీ లేదు. బిఆర్‌ఎస్‌ ను ఈటెల రాజేందర్‌ ఇప్పటికీ శత్రు వర్గంగా చూస్తున్న ధాఖలాలు లేవు. తన రాజకీయ మూలాలు అక్కడే వున్నాయన్నది ఆయన మర్చిపోయింది లేదు. ఇదిలా వుంటే బడ్జెట్‌ చర్చ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశానికి ప్రధాని అయితే తొలుత సంతోషించేది నేనే…అన్నారు. అంటే ఆ మమకారం ఇంకా ఆయనకు పోలేదు. ఇది కూడా ఈటెల యాదృచ్ఛికంగా అన్నారా? లేక హుందాతనం కోసమన్నారా? అన్నది ఇక్కడ అవసరం లేదు. కానీ ఈటెల మనసులోనుంచి మాటలు గానే అనుకోవడం జరుగుతోంది. 

అందరూ మా రాజేందరే అన్నారు! ఎందుకు!?

 అన్నది కూడా హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఒక్కరు కాదు…బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అందరూ ఈటెల విషయంలో చాలా పాజిటివ్‌ గా వున్నారు. ఈటెల రాజేందర్‌ పార్టీ నుంచి బైటకు వెళ్లిన తర్వాత ఆయనతో మాట్లాడేందుకు చాలామంది నేతలు వెనుకాముందు ఆడేవారు. కానీ ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. అదేంటో గాని ఆ మధ్య ఈటెల రాజేందర్‌ తమ పార్టీలో బిఆర్‌ఎస్‌ కోవర్టులున్నారంటూ వ్యాఖ్యానించారు. అది పది రోజుల క్రితం పెద్ద వివాదం ముసురుకుంది. ఈటెల వ్యాఖ్యలపై విజయశాంతి లాంటి వారు స్పందించారు. నిజంగానే బిజేపిలో కోవర్టులు వుంటే బైటకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ వివాదం ఇంకా సాగుతున్న తరుణంలోనే ఈటెల అసెంబ్లీ ఎపిసోడ్‌ కు మరింత మసాలా అద్దినట్లైంది. అసెంబ్లీలో కేటిఆర్‌, ఈటెల సరదా సన్నివేశం చూసినప్పుడే చర్చ మొదలైంది. ఆ తర్వాత ఈటెల, మంత్రి కేటిఆర్‌ రహస్య సమావేశం కూడా జరిగినట్టు ప్రచారం జరిగింది. అది కూడా దాటి సిఎం కేసిఆర్‌ తో ఈటెల రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాతే సిఎం కేసిఆర్‌ అసెంబ్లీలో ఈటెల ను అన్ని సార్లు ప్రస్తావించారనే మాటలు వినిపిస్తున్నాయి. 

అంతుపట్టని వ్యూహం… తెరపైకి ఈటెల వ్యవహారం. 

రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించేది కాదు. ఉన్నట్టుండి ఈటెల రాజేందర్‌ ఎపిసోడ్‌ పుల్‌ స్పీడ్‌ గా దూసుకుపోతోంది. ఎవరికి తోచినట్లు వారు అన్వయించుకుంటున్నారు. వార్తలు వండి వార్చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వచ్చాక కంటెంట్‌ అవసరం లేదు…కన్‌ ఫ్యూజన్‌ టెక్నిక్‌ తెలిస్తే చాలు, తోచింది రాసేస్తే చాలు…అది ప్రపంచం మంతా చుట్టొస్తుంది. నాయకులకు కూడా ఇదే కావాలి. నిత్యం వార్తల్లో వుండాలి. ఇలాంటి ప్రచారాలు జరిగినప్పుడు ఎంజాయ్‌ చేయాలి. నాకేం సంబంధం లేదు… అని ఓ నిట్టూర్పు విడిస్తే చాలు…మళ్ళీ మొదలౌతుంది…అందులో లేని గూడార్థాలు వెలుగులోకి వస్తాయి… విపరీత ప్రచారం మోసుకొస్తాయి. నిజానికి ఈటెల రాజేందర్‌ బిజేపిలో అంత సంతృప్తిగా లేరన్న చర్చ కూడా వుంది. పైకి ఈటెల ఎంత సమర్థించుకున్నా, లోలోన రగులుతున్న బాధ చెప్పుకోలేనిది. ఇప్పుడు ఎటు చూసినా ఇబ్బందే…ఎవరు ఏం మాట్లాడినా ఇబ్బందే…చుట్టుపక్కల ఎంత చూసుకున్నా ముళ్ల కంప అంటుకోనుంది…ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు బిఆర్‌ఎస్‌ నుంచి బైటకు వచ్చినప్పుటికన్నా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనే మాటలే వినిపిస్తున్నాయి. ఈ మధ్య మాజీ ఎంపి. వివేక్‌ వెంకటస్వామి తో జరిగిన రచ్చ ఎంత దుమారం రేపిందో తెలిసిందే… అసలు అప్పటి దాకా ఈటెల రాజేందర్‌ పార్టీలో ఒక రకమైన గౌరవం వుండేది. ఇక అప్పటి నుంచి పార్టీలో అంత ప్రాధాన్యత లేకుండా పోతోందని మధనపడుతున్నారట…ఈటెల ఎంత దూరమైనా వెళ్ళి నాయకులను పార్టీలోకి తెస్తాడన్న నమ్మకం బాగా వుండేదట…ఈటెల, వివేక్‌ మధ్య వ్యవహారంతో ఈటెల ను లైట్‌ తీసుకుంటున్నారట…అంతే కాకుండా తనను ముఖ్యమంత్రి అభ్యర్థిని చేస్తే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటానని ఈటెల అన్నట్లు కూడా ప్రచారం జరిగింది… కానీ వివేక్‌ ఎపిసోడ్‌ తో ఈటెల గ్రాఫ్‌ ఒక్కసారిగా పడిపోయినట్లు చెప్పుకుంటున్నదే….ఇదిలా వుంటే ఈటెలను నమ్ముకొని బిజేపిలో చేరిన వారి పరిస్థితి ఎలా అన్నది కూడా చర్చకు వస్తున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది. ఈటెల రాజేందర్‌ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే సూచనలైతే కనిపించడం లేదు. ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం మాత్రమే వుంది.. ఒకవేళ ఈటెల కు పదవి ఇచ్చేదే వుంటే ఈ పాటికి పూర్తి చేయాల్సి వుండే…ఆ ఆశ కూడా ఈటెల కు లేదనే అనుకోవచ్చు. ఈ సారి ఎన్నికలు బండి సంజయ్‌ నేతృత్వంలోనే వెళ్లే అవకాశం వుంది. అంతేకాకుండా ఈసారి బండి సంజయ్‌ అసెంబ్లీకి మళ్ళీ పోటీ చేయనున్నారట…గత ఎన్నికలలో కరీంనగర్‌ నగర్‌ నుంచి బండి సంజయ్‌ పడిపోవడం, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు సానుభూతి చూపించడం జరిగింది. బండి ఓటమిని జీర్ణించుకోలేక కార్యకర్తలు కన్నీటి పర్యంతం కావడం వంటివి బాగా కలిసొచ్చాయి. పార్లమెంటు కు పోటీ చేసే అవకాశం తలుపుతట్టింది. గెలుపు వరించింది. ఇక్కడితోటే బండి సంజయ్‌ రాజకీయం మలుపు తిరిగింది. ఈసారి మళ్ళీ బండి సంజయ్‌ అసెంబ్లీకి కరీంనగర్‌ నుంచి కాకుండా వేములవాడ నుండి పోటీ చేయాలనుకుంటున్నారట…కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం వుందని తేలిందట…పైగా ఇటీవల ఓ జ్యోతిష్యుడు బండి సంజయ్‌ ఇంటికి వెళ్లడం, ఆయన జాతకం చూడడం జరిగింది. బండి సంజయ్‌ కు యోగం వుందని ఆ జ్యోతిష్యుడు చెప్పాడట…ఇక అప్పటి నుంచి తనకు పోటీ అనుకుంటున్న ఈటెల కు బండి పొగబెడుతున్నట్లు సమాచారం… పైగా ఈటెల బిజేపిలో చేరినప్పుడు వేములవాడ టికెట్‌ తుల ఉమకు ఇవ్వడానికి పార్టీ అంగీకరించిందట…ఇప్పుడు బండి సంజయ్‌ వేములవాడ నుంచి పోటీ అన్నది కూడా ఈటెలను కలవరానికి గురి చేస్తోందట…ఇలా అటు పార్టీలో పొగ…ఇటు బిఆర్‌ఎస్‌ నుంచి వస్తున్న సెగతో ఈటెల కు ఎండాకాలానికి ముందే ఉక్కపోత మొదలైంది….

అసెంబ్లీలో కేటిఆర్‌… మాటా మంతి…హరీష్‌ రావు పదే పదే ఈటెల ప్రసక్తి! సిఎం. కేసిఆర్‌ అదే ప్రస్తుతి….

ఇంకేముంది …ఏదో జరుగుతోందనేది మీడియా లోకం కోడై కూస్తోంది! లోగుట్టు వున్నట్టా! లేనట్టా!!బట్టకాల్చి మీదేసినట్టా! బురదంటించి కడుక్కోమన్నట్టా? ఈటెల గర్‌ వాపసీ ఉత్త ఊహలేనా? ఈటెల మనసులో ఏముంది? పైకి చెప్పేదానిలో నిజమెంతుంది? బిజేపిలో ఈటెల కలత…మీడియాలో నలత? ఈటెల ఖండిరచినా ఆగని ప్రచారం…నమ్మడానికి సిద్ధంగా లేని జనం. మీడియా లోకం…నేతల చేతుల్లో లేని రాజకీయం! వారం రోజుల వ్యవధిలో ఈటెల రాజేందర్‌ పేరు మీడియాలో నానుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏకంగా ఒకే రోజు ఈటెల పేరు 18సార్లు ప్రస్తావించారు. ఈటెల ఏది కోరితే అది చేయమన్నాడు. ఈటెల మూలంగానే హస్టళ్లలో సన్న బియ్యం పడుతున్నట్లు చెప్పాడు. ఇప్పుడు కూడా ఈటెల సూచనలు, సలహాలు తీసుకొమ్మన్నాడు. ఇదే సమయంలో బిఆర్‌ఎస్‌ సభ్యలు ఈటెల నుద్దేశించి గర్‌ వాపసీ అంటూ బల్లలు చర్చారు. ఈటెలను అయోమయంలో పడేశారు… అంతకు ముందు బడ్జెట్‌ మీద క్లారిఫికేషన్ల సమయంలో మంత్రి హరీష్‌ రావు ..అన్న…రాజేందర్‌..ఎక్కడున్నా మావాడే…అన్నాడు…మా దగ్గర వున్నప్పుడు మంచిగుండె అని ప్రకటించారు. అదేదో సినిమాలో ముందు సీటుకు, వెనుక సీటుకు దూరం తగ్గదన్నట్లు…మా మధ్య దూరం లేదన్నాడు. అటు బిజేపి ని, ఇటు ఈటెలకు మాట లేకుండా చేశాడు…అంతకుముందు రోజు మంత్రి కేటిఆర్‌ ఏకంగా ఈటెల తో ముచ్చట్లే పెట్టేశాడు…బిజేపిలో కుంపటి రాజేశాడు…ఆ సెగ బిజేపికో…ఈటెలకో అర్థం కాకుండా చేశాడు…ఒక్కసారిగా ఈటెల డైలమాలో పడ్డాడు…ఇప్పుడు ఈటెల ఏది చెప్పినా ఉన్న ఫలంగా ఎవరూ నమ్మకుండా చేసేశారు…అదీ బిఆర్‌ఎస్‌ రాజకీయం అని మరో సారి రుజువు చేశారు…తాంబూలాలు ఎవరివో…ఆ తర్వాత తతంగం ఎవరిదో…కాలమే చెప్పాలి.

మాటపాయే…మూటపాయే! పనికాకపాయే! కొలువు రాకపాయే!!

`ఆశగా ఎదురుచూడుడు తప్ప కొలువులింకారాకపాయే!

`అదుగో వచ్చే…ఇదిగో వచ్చే అనే ఆశలే మిగలవట్టే?

`బతుకు భారం కావట్టే.

`కుటుంబ పోషణ గడవకపోవట్టే…

`కాలం కరిగిపోవట్టే…కన్నీళ్లు ఇంకిపోవట్టే…

`ఎవరికీ చెప్పుకోలేక తెల్లందాక కంటికి నిద్రరాకపోవట్టే…

`ఆరోగ్యాలు కరాబుగావట్టే…

`కనికరించి పుణ్యం కట్టుకుంటారని ఎదురుచూసి కళ్లు కాయలు కావట్టే.

`ఎదురుచూపులు మిగలవట్టే!

`మంత్రి కేటిఆర్‌ దాకా సంగతి చేరకపోవట్టే...

`అంతగనం మంత్రి కేటిఆర్‌ చెప్పినా కొలువులు రాకపాయే!

`దుఃఖమింకా తీరదాయే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చెట్టు , పుట్టకు మొక్కినా ఫలితముండేదేమో! నాయకులను నమ్ముకొని ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నారు..కనిపించిన నాయకులకల్లా దండాలు పెట్టారు..కాళ్లు మొక్కారు…కన్నీళ్లు పెట్టుకున్నారు…వీధిన పడ్డామని వేడుకున్నారు…ఆదుకొమ్మని ప్రాదేయపడ్డారు…కడుపుల్లో తలకాయపెట్టి కనికరించమన్నారు…దారి చూపమన్నారు…మీ పేరు చెప్పుకొని బతుకుతామని కాళ్లా, వేళ్లా పడ్డారు…అందరూ మాటిచ్చారు…మేమున్నామన్నారు…భరోసా ఇచ్చారు…మాటిస్తున్నాం కొలువులొచ్చినట్లే అని చెప్పారు…అందులో కొందరు మూటెంతిస్తారని అడిగారు…ఊరికే సాయమెందుకు చేయాలన్న వాళ్లు వున్నారు…పని చేసిపెడితే మాకేంటని ముఖం మీదే అడిగిన వాళ్లున్నారు…చులకన చేసినవాళ్లున్నారు..చీదరించుకున్న వాళ్లున్నారు… కొలువులు ఇప్పిస్తామని చెప్పి మూటలు తీసుకున్న వాళ్లు వున్నారు…ఏళ్లుగా తిప్పుకుంటాన్నారు…మాటిచ్చిన వాళ్లు మాట తప్పారంటే ఏమో! అనుకోవచ్చు…మూట తీసుకున్న వాళ్లైనా మాట నిలుపుకోవాలి కదా! అందరూ చేతులెత్తేశారు…

   వాళ్లు అభాగ్యులో…నిర్భాగ్యులో అర్థం కాని అయోమయ పరిస్థితి. 

