నేనొక్కడినే!

`రాజకీయమంతా రే’వంతే’!

`హస్తంలో ఇది రేవంత్‌ హయామంతే!

`సీనియర్లందరికీ పొగే?

`సెగ తగిలిస్తేగాని కదలరని తెలిసే!

`ఒక్కరొక్కరినీ సాగనంపితేనే!

`ఎన్నికల నాటికి తనకు ఎదురులేకుండా వుండాలంతే!

`తన ఎజెండా మాత్రమే నడవాలంతే!

`నా అనుచరులకే టిక్కెట్లంతే!

`ఇదే ఫైనల్‌…ప్రశ్నిస్తే కోవర్టే!

`ఎదిరిస్తే సోషల్‌ మీడియాలో బెదిరింపే!

`వన్‌ మ్యాన్‌ షో…అంతే!

`రేవంత్‌ జోలికొస్తే ఇక అంతే..రాజకీయంగా అంతే!

గతంలో పది మందిని కలుపుకుపోయే నాయకత్వం కావాలే గాని, కెలుక్కుంటూ పోయే నాయకత్వం వద్దనేవారు. కాని ఇప్పుడు కాలం మారింది. రేవంత్‌ రెడ్డి లాంటి నాయకులకు అది కుదిలేలా లేకుండాపోతోంది. అందరికోసం సమయం కేటాయించడం కానిపనౌతోంది. అందరికోసం చూస్తూ కూర్చుంటే పనయ్యేలా లేకుండా వుంది. తన దర్శనానికి ఎల్‌ వన్‌, ఎల్‌ టూ అంటూ ఎన్ని విమర్శలొచ్చినా రేవంత్‌ తీరులో మార్పు రావడంలేదు. పైగా ఆయన వ్యవహార శైలిలో మరింత దూకుడే కనిపిస్తోంది తప్ప, వెనకడుగు లేకుండా చూసుకుంటున్నాడు. ఇక రాజకీయమంతా రేవంత్‌దే అన్నంతగా కాంగ్రెస్‌ రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు. పార్టీమీద పట్టు సాధిస్తున్నాడు. కాని ఇది పార్టీకి శ్రేయస్కరమా? కాదా? అన్నది ఇప్పటికీ అంతు చిక్కకుండా వుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా వున్న రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన 48 గంటల్లో మునుగోడు నియోజకవర్గంలో పెద్దఎత్తున సభ నిర్వహణ అన్నది అంత సులువైన పని కాదు. అంతే కాదు కాంగ్రెస్‌లో అసమ్మతిని ఎదరుర్కొలేక పోయిన నాయకులే చరిత్రలో ఎక్కువగా కనిపిస్తారు. కాని అసమ్మతిని తొక్కేస్తూ రాజకీయం చేస్తున్న నాయకుడిగా మాత్రం రేవంత్‌ మిగిలిపోతాడని చెప్పడంలో సందేహంలేదు. ఒకనాడు కాంగ్రెస్‌ పార్టీలో రాజశేఖరరెడ్డి పాత్ర కూడా ఇలాగే వుండేది.

ఆయన 1980వ దశకంలోనే యువ నాయకుడిగా వున్నప్పుప్పుడే పిసిసి. అధ్యక్షుడయ్యాడు. కాని ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా అసమ్మతి నేతగానే ముద్రపడ్డాడు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన క్రియాశీలకపాత్ర పోషించినా, ఆయనను రాష్ట్ర కాంగ్రెస్‌లో కాకుండా డిల్లీ కాంగ్రెస్‌కే పరిమితం చేశారు. కడపకు మాత్రమే పరిమితమయ్యేలా చేశారు. ఇక కాంగ్రెస్‌లో నాటి పరిస్ధితులల్లో సీనయర్ల ప్రస్తానం కూడా ఇంత నల్లేరు మీద నడకకాలేదు. వారి ముప్పు తిప్పలు పడిన సంరద్భాలే ఎక్కువ. ప్రతి సారి అధిష్టానానికి సంజాయిషీ చెప్పుకున్నవాళ్లే ఎక్కవ. కాని రేవంత్‌రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతువంతుడనే చెప్పాలి. ఆయనను వ్యతిరేకించిన వాళ్లంతా పార్టీని వదలాల్సి వస్తోంది. అవసరమైతే వదిలేలా చేయాల్సివస్తోంది. నోరు తెరిస్తేచాలు కోవర్టు అనే ముద్ర వేసి మరీ కాంగ్రెస్‌ శ్రేణుల చేత తిట్టించాల్సివస్తోంది. ఇది కూడా సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల్లో ఒక రకమైన అంతర్మధనానికి దారి తీస్తోంది. అందరినీ సైలెంటుగా వుండేలా చేస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యం అన్నది నిన్నటిదాకా చెప్పుకున్న గొప్ప ఘనత లేకుండాపోతోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసెడెంటు అయ్యే ముందు, అయిన తర్వాత చూసిన తుఫానును ఆయనను రాటుదేలా చేసిందా? 

అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమౌతోంది. ఇక సీనియర్ల ముందు చేతులు కట్టుకొని నిలబడినంత కాలం వాళ్లు గోడ కుర్చీ వేయించే ప్రయత్నం చేస్తారని తెలుసుకున్న రేవంత్‌ వారి నోటికి తాళం వేయడం మొదలుపెట్టాడు. అవసరాన్ని బట్టి పరుషమైన భాషను కూడా వాడుతూ, తన తనదైన శైలిలో సాగుతున్నాడు. సీనియర్‌ నాయకులైన కోమటి రెడ్డి బ్రదర్స్‌ విషయంలో వైన్స్‌ షాపు దగ్గర నుంచి మొదలుపెడితే పండబెట్టి తొక్కుతా? అన్నంత దాకా రేవంత్‌ మాట్లాడాడు. ఆఖరుకు వెంకటరెడ్డికి తెలియకుండానే, ఆయన ప్రమేయం లేకుండానే మునుగోడులో సభ ఏర్పాటు చేశాడు. సభ సక్సెస్‌ చేశాడు. వెంకట్‌రెడ్డి పెద్ద తోపేం కాదని నిరూపించే ప్రయత్నం చేయాల్సినంత చేశాడు. మునుగోడులో ఒక రకంగా కాంగ్రెస్‌కు పాజిటివ్‌ వాతావరణం సృష్టించాడు. కాంగ్రెస్‌ పార్టీ అక్కడ గెలుస్తుందా? లేదా? అన్నది పక్కనపెడితే, తన మాట చెల్లుబాటౌతుందా? లేదా? అన్నదే రేవంత్‌కు ముఖ్యమైపోయినట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్‌ విషయంలోనూ ఇదే చేశాడు. ముందే అక్కడ చేతులెత్తేశాడు. స్ధానికేతరుడైన బల్మూర్‌ వెంకట్‌ను రంగంలోకి దింపాడు. ఓట్లు పడకుండా చేసుకున్నాడు. అయినా ఆయన తాను చేసింది తప్పు అని ఇప్పటికీ అంగీకరించడం లేదు. తాజాగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం అన్ని మీడియా సంస్ధల ముందుకొచ్చి, తాను అలిగానని, భుజ్జగిస్తే ఆలోచిస్తానంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు.

దీన్ని రేవంత్‌ ఎంతో చాకచక్యంగా వినియోగించుకున్నాడు. ఒక రకంగా చెప్పాంలంటే తప్పంతా అద్దంకి దయాకర్‌ మీద తోతేసి, తన తప్పేం లేదన్నది తేల్చేశాడు. అంటే రేవంత్‌ ఎటు వైపైనా రాజకీయం చేయగలడని రుజువు చేసుకున్నాడు. రెడ్డి, రెడ్డి ఒకటే గాని అద్దంకి దయాకర్‌ వేరు అని నిరూపించాడు. ఇది పార్టీలో ఎలాంటి సంకేతాలను పంపిస్తుందన్నది కూడా ఆలోచించకుండానే రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోలేం. ఎంకి పెల్లి సుబ్చి చావుకొచ్చిందని రేవంత్‌ రెడ్డి చెప్పిన క్షమాపణ నేను చూడలేదని, అద్దంకి దయాకర్‌ను పార్టీనుంచి శాశ్వతంగా సస్పెండ్‌ చేస్తే తప్ప తాను పార్టీ కోసం ఆలోచించను. అంటూ వెంకటరెడ్డి మరో కొత్త రాగం అందుకున్నాడు. ఇది కూడా వెంకటరెడ్డి అనకుండా వుండలేరని అందరికీ తెలిసిందే… ఒక రోజంతా తనను పార్టీ పట్టించుకోవడం లేదన్న మాటలను మాట్లాడుతున్న వెంకటరెడ్డిని మరోసారి బోనులోకి పిలవడం అంటే, ఏమిటో రేవంత్‌ మరో రాజకీయం చేస్తే గాని తత్వం ఆయనకు పూర్తిగా బోధపడేలా లేదు. సీనియర్లు వుండొద్దన్నదే రేవంత్‌ లెక్క. ఆయనకు ఎదురుండొద్దన్నదే రేవంత్‌ రాజకీయం. తన మాటకు విలువ ఇవ్వని వాళ్లను పార్టీకి దూరం చేయడమే రేవంత్‌ లక్ష్యంగా పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. మొత్తంగా తనకు ఎదురులేని రాజకీయాలు చేయాలన్న కసితో రేవంత్‌ పని చేస్తున్నాడు. ఒక రోజంతా రేవంత్‌ను అన్ని మీడియాల్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన అన్ని వ్యాఖ్యలకు రేవంత్‌ ఒక్క మాటతో సమాధానం చెప్పాడు. సారీ అని చెప్పేశాడు. మొహమాటానికి వెళ్లకుండా బేషరుతుగా రేవంత్‌ క్షమాపణ చెప్పేశాడు. వెంకటరెడ్డిని డైలమాలో పడేశాడు. నిజానికి వెంకటరెడ్డి ఇది ఊహించింది కాదు. రేవంత్‌ ఒక మెట్టు దిగి వస్తాడని ఆయన అసలే ఊహించలేదు. ఎలాగైనా రేవంత్‌ తన విధానంలో మార్పు తెచ్చుకున్నట్లు నటిస్తాడని కూడా ఆలోచించలేదు. ఇప్పుడు బంతి మళ్లీ వెంకటరెడ్డి కోర్టులోకి వెళ్లింది. ఇక కాంగ్రెస్‌ రాజకీయాల్లో పాలు పంచుకోకపోతే వెంకటరెడ్డిదే తప్పు అవుతుంది. తమ్ముడికి వ్యతిరేకంగా వెంకటరెడ్డి ముందుకు వెళ్లలేడు…పార్టీని కాదని వెనక్కి వెళ్లలేడు. కాకపోతే వెంకటరెడ్డి తమ్ముడికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తాడని ఎవరూ అనుకోవడం లేదు. ఇది రేవంత్‌కు కూడా బాగా తెలుసు. అందుకే కోరికోరి రేవంత్‌ చేత క్షమాపణ అడుక్కున్న వెంకటరెడ్డిని బాగానే ఇరికించాడు. మరోసారి వెంకటరెడ్డి గిలగిలలాడేలా చేశాడు. 1980 నుంచి రాజకీయాల్లో , వ్యాపారాల్లో వున్న తమకు జూబ్లీహిల్స్‌లో 400 గజాల్లో ఇల్లుంటే…రేవంత్‌కు 4000 గజాల్లో ఇల్లెలా వుందని ప్రశ్నించిన వెంకటరెడ్డి అదే మాట మీద నిలబకుండా చేశాడు. ఒక ఎస్పీ, హోంగార్డుకు క్షమాపణ చెప్పాల్సివస్తే చెబుతానని రేవంత్‌ నిరూపించుకున్నాడు. సీనియర్లందరి నోరు ఒకేసారి మూయించేశాడు. తనదైన రాజకీయం ఆడేందుకే రేవంత్‌ నిర్ణయించుకున్నాడు. సీనియర్లెవరైనా సరే…తన గీతలో వుండాల్సిందే అంతే….ఇక్కడ రేవంత్‌ అంతే…లేకుంటే రాజకీయంగా అందరి అంతే..! పెదవిలో నవ్వు కళ్లల్లో కసి రెండూ ఏక కాలంలో చూపి వెంకన్న రాజకీయాన్ని డైలమాలో పడేశాడు…అద్దంకి దయాకర్‌ను బలిచేస్తారా? లేక వెంకటరెడ్డి సంగతి తెలిసిందే అని వదిలేస్తారా? అన్నది మాత్రం ఇప్పటికప్పుడు సస్పెన్స్‌….

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు..

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు నని విగ్నేశ్వర్ అన్నారు.. బాల సముద్రంలోని శ్రీనివాస్ గురుకుల్ హై స్కూల్ శనివారం ప్రముఖ స్పీకర్, మోటివేటర్, సిలువేరు విఘ్నేశ్వర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని దానికి తోడు సాధన చేస్తే అన్నిటిని సాధించవచ్చని, ఉన్నదాని విలువ తెలుసుకోకుండా లేనిదాని కోసం పాకులాడుతూ ఉన్న దాన్ని కోల్పోతున్నారు అని అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదు అని తెలిపారు.

తాను చిన్నప్పటి నుంచి ఉన్నత చదువులు చదివి సమాజ సేవ చేయాలనే సంకల్పంతో ఉండేది కానీ ప్రమాదవశాత్తు రెండు చేతులు పోయినప్పటికీ లక్ష్యసాధన కోసం శ్రమిస్తున్నాను.

తల్లిదండ్రులను,గురువులను, గౌరవించాలని తెలిపారు.

మన హంగు ఆర్భాటాల కోసం ప్రకృతి వనరులను హాని కలిగించకూడదని విద్యార్థులకు తెలియజేశారు. వాటిని కాపాడే బాధ్యత ముందు తరాలుగా విద్యార్థుల భుజాలపై ఉందని గుర్తు చేశారు. చివరగా చిరునవ్వుతో ఎన్ని కష్టాలేనా సాధించవచ్చు అని పిల్లల్లో స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చిదురాల సోమరత్నం, ఉపాధ్యాయులు వినయ్, విజయ్, శ్రీనివాస్, యుగంధర్ ,రమేష్ ,ఉదయ్, రజనీకాంత్, అనిల్ పాల్గొన్నారు.

ధరల మోతకు బాధ్యులెవరు?

`ధరల పెరుగుదలపై ఒకరిపై ఒకరి నిందలు?

`నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సిందెవరు?

`పన్నుల గుది బండను తగ్గించాల్సిందెవరు?

`2014లో సిలిండర్‌ ధర ఎంత?

`ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడెంత?

`ఎందుకింత పెరిగింది?

`సిలిండర్‌ సబ్సిడీకి మంగళం పాడిరదెందుకు?

`జిఎస్టీ వసూళ్ళు పెరిగితే చాలా?

`సంక్షేమ పథకాలు ప్రమాదకరమా?

`ప్రజలను మభ్యపెడుతున్నదెవరు?

`ధరల మద్దెల వాయిస్తూ నడ్డి విరుస్తున్నదెవరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఏ ఉపద్రవం ముంచుకొచ్చినా ముందుగా మునిగేది మధ్య తరగతి ప్రజలే…అమ్మో ఒకటో తారీఖు అని నిత్యం ఆగమౌతూ, నెలంతా భయపడుతూ బతికేది వాళ్లే…నెలలో ఒక్క రోజు వచ్చే ఒకటోతారీఖును కూడా కళ్లకద్దుకోలేని జీవితాలు మధ్య తరగతి వాళ్లవే…మన దేశంలో మెజారిటీ ప్రజలు మధ్య తరగతి ప్రజలే…అలాంటి ప్రజల జీవన ప్రమాణాలు నానాటికీ ఎందుకు దిగజారిపోతున్నాయి? ఈ గడచిన ఎనమిదేళ్ల కాలంలో మరీ ఎందుకు భజారునపడుతున్నారు. బతుకంటే ఎందుకు భయపడుతున్నారు…దినదిన గండంగా ఎందుకు బతుకులీడుస్తున్నారు. ప్రభుత్వాల మీద నమ్మకం ఎందుకు సన్నగిల్లుతోంది. ప్రభుత్వాలు ఆదుకుంటాయన్న విశ్వాసం ఎందుకు లేకుండపోతోంది….స్వాతంత్య్రం వచ్చిన కాలం నుంచి ధరల పెరుగుదల గురించి మాట్లాడుకుంటున్నా, ఇంతగా ధరల పెరుగుదలలో మోతను మాత్రం ఎప్పుడూ చూసింది లేదు. కారణం ఏమిటి? మనది ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజా స్వామ్య దేశం. సామ్యవాద బావాలను అమలు చేసే దేశం. మిశ్రయ ఆర్ధిక వ్యవస్ధకు పునాదులు పడిన దేశం. ఇలాంటి దేశంలో ప్రజలు నిత్యం సుఖ శాంతులతో జీవనం సాగాలి. ప్రకృతి వైపరిత్యాలు ఎదురైనప్పుడు బతుకు ఆగమైనా కాపాడుకున్న రోజులున్న దేశం మనది. అన్ని సమయాల్లో ప్రభుత్వాల సంక్షేమం వారిని కాపాడుతూ రావాలి. కాని ప్రజలు ఎందుకు ఇప్పటికీ అల్లాడుతున్నారు. సామాన్య జనం ఎందుకు విలవిలలాడుతున్నారు. మధ్య తరగతి బతుకులకు భరోసా ఎందుకు లేకుండాపోతోంది. దీనంతటికీ బాధ్యులు ఎవరు? అన్నది సామాన్యలకు కూడా అర్ధం కాని పరిస్ధితిలోకి ప్రభుత్వాలు నేట్టేస్తున్నాయి.ఇంతకీ సామాన్య ప్రజలు కోరుకునేది ఏమిటి?

