సాగు సల్లగుండాలే- రైతు సంతోషంగుండాలే!

`రైతు సుభిక్షమే కేసిఆర్‌ లక్ష్యం

`ఒకనాడు ఎండిన తెలంగాణను చూసి తల్లడిల్లిన కేసిఆర్‌

`ఎన్ని బోర్లేసినా చుక్క కళ్ల చూడని మల్లారెడ్డి గోస చూసిన కేసిఆర్‌.

`చెరువుల్లో నీళ్లు లేక, పొలాలకు నీరందక ప్రతి ఏడు ఎండుడే!

`తెలంగాణ వస్తే తప్ప సాగు కష్టాలు కడతేరవని జెండా ఎత్తిన నాయకుడు కేసిఆర్‌

`రైతు బంధు అందులో భాగమే

`ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్‌ సాగు రంగంలో తెలంగాణ నెంబర్‌వన్‌ కోసమే

`తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశమంతా అమలు చేయాలి.

`దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడమే కేసిఆర్‌ కల.

`దేశంలోని రైతులందరికీ రైతు బంధు, రైతు భీమా అమలు కావాలి.

`దేశమంతా మంచినీటి సమస్య తీరాలి. 

`గఇవన్నీ దేశమంతా అమలు కావాలంటే దేశానికి కేసిఆర్‌ నాయకత్వం రావాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సాగు సల్లగుండాలే..రైతు సంతోషంగా వుండాలి. ఆనందంగా వుండాలి. సుభిక్షంగా వుండాలి. పెదవులుపై చిరునవ్వులు తొనికిసలాడాలి. కాలం కావాలని మొగులు వైపు, కరువు రావొద్దని కాలం వైపు, పంటలెండిపోవద్దని మధనపడొద్దు. సాగు నీటి కటకట అసలే రావొద్దు. పల్లె పచ్చగుండాలి. పాడి పంటలతో కళకళలాడాలి. చేనంతా పచ్చని పైట కప్పుకోవాలి. రైతులకు బంగారు సిరులు పండాలి. వృత్తులు పునరుజ్జీవం కావాలి. మావన వనరుల అభివృద్ధికి మళ్లీ జీవం పోయాలి. దేశమంతా రైతుకు ఆసరా కావాలి. ప్రభుత్వాలు భరోసా కావాలి. రైతును ఆదుకునే పాలకులు కావాలి. రైతును అడుగడుగనా అండగా నిలిచే ప్రభుత్వాలే వుండాలి. రైతు పెట్టుబడి కష్టం రాకుండా చూసుకోవాలి. అందుకు ప్రభుత్వాలే పెట్టుబడి సాయం అందించాలి. తెలంగాణలో అమలౌతున్న రైతు బంధు దేశమంతా అమలు కావాలి. రైతు ఒకరి సాయం కోసం అర్దించే పరిస్ధితి రావొద్దు. అప్పుల పాలు కావొద్దు. ఈ సాగు మా వల్ల కాదని వ్యవసాయం వదిలేయొద్దు. రైతు ఏడ్చే రోజు అసలే రావొద్దు. ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ లక్ష్యం. ఇది తెలంగాణలో నెరవేరిన స్వప్నం. అంటే నిజమైన కల. ఆ కల దేశమంతా కలగా మిగిలిపోకూడదు. తెలంగాణలో రైతు ఎంత సుభిక్షంగా వున్నాడో దేశమంతా అలాగే రైతు ఆనందంగా వుండాలి. గతంలో అంతో ఇంతో రైతు సంక్షేమం మీద కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించేవి. కాని కేంద్రంలో బిజేపి వచ్చిన తర్వాత రైతు గోసలు మరింత పెరిగాయి. ఈ ఏడెనెమిదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదు. తెలంగాణలో కాలం అబ్బురపడేలా, ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా మూడేళ్లలో కాలేశ్వరం…ఆరేళ్లలో మల్లన్న సాగర్‌ తోపాటు, అనేక రిజర్వాయర్లు పూర్తి చేసుకున్నాము. తెలంగాణలో నీటి గోస లేకుండా చేసుకున్నాము…మరి దీన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాయి. అందుకు కారణం దేశంలోని అనేక మెజార్టీ రాష్ట్రాలలో బిజేపి ప్రభుత్వాలు వుండడమే కారణం. అరవై ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఏనాడూ సమైక్య పాలకులు తెలంగాణ కోసం ఆలోచించలేదు.

తెలంగాణకు అన్యాయం చేయకుండా వుండలేదు. 1956 నుంచే అన్యాయం చేస్తూ వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఏకమైన సమైక్య రాష్ట్ర్రం ఏర్పాటు అయిన సమయంలోనే తెలంగాణ రెండుకోట్ల మిగులు బడ్జెట్‌ వున్న రాష్ట్రం. 4 కోట్లు లోటుతో వున్నది అప్పటి ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం. తెలంగాణ నిధులన్నీ ఆంధ్రకు తరలించారు. అక్కడ ప్రాజెక్టులు, కాలువలు కట్టుకున్నారు. తెలంగాణ ఎండబెట్టారు. ప్రాజెక్టులకు మొండిచేయి చూపారు. ఆనాడు ప్రశ్నించిన కొందరు నాయకులే గాని, నిలదీసిన నాయకులు లేరు. ఎదిరించి నిలబడిన నాయకులు లేరు. తెలంగాణలో ఉద్యమ స్వరూపం సాగుతున్నా, ఉవ్వెత్తున సాగేంత కొండంత అండ నాయకత్వం తెలంగాణ లేదు.2001లో కేసిఆర్‌ రూపంలో ఒక ఉద్యమ స్వరూపం ఎవరెస్టు శిఖరమంత బలమైంది ప్రజల ముందు నిలబడిరది. మనిషి బక్క పల్చనే కాని, బలం వెయ్యేనుగుల బలమంతది అని ప్రజల నమ్మారు. కేసిఆర్‌ వెంట నడిచారు. ఆ సమయంలో కేసిఆర్‌ చూసిన తెలంగాణ సాగు గోసలు అన్నీ ఇన్నీ కావు. తలాపున గోదారి పారుతున్నా ఉత్తర తెలంగాణ ఎప్పుడూ ఎండడమే తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద కాలువ అంటూ చెప్పుకోవడానికి తప్ప, నీరు పారడానికి వీలు లేకుండా కాకతీయ కాలువను మార్చారు. కాలువ తప్ప నీరు లేకుండా చేశారు. మరి ఇప్పుడు ఏడాది మొత్తం ఆ కాలువ కళకళలాడుతుంటోంది. నిజామాబాద్‌ నుంచి ఖమ్మం సరిహద్దు దాకా సాగునీరు మోసుకెళ్తోంది. కాళేశ్వరంలో ఉత్తర తెలంగాణలోని ప్రతి పల్లెలో నీటి సిరులు జళజళ పారుతున్నాయి. ప్లోరైడ్‌ను తరిమేసేలా అటు ఖమ్మంతోపాటు, ఇటు నల్లగొండలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మంచీనీరు అందుతోంది…తెలంగాణ సాధిస్తే ఇవన్నీ సాధ్యమా? అని అనుకున్నవారు కూడా ఆ నిజాన్ని కల్లారా చూస్తున్నారు…తెలంగాణ ప్రగతిని చూసి మురుస్తున్నారు. అందుకే నిన్నటి గోసను మర్చిపోవద్దు. నిన్న పడిన కష్టం కల అనుకోవద్దు. 

నిలిచి గెలిచిన తెలంగాణను మళ్లీ ముంచేవాళ్లు కాచుకొని కూర్చున్నారు. అసలు ప్రగతి అంటే అర్ధం కూడా తెలియని నాయకులు ప్రతిపక్షాలలో మాటల గారడీ నేర్చుకున్నారు. మాయ మాటలు చెప్పే వారిని నమ్మొద్దు. తెలంగాణ సరిహద్దులు కూడా సరిగ్గా తెలియని వాళ్లంతా మాకు ఒక్కసారి చాన్స్‌ ఇవ్వండంటున్నారు. వచ్చిన తెలంగాణను మూడేళ్లులోనే ఆగం చేసేందుకు సీమాంధ్ర నేతల కనుసన్నల్లో పనిచేసి ఓటుకు నోటు కేసులో ఇరుకున్నవాళ్లు వాళ్లు కూడా తెలంగాణను పాలిస్తామంటున్నారు. పరాయి వాళ్ల చేతుల్లో తెలంగాణను పెట్టేందుకు దాసోహం అంటున్నారు. తెలంగాణ గురించి కనీసం ఉచ్చరించే అర్హత లేని వాళ్లంతా ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఏనాడు తెలంగాణ జెండా మోసిన దాఖలాలు లేని వాళ్లంతా తెలంగాణలో పెత్తనం కోసం నయవంచన కపట నాటకాలాడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. వారి మాయల్లో పడొద్దు. కుప్ప మీద పడి తినాలని చూస్తున్నారు. దోచుకొని తినాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. నీరు పెట్టి, దుక్కి దున్ని, విత్తు నాటి, పంట పండిరచి, కుప్ప నూడ్చాక కుప్ప మీద పడి తినడానికి గోతి కాడ నక్కల్లా కాచుకొని కూర్చున్నారు. కుప్ప నూడ్చడానికి కష్టపడ్డవారిని ప్రజలు మర్చిపోవద్దు. అధికారం కోసం అడ్డదారులు తొక్కే వాళ్లుంటారు. సమాజం గురించి సోయి లేని వారు పార్టీల పేరు చెప్పుకొని నయవంచన కోసం వస్తుంటారు. అధికారంలోకి రావాలని తంటాలుపడుతుంటారు. ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో కనిపించని వాళ్లంతా ఇప్పుడు తెలంగాణ మీద పెత్తనం కోసం అర్రులు చాస్తున్నారు. ఒక్కనాడు జై తెలంగాణ అనేందుకు నోరు రాని వాళ్లు, ఆనాడు నోరు లేని వాళ్లు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద నోరేసుకొని మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క దూం..ధాం కార్యక్రమంలో పాల్గొన్న చరిత్ర లేని వాళ్లంతా దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారు. పచ్చగా వున్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారు. అభివృద్ధి అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని వాళ్లు, ఆ మాటలు చెబితే ఎలాగూ తెలంగాణ ప్రజలు వినరని తెలుసు.

వారిని నమ్మరని తెలుసు. వారిని దగ్గరకు రానియ్యరని తెలుసు. అందుకే కులం చిచ్చు ఒక వైపు, మతం మత్తు ఒకవైపు నమ్ముకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. దేవుని పేరు చెప్పి, మనుషులను చీల్చి రాజకీయం చేయాలనుకుంటున్నారు. తస్మాత్‌ జాగ్రత్త అన్నది జనం అందరూ గమనించాలి. తెలంగాణ సాగు రంగంలో వేస్తున్న విప్లవాత్మక అడుగులు ఎలా వున్నాయో చూసేందుకు అనేక రాష్ట్రాలనుంచి రైతు నాయకులు వచ్చారు. రెండు రోజుల పాటు ప్రగతి భవన్‌లో వున్నారు. తెలంగాణలోరైతులకు అందుతున్న సంక్షేమ పథకాలు తెలుసుకున్నారు. రైతు బంధు విశిష్టతను స్వయంగా చూసి ఎంతో సంతోషంగా కొనియాడారు. రైతు భీమా వంటి వినూత్నమైన పధకం గూర్చి చర్చ చేశారు. పంట కొనుగోలు లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ, ముఖ్యమంత్రి కేసిఆర్‌ విజన్‌ తెలుసుకున్నారు. మిషన్‌ కాకతీయతో చెరువుల అభివృద్ధి , వాటికి పూర్వ వైభవం ఎలా వచ్చింది. ఇప్పుడు వాటి పరిస్దితి ఎలా వుంది. తెలంగాణ ఎలా కరువును దూరం చేసుకున్నది. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని,ఇంటింటికి ఎలా అందించుకుంటోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలలో ఈ పధకాలు ఎందుకు అమలు కావడంలేదు? అన్నదానిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్‌ సరఫరా ఎలా సాధ్యం? తెలంగాణ ఎలా సుసాధ్యం చేసింది? దేశమంతా ఎందుకు అమలు కావడంలేదు. అక్కడి పాలకులకు ఎందుకు చిత్తశుద్ది లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఆ సోయి ఎందుకు లేదు? ఇవన్నీ పొరుగు రాష్ట్రాల రైతులు కళ్లారా చూసి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రజెంటేషన్‌తో తెలుసుకున్నారు. దేశానికి కేసిఆర్‌ ఎలా ఆదర్శం కావాలో, దేశానికి కేసిఆర్‌ నేత అయితే ఎలా వుంటుందో అన్నది ఆ రైతు నాయకులే ఆయా రాష్ట్రాలలో చెప్పడానికి సిద్దంగా వున్నారు. దేశంలో వినూత్నమైన మార్పు కేసిఆర్‌ నాయకత్వం నుంచే మరో కొత్త తరం ఆవిష్కరణ జరగనుందని భవిష్యత్తు చెబుతోంది.

వాళ్లు క్రిమినల్స్‌ కాదా?

`వాళ్లనెందుకు అరెస్టు చేయడం లేదు?

`సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెట్టిన వారి ఫోటోలే క్రిమినల్‌ లిస్ట్‌ లో చేర్చుతున్నారు?

`కాసులకు కక్కుర్తి పడి అటు గర్భిణీలు, ఇటు పిండాలను చిద్రం చేస్తున్న వాళ్లు నేరస్థులు కాదా?

`వైద్యుడు దేవుడని కొలుస్తాం!

`వైద్య వృత్తిలో వుండి ప్రాణాలు పోయకుండా తీస్తున్న వారిపై చర్యలేవి?

`ప్రాణాలు తీస్తున్నా ప్రశ్నించే వారి గోడు వినేవారేరీ!

`నిత్యం భ్రూణ హత్యలు జరుగుతుంటుంటే బేటీ ఎక్కడ కాపాడబడుతోంది?

`పొత్తిళ్లలోనే ప్రాణాలు తీస్తుంటే ఆడపిల్ల పుట్టేదెలా?

`ఏసి. గదుల్లో సమీక్షలు జరిపితే ఆడపిల్లలు బతుకుతారా?

`కలెక్టర్‌ గారు మీ సమీక్షా సమావేశంలో ప్రాణాలు పోయిన రజిత గురించి చర్చించారా?

`రజిత ప్రాణాలు తీసిన డాక్టర్లపై చర్చించారా?

`నెల రోజులుగా నేటిధాత్రి అక్షరాలే అరణ్య రోధనౌతుంటేనే దిక్కులేదు?

`గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి…భ్రూణ హత్యలు ఆపాలన్న మానవత్వం మీలో వుందా?

`కళ్లు తెరవని పసి గుడ్డు ఆయువు తీస్తున్న వారిని కాపాడున్న వాళ్లే, రక్షిస్తామంటే నమ్మదగిందేనా?

`ఏసి రూముల్లో కూర్చొని చర్చిస్తే సరిపోతుందా?

`ఇప్పటి వరకు ఎన్ని ఆసుపత్రులు మూయించారు?

`ఎంత మంది డాక్టర్లను అరెస్టు చేశారు?

`వైద్యురాలు సబితను విచారించారా?

`ఆసుపత్రులకు నోటీసులిచ్చారా?

`ఓ పసిగుడ్డు, ఓ తల్లి ప్రాణాలు తీసిన వారిపైనే ఇంతవరకు చర్యలు లేవు?

`అధికారుల మీద ప్రజలకు ఇంకా నమ్మకం వుందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వాళ్లు పనిగట్టుకొని, పాపాలు చేస్తూ, నేరాలు చేస్తూ, పసిగుడ్డులను పొత్తిళ్లలో చిదిమేస్తూ, వైద్యం ముసుగులో వ్యాపారం చేస్తూ ప్రాణాలు తీస్తుంటే వాళ్లపై చర్యలుండవా? వారిపై కేసులుండవా? వారు నేరస్ధులు కాదా? శిక్షార్హులు కాదా? క్రిమినల్స్‌ జాబితాలో వారు చేరరా? వారి సర్టిఫికెట్టు సస్పెండ్‌ చేయరా? ఆసుపత్రులు మూసేయరా? వారి సర్టిఫికెట్లు నిజమేనా? ఆసుపత్రి ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తీసుకున్నారా? అన్ని రకాల సౌకర్యాలతో కూడిన వ్యవస్ధలోనే ఆసుపత్రి వుందా? అన్నవి కూడా ఎంతో ముఖ్యం. కాని ఇక్కడ అవేవీ పట్టించుకోకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిని కాపాడుతున్నదెవరు? వారికి అండగా నిలుస్తున్నదెవరు? ఎక్కడో ఏదో లోపం లేకుంటే వైద్య వృత్తి ముసుగులో గర్భిణీ ప్రాణాలకు ముప్పు తెచ్చిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఇంత కాలమెందుకు పడుతోంది? ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాని వైద్య శాఖ అధికారుల అలసత్వమా? లేక అవకాశవాదమా? ఏం జరుగుతోంది? ఓ వైపు పసి ప్రాణాలు ప్రపంచం కూడకముందే కంటి దీపం ఆర్పేస్తున్న వారిని కాపాడుతూ, మరో వైపు బేటీ బచావో, బేటీ పడావో అంటూ సమీక్షలు నిర్వహించడం దేనికి సంకేతం? ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భ్రూణ హత్యలు అన్నవి నిత్యకృత్యమైపోయాయని అందరికీ తెలుసు. అందుకు ఎంతో కఠినమైన చట్టాలున్నాయని తెలుసు. అయినా వైద్య వృత్తిలో వున్నవారు అబార్షన్లు చేయడం ఆపడంలేదు. అధికారులకు తెలిసినా వారు చర్యలకు ఉపక్రమించడం లేదు? తాజాగా హన్మకొండ కలెక్టరేట్‌లో బేటీ బచావో, బేటీ పడావో అనే విషయం మీద కొన్ని గంటల పాటు జిల్లా స్ధాయిలో అన్ని శాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. అదే సమావేశానికి జిల్లా వైద్యాధికారులు కూడా హజరయ్యారు. ఇటీవల భ్రూణ హత్యతోపాటు, రజిత అనే మహిళ ప్రాణం కూడా పోయింది. ఆ కుటుంబం వీధిన పడిరది. ఇద్దరు చిన్నారుల జీవితం ఆగమ్య గోచరమైంది. వారికి తల్లిలేకుండాపోయింది. వారి భవిష్యుత్తు అంధకారమైంది. ఎవరు వారిని చూసుకున్నా, కన్నతల్లి ప్రేమను పంచి, పెంచి పెద్ద చేసేంత పెద్ద మనసు మరొకరికి వుండదు. అలాంటి తల్లిని ఇద్దరు చిన్నారులకు దూరం చేసిన వారు దర్జాగా తిరుగుతుంటే, ఆ పిల్లలు నిత్యం కన్నీళ్లతో జీవితం గడపాల్సిన స్ధితికి కారణమైనవారిని గుర్తించరా? వారిని శిక్షించరా? మరి ఇలాంటి సమీక్ష సమావేశంలో ఇంత పెద్ద సంఘటనపై చర్చ జరిగిందా? కనీసం కలెక్టర్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారా? సంబంధిత అధికారులకు గుర్తు చేశారా? కలెక్టర్‌ తిరిగి పంపిన ఫైలు గురించి మాట్లాడారా? ఓ వైపు పెద్దఎత్తున భ్రూణ హత్యలు జరుగుతుంటే అరికట్టేందుకు సమీక్షలు ఎందుకు నిర్వహించలేదు? : 