ఎవరైనా కొలువుల కోసం ఎదురుచూసే వాళ్లను చూస్తాం…కానీ వీళ్లు, ఓ పదేళ్లు కొలువులు చేసి పొగొట్టుకోవడం చూస్తున్నాం…కొలువులంటే ప్రమోషన్లు, డిమోషన్లే కాదు తప్పు చేసి ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. కానీ వీళ్ల కొలువులు పోవడానికి వీళ్లు కారణం కాదు…ఎవరో చేసిన తప్పుకు వీళ్లు బలయ్యారు….ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే తప్పు చేసిన వాళ్లంతా కొలువుల్లో వున్నారు…సంతోషంగా జీతాలు తీసుకుంటున్నారు…కానీ ఏ తప్పు చేయని గృహ నిర్మాణ శాఖలో గతంలో పని చేసిన ఈ ఒప్పంద ఉద్యోగులు మాత్రం కొలువులు పోగొట్టుకున్నారు…వీధిన పడ్డారు…అప్పటి నుంచి తిప్పలు పడుతున్నారు… ఆశగా ఎదురుచూడుడు తప్ప కొలువులింకారాకపాయే! అని మధనపడుతున్నారు. నిత్య నరకం అనుభవిస్తున్నారు. 

అదుగో వచ్చే…ఇదిగో వచ్చే అనే ఆశలే మిగలవట్టే? 

బతుకు భారం కావట్టే. కుటుంబ పోషణ గడవకపోవట్టే…కాలం కరిగిపోవట్టే…కన్నీళ్లు ఇంకిపోవట్టే… ఎవరికీ చెప్పుకోలేక తెల్లందాక కంటికి నిద్రరాకపోవట్టే…ఆరోగ్యాలు కరాబుగావట్టే…కనికరించి పుణ్యం కట్టుకుంటారని ఎదురుచూసి కళ్లు కాయలు కావట్టే. ఎదురుచూపులు మిగలవట్టే! ఒకరా! ఇద్దరా…ఎంత మంది నేతలున్నారో అంత మందినీ కలిశారు…మాట తీసుకున్నారు…కొలువిప్పియ్యమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 

సాక్ష్యాత్తు మంత్రి కేటిఆర్‌ గృహ నిర్మాణ శాఖలో తొలగింపబడిన ఒప్పంద ఉద్యోగులకు తిరిగి ఉపాధి చూపించాలని చెప్పారు. వరంగల్‌ జిల్లా కు చెందిన నేతలను నమ్మి నేను మాట ఇస్తున్నాను…అని ప్రకటించారు. వారికి ఇచ్చిన హామీ వృధా కావొద్దని మరీ నొక్కి చెప్పారు. అధికారులు స్పందించారు. 51 మందికి సంబంధించి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ వరంగల్‌ లో కొలువుల ఏర్పాటు కూడా జరిగింది. అందుకు అవసరమైన ప్రొసెసింగ్స్‌ కూడా పూర్తి చేశారు. మున్సిపల్‌ సమావేశంలో అందుకు తగిన నిర్ణయం తీసుకున్నారు. తీర్మానం కూడా చేశారు. ఒకసారి కాదు, రెండు సార్లు ఆ తంతు పూర్తి చేశారు. ఆ 51 మందిలో ఎవరు ఏఏ పనులను చేయగలరు? గతంలో గృహ నిర్మాణ శాఖలో వారు చేసిన పనిని బట్టి, ఏ పని అప్పగించాలన్నది కూడా నిర్ణయం చేశారు. అయినా వారికి ఉద్యోగాలు ఇంత వరకు రాలేదు…ఈ విషయం ఇప్పటి దాకా మళ్ళీ నాయకులు కేటిఆర్‌ కు వరకు తీసుకుపోలేదు… మంత్రి కేటిఆర్‌ చెప్పినా ఇంత వరకు నాయకులు వీరి జీవితాలను ఒక దారికి తీసుకురాలేదు…అంతగనం మంత్రి కేటిఆర్‌ చెప్పినా కొలువులు రాకపాయే! వారి దుఃఖమింకా తీరదాయే!

  కొలువులు పోయిన వారిలో ఎక్కువ మంది బడుగులే…

వాళ్లకు అండగా వుంటాలని ఇంత కాలం మభ్యపెట్టి కాలయాపన చేసింది బడుగు నేతలే…సమయం దొరికితే బడుగులకు జరిగే అన్యాయం గురించి గంటలు గంటలు చెప్పేవారే….వారికి రాజకీయంగా పదవుల పందేరమప్పుడు మాత్రమే వారికి బడుగు నేతలని గుర్తుకొస్తుంది…అదే సామాన్యులు పనుల కోసం నాయకుల వెంట పడుతున్నా, వారి కోసం పడిగాపులు పడుతున్నా బడుగు నేతలకు కనిపించరు. వారి ఆర్తనాదాలు వినిపించవు. ఇక వీరి విషయంలో వరంగల్‌ జిల్లాలో ఇప్పటికీ పెద్ద నాయకుడుగా పేరున్న నేత సాయం చేస్తానని చేతులెత్తేశాడు…ఇక ఆయన దారిలోనే మిగతా బడుగు నేతలు వ్యవహరించారు. ఇక మరో పేరు మోసిన నేత ఏకంగా సాయపడతానని, కొలువులు ఇప్పిస్తానని చెప్పి కొంత ముట్టజెప్పించుకున్నాడు. కానీ ఇంత వరకు ఆయన కొలువులు ఇప్పించలేదు. దాంతో తామిచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వమని అడిగారు…అందుకు సదరు పెద్ద నాయకుడు చెక్కు ఇవ్వడం కూడా జరిగింది అంటున్నారు. కొలువులు పోయి, జీవితాలు రోడ్డున పడ్డ వారిని ఆదుకోవాల్సింది పోయి, వారు ఇచ్చేదానికి పెద్ద నాయకులు ఆశపడ్డారు. అయినా వారికి న్యాయం చేశారా? అంటే అదీ లేదు…పైగా సదరు నేత పిఏ…చేయాల్సింత ప్రయత్నం చేశాము…తిరిగాల్సినంత తిరిగాము…డబ్బు రిటన్‌ ఇయ్యమంటే ఎలా? అని రివర్స్‌ ప్రశ్నించినట్లు తెలిసింది…ఆ పిఏ అలా మాట్లాడడంతో అవాక్కవడం వీరి వంతైంది…పెనం మీద నుంచి కాపాడమంటే పొయ్యిలోకి తోసేశారు…ఈ విధంగా చేయడం వల్ల పార్టీ పరువు పోదా? పదవులు కావాలి. అధికారం కావాలి. కానీ పార్టీకి పనికొచ్చే పనులు చేయడం మాత్రం నాయకులకు రాదు…నాయకుల తీరు ఇలా తయారైంది. కనీసం రాజకీయ ప్రయోజనం కోసం నాయకులు ఆలోచించినా బాగుండేదీ…గృహా నిర్మాణ శాఖలో ఒకప్పుడు పని చేసిన ఈ ఉద్యోగులకు ప్రజలతో మంచి సంబంధాలు వున్నాయి. ఇప్పటికీ లబ్ధి దారులు వీరు చెప్పిన మాట వింటారు. అలా గ్రామాలలో కొన్ని వందల కుటుంబాలను వీరు ప్రభావితం చేసే అవకాశం వున్న వాళ్లు…ఇలాంటి వారికి పునరావాసం కింద వారు అడిగిన కొలువులు ఇప్పించి, రాజకీయంగా వారిని వాడుకునే అవకాశం వుంది. అయినా నాయకులకు ఆ శ్రద్ధ లేదు…పార్టీ మీద పట్టింపు లేదు…పైగా పార్టీ పరువు తీస్తున్నారు. ఇప్పటికీ మించి పోలేదు…ఏది ఏమైనా వారి ఆశలన్నీ మంత్రి కేటిఆర్‌ మీదనే….తమకు కేటిఆర్‌ ఎప్పటికైనా న్యాయం చేస్తారన్న నమ్మకంతో వున్నారు…తాము నమ్మిన నాయకులు తమ సమస్యలు మంత్రి కేటిఆర్‌ దృష్టికి తీసుకెళ్తున్నారని అనుకున్నారు. నాయకులు ఈ అభాగ్యులకు చెప్పేదొకటి, చేస్తున్నదొకటి అని అర్థమైంది…ఇక మంత్రి కేటిఆర్‌ దృష్టి పెడితే తప్ప వీరి జీవితాలు ఓ దరికి చేరవు.

నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న‌ 348 వాహనాలను సీజ్

పోలీస్ కమిషరేట్ వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్

నేటిధాత్రి హ‌నుమకొండ క్రైమ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న‌ 348 వాహనాలను సీజ్ చేసిన సదరు వాహన యజమానులపై చీటింగ్ కేసులను నమోదు చేసినట్లుగా వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ మ‌ధుసూద‌న్‌ వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ట్రై సిటీ పరిధితో పాటు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ లేనివి, మార్ఫింగ్ చేసినవి, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, నంబర్ ప్లేట్లకు మాస్కులు పెట్టిన వాహనాలను గుర్తించి వాహన యజమానులపై చీటింగ్ కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేర‌కు గత నెల మొదటి తారీకు నుండి ఇప్పటి వరంగల్ ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా రోజువారి తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 348 వాహనాలు సీజ్ చేయగా ఇందులో కార్లు 4, ఆటోలు ఒకటి, ద్విచక్రవాహనాలు 343, ఈ సీజ్‌ వాహనాల్లో వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 93, హ‌న్మ‌కొండ‌ 126, కాజీపేట 72 వాహనాలు ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. అప్పగించిన వాహన యజమానులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులను నమోదు చేసిన‌ట్లు ట్రాఫిక్ ఏసీపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వరంగల్, కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్లు బాబు లాల్, రామకృష్ణ వరంగల్ ట్రాఫిక్ ఎస్ఐలు రాజబాబు, డేవిడ్, మిల్స్ కాలనీ ఎస్ఐ సాంబయ్య పాల్గొన్నారు.

అనుమతి లేని ఇసుక ట్రాక్టర్ సీజ్ చేసిన ఎస్సై అభిలాష్:

బోయినిపల్లి:నేటిధాత్రి 

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం గుండన్న పల్లి శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేసినట్లు తెలిపారు. వేములవాడ నుండి గుండనపల్లి వైపు అక్రమ ఇసుక తరలిస్తుండగా గుండన్నపల్లి గ్రామ సమీపం లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక ను తరలిస్తుండగా అనుమానం వచ్చి ట్రాక్టర్ ను అపగా డ్రైవర్ పరారు కావడంతో ఇసుక ట్రాక్టర్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ ఐ అభిలాష్ తెలిపారు.

నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించిన పోలీసులు

 చందుర్తి:నేటిధాత్రి చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన రాణవేణి గణేష్ హత్య కేసులో నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు పోలీసులు… రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రాణవేణి గణేష్ ను రెండు రోజుల క్రితం నర్సింగాపూర్ లో బంధువుల ఇంట్లో కారం పొడి చల్లి గొడ్డలితో కత్తితో అతికిరతకంగా నరికి చంపిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకొని వేములవాడ డి.ఎస్.పి నాగేంద్ర చారి ఎదుట హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు… మృతి చెందిన గణేష్ భార్య స్వప్నను ప్రేమ వివాహం చేసుకొని మానసికంగా శారీరికంగా చిత్రహింసలు పెట్టి వేధించడంతో పాటు మరో కొంతమంది మహిళలతో అక్రమ సంబంధమే గణేష్ హత్యకు దారితీసిందని డీఎస్పీ నాగేంద్ర చారి వివరాలను వెల్లడించారు.. హత్య జరిగిన రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించడంలో చందుర్తి సీఐ కిరణ్ కుమార్ ను డీఎస్పీ అభినందించారు… డిఎస్పి నాగేంద్ర చారి మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పమన్నారు ..

కొదురుపాక ఎక్స్ రోడ్ వద్ద కోనేరుగా నిండిన మూర్కినీరు

పట్టించుకోని గ్రామ పంచాయతీ కార్యదర్శి అంజలి

బోయినిపల్లి:నేటిధాత్రి 

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో ఎక్స్ రోడ్ వద్ద బస్టాండుకు ఆనుకొని విలాసాగర్ మార్గంలో గల పదో నంబరు వార్డు నుండి మురికి కాలువ అస్తవ్యస్తంగా కొనసాగుతుంది. దాదాపు 130 మీటర్ల వరకు మురికి కాలువ లేనందున నీరు రోడ్డు ప్రక్కల నుండి మురికి నీరు పారుతుంది.కొదురుపాక ఎక్స్ రోడ్ బస్టాండ్ కు ఆనుకొని పెద్ద కోనేరుగా మారి, చెత్తాచెదారం కూడుకొని, దుర్వాసన వెదజల్లుతూ, దోమలతో నిండి ఉన్నది.గ్రామస్తులు బాధలు చెప్పుకోలేకపోతున్నారు. ఈ సమస్యను తీర్చాలని గ్రామ ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు. మురికి కాలువ గురించి గ్రామ పంచాయతీ కార్యదర్శి అంజలిని వివరణ కోరగా సంవత్సరం నుండి ఆర్ అండ్ బి వాళ్లు మాకు అనుమతి ఇవ్వట్లేదని అక్కడి నుండి చేతులు దులుపుకొని వెళ్లిపోయారు.

డి ఎస్ ఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ.

డి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు నగునూరి హరీష్ కుమార్

వేములవాడ :నేటిధాత్రి 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు డి ఎస్ ఎఫ్ డిప్లొమా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ అధ్వర్యంలో లో డి ఎస్ ఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు నగునూరి హరీష్ కుమార్ మాట్లాడుతూ…, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి డి ఎస్ ఎఫ్ ముందు నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, కళాశాల యాజమన్యం, ,డి ఎస్ ఎఫ్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నగునూరి అభినయ , రాపెల్లి లావణ్య, శ్రావణ, శ్రావణీ,డి ఎస్ ఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ప్రజాపద్దుపై ఈకలు పీకొద్దు.

 

`బడ్జెట్‌ పై ప్రతిపక్షాల రాద్దాంతాన్ని తిప్పి కొడుతూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఎంపి. రవిచంద్ర ఘాటు వ్యాఖ్యలు…

`దేశంలోనే ఇంతటి సంక్షేమ బడ్జెట్‌ ఎక్కడా కనిపించదు.

` కేంద్ర ప్రభుత్వం బిసి సంక్షేమానికి కేటాయింపు కన్న తెలంగాణ ఎన్నో రెట్లు ఎక్కువ.

` ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ. 21 వేల కోట్లు ఏ రాష్ట్రంలోనైనా వుందా?

`వ్యవసాయానికి రూ. 26 వేల కోట్లు ఏ రాష్ట్రమైనా కేటాయించిందా!

` అసలు తెలంగాణలో వున్న సంక్షేమ పథకాలు, అమలు ఎక్కడైనా వున్నాయా?

`తెలంగాణ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వము అన్నది విన్నాము…

` తెలంగాణ గోస చూశాము….

`ఇప్పుడు దేశంలోనే తెలంగాణ గొప్ప రాష్ట్రంగా కీర్తింపబడుతుంటే చూస్తున్నాము…

` ప్రతిపక్షాలు కావాలని రాద్దాంతం చేయడం తప్ప, పసలేని వాదన చేస్తున్నాయి.

`ఎంత సేపు మత రాజకీయం తప్ప సంక్షేమం బిజేపికి పట్టదు.

` ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం కోరుకోవడం తప్ప కాంగ్రెస్‌ కు అభివృద్ధి వద్దు.

` ఉమ్మడి రాష్ట్రంలో నోరు మెదపలేని నాయకులందరూ ఇప్పుడు నీతులు చెప్పేవారే!

`ఎరువుల దగ్గర కూడా రైతులకు లాఠీ దెబ్బలు చూపించిన కాంగ్రెస్‌ కూడా మాట్లాడడం విడ్డూరం.

`తెలంగాణలో కరంటు గోస గురించి ఒక్కనాడు అడగని కాంగ్రెస్‌ నేతలు కరంటు కోతల గురించి చెప్పడం దెయ్యాలు వేధాలు వల్లించడమే.

`రాజకీయం తప్ప, ప్రజా సంక్షేమం పట్టని ప్రతిపక్షాలకు తెలంగాణలో చోటు లేదు.

`దేశంలో కూడా ఆ పార్టీలు ఈసారి మరింత దిగజారక తప్పదు.

`దేశమంతా బిఆర్‌ఎస్‌ వైపు చూస్తోంది…

`తెలంగాణ పథకాలపై దేశమంతా చర్చ సాగుతోంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒకనాడు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదంటూ, ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఒక్క చిత్తూరు జిల్లాకు రూ.8వేల కోట్లను కొల్లగొట్టుకుపోయిన సమయంలో నోరు మెదపలేని నాయకులు నేడు తెలంగాణ బడ్జెట్‌పై పెదవి విరుపులు విరస్తుంటే వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా, గ్రామాల్లో ఎవరిని కదలించినా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మా పెద్ద కొడుకంటూ కీర్తిస్తున్నారు. ఆసరా వంటి పథకంతో రూ.2000 ఇస్తున్నాడు. పేదింటి ఆడపిల్ల పెల్లికి లక్ష రూపాయలు ఇస్తున్నాడు. అన్నార్ధులకు ఉచితంగా అన్నపూర్ణ క్యాంటిన్‌ల ద్వారా అన్నం పెడుతున్నాడు. సాగుకు రైతు బంధు ఇస్తున్నాడు. సమాజంలో దళితులు కూడా ఆర్ధికంగా ఎదిగితేనే సమ సమాజ నిర్మాణం జరుగుతుందని తెలిసి, వారిని ఉన్నత స్ధాయికి తీసుకొచ్చేందుకు దళిత బంధు అమలు చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు…వాటి అమలుకు గొప్పగా బడ్జెట్‌ రూపకల్పన చేసి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. అలాంటి తరుణంలో కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలు తమ ధోరణి ఇంతే…తమ దారి ఇదే…తమకు మంచి కనిపిందన్న దోరణిని ప్రదర్శిండచాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా తప్పుపట్టాడు. రాష్ట్ర బడ్జెట్‌ మీద చిల్లర వ్యాఖ్యలు చేసిన వారిని తూర్పార పడుతూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో మాట్లాడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు…అదే సందర్భంలో బడ్జెట్‌పై తన సునిశితమైన విశ్లేషణ చేశారు.  

 దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి సంక్షేమ బడ్జెట్‌ రూపకల్పన కనిపించదు. 

దేశం కోసం, ధర్మం కోసం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే బిజేపి పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క చోటనైనా తెలంగాణ బడ్జెట్‌ కనిపిస్తుందా? కనీసం తెలంగాణ సంక్షేమ పద్దు లాంటిది ఒక్కచోటైనా వుంందా? మాటలు చెప్పడం గొప్ప కాదు..ప్రజలకు సేవ చేయడంలోనే వుంది అసలైన గొప్ప. అసలు తెలంగాణ బడ్జెట్‌ ఆదర్శంగా, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిన అవసరం వుంది. కాని భూతద్దం పెట్టి వెతికినా ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాన పథకాలు, ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కేటాయింపులు కనిపించవు. తెలంగాణ రాష్ట్రం సాధించి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యి ఎనమిది సంవత్సరాలుగా అమలు చేస్తున్న అనేక పథకాలలో సాధించిన విజయాలు అన్ని రాష్ట్రాలు చూస్తున్నవే…కాని ఏ ఒక్క రాష్ట్రంలోనూ తెలంగాణలో ప్రభుత్వానికి ప్రజలపై వున్న చిత్తశుద్ది మరెక్కడా కనిపించదు. కనీసం కేంద్ర ప్రభుత్వమైనా తెలంగాణలో అమలు జరుగుతున్న పధకాలను చూసైనా నేర్చుకోండని చెప్పే ఆలోచన చేయదు. ఆదర్శవంతమైన, అభివృద్ధి కరమైన నిర్మాణం సాగాలని బిజేపికి ఏనాడు లేదు. ఎంత సేపు మత రాజకీయాలు చేయాలి. ప్రజలను రెచ్చగొట్టాలి. రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఇంతకు మంచి ఎక్కడా ప్రజల మీద ప్రేమ కనిపించదు. ప్రజలు అధికారం ఇచ్చారంటే వారి రుణం తీర్చుకునేందుకు ప్రభుత్వాలు ఏలా పని చేయాలన్నదానిని ముఖ్యమంత్రి కేసిఆర్‌ను చూసి నేర్చుకోవాల్సిన అసవరం వుంది. అది వదిలేసి తెలంగాణలో తాజా బడ్జెట్‌పై బిజేపి, కాంగ్రెస్‌నేతలు మాట్లాడే మాటలు మరీ విచిత్రంగా వున్నాయి. ఒక్కసారి రాష్ట్ర బడ్జెట్‌ను అవగాహన చేసుకున్న నేతలైతే అలా మాట్లాడరు. ఇలాంటి బడ్జెట్‌ రూపకల్పన, ప్రజా సేవను ఎవరైనా మెచ్చుకోవాల్సిందే… కాని ప్రతిపక్షాలకు నోరు రాదు…మంచిని ఒప్పుకోరు…

బడ్జెట్‌ పద్దులను ఓసారి పరిశీలిస్తే 

వ్యవసాయ శాఖకు రూ. 26,831 కోట్లు, పాడి, మత్స్య శాఖకు రూ.2,071 కోట్లు, బిసి. సంక్షేమం కోసం రూ. 2071 కోట్లు, విద్యుత్‌ రంగం రూ.12,727 కోట్లు, అటవీ, పర్యావరణ శాఖకు రూ.1471 కోట్లు, ఆర్ధికశాఖకు రూ.49,749 కోట్లు, ఆహారం, పౌరసరఫరఫరాలశాఖకు రూ. 3117 కోట్లు, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రూ. 1491 కోట్లు, వైద్యశాఖకు రూ.12,161 కోట్లు, విద్యారంగానికి రూ. 19,093 కోట్లు, హోంశాఖకు రూ. 9599 కోట్లు, పరిశ్రమలు ఈ కామర్స్‌ రూ. 4037కోట్లు, ఐటిశాఖకు రూ. 366 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ. 26,885 కోట్లు, కార్మిక శాఖకు రూ. 542 కోట్లు, న్యాయశాఖకు రూ. 1665 కోట్లు, లెజిస్టేచర్‌ కోసం రూ. 168 కోట్లు, మైనార్టీల సంక్షేమం కోసం రూ. 2200 కోట్లు, మున్సిపల్‌ శాఖకు రూ. 11372 కోట్లు, పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధికోసం రూ. 31 428 కోట్లు, ప్రణాళిక శాఖకు రూ. 11495 కోట్లు, రెవిన్యూ కోసం రూ. 3560 కోట్లు, షెడ్యూల్‌ కులాల సంక్షేమం కోసం రూ. 21022 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు రూ. 22260 కోట్లు, గిరిజన సంక్షేమం కోసం రూ. 3965 కోట్లు, సీనిjర్‌ సిటిజన్స్‌, వుమెన్స్‌ అండ్‌ చిల్డ్రన్‌ వెల్ఫేర్‌ కోసంరూ. 2131 కోట్లు, సాంస్కృతిక శాఖకు రూ. 1117 కోట్ల కేటాయింపులతో అన్ని వర్గాలకు, అన్ని శాఖలకు సముచిత స్ధానం కల్పిస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను హర్షించాల్సిన అవసరం అందరికీ వుంది. 

తెలంగాణ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో బిసి. సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో కనీసం నాలుగోవంతు కూడా కేంద్ర ప్రభుత్వం యూనియన్‌ బడ్జెట్‌లో ప్రవేశపెట్టలేకపోయారంటే బిజేపి చిత్త శుద్ది ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

 దేశంలోని మొత్తం బిసిల అభ్యున్నతి కోసం రూ. 2వేల కోట్లు ఎక్కడ, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.8వేల కోట్లు ఎక్కడ…ఈ మాత్రం కూడా బిజేపి నేతలకు సోయి లేకుండాపోయింది. తెలంగాణలో ఎస్సీల అభ్యున్నతితోపాటు, అమలుచేయాల్సి వున్న దళిత బంధు అమలు కోసం రూ. 21వేల కోట్లుకుపైగా కేటాయింపులు చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప కేటాయింపులు బిజేపికి కనిపించడం లేదా…కాంగ్రెస్‌ నేతలకు మాటలు రావడంలేదా? కాని కోడు గుడ్డు మీద ఈకలు పీకడం మాత్రం వస్తాయి. దళిత ఓటు బ్యాంకు మాదంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌పార్టీ ఏనాడైనా ఇలాంటి కేటాయింపులు జరిపిన సందర్భం వుందా? కనీసం కేంద్రంలోనైనా చేశారా? కాని తెలంగాణ ప్రభుత్వం ఏకంగా ఒక్క ఏడాది కోసం రూ.21వేల కోట్లు కేటాయింపు అన్నది ఒక రికార్డు. బడ్జెట్‌ సందర్భంగా ఈటెల రాజేందర్‌ మాటలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. అందుకు మంత్రి హరీష్‌రావు ఇచ్చిన సమాధానంతో బిజేపి నేతలకు దిమ్మతిరిగిపోయింది. ప్రజలకు తామేం చేస్తామో చెప్పే శక్తి , దమ్ము బిజేపి నేతలకు లేదు. అదే దారిలో కాంగ్రెస్‌ నేతల పరిస్దితి వుంది. ప్రజల సొమ్ముతో నిర్మాణం చేసిన, ముఖ్యమంత్రి అధికారక నివాసమైన ప్రగతి భవన్‌ను పేల్చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నీతి మాలిన మాట్లాడడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం అసెంబ్లీలో జై తెలంగాణ అనేందుకు కూడ నోరు రాని కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండడం విడ్దూరం. ఇక రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్‌పై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ , బిజేపి నేతలకు వుందా? దేశంలో ఎక్కడైనా బిజేపి పాలిత రాష్ట్రాలలో అమలౌతుందా? కాంగ్రెస్‌ ఎక్కడైనా అమలు చేస్తోందా? ఇదిలా వుంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా అప్పుడు తెలంగాణ ప్రాంతంలో రైతులు పడ్డ కరంట కష్టాలు కాంగ్రెస్‌నేతలు మర్చిపోయినా, ప్రజలు మర్చిపోలేదు. వాళ్లు కూడా కరంటు విషయంలో నీతులు వల్లించడం అంటే దెయ్యాలు వేధాలు వల్లించినట్లే వుంటుంది. రైతులకు సరిపడ ఎరువులు కూడా సక్రమంగా అందించలేక, రైతులపై కర్కషంగా లాఠీలు రaులిపించిన ఘన చరిత్ర కాంగ్రెస్‌ది. కాని నేడు తామేదో రైతులను ఉద్దరించినట్లు చెప్పుకుంటుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికైనా బిజేపి, కాంగ్రెస్‌పార్టీలు ప్రజలకు మరింత మేలు జరిగేలా సూచనలు, సలహాలు ఎలాగూ ఇవ్వలేరు. అంతటి ఆలోచనలు చేయలేరు. కనీసం ఎంతో గొప్పగా అమలౌతున్న తెలంగాణ సంక్షేమాన్నైనా చూసి నేర్చుకోవడం మానేసి, తప్పులు వెతుతామన్న ధోరణిని ప్రజలు క్షమించరు…ఇప్పటికైనా మారండి…ప్రభుత్వం చేసే మంచిపనులకు అడ్డు తగిలి, ప్రజలకు నష్టం జరిగే రాజకీయాలు చేయకండి!!

ఆడబిడ్డలకు ‘కల్యాణ లక్ష్మి’ ఒక వరం: ఎమ్మెల్యే చల్లా

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చెంసిన ఎమ్మెల్యే చల్లా

ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఒక వరమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన *86 మంది లబ్దిదారులకు 86,09,976 రూపాయలు* విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను హనుమకొండలోని వారి నివాసంలో అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పేదింటి ఆడబిడ్డల పెండ్లీలు చేయడం కోసం ఆ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తిరుగుతూ చూసిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకంతో ఎంతో మంది పేదలు పెండ్లీలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పాటు రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైనా ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదన్నారు. గ్రామాల్లో అసత్య ప్రచారం చేస్తున్న ప్రతి పక్ష నాయకులకు కూడా ఈ పథకాలు అందజేస్తున్నామన్నారు.

లబ్ధిదారుల వివరాలు: గీసుగొండ మండలం(45) -45,05,220/-

 

సంగెం(41) -41,04,756/-.

 

ఈ కార్యక్రమంలో మండలాల ముఖ్య నాయకులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఆట…ఆడుకుంటున్నారు!

అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట లేకుండా చేస్తున్న కేటిఆర్‌, హరీష్‌ రావుపై ప్రశంసలు కురిపిస్తూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి చిట్‌ చాట్‌…

`ప్రతిపక్షాలు నోరుమెదపలేకపోతున్నాయి.

`ప్రతిపక్షాలకు ప్రశ్నలు కరువౌతున్నాయి.

`అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

`మంత్రులు కేటిఆర్‌, హరీష్‌ రావు ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు.

`ప్రతిపక్షాలు గుక్కతిప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు.

`ఇద్దరూ ఇద్దరే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.

`సందర్భోచిత సమాధానాలతో ప్రతిపక్షాలకు వాయిస్‌ లేకుండా చేస్తున్నారు.

`ప్రతిపక్షాలు చేసే అనవసర రాద్దాంతాలను అసందర్భ ప్రేలాపనలుగా చిత్రీకరించి ఇరుకునపెట్టేస్తున్నారు.

`ఏ మాట్లాడాలో అర్థం కాక బిజేపి సభ్యులు కార్యాలయ కేటాంపు గురించి ప్రస్తావన తెచ్చారు.

`గవర్నర్‌ ప్రసంగానికి తీర్మానంలో కేటిఆర్‌ ప్రతిపక్షాలను కిమ్మనకుండా చేశారు.

`తనదైన శైలిలో వన్‌ మాన్‌ షో చేశారు.

` రఘునందన్‌ మ్యానిఫెస్టో చదివి నోరుమూయించాడు.

`అక్బరుద్దీన్‌ పై అసహనంపై తనదైన పంచులు విసిరారు.