తమకు నిత్యావసర వస్తువులు అందుబాటులో వుండాలి. చేసే పనికి సరైన వేతనం అందాలి. దోపిడీ వ్యవస్ధ పోవాలి. సమ సమాజ నిర్మాణం జరగాలి. అందరకీ కూడు, గూడు, గుడ్డ అందేలా జీవనం సాగాలి. ఇంతకన్నా ప్రజలు సహజంగా ఎక్కువ ఏదీ కోరుకోరు. ఇవన్నీ సరిపోయినంతగా వుంటే, విలాసవంతమైన జీవితం కోరుకుంటారు. అసలు బతకడమే కష్టంగా వున్న ఈ సమయంలో విలాస జీవితం గురించి కల కూడా కనలేని పరిస్ధితి ఎదురౌతోంది. దేశంలో జీఎస్టీ తీసుకొస్తే దేశమంతా ఒకే పన్ను విధానం అమలౌతుందని దేశ ప్రజలంతా ఆశించారు. కాని ఏమౌతోంది. తినే తిండి నుంచి మొదలు ప్రతి వస్తువు మీద జిఎస్టీ బాదుడుతో సామాన్యుడు కుదేలౌతున్నాడు. ఒకనాడు రూ.70 రూపాయలు వున్న వంటనూనే ఎందుకు ఇలా సలసలా కాగుతోంది. రెండు వందల యాభై రూపాయలదాకా ఎందుకు చేరింది? కారణం ఎవరు? మన వ్యవసాయ రంగం ఎటు పోతోంది? ఎరువుల ధరలు పెరుగాయి? విత్తనాల ధరలు పెరిగాయి? రైతులకు ఇచ్చే సబ్సిడీలకు మంగళం పాడారు? దాంతో వ్యవసాయం కూడా భారమైపోయే పరస్ధితి నెలకొన్నది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్డ్‌ నిత్యావసర వస్తువులైనా సరే జిఎస్టీ వడ్డించడంతో సామాన్యుడి మీద పడే భారం గురించి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోంచకపోవడం విడ్డూరం. ప్రజలకు ప్యాకేజ్డ్‌ నిత్యావసర వస్తువులు ఆయా కంపనీలు అలవాటు చేశాయి. గతంలో కిలో గోధుమ పిండి కొనుగోలు చేయాలన్నా విడిగా అమ్మేవారు. అందులో ఎంత కల్తీ జరిగిదో తెలియదు. ఇప్పుడు మార్కెట్‌లో కొన్ని కంపనీలు తమ వ్యాపారంలో మార్కెట్‌ పోటీని తట్టుకునేందుకు అవసరమైన కొత్త కొత్త పద్దతులు అనుసరిస్తున్నాయి. అందులో శుధ్దమైన, శుద్ది చేయబడిన నిత్యావసర వస్తువులను ప్యాక్‌ చేసి మరీ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. వాటిపై కూడా జిఎస్టీ వేసి సామాన్యులకు అది కూడా భారం చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయమే గాని, సామాన్యుడిని గాయం కావడంలేదా? తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు ఉచిత పధకాలు అలవాటు చేయడం అంత మంచిది కాదన్నంతగా మాట్లాడుతున్నారు. 

ఇది ఎవరూ సమర్ధించాల్సిన అంశం కాదు. ప్రభుత్వాలున్నవి ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే అన్నది మర్చిపోవద్దు. ప్రజా సంక్షేమం కాంక్షించకపోతే ప్రభుత్వాలు వున్నది ఎందుకు? పాలన చేస్తున్నదెందుకు? ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వహించడం అన్నది వ్యాపారంగా ప్రభుత్వాలు భావించొద్దు. కాని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యాపారం చేయదల్చుకోలేదు అంటూ వ్యాఖ్యానించిన సందర్భం వుంది. దాంతో ఎల్‌ఐసి లాంటి సంస్ధను కూడా ప్రైవేటు పరం చేయజడం జరిగింది. ఒకనాడు ఎల్‌ఐసి ప్రైవేటు వ్యక్తులు మొదలు పెట్టిందే. 19955లో మొదటి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ ఎల్‌ఐసిని ప్రభుత్వం పరం చేశారు. ప్రైవేటు బాగస్వామ్యం తగ్గించారు. ప్రభుత్వ రంగ సంస్ధగా తీద్దిద్దారు. దాంతో ఇప్పుడది సుమారు రూ.40వేల కోట్ల రూపాయల ఆస్ధులను కలిగివున్న సంస్ధగా గుర్తింపు పొందింది. ప్రజలకు ఒక భరోసా నింపుతోంది. అలాంటి సంస్దలను కూడా అమ్మకాలకు పెట్టి ప్రభుత్వాలు పాలన సాగించడంలో అర్ధమేమిటో సామాన్యులు కూడా తెలుసుకోవాల్సిన అసవరంవుంది. త్వరలో జరగనున్న గుజరాత్‌ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో బిజేపికి కేంద్రంలో ఆప్‌ పార్టీ ఒక గుదిబండగా మారింది. 

హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లలోనూ పోటీ చేస్తోంది. అక్కడ ప్రజలకు ఉచిత విద్య, వైద్యం గురించి పెద్దఎత్తున ప్రచారం సాగిస్తోంది. ఇది మొదటికే మోసం వచ్చేలా వుందన్న ఆలోచన చేసిన ప్రధాని మోడీ ఉచితాలు ప్రజలకు అలవాటు అంత మంచిది కాదన్న మాటలు చెప్పడంతో ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమాలను విస్మరిస్తే, కేంద్రం వాటిని హెచ్చరించాల్సిందిపోయి, కేంద్రమే సంక్షేమాలకు కోత పెట్టాలని ఒత్తిడి చేయడం అన్నది ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నార్ధకం చేస్తుందని చెప్పడంలో సందేహంలేదు. సేవా రంగాన్ని విస్మరించడం అన్నది పాలకులు చేసే అతి పెద్ద తప్పు. ఉచితాలు అమలు వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని అనడంలో సత్యం లేదు. అభివృద్ధి అంటే ఒక్క రోడ్లే కాదు…! ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం. ప్రజలు ఆరోగ్యంగా జీవించడం. మూడు పూటలా మూడు ముద్దలు తినగలగడం. నిరుద్యోగిత లేని సమాజం. వారానికి కనీసం 48 గంటల పని లభించడం. పేదలకు ప్రభుత్వ విద్య అందడం. ఉచిత వైద్య సేవలు అందించడం. మన దేశ ఆర్ధిక వ్యవస్ధ మొత్తం ముడిపడి వుందే వ్యవసాయ రంగంతో…దాని సమృద్ది అవసరం. సమ్మిళిత అభివృద్ది అంటే అన్ని రకాలైన ఆహార పదార్ధాలను రైతులు పండిరచేలా ప్రోత్సహించడం. ఇంత పెద్ద మన దేశంలో ఎన్నో నీటి వనరులున్నా, ఇప్పటికీ నూనె గింజల మీద మలేషియా లాంటి దేశాల మీద ఎందుకు ఆధారపడుతున్నాం? అన్నది పాలకులు ఆలోంచిడం లేదు. ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలన్న నిర్ణయాలు ఎందుకు చేయడం లేదు. ధరల పెరుగుదలకు కారణం ఎవరు?

అన్నదానిపై కూడా ప్రజల్లో ఒక అవగాహనం లేకపోవడం కూడా విపరీత పరిణామం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మూలంగానే నిత్యావస వస్తువుల ధరల పెరుగుతున్నాయని ప్రజలు భ్రమపడుతున్నారు. అందుకే ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్న ప్రతి చోట బిజేపి పాగా వేయగలుతోంది. కాని అది కేంద్రం వల్ల జరుగుతోందన్న సంగతిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల కూడా ఆ పార్టీలకు మొదటికే మోసం వస్తోంది. తెలంగాణలో కూడా మునుగోడు ఉప ఎన్నిక త్వరలో జరగనున్నది. సోషల్‌ మీడియా పెద్దఎత్తున ప్రజాభిప్రాయం సేకరిస్తోంది. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ధరల పెరుగుదలకు కారణం రాష్ట్ర ప్రభుత్వం, టిఆర్‌ఎస్‌ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే వారికి జరుగుతున్నదానిపై అవగాహన లేదు. సంక్షేమ పధకాలు అందిస్తోంది టిఆర్‌ఎస్‌ అని తెలిసినా, ధరలు కూడా మరో పక్క పెంచుతోందన్న భ్రమల్లో ప్రజలుంటున్నారు. దాన్ని టిఆర్‌ఎస్‌ నేతలు గమనించడం లేదు. ప్రజల్లో చైతన్యం కల్గించాలన్న సోయిలో వారు లేరు. ఇప్పటికైనా మేలుకోండి. సామాన్యుల ఆలోచనల్లో మార్పును గమనించండి. వారిలో వున్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయండి. లేకపోతే ధరల పాపమంతా టిఆర్‌ఎస్‌దే అన్న ఆలోచనలో సామాన్యులున్నారు. అది ఉప ఎన్నిక మీద తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. ఏ గ్రామంలోని టిఆర్‌ఎస్‌ నాయకులు ఎక్కడికక్కడ ఈ విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. పెరుగుతున్న ఉప్పు, పప్పు, నూనెల ధరలకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్న సంగతి చెప్పుకోలేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ముందు టిఆర్‌ఎస్‌ నేతలు మేలుకోండి. ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం ముందు చేయండి. ఆ తర్వాత ప్రచారం చేసుకోవచ్చు.

ప్రభుత్వ వైద్యుల స్పందనకు అభినందనల వెల్లువ.

ప్రభుత్వాసుపత్రిలో ప్రసవ సేవలు భేష్‌…

ఆర్టీసీ డ్రైవర్‌ ఔదార్యం

ఆర్టీసీ డ్రైవర్‌, ప్రభుత్వాసుపత్రి వైద్యలను పలువురు అభినందించారు. 

ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులు- సమయస్ఫూర్తి కనబర్చిన డ్రైవర్‌

గర్భిణీని ప్రభుత్వాసుపత్రికి తరలింపు…

ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం- పండంటి బిడ్డ జననం

భూపాలపల్లి,నేటిధాత్రి: ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న గర్భిణీ సెగ్గం లహరికి వున్నట్టుండి నొప్పులు మొదలయ్యాయి. విషయం తెలిసిన బస్సు డ్రైవర్‌ హుటాహుటిన బస్సును భూపాలపల్లి జిల్లా వంద పడకల ప్రభుత్వాసుపత్రికి మళ్లించాడు.

మధ్యలోనే ఆసుపత్రికి కండక్టర్‌ సమాచారం చేరవేశారు. స్పందించిన ప్రభుత్వాసుపత్రి వైద్యరాలు డాక్టర్‌. మౌనిక నేతృత్వంలోని బృందం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సు ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకునే సరికి స్టేచర్తో సహా సిబ్బంది రెడీగా వున్నారు. వెంటనే లహరిని ఆసుపత్రిలోని ఆపరేషన్‌ థియేటర్లలోకి తరలించారు. లహరికి సాధారణ ప్రసవం చేశారు. పండంటి బాబుకు లహరి జన్మనిచ్చింది. దాంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రి వాతావరణం సందడిగా మారింది. సమయానికి స్పందించి బస్సును ఆసుపత్రికి తీసుకొచ్చిన డ్రైవర్‌ ను అందరూ అభినందించారు. సకాలంలో స్పందించిన ఆసుపత్రి సిబ్బందికి లహరి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్‌ వుంది. ప్రవస సమయం తెలుసుకునేందుకు మహా ముత్తారం మండలం పొలంపల్లి లహరి పరకాలలో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ప్రసవానికి ఇంకా సమయం వుందని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో ఆమె తిరుగు ప్రయాణమైంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. చివరికి కథ సుఖాంతమైంది. ఈ వైద్యంలో స్టాప్‌ నర్సు మానస,నరేష్‌,ఎఫ్‌ ఎన్‌ఓ సౌందర్యలు పాల్గొన్నారు. లహరికి మూడు కిలోల బాబు జన్మించాడని ,తల్లి బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సంజీవయ్య ఆకుల తెలిపారు.

చేటు తెచ్చిన చెలిమి?

`ఈటెల గెలుపు రేవంత్‌ మెడకు?

`హుజూరాబాద్‌ ఎన్నికల నాడు ఎంత మంది చెప్పినా వినలే!

`టిఆర్‌ఎస్‌ ఓడితే చాలనుకున్నాడు?

`బిజేపి బలపడితే మొదటికే మోసమని గ్రహించలేకపోయాడు?

`టిఆర్‌ఎస్‌తో రోకలి దరువే ఉండేది?

`ఈటెలకు సపోర్ట్‌ చేసి మద్దెల దరువు తెచ్చుకున్నాడు?

`బిజేపికి లేని ధైర్యం తెచ్చి, తను కుదేలయ్యాడు?

`కాంగ్రెస్‌ నేతలను ఈటెల లాగేస్తుంటే చూస్తూ వుండాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు?

`మొన్నటి దాకా టిఆర్‌ఎస్‌తో పోరాడితే పోయేది!

`ఇప్పుడు పక్కలో బల్లెమైన బిజేపితో ఎలా వేగేది?

`చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహదేవా? అని ఊరికే అనలేదు!

`రేవంత్‌ దూకుడు ముంచిన కొంప?

`నల్లేరు మీద నడకను కొంప కొల్లేరు చేసుకున్నాడు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నవ్వు నాకు రక్ష…నేను నీకు రక్ష…ఎక్కడైనా బాగుంటుందేమో! కాని రాజకీయాల్లో సరిపడదని మరోసారి రుజువైంది. అందుకు తగిన మూల్యం పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుభవిస్తున్నట్లే కనిపిస్తోంది.

ఎంత గొప్ప మేధావులైనా సరే తమ గోతిని తామే తవ్వుకుంటారంటే ఇదే…ఈటెల రాజేందర్‌ హుజూరాబాద్‌లో గెలుపుకు పరోక్షంగా సహకరించి, చేసిన తప్పుకు రేవంత్‌ అనుభవిన్నాడు. ఎంతో కాలంగా ఎదురుచూసిన పిపిసి పదవి వచ్చిన కొత్తలో రేవంత్‌రెడ్డికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. కాని ఒక్కసారిగా ఆయన కాడి కిందపడేసినంత పనిచేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నానని అనుకున్నాడే గాని, తర్వాత తానే గుడ్లు తేలేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నానని ఊహించలేకపోయాడు. కాకపోతే అందరూ అప్పటికే రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. హుజూరాబాద్‌ లాంటి అవకాశాన్ని రేవంత్‌ రెడ్డి చేజేతులా వదిలేసుకోవడం వల్ల భవిష్యత్తులో తీరని నష్టం కూడా ఎదుర్కొక తప్పదన్న సంగతిని రాజకీయ మేధావులు సైతం చెప్పి చూశారు. కాని రేవంత్‌ రెడ్డి వినలేదు. ఎవరి మాట ఆయన వినిపించుకోలేదు. పార్టీలోని సీనియర్లు చెప్పిన మాటలు కూడ ఆయన పెడ చెవిన పెట్టారు. ఒంటెద్దుపోకడలు పోయారు. పార్టీ ప్రచార బాధ్యతలు ఆనాడు సీనియర్లకు ఎవరికీ అప్పగించలేదు. ఆయన కూడా పెద్దగా అక్కడ దృష్టి కేంద్రీ కృతం చేయలేదు. రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ లాంటి నాయకుడిని పోటీలోకి దింపి కూడా బలంగా ప్రచారం చేయాలని చూడలేదు. పోటీలో వెంకట్‌ను నిలబెట్టి మమ అనిపించాడు. రాజకీయంగా ఆయన చేసిన తొలి అడుగే తప్పటడుగు వేశాడు. దిక్కుకోలేని తప్పు చేశాడు. పార్టీలో ఓ వైపు నిత్యం సెగను అనుభవిస్తున్న రేవంత్‌రెడ్డి, రాజకీయ పక్షాలతో కోరి సెగను అరువు తెచ్చుకున్నట్లు చేసుకున్నాడు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓడితే చాలనుకున్నాడు. టిఆర్‌ఎస్‌ వీకౌతుందని రేవంత్‌ అంచనా వేసుకున్నాడు. కాని బిజేపి బలపడుతుందని కల గనలేదు. తెలంగాణలో పెద్దగా ప్రభావం లేని బిజేపి పుంజుకోవడం అంత సులువు కాదని ఊహించుకున్నాడు. పైగా ఆ ఎన్నిక కేవలం ఈటెల రాజేందర్‌, టిఆర్‌ఎస్‌ల మధ్య ఎన్నికగానే రేవంత్‌ పరిగణించాడు. కాని భవిష్యత్తులో అది కాస్త రాజకీయ రణమౌతుందని అనుకోలేకపోయాడు. కనీసం మేధావులను సైతం సంప్రదించి అడుగులు వేయలేకపోయాడు. హెచ్చరించేవారి మాటలు కూడా వినిపించుకోలేదు. ఈటెల గెలిస్తే ఆ గెలుపు ఆయన ఖాతాలో పడుంతుందే తప్ప బిజేపికి పెద్ద లాభం వుండకపోవచ్చనుకున్నాడు. అంతే కాదు ఈటెల కూడా బిజేపిలో ఇమడకపోవచ్చని కూడా రేవంత్‌ అనుకున్నట్లున్నాడు. ఎందుకంటే అప్పటికే ఈటెల వామపక్ష భావజాలం నరనరాన జీర్ణించుకున్న నాయకుడు బిజేపిలో నెగలడం కష్టమని అందరూ చర్చించుకునే ట్రాప్‌లో రేవంత్‌ పడ్డాడు. ఆ మాటలే నిజమని నమ్మి బోల్తా పడ్డాడు. ఇప్పుడు ఈటెల తన రాజకీయ చాణక్యం చూపిస్తుంటే దిక్కు తోచని స్ధితిలో రేవంత్‌కొట్టుమిట్టాడుతున్నాడు. 

టీఆర్‌ఎస్‌ చేతిలో ఓటుకు నోటు కేసుతో కుదేలైన రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే బెబ్బులిలా చెలరేగిపోతాడని పార్టీ అంచనా వేసింది. ఎంతో మంది సీనియర్లను కాదని ఆయన చేతిలో పిపిసి పెట్టింది. ఇంత వరకు బాగానే వుంది. అసలు రేవంత్‌ రెడ్డి పార్టీలోకి వచ్చిన వెంటనే ఆయనకు వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఆఫర్‌ చేశారు. అది ఆయనకు కలిసొచ్చింది. కాని పిపిసి కావడానికి చాలా కాలం పట్టింది. అలా పదవి దక్కడానికి పట్టినంత సమయం కూడా ఆయన వెచ్చించకుండానే కొత్త శత్రువును బిజేపి రూపంలో ప్రజాక్షేత్రంలో పెంచి పోషించుకున్నాడు. రేవంత్‌ రెడ్డి పిపిసి అయిన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే ఎంతో ఆవేశంగా కోవర్టులు వెల్లిపోచవచ్చు అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. నిజానికి అప్పటి వరకు వున్న పిపిసి అధ్యక్షుడైన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి లాంటివారే టిఆర్‌ఎస్‌ కోవర్టులుగా ముద్ర పడి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో టిఆర్‌ఎస్‌కు రాష్ట్రంలోనే వ్యక్తిగతంగా బలమైన శత్రువు రేవంత్‌ రూపంలో కాంగ్రెస్‌కు కనిపించింది. ఇప్పుడు అదే పాపమై పార్టీ మెడకు చుట్టుకుంటోంది. రేవంత్‌ను కూడా గిలగిల లాడిస్తోంది. 