కేంద్ర ఫ్రభుత్వం ఎనమిదేళ్లుగా బేటీ బచావో…బేటీ పడావో అనే కార్యక్రమం అమలు చేస్తోంది. అందుకు అవసరమైన నిధులు కూడా పెద్దఎత్తున వెచ్చిస్తోంది. ఆ నిధులు వినియోగమౌతున్నాయే…తప్ప ఎక్కడా వాటి ఫలితాలు పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు కూడా ఆడ పిల్లను బతికిద్దాం…వారిని చదివిద్దామని ప్రధాన కూడళ్లలో పెద్ద పెద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? అమలు మీద చిత్తశుద్ధి అవసరం లేదా? ముందు రిజిత సంగతి తేల్చండి? ఆమె మరణానికి కారకులైన వారిని ముందు అరెస్టు చేయండి? వారిని శిక్షించండి? అప్పుడు అధికారుల మీద ప్రజలకు నమ్మకం కల్గుతుంది. ఓ వైపు కలెక్టర్‌ రజిత మరణంమీద జిల్లా అధికారులు రూపొందించిన నివేధికలో ఏదో లోపముందని గ్రహించి, ఫైలు తిప్పి పంపించినప్పుడైనా అధికారుల్లో చలనం వుండొద్దా? సాక్ష్యాత్తు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు స్పందించి ఈ విషయాన్ని తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ను చూసుకొమ్మని ఆదేశాలు జారీ చేసినా అధికారుల్లో కించిత్‌ స్పందన లేదా? తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ ఓ కమిటీ ఏర్పాటు చేసిందన్న సంగతి తెలిసినా జిల్లా వైద్య అధికారులు కదలినట్లు లేదు. తాజాగా ప్రభుత్వ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన సంఘటనలో ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అంతే కాదు ఏదైనా ప్రభుత్వాసుపత్రిలో సంఘటనలు జరిగి, వైద్య అందడంలో ఏదైనా లోపం జరిగిన సందర్భాలలో వైద్యులను బాధ్యులు చేయడం చూస్తుంటాం. ఆ కుటుంబాలను ప్రభుత్వ ఆదుకోవడం తెలిసిందే! మరి డబ్బులు ఖర్చు చేసి, వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను నమ్మితే వారు ప్రాణాలు పోయాల్సిన వారి చేతుల్లో ప్రాణాలు పోతే వారి బాధ్యత లేదా? వారికి శిక్షలుండవా? రిజత కేసులో ఫైలు మూసేయడానికి అవసరమైన మార్గాలు అన్వేషిస్తున్నారే గాని, రజిత మరణంతో అనాధలైన చిన్నారులను ఆదుకోవాలన్న బాధ్యత వైద్యాధికారులకు లేదా? కనీసం వారిలో మానవత్వం కూడా లేదా? కర్తవ్యం గాలికి వదిలేశారా?అందరూ మర్చిపోయారు…మీరెందుకండీ…రజిత కేసులో న్యాయం అంటూ… ఇంకా సాగదీస్తున్నారు?:

ఇది ఎవరో కాదు…రియా ఆసుపత్రికి చెందిన ఓ డాక్టర్‌ నేటిధాత్రికి ఫోన్‌ చేసి అన్న మాటలవి. అసలు అబార్షన్‌కు కారణమైన వైద్యురాలు సబిత. మా తప్పేముంది? అంటూ నేటిధాత్రితో చెబుతూ మమ్మల్ని వదిలేయండి? అంటున్నారు. దయచేసి ఇకనైనా ఆపండి…అందరూ మర్చిపోయిన దాన్ని మళ్లీ రేపుతున్నారు? మేమేదో మేనేజ్‌ చేసుకున్నాం…ఇంకా ఆ విషయాన్ని లైమ్‌లైట్‌లోకి తేకండీ అంటున్నారు. వారికి ఒక గర్భిణీ ప్రాణం చిన్నగా కనిపిస్తోంది. అదేదో సినిమాలో నేను కోడిని కోస్తాను…మనిషిని చంపుతాను? రెండిరటీనీ ఒకే రీతిగా చూస్తాను…అంటూ విలన్‌ చెప్పినప్పుడు విన్నాం. కాని ఇప్పుడు రియా ఆసుపత్రి వైద్యుడు కూడా పరోక్షంగా అదే విషయాన్ని చెప్పినట్లు అనిపించకమానదు. ఇద్దరు చిన్నారులు జీవితాలు ఏం కావాలి? అన్నది మాత్రం ఎవరూ ఆలోచించడంలేదు? అటు ఆసుపత్రులు ఆలోచించక, ఇటు ప్రభుత్వ అధికారులు ఆలోచించక, పసి పిల్లలను దిక్కులేకుండా వదిలేద్దామా? వారికి ఓ దారి చూపిస్తామన్న మాటలే ఎక్కడా వినిపించడం లేదు? ఎంత సేపు మేనేజ్‌ చేశాం…అంటున్నారు? అంటే అర్దమేమిటో వారికే తెలియాలి? ఆ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామన్న మాట మాత్రం వారి నోటి నుంచి రావడంలేదు? మీకు చేత కాకుండా పోలీసు శాఖకు అప్పగించండి?:

వైద్యాధికారులకు ఇది కొత్త సమస్య కాకపోవచ్చు. కాని ఒక ప్రాణం అన్నది సమాజానికి ఎప్పుడూ పెద్ద సమస్యే…అసలు సమస్యే…అన్ని మీడియా సంస్ధల వదిలేశాయి? మీకుందుకు? అని నేటిధాత్రిని అనడం కూడా వైద్యులకు తగనిది. ఆ కుటుంబానికి ఏం చేయాలో చెప్పండి? అన్నది మాట మాత్రం ఎక్కడా వినిపించడం లేదు? ఇదీ మన వ్యవస్ధ దౌర్భాగ్యం. నెలల కింద జరిగిన ఈ సంఘటనను ఆసుపత్రులు, వైద్యులు, వైద్యాధికారులు, ఆఖరుకు వైద్యురాలు సబిత కూడా మర్చిపోయింది. మళ్లీ ఆమె పనుల్లో ఆమె నిమగ్నమైంది. రోజుకు ఎన్ని అబార్షన్‌ కేసులు వస్తే, అన్నీ పూర్తి చేస్తూనే వుంది. తన పాపపు పని ఆపడం లేదు. ఈ విషయాలన్నీ అందరకీ తెలుసు. ఒక్కటి వికటించి ఏదో జరిగినంత మాత్రాన ఆపుతామా? అన్నట్లు వైద్యంలో భ్రూణ హత్యల వ్యాపారం సాగిస్తూనే వున్నారు…! కలెక్టర్‌ గారు ఇక ప్రజలకు మీపైనే ఆశ. 

మీరు సత్వర న్యాయం జరిపిస్తారననే నమ్మకంతోనే చాలా మంది వున్నారు. రజత విషయంలో ఫైలు తిరిగి పంపినప్పుడు మీరు ఎలాగైన దోషులను శిక్ష పడేలా చేస్తారని అనుకుంటున్నారు? మీరు మరి కాస్త మనసు పెడితే…వైద్యుల ముసుగులో పసి ప్రాణాలను గాలిలో కలుపుతున్న వారిని శిక్షిస్తే తప్ప , ఇతర వైద్యుల్లో భయం కలగదు..! మీరు మరింత గట్టిగా ఈ విషయంపై దృష్టిసారితే తప్ప…అసలు దోషులు బైటకు రారు…బేటీ బచావో…బేటీ పడావో సార్ధకం కాదు?

భ్రూణ హత్యలపై స్పందన కనబర్చరా?

`ఇంకెంత కాలం కాలయాపన!?

`తల్లులు చనిపోతున్నా పట్టించుకోరా?

`జిల్లా వైద్య విభాగం రూపొందించిన రిపోర్ట్‌ ను కలెక్టర్‌ తిప్పి పంపినా స్పందనేది?

`డిఎంఅండ్‌ హెచ్‌ఓ సమాచారమిచ్చే తీరికలేదా?

`రియా ఆసుపత్రిలో పేషెంట్‌ రజితను ఎలా చేర్చుకున్నారు?

`శ్రీచక్రకు ఎందుకు పంపించారు?

`ఒక్క రోజులో సేకరించే సమాచారానికి నెలల సమయం కావాలా?

`అసలు రియా, శ్రీ చక్ర ఆసుపత్రులకు ఎలా అనుమతులిచ్చారు?

`అంతా గందరగోళం వ్యవహారం?

`తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన ఎథిక్స్‌ కమిటీ సభ్యులు ఏం రిపోర్టు ఇస్తారు అన్నది సర్వత్రా ఉత్కంఠ?

`ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆగని భ్రూణ హత్యలు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రాణాలు పోయడం మర్చిపోయిన కొందరు స్వార్ధపరులు ప్రాణాలు తీయడం నేర్చుకున్నారు. అవి కూడా పసి ప్రాణాలు. ప్రపంచాన్ని చూడాల్సిన ప్రాణాలు. అమ్మ కడుపులో చల్లగా పెరగాల్సిన ప్రాణాలు…కళ్లు తెరవకముందే ఆరిపోతున్నాయి…ప్రాణాలు పురిటిదాకా రాకుండానే పోతున్నాయి? ప్రాణాలు నిలపాల్సిన సమయంలో పసి ప్రాణాలు తీయడం కూడా వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఇది ఎంత దర్మార్గమైన చర్యలో అర్ధం చేసుకోవచ్చు. వారి వ్యాపారం కోసం, ఆదాయం కోసం, కోట్లకు పడగడలెత్తడం కోసం మహిళలే అరకొర చదువులతో వైద్య చేస్తూ, భ్రూణ హత్యలు చేయడమే వైద్యంగా పెట్టుకుంటున్నారు. నిత్యం భ్రూణ హత్యలతోనే క్లినిక్‌లు నడుపుతున్నారు. అలాంటివారిలో సబిత అనే వైద్యురాలు ఒకరు. ఇదంతా ప్రపంచానికి తెలుసు. ఆమె ఇప్పటికే మూడు సార్లు పట్టుబడిన సంగతి తెలుసు. తాజాగా రజిత అనే ఓ మహిళకు అబార్షన్‌ చేసే క్రమంలో జరగరాని ఘోరం జరిగిందన్నది అందరికీ తెలుసు. కాని అదంతా తారు మారు చేశారు…తప్పుడు నివేదిక తయారు చేశారు… కనీసం భయం లేకుండా దాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. ఆయనకు దానిపై అనుమానం వచ్చి, తిరిగి పంపారు…అయినా వైద్యాధికారుల్లో చలనం లేదు…స్పందన కరువు…! రజిత అనే గృహణి శ్రీచక్ర ఆసుపత్రిలో చనిపోయిందన్న నిజం అందిరకీ తెలిసిందే.

శ్రీ చక్ర ఆసుపత్రికి రజిత అనే గృహిణి ఎక్కనుంచి వచ్చిందంటే రియా ఆసుపత్రి నుంచి అన్నది కూడా తెలిసిందే. రియా ఆసుపత్రికి రజిత ఎలా వచ్చింది? ఎక్కడినుంచి వచ్చింది? ఎవరు రిఫర్‌ చేశారు? ఏ పరిస్ధితుల్లో రజిత రియా ఆసుపత్రిలో చేరిందన్న విషయం పూర్తిగా ఆసుపత్రి వైద్యుడు రవి చెబుతూనే వున్నారు. నేటిధాత్రికి కూడా ఆ విషయం వెల్లడిరచారు. అలాంటిది ఎంక్వౌరీ కమిటీకి రజిత రియా ఆసుపత్రికి ఎలా వచ్చిందన్న విషయాన్ని వెల్లడిరచకుండా వుంటారా? ఎవరిని మభ్యపెడదామని డిఎంఅండ్‌ హెచ్‌ఓ చూస్తున్నారు. ఎవరిని కాపాడేందుకు నివేదికను తప్పుల తడకగా తయారు చేశారు? రజిత మరణం మీద డిఎంఅండ్‌హెచ్‌ఓ తయారు చేసిన నివేధిక అంతా అతుకుల బొంతగా వుందని, అర్ధం పర్ధం లేకుండా వుందన్న సంగతి జిల్లా కలెక్టర్‌ కూడా చెప్పేశారు. ఆ నివేదికను తిరిగి వెనక్కి పంపిచారు. అయినా జిల్లా వైద్య యంత్రాంగం మాత్రం కదిలినట్లు లేదు. స్పందిస్తున్నట్లు అసలే కనిపించడం లేదు? నేటిధాత్రికి రిజత అనే గర్భిణీని సబిత అనే వైద్యురాలు రియా ఆసుపత్రికి రిఫర్‌ చేసిందన్న సంగతిని పేరుతో సహా డాక్టర్‌ రవి వెల్లడిరచారు. అదే విషయాన్ని ఎంక్వరీ కమిటికీ కూడా చెప్పి వుంటాడు? కాని దాన్ని తారు మారు చేయాల్సిన అవసరం డిఎంఅండ్‌హెచ్‌ఓకు ఏమొచ్చిందనేది ఇక్కడ తేలాల్సిన అసలు పాయింట్‌? రజిత అనే గర్భిణీకి అబార్షన్‌ ఎవరు చేశారని రియా ఆసుపత్రి వైద్యుడు రవిని నేటిధాత్రి ప్రశ్నించింది? మా ఆసుపత్రికి వచ్చే సరికే రిజతకు అబార్షన్‌ చేయడం జరిగిందన్న సంగతిని ఆయనే స్వయంగా వెల్లడిరచారు. ఇంత స్పష్టంగా డాక్టర్‌ . రవి చెప్పినా నివేదికను జిల్లా వైద్యాదికారులు ఎందుకు తారు మారుచేశారు? తప్పుల తడక నివేదిక ఎందుకు రూపొందిచారు?  ఇక్కడ మరో విషయంపై కూడా లోతుగా ఎంక్వౌరీ జరగాల్సిన అవసరం వుంది.

అసలు అబార్షన్‌ వికటించి, ప్రాణాపాయ స్ధితిలో వున్న రిజిత గురించి పూర్తి వివరాలు సేకరించకుండానే రియా ఆసుపత్రి జాయిన్‌ చేసుకున్నదా? అన్నది కూడా ఇక్కడ తేలాల్సివుంది? మరి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ, ప్రపంచానికి తెలియకుండా, జరిగిన సంఘటనలు వెలుగులోకి రాకుండా మభ్యపెడుతున్న రియా ఆసుపత్రి లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయొద్దన్నదానికి విచారణ కమిటి ఎందుకు ప్రశ్నించలేదు? రియా ఆసుపత్రికి ఎందుకు ఇంతవరకు నోటీసులివ్వలేదు? మా దగ్గర ఆబార్షన్‌ కాలేదన్న విషయాన్ని మాత్రమే నమోదు చేసి, మిగతా విషయాలన్నీంటిని కమిటి ఎందుకు వదిలేసింది? ఆసుపత్రి మీద చర్యలకు ఎందుకు రిపోర్టు చేయాలేదు? తూతూ మంత్రంగా రిపోర్టు తయారు చేసి చేతులు దులుపుకుంటే చాలని అనుకున్నారా? రియా ఆసుపత్రి వైద్యులు వెల్లడిరచిన వివరాల ప్రకారం తమ ఆసుపత్రిలో రిజితను జాయిన్‌ చేసుకున్నా, తమ వల్ల కాకపోవడంతోనే రిజితను శ్రీచక్ర ఆసుపత్రికి పంపడం జరిగిందన్న సంగతిని కూడా డాక్టర్‌ రవి చెప్పేశారు. మరి శ్రీచక్ర ఆసుపత్రి ఎలా జాయిన్‌ చేసుకున్నది? రజిత మరణానికి శ్రీచక్ర వైద్యులు ఎలా కారణమయ్యారో అన్నది దానిపై అధికారులు ఎంతో సీరియస్‌గా వుండాల్సిన అవసరం వుండేది. అసలు రియా ఆసుపత్రి ఎలా వుంది? శ్రీచక్ర ఆసుపత్రి ఎలా వుంది? అన్నది ఓసారి పరిశీలిస్తే, ఏదైనా జరగరానిది జరిగితే, గత కరోనా సమయంలో విజయవాడలో రమేష్‌ ఆసుపత్రికిలో జరిగినదానికంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం వుంది. కనీసం ఫైర్‌ సేఫ్టీ కూడా లేకుండా వుంది. ఏదైనా ఫైర్‌ ఆక్సిడెంటు అయినా వెనకనుంచి వెళ్లేందుకు గాని, ఫైర్‌ ఇంజన్‌ ద్వారా నీళ్లు చల్లేందుకు కూడా స్ధలం కూడా లేదు. అలాంటి భవనాల్లో ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవడం? వాటికి అధికారులు లైసెన్సులు ఇచ్చేడం కూడా పెద్ద మాఫియాగా తయారైంది! సరే….లైసెన్సులు ఇచ్చేప్పుడు ఏదైనా విషయంలో షరతులు ఉల్లంఘించినా, రజిత లాంటి మహిళ భ్రూణ హత్యలో ప్రాణాలు కోల్పోతే కూడా ఆ ఆసుపత్రుల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అన్నది అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. డిఎంఅండ్‌హెచ్‌ఓ ఫోన్లోకి అందుబాటులోకి రారు?: 

ఎన్ని సార్లు డిఎంఅండ్‌హెచ్‌ఓకు ఫోన్‌ చేసినా కట్‌ చేస్తుంటారు..లేకుంటే పోన్‌ ఎత్తరు. ఆగష్టు 19నుంచి ఎన్నిసార్లు ఫోన్‌ చేస్తున్నా డిఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు పోన్‌ లిప్ట్‌ చేయడంలేదు. అసలు నివేదిక మళ్లీ తయారు చేస్తున్నారా? అన్న సంగతి కూడా చెప్పడానికి ఆయనకు సమయం చాలడం లేదా? లేక మీడియాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? ఓ మహిళ ప్రాణం తీసిన వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఎవరినీ లెక్క చేయడం లేదా? రజిత మరణం మీద తయారు చేసిన నివేధిక కలెక్టర్‌ రిటన్‌ పంపిన తర్వాత కూడా కదిలేందుకు డిఎంఅండ్‌హెచ్‌ఓకు సమయంలేదా? లేక కలెక్టర్‌ ఆర్డరును కూడా బేఖాతరు చేస్తున్నారా? అసలు రిజిత మరణం విషయంలో అసలైన దోషులను ఎందుకు ఆయన దాచిపెడుతున్నారన్నది తేలాల్సిన అవసరం వుంది? వైద్యురాలు సబిత అనుచరుడి తిరకాసు మాటలు?: వైద్యురాలు సబిత నేటిధాత్రిని లీగల్‌గా చూసుకుంటామని కొత్త రాగం అందుకున్నారు? అంటే ప్రాణాల మీద ప్రాణాలుతోపాటు, నిత్యం భ్రూణ హత్యలు చేస్తూ, పట్టుబడి కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే వ్యవస్ధలను వైద్యురాలు సబిత ఎలా మేనేజ్‌ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అంటే రెడ్‌ హాండెడ్‌గా పట్టుకున్న వైద్య అధికార సిబ్బంది, నివేదికలు సమర్పించిన సిబ్బంది, అరెస్టు చేసిన పోలీసులందరిదీ తప్పని నిరూపించుకుంటానని భహిరంగంగానే చెబుతున్నారంటే చట్టాలు కూడా లెక్కలేవా? జైలు జీవితం అనుభవించి కూడా మారని తీరుతో, మళ్లీ, మళ్లీ అవే తప్పులు చేస్తున్నాం, పాపాలు మూట గట్టుకుంటున్నామన్న బాధ కించిత్తు కూడా లేకుండా లేదు. పైగా తమ తప్పులను ఎత్తి చూపడం తప్పంత దోరణితో నేటిధాత్రికి దమ్‌కీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఇక అర్ధం చేసుకోండి? ఇక సామాన్యుల పరిస్ధితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు? రంగంలోకి తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ : 

గర్భిణీ రజిత మరణం, భ్రూణ హత్యలపై తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ స్పందించింది. ఈ మేరకు కౌన్సిల్‌ చైర్మన్‌ రాజలింగం నేటిధాత్రితో మాట్లాడారు. రజిత మరణంపై జరిగిన పూర్తి స్ధాయి నివేదిక రూపొందించేందుకు ప్రత్యేకంగా ఓ కమిటి ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. కాకతీయ మెడికల్‌ కాలేజీ ఉపాధ్యాయవైద్యులతో కమిటి ఏర్పాటైంది. గైనిక్‌ డాక్టర్‌ నిర్మల, పిల్లల డాక్టర్‌. శేషుమాధవ్‌లతో కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి హరీష్‌రావు చొరవతో తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ రంగంలోకి దిగింది. వంద గొడ్లనుతిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కొట్టుకుపోయిందని తప్పుల మీద తప్పులు నేరాలు చేస్తూ, పసి ప్రాణాలను కర్కషంగా చంపేస్తున్నవారికి ఎన్నటికైనా శిక్ష తప్పదు…!