`బడ్జెట్‌ మీద చర్చలో హరీష్‌ రావు ప్రతిపక్షాలకు చక్కలు చూపించారు.

` బిజేపి నుద్దేశించి మన్‌ కి బాత్‌ మీది, జన్‌ కి బాత్‌ మాది అంటూ చురకలంటించాడు.

`ఈటెల రాజేందర్‌ మాట్లాడిన మాటలు అసెంబ్లీ లో వినిపించి నోరు మూయించారు.

` ఈటెల ఎక్కడున్నా మా వాడే అని ఇరుకున పెట్టారు.

`దేశం నలు దిక్కులు కోరుకుంటున్నది బిఆర్‌ఎస్‌ సర్కార్‌ అని చెప్పి ఊపు నందించారు.

`మొత్తంగా ఇద్దరూ కలిసి అసెంబ్లీ చరిత్రలో కొత్త అధ్యాయం రచించారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రజలు తెలుసు…ప్రజల కష్టం తెలుసు…తెలంగాణ ప్రజలు పడిన గోస తెలుసు. ఉద్యమాలు తెలుసు..పోరాటాల రూపాలు తెలుసు. ప్రజలకు ఎలా చేరువవ్వాలో తెలుసు. ప్రజలతో ఎలా మమేకమౌవ్వాలో తెలుసు. ప్రజల మధ్య ఎలా మసలుకోవాలో తెలుసు. ప్రజలకు ఎలా దగ్గరవ్వాలో తెలుసు. ప్రజా సమస్యలు తెలుసు. వాటికి పరిష్కారం తెలుసు. ప్రజలు ఏంకోరుకుంటున్నారో తెలుసు. ప్రజలు ఏం చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయో తెలుసు. మొత్తంగా ప్రజల నాడి తెలుసు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలుసు. ప్రజల గుండెల్లో నిలిచిన వాళ్లు…ఇద్దరూ ఇద్దరే…ఒకరు మున్సిపల్‌శాఖ, ఐటి మంత్రి కేటిఆర్‌, ఆర్ధిక, వైద్య శాఖమంత్రి హరీష్‌రావు. ప్రజలకు ఎంతో చేరువైన నాయకులు. ప్రజల సంక్షేమం కోరుకునే నాయకులు. పాలనలో చాణక్యులు…రాజకీయాల్లో రాటుదేలిన వ్యూహకర్తలు..ప్రజా దీవెనలతో తిరుగులేని నాయకులుగా ఎదిగిన వాళ్లు…ఎదురులేని రాజకీయం చేయడంతో ప్రజల మద్దతు మెండుగా వున్న వాళ్లు…ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో బాగస్వాములు…బంగారు తెలంగాణ ఆవిష్కరణలో రెండు కళ్లు…! అని చెబుతూ ప్రజల్లో మంత్రులు కేటిఆర్‌, హరీష్‌రావుల సమర్ధవంతమైన నాయకత్వంపై నేటిధాత్రి ఎడిటర్‌ కటారాఘవేంద్రరావుతో ఎమెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చిట్‌ చాట్‌…

 సహజంగా అసెంబ్లీ సమావేశాలు అనగానే ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకొని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, ఎండగట్టడం, నిందించడం, ప్రభుత్వాల అసమర్థతను అసెంబ్లీ వేధికగా ఎండగట్టడం గతంలో చూశాం..

.కాని తెలంగాణ వచ్చాక, ప్రతిపక్షాలకు ప్రశ్నలు లేని పాలన సాగుతోంది.సంక్షేమం అమలు చేయబడుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఈ ఎనమిదేళ్ల కాలంలో వచ్చిన సంక్షేమ పథకాలు నభూతో నభవిష్యతిగా కొనసాగుతున్నాయి. సంక్షేమ పాలనకు కేరాప్‌ అడ్రస్‌గా తెలంగాణ నిలుస్తోంది. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ రూపంలో ఇన్ని సంక్షేమ పధకాలు అమలు చేయొచ్చన్న ఆలోచన గతంలో ఏ పాలకులు చేసింది లేదు. దేశంలో ఎక్కడా లేవు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ మనసులోనుంచి పుట్టిన అనేక మానసపుత్రికలైన పథకాలు దేశంలో అనేక రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి. ఒకటా, రెండా ప్రపంచంలో ఇన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అలాంటి తెలంగాణ ప్రభుత్వంలో వున్న ఇద్దరు సమర్ధవంతమైన నాయకుల నేతృత్వంలో కూడా పాలన బంగారు తెలంగాణ వైపు సాగుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలు, పధకాల సృష్టితో మొదలైతే వాటి అమలులో ప్రత్యేక శ్రద్ద కనబర్చి అమలు చేస్తున్న నాయకుల్లో ఈ ఇద్దరు ముందు వరసలో వున్నారు. ఇద్దరూ ఇద్దరే…తెలంగాణ ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయగల నాయకులు ఈ ఇద్దరూ…ఈ బడ్జెట్‌ సమావేశాలలో వారి నాయకత్వ పటిమ చూసి, తెలంగాణ అబ్బుర పడుతోందంటే అతిశయోక్తి కాదు. 

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై చర్చ జరిగిన నాడు మంత్రి కేటిఆర్‌ ఒక్కడే అసెంబ్లీలో వన్‌మాన్‌ షో చేశారు.

ప్రతిపక్షాలతో చెడుగుడు ఆడుకున్నారు. ప్రతిపక నాయకులు మాట్లాడిన మాటలకు సమాధానాల్చిన సందర్భంలో కేటిఆర్‌ విశ్వరూపం చూడడం జరిగింది. ముందుగా ఎంఐఎం నాయకుడు అక్భరుద్దీన్‌ ఎంతో ఆవేశంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. కాని దాన్ని ఎంతో చాకచక్యంగా కేటిఆర్‌ ఎదుర్కొన్నారు. అక్భరుద్దీన్‌కు మరో మాట లేకుండా చేశాడు. ఇక బిజేపి ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రభుత్వం మీద ఎంతో విరుచుకుపడుతున్నానన్నట్లు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. దాంతో స్పందించిన కేటిఆర్‌ దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందన్‌ రావు ఇచ్చిన హామీల చిట్టా చదవి, అసెంబ్లీ సాక్షిగా ఆయన పరువు తీశారు. అసలు అలవి కాని హామీలు ఇచ్చిన రఘునందన్‌రావు ఒక్కటంటే ఒక్క పని చేశాడా? అని నిలదీశాడు..భబ్రాజ మానం భజగోవిందం… అంటూ ఎద్దేవా చేశాడు. దాంతో రఘునందన్‌ మ్యానిఫెస్టో ఇలా వుందా? అనేది ప్రపంచానికి తెలిసింది. ప్రతి ఇంటికి రెండు ఎడ్లు, తన నియోజకవర్గంలో వున్న యువతకు నిరుద్యో భృతి ఇలాంటివి తక్షణం అమలు చేస్తానని చెప్పారు. అవి ప్రభుత్వ సహాకారంతో జరగాల్సిన పనులు. కాని ఏ ఒక్క ఎమ్మెల్యే వ్యక్తిగతంగా తీర్చేవికాదు. కేవలం ఎన్నికలలో గెలిచేందుకు రఘునందన్‌ ఇచ్చిన అలవి కాని హమీలు. వాటిని చెప్పి బిజేపి నాయకుల పరువు తీశారు. ఇక ప్రధాని మోడీ దేవుడు…దేవుడు అంటూ కీర్తించడం ఏమిటన్నదానిపై అసెంబ్లీ సాక్షిగా బిజేపిని కేటిఆర్‌ ఆటాడుకున్నాడు. మోడీ పేదల దేవుడెలా అయ్యాడని నిలదీశాడు…సిలిండర్‌ ధర పెంచినందుకు దేవుడయ్యాడా? పెట్రోల్‌ రేట్లు పెంచి దేవుడయ్యాడా? తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వనందుకు అయ్యాడా? ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వనందుకు దేవుడయ్యాడా? కనీసం ఒక్క నర్సింగ్‌ కాలేజీ కూడ ఇవ్వకపోవడంతో దేవుడయ్యాడా? అంటూ బిజేపిని కేటిఆర్‌ తూర్పారపట్డారు. 

బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో మంత్రి హరీష్‌రావు ప్రతిపక్షాలకు చుక్కలు చూపించారు. 

అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగేలా చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ప్రతిపక్షాలను ఆటాడుకుంటున్నారు. ప్రతిపక్షాలను ఇద్దరూ కలిసి గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. ముఖ్యంగా బిజేపిని హరీష్‌రావు టార్గెట్‌ చేసి మాట్లాడిన తీరు, మాజీ మంత్రి ఈటలపై వేసిన పంచులతో సభలో నవ్వులు పూయించారు. తెలంగాణ అభివృద్దిని కవిత రూపలంలో వివరించి, ఆధ్యంతం ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్‌ లేవనెత్తిన అంశాలపై సభలో రసవత్తరమైన చర్చ దిశగా తీసుకెళ్లారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెబుతూ మంత్రి హరీష్‌రావు , హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. అసలు దళిత బంధు అమలయ్యేది కాదని ఎద్దేవా చేశారని విమర్శించారు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో ఈటెల రాజేందర్‌ చెప్పాలన్నారు. ఈటెల రాజేందర్‌ తమ వైపు వున్నప్పుడు బాగానే వున్నారని, బిజేపిలోకి వెళ్లి తనలో మార్పు తెచ్చుకున్నారని చురకలంటించారు. నాయకుడు పార్టీ మారినంత మాత్రాన మనసు మారడంలో అర్ధం లేదన్నారు. తన నోటితో తాను గతంలో ఈటెల రాజేందర్‌ మాట్లాడిన మాటలు అసెంబ్లీ సాక్షిగా వినిపించి ఈటెల పరవు తీసేశారు. ఎక్కడున్నా ఈటెల మా వాడే అంటూ, బిజేపిలో చేరి మన్‌కీ బాత్‌కు అలవాటు పడ్డాడని, జన్‌కీ బాత్‌ వినడం మర్చిపోయాడని అనడంతో సభలో నవ్వులు విరిసాయి. ఇక ఈటెల రాజేందర్‌ ఏం మాట్లాడాలో కూడా బైటకు వెళ్లి ఇప్పుడే ప్రిపేర్‌ అయి వచ్చిన సంగతి తెలుసంటూ నవ్వుకుంటూనే తీయాల్సిన పరువు తీశారు. దాంతో ఈటెలతోపాటు అందరూ నవ్వుకున్నారు. అయితే ఈ చర్చలో పాల్గొని అనవసరమైన విషయాలు తవ్వుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో! గాని ఈటెల రాజేందర్‌ బిజేపి సభాపక్ష కార్యాలయం గురించి సభలో చర్చించి, చర్చను పక్కదోవ పట్టించాలని చూశాడు. కాని దాన్ని కూడా మంత్రి హరీష్‌రావు తిప్పికొట్టి తనదైన శైలిలో అసెంబ్లీలో వన్‌మాన్‌ షో చేశాడు. ఇద్దరు నాయకులు వరుసగా అసెంబ్లీ వేధికగా ప్రతిపక్షాలను ఎండగట్టిన తీరు గతంలో ఎన్నడూ చూసింది లేదని సభ్యులు చర్చించుకున్నారు. ఇద్దరు నేతలు ప్రతిపక్షాలకు వాయిస్‌ లేకుండా చేయడంలో సఫలీకృతమయ్యారని, అదే సమయంలో ప్రభుత్వ పనితీరును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లారన్న చర్చ ప్రతిపక్షాలలో కూడా సాగుతోందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

నలుగురు కనబడగానే నాలుకకు శిగమొస్తదా?

`తొలి అడుగునాడే తొందరపాటు తప్పులు!

`తప్పుడు ప్రకటనలు…వివాదాస్పద వ్యాఖ్యలు!

`ప్రగతి భవన్‌ ప్రజల ఆస్తి…ఆ మాత్రం తెలియకుండా రాజకీయాలా?

`రాజకీయ నాయకులైతే ఏదైనా మాట్లాడొచ్చా!

`ఎవరైనా సామాన్యుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చట్టం ఊరుకునేదా?

`ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేయమని చెప్పేవారు నాయకులా?

`దిక్కుమాలిన రాజకీయాల కోసం అంతగా దిగజారాలా?

`ఇలాంటి వ్యాఖ్యల వల్లే యువత చెడిపోయేది?

`జీవితాలు ఆగం చేసుకునేది…?

`ఎర్రబెల్లి ఉద్యమకారుడు కాదు, సరే రేవంత్‌ రెడ్డి ఏమిటి?

`చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఉత్తరం రాయించింది మంత్రి దయాకర్‌ రావు.

`చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చింది ఎర్రబెల్లి.

` ఉద్యమకారులను బెదిరించేందుకు తుపాకీ పట్డుకొని పర్యటన చేసింది రేవంత్‌ రెడ్డి.

`సోనియా గాంధీని తిట్టిన తిట్టు తిట్డకుండా తిట్టింది రేవంత్‌ రెడ్డి.

`తెలంగాణ ఉద్యమకాలం ఒక్కసారైనా జై తెలంగాణ అన్న చరిత్ర రేవంత్‌ రెడ్డికి వుందా?