పార్టీలో కోవర్టులు వెళ్లిపోతే చాలు తన హవా కొనసాగుతుందని రేవంత్‌ లెక్కలేసుకున్నాడు. కాని రెక్కలు తెగిపోతే తానొక్కడే ఎగడరడం కష్టమౌతుందని అంచనా వేసుకోలేకపోయాడు. ఇప్పటికే చాలా మంది రేవంత్‌కు దూరమయ్యారు. పార్టీకి కూడా దూరమౌతున్నారు. అదే దారిలో మరి కొందరిని దూరం చేసే పనిలో ఈటెల రాజేందర్‌ పడ్డారు. దాంతో రాజకీయం రంజులో పడిరది. ఈటెల రాజేందర్‌ గెలిస్తే టిఆర్‌ఎస్‌ను ఢీ కొట్టడం చాలా తేలిక అనుకున్నాడు రేవంత్‌. కాని అదే ఈటెలతో సమరం చేయాల్సి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు బిజేపిలో చేరికల కమిటీ చైర్మన్‌ అనే పదవి దక్కించుకొని ఈటెల రాజేందర్‌ నెరుపుతున్న రాజకీయం కాంగ్రెస్‌నే దెబ్బకొడుతుందే తప్ప టిఆర్‌ఎస్‌కు జోలికి వెళ్లడం లేదు. టిఆర్‌ఎస్‌లో స్వయం అసంతృప్తులు కొంత మంది పార్టీని వీడినా వాళ్లుకూడా కమలం వైపు చూస్తున్నారే గాని, హస్తం సాయం కోసం ఎదురు చూడడం లేదు. కాంగ్రెస్‌ వైపు చూడాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. ఇటు కాంగ్రెస్‌నుంచి వీడుతున్న వారు, అటు టిఆర్‌ఎస్‌ నుంచి దూరమౌతున్న వారందరికీ బిజేపి ద్వారాల వైపే చూస్తున్నారు. నిజానికి హుజూరాబాద్‌ ఎన్నికల వరకు బిజేపికి నిజానికి అంత బలం లేదు. ఆ పార్టీకి ప్రచారం కూడా లేదు. కాని ఈటెల గెలుపు తెచ్చిన ఊపుతో ఇక మొదలైన ఆటలో కాంగ్రెస్‌ పార్టీ కుదేలు కావడానికి ప్రధాన కారణంగా రేవంత్‌ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నాడు. ఆరేళ్లలో ఇంతగా చతికిలపడని కాంగ్రెస్‌ ఇప్పుడే ఎందుకు పడుతుందన్న దానికి రేవంత్‌రెడ్డే సమాధానం చెప్పాలి. కోవర్టులన్న ముద్ర వున్నవారి హయాంలో కూడా పార్టీనీ వీడి బిజేపిలో చేరిన వారు లేరు. ఇప్పుడు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ నేతలు బిజేపి వైపు క్యూ కడుతున్నాడు. రేవంత్‌ను దూకుడును మొగ్గలోనే తుంచేస్తున్నారు.

నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ వెళ్లగడమే కాదు ఏకంగా పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేశాడు. ఈటెల సారధ్యంలోని చేరికల కమిటి సినీ నటి సికింద్రాబాద్‌ మాజీ ఎమ్మెల్యే జయసుధను పార్టీలోకి ఆహ్వానించే పనిలో వున్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినా రేవంత్‌లో ఎలాంటి మార్పు కనిపిచండం లేదు. వెళ్లేవాళ్లు వెళ్లనీ ఇంకా అనుకుంటున్నట్లే వున్నాడు. తనను ప్రశ్నించేవారు లేకుండా వుంటేనే మేలనుకుంటున్నట్లున్నాడు. అందుకే ఇప్పటికీ ఆయనలో చలనం లేకుండా వుంటున్నాడు. పార్టీలో సీనియర్లు పడుతున్న మధనం కూడా ఆయనలో లేనట్లే కనిపిస్తున్నాడు. అందుకు కారణం ఆయనకు మాత్రమే తెలియాలి. అంతే కాకుండా రాజగోపాల్‌రెడ్డి పార్టీకి దూరం కావడంతో వచ్చిన ఉప ఎన్నికలోనైనా పార్టీని ఎలాగైనా గట్టెక్కిస్తానన్నంత ధీమా రేవంత్‌లో ఇప్పటికీ కనిపించడం లేదు. ఓడిపోయినా ఫరవాలేదన్నంతగానే ఆయనలో మాటలు ధ్వనిస్తున్నాయి. అంటే మునుగోడును కూడా బిజేపి చేతిలో పెట్టేందుకు రేవంత్‌ పరోక్షంగా సిద్దమయ్యాడా? అన్నది కూడా త్వరలో తేలుతుంది. అదే జరిగితే రేవంత్‌ పట్టుబట్టి కాంగ్రెస్‌కు సారధైంది ఎందుకు అన్నది అప్పుడే అందరికీ స్పష్టమౌతుంది. పిపిసికి ముందు ఆయన చెప్పిన మాటల్లో ఏ ఒక్కటీ ఆచరిస్తున్నట్లుగాని, అనుసరిస్తున్నట్లు గాని కనిపించడం లేదు. ఆ దిశగా అడుగులేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. ఇప్పటిదాకా సీనియర్ల మాటలను పెడచెవిన పెట్టిన వాళ్లుకు ఇప్పుడు వాళ్ల మాటలే నిజమా? అన్న ఆలోచన అందరిలోనూ మొదలైనట్లు చెప్పుకుంటున్నారు…ఈటెల రూపంలో కోరి గాలికి పోయే కంపను రేవంత్‌ తగిలించుకొని, పార్టీకి ముళ్ల కంచెను నాటినట్లే వున్నాడంటున్నారు.

సబితపై చర్యలున్నట్లా? లేనట్లా!?

సబిత నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి?

అబార్షన్‌ వికటించడంతో రియా కు పంపి చేతులు దులుపుకున్న సబిత.

రియా లోనూ సరైన వైద్యం అందక శ్రీ చక్రకు గర్బిణి రజితను తరలింపు.

సకాలంలో శ్రీ చక్ర స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన రజిత.

ఇద్దరు ఆడపిల్లలను అనాధలు చేశారు.

అబార్షన్లు వృత్తిగా చేసుకొని అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సబిత.

ఇంత పెద్ద సంఘటన జరిగినా అధికారులలో చలనం ఎందుకు లేదు?

సబితను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?

సకాలంలో సరైన వైద్యం అందించని ఆసుపత్రులకు నోటీసులెందుకివ్వలేదు?

మృతురాలు రజితకు స్కానింగ్‌ చేసిన డయాగ్నస్టిక్‌ పై చర్యలేవి?

ఆసుపత్రుల లైసెన్స్‌ లు రద్దు చేయరా?

మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కు పిర్యాదు చేయరా?

డాక్టర్ల పట్టా క్యాన్సిల్‌ చేయరా?

రజిత ప్రాణం బలిగొన్న వారిపై కేసులడవా?

కలెక్టర్‌ కలుగజేసుకుంటే గాని ముందుకు కదిలేలా లేదు?

                              హైదరాబాద్‌,నేటిధాత్రి: కడుపులో పడ్డ పాపానికి ఓ పసిగడ్డు ప్రాణం చిద్రమైపోయింది. కడుపుకోతను సైతం దిగమింగుకున్న ఓ ఆడకూతురు అర్ధాంతరంగా తనువు చాలించింది. ఎంతో భవిష్యత్తు వున్న ఆమెకు అబార్షన్‌ చేసి ప్రాణం తీశారు. ఇదంతా జరిగి నెల దగ్గరకొస్తున్నా, అధికారులకు అంతా తెలిసినా ఇంత నిర్ధయగా ఎలా వుండగలుగుతున్నారు? కనీసం కర్తవ్యం కూడా ఉన్నతాధికారులకు గుర్తు రావడం లేదా? ఓ నిండు ప్రాణం పోయిందన్న కనికరం కూడా లేదా? అసలు భ్రూణ హత్యలు చేయడం నేరమని తెలిసినా సబిత అనే వైద్యురాలు ఎలా అబార్షన్లు సాగిస్తోంది. ములుగు జిల్లా మల్లం పల్లిలో ఏకంగా తన క్లినిక్‌కే ప్రభుత్వ ఆమోదిత కుటుంబ నియంత్రణ కేంద్రమని బోర్డు తాటికాయంత అక్షరాలతో రాసుకొని పాపపు పనులు చేస్తుంటే తెలియడం లేదా? అసలు అధికారులకు సమచారం లేదా? రజిత అనే మహిళకు అబార్షన్‌ వికటించడంతో తమ ఆసుపత్రికి రిఫర్‌ చేశారని సాక్ష్యాత్తు రుయా ఆసుపత్రికి చెందిన వైద్యుడే నేటిధాత్రికి వెల్లడిరచడం జరిగింది. మరి అదే ఆసుపత్రి ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారా? లేక ఒత్తిళ్లకు లొంగి అధికారులు అసలు విషయం దాచి పెడుతున్నారా? ఏం జరుగుతోంది. నేటిధాత్రి వద్ద అదే ఆసుపత్రి చెప్పిన స్పష్టమైన సమాచారం వుంది.

రజిత అనే మహిళలకు సబితే అబార్షన్‌ చేసిందనే విషయాన్ని ఆసుపత్రి వర్గాలే వెల్లడిరచాయి. తమ వద్దకు వచ్చే సరికే రిజిత ఆరోగ్య పరస్ధితి కొంత క్రిటికల్‌గా వుందన్న సంగతి రియా ఆసుపత్రి వర్గాలే చెబుతున్నాయి. తమ ఆసుపత్రిలో వైద్యం అందుతున్న సమయంలో కార్డియా ఎఫెక్ట్‌తో వెంటనే ఆ మహిళను శ్రీ చక్రకు తరలించడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అసలు ఇలా అబార్షన్లు వికటించిన పేషెంట్లను ఎలా అడ్మిట్‌ చేసుకుంటున్నారు. ఏ చిన్న గాయమైనా పోలీసు కేసు తప్పని సరి అని మనం అనుసరిస్తాం…అలాంటిది గర్భస్రావం జరిగిన మహిళ ఎలాంటి పరిస్ధితిలో వచ్చిందో ఆసుత్రులకు తెలిసే ఎలా చేర్చుకుంటున్నారు? సహజంగా గర్భిణీలకు ఎదురయ్యే సమస్యలపై వైద్యం చేయడం వేరు? భ్రూణ హత్యల పేరుతో సాగే దందాకు ఆసుపత్రులు సహకరించడం వేరు? మరి అలాంటి కేసులను తాము అంగీకరించమని ఆసుపత్రులు నిర్ణయానికి వస్తే, అబార్షన్లనే వృత్తిగా పెట్టుకొని ప్రజల ప్రాణాలతో వ్యాపారం సాగిస్తున్నవారి ఆటలు సాగవు కదా? ఇక అలాంటి పనులు చేయకుండా వుంటారు కదా? ఎందుకు ఆ దిశగా ప్రైవేటు ఆసుపత్రులు నిర్ణయాలు తీసుకోవడం లేదు. అందిన కాడికి దోచుకోవచ్చు…వైద్యం పేరుతో లక్షలు వసూలు చేయొచ్చున్న దుర్భుద్ది తప్ప మరేం కనిపించడం లేదు. అందుకు వైద్య శాఖలో ఉన్నతాధికారుల ఆశీస్సులు లేకుండా ఈ తంతంతా జరిగే అవకాశమే లేదు. 

సబితను నేనే మూడుసార్లు పట్టుకున్నానని ఓ జిల్లాకు చెందిన అధికారి నేటిధాత్రికి వెల్లడిరచారు. గతంలో సబిత ఇలాంటి అబార్షన్లు సాగిస్తున్న విషయం తెలిసిన సమయాల్లో ఆమెను పట్టుకున్న సందర్భాలలో తానే స్వయంగా వున్నానని, తానే ఆమెను పట్టుకున్నానని కూడా డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో కూడా నేటిధాత్రితో చెప్పారు. మూడు సార్లు పోలీసులు కేసులు ఎదుర్కొని, మూడుసార్లు జైలు జీవితం అనుభవించిన సబిత అయినా మారకపోవడానికి వైద్య శాఖ ఉన్నతాధికారుల నిర్లిప్తత కారణం కాదా? సబిత అనే వైద్యురాలు ఏకంగా రాష్ట్రంలో కొన్ని వందల మంది ఆర్‌ఎంపిలతో కూడిన నెట్‌వర్క్‌ నెరుపుతోంది. ఎక్కడో మారు మూల ప్రాంతంలో ఇలాంటి ఆసుపత్రి ఒకటి ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలోనే సంచలనంగా మారినా ఎవరికీ కనిపించడం లేదా? సబితను చూసి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇంకా అనేక చోట్ల ఇలాంటి సంస్ధలు పుట్టగొడుగుల్లా వెలిశాయన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి రజితకు సంబంధించిన వైద్యం విషయంలో ఏం జరిగిందన్నదానిపై రియా ఆసుపత్రి నుంచి అధికారులు పూర్తి స్ధాయి సమాచారం సేకరించినట్లు లేదు. ముందుగా జరిగిన ఒప్పందం మేరకు మాత్రమే రిపోర్టు తయారు చేసినట్లు కనిపిస్తోంది. లేకుంటే ఈ పాటికి రుయామీద కూడ చర్యలు తీసుకునేవారు. ఇక ఈ మధ్యే కొత్తగా వెలసిన శ్రీ చక్ర ఆసుప్రతి వ్యవహారం మరో విధంగా వుంది. ఆ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలున్నాయన్నది, ఎలాంటి వైద్యం అందుతోందన్నదానికి రజిత మరణమే ఒక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి సేఫ్టీ మెజర్‌మెంట్లు లేకుండా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో అసలు వైద్యం అందుతున్న తీరు, వైద్యులపై కూడా పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ రెండు ఆసుపత్రుల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. ఇలాంటి విషయాలలో పాలు పంచుకున్న ఈ రెండు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటే గాని, భవిష్యత్తులో మిగతా ఆసుపత్రులు కూడా నేరపూరితమైన పనులు చేయడానికి ముందుకు రావు. ప్రజల ప్రాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించరు. ఈ విషయాలను జిల్లా వైద్య ఉన్నతాధికారులు ఆ రెండు ఆసుపత్రులకు సంబంధించిన లైసెన్సులు రద్దు చేయాల్సిన అవసరం వుంది. వైద్యం చేసిన డాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాలి. వారి పట్టాలపై మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు పిర్యాధు చేయాలి. వారి పట్టాలు రద్దు చేయించాలి. ఇలా కఠినంగా వుంటే తప్ప , వైద్యులు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకోరు. వైద్యాన్ని వ్యాపారం చేసి కాసుల కోసం కక్కుర్తి పడరు.

ఒక సబితపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిన అవసరం విస్మరిస్తున్నారు. గతంలో అబార్షన్లకు రెడీ అవుతున్న సందర్భంలోనే పట్టుకొని కేసులు నమోదు చేసిన వైద్య శాఖ ఉన్నతాధికారులు, ఇప్పుడు ఏకంగా ఆమె మూలంగా ఒక మహిళ ప్రాణం పోతే కూడా ఎందుకు కదలడం లేదు? సరైన ఆధారాలు లేవన్న నెపాన్ని ఎలా రూపొందించుకుంటున్నారు. మృతురాలు రజిత భర్తను బెదిరింపులకు కూడా గురిచేసినట్లు స్పష్టమౌతోంది. ఎందుకంటే అబార్షన్‌ చేయించడం అన్నది అమాయకులైన వారికి తెలియకపోవచ్చు. వారికి తెలిస్తే ఇలాంటి పనులు చేయడానికి దైర్యం చేయరు. కాని అమాయకులకు అసలు విషయం చెప్పకండా తమ స్వార్ధం కోసం, కాసుల కక్కుర్తి కోసం సబిత ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. ఇప్పుడు అబార్షన్‌ చేయించడానికి తీసుకొచ్చినవారిపై కూడా కేసు నమోదు చేస్తారని అతన్ని భయపెట్టినట్లు తెలుస్తోంది. దాంతో రజిత భర్త కూడా జరిగిన ఘోరాన్ని దిగమింగుకొని, సబిత లాంటి నరరూప రాక్షసులను వెనకేసుకొస్తున్నారు. సజహంగా ఇలాంటి విషయాల్లో అమాయకులైన ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారులదే…నిజం చెప్పడానికి సామాన్యులకు ఎలాగూ ఇబ్బందికరమైన పరిస్ధితే…కాని పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? అంటూ సెంటిమెంటు డైలాగులు చెప్పి, ఎంతో కొంత ముట్ట జెప్పి, సబితపై కేసు రాకుండా చూసుకోవడంలో అధికారులు కూడా కీలకపాత్ర పోషించారన్నది ఇక్క స్పష్టంగా తెలిసిపోతోంది. ఏలాంటి ఒత్తిడి లేకపోతే ఎవరైనా నిజమే చెబుతారు. ఇద్దరు ఆడపిల్లలను అనాధలు చేసిన వారిని ఊరికే వదిలేయొద్దనేది ప్రజా సంఘాలనుంచి వస్తున్న డిమాండ్‌. 

ఒక మహిళ వైద్యురాలై వుండి, సాటి ఆడ ప్రాణం పురుడు పోసుకోకుండా, పురిట్లోనే కొన్ని వందల ప్రాణాలు చిదిమేస్తున్న సబితను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. అన్ని రకాలైన ఆధారాలు ఆమెను దోషిగానే చూపిస్తున్నాయి. సబిత సాగిస్తున్న వ్యవహారం ఇప్పటిది కాదు. ఇప్పటికి ఆమె పసి ప్రాణాలు తోడేసిందో ఆ లెక్క అటుంచితే, రజిత లాంటి అమ్మాయిలెందరి ప్రాణాల పోవడానికి కారణమైందో కూడా తెలియాల్సివుంది. వృత్తిలో నేరమయమైన పనిని ఎంచుకొని వ్యాపారం సాగిస్తూ, గొప్పగా చెలామణి అవుతున్న సబితను శిక్షించాలంటున్నారు. జిల్లా కలెక్టర్‌ ఈ విషయంపై సీరియస్‌గా దృష్టిపెడితే తప్ప ఈ సంగతి తేలేలా లేదని ప్రజలంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం!

అబార్షన్లకు ఆమె ఫేమస్‌?

అదే ఆమె వృత్తి?

కార్పొరేట్‌ ఆసుపత్రులను తలదన్నే సంపాదన?

భ్రూణ హత్యలు నేరమని తెలిసినా గుట్టు చప్పుడు కాకుండా నిత్యం పదులలో అబార్షన్లు?