మళ్ళీ ‘పొత్తు’పొడుపు!

`చిగురిస్తున్న పాత స్నేహాలు

`తెదేపా, బిజేపిల ఎన్డీయే మానియా!

`వరుసగా ఇరు పార్టీల నేతల రహస్య భేటీలు…

`మొదట మోడీతో డిల్లీలో చంద్రబాబు 

`మునుగోడు సభ నాడే తెలంగాణలో అమిత్‌ షా కొత్త రాజకీయం

`అటు రామోజీ రావు, ఇటు జూనియర్‌ ఎన్టీఆర్‌ తో సమావేశం.

`తాజాగా లోకేష్‌ తో అమిత్‌ షా భేటీ

`చంద్రబాబుకు భద్రత మరింత పెంపు

`తెలంగాణపై ముందు ఫోకస్‌…

`ముందే చెప్పిన నేటిధాత్రి…

`ఎన్టీఆర్‌ మానియాతో తెలంగాణలో బిజేపి…

`ఆంద్రప్రదేశ్‌ లో రెండు కలిసి పోటీ…

`ఒక్క దెబ్బకు రెండు పిట్టలు…

 కేసిఆర్‌ కాదంటే చంద్రబాబు…

`బిజేపి పొత్తు రాజకీయాలు….

`తెదేపా కు రెడ్‌ కార్పెట్‌…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మళ్లీ పాత స్నేహాలు చిగురిస్తున్నాయి. పాత పొత్తులు తెరమీదకొస్తున్నాయి. దక్షిణాదిన పాగా వేయడం అంత సులువైన పని కాదని తెలుసుకున్న బిజేపి మళ్లీ పాత స్నేహాల కోసం చేతులు చాచుతోంది. హస్తం పార్టీ పాగా వేయకుండా వుండాలంటే ఏక కాలంలో దక్షిణాదిలో కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది. అందులో భాగంగా ఉభయకుశలోపరిగా బిజేపి తన వంతు ద్విపాత్రాభియన రాజకీయాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏక కాలంలో అటు వైసిపితో, ఇటు తెలుగుదేశంతో జట్టుకట్టేందుకు, తెలంగాణలో తెలుగుదేశంతో కలిసి సాగేందుకు నయా రాజకీయం రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఒంటరిగా బిజేపి పాగా వేయడం కుదరనిపని. వైసిసితో పొత్తు సాగని పని. జనసేనను నమ్ముకుంటే సీట్లొస్తాయన్న నమ్మకం లేని పని. ఇక మిగిలింది. … కొత్త మిత్రుడికన్నా, , పాత శత్రువే మేలు అన్న సామెతను బిజేపి నిజం చేయనున్నది. తెలుగుదేశం పార్టీని మళ్లీ దగ్గరకు చేర్చుకుంటోంది. తెలంగాణ ఇవ్వడం అన్నది తెలుగుదేశం పార్టీకి సుతారం ఇష్టం లేని విషయం. అందులోనూ రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో ఒక వైపే చేసి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, తెలంగాణ ప్రయోజనాలు ఏనాడు పట్టని చంద్రబాబుకు రాష్ట్ర విభజన ఏ కోశాన ఇష్టంలేదు. ఇచ్చేదా…వచ్చేదా? అన్న ధోరణిలోని తెలంగాణలో ఆనాటి తెలంగాణ తెలుగుదేశం నాయకుల రాజకీయ మనుగడ కోసం తెలంగాణ ఉత్తరం ఇచ్చిన ఘనుడు చంద్రబాబు. 2009 డిసెంబర్‌9న తెలంగాణ ప్రకటించిన వెంటనే సీమాంధ్రకుచెందిన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేల రాజీనామాలను రాజకీయం సృష్టించిందే. ఆ రాత్రంతా నిద్ర లేకుండా తెల్లారే సరికి సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలన్నీ పూర్తయ్యే దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబుతో బిజేపి అంటకాగడం కొత్త కాదు. పైగా ఒకనాటి బిజేపికి తెలంగాణ ఇవ్వడం ఇష్టమున్నా, నాడు కూడా అద్వానీ లాంటి వారికి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని పని. ఇప్పుడు అదే ప్రధాని మోడీకి కూడా తెలంగాణ ఏర్పాటు అన్నది అసలే ఇష్టం లేని పని అన్నది పలు మార్లు ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన స్పష్టం చేసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత ఎన్నికల సందర్భంలో రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతిలో 2014లో తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నప్పుడు తెలంగాణ ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. యధాలాపంగా రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ చేసిన వ్యాఖ్యలనే అందరూ అనుకున్నారు. అరవైఏళ్లలో అలాంటి మాటలు ఎన్నో విన్న తెలంగాణ ప్రధాని కాకముందు నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం సీరియస్‌గా తీసుకోలేదు. పైగా అవి నరేంద్ర మోడీ మనసులో నుంచి వస్తున్న మాటలు అనుకోలేదు. కాని ఆయన కావాలనే అన్నారని, సమయం దొకినప్పుడల్లా తెలంగాణ మీద కసి తీర్చుకుంటున్నాడని అనేక సార్లు రుజువైంది. తాజాగా కూడా ఆయన పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును అసందర్భంగా ప్రస్తావించి బిజేపి వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తుకు పాకులాడడంతో తేలిపోతోంది. నిజానికి నరేంద్రమోడీని చంద్రబాబు దూషించినంతగా ఎవరూ తిట్టలేదు. 

ఆంధ్రప్రదేశ్‌ కు విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల అమలు విషయంలో కేంద్రం చేసిన తొండి రాజకీయాన్ని చంద్రబాబు బాగానే తూర్పారపట్టారు. మొదట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ పని చేసినా ఆహా…ఓహో అని తెగ పొడిగిన చంద్రబాబు, తీరా 2019 ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు ఎన్డీయేనుంచి బైటకు వచ్చాడు. ఎన్డీయే కన్వీరన్‌ పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తున్నాడని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కాకపోతే చంద్రబాబుని, ఆయన మాటలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నమ్మలేదు. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు జీరో అయ్యారు. 23 ఎమ్మెల్యే సీట్లకు పరిమితమయ్యారు. ఇక ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో కోలుకునే పరిస్ధితి కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావాలంటే ఎలాగైనా మరో పార్టీతో పొత్తు లేకుండా పోటీ సాధ్యం కాని పని. ఎన్నికల్లో ఒంటరి పోరు వల్ల లాభం లేదు. ఇక జనసేనకు అంత సీన్‌ లేదు. ఒక వేళ పొత్తుతో ఏదైనా లాభం జరిగినా మరునాటి నుంచే తలపొటు తప్పదు. రెండున్నరేళ్లు మేము..మరో రెండున్నరేళ్లు మీరు అన్న కాన్సెప్ట్‌ అమలు పర్చాల్సి రావచ్చు. లేకుంటే కేంద్రంలో మళ్లీ బిజేపి అధికారంలోకి వస్తే, జనసేన లాంటి పార్టీతో మహారాష్ట్ర లాంటి రాజకీయాలకు తెరతీయొచ్చు. ఇలాంటి వాటిలో ఎంతో దూర దృష్టితో వుండే చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలి. జనసేనను పక్కకు తప్పించాలి. అంటే బిజేపితో సఖ్యత కావాలి. కలిసి సాగాలి. కాంగ్రెస్‌తో వెళితే మొదటికే మోసం రావొచ్చు. పైగా ఆ పార్టీని ఆదరించేందుకు ప్రజలు కూడ సిద్దంగా లేదు. ఎటు తిరిగి చూసినా బిజేపేని పట్టుకొని ఎన్నికల గోదారి ఈదడమే సరైందన్న నిర్ణయానికి వచ్చి కొత్త రాజకీయం మొదలుపెట్టారు. అందుకే ఈ వరస బేటీలు…దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా చంద్రబాబును డిల్లీకి ప్రధాని మోడీ ఆహ్వానించారు.

పనిలో పనిగా చంద్రబాబుతో ఐదు నిమిషాలు రాజకీయం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో లంచ్‌చేశారు. అంటే ఇప్పుడే తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూసుకున్నారు. కాకపోతే చంద్రబాబు అడిగిన సెక్యూరిటీ పెంచేశారు. చంద్రబాబుకు జడ్‌ కేటగిరిలో 12 సెక్యూరిటీ వుంది. ఇప్పుడు దాన్ని 24చేశారు. అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అందులోనూ దేశంలో బిజేపి ఎలాంటి రాజకీయాలు చేస్తుందో తెలిసిన సమయంలో చంద్రబాబుకు సెక్యూరిటీ విషయంలో జగన్‌కు ఇష్టంలేని పని చేశారు. అంటే పొత్తు పొడుపుకు సంకేతాలు పంపించారు. ఇక ఇదిలా వుంటే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రజల దృష్టంతా మునుగోడు కేంద్రీకృతమై వుంది. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన సభకన్నా, కేంద్ర మంత్రి అమిత్‌షా ఈనాడు అధినేత రామోజీరావును, సినీ నటుడు ఎన్టీఆర్‌ను కలసి వార్తలకే ప్రాధాన్యం పెరిగింది. రాజగోపాల్‌రెడ్డి పెట్టిన కోట్ల రూపాయల ఖర్చ గంగలో కలిపిపనట్లైంది. భవిష్యత్‌ రాజకీయాలను ఎంచుకునే సమయంలో రాజగోపాల్‌ రెడ్డి రాజకీయం కోసం బిజేపి ఆలోచిస్తుందా?

అందుకే తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రాజకీయంగా ప్రధాన శత్రువులైన తెలుగుదేశం పార్టీని, మళ్లీ కలుపుకుపోతే తప్ప బిజేపికి మనుగడ లేదు. అందుకే ఎలాగూ తెలుగేదేశం పార్టీకి తెలంగాణలో ఎవరో ఒకరు దిక్కు కావాలి. ప్రజలు కూడా ఎన్టీఆర్‌వైపు చూస్తున్నారు. ఏదో రకంగా ఎన్టీఆర్‌ను రాజకీయాల్లో ఇరికిస్తే, ఆయనకు తెలంగాణ రాజకీయాలు అప్పగిస్తే, సీమాంధ్రలోనూ ఓట్లు కురిపించేందుకు ఉపయోగపడతాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన స్ధానాలు కొన్ని వున్నాయి. వాటిలో తెలుగుదేశం కీలక భూమిక పోషించినా, మిగతా ప్రాంతాల్లో బిజేపికి బలం పెంచుకునే అవకాశం వుంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారం పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. సీమాంధ్ర రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ప్రస్తావన కనుమరుగౌతుంది. లోకేష్‌ను నాయకుడిగా గుర్తించేందుకు అవకాశం ఏర్పతుంది. అవసరమైతే సీమాంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణలో ఎన్ని వేషాలేసేందుకైనా కుదురుతుంది. ఇప్పటికే పదేళ్లుపాటు ఉమ్మడి రాజధాని అన్నది కొనసాగుతోంది. అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప జగన్‌ చేసిందేమీ లేదు. దాంతో మళ్లీ అమరావతి మీద దృష్టిపెట్టడం కాన్న, తెలంగాణ రాజకీయాల మీద సమయం కేంద్రీకరించడం మేలన్న ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు. బిజేపి కూడా అందుకు సై అన్నట్లే కనిపిస్తోందన్న వార్తలే వినిపిస్తున్నాయి. చంద్రబాబు, మోడీ పాత మిత్రులే. బిజేపి, తెలుగుదేశం పార్టీలు ఎన్‌డిఏలో మొదటినుంచి ఆప్తులే. కేసిఆర్‌ ఎలాగూ తిరుబాటు జెండా ఎగరేశాడు. కేంద్రంపై కత్తులు నూరుతున్నాడు. ఈ విషయంలో బిజేపికి, ప్రధాని నరేంద్ర మోడీకి పీకల దకా కోపం వుంది. ఎలాగైనా టిఆర్‌ఎస్‌ను కట్టడిచేయాలంటే, తెలుగుదేశం పార్టీని లేపాలి. లేకుంటే కాంగ్రెస్‌ లేచి నాట్యం చేస్తుంది. చేతికి బలమొస్తే కమలాన్ని పీకేస్తుంది. అందుకు ఒక్క దెబ్బకు రెండుపిట్టలు…అటు టిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలి…ఇటు కాంగ్రెస్‌ను రాష్ట్ర రాజకీయాలకు దూరం చేయాలి. ఇదే ఇప్పుడు బిజేపి లక్ష్యం…తెలంగాణలో అధికారమే లక్ష్యం..! తెలుగుదేశంతో మళ్లీ సాగడమే నయా రాజకీయం!!

ప్లీజ్‌ …ప్లీజ్‌…అంటే ఓట్లు పడతాయా!

`అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నరో చెప్పరా!

`అధికారంలోకి వస్తామని మీకు మీరు ప్రచారం చేసుకుంటే సరిపోతుందా?

`రైతులకు ఇప్పటికన్నా మెరుగైన పథకాలు ఏమిస్తారు?

`పెన్షన్లు ఎంతకు పెంచుతారు?

`అనేక సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి….వాటిని కొనసాగిస్తారా? కోత పెడతారా?

`ఆంద్రప్రదేశ్‌ లో జగన్మోహన్‌ రెడ్డి కూడా ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అన్నాడు.

`నవరత్నాలు ప్రకటించి విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ఒక్క ఛాన్సివ్వండి అని వేడుకున్నాడు.

`ఆఖరుకు కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించింది.

`బిజేపి ప్లీజ్‌…ప్లీజ్‌ తప్ప మరేం చెప్పింది?

`పేదల దేవుడు మోడీ అని చెప్పగానే సరిపోతుందా? ధరలు తగ్గిస్తామని చెప్పగలరా?

`గ్యాస్‌ ధర తగ్గుతుందని చెప్పే ధైర్యముందా?

`రాష్ట్రానికి అప్పులెక్కువున్నాయని సంక్షేమాలకు కోతపెడతారా?

`బిజేపిని ఎందుకు గెలిపించాలో చెప్పకపోతే ఎలా?

`కేసిఆర్‌ కుటుంబ పాలన ఆరోపణ ఒక్కటే నమ్ముకుంటే గెలుస్తారా?

`పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమాలను ఉచితాలంటే, వ్యాపారుల రుణాల మాఫీపై సమాధానం చెప్పరా?

రాజకీయ పార్టీ అన్న తర్వాత అధికారం కోరుకోవడం తప్పు కాదు. అధికారంలోకి రావాలనుకోవడం ఆశ కాదు. ప్రజలకు మరింత సేవ చేయాలన్నా అధికారం కావాలి. ఆయా పార్టీలు అనుకున్న తీరిలో సమాజ నిర్మాణం జరగాలన్నా అధికారంలో వుండాలి. ఉన్నతమైన ఆశయాలతో సమాజంలో కొత్త ఒరవడి తీసుకురావాలన్నా అధికారంలోకి రావాలి. ప్రజలకు మేలైన పాలన అందించాలి. వారి సంక్షేమం కోసం నిరంతరం తపన పడాలి. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ రాజ్య నిర్మాణం జరగాలి. ప్రజల గుండెల్లో రాజకీయ పార్టీలు పదిలంగా వుండాలి. కొన్ని దశాబ్ధాలైనా సరే ప్రజలకు మేలు చేసిన నాయకులను మర్చిపోని పాలన అందించాలి. అందుకు పార్టీలు ఎంతో కృషి చేయాలి. ప్రజలకు చేరువ కావాలి. ప్రజల కోరిక మేరకు పని చేయాలి. ప్రజా పోరాటాలు చేయాలి. ప్రజల హక్కుల రక్షణకు పాటు పడాలి. అభివృద్దిలో రాజీలేని పోరాటం చేయాలి. ప్రజల మన్ననలు పొందాలి. ఇవీ సహజంగా రాజకీయ పార్టీలు ఆలోచించేవి. నిర్ణయాత్మక ఆలోచనలతో, నిర్మాణాత్మక విధానాలతో ముందడుగు వేయాలి. అంతే కాని ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌…ప్లీజ్‌…ప్లీజ్‌ అంటే సరిపోతుందా? ప్రజలు ఓట్లేస్తారా? కేంద్రంలో ఎనమిదేళ్లుగా అధికారంలో వున్న బిజేపి, 19 రాష్ట్రాల్లో అధికారంలో వుండి అక్కడ ఎలాంటి పాలన సాగిస్తున్నారన్నది ప్రజలు గమనించరా? తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పధకాలు మరే రాష్ట్రంలోనైనా అమలౌతున్నాయా? 