` తెలంగాణ వాది కాని వారు ముఖ్యమంత్రి కాలేరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నవ్వి పోదురు గాని నాకేం సిగ్గు అన్నట్లా…నలుగురుని చూడగానే నాలుకకు శిగమొచ్చినట్లా..? ప్రగతి భవన్‌ పేల్చేయండని పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటన ఏమిటి? సోయిలోనే వుండి మాట్లాడుతున్నాడా? లేక ఇంకేదైనా లోకంలో వున్నాడా? మైకంలో వున్నాడా? ప్రగతి భవన్‌ ఇప్పుడు ఖాళీగా లేదు. అందులో తెలంగాణ రాష్ట్ర పరిపాలనా వ్యవహారం సాగుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అధికారిక నివాసంగా వుంది. అంటే వారికి హని తల పెట్టాలనే అర్ధం వచ్చేలా మాట్లాడడం పరిణతి చెందిన నాయకుడు చెప్పాల్సిన మాటలేనా? ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద కోపం వున్నా, బిఆర్‌ఎస్‌ మీద కసి వున్నా, ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఎన్నికల వేధికగా ప్రజల ఆదరణతో విజయం సాధించి గెలిచి నిలవాలి. అలా రాజకీయాల్లో పై చేయి సాధించాలి. అంతే కాని నోరుంది కదా? అని దూల తీర్చుకునేందుకు ఏదైనా మాట్లాడతాంటే ఎలా? నరం లేని నాలుక ఏదిపడితే అది మాట్లాడితే జనం మెచ్చరు…నచ్చరు…రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ చాల రోజుల తర్వాత ఓ కార్యక్రమం చేపట్టింది. కాని ఇక్కడ కూడా వివాదం మూటగట్టుకోవడమే పార్టీ వంతైంది. ముఖ్యంగా పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తొలి రోజు హాత్‌సే, హాత్‌ జోడో యాత్ర చేపట్టారు. ఇంత వరకు బాగానే వుంది. నలుగురు కనిపించగానే నాయకుల నాలుకలకు శిగమొస్తుందన్నట్లు రేవంత్‌ రెడ్డి తొలిరోజే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

  ప్రభుత్వ అధికారిక భవనం ప్రగతి భవన్‌కూ నక్సలైట్లు కూల్చేయాలని అనడం సరైంది కాదు…

ఒక బాధ్యత గల్గిన నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. నాయకులు సమాజానికి మార్గదర్శకంగా వుండాలి. వివాదాలు లేని ఆదర్శవంతమైన జీవనం వుండాలి. అంతే గాని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సబబు కాదు… ప్రజస్వామ్య వాదులెవరూ? హర్షించరు. నాయకులు చెప్పే మాటలు ప్రజల హర్షించే విధంగా వుండాలి. మెచ్చుకునేలా వుండాలి. మేధావులు గొప్పగా చర్చించుకునేలా వుండాలి. అంతే కాని సామాన్య ప్రజలు కూడా చీదరించుకునేలా వుండకూడదు. ప్రగతి భవన్‌ కూల్చేయమని చెప్పి, రేవంత్‌రెడ్డి ఎలాంటి సంకేతాలు పంపుతున్నట్లు? అన్నది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రగతి భవన్‌ అన్నది ప్రజల సొత్తు. ప్రభుత్వ భవనం. ఏ పార్టీ అధికారంలో వుంటే పార్టీ ప్రభుత్వ పాలకుల కోసం నిర్మాణం చేబడిరది. ప్రజల పన్నుల ద్వారా జరిగిన నిర్మాణం ప్రగతి భవన్‌…నిజంగా తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ అంగీకరించరు. ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఆ మాత్రం వున్న సానుభూతిని కూడా హరించేలా వుండకూడదు. పార్టీ ఇప్పటికే కష్టాలలో వుంది. ఇప్పటి దాకా కాంగ్రెస్‌లోనే రేవంత్‌ రెడ్డి మీద సరైన అభిప్రాయం లేదు. ఆయనకు పార్టీ పరంగా సీనియర్ల నుంచి ఆదరణ లేదు. తప్పని పరిస్ధితుల్లోనే సీనియర్లు రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని భరిస్తున్నారు. ఇది యదార్ధం. అలాంటప్పుడు కాంగ్రెస్‌ను గట్టెక్కించేలా రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి వుండాలే తప్ప, పార్టీని నిండా ముంచేలా వుండకూడదు. 

 అసలు రేవంత్‌ రెడ్డి హాత్‌సే, హాత్‌ జోడో యాత్ర చేపట్టడంలో ఆంతర్యంలో అర్ధం లేనిదిగా మిగిలిపోకూడదు.

తొలినాడే ఒక్క మాటతో అందరి చేత చీవాట్లు పడే స్ధితి తెచ్చుకోవడంతో ఆ యాత్ర పరమార్ధం మారిపోయేలా చేసుకున్నాడు. ఒకనాడు తెలంగాణలో ఎంతో మంది యువకులు ఆనాటి నాయకుల మూలంగా అడవిబాట పట్టారు. ఎంతోమందికి పుత్ర శోకాలు మిగిల్చారు. ఇప్పటికీ తెలంగాణలో అనేక పల్లెల్లో ఆ కన్నీటి జాడలు ఇంకలేదు. ఆ కుటుంబాలు ఇంకా ఆ గాయాలనుంచి తేరుకోలేదు. ఎంతో మంది తల్లిదండ్రులు తమ కంటి ముందే పిల్లలు చనిపోతుంటే కడుపుకోతలు అనుభవించారు. ఆ కన్నీటీ జీరలు, చారలు వారి ముఖాల మీద ఇప్పటికీ కనిపిస్తూనేవుంటాయి. గతంలో రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ ఇలా నక్సలైట్లను వాడుకొని అధికారంలోకి వచ్చింది. ఒకసారి మర్రిచెన్నారెడ్డి, మరోసారి వైఎస్‌.రాజశేఖరరెడ్డి. అయితే ఆ రోజులు వేరు…ఇప్పుడున్న పరిస్దితులు వేరు. ఆనాడు తెలంగాణలో ఆకలి, కరువు, నిరుద్యోగం…ఆంధ్ర నాయకుల పెత్తనం, తెలంగాణ వెనుకబాటు తనం ఇవన్నీ నాడు యువతను అడవిబాట పట్టేలా చేశాయి. ఎంతో మంది యువత అర్ధాంతంగా జీవితాలను ముగించాల్సివచ్చింది. ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపు చిచ్చు మిగిల్చింది. 

ఏ నక్సలైట్ల పేరు చెప్పి అధికారంలోకి వచ్చారో అదే కాంగ్రెస్‌ పార్టీ ఓసారి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి రూపంలో, మరోసారి వైస్‌.

రాజశేఖరెడ్డి రూపంలో తెలంగాణలో రక్తపాతం పారించారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ యువతను బలి చేసే కుట్రలకు తెరతీస్తే ప్రజలు క్షమించరు. ఇప్పటికైనా కుళ్లు, కుతంత్రాలతో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి చూడాలనుకోవడం సరైంది కాదు. అందుకు యువతను బలి చేసేందుకు రాజకీయాలు చేయొద్దు. ఏ నాయకుడైనా యువకులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని చెప్పాలి. అంతే కాని అడ్డదారుల తొక్కమని, అక్రమ మార్గాలు ఎంచుకొమ్మని చెప్పొదు. నక్కలైట్ల యుగం అన్నది ఒకనాటి కధ…చెరిగిపోయిన కథ. ఆ గాయాన్ని రేపడం అంటే తప్పు చేయడమే..పాపం చేయడమే! తెలంగాణ వచ్చాక ముఖ్యమర్రతి కేసిఆర్‌ తమ ప్రభుత్వ ఎజెండా నక్సలైట్ల ఎజెండా అమలు చేయడమే అన్నారు. అది ఒక బాధ్యత కల్గిన నాయకుడు చెప్పాల్సిన మాట అది…అంతే కాని రేవంత్‌రెడ్డిలాగా ప్రజల్లో అలజడి రేపే వ్యాఖ్యలు చేయకూడదు. ఒక వేళ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక సామాన్యుడు చేస్తే చట్టం ఊరుకుంటుందా? ఇప్పటికే పిడీ యాక్ట్‌ పెట్టేవాళ్లు…ఇప్పటికీ కనీసం సానుభూతి పరులుగా వున్నారని తెలిసినా వారి జాడ పట్టుకొని చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి నాయకుడైనంత మాత్రాన రేవంత్‌రెడ్డి లాంటివారు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు…ఎవరూ హర్షించరు. 

    ఇక తెలంగాణ ఉద్యమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లేడు సరే…మరి రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమానికి చేసిన మేలేమిటి?

 ఆయన పాల్గొన్న ఉద్యమాలేమిటి? తెలుగుదేశం పార్టీలో వుంటూ రెండు కళ్ల సిద్దాంతాని అనుసరించి, తెలంగాణ వాదాన్ని సమాధి చేయాలని చూసి వారిలో రేవంత్‌రెడ్డి ఒకరు. ఇది చరిత్ర సత్యం..దాన్ని ఇప్పుడు కప్పుపుచ్చుకోవాలని చూసినా దాగేది కాదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉత్తరం ఇవ్వడంలో కీలకపాత్ర పోషించింది ఎర్రబెల్లి దయాకర్‌రావు. 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసేలా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి, దసరా రోజు తెలుగుదేశం శ్రేణుల చేత జై తెలంగాణ అనిపించింది దయాకర్‌రావు. మరి రేవంత్‌రెడ్డి ఏం చేశాడు? అన్నది ఇప్పటి యువతకు తెలియాల్సిన అవసరంవుంది. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న వేళ, తెలంగాణ వ్యతిరేకులను తెలంగాణ వాదులు అడుగడుగుగా అడ్డుకుంటున్న సమయం అది. తెలంగాణకు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమేయాలి…ప్రాంతం వాడే మోసం చేస్తే పాతరపెట్టాలని సూచించిన కాలోజీ స్పూర్తి మాటలు బాగా చెప్పుకుంటున్న రోజులవి. ఆ సమయంలో కరీంనగర్‌లో తెలుగుదేశం పార్టీ సమావేశాలకు వెళ్తు, తెలంగాణ వాదులు అడ్డుకుంటే కాల్చేస్తానని హెచ్చకరికలు జారీ చేసేలా రేవంత్‌ రెడ్డి గన్‌ పట్టుకొని వెళ్లిన సందర్భం ప్రజలు అప్పుడే మర్చిపోలేదు. అలాంటి రేవంత్‌రెడ్డి ఇప్పుడు తాను తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకుంటే సరిపోదు. ఇక తెలంగాణ విషయంలో సోనియా గాంధీ వల్ల, కాంగ్రెస్‌ వల్ల ప్రజల్లో వైషమ్యాలు సృష్టించబడుతున్నాయని, ఆంధ్రా, తెలంగాణ ప్రజల్లో అంతరం పెంచి రాజకీయ పబ్బం గుడుపుకుంటున్నారని ఎన్ని నిందలు వేయాలో అన్ని రేవంత్‌రెడ్డి వేశాడు…సోనియా గాంధీని దెయ్యం…అన్నాడు…మరి ఇప్పుడు కాంగ్రెస్‌లో వుండి నీతులు వల్లిస్తే, మొసలి కన్నీరు ఎవరైనా నమ్ముతారా?

సూపర్‌ కలెక్టర్‌ సంతోష్‌!

`సిన్సియర్‌, సెన్సిటివ్‌, డైనమిజమ్‌.

`ప్రజా సేవలో గొప్ప విజయాలు.

`తక్కువ సమయంలోనే మంచి పేరు.

`అవినీతిని అస్సలు సహించరు.

`జిహెచ్‌ఎంలో విప్లవాత్మక నిర్ణయాలు, అధ్భత ఫలితాలు.

`స్వఛ్ఛ హైదరాబాదుకు అనేక అవార్డులు.

`సానిటేషన్‌ వ్వవస్థలో సమూల మార్పులు.

`బస్తీ దహఖానలతో పేదలకు వైద్య సేవల కల్పనకు శ్రీకారాలు.

`సుస్తిలేని సమాజ నిర్మాణం కోసం ఫలించిన ప్రయత్నాలు.

`కరోనా సమయంలో ఉచిత భోజన ఏర్పాట్లు.

`ప్రభుత్వం నుంచి అనేక ప్రశంసలు.

`కొత్తగా మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు.

`ఎంతటి సవాళ్లనైనా సరే సునాయాసంగా పరిష్కారం.

`ఇక అవినీతి పరులకు చుక్కలు కనిపించడం ఖాయం.

`గతంలో జరిగిన తప్పులకు తవ్వకాలు జరపాలని ప్రజల నుంచి విజ్ఞాపనలు.

`నిధుల దుర్వినియోగం మీద దృష్టి సారించాలి.

`ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై ఉక్కుపాదం మోపాలి.

`అక్రమాలకు చెక్‌ పెట్టాలి.

`ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి భరతం పట్టాలి.

`ప్రజా ధనం లూఠీ కాకుండా చూడాలి.

………………….జీవితంలో అనుకున్న లక్ష్యాలను అధిరోహించడంలో వుండే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఇష్టపడిన జీవితాన్ని కష్టపడి ల మల్చుకోవడం అంటే అందరివల్ల సాధ్యమయ్యే పని కాదు. అందుకు అకుంఠిత దీక్ష కూడా కావాలి. లక్ష్య సాధన కోసం ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా, చిరునవ్వుతో వాటిని ఎదుర్కొని గమ్యం చేరగలగాలి. మధ్యలో విశ్రమించడం, విరామం తీసుకుంటా అంటే కుదరదు… విద్యావంతులు కావడం వేరు…మన దేశంలోనే అత్యున్నతమైన పరీక్షలలో విజయాలు సాధించి లక్షల్లో ఒకరుగా గెలిచి నిలవడం వేరు. అలాంటి విజయం ఊరికే రాదు… రాత్రింబవళ్ళు పడే కష్టానికి ప్రతిరూపం. మన దేశంలో అంతటి గొప్ప గౌరవం ఒక్క సివిల్‌ సర్వీసెస్‌ కే వుంటుంది. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి…పోతుంటాయి…ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో లక్ష్యం వుంటుంది. అలాంటి సమయంలో ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యతలు నిర్వర్తించడమే కాదు, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ప్రతి గడపకు చేరేందుకు కృషి చేసే వ్యవస్థ సివిల్‌ సర్వీసెస్‌ విభాగానిది. మారుతున్న కాలానికి అనుగుణంగా, సమాజంలో వచ్చే మార్పులు, అందివచ్చే అవకాశాలు, ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లు, ప్రభావితం చేసే కొత్త కొత్త అంశాలు, టెక్నాలజీ వినియోగంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం తలకు మించిన భారమే…అయినా చెరగని చిరునవ్వుతో ప్రతి సమస్యకు పరిష్కారం చూపెడుతూ, సవాళ్లను ఎదుర్కొంటూ, ఒత్తిళ్లను అధిగమిస్తూ, ప్రజలను మెప్పిస్తూ, పాలకులు చేసే చట్టాలను అమలు చేస్తూ ప్రతి క్షణం కొత్త ఉత్సాహంతో పని చేసే వారే ఐఏఎస్‌ లు. అలాంటి వారిలో అతి తక్కువ సమయంలో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సాధించిన ఐఏఎస్‌ అధికారులలో ధరావత్‌ సంతోష్‌ ఒకరు. ఎలాంటి వివాదాలు లేకుండా, అవినీతికి తావులేని అధికారిగా మంచి పేరు సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే ఎంతో కష్టమైన విధుల నిర్వహణలో సమర్థవంతమైన అధికారిగా ప్రశంసలందుకుంటున్నారు. 2016 బ్యాచ్‌ కు చెందిన ఐఏఎస్‌ అధికారి ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ ధరావత్‌ సంతోష్‌ ది ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషను ఘనపూర్‌ పక్కన వుండే తండా. చిన్నప్పటి నుంచి ఉన్నతమైన భావాలు కలిగి, జీవిత లక్ష్యం మీద అవగాహన కలిసి, పరిస్థితులను తనకు అవకాశాలుగా మల్చుకొని ఎదిగారు…సివిల్‌ సర్వీసెస్‌ లో విజయం సాధించారు. జిహెచ్‌ఎంసిలో సానిటేషన్‌, మెడికల్‌ డిపార్ట్మెంట్‌ కు హెడ్‌ గా పోస్టింగ్‌ లో ఆయన సాధించిన విజయాలు అమోఘం. ఇటీవలే మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు చేపట్టారు……………………………..