ఇప్పటికే మూడు సార్లు జైలుకు?

అయినా ఆమె మారలేదు…అబార్షన్లు ఆపడం లేదు?

అధికారికంగా బోర్డు పెట్టుకొని మరీ అబార్షన్లు!

అబార్షన్ల స్పెషలిస్ట్‌ సబిత అంటే తెలంగాణ మొత్తం ఫేమస్‌?

ఆమె రాకెట్‌ నెట్వర్క్‌ మామూలుగా లేదు? 

ఆమె రిఫర్‌ చేసిందంటే డయాగ్నస్టిక్‌ సెంటర్లు లింగ నిర్థారణ చేయాల్సిందే?

అబార్షన్‌ వికటిస్తే సబిత పంపితే ఆసుపత్రులు వైద్యం చేయాల్సిందే?

ప్రాణాలు పోతే పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవాల్సిందే?

అధికార యంత్రాంగానికి ఈ తంతంతా తెలుసు?

అయినా అంతా గప్‌ చుప్‌!

పట్టించుకునే వాళ్లు లేరు…?

బేటీ బచావో…బేటీ పడావో…! అసలు బేటి పుడితే కదా!

పురిట్లోనే చంపేస్తుంటే పుట్టేదెలా?   

రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ భ్రూణ హత్యలు నిత్య కృత్యమయ్యాయి. ప్రభుత్వం దాకా వివరాలు చేరవు. పాలకుల దృష్టికి రావు. అధికారులు ఎక్కడికక్కడే సంఘటనలు తొక్కి పెట్టేస్తుంటారు. ఏం జరిగినా బైటి ప్రపంచానికి తెలియదు. నిత్యం రాష్ట్రంలో భ్రూణ హత్యలు ఆగడం లేదు. వైద్య వృత్తిలో ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు పొత్తిళ్లలలోనే ఆడ పిల్లలను చంపేస్తున్నారు. వైద్య వృత్తిలో అదో భాగంగా మార్చుకొని వ్యాపారం చేసుకుంటున్న వాళ్లు కూడా ఎక్కువైపోయారు. బేటీ బచావో…బేటీ పడావో అని గొప్పగా చెప్పుకుంటే సరిపోతుందా? ఆడ పిల్ల అసలు పుడితే కదా? పుట్టనిస్తే కదా? బతుకుడో…చదువుడో అన్నది తర్వాత. ముందు పురిటిలోనే చిద్రం చేస్తున్నారు. భూమ్మీదికి చిన్నారి రాకుండా కళ్లు తెరవకముండే చిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రాణం తీసేస్తున్నారు. లోకం కూడకుండా చేస్తున్నారు. ఇక ఆడ పిల్ల పుట్టేదెలా? భూమ్మీద పడేదెలా? బతికి బట్ట కట్టేదెలా? కడుపులోనే కత్తెర్లతో ముక్కలు ముక్కలు చేస్తున్నారు. జాలి లేని వైద్యలు చేస్తున్న ఈ కర్కోటకపు పని పైకి అందరూ ఖండిరచేవారే? కాని ఎక్కడా ఆగడం లేదు. ఎలా జరుగతున్నాయి. ఎందుకు జరగుతున్నాయి. వాటిని వెనకేసుకున్నవారు ఎవరు? సమర్ధిస్తున్నవారు ఎవరు? ప్రోత్సహిస్తున్నవారు ఎవరు? భ్రూణ హ్యత్యలు చట్టరిత్యా నేరం. అలాంటి వారు పట్టుబడుతున్నా…ఎందుకు బైటకొస్తున్నారు? మళ్లీ ఎందుకు అవే పనులు చేస్తున్నారు? వాటిని ఆపాలన్న కనీస జ్ఞానం లేకుండా ఎందుకు ఆడపిల్లలను చిదిమేస్తున్నారు. ఇదో పెద్ద వ్యాపార సామ్రాజ్యం చేసుకొని కొందరు స్వార్ధపరులైన వైద్యులు ఆడుతున్న వికృత క్రీడ మూలంగా రాష్ట్రంలో ఎంతో మంది తల్లులు ప్రాణాలు కూడా గాలిలో కలుస్తున్నాయి. అలా ఈ మధ్య లోకం చూడని ఓ పసిగడ్డును, ఆడ పిల్లను కడుపులో దాచుకున్నందుకు ఓ తల్లిని ఇద్దరినీ మింగిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాని అదంతా ఎక్కడికక్కడ గప్‌చుప్‌గా ముగిసింది…? దీని వెనకు వున్నదెవరు? ఆ పాపానికి ఒడిగట్టిందెవరు? అందుకు సహకరించిందెవరు? అన్నదానిపై నేటిధాత్రి పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఆమె పేరు సబిత…? అబార్షన్లు చేయడంలో ఆమె దిట్ట? చాలా ఫేమస్‌? ఏకంగా ప్రభుత్వ ఆమోదిత కుటుంబ నియంత్రణ కేంద్రం అని బోర్డు పెట్టుకొని మరీ అబార్షన్లు సాగిస్తోంది? ఇలా బోర్టు పెట్టుకోవడం నేరమన్న సంగతి కూడా తెలియకుండానే ఈ వ్యహారం అంతా సాగితస్తోంది. ఇదే ఆమె వృత్తి. పేరుకు వైద్యురాలు. కాని చేసే సేవ మాత్రం పురిట్లోనే ఆడ పిల్ల అని తెలిసిన పిండాలను చిద్రం చేయడం. అందుకు ఆమె చేసే చార్జి కూడా మామూలుగా వుండదు. ఆమె సంపాదన కూడా కార్పోరేట్‌ ఆసుపత్రికి తగ్గదు. అలా సంపాదనకు అలవాటు పడి ఇక వైద్యం చేయడం మానేసింది. రోజుకు పదుల సంఖ్యలో అబార్షన్లు చేయడమే పనిగా పెట్టుకున్నది. ఏదైనా జరక్కూడనిది జరిగితే వెంటేనే హన్మకొండలోని ఏదో ఒక ఆసుపత్రికి పంపించేస్తుంది. అక్కడ వైద్యం అంది బాధితులు బాగుపడితే సరి…? పొత్తిళ్లలో బిడ్డను చిద్రం చేసే క్రమంలో తల్లికి ప్రమాదం జరిగి, ప్రాణాలు పోయినా పరిహారం చేసుకొని మరీ కేసులు లేకుండా చేసుకుంటుంది? అసలు ఆ విషయాలు బైటకు వెల్లడికాకుండా చూసుకుంటుంది. ఈ విషయాలు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వైద్య శాఖలో పెద్ద తలకాయలందరికీ తెలుసు. కాని ఎవరికీ అవసరం లేదు. ఏం జరుగుతున్నా పట్టింపు లేదు. దాంతో సబిత సాగిస్తున్న అబార్షన్ల వ్యాపారం నిత్యం పది అబార్షన్లు, అప్పుడప్పుడు తల్లుల ప్రాణాలు అన్నట్లు సాగుతోంది. అయినా ఆమెకు క్రేజ్‌ తగ్గడం లేదు. ఇంతలా ఫేమస్‌ కావడానికి ఆమెకువున్న నెట్వర్కే కారణమంటారు.

రాష్ట్రంలో ఏ మూలలో వున్న ఆసుపత్రులకైనా ఆమె గురించి తెలుసు. ఆమెకు రిఫర్‌ చేస్తే చాలు…మన చేతికి మట్టి అంటకుండా పనైపోతుందని అందరూ ఆమెకే కేసులు పంపిస్తుంటారు. ఆమె నిర్వహించే ఆరోగ్య కేంద్రానికి రాలేని వారి కోసం ఆమే ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకు అవసరమైన చార్జి చేస్తుంది. లక్షల్లో కూడా కొన్ని సార్లు ఫీజులు తీసుకుంటుంది. హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో కూడా ఆమె ఎక్కడికక్కడ గుట్టు చప్పుడు కాకుండా అనేక అప్పార్టుమెంట్లలో ఇలాంటి వ్యవహారం కానిస్తుంటున్నారని తెలుస్తోంది. ఇలా అక్రమ అబార్షన్లు చేస్తున్న క్రమంలో గతంలో మూడుసార్లు పట్టుబడ్డారు కూడా….మూడు సార్లు జైలు జీవితం కూడా అనుభవించారు. ఓసారి సబిత ఓ అబార్షన్‌ చేస్తున్నందన్న సంగతి అధికారులకు ఉప్పందడంతో దాడి చేసిన సందర్భాలున్నాయి. అలా ఓసారి అధికారులు తనిఖీకి వస్తున్నారని తెలిసి మేడమీదకు వెళ్లి మరీ దాక్కుంటే అధికారులు పట్టుకొచ్చి మరీ కేసులు నమోదు చేశారు. కాని ఆమె మారలేదు. మూడుసార్లు ఇలా కేసులను ఎదుర్కొన్నా ఆమెలో మార్పు లేదు. మారుతుందన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే భ్రూణ హత్యలపై మరింత కఠినమైన చట్టాలు లేకపోవడం..రాకపోవడమే ఇందుకు కారణం? అధికారం యంత్రాంగం కదలదు. పట్టించుకోదు. ఈ మధ్య సబిత చేసిన పనికి ఓ మహిళ ప్రాణం పోయింది. ఆమెకు ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు. సబితను కలిసిన దంపతులకు సేఫ్‌గా అబార్షన్‌ చేస్తానని నమ్మించింది. లింగనిర్ధారణ పరీక్ష చేయించింది. ఆడపిల్ల అని తేలిందని చెప్పి, అబార్షన్‌ మొదలు పెట్టింది. మధ్యలో ఏదో జరిగింది. ఆ మహిళకు రక్త స్రావం జరిగింది. వెంటనే ఆ మహిళను హన్మకొండలోని ఓ ఆసుపత్రికి రిఫర్‌ చేసింది. అక్కడ కూడా సరైన వైద్యం అందకపోవడంతో అక్కడి నుంచి ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా సరైన చికిత్స అందకపోవడంతో ఆ మహిళ చనిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు ఆనాధలయ్యారు. ఆ కుటుంబం వీధిన పడిరది. ఇద్దరు ఆడపిల్లలను తల్లిలేని బిడ్డలను చేశారు. అందరూ కలిసి చేతులు దులుపుకున్నారు. 

ఈ సంఘటన జరిగిన నుంచి ఆమె జంప్‌…! గతంలో జరిగిన వ్యహారాలు పెద్దగా బైటకు పొక్కకపోయినా, ఈ మధ్య జరిగిన సంఘటనపై పెద్దఎత్తున చర్చ సాగుతుండదంతోపాటు, నేటిధాత్రి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం వల్ల తన మకాం తాత్కాలికంగా హైదరాబాద్‌కు మార్చినట్లు సమాచారం. అంతా సర్ధుమణిగిన తర్వాత మళ్లీ నిన్ననే తన సొంత క్లినిక్‌ చేరుకొని మళ్లీ కోతలు మొదలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాదు తన కూతురును కూడా ఎంబిబిఎస్‌ చేయించేందుకు మహారాష్ట్రలో మేనేజ్‌ మెంట్‌ కోటాలో సీటు కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంత పెద్ద సంఘటన జరిగినా అధికార యంత్రాంగం చలనం లేదు. స్పందన లేదు. వైద్యాధికారులు మాత్రం కదిలినట్లు కదిలారు. తూతూ మంత్రంగా రిపోర్టును తయారు చేశారు. కాని బాధితులనుంచి సరైన పిర్యాధు లేదన్న ఏకైక కారణంతో ఇంత దుర్మార్గమైన పని చేసిన సబిత మీద కేసు లేదు. ఒక మహిళగా ప్రాణాలు పోయాల్సిందిపోయి, నిర్ధయగా ప్రాణాలు తీసేస్తుంటే సుమోటోగా కేసులు నమోదు చేసే అవకాశమే లేదా? అధికారులు సరిగ్గా స్పందించాలనుకుంటే ఓ లెక్కా? ఇంత పెద్ద రాకేట్‌ నడుపుతున్న మహిళను కూడా అధికార యంత్రాంగం కూడా భయపడుతుందా? అన్న సందేహం కలగకమానదు. లేకుంటే జిల్లా వైద్య ఉన్నతాధికారులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు. ఎందుకు ఆమెపై కేసులు నమోదు చేయడం లేదు. 

అంతా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం కానిచ్చేశారు. అధికారులు కూడా తూతూ మంత్రంగా పంచనామా చేసి రిపోర్టు క్లోజ్‌ చేశారు. ఫైల్‌ కలెక్టర్‌ టేబుల్‌మీదకు చేర్చేశారు. ఇక ఆ ఫైల్‌ కలెక్టర్‌ చూసేదెప్పుడు, దానిపై సమగ్రమైన వివరాలు తెలుసుకునేదెపఫ్పుడు? ఈ లోపు జరిగిందంతా మాఫ్‌….! ఇలా ఓ మహిళ సాగిస్తున్న అక్రమ అబార్షన్ల వ్యవహారం ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదన్నదానిపై ఎవరూ స్పందించేందుకు సిద్దంగా లేరు. అసలు లింగనిర్ధారణ పరీక్షలు చేయడమే తప్పు. నేరం కూడా. అందులోనూ లింగ నిర్ధారణ పరీక్షలు విచ్చలవిడిగా చేసేస్తున్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న డయాగ్నస్టిక్‌ సెంటర్లు రిపోర్టులు టెస్టులు చేస్తున్నారు. రిపోర్టులు ఇచ్చేస్తున్నారు. సబిత చేతికి అందిస్తున్నారు. ఆమె విచ్చలవిడిగా అబార్షన్ల దందా సాగిస్తున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆధారాలతో సహా నేటిధాత్రి చేతిలో వున్నాయి.

మునుగోడు ముంచేదెవరిని! తేల్చేదెవరిని?

ప్రభుత్వ పధకాల కారును గట్టెక్కిస్తాయా?

టిఆర్‌ఎస్‌ ధీమా ఏమిటి?

బిజేపి చూపిస్తున్న అత్యుత్సాహం జనం నమ్ముతారా?

రాజగోపాల్‌రెడ్డిని మళ్లీ విశ్వసిస్తారా?

ధర పెరుగుదల బిజేపి మీద ప్రభావం చూపకపోవచ్చా?

బిజేపి ధైర్యంలో నిజముందా? నాయకుల ప్రకటనల్లో బలముందా?

కాంగ్రెస్‌ చతికిల పడుతుందా? నిలబడుతుందా?

మొన్నటి సభ ప్రభావం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే అవకాశం వుందా?

రేవంత్‌ వేగంపరుగులు పెడుతుందా? మొదటికే మోసం వస్తుందా?

నల్లగొండ కాంగ్రెస్‌ సీనియర్లు కోమటిరెడ్డి సోదరులను వ్యతిరేకిస్తారా?

నిజాలెలా వున్నాయి? ప్రచారాలు ఎలా సాగుతున్నాయి?

హైదరాబాద్‌,నేటిధాత్రి: ఆలోచనలను అంచనా వేయలేకపోవచ్చు. వేగాన్ని ఆపలేకపోవచ్చు. కాని అడుగులు లెక్కబెట్టగలం. ఎటు పడుతున్నాయో చెప్పగలం. ఇప్పుడు రాజకీయాలలో ఇదే ముఖ్యం. మునుగోడు రాజకీయాలు ఎలాగూ రాష్ట్ర రాజకీయాలకు ఒక దిశా నిర్ధేశం చేస్తాయని చెప్పడంలో సందేహంలేదు. సార్వత్రిక ఎన్నికలు దగ్గపడుతున్న సందర్భంలో జరిగే ఉప ఎన్నికల ప్రభావం వచ్చే ఎన్నికల్లో కూడా వుండొచ్చు. అయితే ఇలా గతంలో జరిగిన సందర్భాలలో కూడా ఆరు నెలల్లో ప్రజల ఆలోచనల్లో మార్పులు వచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆ వెంటనే స్పీకర్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఆ రాజీనామా ఆమోదం తెలిపినట్లు స్పీకర్‌ కార్యాలయం సర్కులర్‌ జారీ చేసింది. ఇది బిజేపి ఊహించంది కాదు. స్పీకర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అంత తొందరగా రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా ఆమోదిస్తారని ఊహించలేదు. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా ఒక వేళ పెండిరగ్‌లో పెడితే ప్రభుత్వం భయపడుతుందని ప్రచారం చేసుకోవచ్చని బిజేపి ఆలోచన చేసింది. కాని ప్రభుత్వం బిజేపి ఆలోచనలు తలకిందులు చేస్తూ, స్పీకర్‌ ఆమోదంతో ఉప ఎన్నికకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించినట్లైంది. దాంతో ఒక్కసారిగా రాజకీయాల్లో స్ధబ్దత మాత్రం నెలకొన్నదనే చెప్పాలి. నిజానికి మునుగోడు ఉప ఎన్నిక రావాలని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చూస్తోందని చెప్పడంలో సందేహం లేదు. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా ఆమోదం అందుకు సంకేతంగానే భావించాలి. ఈ మధ్య కాలంలో బిజేపి బలం పెరిగినట్లు సాగిస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మునుగోడు ఉప ఎన్నికను ఒక ఆసరాగా వాడుకోవాలని టిఆర్‌ఎస్‌ చూస్తోంది. మునుగోడు అభివృద్ధిపై ప్రభుత్వం అప్పుడే ఫోకస్‌ పెట్టింది. రూ.25 కోట్లు విడుదల ప్రకటన కూడా చేసేసింది. అంటే మునుగోడులో ప్రభుత్వం కూడా సై అంటే సై అనేందుకు సిద్దంగానే వుందన్న సంకేతాలు పంపినట్లైంది. ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ రెడీ అని చెప్పకనే చెప్పినట్లైంది. పైగా చౌటుప్పల్‌ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫార్మా హబ్‌ల ఏర్పాటు వంటివి పెద్దఎత్తున వచ్చే అవకాశం వుంది. ఇప్పటికే కూడా కొంత పారిశ్రామికంగా ముందంజలో వుంది. మరింత అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు గెలిస్తే కొంత ఉపయోగం వుంటుందన్న ఆలోచన కూడా ప్రజలు చేసే అవకాశం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పధకాలు కూడా అక్కడ కూడా పెద్దఎత్తున లబ్ధిపొందుతున్నవాళ్లు వున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలౌతున్న కొన్ని పధకాలను ఓసారి విశ్లేషిస్తే రాష్ట్రంలో అమలౌతున్న చాల కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవన్న సంగతి అందిరికీ తెలిసిందే. రైతు బంధు మే 10 2018న ప్రభుత్వ ప్రకటించింది.

రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. రైతు భీమా సుమారు 60 లక్షల మందికి చేయడం జరిగింది. రుణమాఫీ 40లక్షల మంది రైతులకు జరిగినట్లు సమాచారం. ఉచిత విద్యుత్‌ దాదాపు 26లక్షల మంది రైతులకు అందుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 16లక్షల రైతులకు ఉచిత విద్యుత్‌ అందేది. ఇప్పుడు మరో పది లక్షల మందికి అదనంగా అందడమే కాకుండా, ఇరవై నాలుగు గంటలు సరఫరా అవుతోంది. 2021 ఆగష్టు నెల 5న మొదలైన దళిత బంధు ఇప్పటికీ రాష్ట్రంలో 30,480 కుటుంబాలకు సాయం అందింది. అందుకోసం ప్రభుత్వం రూ.2257కోట్లు ఖర్చు చేసింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం అమలులో వుంటుంది. దేశంలో ఎక్కడా లేని కేసిఆర్‌ కిట్‌ పధకం 2017లో మొదలు పెట్టిన నాటినుంచి ఇప్పటి వరకు సుమారు 13లక్షల మందికి అందినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం ద్వారా రాష్ట్ర్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 10 లక్షల కుటుంబాలకు అందించడం జరిగింది. ఆసరా పించన్లు రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 40లక్షల మందికి అందుతోంది. ఇంకా 10లక్షల మందికి అందజేసే ఆలోచనలో ప్రభుత్వం వుంది. బీజేపీ దూకుడును ప్రజలు ఆదరిస్తున్నారా? అనుసరిస్తున్నారా? విశ్వసిస్తున్నారా?అన్నది ఇప్పటికిప్పుడు ఎవరూ చెప్పలేనిది.

ప్రచార ఆర్భాటం పటోటోపం బాగానే వుంది. కాని క్షేత్రస్ధాయిలో రాజగోపాల్‌రెడ్డి బలం మీదే ఆధారపడి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం రావడం అన్నది బిజేపి బలహీనతే అని చెప్పొచ్చు. ఎందుకంటే దుబ్బాకలో అదే పరిస్ధితి. రఘునందర్‌ మీద వున్న సానుభూతి మాత్రమే బిజేపిని గట్టెక్కినా అది బిజేపి ఖాతాలో పడిరది. కాకపోతే జనానికి తెలుసు. నాయకులకు తెలుసు. ఇక హుజూరాబాద్‌ అన్నది పూర్తిగా ఈటెల రాజేందర్‌ మీద వున్న సానుభూతి మూలంగానే బిజేపి గట్టెక్కింది. ఆ ఎన్నికల సందర్భంలో ఈటెల రాజేందర్‌ ఎక్కడా బిజేపి నినాదం గురించి గాని, బిజేపి సిద్ధాంతాల గురించిగాని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం గురించి ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఎంత సేపు తనకు జరిగిన అన్యాయం తప్ప మరో మాట మాట్లాడలేదు. అంతకు ముందు కనీసం మూడు వేల ఓట్లు కూడా రాని బిజేపికి ఈటెల రాజేందర్‌ బలంతో తోడు కావడం వల్ల ముప్పై వేల మెజార్టీదాకా వెళ్లింది. బిజేపి బిఫామ్‌ మీద ఈటెల పోటీ చేయడం వల్ల అది కూడా బిజేపి ప్రచారానికి బాగానే ఉపయోగపడిరది. ఇలా ప్రచారం చేసుకోవంలో బిజేపి కూడా ఆరితేరిందని చెప్పడానికి ఈ రెండు సంఘటనలు చాలు. అయితే గత ఎన్నికల్లో మునుగోడులో ఆరు వేల ఓట్లు వచ్చిన బిజేపికి ఈసారి రాజగోపాల్‌ రూపంలో ఓట్ల వర్షం కురుస్తుందా? లేదా? అన్నది మాత్రం క్షేత్రస్ధాయిలో కనిపించడం లేదు. ఇదిలా వుంటే దేశంలో పెరుగుతున్న ధరల పెరుగుదల అన్నది బిజేపి మీద ఎంత మేర ప్రభావం చూపుతుందనేది కూడా ఈ ఎన్నికల్లో కూడా తేలడానికి అవకాశం వుందనే చెప్పాలి. గతంలో సిలిండర్‌కు దండం పెట్టి ఓట్లేయాలన్న టిఆర్‌ఎస్‌ ఆ ప్రచారం మళ్లీ ముందుకు తీసుకురాక మానదు.ఇంతకీ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఎలా వుంటుందనేదే అందరిని తొలుస్తున్న ప్రశ్న. 

గత ఎన్నికల్లో ఎంతో కొంత కాంగ్రెస్‌ బలంగా లేకపోతే రాజగోపాల్‌రెడ్డి గెలిచేవారు కాదు. ఆయన స్వంత బలం అని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నా, కాంగ్రెస్‌ పట్ల కోమటి రెడ్డి కుటుంబానికి అప్పట్లో వున్న అంకితభావం కూడా పనిచేసిందనే చెప్పాలి. పైగా 2014 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ గెలిచింది. ప్రజలు కూడా కొంత ఆ విషయంలో మార్పు కోరుకున్నారు. అంతే కాని పూర్తిగా రాజగోపాల్‌ రెడ్డిని మాత్రమే గెలిపించాలన్న ఆలోచనలో ప్రజలు ఓట్లు వేయలేదు. పైగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పూర్తి స్ధాయిలో పనిచేశారన్నది మాత్రం ఇక్కడ స్పష్టమైంది. మరి ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటన్నది ఆలోచనలో పడేస్తోంది. ఎంత లేదన్నా కోమటి రెడ్డి సోదరుల ప్రభావం ఉమ్మడి నల్లగొండ మీద బాగానే వుంటుంది. దాని నుంచి బైట పడడం అంటే రేవంత్‌ రెడ్డి మీద అంతకన్నా గొప్ప నమ్మకం కాంగ్రెస్‌ శ్రేణుల్లో కలగాలి.

గ్రానైట్ సమస్యలకు త్వరలో పరిష్కారం 

గ్రానైట్ సమస్యలకు త్వరలో పరిష్కారం 

మంత్రి పువ్వాడ అజయ్ 

ఖమ్మం, ఆగస్ట్, 6:

గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు తొందరలోనే పరిష్కార మార్గం లభిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక హరితా గార్డెన్స్ లో ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి అజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఒక దఫా మంత్రి కేటీఆర్ చొరవతో పలు గ్రానైట్ సమస్యలకు పరిష్కారం లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రానైట్ లీజుల విషయం లో సుమారు 200 మంది చిన్న పారిశ్రామిక వేత్త లు ఇబ్బందులు పడుతున్న విషయం.. సీ ఫామ్ అంశాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయన్నారు. కరోనా వల్ల కలిగిన ఆర్థిక ఒడిదిడుకులు మూలంగా సబ్సిడీలు కొంత ఆసఆలస్యం అయ్యాయని వీటిని కూడా తొందరలోనే అందుకుంటామని చెప్పారు. 

నూతనంగా ఎన్నికైన గ్రానైట్ అసోసియేషన్ పాలక వర్గానికి మంత్రి అజయ్ శుభాకాంక్షలు తెలిపారు.

 రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ గ్రానైట్ పరిశ్రమ తన కుటుంబమని… కుటుంబంలో ఎవరికీ కష్టం రాకుండా కాపాడుకుంటా న్ని అన్నారు. సి ఫామ్, సబ్సిడీ, లీజుల అంశాలు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ గారి నేతృత్వంలో సీఎం గారిని కలిసి వాటిని పరిష్కారించుకుంటామని అన్నారు.

 ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ఏకైక ఉపాధి వనరుగా ఉన్న గ్రానైట్ పరిశ్రమను కాపాడుకోవడంలో ముందుంటానని అన్నారు. గ్రానైట్ హబ్ గా ఉన్న ఖమ్మంలో ఎస్ఈజెడ్ల తరహాలో అభివృద్ధి చేయాలని కోరారు.

 ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. 

ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న గ్రానైట్ పరిశ్రమకు ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటామన్నారు.  

 ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీతో ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపుడి రామారావు ప్రమాణం చేయించారు. కొత్త కార్యవర్గానికి మంత్రి, ఇతర అతిధులు నియామక పత్రాలు అందజేసి, సన్మానించారు. 

సభలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సీపీఐ ప్రజాపంధా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు, నాయకులు పారా నాగేశ్వరరావు, తమ్మినేని వెంకట్రావు, చక్రధర్ రెడ్డి, పాటిబండ్ల యుగంధర్, ఫణి కుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ ఉప్పల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీనివాస రెడ్డి, కోశాధికారి దొడ్డా రాకేష్, ఉపాధ్యక్షులు ఎస్. కె. ఖాసిం, కె. వీరభద్రరావు తదితరులు మాట్లాడారు.

పేరు కార్యకర్తలది…భోగాలు నాయకులవి!

ఒక్కసారైనా పదవులు త్యాగం చేసే శక్తి వుందా?

ఏ పార్టీ అయినా సామాన్య కార్యకర్త కు మునుగోడులో టిక్కెట్టు ఇవ్వగలదా?

ప్రజా బలం మాకుందని నిరూపించుకోగలరా?

అందరూ గెలుపు గుర్రాల వేటనే!

ఎన్నికలగానే కార్యకర్తలకు ఎక్కడ లేని విలువ

నాలుగు రోజులు కాగానే ఇక అంతే!

ఎన్నికల ముందు చొచ్చుకొని వస్తారు..

ఆ తర్వాత ముఖం చాటేస్తారు?

అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే!

కార్యకర్తలకు అండగా వున్నామన్న నాయకులున్నారా?

జంపింగ్‌ జపాంగ్‌ లంతా స్వార్థపరులే!

అందరూ కార్యకర్తల జీవితాలతో ఆడుకునే వారే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: మునుగోడు నియోజకవర్గంలో కొత్త సంప్రదాయానికి తెర తీసే ధైర్యం రాజకీ పార్టీలకు వుందా? ఎంత సేపు బలవంతమైన నాయకుల మీదనే ఆధారపడి రాజకీయాలు సాగిస్తారా? ఎన్నికలలో కోట్లు ఖర్చు చేయగల నాయకులకే టిక్కెట్లు ఇస్తారా? మునుగోడు విషయంలో ఏమైంది? రాజగోపాల్‌ రెడ్డిని నమ్మి కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇస్తే, తనను గెలిపించిన ప్రజల మనోభావాలను గాలికి వదిలేసి, తన దారి తాను రాజగోపాల్‌ రెడ్డి చూసుకోవడం లేదా? పార్టీలు నాయకులను శాసించే కాలం నుంచి నాయకులే పార్టీలను శాసించే పరిస్థితి రావడానికి కారణం ఎవరు? గెలుపు గుర్రాలు అనే ఒకే ఒక్క మాటతో రాజకీయాలను సమూలంగా మార్చేస్తున్నారు. అనుక్షణం నాయకులు ఏం చేస్తున్నారు? ఎవరితో కలుస్తున్నారు? ఎక్కడ సమావేశమౌతున్నారు? ఇలాంటి జాగ్రత్తలతోనే పార్టీలకు పుణ్యకాలం పూర్తవుతోంది. ఎప్పుడూ ఎన్నికల కోసం ఎదురుచూడడం అలవాటైంది. తమ బలం తగ్గిందా? పెరిగిందా? అని తెలుసుకోవడం కోసం నిత్యం సర్వేలేనా? ఐదేళ్ల కాలంలో ఏదో ఒక పార్టీ తరఫున ఎవరో ఒకరు సర్వేలు, చేయడం మేం బలంగా వున్నామని చెప్పుకోవడం తప్ప, ప్రజలకేం కావాలి. అభివృద్ది మంత్రమేమిటి? గుడ్డిగా ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీ దుమ్మెత్తి పోసే రాజకీయాలు తప్ప, ప్రజల కోసం ఆలోచనే మర్చిపోయాయి. ఎంత సేపూ ఆధిపత్య రాజకీయాల యావ తప్ప మరొకటి లేదు. అందుకే కొత్త తరం రాజకీయాలు పురుడుపోసుకోవడం లేదు. నూతన తరం ఆవిష్కరణ జరగడం లేదు…మూస రాజకీయాలు…ముతక నాయకులు తప్ప ప్రజా సేవ చేయాలన్న దృక్పథంతో వస్తున్నారెంత మంది? రియలెస్టేట్‌ వ్యాపారాలు, ఆ సంపాదనతో రాజకీయాలు…వాటిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు…ఇదే ఇప్పుటి రాజకీయం…ఇలాంటి పరిస్థితులలో ఒక సామాన్య కార్యకర్త నాయకుడు అయ్యే అవకాశం వుందా? హుజూరాబాద్‌ లో ఏం జరిగింది. గెల్లు శ్రీనివాస్‌ పేరు అప్పటికే తెరమీదకు వచ్చినా, ఎమ్మెల్సీ కౌషిక్‌ రెడ్డి సీటు నాదే అన్నాడు. ఇంకే ముంది తర్వాత ఎంత దిద్దుబాటు చర్యలు చేపట్టినా లాభం లేకపోయింది. బలమైన నేతలు వున్న చోట ఒక రకంగా, లేని చోట మరోకరంగా రాజకీయాలు సాగుతున్నా బలవంతులే గెలుస్తున్నారు. రాజకీయాలు శాసిస్తున్నారు. ఇప్పుడు మునుగోడులోనూ అదే జరగబోతోంది. నిజానికి టిఆర్‌ఎస్‌ మునుగోడులో బలంగా వుంది. కాకపోతే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. టిఆర్‌ఎస్‌ లో ఆశావహుల సంఖ్య ఆరు వరకు వుంది. మరి ఎవరిని ఎంపిక చేయొచ్చు అనే దశ రాకముందే ఎవరికి వారే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రచారానికి కూడా శ్రీకారం చుడుతూనే వున్నారు. ఎవరికి వారు, మేమంటే మేం ముందున్నామని, ప్రజల్లో పలుకుబడి వుందని చూపించుకుంటున్నారు. ఇది చివరికి మళ్ళీ హుజూరాబాద్‌ ఎన్నికలో జరిగిన పొరపాటుకు దారితీసే పరిస్థితి లేకపోలేదు.ఇక బిజేపి పార్టీ పూర్తిగా అద్దె నాయకుల మీదనే రాజకీయాలు చేయాలనుకుంటోంది. 

వలసలు ప్రోత్సహిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను ఆకర్షణ అన్నది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాగిస్తూనే వుంది. రాష్ట్రంలో ఈ మధ్య మొదలు పెట్టింది. జోరుమీద వున్నట్టు మాత్రం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. మూడున్నరేళ్లుగా మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోయిన రాజగోపాల్‌ రెడ్డి ఒక వేళ గెలిస్తే ఏం చేస్తాడు? అప్పుడు రాష్ట్రంలో వుండేది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. గెలిచామని సంబరపడుతున్న రఘునందన్‌ దుబ్బాకకు ఇచ్చిన హామీలు నెరవేర్చాడా? అధికార టిఆర్‌ఎస్‌ లో ఆరేళ్లు మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్‌ చేసిందెంత? ఇప్పుడంటే ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని తప్పించుకుంటున్నాడు. మరి మంత్రిగా పని చేసినంత కాలం ఏం చేశాడు. వ్యాపార సంస్థలు, సామ్రాజ్యం పెంచుకున్నడన్న ఆరోపణలు వున్నవే. అసైన్డ్‌ భూముల వ్యవహారం నానుతున్నదే. మరి అలాంటి నాయకుడికి జాతీయ పార్టీ ఆశ్రమం కావాలి. బిజెపి ఆర్థిక మూలాలున్న నాయకులు కావాలి. ఇదేనా ప్రజా స్వామ్యం ఫరిఢవిల్లేలా చేయడం? ఇక కాంగ్రెస్‌ చేసుకున్న పాపానికి అనుభవిస్తోంది. మునుగోడులో స్థానిక నాయకులు లేరన్నట్లుగా, రాజగోపాల్‌ రెడ్డి కి అడిగిన అవకామల్లా ఇచ్చింది. అన్న పేరు చెప్పుకొని రాజకీయాలు చేసిన రాజగోపాల్‌ రెడ్డి కూడా బ్రాండ్‌ అని మాట్లాడుతున్నాడే గాని, ప్రజల హృదయాలలో వున్నామని అనడం లేదు. అంతగా తన బ్రాండ్‌ గురించి పదే పదే చెప్పుకునే రాజగోపాల్‌ రెడ్డి తన అనుచరులైన ఎంత మంది నాయకులు, కార్యకర్తలకు ఆర్థిక బలానికి తోడ్పాటు పడ్డాడో కూడా చెప్పాలి. ఎంత సేపు తన వ్యాపార ముసుగు రాజకీయాలే గాని మరేం కనిపించడం లేదు. కార్యకర్తల పేరు చెప్పి రాజకీయాలు చేయడం నాయకులు, పార్టీలు బాగా అలవాటు చేసుకున్నాయి. ఇదిలా వుంటే తాజాగా పిసిసి ఆధ్వర్యంలో మునుగోడులో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఆఖరుకు గెలవకపోయినా నష్టం లేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇది దేనికి సంకేతం. మునుగోడు లో సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకుంటామనాల్సిన చోట మొదటనే చేతులెత్తేయడం కాదా? అంత పెద్ద సభ ఏర్పాటు చేసి తుస్సుమనిపించినట్లు కాదా? వచ్చిన అంత మంది జనాలను పిచ్చోళ్లను చేయడం కాదా? దీనికి రేవంత్‌ సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోలేదు. అంతే కాదు పార్టీ బలంగా వున్న సీటు చేజార్చుకోవడం అంటే ముందే అస్త సన్యాసం చేసినట్లౌతుంది. నిజానికి మునుగోడు అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం. వరుస ఓటములతో కుదేలైనట్లురాజకీయ పార్టీలు నాయకులను తయారు చేయలేవా? 