తెలంగాణ కంటే మరింత మెరుగైన పథకాలు మరెక్కడైనా వున్నాయా? అందులోనూ బిజేపి పాలిత రాష్ట్రాల్లో అమలౌతున్నాయా? కనీసం గుజారాత్‌లోనైనా అమలౌతున్నాయా. గుజరాత్‌లో తెలంగాణలో ఇస్తున్న రూ.2116 పెన్షన్‌ ఇస్తున్నారా? అక్కడ కేవలం రూ.500 ఇస్తున్నారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణలో ఇచ్చినంత పెన్షన్‌ ఇవ్వడం లేదు. అక్కడెక్కడా ప్రాజెఉ్టలు కట్టింది లేదు. రిజర్వాయర్ల నిర్మాణం లేదు. కళ్యాణ లక్ష్మి వంటి వినూత్నమైన పధకం లేదు. అలాంటి పధకాలు అమలు చేయాలన్న ఆలోచన లేదు. రైతు బంధు వంటి కార్యాక్రమాలు లేనే లేవు. అయినా మేం గెలుస్తాం…గెలుస్తున్నాం…టిఆర్‌ఎస్‌ను ఓడిస్తాం…డబుల్‌ ఇంజన్‌ తెస్తాం…తెచ్చి ఏం చేస్తారు? గెలిచి ఏం చేస్తారో ఇప్పటికి కూడా చెప్పకపోతే ఎలా? అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ అమలు చేస్తామనే ప్రత్యేకమైన పధకాలు బిజేపి వద్ద వున్నాయా? వుంటే అవి కదా? బిజేపి చెప్పాల్సింది. ఒక్క ఛాన్సు ప్లీజ్‌..అంటూ ప్రతి సభలోనూ చెప్పుకుంటూ పోతే ప్రజలు ఆదరిస్తారా? యూపిఏ 2 హయాంలో పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతోపాటు, నాడు నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధిని దేశమంతా అమలు చేస్తాడని ప్రజలు ఎంతో నమ్మారు. అప్పటికి గుజరాత్‌ అన్ని రంగాల్లో పెద్దఎత్తున ప్రగతిలో దూసుకుపోతోందన్న ప్రచారం విసృతంగా వుంది. పైగా బిజేపి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీని పార్టీ గుర్తించి ప్రకటించిన తర్వాత నరేంద్రమోడీ ప్రజలకు చేసిన వాగ్ధానాలు ప్రజలను పెద్ద ఎత్తున కదించించాయి. అప్పటికే పడిపోతున్న రూపాయి విలువను మళ్లీ నిలబెడతానమన్నారు. ద్రవ్యోల్భనం తగ్గిస్తామన్నారు. ధరలు అదుపు చేస్తామన్నారు. పేద ప్రజలకు అందుబాటులో వుండేలా అన్ని రకాల ధరలు నియంత్రిస్తామన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామన్నారు. గ్యాస్‌ ధరలు దించుతామన్నారు. పెద్దఎత్తున పారిశ్రామిక రంగాన్ని విసృతం చేస్తామన్నారు. యువతకు ఉపాది కల్పిస్తామన్నారు. పారిశ్రామిక రంగంలో పరుగులు తీయిస్తామన్నారు. వ్యవసాయం పండగ చేస్తామన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు మహిళళపై దాడులు జరక్కుంగా కఠినమైన చట్టాలు తెస్తామన్నారు. విదేశాల్లో వున్న నల్ల డబ్బును తెస్తామన్నారు. ప్రతి అకౌంట్లో 15లక్షలు వేస్తామన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేస్తామన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామన్నారు. బిజేపి తొలి నినాదమైన రామమందిర నిర్మాణం చేస్తామన్నారు. దేశమంతా ఒకే పన్ను విధానం అమలు చేస్తామన్నారు. ఇలా అనేక రకాల వాగ్ధానాలు చేశారు. దాంతో బిజేపి దేశ ప్రజలు నమ్మారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని విశ్వసించారు. దేశమంతా బిజేపి ప్రభజంనంలా గెలిపించారు. మరి అదే బిజేపి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చెబుతారు? 

ఏదీ చెప్పకుండా ఎలా అధికారంలోకి వస్తారు? రాష్ట్రంలో బిజేపి ఒంటరిగా పోటీ చేసే శక్తిని పెంపొందించుకోవడం నిజంగా శుభపరిణామమే…తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుతో 5 సీట్లు గెలిచిన బిజేపి, 2018 ఎన్నికల్లో ఒంటరి పోరుతో ఒక్కసీటుకు పరిమితమైంది. కాకపోతే మధ్యలో వచ్చిన దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు కలిసొచ్చాయి.ఊపు ను తెచ్చిపెట్టాయి. అయితే ఆ రెండు సీట్లు కూడా బిజేపి బలంతో గెలిచాయని చెప్పడం కన్నా, ఆయా అభ్యర్ధుల మీద ప్రజల్లో వున్న నమ్మకం గెలిపించిందని చెప్పకతప్పదు. కాకపోతే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మాత్రం బిజేపి మానియా పనిచేసింది. ఆ ఎన్నికల్లో కూడా చేయరాని వాగ్ధానాలు చేస్తే తప్ప, ప్రజలు ఓట్లేయలేదు. మరి మర్చిపోయినట్లున్నారు. ప్రజా సంగ్రామయాత్రతో బిజేపి రాష్ట్ర ఛీఫ్‌ బండి సంజయ్‌ పాదయాత్ర వరకు బాగానే వుంది. కాని ఒక్క ఛాన్స్‌ అనే మాటనే జనం వింతగా తీసుకుంటున్నారు. ఈ ఒక్క ప్లీజ్‌ అన్న పదం తప్ప మరేం లేదా? అన్న ప్రశ్న కూడా జనం నుంచే వస్తోంది. ఆ మధ్య బీజేపీ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ ముందు రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్‌ పేదల దేవుడు అన్నా…మన మోడీ అంటూ చెప్పుకొచ్చారు. 

మరి పేదల దేవుడైతే పెరుగుతున్న ధరలేంది? అన్న ప్రశ్న ప్రజలు వేసుకుంటారని, సమయం వచ్చినప్పుడు ప్రశ్నిస్తారని, నిలదీస్తారని బండి సంజయ్‌కు తెలియందా? ఆ మధ్య ప్రజా సంగ్రామ యాత్రలో ఓసారి ఈ ధరలేంది? అని మహిళలు నిలదీసిన సంఘటన మర్చిపోయారా? ఎంత సేపు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబ పాలన…అవినీతి పాలన అంటూ చెప్పడం బాగానే వుంది. ఆ పాలనకు ప్రజలు చరమగీతం పాడితే… తెలంగాణ ప్రజలకు బిజేపి ఏం చేయాలనుకుంటుంది? అన్నది చెప్పరా? చెప్పాల్సిన అవసరం లేదా? టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలే బిజేపికి వరాలా? సరే…బిజేపిని ప్రజలు నమ్మి గెలిపిస్తే దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పధకాల అమలౌతున్న ఆ పధకాలు అమలు చేస్తారా? లేక వదిలేస్తారా? ప్రజలకు వచ్చే ప్రధానమైన అనుమానల్లో ఇవి కూడా వున్నాయి. అసలే రాష్ట్ర్రం అప్పుల్లో వుందంటున్నారు. అప్పులు చేస్తే తప్ప రాష్ట్రానికి పూట గడవడదంటున్నారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్ధితి వుందంటున్నారు. అప్పులు తేకుండా, ఉద్యోగస్తుల జీతాలు ఆపకుండా వుండాలంటే సంక్షేమ పథకాలకు కోత పెడతారా? పెన్షన్లు దేశంలో ఇతర రాష్ట్రాలలో ఇచ్చిన వాటికి సమానం చేస్తారా? వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం లేదా? గత ఎన్నికల్లో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. పనిలో పనిగా నవరత్నాలే తమ మ్యానిఫెస్టో అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. వివిధ రకాల పెన్షన్లు సంఖ్య పెంచుతామన్నారు. ఇచ్చే నగదు కూడా పెంచుతామన్నారు. ఇలా కొత్త కొత్త పథకాలకు శ్రీకారంచుట్టారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కన్నా మెరుగైన పథకాలు అమలు చేస్తామన్నారు. మరి తెలంగాణలో బీజేసీ ఏం చెప్పదల్చుకుంది?

పొరుగున వున్న కర్నాటకలో రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు లేదు. రూ.2116 పెన్షన్‌ లేదు. తెలంగాణలో అమలౌతున్న ఏ ఒక్క పధకం అమలులో లేదు. గురుకులాలు లేవు. ఫీజు రీఎంబర్స్‌ మెంటు లేదు. ఆరోగ్యశ్రీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో సంక్షేమ పధకాలకు లెక్కే లేదు. మరి వాటన్నింటినీ ఆపకుండా అమలు చేస్తామని, ఇంకా మెరుగైన పధకాలు సృష్టిస్తామని, అమలు చేస్తామని బ్లూ ప్రింట్‌ ఏదైనా ప్రకటిస్తారా? ఎన్నికల నాడు ఏదో తూతూ మంత్రంగా మ్యానిఫెస్టో అని ఏవో నాలుగు ప్రకటించి, గెలిచి తూచ్‌ అంటారా? ఇది కూడా ప్రజల నమ్మకం మీద ఆధారపడి వుంటుంది? ప్లీజ్‌…ప్లీజ్‌ మీద ఆధారపడి సాగేది కాదు…ఆలోచించుకోండి!!

కోమటి రెడ్డి కొత్త ఎత్తుగడ!

`తమ్ముని కోసం అన్న కొత్త తరహా కోవర్డు అవతారం!?

`వెంకట రెడ్డి తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం నమ్మదగిందేనా!

`తమ్ముడు గెలిస్తే తాను రాజీనామా చేస్తా?

`లేకుంటే తమ్ముడిని ఓడిరచిన క్రెడిట్‌ ఖాతాలో వేసుకుంటా?

`ఏదైనా తన మంచికే…కుటుంబానికి పనికొచ్చేదే?

`అవసరమైతే అన్న ఇక్కడ, తమ్ముడు అక్కడ?

`మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌?

`అన్న తమ్ముని తోనే!

`పైకి రాజకీయం…లోన వ్యాపారం!

`కాంగ్రెస్‌ పార్టీకి జెల్లకొట్టకపోతే కాంట్రాక్టు మాయం

`వ్యాపారం చే జారిపోతే కష్టం!

`తమ్ముడితో నడవడం తప్పదు

`కాంగ్రెస్‌ మునిగిన నావ అనకపోతే నష్టం.

`నేనెక్కడికీ వెళ్లననే మాటలు ఒట్టివే!

`పనికిరాని తిరకాసులందుకే!

`అన్నదమ్ములది ఒకేదారి…చెరోదారి అన్నది చెప్పుకోవడానికే మరి…

`అన్న అంతరంగం…తమ్ముడు ఆవిష్కారం!

`అంతా మునుగోడు నాటకం!

`ఇరవై ఏళ్ల వ్యాపారం కోసం ముప్పై ఏళ్ల పార్టీని నిండా ముంచడం?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తనను తాను మోసం చేసుకోవడం మూర్ఖులు చేసే పని. తన పని కోసం ఇతరులను మోసం చేయడం అతి తెలివి మంతుని పని. అదే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఊగిసలాట ఎలా వున్నా ఉత్తుత్తి ప్రచారానికి తప్పకుండా వస్తా! తన వంతు పాత్ర ఎలా పోషించాలో అలా పోషిస్తా? ఎవరిని గెలిపించాలో వారినే గెలిపిస్తా? పార్టీ కోసమే పనిచేస్తా? పార్టీలోనే వుంటా? ఎలాగైనా పంతం నెగ్గించుకుంటా? తను అనుకున్నది నెరవేరడానికి కావాల్సిన ఎత్తుగడలు వేస్తా? తమ్ముని కోసం కొత్త తరహా కోవర్టు అవతారం ఎత్తుతా? అన్నట్లే వుంది కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ కాంపెయినర్‌ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. పిపిసి దక్కలేదన్న అంసతృప్తితో వున్న వెంకటరెడ్డికి ఏ క్షణాన ఏఐసిసి స్టార్‌ కాంపైనర్‌ పోస్టు ఇచ్చిందో కాని అది ఈ రకంగా వెంకటరెడ్డికి ఉపయోగపడుతుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి ఇలాంటి పరిస్ధితుల్లో వెంకటరెడ్డి అడకత్తెరలో పోక చెక్క కావాలి. నుజ్జు నుజ్జు కావాలి. ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కునే పరిస్ధితి ఎదురుకావాలి. కాని స్టార్‌కాంపెయినర్‌ పదవి అన్నది వెంకటరెడ్డికి అనుకూలంగా మారుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే దాన్ని వినియోగించుకొని మాత్రం తమ్ముడి వైపు పరోక్ష ప్రచారానికి క్షేత్ర స్ధాయిలోకి వెళ్లే అవకాశం దక్కింది. నిన్నటిదాకా మునుగోడు ప్రచారానికి నేను వెళ్లను…

అంటూ భీష్మించుకు కూర్చున్న వెంకటరెడ్డిలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు పార్టీ కోసమనుకుంటే అంత కంటే అమాయకత్వం వుండదు. తాను పంతం పట్టుకొని కూర్చుంటే తమ్ముడి వైపు అన్న లేడన్న సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. అందుకే చీకటి రాజకీయాలు చేసైనా సరే తమ్ముడిని గెలిపించుకోవాలంటే కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ పదవి అడ్డం పెట్టుకొనే, శకుని పాత్ర పోషించొచ్చు. శల్య సారధ్యం వహించొచ్చు. ఇది కాంగ్రెస్‌పెద్దలు ఎందుకు ఆలోచన చేయడం లేదో అర్ధం కాకుండా వుంది. నిజాలు మాట్లాడుకోవడం కాంగ్రెస్‌లో పూర్తిగా కనుమరుగైనట్లుంది. తమ్ముడు రాజగోపాల్‌కు వ్యతిరేకంగా వెంకటరెడ్డి ప్రచారంచేయడం అంటే నమ్మశక్యం కాని విషయం. కాంగ్రెస్‌ పార్టీ తరుపున ప్రచారం అంటే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిని గెలిపించండి అని చెప్పడం కాదు…రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి తీరని ద్రోహం చేసిండని చెప్పగల ధైర్యం వెంకటరెడ్డికి వుందా? రాజగోపాల్‌రెడ్డి ఎన్నుకున్న మునుగోడు ప్రజలను మోసం చేశాడని చెప్పగడా? తన నాయకత్వాన్ని చూసే పార్టీ రాజగోపాల్‌కు ఇన్ని రకాల అవకాశాలు కల్పించినా, పార్టీని వదిలివెళ్లడం తల్లికి ద్రోహం చేయడమే అని వెంకటరెడ్డి చెప్పగలరా? మరి ఏం చెబుతారు? ఎలా ప్రచారం చేస్తారు? ఇదంతా హంబక్‌ అన్నది ఇక్కడే తెలిపోతోంది. ఇక్కడ వెంకటరెడ్డి అడుగులకు ముందర కాళ్లకు బంధం పడిరది. 

ముందుకు అడుగు వేయలేడు. వెనక్కి వేయలేడు. రాష్ట్రంలో పరిస్ధితులు కొద్దిగా మారుతున్నాయి. బిజేపిలో ఒక వర్గం దూకుడు ఆ పార్టీకి నష్టం తెచ్చే పరస్థితి వుందని తేలిపోయింది. ఇది గమనించే ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలకు పూనుకున్నది. ఆయనను సస్పెండ్‌ చేసింది. ఇలాంటి సమయంలో రాజగోపాల్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కూడా ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. నిజానికి కోమటిరెడ్డి సోదరులకు మునుగోడులో మంచి పట్టు వుంది. ప్రజల ఆదరణ కూడా వుంది. దీన్ని వదులుకుంటే రాజగోపాల్‌రెడ్డిది ఎటూ కాని రాజకీయం అవుతుంది. అందుకే అన్న వెంకటరెడ్డి చాలా చాకచక్యంగా రంగంలోకి దిగాడు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌ రెడ్డి ఒక వేళ గెలిస్తే, ఆ మరు క్షణమే వెంకటరెడ్డి కూడా భువనగిరి పార్లమెంటు స్ధానానికి రాజీనామా చేస్తాడు. ఒక వేళ రాజగోపాల్‌ రెడ్డి ఓడిపోతే, తాను చేసిన ప్రచారం మూలంగానే తమ్ముడు ఓడిపోయాడు? అన్న క్రెడిట్‌ తన ఖాతాలో వేసుకుంటాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు…ఇందులో పెద్ద లాజిక్‌ లేదు. కాకపోతే వెంకటరెడ్డి ఊ… అనడమే గొప్ప అన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ చేసుకునే ప్రచారం అసలుకే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు. అంటే ఇక్కడ ఎవరికి వారు కాంగ్రెస్‌ నేతలంతా తప్పించుకునే ఎత్తుగడలోనే వున్నారన్నది పూర్తిగా స్పష్టమౌతోంది. కోమటిరెడ్డి సోదరుల మూలంగానే పార్టీ నల్లగొండలో బతుకుతుందన్న సంకేతాలు పరోక్షంగా ఒప్పుకున్నట్లే అవుతోంది. ప్రజల్లోకి పంపుతున్నట్లే అవుతుంది. అంతే కాదు వెంకటరెడ్డి భుజం మీద తుపాకి పెట్టి కాల్చుతున్నామన్న భ్రమల్లో పిసిపి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసిసి నేతలు కూడా వున్నారనడంలో సందేహం లేదు. ఏది జరిగినా కోమటిరెడ్డి కుటుంబానికి నష్టం లేదు. 

రాజగోపాల్‌ రెడ్డి గెలిస్తే కాంగ్రెస్‌ పార్టీ కన్నా, కోమటిరెడ్డి కుటుంబానిదే పై చేయి అన్నది ప్రచారం చేసుకోవడానికి వీలౌతుంది. బిజేపిలో ఆయనకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. అన్న వెంకటరెడ్డి కూడా బిజేపిలో అడుగుపెట్టడానికి మార్గం సుగమమౌతుంది. కాంగ్రెస్‌ పార్టీ మునిపోయిన నావ అంటూ వెంకటరెడ్డి నోటితోనే పదే పదే చెప్పించుకునేందుకు వీలౌతుంది. ఒక వేళ రాజగోపాల్‌రెడ్డి ఓడిపోతే, వెంకటరెడ్డి బలమైన నాయకుడు. ఆయన వల్లే తమ్ముడు ఓడిపోయాడని కాంగ్రెస్‌లో మరింత ప్రాధాన్యత పెరిగేందుకు అవకాశం ఏర్పడుంది. ఎటు చూసినా కోమటిరెడ్డి కుటుంబానికి మేలే తప్ప, నష్టం లేదు. ఇదీ అసలు లెక్క. రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే అన్న కూడా అన్నీ సర్ధుకుంటాడు. లేకుంటే తమ్ముడు అక్కడ, అన్న ఇక్కడ రాజకీయాలు చేస్తుంటారు. పైకి కనిపించేందంతా రాజకీయమైనా, లోన సాగేందంతా వ్యాపారమే అన్నది అందరికీ తెలిసిందే. 

కాంగ్రెస్‌కు జెల్ల కొట్టకపోతే కాంట్రాక్టు మాయమౌతుంది. రెండేళ్లలో కేంద్రానికి ఎన్నికలు జరగాల్సివుంది. ప్రజలు మార్పు కోరుకుంటే పరిస్ధితి మరో రకంగా వుంటుంది. గత నలభై ఏళ్ల కాలంగా దేశ ప్రజలు వరసగా మూడుసార్లు ఏ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. మరి ఇప్పుడు బిజేపికి మూడోసారి అవకాశం వరించిందంటే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పూర్తిగా గల్లంతే…! అన్నది నూరు పైసల నిజం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఇద్దరు అన్నదమ్ములు మళ్లీ అసెంబ్లీకే పోటే చేసే అవకాశం వుంది. అప్పుడు ఏది అధికారంలో వుంటే దానికి సై అనేందుకు ఇద్దరు సోదరులు సన్నద్దమనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మంచో చెడో కాని రాజగోపాల్‌రెడ్డి కుమారుడు నడిపే కపంనీకి ఇరవైఐదేళ్ల కాలం సాగే ఓ కాంట్రాక్టు అన్నది వశమైంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక జీవిత కాలం కాంట్రాక్టు. ఒక జీవితానికి సరిపోయంతే పెద్ద ప్రాజెక్టు. ఒక తరం సుసంపన్నంగా కాలం వెళ్లదీసేందుకు ఆ ఒక్క కాంట్రాక్టు చాలు. అంత పెద్ద వ్యాపారం ముందు రాజకీయాలు చాలా చిన్నవి. అధికారంలో వున్న పార్టీ ఆశీస్సులు ఎంతో అవసరం. అందుకే ముందూ వెనుక ఆలోచించాల్సిన అవసరం లేకుండా రాజగోపాల్‌రెడ్డి జంప్‌ అయ్యారు. అన్న అలాగే వున్నారు. అయినంత మాత్రాన వెంకటరెడ్డి చెప్పే నేనెక్కడికీ వెళ్లను అన్న మాటలు వట్టివే…అన్నది అందరికీ తెలుసు. ఆయనకు కూడా తెలుసు.పనికి రాని తిరకాసులు పెడితే తప్ప తన ప్రభావం కనిపిచంచేలా లేదన్న చాణక్యం ప్రదర్శించడంలో వెంకటరెడ్డి సక్సెస్‌ అయ్యారని చెప్పడంలో సందేహం లేదు.