 

ఐఏఎస్‌ అధికారి సంతోష్‌ జిహెచ్‌ఎంసిలో హెల్త్‌ అండ్‌ సానిటేషన్‌ విభాగంలో అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి, అధ్భుతమైన విజయాలు అందించారు. నగరం సుందరంగా, ప్రజలు ఆరోగ్యంగా, పరిసరాలు పరిశుభ్రంగా, సమాజం సంతోషంగా వుండడానికి ఎంతో దోహదపడ్డారు. ముప్పై సర్కిళ్లు ఆయన ఆధ్యర్యంలో వుండేవి. సమారు 22వేల మంది సానిటేషన్‌ సిబ్బందితో నగరం సుందరంగా తీర్చిదిద్దడంలో తనదైనముద్ర వేశారు. అంతకు ముందు లేని కొత్త కొత్త ఆలోచనలతో నగరంలోని ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించడం కోసం ఆయన అనుసరించిన మార్గం అనేక రాష్ట్రాలకు ఇప్పుడు అనుసరణీయమైంది. తెలంగాణ మొత్తం అమలు పర్చడంలో కూడా కీలకపాత్ర వహించింది. నగరంలోని ఆయన పరిధిలో వున్న ముప్పై సర్కిళ్లలో సుమారు 6500 వెయికిల్స్‌ ఏర్పాటు చేసి, నిత్యం చెత్త సేకరణకు శ్రీకారం చుట్టడంతో సంతోషది ప్రత్యేక పాత్ర. వీటితోపాటు నగరంలో సేకరించిన చెత్తను జవహర్‌ నగర్‌కు తరలించేందుకు మరో 1600 వాహనాలు వినియోగించి, ఎప్పటికప్పుడు నగరంలోని చెత్తను శివారు ప్రాంతానికి తరలించి, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందకు ఎంతో కృషి చేశారు. ప్రజలను రోగాల బారిన పడుకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో కీలకభూమిక పోషించారు. సంతోష్‌ జిహెచ్‌ఎంసిలో విధుల్లో చేరకముందు జవహర్‌ నగర్‌లో చెత్త నిక్షిప్తం చేయడాన్ని డంపింగ్‌ యార్డు అనే సంబోధిస్తుండేవారు. కాని ఆ మాటను సంతోష్‌ మార్చారు. అక్కడి పరిస్ధితులు చక్కదిద్దారు. అక్కడి ప్రజలకు పడుతున్న వేధన నుంచి విముక్తి చేశారు. గుట్టల్లా పేరుకుపోయిన చెత్తతో జవహర్‌నగర్‌లో జీవించే ప్రజలు నిత్యం నరకం అనుభవించేవారు. దుర్వాసనతోపాటు, ఈగలు, దోమలు, పొగతో నిత్యం నరకం అనుభవించేవారు. నీటి కాలుష్యం, వాయుకాలుష్యంతో నిత్యం సతమతయ్యేవారు. రోగాల బారిన పడుతూ వుండేవారు. ఇక జవహర్‌నగర్‌లో బతకలేమని ఇళ్లు ఖాళీ చేసి వెళ్లినవారు వున్నారు. కాని ఎప్పుడైతే సంతోష్‌ బాధ్యతలు చేపట్టారో…అక్కడి ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు అందమైన జవహర్‌ నగర్‌ తయారైంది. గ్రామ పంచాయితీ కాస్త కార్పోరేషన్‌ స్ధాయికి ఎదిగింది. జవహర్‌ నగర్‌ విస్తరించింది. అందుకు సంతోష్‌ చేపట్టిన విధానాలే కారణం. ఒకనాడు డంపింగ్‌ యార్డు స్ధలాన్ని నేడు ట్రీట్‌ మెంటు ప్లాంటుగా మార్చివేశారు. అక్కడ కూడా అధ్భుతాలు సృష్టించారు. తడి చెత్తతో కరంటు ఉత్పత్తి చేస్తున్నారు. తర్వారా వెలువడిన దానిని కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారు. రైతులకు ఆ ఎరువును అమ్ముతూ, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చేశారు. ఇక పొడి చెత్త విషయంలో ప్లాస్టిక్‌ రీసైకిలింగ్‌కు పంపిస్తున్నారు. చెత్తా, చెదారమంతా పేపర్‌ యూనిట్లకు పంపిస్తున్నారు. అది కూడా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చేస్తున్నారు. ఇంతముందు ఆ డంపింగ్‌ అంతా ఎప్పుడూ కాలబెడుతూ వుండేవారు. దాంతో జవహర్‌నగర్‌ పరిసర ప్రాంతాలన్నీ కాలుష్య కాసారంగా మారిపోయాయి. కాని ఇప్పుడు అదే ప్రాంతం సుందరంగా విరాజిల్లుతోంది. ఈ నిర్ణయంలో సంతోష్‌దే ప్రత్యేక పాత్ర. అంతే కాకుండా నగరంలో సుమారు 7వేల వరకు చెత్త డబ్బాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటినుంచి రోజుకు రెండుసార్లు చెత్త సేకరించే ఏర్పాటు చేశారు. దాంతో చెత్తడబ్బాల్లో చెత్త పేరుకుపోకుండా, ఆ పరిసరాల్లో ప్రజలు చెత్త కింద పడేయకుండా చేశారు. చిన్న వయసులోనే ఇంతటి అధ్భుతమైన ప్రతిభను కనబర్చిన అధికారులు గతంలో లేరు. ఇక జిహెచ్‌ఎంసిలో ఎదురయ్యే సవాళ్లనే, సమస్యలను ఎంతో చాకచక్కంగా పరిష్కరించడం ఆయనకున్న ప్రత్యేకత. ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుందని నమ్మే వ్యక్తిత్వం. అందుకే ఎంతటి క్లిష్ట సమస్యనైనా చాలా సునాయసంగా పూర్తి చేస్తుంటారు. పరిష్కారం కనుక్కుంటారు. అంతే కాకుండా అటు అధికారులతో సమన్వయం, ఇటు ప్రజా ప్రతినిధులు కోరిన పనులు పూర్తి చేయడం, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేధికలు సమర్పించడం, కొత్త ఆలోచనతో నగరాభివృద్ధి, సుందరీకరణ కోసం సంతోష్‌ చేపట్టిన పనులు వ్యక్తిగతంగా ఆయనకు, ప్రభుత్వానికి ఎంతో పేరు తెచ్చాయి. 

    ఇదిలా వుంటే గత అధికారులకుంటే సంతోష్‌ ది భిన్నమైన శైలి.

 సహజంగా ఐఏఎస్‌ అధికారులంటే ప్రజలకు చేరువగా వుంటారని ఎవరూ అనుకోరు. కాని ఆయన మాత్రం ఉదయం ఏడుగంటలకు ప్రజల మధ్య వుంటారు. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుంటారు. కార్మికులు చేస్తున్న పనులు పర్యవేక్షిస్తుంటారు. అవసరమైన సూచనలు క్షేత్ర స్ధాయిలో వుంటూనే ఇస్తుంటారు. స్ధానిక నేతల అభిప్రాయాలు సేకరిస్తుంటారు. ఆయా కాలనీలకు అవసరమైన సేవలను తెలుసుకుంటారు. వాటిని అమలు చేస్తారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూసుకుంటారు. ఇదే ఆయన విజయానికి కారణమైంది. నగరంలోని సానిటేషన్‌ విభాగం పూర్తి స్ధాయిలో ప్రక్షాళన జరగడమే కాదు, అధ్భుతమైన అందమైన, ఆరోగ్యకరమైన పరిసరాలను తీర్చిదిద్దిన ఘనత సంతోష్‌కే దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు. హైదరాబాద్‌ మహానరగర పాలక సంస్ధకు ఏటా కొన్ని పదలు సంఖ్యలో అవార్డులు సంతోష్‌ వచ్చిన తర్వాతే రావడం మొదలైంది. అంతకు ముందు వచ్చినా, పదలు సంఖ్యలో వచ్చేవి కాదు…నగరంలో ప్లాస్టిక్‌ వినియోగం మీద నిఘా ఏర్పాటు చేసి, దాని వినియోగాన్ని తగ్గించేందుకు కృషిచేశారు. ముఖ్యంగా ప్రజల్లో కూడా ప్లాస్టిక్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాలను విజయం వంతం చేశారు. కులీకుబ్‌షా అర్భన్‌ డెవలప్‌ మెంటు కార్యక్రమాలను కూడా ఎంతో విజయంతంగా చేపట్టారు. ఇక నగరంలోని పేదల ఆరోగ్యం కోసం ఏదైనా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో బస్తీ దవాఖానాల ఏర్పాటులో కీలకభూమిక పోషించారు. ఇప్పుడు నగరంలో దాదాపు 263 బస్తీ దవాఖానాలు ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఆయన ఆయన విధుల్లో వున్నప్పుడు సమారు 79కి పైగా బస్తీ దవఖానాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఆరోగ్య కల్పనకు కృషి చేశారు. వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. పేదలకు ఎంతో కొంత మేలు చేసే ప్రయత్నంలో విజయం సాధించారు. పజలకు ఐదు రూపాయల భోజన స్టాల్స్‌ను మూడు వందల వరకు ఏర్పాటు చేయయడంలో ఎంతో చొరవ చూపారు. ప్రజలకు భోజన వసతి కల్పించారు. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాలను నుంచి వచ్చి ఆశ్రయం పొందుతున్న కూలీలకు ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. నగరంలో వరదల సమయంలో ప్రతి కుటుంబానికి రేషన్‌ సరుకులు ఇంటింటికి తిరిగి అందించే కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇదంతా ప్రభుత్వ ఆదేశాలతో చేపట్టినా, ఆచరణలో చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే…దాంతో ప్రజలకు ప్రభుత్వ మెరుగైన సేవలు అందాలంటే సంతోష్‌ లాంటి అధికారుల పని తీరు ఎంతో మఖ్యమైంది. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చడమే కాదు, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించడంలో కూడా సంతోష్‌ ఎంతో ముందుంటారని నిరూపించుకున్నారు. దుండిగల్‌లో కరంటు ఏర్పాటు చేయడంలో కూడా సంతోష్‌ కృషి గొప్పది. కరోనా సమయంలో వాక్సినేషన్‌ విషయంలో జిహెచ్‌ఎంసి కార్మికులకు ముందుగా ఇప్పించడంలో కీలకభూమిక పోషించారు. ఇక గతంలో మున్సిపాలిటీలలో బర్త్‌ సర్టిఫికెట్లు, డెత్‌ సర్టిపికెట్లు పొందడం ఎంతో గగనంగా వుండేది. రోజుల తరబడి మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సివచ్చేది. అక్కడ కూడా అవినీతి జరుగుతుండేది. దాన్ని పూర్తిగా మార్చివేశారు. బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు అదే రోజు క్షణాల మీద అందేలా అంతా ఆన్‌లైన్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయించారు. పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంతోష్‌ సృష్టించిన అధ్భుతాలకు, సాధించిన విజయాలకు లెక్కే లేదు. హనెస్ట్‌ ఆఫీసర్‌గా ఆయన పేరు పొందారు. 

    సమస్యల స్వాగతం: 

ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా సులువుగా పరిష్కరిస్తారనే పేరున్న కలెక్టర్‌ సంతోష్‌కు మంచిర్యాల జిల్లాలో వున్న కొన్ని సమస్యలు పరిష్కారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో డిఎంఎఫ్‌టి ఫండ్స్‌ గతంలో విచ్చవడిగా ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. చేసిన పనులకు, చెప్పిన లెక్కలకు ఎక్కడా పొంతన కుదడం లేదన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఇక మంచిర్యాల జిల్లాలో ఇసుక తవ్వకాలకు అడ్డాగా మారింది. ఇష్టం వచ్చినట్లు గోదావరిని తవ్వేస్తున్నారన్న ఆరోపణలు అనేకం వున్నాయి. జిల్లాలోని నస్పూర్‌ మండలానికి చెందిన ఒక వ్యక్తి డీలర్‌గా పనిచేసి, ఇసుక వ్యాపారం అడ్డం పెట్టుకొని ఆడన్‌గా ఎదగడమే కాకుండా, అధికార యంత్రాంగాన్నంతా గుప్పిట్లో పెట్టుకొని పేదల భూములను ఆక్రమించకుంటున్నారన్న విమర్శలు అనేకం వున్నాయి. బాధితులు కూడా ఇప్పటికే అనేక మార్లు సదరు వ్యక్తిపై చర్యలకు ఎన్ని సార్లు డిమాండ్లు చేసినా పట్టించుకోలేదన్నది ఇక్కడ ప్రజలు చెబుతున్న మాట. మొత్తం జిల్లా యంత్రాంగాన్నంతా చేతిలో పట్టుకొని, ప్రభుత్వం అతని వద్ద స్వాధీనం చేసుకున్న ఇసుక మళ్లీ అతనే అమ్ముకుంటుంటే కూడా చూస్తూ ఊరుకున్నారే గాని, అడ్డుకోలేదు. అతన్ని అదుపులోకి తీసుకోలేదు. ప్రభుత్వానికి అతను చెల్లించాల్సిన సొమ్ము కూడా చెల్లించకపోయినా అధికారులు చర్యలు తీసుకున్నది లేదన్నది ప్రజలు చెబుతున్న మాట. ఇక జిల్లాలోని మండల రెవిన్యూ కార్యాయలయాలు, ఆర్డీవో కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఎక్కువైందన్న వార్తలు అనేకం వినిపిస్తున్నాయి. ఆర్డీవో కార్యాలయంలో ఏకంగా ఓ ప్రైవేటు వ్యక్తి అన్ని పనులు అతనే చక్కబెడుతున్నట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. జిల్లాలోని అధికారులందరికీ తెలిసినా ఎవరూ అడ్డుకున్నది లేదు. అతని పెత్తనం గురించి ప్రశ్నించిన వారు లేరు. ఏ చిన్న పని కావాలన్నా అతన్ని కలిస్తే సరిపోతుందన్న మాటే ఆర్డీవో కార్యాలయంలో వినిపిస్తోందంటున్నారు. అలా ప్రభుత్వ భూముల అక్రమణల దగ్గర నుంచి మొదలు, ప్రభుత్వ భూముల అప్పగింతలో కూడా కీలక భూమిక పోషిస్తున్నారని అంటున్నారు. అందుకు పూర్తి స్ధాయిలో అధికార యంత్రాంగం సహాకారం వుందని తెలుస్తోంది. దీనిపై పూర్తి స్ధాయి దృష్టిపెడితే, ఎన్నో విషయాలు వెలుగులోకి రావొచ్చు. ఇక ఓ ఫారెస్టు అధికారి కింది స్ధాయి మహిళా అధికారులను వేధింపులకు గురి చేస్తున్న అంశం సంచలనంగా మారింది. మహిళా అధికారులు అక్కడ పనిచేయడానికి కూడా భయపడుతున్నారని, ఆ అధికారిపై పిర్యాధులు వెల్లడం జరిగినా, పై స్ధాయిలో సందన లేకపోవడం వంటి అనేక అంశాలు వున్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంగా, అవినీతి,అక్రమాలకు మాత్రం నిలయంగా జిల్లా మారిందన్న విమర్శలు వున్నాయి. వాటిని చక్కదిద్ది జిల్లా ను గాడిలో పెడతారని ప్రజలు కోరుకుంటున్నారు. ఆల్‌ బెస్ట్‌…సార్‌.