కొత్త తరం రాజకీయాలు ఆవిష్కరించలేవా? ఎంత సేపు అరువు తెచ్చుకున్న నాయకులపై ఆధారపడి రాజకీయాలు చేస్తాయా? అంటే అలాగే కనిపిస్తోంది. గత రెండు దశాబ్దాల క్రితం ఇలాంటి రాజకీయ పోకడలు వెలుగుచూడడం మొదలుపెట్డాయి. వాటిని అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయి. అందుకు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్నీ ఆ తాను ముక్కలే. గడచిన ఇరవై సంవత్సరాలుగా అదే నాయకులు, అవే పెత్తనాలు…వారికే పదవులు. కొత్త వాళ్లు రారు…రానీయరు. అయితే వారసులు, లేకుంటే వారి బంధువులు…ఇంతకు మించి కొత్త నాయకత్వం ఎక్కడా కనిపించదు. తెలంగాణ ఉద్యమం మొదలైన నుంచి నాయకులైన వారిలో కొంత కొత్త తరం పురుడుపోసుకుంటుందనే ఆశ అందరిలోనూ చిగురించింది. కానీ ఆ ఆశ సజీవం కావడానికి చాలా కాలం పట్టలేదు. ఉద్యమ కారులతో పాటు టిఆర్‌ఎస్‌ లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు పెరిగిపోవడంతో సహజంగా నాయకులలో నిస్తేజం ఆవహించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనాదిగా రాజకీయాలలు చేస్తున్న కాంగ్రెస్‌ దానికి బాటలు వేసింది. మరో రాజకీయ పార్టీ కనిపించకుండా పోవాలంటే ఆ పార్టీ నాయకులను లాగేయాలి. పార్టీలలో చేర్చుకోవాలి. ఆ పరంపర బీజేపీ పార్టీ హయాం వచ్చే సరికి కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అన్న నినాదంలోనే ఆ పార్టీ నాయకులను లాగేసుకోవడం అన్నది వుంటుందని ఎవరూ ఊహించలేదు. జాతీయ స్థాయి పార్టీల వ్యవహారం అలా వుంటే ప్రాంతీయ పార్టీలు అదే బాటలో పయనిస్తున్నాయి. రాను రాను కొత్త రాజకీయ పార్టీల పుట్టుక అనేది ఎలా వున్నా, అధికారం సాధించేంత శక్తివంతమైన నాయకులు తయారు కావడం లేదు. ప్రజల ఆలోచనా విధానాలలో కూడా మార్పులు రావాల్సిన అవసరం వుంది. అయితే కేవలం రాజకీయాలు అధికారం పరమావధి అనుకునే పార్టీలు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. సిద్ధాంతాలు, రాద్దాంతాల గురించి మాట్లాడే పార్టీలకు కాలం చెల్లిపోయింది. దానికి కారణం రాజకీయ పార్టీలే. ప్రజలు ఎప్పుడూ సమస్యల మీద మాట్లాడే అవసరం, అవకాశం లేకుండా తాయిలాల రాజకీయాలు నెరపడం మొదలుపెట్టాయి. అందుకే ప్రజలకు కూడా ఏవగపు మొదలైంది. కొత్త రాజకీయ పార్టీలకు చోటు లేకుండా పోతోంది. నూతన రాజకీయ నిర్మాణం జరగకుండా అడ్డుకుంటోంది. ప్రజలు కూడా అభివృద్ధి చేస్తున్న పార్టీల నుంచి కూడా తాయిలాలు ఆశించడం తప్పు. అది ముందు ప్రజల్లో మార్పు రావాలి. అప్పుడు గాని రాజకీయ పార్టీలు ప్రజలంటే భయపడతాయి. ప్రజా సంక్షేమ రాజకీయాలు చేస్తాయి. ఆ రోజు రావాలని ఆశిద్దాం.!

బీజేపీలో తార స్థాయికి చేరిన విబేధాలు

*అధికార ప్రతినిధిని స్టేజ్ పైకి పిలవని జిల్లా అధ్యక్షురాలు*

 

పొలిటికల్, నేటిధాత్రి: 

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జాతీయ నాయకులు విశ్వసిస్తున్నప్పటికీ, కమలంలో జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య ఉన్న విభేదాలు పార్టీలో చర్చనీయా అంశంగా మారాయి. ప్రజలకు చేరువై పార్టీని అధికారంలో తేవడానికి రాష్ట్ర అధ్యక్షుడు

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమ సన్నాహక సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధిని జిల్లా అధ్యక్షురాలు స్టేజ్ పైకి పిలవకపోవడం నాయకుల మధ్య విబేధాలు తార స్థాయికి చేరాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం. హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ 2014 ఎన్నికలలో వరంగల్ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజ్యపాలయ్యారు, 2018 ఎన్నికలలో వరంగల్ పశ్చిమ టికెట్ను ఆశించిన దక్కలేదు, ప్రస్తుతం జిల్లా అధ్యక్షురాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలతో పాటు హన్మకొండ జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ తనను నమ్ముకున్న వారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందజేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు యువతలో ఫాలోయింగ్ ఉండడం జిల్లాలో తరచుగా పర్యటించడం వరంగల్ పశ్చిమలోని పలు ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను లేవనెత్తడం, నాయకుల మధ్య విభేదాలకు కారణమనే చర్చ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీలో నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయినడం పార్టీకి నష్టం వాటిల్లుతుందని పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

 

 *అధికార ప్రతినిధిని స్టేజ్ పైకి పిలవని జిల్లా అధ్యక్షురాలు*

 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర హన్మకొండ, వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశం గురువారం 

నిర్వహించగా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాత్ర సహా ఇంచార్జ్ తుళ్ళ వీరేందర్ గౌడ్ ముఖ్యఅతిధి పాల్గొన్నారు. నాయకులతో పాటు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డిని హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ స్టేజ్ మీదకు పిలవకపోవడం మరోసారి విభేదాలు బయటపడ్డాయి, కొద్దీ సేపు కార్యకర్తల మధ్యలో కూర్చొని రాకేష్ రెడ్డి వెళ్లిపోవడం రాష్ట్ర అధికార ప్రతినిధి, యాత్ర సహా ఇంచార్జ్ తుళ్ళ వీరేందర్ గౌడ్ విషయం పై అరా తీయడం పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందనే చర్చ నాయకులలో కొనసాగుతుంది. పార్టీ అధిష్టానం నాయకులు మధ్యలో సమన్వయం కొరకు ఏం చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన వద్దిరాజు

న్యూఢిల్లీ, ఆగస్ట్, 6:

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సైతం తన ఓటు వేసారు. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత మొదటి సమావేశంలోనే తనకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని రవిచంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది..? 

– రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు 

– సమాధానం దాటవేసిన కేంద్రం 

– ప్రజల మనోభావాలకు పాతర

 

న్యూఢిల్లీ, ఆగస్టు, 5:

 

తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం మరోసారి రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. శుక్రవారం సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని రైల్వే సంబంధిత అంశాలపై ప్రశ్నించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సభలో ప్రశ్నను లేవనెత్తారు. ఈ అంశం రాష్ట్రాల పునర్విభజన చట్టంలో కూడా పొందు పర్చారని.. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనిపై కేంద్రానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేశారని రవిచంద్ర గుర్తు చేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పై సమాధానం చెప్పాలని ఆయన రాజ్యసభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాధానాన్ని దాటవేశారు. దీనిపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం తెలంగాణ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందన్నారు. రాష్ట్రాల పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశంపై సమాధానం ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం ఎప్పటిలాగే నిరాకరించిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం పట్ల, ఇక్కడి ప్రజల పట్ల కేంద్రానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనేది మరోసారి స్పష్టమైందని అన్నారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలని రవిచంద్ర కోరారు.

అంతా రేవంత్‌ వల్లే..?

రేవంత్‌ మూలంగానే బిజెపికి వలసలు?

కాంగ్రెస్‌ నుంచి బిజెపికి వలసల పేర్లెందుకు వినిపిస్తున్నాయ్‌?

బిజెపి నుంచి కాంగ్రెస్‌ కు రావాల్సిన సమయంలో ఇదేం ట్విస్ట్‌?

బిజెపిలో చేరతారనే వారిలో కాంగ్రెస్‌ నాయకుల పేర్లెందుకు వినిపిస్తున్నాయి?

సర్థుకు పోవుడెలాగూ లేదు..భుజ్జగింపులు కూడా లేవా?

బలంగా వున్న కాంగ్రెస్‌ వైపు కాకుండా ఇతరులు బిజెపి వైపే ఎందుకు చూస్తున్నట్లు?

బిజెపిలో కనిపిస్తున్న భరోసా ఏమిటి?

కాంగ్రెస్‌ వైపు ఎవరూ కన్నెత్తి చూడకపోవడానికి కారణం ఏమిటి?

రేవంత్‌ నాయకత్వం మీద నమ్మకం సన్నగిల్లినట్లేనా?

ఒకరు కాంగ్రెస్‌ ఖాళీ అవుతుంటే పిసిసి అధ్యక్షుడుగా వున్నంతకాలం దిక్కులు చూశాడు…కోవర్టనే ముద్ర వేసి విపరీత ప్రచారం జరిగినా పట్టించుకోలేదు. ఆఖరుకు ఇక ఆయనకు విసుగొచ్చి వదులుకునేదాకా పార్టీకి జరగాల్సిన డ్యామేజీ జరిగేదాక వున్నారు. నాకు పిసిసి పదవి కావాలని నెలల కొద్ది ప్రయత్నాలు చేసి, ఎదురుచూసి రేవంత్‌ రెడ్డి పదవి సాధించుకున్నారు. ఇప్పుడూ పరిస్థితి అంతకు భిన్నంగా ఏమీ లేదు. అని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి పార్టీ వదలేయపోయినా సమస్య ఎపిసోడ్‌లకు ఎపిసోడ్‌ సాగింది. ఇప్పుడు మరి కొందరు కాంగ్రెస్‌ నాయకులు కూడా బిజెపి లో చేరేందుకు క్యూలు పడుతున్నట్లు బిజెపి లీకులిస్తోంది. ఇదంతా రేవంత్‌ రెడ్డి వల్లనే జరుగుతుందన్న ప్రచారం జోరందుకుంటోంది. దీనంతటికీ రేవంత్‌ రెడ్డి అలసత్వం, ఒంటెద్దు పోకడలే కారణమంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ లో సీనియర్లుకు ఆయన ప్రాధాన్యత కల్పించడం మర్చిపోయారు. ఆది నుంచి వారితో అంటీ ముట్టనట్లే వుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని రేవంత్‌ పక్కన పెడుతున్నాడు. పార్టీలో వారి ప్రధాన్యత తగ్గిస్తున్నాడు. ఇతరులను పరోక్షంగా ఉసిగొల్పుతున్నాడు. మొత్తంగా రాష్ట్రం మొత్తం తన అనుచర గణం మాత్రమే వుండేలా చూసుకుంటున్నాడనేది ప్రధాన ఆరోపణ. అందుకే కాంగ్రెస్‌ ఇక రేవంత్‌ తమను లెక్క చేసే పరిస్థితి కనిపించడం లేదన్న భావనలో వాళ్లు బిజెపి వైపు చూస్తున్నారంటున్నారు. నిజానికి ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఎంతో బలంగా వుంది. నాయకులు ఉన్నారు.

కానీ వారిని ప్రోత్సాహం చే క్రమంలో పిసిసి అధ్యక్షుడు అందరికీ అందుబాటులో వుండడం లేదు. ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయితే ఆయన పాదయాత్ర చేసి, పార్టీని పటిష్ఠం చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇక జరుగుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు. సమయం కూడా సరిపోదు. రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేస్తాడని ప్రచారం జరిగిన సమయానికి వైఎస్‌ఆర్‌ టిపి అధ్యక్షురాలు షర్మిల పార్టీ కూడా పురుడుపోసుకోలేదు. ఆమె పార్టీ పెట్టారు. పాదయాత్ర ఆరు నెలలుగా సాగిస్తున్నారు. ఒక బిజెపి రాష్ట్ర ఛీఫ్‌ బండి సంజయ్‌ పాదయాత్రలు అన్నవి ముందు అనుకున్నవి కాదు. కానీ బండి సంజయ్‌ విడతల వారీగా ఇప్పటికే రెండు ప్రజా సంగ్రామ యాత్రలు పూర్తి చేశారు. ఇప్పుడు మూడో యాత్ర యాదాద్రి నుంచి మొదలు పెట్టారు. ఇలా బిజెపిని బలోపేతం చేయడానికి సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. యాత్రల మీద యాత్రలు సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి మాత్రం పాదయాత్ర అంశాన్ని పక్కనపడేశారు. ప్రజా ఉద్యమాలైనా అనుకున్న మేర సాగిస్తున్నారా? అదీ లేదు. రాజకీయం తప్ప మరేం చేయడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. గతంలో చేసిన ఉద్యమాలు కూడా రేవంత్‌ చేయడానికి సుముఖంగా లేరనే అంటున్నారు. రాజకీయాలతో దూసుకొచ్చినంత సులువుగా నిలదొక్కోవడం అందరికీ సాధ్యం కాదు. 

కానీ తన రాజకీయ జీవితం జెట్‌ స్పీడ్‌ లా ఎదగాలని కోరుకొన్నవారిలో డక్కమొక్కీలు తిన్నవాళ్లు చాలా మందే వున్నారు. అలాంటి వారిలో సక్సెస్‌ అయిన వాళ్లు వున్నారు. ఆఖరు దాక కొట్లాడినా ఫలితం అందని వారూ వున్నారు. అలాంటి వారిలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఏ రకమైన భవిష్యత్తు ఆయనను వరిస్తుందో మాత్రం అర్థం కావడం లేదు. టిడిపిలో వున్నంత కాలం అధికారంలో లేడు. అధికారం చూసింది లేదు. చూస్తుండగానే జడ్పీ టిసి అయ్యాడు. ఆ వెంటనే ఎమ్మెల్సీ అయ్యాడు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు మల్కాజిగిరి ఎంపిగా వున్నాడు. తెలుగు దేశంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయ్యాడు. కాంగ్రెస్‌ లోనూ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా కూడా పని చేశాడు. ప్రజాప్రతినిధి అయినా ప్రతి పక్ష పాత్రనే కొనసాగించాల్సి వచ్చింది. తెలంగాణ వచ్చి కాలం కలిసొచ్చిందో, ఆశల కుంపటి పెరిగిందో ఏమో కాని పిసిసి అధ్యక్షుడు అయ్యే దాక వచ్చింది. గత ఎన్నికలలో రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ లో ఓడిపోయిన తర్వాత ఇక ఆయన పని అయిపోయిందనే అన్నారు. కాకపోతే పార్లమెంటు ఎన్నికలు కలిసొచ్చాయి. గెలుపుకు మార్గం వేశాయి. మళ్ళీ ఆశలు చిగురించాయి. పడినా లేచి నిలబడ్డాడు. కాంగ్రెస్‌ లో కీలమయ్యాడు. పిసిసి మీద పడ్డాడు…అదిగో…ఇదిగో అన్నారు…కానీ రెండేళ్ళ కాలయాపన జరిగింది. పిసిసి అయితే రేవంత్‌ పాదయాత్ర అన్న ప్రచారం జోరుగా సాగింది. ఆయన కూడా అవునన్నారు. ఒక రకంగా పాదయాత్ర వుంటుందన్నంత ప్రకటన చేశారు. మధ్యలో రెండు ఉప ఎన్నికలు రావడం పిసిసి వాయిదా పడుతూ వచ్చింది. ఇక రేవంత్‌ కాంగ్రెస్‌ వదిలేడం పక్కా అన్న ప్రచారం కూడా మామూలుగా సాగలేదు. అప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితులు మరీ అద్వాహ్నంగా వున్నాయి. బిజెపికి పెద్దగా ఆశలు కూడా కనిపించని కాలం. తెలంగాణ లో ప్రాంతీయ పార్టీకి వ్యాక్యూమ్‌ వుందన్న ప్రచారం జరిగిన సమయం. రేవంత్‌ పై అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు. సహజంగా రేవంత్‌ స్వభావం దూకుడుగా వుంటుంది. పిసిసి విషయంలో మాత్రం చాలా కాలం పాటు ఎంతో ఓపిగా నిరీక్షిస్తూ వచ్చాడు. అందుకు ప్రతిఫలం దక్కనైతే దక్కింది. పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. అప్పటి వరకు గేమ్‌ ఒక ఎత్తు…ఇక ఇప్పుడు ఒక ఎత్తు… గేమ్‌ స్టార్ట్‌ నౌ…అనుకున్నాడు. గతంలో అందరు పిసిసి ప్రెసిడెంట్ల లాగా సునాయాసంగా వుంటుందనుకున్నాడు. అది కాంగ్రెస్‌… అందులో పుట్టి పెరిగిన వాళ్లకే మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంటారు. అలాంటి పార్టీని ఏరి కోరి ఎంచుకొని, పిసిసి పదవి తెచ్చుకొని ముళ్ల కుర్చీ మీద, ముళ్ల కిరీటం పెట్టుకున్నాడు…రోజుకో సినిమా చూస్తూనే వున్నాడు. ఇంతా కష్టపడి పిసిసి అయి ఆయన చేస్తున్నదేమీ లేదని, బిజెపి బలపడుతుంటే చేష్టలుడిగి చూస్తున్నాడనే అంటున్నారు. మైకు మాట్లాడుతున్నంత పట్టుదల పార్టీ బలపడడానికి కృషి చేయడం లేదంటున్నారు. అంత దాకా ఎందుకు రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంలో రేవంత్‌ పట్టించుకున్నట్లు కనిపించలేదు. పార్టీ లోని సీనియర్లంతా రాజగోపాల్‌ ను కలిసి పార్టీ మారొద్దని ఒత్తిడి చేశారు. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా రాజగోపాల్‌ రెడ్డి ఇంటికి వెళ్లి వారించే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్‌ మాత్రం ఆ పని చేయలేదు. అసలు వెళ్లాల్సింది రేవంత్‌ రెడ్డి. ఇతర నాయకులందరినీ కలుపుకొని వెళ్లి, మాట్లాడి రావాల్సిన సందర్భం. అది జరగలేదు. ఒక రకంగా రాజగోపాల్‌ వ్యవహారంపై పెద్దగా స్పందించింది లేదు. పార్టీకి నష్టమన్న భావన ఆయనలో కనిపించినట్లు లేదు.

ఎరువుల కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేటిధాత్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఎరువుల కొరత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు ఎరువులు ఎమ్మార్పీ రేట్లు అమ్మినారు నెలరోజులవుతున్న ఎరువుల కోసం ఎదురుచూపులు బయట ఫెర్టిలైజర్స్ నందు ఒక కట్టకు వంద రూపాయల నుండి 150 రూపాయలు అధిక రేట్లు అమ్ముతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు తీసుకెళ్లిన ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు పక్క మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మందు కట్టాలు దొరుకుతున్న కరకగూడెం మండలంలో ఎందుకు దొరకడం లేదు రైతుల సమస్యలు వ్యవసాయ శాఖ ఇప్పటికైనా పరిష్కరించగలరు లేకపోతే కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తాం ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు

టిఆర్‌ఎస్‌ నుంచి పోటీకి ఆరుగురు రెడీ!

`కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఎవరో మరి!