ఎందుకంటే తమ్ముడు పార్టీకి జెల్ల కొట్టి పోయినా, అన్న వెంకటరెడ్డి తన హావాను కొనసాగిస్తున్నాడంటే వారి రాజకీయాల ముందు రేవంత్‌ రాజకీయం తేలిపోయిందనేది ఇక్కడ స్పష్టమౌతోంది. పట్టుబట్టి మరీ రేవంత్‌రెడ్డి చేత సారీ చెప్పించుకున్నాడు. అయినా సంతృప్తి పడలేదని తేల్చేశాడు. అద్దంకి దయాకర్‌ సారి చెప్పాలన్నాడు. నాలుగు సార్లు చెప్పినా అబ్బే నాకు నచ్చలేదన్నాడు. అద్దంకిని సాగనంపితే తప్ప తాను కాంగ్రెస్‌ మొహం చూడనన్నాడు. అది కూడా చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైనా తూచ్‌ అన్నాడు. నేను మునుగోడుకుప్రచారం చేయనన్నాడు. అసలు కాంగ్రెస్‌ గెలిచే పరిస్ధితే లేదన్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకున్నాడు. అందర్నీ పిచ్చోళ్లను చేశాడు. అయినా పార్టీకి వెంకటరెడ్డి ప్రచారం చేస్తారనుకోవడం వెర్రిబాగుల తనం. పాపం కాంగ్రెస్‌ పార్టీ కూడా ఒక నాయకుడు ఆడమన్నట్లు అడేదాకా దిగజారిపోయిందనేది కళ్లముందు సాక్ష్యాత్కారం…ఇక పార్టీ కోలుకోవడం దేవుడెరుగు…జనం ఆదరణ మాత్రం ఇప్పటికే కరువు!?

మన మధ్య అడ్డు గీతలొద్దు!

`సమాజాన్ని చీల్చే రాజకీయాలు చేయొద్దు!

`మతాల మధ్య మానవత్వం ముద్దు.

`అందరి ఐక్యత స్పూర్తి దాయకం.

`సఖ్యత సంతోషదాయకం.

`అలాయ్‌ బలాయ్‌ మనకు ఆనందదాయకం.

`కులాల చిచ్చు, మతాల ఉచ్చు వద్దు.

`కరోనా నేర్పిన పాఠం అప్పుడే మరువొద్దు.

`ఆధిపత్య రాజకీయాలకు సమాజ విభజన సరైంది కాదు.

`అలజడులు ఆకలి తీర్చవు…

`హింసా వాదాలు హితాన్ని కోరుకోవు.

`అందరం ఒక్కటే….మనమంతా ఒక్కటే.

`మంచి మన ఆభరణం కావాలి.

`మానవత్వం మనలో వెల్లివిరియాలి.

`విద్వేషాలొద్దు…విషభీజాలు నాటొద్దు.

`యువత జీవితాలతో ఎవరూ ఆటలాడుకోవద్దు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నువ్వైనా, నేనైనా, మనమెవరమైనా మంచికి ప్రతీకలం కావాలి. మానవత్వానికి సంకేతం కావాలి. ఐక్యతకు స్పూర్తి కావాలి. ఐకమత్యం ప్రదర్శించాలి. ఆదర్శానికి నిదర్శనం కావాలి. ప్రగతికి మార్గనిర్ధేశకం కావాలి. అభివృద్ధికి ఆలంబన కావాలి. మన మధ్య ఎప్పుడూ స్నేహం వెల్లివరిస్తూ వుండాలి. చిద్విలాసం మన పెదవులపై చిందిస్తుండాలి. ఎవరైనా భయపడాల్సివస్తే అనారోగ్యానికి భాధపడాలి. పేదరికానికి భయపడాలి. అంతే కాని మనిషినికి మనిషి చూసి భయపడే రోజులు రావొద్దు. ఆ రోజులు ఎవరూ సృష్టించొద్దు. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే చింతించాలి. అంతే కాని సమాజమేమౌతుందో అని చింతించే రోజు రావొద్దు. బిక్కు బిక్కు మంటూ బతికే పరిస్ధితులు ఎవరూ కోరుకోవద్దు. వాటిని సృష్టించే ప్రయత్నం ఎవరూ చేయొద్దు. రాజకీయ ప్రయోజనాలు ముడిపెట్టి, మనుషుల మధ్య విభజనలు సృష్టించొద్దు. కులాల కుంపట్లు పెట్టొదు. మతాల మధ్య దూరాలు, మనుషుల మధ్య విద్వేషాలు రగిలించొద్దు. అంతరాలు పెంచేవే రాజకీయ అగచాట్లు. వాటిని దరి చేరనీయొద్దు. తోటి వారికి సాయం చేయాలన్న ఆలోచనలు చేయాలే తప్ప, కీడెలా జరుగుతుందన్నది మదిలోకి కూడా రానివ్వొద్దు. మతాల పేరుతో, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారు ఎవరైనా సరే ప్రభుత్వాలు ఉపేక్షించొద్దు.పిచ్చి ప్రేలాపనలు చేసేవారిని ఊరికే వదిలేయొద్దు. కఠినంగా వుంటే తప్ప కాక చల్లారదు.

మన దేశం లౌకిక ప్రజాస్వామ్యానికి ప్రతీక. ప్రపంచ దేశాలు మనను చూసి స్పూర్తి పొందుతున్న ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం మనది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కొన్ని వందల సంవత్సరాలుగా సాగుతున్నది. మతం పేరుతో చిచ్చు రేపితే శాంతిభద్రలకు విఘాతం కలుగుతుంది. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిసిన మన దేశంలో కులాలెన్ని వున్నా, మతాలెన్ని వున్నా మన మధ్య ఐక్యతే మన దేశాన్ని ప్రపంచంలో గొప్ప దేశంగా నిలిపింది. ప్రజా ప్రతినిధిలే సమాజంలో విద్వేషాలు సృష్టించే వ్యాఖ్యలు చేయడం మనకు ఏ మాత్రం మంచిది కాదు. సమాజాన్నీ చీల్చే రాజకీయాలు ఎవరూ చేయొద్దు. కేవలం అధికారమే పరమాధిగా సమాజాన్ని వర్గాలుగా విభజించడం పెద్ద తప్పు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లో కుల రాజకీయాలను గురించి నిత్యం మాట్లాడుకుంటుంటాం. మనలో మనకే కుల రాజకీయాలే సమాజానికి విఘాతం అనుకుంటే, మత రాజకీయాలు ఉత్పాతాలౌతాయి. సమాజాన్ని రెండుగా చీల్చేస్తాయి. ఇది ఎవరికీ మంచిది కాదు. ఎంత మాత్రం హితం కాదు. అందుకే రాజకీయా పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం విద్వేషాలు సృష్టించే రాజకీయ ప్రసంగాలెక్కడా చేయెద్దు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారు చేయాల్సిన పనులు కాదు. అది ఏ పార్టీ చేసినా తప్పే. రాజకీయ పార్టీలు అన్న తర్వాత అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాలి. ఎన్నికల నాడు ఎల్లన్న, తర్వాత బోడన్నా అనే రాజకీయాలు చేయొద్దు. ఏ ఒక్క కులమో, ఓ ఒక్క మతమో ఓట్లేస్తే గెలిస్తేనే నాయకులు కాలేదు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఓట్లేస్తేనే గెలిచారు. అది మర్చిపోవద్దు. ఎన్నికల నాడు ఒక రాజకీయం…ఎన్నికల కోసం ఒక రాజకీయం చేయొద్దు. సమాజంలో చిచ్చు రేపే రాజకీయాలు మనకొద్దు. మతాల మధ్య మానవత్వం అందరికీ ముద్దు. కాని ఎవరూ విద్వేషపూరితమైన వాతావరణం కావాలని కోరుకోవద్దు. ఆ ఆలోచనలు చేయొద్దు. సమాజాంలో అందరికి ఐక్యత, అలాయ్‌ బలాయ్‌ లాంటి సంస్కృతి మనది. అది సమాజానికి ఎంతో ఆనందదాయకం. సఖ్యత సంతోషదాయకం. ఆధిపత్య రాజకీయాల కోసం, కేవలం అధికారం కోసం, ఓ పార్టీని అప్రదిష్టపాలు చేయడంకోసం, అధికారంలో వున్న పార్టీని గద్దెదింపడం కోసం చేసే రాజకీయ కుట్రల్లో మతాన్ని జొప్పించడం అన్నది ఎవరికీ శ్రేయస్కరం కాదు. అలజడులు ఆకలి తీర్చవు. కుత్సితాలు రేపే కుంపట్లు ఆరని మంటలు తెచ్చిపెడతాయి.ఒక్కసారి మన తెలంగాణ రాజకీయాలు బాగా గమనించండి. 

తెలుగు సామ్రాజ్యాలు మన దేశంలోనే కాదు, మన తెలంగాణలో అంతరించిన తర్వాత సుమారు ఆరు వందల సంవత్సరాల పాటు ముస్లింల పరిపాలనలోనే తెలంగాణ వుంది. మొఘలులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌ జాహీల పరిపాలన కొనసాగింది. కాని ఐక్యత ఒక ఒరవడిగానే సాగింది. ఒక దశలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ముస్లిం సమాజం కూడా వుంది. అందరూ కలిసే నిజాం మీద తిరగబడ్డారు. తెలంగాణ సాయుధపోరాటం చేశారు. నిజాంలకు తొత్తులుగా పనిచేసిన దొరల మీద అందరూ పోరాటం చేసి, తెలంగాణ సాధించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ అస్ధిరతల సృష్టికి ఆనాడు కూడా కొందరు పాకులాడేవారు. ప్రభుత్వాల అస్ధిరతకు కారణభూతులయ్యేవారు. అయినా సమాజంలో అవి రాజకీయ కుట్రలుగా కనిపించేవి. ఎన్టీఆర్‌ హాయాం వచ్చేసరికి కొంత సద్దుమణిగింది. చంద్రబాబు కాలంలో మరింత తగ్గింది. కాని వైఎస్‌. రాజశేఖరెడ్డి సమయంలో గోకుల్‌ ఛాట్‌ , లుంబినీ పార్కు వంటి దుర్ఘటనలు జరిగాయి. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చాలా వరకు నగరంలో అల్లర్లు లేకుండా చేశారు. తెలంగాణ వచ్చాక అసలు అలజడి అన్న పదమేలేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన ప్రగతి శీల భావనలు ఎంతో మార్పును తెచ్చాయి. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాల అమలు. వంటి వాటితో సమాజంలో విజభన అన్నది లేకుండాపోయింది. అందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపే రోజులువచ్చాయి. దేశంలోనే అత్యంత ప్రశాంతమైన వాతావరణం వున్న రాష్ట్రంగా తెలంగాణ, ఎంతో ఆనందదాయకమైన నగరంగా హైదరాబాద్‌ మరింత కీర్తికెక్తింది. ఎన్నో రకాల పరిశ్రమల ఏర్పాటుకు, ఐటి రంగానికి ఉజ్వల భవిష్యత్తు తెలంగాణలో కనిపించింది. తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు, రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సమాజంలో ఒక్కసారిగా కుదుపుకు కారణమైంది. 

కొన్ని సంవత్సరాలుగా చార్మినార్‌ వంటి ప్రాంతాల్లో అర్ధరాత్రుళ్లు కూడా ప్రశాంతమైన వాతావారణం నెలకొన్నది. కాని మళ్లీ ఏడు గంటలకే దుకాణాలు మూసేయాల్సిన పరిస్ధితులు మళ్లీ వస్తాయని సగటు తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించలేదు. ఇందుకు కారణం ఎవరైనా కావొచ్చు. కాని రాష్ట్ర్రప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ర్యాపిడ్‌ ఆక్షన్‌ఫోర్సును రంగంలోకి దింపి, పరిస్దితి చక్కదిద్దింది. త్వరలో గణేష్‌ నవరాత్రులున్నాయి. పరిస్ధితి చేయిదాటిపోకుండా వుండాల్సిన తరుణం. అసలు ప్రేజలు రెచ్చగొట్టే వేషాలు ఎవరూ వేయొద్దు. తెలంగాణ ఉద్యమ కాలంలో ట్యాంక్‌ బండ్‌ మీద బతుకమ్మ పండుగ, తర్వాత పెద్దఎత్తున సాగిన సద్దుల బతుకమ్మలు, గణేష్‌ నిమజ్జనాలు ఎంతో సంతోషంగా సాగాయి. కాని ఒక్కసారిగా మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా? అని రాజకీయ వేడిని రగిలిస్తున్నారు. నిన్నటిదాక రాష్ట్ర బిజేపిలో అంతా మిత వాదులే వుండేవారు. తాజాగా పార్టీ అధ్యక్షుడు అతి వాద నాయకుడి మారిపోవడం అన్నది కొంత ఇబ్బందికరమైన పరిస్ధితికి సంకేతం. చనిపోయిన వారి ఇళ్లముందు భగవగ్ధీతను పెట్టొద్దు? అని చెప్పడం వేరు. అలా పెట్టిన వారిపై దాడి చేస్తామని చెప్పడం వేరు. హిందువులే భగవగ్ధీతను నమ్ముతారు. ఎంతో పవిత్రంగానే భగవధ్గీతను ప్రతి హిందువు చూస్తాడు. కాని కొంత కాలంగా అలా భగవద్గీతను వైకుంఠదామాల వాహనాలకుండే మైకుల్లో వినిపిస్తున్నారు. ఇది తప్పని చెప్పండి. కాని హిందులపైనే దాడి చేస్తామని చెప్పడం కూడా బిజేపికి తీవ్ర నష్టదాయమైన పనే. ఇక బిజేపి మొత్తం హిందువుల కోసమే అన్నట్లు మాట్లాడుతూ పోతే , ఆ పార్టీలో మైనార్టీ నాయకులకు చోటు లేకుండాపోతుందన్న సంకేతాలు వెళ్తాయి. అది పార్టీ మూల సిద్ధాంతానికి కూడా వ్యతిరేకం. అదే నుపుర్‌ శర్మ విషయంతో తేలిపోయింది. అయినా ఒక ప్రజా ప్రతినిధిగా వున్న రాజాసింగ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఒక వర్గం ప్రజల్లో అలజడిని సృష్టించాయి. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, ప్రజలను రెండుగా చీల్చి, ఇప్పుడేం సమాధానం చెబుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అన్నది ఎంత వరకు సమంజమో! కూడా పార్టీల నాయకులు తమను తాము ప్రశ్నించుకోవాలి. ప్రజలకు అసౌకర్యం కల్పించడమే రాజకీయం అనుకుంటే, ఆ పార్టీల రాజకీయానికి చరమగీతం పాడడం ప్రజలకు పెద్ద పని కాదు…ఓటుతో ఎక్కడ విసిరేయాలో అక్కడకి విసిరేస్తారు…బంగాళాఖాతంలో కలిపేస్తారు.

నేతల నీతులు…విషపు కాట్లు!?

`నాయకులా నీతులు చెప్పేది?

`మీరా ఓటర్లను నిందించేది?

`ప్రజలపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి?

`మీరు గెలవడం కోసం నోట్లు పంచడం నేర్చుకున్నారు?

`కోట్లకు కోట్లు అవినీతి సంపాదనకు ఎగబడ్డారు?

`కార్యకర్త నుంచి నాయకుడి దాకా ప్రచారానికి పైస లెకుండా కదలరు?

`ప్రజలు పనులొదిలి పెట్టుకొని మీ సభలకు రావాలా?

`రాజకీయాలను ఏనాడో భ్రష్టు పట్టించారు?

`డబ్బులివ్వందే ఓటు వేయడం లేదని నిందలేస్తారా?

`ఎన్టీఆర్‌ కాలం దాకా లేని పైసల రాజకీయాలు, ఇప్పుడెందుకు ఇష్టారాజ్యమయ్యాయి?

`గెలుపు గుర్రాలే ఎందుకు అవసరమౌతున్నాయి?

`ఎన్నికల ముందు నాయకులతో తిరిగిన మిగతా నాయకులు ఎందుకు దూరమౌతున్నారు?

`ప్రచారానికి వచ్చే నాయకులకు సకల సౌకర్యాలు లేకపోతే వస్తారా?

`రాజకీయాలను వ్యాపారం చేసి, ప్రజలను వంచిస్తోంది పార్టీలు కాదా?

`అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే?

`జనం ఎప్పుడూ అమాయకులే!

`కోట్లు కొల్లగొట్టి, లక్షలు ఖర్చుపెట్టి జనం మీద నాట్యం చేస్తున్నవారే?