హనుమకొండ లోని నవయుగ హై స్కూల్ లో విద్యార్థి ఆత్మహత్య

ఉరేసుకుని చనిపోయిన తొమ్మిదో తరగతి విద్యార్థి

హనుమకొండలోని నవయుగ హై స్కూల్ లో ఘటన

ఎన్జీవోస్ కాలనీ (హనుమకొండ) నేటి ధాత్రి:

క్లాస్ రూమ్ లోనే ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగగా..

స్కూల్ సిబ్బంది గమనించి ఎంజీఎం హాస్పిటల్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ లు నిర్ధారించారు.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామానికి చెందిన వివేక్ హనుమకొండ విజయపాల్ కాలనీ ఇందిరానగర్ రోడ్డు లోని నవయుగ హై స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

సోమవారం సాయంత్రం వరకు తోటి స్టూడెంట్స్ తో గడిపిన వివేక్.. రోజువారీలాగే మిగతా పిల్లలతో కలిసి పడుకున్నాడు. కాగా అర్ధరాత్రి 12 గంటల సుమారులో క్లాస్ రూమ్ కి వెళ్లిన వివేక్ అక్కడే ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజామున గుర్తించిన స్కూల్ సిబ్బంది హుటాహుటిన వరంగల్ ఎంజీఎం కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా వివేక్ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్టూడెంట్ సూసైడ్ సమాచారం అందుకున్న సుబేదారి సిఐ షుకూర్, ఇతర సిబ్బంది వివేక్​ ఉరేసుకున్న గదిని, సీసీ ఫుటేజీ పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

విద్యార్థి ఆత్మహత్యపై అనుమానాలు

తరగతి గదిలోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వివిధ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్​ సిబ్బంది తీరు వల్లే విద్యార్థి ఉరి వేసుకున్నాడని ప్రచారం జరుగుతుండగా.. విద్యార్థి తండ్రి రాజుకు పాఠశాల నుంచి అందిన సమాచారం కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. వివేక్​ ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చిన తరువాత పాఠశాల సిబ్బంది వివేక్​ తండ్రి అయిన రాజుకు ఫోన్​ కాల్​ చేసి.. వివేక్​ కింద పడ్డాడని చెప్పాడని రాజు తెలిపారు. మూర్చ వచ్చి కింద పడ్డాడని చెప్పారని, అసలు ఏం జరిగిందో తెలియడం లేదని వివేక్​ తండ్రి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వివేక్​ ఎవరి జోలికి వెళ్లే వ్యక్తి కాదని విలపించారు. కాగా విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం అందగానే సుబేదారి సీఐ, ఇతర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తూ.. సీసీ ఫుటేజీలు పరిశీలించామని, విద్యార్థి ఒక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. కాగా విద్యార్థి ఉరి వేసుకున్న విషయం స్కూల్​ సిబ్బంది ఎందుకు దాచాల్సి వచ్చిందనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి తండ్రికి అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే చర్చ కూడా నడుస్తుంది. దీంతో విద్యార్థి ఆత్మహత్య విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఎంపీలు నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే వెంకటవీరయ్య

సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారుల వెంట డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగా వినతిపత్రం సమర్పణ

శాలువాతో గడ్కరీకి సత్కారం

ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారులను మరింత విస్తరించాల్సిందిగా, రోడ్లకిరువైపులా డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగాకోరుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డిలతో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు.ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం వారు గడ్కరీతో సమావేశమై తమ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారులు, వాటి విస్తరణ, కొత్తగా కట్టిన కలెక్టరేట్ వద్ద అలైన్మెంట్ మార్పు,డ్రైన్స్ మంజూరు చేయాల్సిన అవసరం గురించి వివరించారు.ఎంపీలు, ఎమ్మెల్యే తన దృష్టికి తెచ్చిన అంశాలను మంత్రి సావధానంగా విని సానుకూలంగా స్పందించారు, ఇందుకు సంబంధించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.ఈ సందర్భంగా వారు గడ్కరీకి ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు.

పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ కి స్వాగతం

అధిక ఫీజులు, అధిక పర్మిషన్ ల పై విచారణ లేవి

త్వరిగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

మండల ప్రధాన కార్యదర్శి సందుపట్ల లక్ష్మారెడ్డి

ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి

ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు నిన్నటి రోజున ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి గారిని సస్పెండ్ చేయడం స్వాగతిస్తూనే కలెక్టర్ గారు కొండను తవ్వి ఎలుకలు పట్టిన చందాన వారి చర్యలు ఉండడం ప్రజాస్వామ్యాన్ని కూనిచేయడంలా ఉందని అన్నారు. గత ఆరు నెలలుగా ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ లో నిధుల దుర్వినియోగం అవినీతి , ఇండ్ల పరిమిషన్లలో డబ్బులు తీసుకోవడం అట్టి విషయాలపై భారతీయ జనతా పార్టీ సాక్షాదారాలతో సహా అధిక ఫీజు వసూల్ చేయడం పై ఇంటి యజమానులతో వాంగ్మూలం తీసుకుని చర్యలు చేపడతాం అని డిపిఓ వచ్చి విచారణ చేపడతామని తెలిపి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు చర్యలు లేకపోవడం మీ నిర్లక్ష్యానికి మొదటి మెట్టు.మొక్కలను పరివేక్షణ పెంపకం లో పంచాయతీ కార్యదర్శి గారి నిర్లక్ష్యానికి సస్పెండ్ చేసినారు మరి అవినీతి ఆరోపణలు గ్రామపంచాయతీలో జరిగిన వాటిపై విచారణలో ఎలాంటి సమాధానం రాకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు వాపోతున్నారు.నిధుల దుర్వినియోగం అవినీతి ఇండ్ల పర్మిషన్ పై జరుగుతున్న అధిక ఫీజు వసూల్ పై కలెక్టర్ డిపిఓ స్పందించి చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. చర్యలు తీసుకొని పక్షంలో డిపిఓ గారిపై సంబంధిత అధికారులపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసి నిగ్గు తెలుస్తమని అన్నారు. ఎప్పటికైనా తప్పు చేసిన వ్యక్తి శిక్ష అనుభవించాలని, ప్రజా సామ్యంపై రాజ్యాంగంపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా అధికారులు పనిచేయాలని అధికారులు ప్రజలు కట్టే పన్నుతో జీతం తీసుకుంటున్నారు.అధికార పార్టీ అండదండలు ఉన్నాయని అధికార పార్టీ నాయకులు ఎన్ని రోజులు కాపాడుతారని ఎప్పటికి మీ ప్రభుత్వం ఉండాలని తప్పు చేసిన వారు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారని అన్నారు.

ఎల్లారెడ్డి పేట భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి

 

 ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణపూర్ రెడ్డి సంఘంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు,జిల్లా అసెంబ్లీ కన్వీనర్ కరేండ్ల మల్లారెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి రావడం జరిగింది. 

ఈ సమావేశం వారు మాట్లాడుతూ రాబోవు కాలంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ అన్ని విధాలుగా ప్రజలతో మమేకమై అధికార పార్టీ యొక్క లోటుపాట్లను ఎండగడుతూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అదేవిధంగా బిజెపిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి జులూమ్ మరియు ఒంటెద్దు పోకడలను ప్రజలకు వివరిస్తూ బిజెపి నాయకులు ఒక ప్రశ్నించే గొంతుక గా ఉండాలని సూచించడం జరిగింది.అదేవిధంగా మరి మొన్న జరిగిన సెస్ ఎలక్షన్లో చూసినట్లయితే ఎక్కువ గ్రామాల్లో కూడా బిజెపి రావడం హర్షించదగ్గ విషయం వాళ్ళు ఎన్ని భయబ్రాంతులకు గురి చేసిన బెదిరింపులు చేసిన వారు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కువ మొత్తంలో అన్ని గ్రామాల్లో కూడా బిజెపి కి ఎక్కువ ఓట్లు రావడం చాలా సంతోషకరం మరియు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ప్రజలు అన్ని చూస్తున్నారు.గ్రామాలలో రైతులకు పంట పొలాలకు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న మరి 24 గంటలు కరెంటు ఇస్తున్నాము అంటున్న కేటీఆర్ గారికి కనబడతలేదా ఖబర్దార్ కేటీఆర్ ఇక నీ ఆటలు సాగవు తప్పకుండా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో బి.ఆర్.ఎస్. ని ప్రజలు బొంద పెడతారు మరి బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన వ్యాఖ్యానించారు. కావున బిజెపి నాయకులు కార్యకర్తలు, అందరూ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని ఎలాంటి కేసులకు భయపడకుండా ధైర్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి ఎస్టి మోర్చా అధ్యక్షులు కోనేటి సాయిలు, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మన్తుర్తి శ్రీను,మినహాజ్ ఖాన్, నేవూరి శ్రీనివాస్ రెడ్డి, పిట్లా శ్రీశైలం, రామచంద్ర రెడ్డి, భాస్కర్, దాసరి గణేష్,రేపాక రామచంద్ర రెడ్డి, కృష్ణ హరి,వంగల రాజు, బొమ్మాడి స్వామి, జితేందర్ రెడ్డి శరత్ రెడ్డి సల్ల సత్యం రెడ్డి కమ్మరి ఆంజనేయులు భాస్కర్ రాజు సనత్ కిరణ్ నాయక్, సత్య రెడ్డి, సాగ లక్ష్మణ్, రాకేష్, కేశవరెడ్డి లక్ష్మణ్, సురేష్, కిట్టు,పరశురాం రెడ్డి, భాను, నరసింహులు, మల్లన్న ,ప్రశాంత్, రాజు ,బాలా గౌడ్ ,మురళి, దిలీప్, బాలకృష్ణ ,జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల మంచి నీళ్ల కోసం 10 వేలు వితరణ చేసిన నిలువ నీడ లేని వ్యక్తి

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి

 

 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో తేలు కిష్టయ్య అనే నిలువ నీడ లేని వ్యక్తి గుండారం ప్రభుత్వ పాఠశాలకు పిల్లలకు మంచినీళ్లు బోరు కోసం పదివేల రూపాయలను ఈరోజు పసుల భాస్కరు కు అందించడం జరిగింది. చాలా రోజుల నుంచి బోరు కాలిపోతుందని నీళ్లు పిల్లలకు అందించలేక గ్రామ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఉదయం గుండారం ప్రజలు ఎవరైనా దాతలు ఉంటే ఇవ్వాలని సర్పంచ్ శంకర్ నాయక్ ఎవరైనా దాతలు ఉంటే సహకరించాలని కోరడం జరిగింది. స్పందించిన తేలుకిష్టయ్య గుండారం గ్రామంలో ప్రజాపతినిధులు నాయకులు చేయలేని పని మీద వాళ్ళు నీడలేని వ్యక్తి చేయడం సంతోషాన్ని కలిగిస్తుంది. తెలు కిష్టయ్యకు గుండారం ప్రజలు అన్ని పార్టీల నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్ష కు అనుగుణంగా ఉంటుంది.

*హరీష్ రావు ఆర్ధిక శాఖ మంత్రి*

కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్

సంక్షేమానికి అభివృద్ధి రెండు జొడేద్దుల్లగా సమపాళ్లలో ఉండబోతోంది.

కేంద్రం నుండి వివక్ష కొనసాగుతుంటే, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోంది

సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశాం

తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోంది

 

దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచింది

 

సభలో నేను, మండలి లో ప్రశాంత్ రెడ్డి ప్రవేశ పెడుతారు

 

బడ్జెట్ నిన్న కేబినేట్ ఆమోదం తో పాటు గవర్నర్ ఆమోదం కూడా లభించింది

 

ఉదయం 10.30 కు బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాం

నియోజకవర్గ ఎమ్ ఎల్ ఏ సోషల్ మీడియా కి పరిమితం. మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు.

40 సంవత్సరాలు పాలించిన అసెంబ్లీలో లిఫ్ట్ ఇరిగేషన్ అడగడం ఏంటిది, పుట్ట మధు చేసిన అభివృద్ధి ని ఓరువలే ఎంఎల్ఏ ఓర్వలేక పోతున్నారు. సర్పంచ్ బాపు.

ప్రజలను ముసుగేసి ఉంచిన ఎంఎల్ఏ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అని నేటికీ ప్రజలకు తెలియని దుస్థితి. సీనియర్ నాయకుడు బాపు.

ఆసుపత్రి సమస్యలపై చైర్మన్ చెప్పాలి కానీ మధ్యవర్తులు సమాధానాలు చెప్పడం విచిత్రం. ఆన్కారి ప్రకాష్.

జడ్పీ చైర్మన్ ఆసుపత్రిలో సమస్యలను బహిర్గతం చేస్తే కాంగ్రెస్ అనుచిత వాక్యాలు చేయడం అవగాహన లోపం. లక్ష్మణ్.

మహాదేవపూర్-నేటి ధాత్రి:

 

నియోజకవర్గ ఎంఎల్ఏ శ్రీధర్ బాబు జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని ప్రతిపాదనతో వచ్చిన డయాలసిస్ కేంద్రానికి నియోజకవర్గ ఎంఎల్ఏ నేను తెచ్చినానని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసుకుంటున్నారని 40 సంవత్సరాలు పాలించిన కుటుంబం చివరికి అసెంబ్లీలో కాలువలు లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి అడగడం విచిత్రంగా ఉందని నాటి నుండి నేటి వరకు నియోజకవర్గ ప్రజలకు ఎంఎల్ఏ ప్రజలకు ముసుగులో ఉంచారని ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఎంఎల్ఏ అన్న విషయం ప్రజానీకానికి తెలవదని చైర్మన్ చెప్పాల్సిన సమాధానాలు మధ్యవర్తులతో చెప్పించడం విచిత్రవని సమస్యలను బహిర్గతం చేస్తే క్యాబినెట్ హోదా ఉన్న చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అవగాహన లోపం అని బంతిని నియోజకవర్గ మహిళా ఇన్చార్జి కేదారి గీతాబాయి, మహదేవ్పూర్ సర్పంచ్ శ్రీపతి బాబు బీసీ సెల్ మండల అధ్యక్షుడు కారంగుల బాపూరావు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆన్కారి ప్రకాష్ మెరుగు లక్ష్మణులు ఆదివారం రోజున స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో అన్నారు.