`బిజెపి మురిసినంత పండగ కాదు…మునుగోడు!

`ప్రతిపక్షాల అత్యుత్సాహం అసలుకే మోసం?

`రాజగోపాల్‌ కు బిజెపి శ్రేణుల సపోర్ట్‌ ఎంత అన్నది స్పష్టత లేదు?

`అనుచరులెవరూ రాజగోపాల్‌ తో రావడానికి సిద్ధంగా లేరు?

`కాంగ్రెస్‌ శ్రేణులు అసలే రారు!

`కాంగ్రెస్‌ లో సై అన్న ధైర్యం కనిపించడం లేదు?

`పోటీకి ఎవరున్నారో అభ్యర్థిని వెతకడం కష్టం?

`నేనంటే నేనే ఆరుగురు రెడీ!

`అందరూ అందరే!

`మునుగోడులో బలంగా గులాబీ..

`ఎవరికిచ్చినా టిఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరు మీద నడకే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అడుగేసేటప్పుడు అందరూ ఆచితూచే వేస్తున్నామనుకుంటారు…కాలు జారితే గాని పడిన సంగతి తెలుసుకోలేరు…హెచ్చరించినా వినిపించుకోరు…తమ మంకు పట్టు వదులుకోలేరు…బొక్క బోర్లా పడేదాకా వాళ్ల ఆలోచన మానుకోరు. అలా ఎవరి చేతనో కూడా ప్రభావితమై కూడా తప్పటడుగులు చాలా మంది వేస్తారని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి వారిలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి… అని అందరూ చర్చించుకుంటున్నారు. ఆయనకు టిక్కెట్టు ఇచ్చిన గెలిపించుకున్న పార్టీ వెళ్లొద్దని వారిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే రోధిస్తోంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ని దూషించినా సరే…ఆయన వైపే సీనియర్లు ఆలోచనలు చేస్తున్నారు…రాజగోపాల్‌ రెడ్డి ని ఎలాగైనా ఆపాలన్న దృఢ నిశ్చయంతో అందరూ వెళ్లి కలుస్తున్నారు…ఎక్కడ రాజగోపాల్‌ రెడ్డి నిర్ణయం మార్చుకుంటాడో అన్న ఆందోళనలో బిజెపి వుంది. అందుకే రాజగోపాల్‌ రెడ్డి అదిగో, వచ్చే ఇదిగో వచ్చే అంటున్నారు. బిజెపి రాష్ట్ర ఛీఫ్‌ బండి సంజయ్‌ ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డి వస్తున్నారని ప్రకటన కూడా చేసేశారు. తాంబూలాలిచ్చుకోవడమే తరువాయి అని టైటిల్స్‌ వేసి వదిలేశారు. సినిమా వస్తుందా? రాదా? వచ్చినా నడుస్తుందా? అన్నది రాజగోపాల్‌ రెడ్డి చేతిలో మాత్రం వుంది. 

ఇదిలా వుంటే మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైన క్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేయడానికి అరుగురు నాయకులు మేం రెడీ అంటున్నారు. వారిలో ఉద్యమ కారుడు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌. టిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు. ఉద్యమ కాలంలో క్రియాశీలక పాత్ర పోషించిన నాయకుడు. 2014 ఎన్నికలలోనే టిఆర్‌ఎస్‌ టిక్కెట్టు ఆశించాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సూచనతో పాటు, సముచిత స్థానం వుంటుందని ఆశించాడు. అందుకు ఎమ్మెల్సీ అయ్యాడు. కాకపోతే ఎమ్మెల్యే కావాలన్న బలమైన కోరికతో వున్నాడు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మంచి సంబంధాలే వున్న మాస్‌ లీడర్‌…కొన్ని మండలాలను ప్రభావితం చేయగల నాయకుడు. 

ఇక కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి. టిఆర్‌ఎస్‌ నుంచి 2014లో మునుగోడు నుంచి గెలిచాడు. ఉద్యమ కారుడు. నియోజకవర్గం మొత్తం పట్టున్న నాయకుడు. ఎంత పట్టున్నా ఒక్కసారి పట్టుజారితే రాజకీయాలలో మళ్లీ అందుకోవడం కష్టం. అందుకే ఈ తరం నాయకులు ఎప్పుడూ పదవి చేజారకుండా చూసుకుంటుండాలి. లైమ్‌ లైట్‌ లో వుండాలి. అందులోనూ పార్టీ అధికారంలో వున్నప్పుడు పదవి చేజార్చుకోకుండా వుండాలి. కానీ గత ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ సెట్టింగులంతా మరింత మెజారిటీతో గెలిస్తే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఓటమిపాలయ్యారు. దాంతో ఒక వేళ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేస్తే, ఉప ఎన్నిక వస్తే మరో సారి అవకాశం వస్తుందని తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టారు. టిక్కెట్టు తనకే వస్తుందని నమ్ముతున్నాడు…పార్టీ ఊపులో వున్నప్పుడే పదవి జార్చుకున్నాడు…ఇప్పుడు సంపాదించుకుంటాడా? అన్న ప్రశ్న మాత్రం ఉత్పన్నమౌతోంది. మరో నాయకుడు కంచర్ల కృష్ణా రెడ్డి. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి సోదరుడు. ఉమ్మడి జిల్లా ప్రజలకు మంచి సుపరిచితమైన నాయకుడే…కాకపోతే టిఆర్‌ఎస్‌ లో చేరి ఎంతో కాలం కాలేదు…. అయినా పోటీ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. జిల్లాలో తమ కుటుంబానికి వున్న స్థానం పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు. అవకాశం కోసం తన ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టారు. గత ఎన్నికలలో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. మునుగోడు లో అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధం అంటున్నాడు. 

మునుగోడు నియోజకవర్గం విషయానికొస్తే ఓటర్లలో ఎక్కువ శాతం పద్మశాలి, ముదిరాజ్‌ సామాజిక వర్గం ఉంది.ఒక వేళ మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన పక్షంలో తమకు అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గ నేతలు కోరుతున్నారు. వారిలో కర్నాటి విద్యాసాగర్‌ పద్మశాలి వున్నారు. ఇక మిగిలిన నాయకుడు నారబోయిన రవి. మునుగోడు జడ్పీటీసి స్వరూపారాణి భర్త. రియలెస్టేట్‌ వ్యాపారంలో వున్నారు. అత్యధిక ఓటర్లు కలిగిన ముదిరాజ్‌ ల ఓట్లు గుండుగుత్తగా కొల్లగొడతానంటున్నాడు. మునుగోడులో తనదైన శైలిలో చక్రం తిప్పి బిజెపి లో తనదైన ముద్రను చాటాలనుకుంటున్నాడు ఈటెల. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో ఈటెల రాజేందర్‌ కొంత కాలంగా రాజగోపాల్‌ రెడ్డి వెనుక వుండి నడిపిస్తున్నాడని సమాచారం. మునుగోడులో రాజగోపాల్‌ రాజీనామా చేస్తే గెలిపించుకునే క్రమంలో ముదిరాజ్‌ ల ఓట్లు కొల్లగొట్టేలా చూసే బాధ్యత నాది అని ఈటెల అంటున్నారట. 

ఇదంతా గతంలో ఓసారి డిల్లీ పర్యటన సమయంలో ఎంపి.కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి కారులో ఈటెల రాజేందర్‌ ప్రత్యక్షమయ్యారు. దాంతో అందరూ ఈటెల కాంగ్రెస్‌ వైపు చూస్తున్నాడా! అన్న ప్రచారం మరోవైపు చేసి, కోమటి రెడ్డి కుటుంబంతో ఈటెల రాజకీయం ఇటు మలపాలని చూశాడు. మొత్తం మీద రాజగోపాల్‌ రెడ్డి బిజెపి చేరేలా ఈటెల రాయబారం జరిపినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి రాజగోపాల్‌ భవిష్యత్తు రాజకీయాల గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఒక రకంగా రాజగోపాల్‌ ఒత్తిడిలో వున్నట్లు మాత్రం స్పష్టమౌతోంది. 

ఇంతకీ రాజగోపాల్‌ ఏదీ సూటిగా చెప్పడం లేదు…డైలమాలో వున్నట్లు స్పష్టమౌతున్నా క్లారిటీగా వున్నా అనుకుంటున్నాడు. తాను రాజీనామా చేసే విషయాన్ని ఏకంగా ప్రజలనే అడుగుతానంటాడు. ప్రజలు వద్దంటారా? తమ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందంటే కాదంటారా? హుజూరాబాద్‌ లాగా హుటాహుటిన పనులు జరగాలని ప్రజలు కోరుకోరా! ప్రజలు కూడా ఎప్పుడు రాజీనామా చేస్తాడా? రాజగోపాల్‌ అనే చూస్తున్నారు. ఈ సంగతి రాజగోపాల్‌ రెడ్డికి అర్థమైపోయింది. దాంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యి ని సృష్టించుకున్నాడు. ఇప్పుడు ముందుకు పోతే ఎలా వుంటుందో ఇప్పటికిప్పుడు ఎవరూ ఏదీ చెప్పలేము. మునుగోడు లో బిజెపికి పెద్దగా బలం లేదు. గత ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఆరువేలు. రాజగోపాల్‌ రెడ్డికి గత ఎన్నికలలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకుని గెలిచాడు. ఇప్పుడు బిజెపి ఒంటరి పోరు. అసలక్కడ క్యాడర్‌ లేదు. కనీసం తన క్యాడరైనా రాజగోపాల్‌ తో వస్తుందా! అన్నదాని మీద క్లారిటీ లేదు. పది మందో, మందో వస్తే సరిపోతుందా? ఇక రాజగోపాల్‌ రెడ్డి తో కాంగ్రెస్‌ క్యాడర్‌ వచ్చే అవకాశమే లేదంటున్నారు. ఇక కాంగ్రెస్‌ కు ఏడుపొక్కటే మిగిలింది…. మేఘాలు, ఉరుములు లేని తుఫాను తమ పార్టీ ద్వారా వస్తుందని, తమ పార్టీ ని బలిస్తుందని ఎవరూ కలలో కూడా కలగలనలేదు.

విద్యార్థి సేవలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అంతా అల్ల కల్లోలం అయ్యి ఎందరో రోడ్డుమీద పడ్డారు మారుమూల గ్రామాల్లో వరద ప్రాంతాల్లో నివసించే ప్రజల నివాసాలు వరద బారిన పడి దెబ్బతిన్నాయి సర్వస్వం కోల్పోయిన ప్రజలకు విద్యార్థులకు అండగా ఉంటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నోటు బుక్స్, పెన్నులు, విద్యారథులందరికీ సహాయం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ప్రతి పాఠశాల, కళాశాలలకు తిరుగుతూ, సోషల్ మీడియా లో సమాచారం అందించి విద్యార్థుల వద్ద నుండి నోటు పుస్తకాలు, పెన్నులను సేకరించి వాటిని వరదల వల్ల నష్టపోయిన విద్యార్థులకు అందజేస్తుంది ఈ కార్యక్రమం గత కొద్ది రోజులుగా నిర్విరామంగా నడుస్తుంది ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్టం లోనే కాదు దేశం నలుమూలలా ఎలాంటి సమస్య ఉన్న ఒక అడుగు ముందు ఉంది సమస్య పరిష్కారంకై పోరాడుతుంది అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హనుమకొండ తెలియ జేసింది

సమాచా(దూ)ర శాఖ!

`కదిలిన ఐఅండ్‌ పిఆర్‌ యంత్రాంగం…

`నేటిధాత్రి కథనంపై హుటాహుటిన సమావేశం..

`ప్రభుత్వ వార్తలపై ఐఅండ్‌ పిఆర్‌ నిర్లక్ష్యాన్ని నిలదీసిన నేటిధాత్రి..

`ఒక్కసారిగా ఐఅండ్‌ పిఆర్‌లో కుదుపు…

`కాకపోతే నేటిధాత్రి మీద అధికారులు గుర్రు…

`డ్యూటీ గుర్తుచేసినందుకు నేటిధాత్రిపై అధికారుల రుసరుసలు…

`పిఐబి లాగా ఇకపై ప్రభుత్వ వార్తలపై పర్యవేక్షణ తప్పదా? అని నిట్టూర్పులు…

`వార్తలు రాయడం మరిచారు…వాటిని పంపడం మానేశారు?

`జిల్లాలో ఎమ్మెల్యేల అధికారిక వార్తలకు కూడా దిక్కు లేదు?

`సమాచార శాఖ ఆ పని చేయాలన్న అవగాహన ఎమ్మెల్యేలకు కూడా లేదు!

`నాలుగు లైన్లు రాసి పంపే తీరిక లేదు?

`విపత్తు సమయాల్లో ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు హజరైనా సమాచార శాఖ కదలదు?

`గుర్తు చేసినందుకు నేటిధాత్రిని తప్పు పడుతున్నారు!

`ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా మేలుకోకపోతే మునిగేది పార్టీ నే!

`ప్రజలకు దూరమయ్యేది మీరే!

`అధికారులెలాగూ కడుపు కదలకుండా, చల్లగా ఎల్లకాలం అక్కడే వుంటారు?

`అధికారులకు పని పురమాయించండి…లేకుంటే డిపార్ట్మెంట్‌ లావైపోతుంది!

`ఒక్క వార్త…ఒక్క కుదుపు…

మీడియా వర్గాలలోనే కాదు సమాజం లో కూడా జరగాల్సిన చర్చ…రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలకు తెలియాల్సిన అంశం. ఇంతకీ (ఐఅండ్‌ పిఆర్‌) సమాచార పౌరసంబంధాల శాఖ అంటే ఏమిటి? కేవలం పత్రికలకు ప్రకటనలు, అక్రిడిటేషన్‌ కార్డులేనా? ఆ పని కూడా సకాలంలో జరుగుతుందా? అంటే అదీ జరగదు…అన్నీ పెండిరగే…ఆఖరుకు వార్తలు కూడా పెండిరగే…ఐఅండ్‌ పిఆర్‌ అంటే ప్రభుత్వ అధికారిక సమాచార వ్యవస్థ, వారధి. మరి ఆ శాఖ నిత్యం ఎన్ని వార్తలు తయారు చేస్తోంది? ఎన్ని వార్తలు ఎన్ని పత్రికలకు పంపిస్తోంది? జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందుతున్న సమాచారమెంత? ప్రజలు తెలుసుకోవాల్సిన సమాచారాలపై ఎన్ని కథనాలు పత్రికలకు పంపిస్తున్నారు? జిల్లా స్థాయిలలో ఏం జరుగుతోంది. ప్రతి జిల్లాలో సమాచార శాఖ కార్యాలయాలు, సిబ్బంది వున్నారు. 

వారికి అవసరమైన పరికరాలు, వాహనాలు వున్నాయి. అవసరమైతే ప్రభుత్వ కార్యక్రమాలకు మీడియా ప్రతినిధులకు సైతం వాహనాలు ఏర్పాటు చేసి మరీ, కవరేజ్‌ చేయాలి. చేయించాలి. మీడియా కవరేజ్‌ చేస్తుంది కదా! అని చేతులు దులుపుకొని కూర్చునే వ్యవస్థ కాదు. కచ్చితంగా ఆ ప్రభుత్వ పనితీరు కనిపించేలా , ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తూ వార్తలను రాసి పంపాలి. ఇంత టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో కూడా సమాచారం శాఖ ఎప్పటికప్పుడు వార్తలు అందించేది. ప్యాక్స్‌ ద్వారా కూడా వార్తలు అందించేవారు. అది ఆ శాఖ విధి. ఇప్పుడు అదంతా మానుకున్నారు. పనులొదులొదిలేసి కాలక్షేపం చేస్తున్నారు. ఈ విషయాలు చాలా మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు తెలియకపోవడం విడ్డూరం. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ సెక్యూరిటీ కోసం ఎలా పనిచేస్తుందో, సమాచార శాఖ అధికారులు కూడా ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యక్రమాలకు విధిగా అందుబాటులో వుండాలి. మీడియా పర్యవేక్షణ సాగించాలి. జిల్లా స్థాయిలో కూడా సమాచార శాఖ సిబ్బంది కార్యాలయాల నుంచి కాలు కదపడం లేదు. అంతదాకా ఎందుకు నిత్యం సరిగ్గా విధులకు హాజరు కావడం లేదు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వస్తున్నారా? లేదా? విధుల్లో వున్నారా? లేరా? అని చూస్తారు. కానీ ఒక్క సమాచార శాఖ వైపు జర్నలిస్టులు కూడా చూడడం మానేశారు. ఎందుకంటే మనలో మీడియా మిత్రులకు సైతం సమాచార శాఖ విధులపై సరైన అవగాహన లేకపోవడం. జర్నలిస్టు సంఘాలు సైతం ఈ విషయాలను ప్రస్తావించకపోవడం. జర్నలిస్టుల శిక్షణా తరగతులలో చెప్పకపోవడం వల్ల ఈ విషయం తెలియకుండా పోతున్నాయి. ఫలానా కార్యాలయంలో అధికారులు పని చేయడం లేదని వార్తలు రాస్తారే గాని, సమాచార శాఖలో అధికారులు విధులకు సక్రమంగా హాజరౌతున్నారా? లేదా అని రాస్తున్నారా? సమాచార శాఖ అధికారుల మీద వార్తలు రాస్తే అక్రిడిటేషన్‌ ఆపుతారేమో! అన్న భయం కూడా చాలా మందిలో చోటు చేసుకున్నట్లుంది. అక్రిడిటేషన్‌ అనేది జర్నలిస్టుల హక్కు. దానిని కాపాడుకోవడంలో జర్నలిస్టులు, సంఘాలు విఫలం కావడం వల్లనే సమాచార శాఖ అధికారులు చేయాల్సిన పనులు వదిలేస్తున్నారు. విధులను తప్పించుకుంటున్నారు. సమాచార శాఖ అధికారులే అప్రమత్తంగా లేకపోతే ఎలా? 

అధికారులంతా అప్రమత్తంగా వుండాలంటే సమాచార శాఖ మరింత అప్రమత్తంగా వుండమని…! అన్ని శాఖలు అప్రమత్తంగా వుండి సమాచార శాఖ నిద్రపొమ్మని కాదు.. ఆ మధ్య వరంగల్‌ లో వర్షాలకు ఓ పాత ఇల్లు అర్ధరాత్రి కూలిపోయింది. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే, హుటాహుటిన తన అనుచరులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అక్కడికి ఇతర శాఖల అధికారులు, మేయర్‌ కూడా చేరుకున్నారు. సమాచార శాఖ అధికారులు జాడ లేరు. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయడానికి, ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఎమ్మెల్యే తన ప్రైవేటు పిఏలతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేసి, మీడియా కు వివరాలు అందించారు. ఇలా సమాచార శాఖ విధులు తెలియక ఒక్కొక్క ఎమ్మెల్యే అరడజను ప్రైవేటు పిర్వోలను, సోషల్‌ మీడియా ఇన్‌ చార్జ్‌ లను ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో అసలు ఏవి ప్రజా ప్రతినిధుల అధికారిక కార్యక్రమాలో, పార్టీ కార్యక్రమాలో తెలియకుండా పోతోంది. రాష్ట్ర స్థాయి కార్యాలయం ఏం చేస్తుందనేది కూడా పెద్ద మిస్టరీగా మారింది. 