`జనాన్ని నిందించడమంటే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రతి వాడు ప్రజలను నిందించేవాడే…ప్రతి వాడు నీతులు చెప్పేవాడే… ప్రతి వాడు ప్రజలను తప్పు పట్టేవాడే…ప్రతి వాడు తామేదో ప్రజలను ఉద్దరిస్తున్నట్లు చెప్పేవాడే…అక్కడికేదో ప్రజలకు ఏమీ తెలియదనన్నట్లు, అంతా వాళ్లకే తెలిసినట్లు, అందుకే నాయకులైనట్లు వాళ్లను గొప్పగా ఊహించుకుంటారు. నాయకుల అవతారమెత్తి పాలించే హక్కు మాకుందని చెప్పుకుంటున్నారు. నాయకులుగా చెలామణి అవుతున్నారు. ప్రజలనే నిందించే స్ధాయికి చేరుకున్నారు. అదేం దౌర్భాగ్యమో వాళ్లే ప్రజా ప్రతినిధులౌతున్నారు. ప్రజల నెత్తిన తాండవం చేస్తున్నారు. దేశమంతా నేతలంతా ఇలాగే వున్నారు…ప్రజలకు తాము లేకుంటే ఏమౌతారని మొసలి కన్నీరు కారుస్తుంటారు. పెత్తనం చేసేందుకే మేమంతా వున్నదని నిరూపిస్తున్నారు. ప్రజలు మారాలి…అంటూ సోది చెప్పడం అలవాటు చేసుకుంటున్నారు. నాయకులు మారాలా? ప్రజలే మారాలా? నోరుంది కదా? ఏది పడితే అది చెప్పడం అలవాటు చేసుకున్నారు. మీడియా కూడా ప్రజలను కాకుండా, తమనే చూపిస్తుంది కదా? అని ప్రజలను పలుచన చేయడం నాయకులు అలవాటు చేసుకున్నారు. వారికి నీతిభోధలు నేర్పడం అలవాటు చేసుకుంటున్నారు. ప్రజలు ఓట్లనాడు నోటు కోసం ఎదురుచూస్తున్నారంతగా చిన్నగా మాట్లాడడం మొదలుపెడతున్నారు. ప్రజలనే కించపరుస్తున్నారు. ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని మాట్లాడండి? ప్రజలు ఏనాడైనా మాకు ఇది కావాలని కోరారా? నోటిస్తేనే ఓట్లేస్తామన్నారా? వారికి లేని ఆలోచనలను సృష్టించింది నాయకులు. వారు వద్దని వారించినా వద్దంటే నామీదొట్టే అంటూ జనాన్ని మభ్యపెట్టి నోటు చేతిలో పెట్టింది నాయకులు. అవ్వా, అయ్యా, పెద్దయ్య, చిన్నయ్య, అక్కా చెల్లి, అన్నా, తమ్మీ అంటూ వరసల కలిపి, దేవుళ్లుగా కొలిచి వారిని బుట్టలో వేసుకొని,ఓట్లు దండుకోవడం అలవాటు చేసుకున్నది నాయకులు. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకున్నది నాయకులు. ఆ తర్వాత మెల్లిగా మద్యం అలవాటు చేసి, ఎన్నికల సమయంలో మద్యం సరఫరా చేసి, ఓట్లనాడు ఓటు ఎటుపోతుందో అన్న అనుమానంతో నోటు జేబులో పెట్టడం అలవాటు చేసుకున్నది నాయకులు. కాని ఇప్పుడు ఆ నెపం జనం మీద తోసేస్తున్నారు…రూపాయి ఇవ్వందే జనం కదలడం లేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎప్పుడు కోరుకున్నా అది సమాజం శ్రేయస్సు కోసమే…

ప్రగతి కావాలని కోరుకుంటారు…అభివృద్ధి జరగాలని ఆశిస్తారు. పేదరికం లేని సమాజం నిర్మాణం కావాలంటారు. ఉపాధి చూపించమంటారు. పేదలకు కనీస సౌకర్యాల కల్పన కావాలంటారు. కూడు, గుడ్డ, గూడు సమకూర్చాలంటారు. ఆరోగ్యం కోసం వైద్యం కావాలంటారు. ఇవి ప్రజలకు కల్పించడం ప్రభుత్వాల ప్రధమ కర్తవ్యం. ఎన్నికల ముందు అమలు చేయలేని వాగ్ధానాల్విడం, ముందు ఓట్లు వేయించుకునేందుకు నోట్లివ్వడం, తర్వాత మర్చిపోవడం అలవాటు చేసుకున్నారు. అభివృద్ధిని ప్రశ్నించిన ప్రజలను నిందించడం నేర్చుకున్నారు. ఓట్లు ఊరికే వేశారా? అంటూ ఎదరు ప్రశ్నించడం నేర్చుకున్నారు. అదే గొప్ప తెలిగా భావిస్తున్నారు. ఇదేం ప్రజాస్వామ్య సూర్తి…మీరేం తక్కువ నాయకులరా? ప్రజలు ఏదైనా పని కోసం వస్తే ఊరికే చేసిపెడుతున్నారా? ఒక్కరైనా గుండెమీద చేయి వేసుకొని మేము రూపాయి అవినీతి చేయకుండా వుంటున్నామని చెప్పగలిగే నాయకులు ఏ పార్టీలోనైనా వున్నారా? సంతకానికి రూపాయి వసూలు చేయడం ఎక్కడైనా మానుకున్నారా? పనుల కోసం వస్తే ఓ రేటు…పైరవీల కోసం వస్తే ఓ రేటు అంటూ ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేసుకొని ప్రజా సేవ ముసుగేసుకున్న నాయకులు ముందు మరాలి. తామున్నది ప్రజా సేవ పేరుతో రాజకీయం చేస్తూ, పదవులు అనుభవిస్తూ, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవం కాదు? నికార్సనైన సేవ చేసే నాయకులు ఏ పార్టీలోనైనా ఈరోజుల్లో కనిపిస్తారా? ఒక్కసారి మునుగోడు రాజకీయమే చూసుకుందాం…

తాను రాజీనామా చేస్తే మునుగోడుకు మేలు జరుతుంది. మునుగోడు అభివృద్ధి జరుగుతుంది. అంటూ ప్రజల కోసం, కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించారు. ఇది మునుగోడులో రాజీనామాకు ముందు కోమటిరెడ్డి తిరకాసు తొలి వ్యాఖ్య? అమిత్‌షా ను పిలిచి మునుగోడులో సభ ఏర్పాటు చేసి, బిజేపిలో చేరిన సందర్భంలో ఇదే రాజగోపాల్‌ చెప్పిన మరో మాట…నాలుక మడతెట్టిన తీరు చూడలేదా? అమిత్‌షా రాజీనామా చేయమంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజీనామా ప్రకటించానన్నారు. ఇందులో ఏది సత్యం…ఏదసత్యం! 

                         నాయకులు నోరు తెరిస్తేనే అబద్దం…మాట మాట్లాడితే అసత్యం…నిలబడితే స్వార్ధం…అడుగేస్తే అన్యాయం…ఇంతకన్నా చెప్పుకోవడానికి నాయకుల తీరులో, వ్యవహారంలో కొత్తమీ లేదు. ఇలాంటి నాయకులు రాజకీయాల్లో నిండిపోయి, అవినీతి, ఆశ్రిత పక్షపాతంలో కూరుకుపోయి, అక్రమ సంపాదనకు అలవాటు పడి ప్రజలు మారాలా? డబ్బుకు ప్రజలు అమ్ముడుపోతున్నారా? మద్యం ఇస్తేగాని మాట వినడం లేదా? చెప్పడానికి కనీసం సిగ్గనిపించాలి. ఐదేళ్ల నాడు ఇచ్చే ఐదు వందల రూపాయలతో ప్రజలు ఐదేళ్లు బతుకున్నారా? మీరు జాలిపడి ఎన్నికల నాడు నోటు ప్రజలచేతికిస్తున్నారా? నాయకులు సిగ్గు శరం పూర్తిగా వదిలేశారు…నిజాలు చెప్పడం ఏనాడో మానేశారు…కనీసం చెప్పే అబద్దమైన కాండ్రిరచి మీద ఉమ్మేస్తుందేమో! అన్న భయం లేకుండా నోరుంది కదా? అని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అందుకే నిస్సిగ్గుగా తమకు తాము గురివింద సామెతను నిజం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెడతారు…నాయకులౌతారు. 

పార్టీలో క్రియాశీలమౌతారు…అప్పుడు పైలా పచ్చీసు ఆట మొదలుపెడతారు? పార్టీ కార్యక్రమాలకు సొంత నిధులు ఖర్చు చేస్తారా? లేదు. అందుకు అవసరమైన నిధులు సేకరిస్తారు. ఏదైనా సభ నిర్వహణ అంటే చేతిలోనుంచి పెట్టుకుంటారా? లేదు. మళ్లీ వ్యాపారుల మీద పడతారు…అందులో నుంచి సభలకు వచ్చే ప్రజలకు నగదిస్తారు? ప్రజలు పనులు వదులుకొని వచ్చినందుకు వారికి గిట్టుబాటు కావొద్దా? కడుపు వుండేది నాయకులకేనా? ప్రజలకు కాదా? సభలేమో! ప్రచారాలేమో!! కాని ప్రజలు ఎండల్లో రావాలి. ఎండలో నిలబడాలి. నాయకులు చెప్పే సొల్లు వినాలి. ఇదంతా పుణ్యానికి రావాలి. మరి అదే నాయకులు ఎక్కడైనా ప్రచారానికి వెళ్తే ఊరికే వెళ్తారా? అక్కడి నాయకులను పీడిరచుకొని తినరా? సౌకర్యాల ఏర్పాట్లలో చుక్కలు చూపించరా? ప్రచారం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో సంచులు నింపుకొని రారా? మరి మీరైతే సంచులకు సంచులకు తెచ్చుకోవచ్చు? కాని ప్రజలను మారమంటారు? ఇదేం న్యాయం…!ఇంకా పెద్ద నాయకుల తీరు చెప్పుకుంటే అబ్బో ఆ చరిత్రలే వేరు…పెద్ద నాయకులకు కదలాలంటే లక్షలు కావాల్సిందే…అద్దాల హోటళ్లలో మకాం ఏర్పాటు చేయాల్సిందే…వారు అడిగినన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందే…! ఎక్కడ తేడా వచ్చినా, ఆగమాగం చేయాల్సిందే…ఎవరినైతే గెలిపించాలని వచ్చారో…వారిని ఓడిరచేందుకు కూడా వెనకాడని రాజకీయాలు చేయాలి…ఇంత దుర్మార్గమైన నాయకత్వాలు కూడా దేశంలో కనిపిస్తున్నాయి. కాని వీళ్లు నీతులు చెబుతారు. ప్రజలు మారమంటారు…ప్రజలకు వాతలు పెడతారు? పన్నుల మీద పన్నులేసి ముక్కు పిండి వసూలు చేస్తారు..ధరలు పెంచుతారు…అన్నీ వడ్డిస్తారు…ప్రజల కోసమే ఇవన్నీ చేస్తున్నామంటారు…? కాలం మారింది. పార్టీలు మారుతున్నాయి? నాయకులు మారుతున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు ఎలా మభ్యపెట్టాలో నేర్చుకొని, కొత్త తరం రాజకీయాలు ఇవే అంటూ రుచి చూపిస్తున్నారు…అందరూ అందరే…అందుకు ఏ పార్టీ మినహాయింపు కాదే!! ఏ నాయకుడు సుద్దపూస కాడులే!!!

ఛీ…ఛీ…మీరు మారరు!?

హస్తంలో ఆరని కుంపటి?

జనం ఆలోచనలకు ప్రతీకలు కాలేరు!

ఎవ్వరి స్వార్థం వారిదే!

పార్టీ కోసం పని చేయాలని ఎవరికీ లేదు?

 గెలవాలన్న కసి లేదు?

 గెలిపిద్దామన్న ఐక్యత లేదు?

ఒకరి కాళ్లు ఒకరు లాక్కోవడం తప్ప, మరేం లేదు?

ఇంత జరుగుతున్నా ఒక్కరిలోనూ అంకిత భావం లేదు?

వున్న వాళ్లను పంపిస్తున్నారు?

పోయే వాళ్లను బ్రతిమిలాడుతున్నారు?

అందరూ కలిసి పార్టీని ముంచేస్తున్నారు?

మునుగోడు తో ఇక లేవకుండా చేసుకుంటున్నారు?

జనం ఛీ కొడుతున్నారు? అయినా మీరు మారరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 నేను రానుబాబో అంటూ ఎంపి కోమటి రెడ్డి వెంకటరెడ్డి భీష్మించుకుకూర్చున్నాడు. ఎలా బైటపడాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నాడు. ఒక్కడివొస్తే చాలదు…అన్నా దమ్ములు ఇద్దరూ కలిసి వస్తేనే లెక్క…అని బిజేపి ఫిట్టింగ్‌ పెట్టి కూర్చున్నది. సరే…అంటూ కోమటిరెడ్డి సోదరులు తలూపినట్లు సమాచారం…కాని రాజగోపాల్‌ రెడ్డి ముందు పరిస్ధితి గమనించేందుకు కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే పదవికి రాం..రాం చెప్పాడు. అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు అంటాడు… ఓ ప్రతిపక్ష పార్టీ నుంచి మరో ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం పోరాటమా? పోరుబాటను ఎంచుకోవడం ఇదా అంటే అదంతా మాకు తెల్వదంటాడు…తాము ఎంచుకున్న మార్గం వేరు అంటారు…అన్నా దమ్ములం కలిసొస్తామని చెప్పినట్టు తెలుస్తున్నా…అబ్బే అదేం లేదంటారు…అసలు నిజం చెప్పలేరు…అబద్దం చెబుతూ కాలం గడపలేదు… ఆఖరుకు పార్టీని ముప్పు తిప్పలు పెట్టి అన్నాదమ్ములు కలిసి కాంగ్రెస్‌ పార్టీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. అయినా సరే …రాజగోపాల్‌రెడ్డి పోయినా ఫరవాలేదు…మీరుండాలి అంటూ కాంగ్రెస్‌ పార్టీ వెంకటరెడ్డి కాళ్లా వేళ్లా పడుతోంది…గతంలో ఏ నాయకుడికి బ్రతిమిలాడనంత గౌరవంగా ఆయనను ప్రసన్నం చేసుకోవాలని పార్టీ చూస్తోంది…నిజానికి అక్కడ ఏం జరగాలి….పార్టీని వెంకటరెడ్డి బ్రతిమిలాడుకోవాలి….కాని అంతా రివర్స్‌ జరుగుతోంది. వెంకటరెడ్డి జారి పోకుండా చూడాలని కాంగ్రెస్‌ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అటు కాంగ్రెస్‌కు తెలుసు…ఇటు వెంకటరెడ్డికి తెలుసు…కాని జగన్నాటకమాడుతున్నారు…జనాలను పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బిజేపిలోకి వెంకటరెడ్డి వెళ్లడం ఖాయమని విసృతంగా చర్చ జరుగుతోంది…కాని నేను వెళ్లను అంటూ వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల దాకా ఆగాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌లోనే వుంటూ కట్టప్ప పాత్ర పోషించాలని చూస్తున్నాడు. తమ్ముడిని గెలిపించుకొని అప్పుడు కాంగ్రెస్‌కు జెల్లకొడదామని చూస్తున్నాడు. ఇది కాంగ్రెస్‌కు కూడా తెలుసు. కాని ఏంచేయలేని నిస్సహాయక స్ధితి. ఇలాంటి పరిస్ధితి కాంగ్రెస్‌ ఏనాడు అనుభవించలేదు. ఒక నాయకుడి కోసం రాష్ట్ర పార్టీ మొత్తం మోకరిల్లడం కూడా ఆయన బిజేపిలోకి చేరడానికి మరింత బలంగా మారుతోంది. కాంగ్రెస్‌ మొత్తం వదులుకునేందుకు ఇష్టపడని నాయకుడు బిజేపిలో చేరితే బలమైన నాయకత్వంగా అవతరించొచ్చని అన్నా, దమ్ములు అనుకుంటున్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు. ఇది మాత్రం బిజేపికి అర్ధం కావడంలేదు. భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే, మిమ్ముల్ని నమ్మి కన్న తల్లి లాంటి కాంగ్రెస్‌ను వదిలేశానని మొసలి కన్నీరు కార్చొచ్చు…పార్టీ మొత్తం నన్ను వద్దన్నా వినకుండా బిజేపి పంచన చేరాని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడ ఇప్పుడు చేస్తున్నట్లే రాజకీయం చేయొచ్చు…

ఇదిలా వుంటే వెంకటరెడ్డి ఎలా ఆడిస్తే కాంగ్రెస్‌ అలా ఆడుతుండడం కూడా ఆ పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు.

 గత కొంత కాలంగా భువనగిరి ఎంపి. వెంకటరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నాడు. ఒక దశలో గాంధీ భవన్‌ మెట్లు కూడా ఎక్కనన్నాడు. రేవంత్‌ రెడ్డి పిపిసి. అధ్యక్షుడు కావడం నాకు ఇష్టం లేదని భహిరంగంగానే చెప్పేశాడు. రూ.50 కోట్లు ఖర్చు చేసిన పిపిసి కొనుక్కున్నాడని కూడా వెంకటరెడ్డి ఆరోపణలు చేశాడు. అయినా ఆయనను పార్టీ సముచితంగానే గౌరవిస్తోంది. తాజాగా చండూరు సభలో కోమటిరెడ్డి సోదరులపై అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలన్నాడు. పాపం రేవంత్‌ భేషరుతుగా క్షమాపణ చెప్పాడు. అద్దంకిని పార్టీనుంచి బైటకు పంపాలని వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎలాగో అద్దంకిని ఆ దిశగా కూడా పార్టీ భుజ్జగించే ప్రయత్నం చేసింది. ఇవన్నీ జరిగితే మునుగోడు ప్రచారానికి వస్తానన్నాడు. పార్టీ తరుపున ప్రచారం చేస్తానన్నాడు. మంగళవారం డిల్లీ నుంచి వచ్చిన వెంకటరెడ్డి మళ్లీ కొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్‌ను మార్చాలంటున్నాడు. అంతే కాదు, సీనియర్లందరినీ మరోసారి సంప్రదించి, పిపిసిని కూడా మార్చాలంటున్నాడు. అప్పటిదాకా తాను పార్టీకి పనిచేయనని స్పష్టం చేశాడు. పనిలో పనిగా ఎవరు ఎంత కష్టపడినా సరే…మునుగోడులో కాంగ్రెస్‌ గెలవదని చెప్పేశారు. అంటే తాను పరోక్షంగా తమ్ముడికే మద్దతిస్తున్నానని మరోసారి చెప్పాడు. అయినా కాంగ్రెస్‌ పార్టీ ఆయనను నెత్తినెత్తుకొని ఊరేగేందుకు ప్రయత్నం చేస్తోంది. పార్టీ సీనియర్లందరూ వెంకటరెడ్డి మాటలు నిజం కావాలని కోరుకుంటున్నారు…

  ఇంత దౌర్భాగ్యం ఏ పార్టీలోనైనా వుంటుందా? 

జనం ఆలోచనలకు కాంగ్రెస్‌ నేతలు ప్రతీకలు కాలేకపోతున్నారు. చుండూరు సభను కార్యకర్తలు సక్సెస్‌ చేశారు. అంటే క్షేత్ర స్ధాయిలో కూడా బలంగానే వున్నామని కాంగ్రెస్‌ పార్టీకి సంకేతాలిచ్చారు. కాని కాంగ్రెస్‌ పెద్దలకు నమ్మకం లేదు. పార్టీ యంత్రాంగం వున్న కాంగ్రెస్‌లో మునుగోడు ఉప ఎన్నికపై నమ్మకం లేదు. కాని అసలు కార్యకర్తలే లేని బిజేపికి అతి విశ్వాసం ప్రదర్శిస్తోంది. అంటే నాయకుల్లో ఐక్యత అన్నది ఏ పార్టీకైనా ముఖ్యమన్నది కాంగ్రెస్‌ నేతలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారనేది ఇప్పటికీ వారిలో వారికే అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోతోంది. 

 మొత్తంగా కాంగ్రెస్‌ను తెలంగాణలో లేకుండా ఆ పార్టీ నేతలే చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.

 అసలు పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారిని ఎందుకు భుజ్జగిస్తున్నట్లు. జగ్గారెడ్డి లాంటి నాయకులను ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు..కొత్తగా అసంతృప్తి వాదులతో గొంతు కలిపిన మర్రి శశిధర్‌రెడ్డి చెబితే ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా కాంగ్రెస్‌కు ఓటు పడుతుందా? అసలు సామాన్య ప్రజలు ఆయనను గుర్తుపడతారా? తనకంటూ సొంత ఇమేజ్‌ లేని మర్రి శశిధర్‌రెడ్డి లాంటి వారు కాంగ్రెస్‌ పార్టీ గాలిలో గెలిచిన వాళ్లే తప్ప, సొంతంగా క్యాడర్‌ వున్న వాళ్లు కాదు. జగ్గారెడ్డి కూడా అంతే…2004లో టిఆర్‌ఎస్‌ మూలంగా, 2009లో కాంగ్రెస్‌ మూలంగా గెలిచాడు. 2014లో తెలంగాణ గాలిలో కొట్టుకుపోయాడు…మళ్లీ 2018లో కాంగ్రెస్‌ ఓట్లతో గెలిచాడు. అలాంటి నాయకుడు కూడా సొంతంగా పార్టీ పెడతానని చెప్పుకుంటున్నాడు. ఆయన చెబితే తెలంగాణలో సంగారెడ్డిలో కాకుండా మరెక్కడైనా గెలిచే పరిస్దితి వుందా? కనీసం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మరెక్కడినుంచి పోటీ చేసినా గెలవగలడా? కాంగ్రెస్‌ను కాదని తన స్వార్ధం కోసం బిజేపిలో చేరి, మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరిన నాయకుడు జగ్గారెడ్డి. ఆయన కూడా నీతి గురించి, పార్టీ మార్పు గురించి రేవంత్‌రెడ్డిపై మాట్లాడడం విడ్డూరం. 