 

 

 *నియోజకవర్గ ఎమ్ ఎల్ ఏ సోషల్ మీడియా కి పరిమితం. మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు.* 

 

పత్రికా సమావేశంలో మంథని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఇంచార్జ్ కేదారి గీతాబాయి మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఉన్న ఎంఎల్ఏ శ్రీధర్ బాబు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధుకర్ జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీహర్షిని తీసుకువచ్చిన పథకాలను సామాజిక మద్యంలో ఎంఎల్ఏ తనే తీసుకురావడం జరిగిందని చెప్పుకోవడానికి మాత్రమే పరిమిత వయ్యారని అన్నారు. జక్కు శ్రీ హర్షిని పుట్ట మధు కృషితో ఏర్పాటైన డైలాగ్స్ సెంటర్లు ఎమ్మెల్యే తీసుకురావడం జరిగిందని చెప్పుకుంటున్నప్పటికీ కనీసం నేటి వరకు వాటికి సంబంధించి భవన నిర్మాణం ఇతర ఇక్యూట్మెంట్లకు ఏనాడైనా ఎమ్మెల్యే ఆసుపత్రి కి సందర్శించిన దాఖలాలు ఉన్నాయని ప్రశ్నించారు. జక్కు శ్రీహర్షిని కోరిక మేరకు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా కేంద్రంలో పర్యటించిన క్రమంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు వేదికపైనే అప్రూవల్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే మర్చిపోయారని గీతా బాయ్ అన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు ప్రజలపై ప్రేమ మమకారం ఉంటే డయాలసిస్ సెంటర్ తక్షణ ఏర్పాటుకు నేటి వరకు ఎందుకు స్పందించలేదు ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. బ్యాలెన్స్ కేంద్రం త్వరగా పూర్తి చేయాలని పట్టుదల కేవలం జక్కు శ్రీ హర్షిని మరియు పుట్ట మధుకర్లకే ఉందని గత నాలుగు రోజుల క్రితమే జిల్లా కలెక్టర్లు సైతం డయాలసిస్ సెంటర్ ఏర్పాటుపై సమీక్ష చేయడం జరిగిందని వరుసటిరోజే జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని ఆసుపత్రికి సందర్శించడం కూడా జరిగిందని సందర్శనకు వచ్చిన క్రమంలో ఆసుపత్రిలో అనేక మౌలిక వసతులకు గూగుల్, నోచుకోకుండా ఉండడం తమ నాయకుడు పుట్ట మధు కట్టించిన మరుగుదొడ్లే ఉన్నాయని వాటిని కూడా నిరుపయోగంగా ఉండడంతో వయసు పైబడిన పేద రోగులకు ఎనలేని ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని నియోజకవర్గ ఎమ్మెల్యే ఆసుపత్రి అభివృద్ధిపై మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాల్సి ఉండగా ఒక్కసారి కూడా చైర్మన్ గా ఉండి ఆసుపత్రి అభివృద్ధిపై సమావేశం పెట్టకపోవడం సూచనీయమని ఓట్లేసి గెలిపించిన ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉంటే ఎంఎల్ఏ శ్రీధర్ బాబు తక్షణమే ఆస్పత్రిలో అధికారులతో మీటింగ్ నిర్వహించి మౌలిక వసతుల కల్పన ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని గీతాబాయి డిమాండ్ చేశారు.

 

 

 *40 సంవత్సరాలు పాలించిన అసెంబ్లీలో లిఫ్ట్ ఇరిగేషన్ అడగడం ఏంటిది, పుట్ట మధు చేసిన అభివృద్ధి ని ఓరువలే ఎంఎల్ఏ ఓర్వలేక పోతున్నారు. సర్పంచ్ బాపు.* 

 

పుట్ట మధు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఊర్వలేక కాంగ్రెస్ పార్టీ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారని మహదేపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు అన్నారు. 40 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని పాలించిన దుదిల్ల శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా దామరకుంట లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారం లిఫ్ట్ ఇరిగేషన్ పంకిన లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం అని కూడా అసెంబ్లీలో లేవడెత్తడం జరిగింది ఇలాంటి పథకాలు ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కొత్తగా ఏమీ కాదని కేవలం శిలాఫలకానికే పరిమితం చేసి వదిలిపెట్టడం ఆనవాయితీగా వస్తుందని శ్రీపతి బాబు అన్నారు. శ్రీ పదరావ్ నుండి శ్రీధర్ బాబు వరకు ఈ ప్రాంతంలో ఒక్క ఎకరానికి నీరు అందించిన దాఖలాలు లేవని 40 సంవత్సరాల క్రింద పంకిన వాగులో మోటర్లు అమర్చి వదిలిపెట్టడం జరిగిందని కుంట్లం రాగి చెట్టు వద్ద ఇప్పటికీ ఒక మోటర్ ఉందని ఇలా కేవలం శిలాఫలకాలు కాలయాపన చేసి మాత్రమే కాలం గట్టెక్కిస్తున్నారని తెలిపారు. చిన్న కాలేశ్వరం కావాలని పలుమార్లు చెప్పడం జరుగుతుందని కానీ చిన్న కాలేశ్వరం నుండి మొదలుకొని కొన్ని కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనుండి పైపులు అమర్చడం జరిగిందని ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ పనులు సాధించకపోవడంతో పైప్లైన్ వేసిన కంపెనీ తిరిగి పైప్ లైన్ ను తీసుకు వెళ్లడం జరిగిందని 2014లో పుట్ట మధు ఎం ఎల్ ఏ గా గెలుపొందిన అనంతరం కన్నేపల్లి చిన్న కాలేశ్వరం నుండి కాటారం వరకు ఫారెస్ట్  క్లియరెన్స్ ను తీసుకువచ్చి పనులు చేపట్టడం జరిగిందని ప్రస్తుతం కేవలం ప్రారంభ దశకు వచ్చి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ బాబు పనులు ప్రారంభించే సత్తా లేక తిరిగి అసెంబ్లీలో లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అలాగే డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సౌకర్యాన్ని పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా అందించి చెప్పడం విద్యార్థులతో చర్చించడం తప్పు కాదు కదా జూనియర్ కళాశాల లో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించవచ్చు కదా అని దానికి మీరు భోజనం పెడితే తమకేమీ అభ్యంతరం లేదని విద్యార్థులకు సదుపాయాలు సొంతగా కలిగిస్తే రాజకీయాలు చేయడం మానేయాలని శ్రీపతి బాబు అన్నారు.

 

 *ప్రజలను ముసుగేసి ఉంచిన ఎంఎల్ఏ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అని నేటికీ ప్రజలకు తెలియని దుస్థితి. సీనియర్ నాయకుడు బాపు* .

 

నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన శ్రీధర్ బాబు నియోజకవర్గ ప్రజలకు కేవలం ఏదో చేస్తానని అభివృద్ధి పేరుతో ముసుగు వేసి ఉన్నాడే తప్ప ఏమీ చేయలేదని బీసీ సెల్ మండల అధ్యక్షుడు కార్మికుల బాపూరావు అన్నారు. అలాగే నియోజకవర్గానికి శాశ్వతంగా నేనే పాలిస్తానని ఊహలు శ్రీధర్ బాబు ఉన్నారని తెలుపుతూ ఎమ్మెల్యే హోదాలో ఉన్న శ్రీధర్ బాబు ప్రభుత్వం నుండి నియోజకవర్గానికి ఎన్ని నిధులు వస్తున్నాయి వాటికి సంబంధించి అభివృద్ధి పనులు ఎలా కొనసాగుతున్నాయి పనుల స్థితిగతులు ఎక్కడ వరకు చేపట్టడం జరిగింది అనే అవగాహన ఉందా అని ప్రశ్నిస్తూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చైర్మన్గా ఎమ్మెల్యే ఉన్నారని అధిక జనాభా ఈ విషయం తెలవదని ఎద్దేవా చేశారు. ఆసుపత్రికి దయచేసి సెంటర్ సాంక్షన్ అయ్యి ఏడు నెలలు గడుస్తున్న అనేకమంది కిడ్నీ వ్యాధిన వారి పడి పట్టణాలకు డయాలసిస్ కొరకు వెళుతున్నారని తాను విద్యావంతుడు గా ఉన్న ఎమ్మెల్యే అని చెప్పుకోవడమే ఏమి చేశారని ఎందుకు డయాలసిస్ సెంటర్ ను ఇప్పటికీ పూర్తి చేయలేకపోయాడు అన్న విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని బాపూరావు డిమాండ్ చేశారు. ప్రజలు ప్రశ్నిస్తే ప్రభుత్వం లేదని అనడమే శ్రీధర్ బాబుకు సులువని పదవి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి శ్రీధర్ బాబు చేసింది ఏమిటని నేను సూటిగా ప్రశ్నిస్తున్నానని బాబురావు బహిరంగ సభకు సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక శాసనసభ్యులు తమ ప్రాంతాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లారని అనేక వసతులను కల్పించి నేడు ఆ నియోజకవర్గాలు కళకళలాడే రా చేశారని కానీ శ్రీధర్ బాబు మాత్రం ప్రభుత్వంలో ఉన్న నియోజకవర్గానికి ఏమీ చేయలేదని కార్మికుల బాపూరావు అన్నారు.

 

 

 *ఆసుపత్రి సమస్యలపై చైర్మన్ చెప్పాలి కానీ మధ్యవర్తులు సమాధానాలు చెప్పడం విచిత్రం. ఆన్కారి ప్రకాష్.* 

 

జిల్లా జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులు మౌనిక వసతులు లేకపోవడంతో చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబును ప్రశ్నించడం జరిగిందని జడ్పీ చైర్మన్ అడిగిన ప్రశ్నకు చైర్మన్ సమాధానాలు చెప్పాలి కానీ మధ్యవర్తులు లేనిపోని మాటలు చెప్పి ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం చేయకూడదని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అన్కారీ ప్రకాష్ అన్నారు. జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని సందర్శన క్రమంలో అనేక మంది రోగులు ఆసుపత్రిలో ఇబ్బందులకు గురవుతున్న సమస్యలను జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగిందని మంచినీరు మరుగుదొడ్లు రక్త పరీక్షల కు సంబంధించి ఇబ్బందులు అలాగే స్త్రీలకు ప్రత్యేక వైద్య నిపుణురాలు లేకపోవడం సమయానికి డాక్టర్లు రాకపోవడం లాంటి అనేక సమస్యలను జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహరిషరి దృష్టికి తీసుకురావడం జరిగిందని ప్రత్యేకంగా దినసరి కూలీతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కూడా నాలుగు నెలలుగా తమ జీతాలు రావడంలేదని చెప్పుకోవడం జరిగిందని ఆసుపత్రి ప్రస్తుత దినస్థితిను దృష్టిలో పెట్టుకొని జడ్పీ చైర్మన్ ఆసుపత్రి అభివృద్ధి చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎందుకు సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కరించడం లేదని ప్రస్తుతం జరిగిందని ప్రకాష్ అన్నారు. కానీ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే సమాధానం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకులు లేనిపోని సమాధానాలు చెప్పడం సరైన పద్ధతి కాదని చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేకు ఆసుపత్రి నువ్వు మౌలిక వసతుల కల్పన ఆసుపత్రి అభివృద్ధిపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసే బాధ్యత ఎమ్మెల్యేకు ఉందా లేదా అని ప్రశ్నించారు జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని కేవలం ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారని ఆసుపత్రి అభివృద్ధి వారి బాధ్యత అని మాత్రమే ప్రశ్నించడం జరిగిందని దానికి ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వాస్తవాలు బయటికి పడడంతో కళాశాలలో భోజనం పెట్టడం లాంటి కార్యక్రమాల వైపు వాస్తవాలను కప్పి పుచ్చడం కొరకు చేసే ప్రయత్నాలు మానుకోవాలని ప్రజలందరూ గమనిస్తున్నారని మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే టిఆర్ఎస్ పార్టీ ఊరుకోలేదు లేదని ఈ సందర్భంగా ప్రకాష్ హెచ్చరించారు.

 

 

 *జడ్పీ చైర్మన్ ఆసుపత్రిలో సమస్యలను బహిర్గతం చేస్తే కాంగ్రెస్ అనుచిత వాక్యాలు చేయడం అవగాహన లోపం. లక్ష్మణ్.* 

 

కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు క్యాబినెట్ హోదా కలిగిన జిల్లా పరిషత్ చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారికి అవగాహన లోపం స్పష్టంగా కనబడుతుందని టిఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు మెరుగు లక్ష్మణ్ అన్నారు. జడ్పీ చైర్మన్ సామాజిక ఆసుపత్రికి సందర్శించి అక్కడ ఉన్న లోటుపాటులను రోగులు పడుతున్న ఇబ్బందులను ప్రజల ముందుకు తీసుకురావడం జరిగిందే తప్ప మరి మీ కాదని రాష్ట్ర ప్రభుత్వం రోగులకు అందించే వసతుల పరిస్థితులు కూడా అడిగి తెలుసుకోవడం జరిగిందని కానీ 2018 నుండి ఆసుపత్రి రోగులకు సంబంధించి అనేక ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని రోగులు పలు ప్రజలు కూడా చెప్పడం జరిగిందని లక్ష్మణ్ అన్నారు. కేవలం జడ్పీ చైర్మన్ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించుటకు మాత్రమే సామాజిక ఆసుపత్రి అభివృద్ధి చైర్మన్ ఎమ్మెల్యే ఉండడంతో వారిని ప్రశ్నించడమే తప్ప వారిపై కక్ష ద్వేషంతో చెప్పలేదని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గమనించాలని లక్ష్మణ్ కోరారు. వాస్తవ పరిస్థితులను గాలికి వదిలేసి స్థానిక నాయకులు వార్డ్ మెంబర్ కు కూడా గెలవైనటువంటి వారు క్యాబినెట్ స్థాయి ప్రజా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారు కూడా పెద్దవారు అవుతారని ఊహలో ఉండి చెప్పడం సరైన పద్ధతి కాదని అన్నారు. జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే పై ప్రశ్నిస్తే దానికి సమాధానం ఎమ్మెల్యే ఇవ్వాలని కేవలం నియోజకవర్గంలో కుల అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే అది ఎంఎల్ఏ శ్రీధర్ బాబు అని కేవలం ఒక దళిత జడ్పీ చైర్మన్ శ్రీధర్ బాబు కు ప్రశ్నించడం ఏంటిదది ఒక కుల అహంకారంతోనే కిందిస్థాయి వారి నుండి అనిత వాక్యాలు చేయించడం జరుగుతుందని మెరుగు లక్ష్మణ్ అన్నారు. ఈ పత్రిక సమావేశంలో ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీపతి బాపు, మంథని మహిళ ఇంచార్జి కేదారి గీత, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పెండ్యాల మమత, ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, మండల యూత్ అధ్యక్షుడు యండి అలీమ్ ఖాన్,   జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్,మండల ఉపాధ్యక్షుడు లింగాల రామయ్య,బిసి సెల్ మండల అధ్యక్షుడు బాపు రావు మండల నాయకులు అంకారి ప్రకాష్,మెరుగు లక్ష్మణ్, శేఖర్, టౌన్ యూత్ అధ్యక్షుడు రాజశేఖర్, సతీష్, టిల్లు, ఉన్నారు

దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి అధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

అన్నసాగర్ గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో

మహబూబ్ నగర్ జిల్లా 

చిన్నచింతకుంట మండలం

తిరుమలాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన వడ్డే రాజపేట రాములు,వడ్డె వెంకటన్న,వడ్డె సత్యన్న, భాస్కర్ తో పాటు టిడిపి పార్టీ కి చెందిన కార్యకర్తలు రామచంద్రయ్య,అంజయ్య,శ్రీనివాసులు,తప్పులిస్టు రామచంద్రయ్య,మైలు బాలరాజు తో పాటు పలువురు

 ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీల చేరినారు.

వారికి గులాబీ కండువాలు కప్పి బిఆరెఏస్ పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై బిఆరెఎస్ పార్టీ లో చేరుతున్నామని వారు అన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయడానికి పార్టీశ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version