ఎప్పుడు చూసిన అన్ని కుర్చీలు ఖాళీనే…కింది స్థాయి సిబ్బంది మాత్రం రివ్యూలలో వున్నారు…మీటింగుల్లో వున్నారని మళ్ళీ మీడియా ప్రతినిధులకే చెప్పి బుకాయిస్తుంటారు. ఏ రివ్యూ జరిగిందన్న దాని మీద మాత్రం ఒక్క వార్త రాసి పంపరు…సీట్లో వుండరు, విధులకు సరిగ్గా హజరుకారు. కంప్యూటర్లలో గేమ్‌ లు, సెల్‌ ఫోన్లలో చాటింగ్‌ లు…! కాకపోతే ఎప్పుడూ ఆన్‌ డ్యూటీ అంటారు. అంతగా పని చేస్తుంటే గతంలో లాగా ప్రభుత్వ పథకాల మీద ప్రత్యేక శ్రద్ధ ఏది? అ ప్రచారమేది? వాటి రికార్డుల తయారీ ఏదీ? మీడియా సంస్థలకు అందజేసి, ప్రజలకు తెలియజేసిన సమాచారమేది? ఏ ఒక్క పత్రికలో నైనా ప్రభుత్వ విజయాలు, పథకాల మీద ఎడిటోరియల్‌ పేజీలలో ప్రత్యేకమైన కథనాలు వస్తున్నాయా? ఏఏ పత్రికలలో ఎలాంటి వార్తలు వస్తున్నాయో? గమనిస్తున్నారా? ఎంత సేపు కార్యాలయానికి వచ్చామా? వెళ్లామా? మిగతా సమయాలలో వచ్చిన వాళ్లతో గంటలు, గంటలు ముచ్చట పెట్టామా? పొద్దుబుచ్చుకున్నామా? అంతే…ఔనంటారా? కాదంటారా? ప్రభుత్వానికి ఇవేం పట్డదు…అధికారులకు ఇంతకన్నా మంచి తీరిక మరొకచోట దొరకదు…పేరుకు ఉద్యోగం…ఏమీ చేయాల్సిన పని బాతాఖానీ వ్యవహారం..! కొంత మంది ఇప్పటికీ కొంత నిబద్ధతతో పని చేసే సమాచార శాఖ అధికారులున్నారు…పై విషయాలకు వారు మాత్రం మినహాయింపు! అర్థం చేసుకోగలరు…జర్నలిస్టులు మేలుకోగలరు…ప్రభుత్వ పెద్దలు తేరుకోగలరు

పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి: ఎమ్మెల్యే చల్లా

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే చల్లా

పరకాల నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ , పరకాల మండలం, నడికూడా మండలం, ఆత్మకూర్ మండలం, దామెర మండలాలకు చెందిన *41 మంది లబ్దిదారులకు 13,64,500.

రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను* పరకాల శాసన సభ్యులు *శ్రీ చల్లా ధర్మారెడ్డి* గారు హనుమకొండలోని అయన నివాసంలో అందజేశారు.

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ….టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. ఆరోగ్య శ్రీ లో వర్తించని వ్యాధులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు వైద్యానికి అయ్యే ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని వైద్య చికిత్సకు అందిస్తోందని తెలిపారు. ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. ప్రతి కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.

 

లబ్ధిదారుల వివరాలు:

 

పరకాల మున్సిపాలిటీ (7)- 1,98,500.

 

పరకాల మండలం(7)- 3,04,000.

 

నడికూడ మండలం(7)-2,55,000.

 

ఆత్మకూర్ మండలం(10)-2,68,500.

 

దామెర మండలం(10)- 3,38,500.

 

ఈ కార్యక్రమంలో మండల ముఖ్య ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు మంట ..మూడు పార్టీలకు తంట!

మునుగోడు మంట ..మూడు పార్టీలకు తంట!

పట్టుతప్పితే ఖేల్‌ ఖతం…. 

గెలిచే పార్టీదే రాష్ట్ర భవిష్యత్తు!

అందరి ఆసక్తి మును‘గోడు’వినాలనే

చావో రేవో మునుగోడులో తేల్చుకోవాల్సిందే!

సర్వశక్తులు అందరూ ఒడ్డేందుకు సిద్దం?

మూలిగే నక్క మీద తాటిపండు కధ కాంగ్రెస్‌ ది?

వాపో, బలుపో బిజెపికి తేలిపోతుంది?

కారు ప్రయాణమెంత పదిలమో తెలిసిపోతుంది?

టిఆర్‌ఎస్‌ గెలిస్తే ఇక తిరుగుండదు?

బిజెపి గెలిస్తే గోడమీద నాయకులు ఆగరు?

ఉమ్మడి నల్గొండలో బిజెపి పాగా అడ్డుకోలేరు?

కాంగ్రెస్‌ గెలిస్తే రెవంత్‌కు తిరుగుండదు?

ముందు చరిత్ర ఓసారి: నిన్న నీదికానిరోజు ,నేడు నీది కావొచ్చు…మళ్ళీ రేపు నీది కాకపోచ్చు…ప్రతి రోజూ నాదే కావాలను కోవడం తప్పు కాకపోవచ్చు..కాని అది అత్యాశే అవుతుంది.. అనర్థం తెచ్చిపెడుతుంది..రాజగోపాల్‌ రెడ్డి రాజకీయంలా వుంటుంది. ప్రజాస్వామ్యాన్ని ఎవరూ అపహాస్యం చేయొద్దు… తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు వాడుకోవద్దు…రాజకీయ నాయకులకు వ్యాపారాలు వుండొద్దని పెద్దలు ఎందుకు చెప్పారో…మునుగోడుతో తేలిపోయినట్లే? రాజకీయం అన్నది ప్రజా సేవ చేయడానికి, ఆస్తుల సంపాదనకు, వాటి రక్షణకో, వ్యాపార విస్తరణలకోసం చేసేవి కావు…అందుకే మన రాజకీయాలు ఇలా తగలబడుతున్నాయి…ఉన్నత విద్యావంతులు, రాజకీయ నాయకుల వారసులు, వ్యాపార వేత్తలు ప్రజా సేవ ముసుగేసుకొని వస్తే ఇలాగే వుంటుంది…

 అయ్యే …మునుగోడు!: 

మునుగోడు ప్రజలు ఏరి కోరి రాజగోపాల్‌ రెడ్డిని ఎంచుకొని గెలిపించుకున్నారు. అందుకు పశ్చాత్తాపడండి అనేలా చేస్తున్నాడా! అనే అనుమానం రాకమాదు. ఒకసారి ఎంపిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే గా నల్గొండ జిల్లా ప్రజలు కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి రాజకీయంగా మద్దతిస్తూనే వున్నారు. దాంతో ఆయన ఇంత దూరం రాగలిగాడు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి సోదరుడు అనే ఒకే ఒక్క అర్హత మరేదీ ఎంపి కాకముందు లేదు. మొదటి సారే కాంగ్రెస్‌ పార్టీ ఎంపిగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. గెలిచాక పదవిలో వుంటూ కాంట్రాక్టులు చేసుకోవడానికి అనుమతులు కల్పించారు. పులిచింతల ప్రాజెక్టు కోమటి రెడ్డి బ్రదర్స్‌ చేపట్టారు. ఆ అవకాశం కల్పించారు. నేషనల్‌ హైవే పనుల కాంట్రాక్టులు పొందారు. ఇలా పార్టీ అనేక అవకాశాలు కల్పించింది. కానీ అవన్నీ రాజగోపాల్‌ రెడ్డి మర్చిపోయారు. ఇప్పుడేంటి…నా కేంటి…అనే దారిని చూసుకుంటున్నాడు. తాను ఎంపిగా,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా గెలిచినా తన సొంత బలంతోనే అన్నంత దాకా వెళ్లాడు…రాజకీయంగా తన ఎదుగుదలలో పార్టీ ప్రమేయమే లేదన్నంతగా మాట్లాడుతున్నాడు. తమది బ్రాండ్‌ అంటున్నాడు….2018 ఎన్నికలలో గెలిచాక సిఎల్పీ పదవి ఆశించాడు. పార్టీ అంగీకరించలేదు. పార్లమెంటు ఎన్నికలలో వెంకటరెడ్డి భువనగిరిను గెలిచారు. ఆ తర్వాత అన్నకు పిసిసి కావాలనుకున్నాడు. అదీ దక్కలేదు. ప్రస్టేషన్‌ పీక్‌ స్థాయికి చేరింది… అప్పటి నుంచి రాజగోపాల్‌ రెడ్డి సొంత పార్టీ మీద రాజకీయం మొదలుపెట్టారు…అదును దొరికినప్పుడల్లా బిజెపిని పొగడ్తలతో ముంచెత్తడం మొదలుపెట్టారు. ఇక అప్పటినుంచి కోమటి రెడ్డి బ్రదర్స్‌ ఎప్పటికైనా జంపే అన్న సంకేతాలు ఎప్పుడూ పంపుతూనే వున్నారు. అదంతా ఒట్టి ప్రచారం మేమంటే గిట్టని వారు చేస్తున్న దుష్ప్రచారం అని ఖండిస్తూ వస్తున్నారు…ఎప్పడైతే రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడయ్యారో అప్పటి నుంచి అదును కోసం, అవకాశం కోసం కోమటి రెడ్డి బ్రదర్స్‌ ఎదురుచూస్తున్నారనేది నిత్యం నలుగుతున్న మాటే…తమ్ముడికేం తెలియదు…ఆవేశం అనుకుంటే అన్న చేస్తున్నదేముంది…రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అధ్యక్షుడు కాగానే ఇక గాంధీ భవన్‌ మెట్లు ఎక్కను అన్నాడు…పార్టీ పరమైన కార్యక్రమాలకు దూరంగా వుంటూ వస్తున్నాడు…ఇప్పటికీ అంటీ ముట్టనట్లు వుంటున్నాడు…సమిష్టిగా పోరాటం చేద్దాం… పార్టీని అధికారంలోకి తెద్దామన్న ప్రకటన చేసింది లేదు…నిత్యం కయ్యమే…సొంత పార్టీలో జగడమే…ఎంత కాలం కోమటి రెడ్డి బ్రదర్స్‌ తలనొప్పి అనుకునే దాకా చెచ్చుకుంటున్నారు. 

ఇప్పుడేం జరగబోతోంది:

నాన్నా పులి కథ అందరికీ తెలిసిందే… అయినా అదే ఆచరిస్తాం…తర్వాత తెల్ల మొహం వేస్తాం…ఇది అహంలో ఒక భాగం… తన గోతి తాను తీసుకోవడం…గోడమీద పిల్లి వాటం ఎల్ల కాలం సాగదు..ఎప్పుడో ఒకసారి ఎటువైపో దూకక తప్పదు…ఎప్పుడూ గోడ మీదనే వుంటానంటే ఆఖరుకు ఎవరూ పట్టించుకోరు.. రాజగోపాల్‌ ఒక నిర్ణయానికి వచ్చింది ఇక్కడే…తాజాగా రాజగోపాల్‌ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలవడంతో కథ క్లైమాక్స్‌ కు చేరింది. డిల్లీ లో లీకులిస్తారు…తెలంగాణకు వచ్చి రచ్చ చేస్తారు..ఇది రాజకీయ నాయకులకు పరిపాటే…ఒక మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్యే అనూహ్యంగా పార్లమెంటులో కేంద్ర హోం మంత్రిని కలవడం అన్నదానికి ప్రత్యేకత వుండదా? సరే కలిసిన తర్వాత ఇంత పెద్ద వార్తల వంటకాలెలా వచ్చాయి? రాజగోపాల్‌ రెడ్డి ఏ మాత్రం లీకులివ్వకుండానే అంతా జరిగిపోయిందా? పైగా రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేస్తే అది చారిత్రక నేపధ్యమౌతుందన్నంతగా ప్రచారం చేసుకోవడం మరో వింత? రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేస్తే కేవలం ఉప ఎన్నిక మాత్రమే వస్తుంది?

అన్నదమ్ములు రాజకీయాలు:

రాజకీయాలలో అన్నదమ్ములు చరిత్రలు కోకొల్లలు. కానీ కోమటి రెడ్డి బ్రదర్స్‌ రాజకీయం సెపరేటు…ఉమ్మడి కుటుంబం… ఒకే పార్టీ రాజకీయం… అయినా వింతవింత ప్రకటనలు.. గతంలో ఆనం కుటుంబం ఇలాగే కుటుంబం రాజకీయం.. కాకపోతే ఇద్దరు ఇద్దరే అన్నట్లు వుండేవారు. ఇద్దరూ ఒకే బాటలో నడిచేవాళ్లు. ఇప్పటికీ అన్నదమ్ములు రాజకీయాలలో వున్నవారిలో ఎర్రబెల్లి సోదరులు. ఇప్పటికీ అన్న గీసిన గిరి దాటకుండా తమ్ముడు రాజకీయం చేస్తున్నాడు. పార్టీలు ప్రతిష్టాత్మకానికి పోయి: క్రీడా కారులకు క్రీడలలో గ్యాప్‌ వస్తే ఎలా వుంటుంది… అలా ప్రతి రాజకీయ పార్టీ ఎప్పటికప్పుడు తమ పార్టీ క్షేత్ర స్థాయిలో ఎలా వుందనేది అంచనా వేసుకునే పనిలో నిమగ్నమై వుంటుంది. గతంలో కన్నా ఈ మధ్య కొద్దిగా రాజకీయాల జోక్యం మరింత పెరిగిపోయింది. ఎవరు నలుగురు కలిసినా రాజకీయమే మొదలౌతోంది. మునుగోడు చర్చనే జరుగుతోంది…

తహతహలాడుతున్నాయా! కసిమీద వున్నాయా?: 

మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావాలని తహతహలాడుతున్న పార్టీలు టిఆర్‌ఎస్‌, బిజెపి… ఆటలో అరటిపండౌతామో అన్న భయంలో కాంగ్రెస్‌ వుంది. నమ్మి పార్టీ అనేక అవకాశాలు ఇచ్చిన ఉత్త పుణ్యానికి ఉప ఎన్నిక తెచ్చి కాంగ్రెస్‌ పార్టీకి మరింత సమ్మెట పోట్లు వేయాలని చూస్తున్నట్లే వుంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కానుంది. ఇప్పటికే వరుస ఉప ఎన్నికలతో కోలుకోలేని దెబ్బలు తింటూ ఇప్పుడు ఊపు మీదున్నామని చెప్పుకుంటే వున్న గాలి తీసే ప్రయత్నం రాజగోపాల్‌ రెడ్డి చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌ కు ఎంత ప్రతిష్టాత్మకమో, రేవంత్‌ రెడ్డి కి సవాలుగా మారే ప్రమాదముంది. హుజూరాబాద్‌ సమయంలో ఇప్పుడే వచ్చాను…ఇళ్లన్నా సర్థుకోలేదు…యుద్ధం చేయమంటే ఎట్లా? అని ఈటెల గెలుపు చేసిన పని రేవంత్‌ మెడకు చుట్టుకోకమానదు…నల్గొండ ఎలా వస్తావ్‌? మా ఇలాఖాలో ఎలా అడుగుపెడతావ్‌? అని నిలదీసిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి కి చెక్‌ పెట్టాలంటే మునుగోడులో కాంగ్రెస్‌ గెలవాలి? అది సాధ్యమేనా? అన్న ప్రశ్న కాంగ్రెస్‌ శ్రేణులను తొలుస్తోంది. రేవంత్‌ రెడ్డి ని రాజగోపాల్‌ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఆశామాషీ వ్యవహారం కాదు..అందుకోసమైనా రేవంత్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కసిగా ఓడిరచాలి. 

రాజగోపాల్‌ ను లాక్కుంటే బిజెపి కి ఏం లాభం?: 

రాజగోపాల్‌ రెడ్డి రాజకీయంతో ఆడుకోవడం తప్ప మరేం లేదు… ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిజెపికి పట్టు లేదు…ఉన్న ఫలంగా బలంగా వున్నాం…ప్రత్యామ్నాయం మేమే అనిపించుకోవాలి. బిజెపి వైపు ఆశగా చూస్తున్న రాజగోపాల్‌ రెడ్డి రాజకీయం అడ్డం పెట్టుకోవాలి. సక్సెస్‌ అయ్యిందనుకో బిజెపికి లాభం… ఫెయిలైతే ఒక ప్రయోగం విఫలమని సరిపెట్టుకోవాలి. తెలంగాణలో కాన్సంట్రేషన్‌ చేయాలో వద్దే తేల్చేసుకోవాలి. 

ఎలాగైనా కారుకు లాభమే! కాకపోతే పరీక్షే?:

గతంలో తిరుగులేదు, ఎదురులేదు, ఎన్నికలేవైనా గెలపు మాదే..గెలిచేది మేమే.. అనుకునే టిఆర్‌ఎస్‌ కు రెండు ఉప ఎన్నికలలో బ్రేకులు పడ్డాయి. ఏ రకంగా చూసినా అవి ఇబ్బంది టిఆర్‌ఎస్‌ ను ఆత్మ పరిశీలనలో పడేలా చేశాయి. పోయిన రెండు ఉప ఎన్నికలలో పరువును సమతూకం చేసి, టిఆర్‌ఎస్‌ తగ్గలేదని నిరూపించుకోవాలి. ఇది అందివచ్చిన అవకాశంగా కచ్చితంగా మల్చుకోవాలి…కారు పార్టీ నుంచి సై అంటే సై అనేందుకు ఆరుగురు రెడీగా వున్నారు…పోటీలో కూడా సంఖ్య పెద్దదే చూపిస్తున్నారు…ఇక్కడ కూడా బలం మాదే అంటున్నారు.

మూడు పార్టీలకు చావో రేవో:

పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న మునుగోడు ఎన్నిక మూడు పార్టీ ముచ్చెమటలు కక్కాల్సిందే…మూడు చెరువుల నీళ్లుతాగాల్సిందే…గంట గంట గడగడమని ఒనుక్కుంటూ రోజులు గడపాల్సిందే…నరాలు తెగే ఉత్కంఠను అనుభవించాల్సిందే…!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version