 ఎలాగైనా రేవంత్‌ను దించేయాలి…

ఇదొక్కటే సీనియర్ల ఎజెండా! ఎందుకు? అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. సరే రేవంత్‌ను పక్కన పెడితే జనారెడ్డిని పిపిసి చేస్తే కాంగ్రెస్‌ గెలుస్తుందా? వెంకటరెడ్డిని చేస్తే అధికారంలోకి వస్తుందా? అంతో ఇంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో వున్న పుల్‌ మాస్‌ లీడర్‌ అంటే కనిపించే ఏకైక పేరు రేవంత్‌రెడ్డి. ఆయన వుండడం సీనియర్లకు ఇష్టం లేదు…ఎందుకంటే ఇంత కాలం ఆడిరది ఆట, పాడిరది పాటగా రాజకీయాలు చేసిన, సీనియర్లకు రేవంత్‌ గిట్టడం లేదు. మరి రేవంత్‌లాగా వాళ్లు పార్టీకి జోష్‌ నింపగలరా? అదీ లేదు. పొన్నాల లక్ష్మయ్య పిపిసిగా వున్నంత కాలం ఆయనతో కోమటిరెడ్డి సోదరులకు పడలేదు…ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వున్నంత కాలం అంతే…ఈ ఇద్దరు అన్నదమ్ములకు పడలేదు…ఇప్పుడు రేవంత్‌ రెడ్డి వారికి అసలే నచ్చలేదు. అంటే మేం తప్ప మరొకరు పార్టీలో వుండొద్దన్నంత హార్డ్‌కోర్‌ కాంగ్రెస్‌ నాయకులా అంటే అదీ లేదు…తమ్ముడి బీజేపి తీర్ధం పుచ్చకున్నాడు…అన్న ఎలా తీర్ధం పుచ్చుకునేది అని ఎదురు చూస్తున్నాడు…వీళ్ల కోసమా? పార్టీ మెట్లు దిగేది…వీళ్లకోసమా..పార్టీ ఆత్మాభిమానం చంపుకునేది…ఒక్కసారి ఆలోచించండి!! నాయకుల ఆటిట్యూడ్‌ మార్చుకోండి…తర్వాత మీరు మారండి…పార్టీ కాదు సుమీ…క్యారెక్టర్లు మార్చుకోండి…కలిసి కట్టుగా సాగండి!!!

ఛీ…ఛీ…మీరు మారరు!?

హస్తంలో ఆరని కుంపటి?

జనం ఆలోచనలకు ప్రతీకలు కాలేరు!

ఎవ్వరి స్వార్థం వారిదే!

పార్టీ కోసం పని చేయాలని ఎవరికీ లేదు?

 గెలవాలన్న కసి లేదు?

గెలిపిద్దామన్న ఐక్యత లేదు?

ఒకరి కాళ్లు ఒకరు లాక్కోవడం తప్ప, మరేం లేదు?

ఇంత జరుగుతున్నా ఒక్కరిలోనూ అంకిత భావం లేదు?

వున్న వాళ్లను పంపిస్తున్నారు?

పోయే వాళ్లను బ్రతిమిలాడుతున్నారు?

అందరూ కలిసి పార్టీని ముంచేస్తున్నారు?

మునుగోడు తో ఇక లేవకుండా చేసుకుంటున్నారు?

జనం ఛీ కొడుతున్నారు? అయినా మీరు మారరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నేను రానుబాబో అంటూ ఎంపి కోమటి రెడ్డి వెంకటరెడ్డి భీష్మించుకుకూర్చున్నాడు. ఎలా బైటపడాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నాడు. ఒక్కడివొస్తే చాలదు…అన్నా దమ్ములు ఇద్దరూ కలిసి వస్తేనే లెక్క…అని బిజేపి ఫిట్టింగ్‌ పెట్టి కూర్చున్నది. సరే…అంటూ కోమటిరెడ్డి సోదరులు తలూపినట్లు సమాచారం…కాని రాజగోపాల్‌ రెడ్డి ముందు పరిస్ధితి గమనించేందుకు కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే పదవికి రాం..రాం చెప్పాడు. అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు అంటాడు… ఓ ప్రతిపక్ష పార్టీ నుంచి మరో ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం పోరాటమా? పోరుబాటను ఎంచుకోవడం ఇదా అంటే అదంతా మాకు తెల్వదంటాడు…తాము ఎంచుకున్న మార్గం వేరు అంటారు…అన్నా దమ్ములం కలిసొస్తామని చెప్పినట్టు తెలుస్తున్నా…అబ్బే అదేం లేదంటారు…అసలు నిజం చెప్పలేరు…అబద్దం చెబుతూ కాలం గడపలేదు… ఆఖరుకు పార్టీని ముప్పు తిప్పలు పెట్టి అన్నాదమ్ములు కలిసి కాంగ్రెస్‌ పార్టీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. అయినా సరే …రాజగోపాల్‌రెడ్డి పోయినా ఫరవాలేదు…మీరుండాలి అంటూ కాంగ్రెస్‌ పార్టీ వెంకటరెడ్డి కాళ్లా వేళ్లా పడుతోంది…గతంలో ఏ నాయకుడికి బ్రతిమిలాడనంత గౌరవంగా ఆయనను ప్రసన్నం చేసుకోవాలని పార్టీ చూస్తోంది…నిజానికి అక్కడ ఏం జరగాలి….పార్టీని వెంకటరెడ్డి బ్రతిమిలాడుకోవాలి….కాని అంతా రివర్స్‌ జరుగుతోంది. వెంకటరెడ్డి జారి పోకుండా చూడాలని కాంగ్రెస్‌ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అటు కాంగ్రెస్‌కు తెలుసు…ఇటు వెంకటరెడ్డికి తెలుసు…కాని జగన్నాటకమాడుతున్నారు…జనాలను పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బిజేపిలోకి వెంకటరెడ్డి వెళ్లడం ఖాయమని విసృతంగా చర్చ జరుగుతోంది…కాని నేను వెళ్లను అంటూ వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల దాకా ఆగాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌లోనే వుంటూ కట్టప్ప పాత్ర పోషించాలని చూస్తున్నాడు. తమ్ముడిని గెలిపించుకొని అప్పుడు కాంగ్రెస్‌కు జెల్లకొడదామని చూస్తున్నాడు. ఇది కాంగ్రెస్‌కు కూడా తెలుసు. కాని ఏంచేయలేని నిస్సహాయక స్ధితి. ఇలాంటి పరిస్ధితి కాంగ్రెస్‌ ఏనాడు అనుభవించలేదు. ఒక నాయకుడి కోసం రాష్ట్ర పార్టీ మొత్తం మోకరిల్లడం కూడా ఆయన బిజేపిలోకి చేరడానికి మరింత బలంగా మారుతోంది. కాంగ్రెస్‌ మొత్తం వదులుకునేందుకు ఇష్టపడని నాయకుడు బిజేపిలో చేరితే బలమైన నాయకత్వంగా అవతరించొచ్చని అన్నా, దమ్ములు అనుకుంటున్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు. ఇది మాత్రం బిజేపికి అర్ధం కావడంలేదు. భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే, మిమ్ముల్ని నమ్మి కన్న తల్లి లాంటి కాంగ్రెస్‌ను వదిలేశానని మొసలి కన్నీరు కార్చొచ్చు…పార్టీ మొత్తం నన్ను వద్దన్నా వినకుండా బిజేపి పంచన చేరాని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడ ఇప్పుడు చేస్తున్నట్లే రాజకీయం చేయొచ్చు…ఇదిలా వుంటే వెంకటరెడ్డి ఎలా ఆడిస్తే కాంగ్రెస్‌ అలా ఆడుతుండడం కూడా ఆ పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు.

గత కొంత కాలంగా భువనగిరి ఎంపి. వెంకటరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నాడు. ఒక దశలో గాంధీ భవన్‌ మెట్లు కూడా ఎక్కనన్నాడు. రేవంత్‌ రెడ్డి పిపిసి. అధ్యక్షుడు కావడం నాకు ఇష్టం లేదని భహిరంగంగానే చెప్పేశాడు. రూ.50 కోట్లు ఖర్చు చేసిన పిపిసి కొనుక్కున్నాడని కూడా వెంకటరెడ్డి ఆరోపణలు చేశాడు. అయినా ఆయనను పార్టీ సముచితంగానే గౌరవిస్తోంది. తాజాగా చండూరు సభలో కోమటిరెడ్డి సోదరులపై అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలన్నాడు. పాపం రేవంత్‌ భేషరుతుగా క్షమాపణ చెప్పాడు. అద్దంకిని పార్టీనుంచి బైటకు పంపాలని వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎలాగో అద్దంకిని ఆ దిశగా కూడా పార్టీ భుజ్జగించే ప్రయత్నం చేసింది. ఇవన్నీ జరిగితే మునుగోడు ప్రచారానికి వస్తానన్నాడు. పార్టీ తరుపున ప్రచారం చేస్తానన్నాడు. మంగళవారం డిల్లీ నుంచి వచ్చిన వెంకటరెడ్డి మళ్లీ కొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్‌ను మార్చాలంటున్నాడు. అంతే కాదు, సీనియర్లందరినీ మరోసారి సంప్రదించి, పిపిసిని కూడా మార్చాలంటున్నాడు. అప్పటిదాకా తాను పార్టీకి పనిచేయనని స్పష్టం చేశాడు. పనిలో పనిగా ఎవరు ఎంత కష్టపడినా సరే…మునుగోడులో కాంగ్రెస్‌ గెలవదని చెప్పేశారు. అంటే తాను పరోక్షంగా తమ్ముడికే మద్దతిస్తున్నానని మరోసారి చెప్పాడు. అయినా కాంగ్రెస్‌ పార్టీ ఆయనను నెత్తినెత్తుకొని ఊరేగేందుకు ప్రయత్నం చేస్తోంది. పార్టీ సీనియర్లందరూ వెంకటరెడ్డి మాటలు నిజం కావాలని కోరుకుంటున్నారు…ఇంత దౌర్భాగ్యం ఏ పార్టీలోనైనా వుంటుందా? 

జనం ఆలోచనలకు కాంగ్రెస్‌ నేతలు ప్రతీకలు కాలేకపోతున్నారు. చుండూరు సభను కార్యకర్తలు సక్సెస్‌ చేశారు. అంటే క్షేత్ర స్ధాయిలో కూడా బలంగానే వున్నామని కాంగ్రెస్‌ పార్టీకి సంకేతాలిచ్చారు. కాని కాంగ్రెస్‌ పెద్దలకు నమ్మకం లేదు. పార్టీ యంత్రాంగం వున్న కాంగ్రెస్‌లో మునుగోడు ఉప ఎన్నికపై నమ్మకం లేదు. కాని అసలు కార్యకర్తలే లేని బిజేపికి అతి విశ్వాసం ప్రదర్శిస్తోంది. అంటే నాయకుల్లో ఐక్యత అన్నది ఏ పార్టీకైనా ముఖ్యమన్నది కాంగ్రెస్‌ నేతలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారనేది ఇప్పటికీ వారిలో వారికే అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోతోంది. మొత్తంగా కాంగ్రెస్‌ను తెలంగాణలో లేకుండా ఆ పార్టీ నేతలే చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.అసలు పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారిని ఎందుకు భుజ్జగిస్తున్నట్లు. జగ్గారెడ్డి లాంటి నాయకులను ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు..కొత్తగా అసంతృప్తి వాదులతో గొంతు కలిపిన మర్రి శశిధర్‌రెడ్డి చెబితే ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా కాంగ్రెస్‌కు ఓటు పడుతుందా? అసలు సామాన్య ప్రజలు ఆయనను గుర్తుపడతారా? తనకంటూ సొంత ఇమేజ్‌ లేని మర్రి శశిధర్‌రెడ్డి లాంటి వారు కాంగ్రెస్‌ పార్టీ గాలిలో గెలిచిన వాళ్లే తప్ప, సొంతంగా క్యాడర్‌ వున్న వాళ్లు కాదు. జగ్గారెడ్డి కూడా అంతే…2004లో టిఆర్‌ఎస్‌ మూలంగా, 2009లో కాంగ్రెస్‌ మూలంగా గెలిచాడు. 2014లో తెలంగాణ గాలిలో కొట్టుకుపోయాడు…మళ్లీ 2018లో కాంగ్రెస్‌ ఓట్లతో గెలిచాడు. అలాంటి నాయకుడు కూడా సొంతంగా పార్టీ పెడతానని చెప్పుకుంటున్నాడు. ఆయన చెబితే తెలంగాణలో సంగారెడ్డిలో కాకుండా మరెక్కడైనా గెలిచే పరిస్దితి వుందా? కనీసం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మరెక్కడినుంచి పోటీ చేసినా గెలవగలడా? కాంగ్రెస్‌ను కాదని తన స్వార్ధం కోసం బిజేపిలో చేరి, మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరిన నాయకుడు జగ్గారెడ్డి. ఆయన కూడా నీతి గురించి, పార్టీ మార్పు గురించి రేవంత్‌రెడ్డిపై మాట్లాడడం విడ్డూరం. ఎలాగైనా రేవంత్‌ను దించేయాలి…

ఇదొక్కటే సీనియర్ల ఎజెండా! ఎందుకు? అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. సరే రేవంత్‌ను పక్కన పెడితే జనారెడ్డిని పిపిసి చేస్తే కాంగ్రెస్‌ గెలుస్తుందా? వెంకటరెడ్డిని చేస్తే అధికారంలోకి వస్తుందా? అంతో ఇంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో వున్న పుల్‌ మాస్‌ లీడర్‌ అంటే కనిపించే ఏకైక పేరు రేవంత్‌రెడ్డి. ఆయన వుండడం సీనియర్లకు ఇష్టం లేదు…ఎందుకంటే ఇంత కాలం ఆడిరది ఆట, పాడిరది పాటగా రాజకీయాలు చేసిన, సీనియర్లకు రేవంత్‌ గిట్టడం లేదు. మరి రేవంత్‌లాగా వాళ్లు పార్టీకి జోష్‌ నింపగలరా? అదీ లేదు. పొన్నాల లక్ష్మయ్య పిపిసిగా వున్నంత కాలం ఆయనతో కోమటిరెడ్డి సోదరులకు పడలేదు…ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వున్నంత కాలం అంతే…ఈ ఇద్దరు అన్నదమ్ములకు పడలేదు…ఇప్పుడు రేవంత్‌ రెడ్డి వారికి అసలే నచ్చలేదు. అంటే మేం తప్ప మరొకరు పార్టీలో వుండొద్దన్నంత హార్డ్‌కోర్‌ కాంగ్రెస్‌ నాయకులా అంటే అదీ లేదు…తమ్ముడి బీజేపి తీర్ధం పుచ్చకున్నాడు…అన్న ఎలా తీర్ధం పుచ్చుకునేది అని ఎదురు చూస్తున్నాడు…వీళ్ల కోసమా? పార్టీ మెట్లు దిగేది…వీళ్లకోసమా..పార్టీ ఆత్మాభిమానం చంపుకునేది…ఒక్కసారి ఆలోచించండి!! నాయకుల ఆటిట్యూడ్‌ మార్చుకోండి…తర్వాత మీరు మారండి…పార్టీ కాదు సుమీ…క్యారెక్టర్లు మార్చుకోండి…కలిసి కట్టుగా సాగండి!!!

ఉత్తరాధి ఉడుకుమోతుదనం!

`తెలంగాణకు ఏం చేస్తారో చెప్పరు?

`కేసిఆర్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పరు?

`కనీసం లేవనెత్తిన అంశాలు ప్రస్తావించరు?

`ఎందుకొస్తున్నారని అడిగితే సెప్టెంబరు 17 అంటారు?

` కృష్ణా జలాల వాటా తేల్చమంటే, మునుగోడులో ముంచేస్తామంటారయ?

` గెలిపిస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోస్తామంటారు?

`కరంటు మోటార్లు పెట్టమని చెప్పాలంటే, కాళ్లల్లో కట్టెలు పెడతామంటారు?

`గ్యాస్‌ ధరలు తగ్గించమంటే, కుటుంబ రాజకీయాలంటారు?

`పొంతన లేని సమాధానాలు చెప్పి మభ్య పెడుతుంటారు?

`కూల దోసుడు తప్ప నిలబెట్టడం కుదరదంటారు?

`చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా గాయి గత్తర చేస్తామంటారు?

`మతం మాయలో ఓట్ల జాతరను నమ్ముకున్నారు?

`తెలంగాణలో అస్థిరతను సృష్టించాలని చూస్తున్నారు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అడిగిందానికి మాత్రం సమాధానం చెప్పం? అవసరం లేని విషయాలన్నీ మాట్లాడతాం? ప్రజలకు అక్కరకొచ్చే మచ్చట్లు మాత్రం చెప్పం? ప్రపంచంలోకి అన్ని విషయాలు ప్రస్తావిస్తాం? దేశం కోసం, ధర్మం కోసమని మాత్రమే చెబుతాం? ఆ ధర్మమేమిటో మాత్రం చెప్పం? ప్రజల మీద ఇలా భారం వేయడం ధర్మమా? అన్నది కూడా ఆలోచించం? ప్రజలున్నది, ఎన్నుకున్నది భారాలు మోసేందుకు అని మాత్రం ధరలు పెంచి చెబుతాం? వారి నడ్డి మీద వాతలు పెట్టినా భరించాలని చెబుతాం? అది దేశం కోసమే? అని చెబుతాం? ఇదీ బిజేపి పరిస్ధితి. తెలంగాణకు మీద కన్నేశాం…వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే అంటారు? అన్నీ సరే తెలంగాణకు ఏం చేస్తారో చెప్పమంటే చెప్పరు? ఇప్పటికీ విభజన చట్టం పొందు పర్చిన వాటిని ఇమ్మంటే ఇవ్వరు. ఇస్తామని విభజన చట్టంలో చెప్పిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గుజరాత్‌కు తరలించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఊసెత్తడమే లేదు. గిరిజన యూనివర్సిటీ గురించి అడిగీ అడిగీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే గోసకొచ్చింది. అయినా కేంద్రం ఇవ్వదు. బిజేపి తరుపున ఎవరూ మాట్లాడరు? రాష్ట్రానికి చెందిన ఏ బిజేపి నాయకుడు కేంద్ర పెద్దలకు గుర్తు చేయరు. అడిగితే నోరు నొప్పి పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వమే అడగాలి. కాని ఆ బాధ్యత బిజేపి నేతలు తీసుకున్నది లేదు. అడిగింది లేదు. తెచ్చింది లేదు. కాని మాటలు మాత్రం కోటలు దాటుతాయి? అనేది టిఆర్‌ఎస్‌ ప్రధాన ఆరోపణ.తాజాగా ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఒక్కటే మాట అడిగారు.

ఎందుకొస్తున్నావ్‌ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా…మా కృష్ణానదీ జలాల వాటా గురించి తేల్చకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఆ వాట గురించి తేల్చేస్తే మునుగోడు నియోజకవర్గంలో నిర్మాణాలు పూర్తయినా ఎత్తి పోతల పథకాలకు నీరు లేకుండా పోతోంది. రిజర్వాయర్లు నిండుకుండాపోతున్నాయన్నారు. దీనికి అమిత్‌షా సమాధానం చెప్పలేదు. కేసిఆర్‌ ఈ విషయం ప్రస్తావించాడని ఏ బిజేపినాయకులు అమిత్‌షాకు చెప్పలేదు. కాని కాళేశ్వరం గురించి మాత్రం మాట్లాడారు. మొన్న ఏ జలశక్తి శాఖ మంత్రి చెప్పిన విషయాలను అమిత్‌షా ఎందుకు రూడీ చేయలేకపోయాడు? అంటే కేంద్ర మంత్రి షెకావత్‌ మాట్లాడిన మాటలు అబద్దమని పరోక్షంగా అమిత్‌షా ఒప్పుకున్నట్లే అయ్యింది? కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురదజల్లాలన్న ధోరణి తప్ప నిజాలు మాట్లాడాలన్న ఆలోచన అమిత్‌షాలో కనిపించలేదు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కల్లకుంట్ల కుటుంబానికి ఏటిఎంగా మారిందన్నారు. ఇది ప్రజలు కూడా హర్షించని విమర్శ. ఇకపోతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ మునుగోడులో ఏర్పాటు చేసిన సభలో సూటిగా స్పష్టంగా బిజేపిని, అమిత్‌షాను కొన్ని ప్రశ్నించారు. దేశంలోని బిజేపి రాష్ట్రాల్లో లేని రకరకాల పెన్షన్లు తెలంగాణలో అమలౌతున్నాయి. వృద్దులు ఎంతో సంతోషంగా వున్నారు. మరి ఆయా రాష్ట్రాలలో తెలంగాణలో ఇచ్చినంత నగదును ఇవ్వడం లేదు. మరి మేమొస్తాం…అనగానే సరిపోదు…ఈ పెన్షున్లు పెంచుతారా? తగ్గిస్తారా? అన్న దానికి అమిత్‌షా ఎలాంటి స్పందన కనబర్చలేదంటే అర్ధమేమిటి? తెలంగాణలో అంతంత పెన్షన్లు ఎందుకిస్తున్నారని ఇప్పటికే కేంద్ర పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సంగతి ముఖ్యమంత్రి కేసిఆరే స్వయంగా చెప్పారు. అది ఒక వేళ అబద్దమైతే అమిత్‌షా ఎందుకు ఖండిరచలేదు. మునుగోడులో బిజేపిని గెలిపిస్తే, తెలంగాణ ప్రభుత్వాన్ని ముంచేస్తామని చెప్పిన అమిత్‌షా తెలంగాణలో రైతుల కరంటు మోటార్లకు మీటర్లు పెట్టమని ఎందుకు చెప్పలేదు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన జరిపిస్తామని ప్రకటిస్తే చాలా?

అదే పెద్ద గొప్ప వరమని తెలంగాణ ప్రజలు సంతోషపడాలా? కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పెట్రోలు ధరలు తగ్గించిందా? నిత్యం పెరుగుతున్న పెట్రోధరలను రెండు సార్లు సవరించినా నిత్యం పెరగడంలో ఆగుదల వుందా? ఆగకుండా వుంటుందా? యూపిఏ ప్రభుత్వంలో పెట్రోల్‌ ధర 74 రూపాయలకు చేరితే సామాన్యుడు ఎలా బతికేదన్నారు? రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేశారు. ఆఖరకు ఉల్లిగడ్డ ధర పెరిగితే కూడా నానా హంగామా చేశారు. బిజేపి హాయాంలో ఉల్లి ధర ఎందుకు పెరగుతుందంటే ఉల్లి తినే అలవాటు మాకు లేదని తప్పించుకునే ప్రభుత్వ పెద్దలు ఎక్కడైనా వుంటారా? అంటే ప్రజలు ఉల్లి తినడం మానేయండని పరోక్షంగా చెప్పడం కాదా? ఒకప్పుడు పెట్రోల్‌ ధరలు పెరిగితే దేశానికి భారమా? ఇప్పుడు పెట్రోల్‌ ధరలు పెరగడం దేశం కోసం, ధర్మం కోసమా? రైతులకు గిట్టుబాటు ధరల ప్రకటన ఏనాడో మర్చిపోయిన కేంద్రం , విత్తనాలు, యూరియా, ధరలు పెంచి రైతుల సమస్యలను గాలికి వదిలేసినా ప్రశ్నించొద్దా? రైతులకు రైతు బంద్‌ పధకాలు ఉచితాలుగా అభివర్ణించడం అన్యాయం కాదా? పెట్టుబడి దారులకు లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేయడం దేశం కోసమా? అవి ధర్మం కోసమా? ఇలాంటి అనేక ప్రశ్నలు ముఖ్యమంత్రి లేవనెత్తారు. కాని వాటిలో ఏ ఒక్కటికీ అమిత్‌షా సమాధానం చెప్పలేదు. చెప్పడానికి ఏమీ లేదు. అందుకే తన రాజకీయం పక్కదారి పట్టించారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. గతంలో రూ.50 గ్యాస్‌ ధర పెరిగితే గోల గోల చేసిన బిజేపి, సబ్సిడీకి మంగళం పాడిరది. సిలిండర్‌ ధర పదకొండు వందల యాభై రూపాయలు చేసింది. గ్యాస్‌ ధర తగ్గిస్తారా లేదా? అంటే గ్యాస్‌ బండ సైజు తగ్గిస్తామని, మహిళలు ఇంతింత సిలిండర్‌ మోయలేకపోతున్నారని చెబుతున్నారు. ఇలా ప్రజలు అడిగేదానికి, బిజేపి నేతలు చెప్పే సమాధానాలు ఎక్కడా పొంతన వుండదు. దేశంలో 11 రాష్ట్రాలలో బిజేపియేతర ప్రభుత్వాలు ఏర్పాటును జీర్ణించుకోలేని బిజేపి ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను కూలదోసింది. బిజేపి ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే చేయాలని చూస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికించాలని ఏక్‌ నాధ్‌ షిండేలను తయారు చేస్తామంటోంది? ఇదినా? నైతికత అంటే నవ్వుతోంది? పడగొట్టడమే మాకు తెలుసన్న దాన్ని పదేపదే చెబుతోంది…ఎనమిదేళ్ల కాలంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి, వున్న ఉద్యోగాలు పోయేలా చేసింది. జిఎస్టీ పేరుతో పరిశ్రమలకు మంగళం పాడిరది. ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటు రంగానికి అప్పగిస్తోంది. అతి తక్కువ ధరకు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అంటగడుతోంది. ఆ రుణాలు తీర్చలేని అదే ప్రైవేటు వ్యక్తులకు రుణాలు మాఫీ చేస్తోంది. పేదల నోరుకొడుతోంది. అన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన అరోపణ. ఇదిలా వుంటే నోట్ల రద్దు నుంచి మొదలు అన్నిట్లోనూ ప్రజలకు ఇబ్బందులు ఎదురౌతున్నా, ఓర్చుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వన్నీ అంగీకరిస్తున్నట్లు కాదని తెలుసుకోవాలి. అంతే కాకుండా రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చే కుట్రలకు తెరతీయం కూడా అంత మంచిది కాదు. మునుగోడులో బిజేపిజెండా ఎగరడం అన్నది కష్టం.అసలు దక్షిణాదిలో బిజేపికి అంత పెద్ద సీన్‌ లేదు. కర్ణాటక వరకే దాని పరిధి పరిమితం. తెలంగాణలో పాగా వేయాలన్న కుతూహలం బాగా వున్నప్పటికీ ప్రజలను మెప్పించి, ఒప్పించి వారికి మరింత మెరుగైన పాలన ఎలా చేస్తామన్నదానిని గురించి చెప్పకుండా రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తామంటున్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పరిహాసమాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారనేది టిఆర్‌ఎస్‌ ప్రధాన ఆరోపణ. అందుకే ఉద్యమాలు కొత్తకాని, పోరాటాలు పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి తెలిసిన పార్టీయే టిఆర్‌ఎస్‌. అలాంటి టిఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే ప్రజలకు మెరుగైన సేవల కోసం ఆలోచించాలే గాని, గాలి మాటలు చెప్పి, ప్రభుత్వాలను భయపెట్టి పాగావేస్తామంటే తెలంగాణలో అంత సులువు కాదు. ప్రజలు నమ్మరు.

మళ్ళీ తోడేళ్ల వేట!?

`తెలంగాణలో ఐక్య ప్రకంపలు

`ఆంద్రప్రదేశ్‌లో లోకేష్‌ 

`మొత్తం మీద రామోజీ రావు వద్ద దౌత్యం…

`మళ్ళీ తెలుగుదేశంతో తెలుగు ప్రజల నినాదం…

`మునుగోడు సాక్షిగా తెలంగాణను ముంచే ప్రయోగం!

`తెరవెనుక చంద్రబాబు కుటిల మంత్రాంగం…

`కొందరు తెలంగాణ నేతల కనుసన్నలో సాగుతున్న చీకటి పథకం!

`అన్ని పార్టీలను ముంచి, తెలుగు రాగంలో వంచనకు తెరతీసి…

`పైకి కనిపించేంత చిన్న రాజకీయాలు కాదు…

`తెలంగాణను వదిలేయడం వాళ్ల వళ్ల కావడం లేదు!

`తెలంగాణ బాగుపడడం అసలే నచ్చడం లేదు!

`ఎలాగైనా బిజేపితో కలిస్తేనే తెలంగాణ మళ్ళీ కలుపుకోవచ్చు?

`పెత్తనం చేయొచ్చు! అణచివేయొచ్చు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కనుసన్నల్లో రాజకీయాలు నడిచింత కాలం…తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో వున్నంత కాలం…ఆపార్టీ బలంగా వున్నంత కాలం ఏమీ లేయలేం…మన పప్పులు ఉడికించలేం. మన ఆటలు చెల్లవు. కోరికలు నెరవేరవు…కలలు తీరవు. అధికారం అన్న మాట మన కల్ల…కనీసం దాని దరిదాపుల్లోకి కూడ వెళ్లలేం…ప్రభావం చూపలేం…మనం గెలిచినా తెలంగాణ నాయకత్వం ముందు మోకరిళ్లకుండా బతకలేం…వారి కనుసన్నల్లో బతక్కుండా వుండేలేం…పెత్తనానికి తావులేని చేట చోతలు కట్టుకొని బతకడం కష్టం…ఇప్పటికే ఎనమిదేళ్లయింది…ఇంకా ఎనభై ఏళ్లయినా మనం అనుకున్నది చేయలేం…మళ్లీ తెలంగాణను వశం చేసుకోలేం…తెలంగాణ లేకుండా ఎక్కువ కాలం వుండలేం…గత డెబ్బై ఏళ్లనుంచి సీమాంధ్ర నాయకులది ఇదే తంతు…మద్రాసు నుంచి విడిపోయిన నాడు అందుకున్న పాట…తెలుగు రాగం…ఐక్య మోసం…చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరడం…విష పెత్తనం చెలాయించడం…తెలంగాణను దోచుకోవడం…నాశనం చేయడం సీమాంధ్ర నాయకులకు తెలిసింది…దోచుకు తినడం అలవాటైన వాడు ఆగలేడు…తెలంగాణ లేకుండా రాజకీయం నెరపలేడు….ఎంతో చైతన్యవంతమైన తెలంగాణలో 1948లోనే నైజాంను తరిమినా, కలిసుంటే కలదు సుఖం…అంటూ తెలుగు పిడి వాదం తెచ్చి, ఆంధ్ర అనే పదం చేర్చి తెలంగాణ అస్ధిత్వాన్ని మళ్లీ చెల్లా చెదురు చేశారు…తెలంగాణను చెరపట్టించారు…వేధించారు…వెక్కిరించారు…గోస పెట్టారు…పలుచన చేశారు…చులకన చేశారు…ఇదంతా తెలంగాణ ప్రజలు మర్చిపోరు…కాని తెలంగాణ వాదుల ముసుగులో ఉద్యమం చేసినట్లు భవిష్యత్‌ రాజకీయం కోసం పైలా పచ్చీసు ఆడినవారితోనే ఇప్పుడు మళ్లీ తంట…బానిక బతుకులకు అలవాటు పడిన నేతలనే, గోతి కాడ నక్కలతోనే అసలు తంటా…సీమాంధ్ర నేతలతో వారు కలిసి ఆడుతున్న తొండాట…పూర్వపు రోజులకు మళ్లీ వేయనున్న ముళ్ల బాట…సీమాంధ్ర నేతలు వచ్చి తెలంగాణలో రాజకీయం చేయడమే ఒక విషరాజకీయ క్రీడ. ఇంకా వేచి చూస్తే ఏం చేయలేదు..ఎక్కడా ఎదగలేం…తెలంగాణలో కనీసం ముప్పై నుంచి నలభై స్ధానాల్లో ప్రభావం చూపే స్ధితిలో వున్నాం…తెలంగాణ బాగుపడుతుంటే తట్టుకోలేం…అక్కడి సంపదమీద కన్ను వదులుకోలేం…ఇది ఆంధ్రా నాయకుల గోతికాడ నక్క వేషాలు…ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగుకు చేరుకుంటుంటే తెలంగాణ బాగుపడుతోంది.

అభివృద్ధిలో దూసుకుపోతోంది…ప్రగతిలో పరుగులు పెడుతోంది. పేదరికం లేని సమాజ నిర్మాణం జరుగుతోంది. విద్య, వైద్య రంగాల్లో పురోగమిస్తోంది. ఐటిలో దేశంలోనే మేటిగా రాకెట్‌ స్పీడ్‌లో పరుగులు పెడుతోంది. కాని ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు కోట్లున్న భూముల ధరలు నాలుగు లక్షలకు పడిపోయాయి…ఉన్న రాజధాని పనికి రాకుండాపోతోంది…అభివృద్ధి కుంటుపడిరది. ఒకప్పుడు కర్నూలు రాజధానిగా డేరాలు వేసుకున్న కాలం కంటే అద్వాహ్నంగా తయారౌతోంది….ఇప్పుడు మళ్లీ ఒక్క ఆంధ్రతో అరవైఏళ్ల కాలానికి వెళ్లిపోయాం…? అరవైఏళ్ల పాటు ఎంత తొక్కేసినా, తెలంగాణ వచ్చిన మూడేళ్లలోనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ సమర్ధవంతమైన నాయకత్వంలో తెలంగాణ మురిసింది…ఎనమిదేళ్లలో ఎక్కడికో వెళ్లిపోయింది….ఉమ్మడి రాష్ట్రంలో ఊహించలేని పనులన్నీ పూర్తి చేసుకుంటూ నెంబర్‌ వన్‌ రాష్ట్రమౌతోంది…ఎండబెట్టిన తెలంగాణలో ఏరుల్లో నీటి పరవళ్లు వయ్యారాలు పోతున్నాయి….పండబెట్టిన తెలంగాణను పచ్చగ చేసుకున్నారు…ప్రాజెక్టులు కట్టుకున్నారు..రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. కాలువలు తవ్వుకున్నారు…కాళేశ్వరం కట్టుకున్నారు. తెలంగాణలో ఏదైతే సాద్యం కాదని అవరవైఏళ్లపాటు మోసం చేశారో…ఆ తెలంగాణ మొత్తం ప్రాజెక్టులతో కళకళలాడేలా చేసుకున్నరు…సిరుల తెలంగాణ చేసుకున్నరు…! కాని విడిపోయి పోలవరం కట్టుకోలేకపోతున్నమని సీమాంధ్ర నేతులు కుమిలిపోతున్నారు…పచ్చగా వున్న కాడ తినడం…ఎచ్చగా ఉన్న కాడం పండుకోవడం అలవాటైన సీమాంధ్ర నాయకత్వం భరించలేకపోతోంది…తెలంగాణ ప్రగతిని ఓర్వలేకపోతోంది…! అరవై ఏళ్లు చీకట్లు చేసినా, తెలంగాణ తెచ్చుకొని మూడు నెలల్లో వెలుగులు నింపుకున్నరు..మూడేళ్లలో రైతాంగానికి ఇరవై నాలుగు గంటల ఉచితం కరంటు ఇచ్చుకుంటున్నరు…! కాని సీమాంధ్రలో కోతలు చూస్తున్నారు..ఉడకపోతలో బతుకులు వెల్లదీస్తున్నరు…కళ్లలో మంటలు నింపుకుంటున్నరు…తెలంగాణను చూసి నిప్పులు పోసుకుంటున్నారు…అందుకే మళ్లీ తెలంగాణ మీద పెత్తనం కోసం పాకులాడుతున్నారు…

తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణలోనే మళ్లీ ముసలం పుట్టిస్తామని ఎనమిదేళ్ల కిందనే నాటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఒకనాడు విడిపోయిన తూర్పు, పశ్చిమ జర్మనీ దేశాలే కలుస్తన్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కారు..రెండు దేశాల మధ్య వున్న బెర్లిన్‌ గోడలను ప్రజలే బద్దలు కొడుతున్నారంటూ రాళ్లు తెచ్చి చూపించారు…ఆనాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోనే హడావుడి చేశారు…ఏనాటికైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లు కలుస్తాయంటూ చెప్పుకున్నారు. కుటిలత్వం నిండిన నాయకులు ఖాళీగా వుంటే కుత్సిత బుద్ధిని ఎలా ప్రదర్శించాలో ఆలోచిస్తుంటారు….కొట్లాడే తత్వం లేకపోయినా, మోసాన్ని నమ్ముకుంటారు..! ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన మూడేళ్లకే తెలంగాణను అస్ధిర పర్చాలని చూశాడు…పిపిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో తెలంగాణ ప్రభుత్వాన్ని పడదోయాలని చూశాడు..ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారు. దాంతో తెలంగాణనుంచి చంద్రబాబు పారిపోయాడు…కాని తెలంగాణ మీద ఆశ చావలేదు…తెలంగాణ మీద ఆధిపత్యం మీద మోజు తీరలేదు…ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను ఎదుర్కొలేక, తెలంగాణలోనైనా చోటు కోసం నయవంచనను తెర తీస్తున్నాడు…అందుకు మళ్లీ పాతరాగం అందుకుంటున్నాడు…. తెలంగాణలో రాజకీయంగా అసంతృప్తి వాదులతో కొత్త రాజకీయం మొదలు పెట్టాడు…అటు రేవంత్‌ రెడ్డితో కాంగ్రెస్‌లో రాజకీయం మొదలుపెట్టి, ఇటు బిజేపితో కలిసి ఏక కాలంలో రెండు మూతుల పాము రాజకీయం నెరపాలనుకుంటున్నాడు…బిజేపితో కలిసి తెలంగాణ రాజకీయాలను అస్ధిరం చేయాలనుకుంటున్నాడు..అందుకు షర్మిల అడుగులతో ప్రయోగం చేశారు…ప్రజలు టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగ మారుతున్నారన్న భ్రమల్లో కళ్లు మూసుకొని పిల్లి పాలుతాగినట్లు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు….సీమాంధ్ర నుంచి తెలంగాణ విడిపోతే బతకలేదన్నారు…

నిజానికి తెలంగాణ లేకపోతే తాము బతకలేమని తెలుసుకున్నారు…భుజ్జగింపులు చేయాల్సిన సమయంలో గద్దింపులు మొదలుపెట్టారు…ఒత్తిడి రాజకీయాలే తెలంగాణ మీద ఎల్ల కాలం మేలనుకున్నారు…ఆఖరకు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమంటూ బెదిరింపులకు దిగారు…కాని తెగించి కొట్లాడే తెలంగాణ ముందు ఆ పిల్లిబిత్తిరి బెదిరింపులు పనిచేయలేదు…తెలంగాణ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు…అరవైఏళ్లపాలు ఎండబెట్టి, పండబెట్టి తెలంగాణ విడిపోతే బాగుపడదని, తొండలు గుడ్డు పెట్టే జాగలని ఎద్దేవా చేశారు…తెలంగాణను నైరాశ్యంలో పడేసే కుట్ర పెద్దఎత్తున చేశారు…కాని కలిసి తెలుగురాగం పంచుకోవాలని వాళ్ల రోగం మన మీద రద్దాలనే పదే పదే చూశారు…ఎన్నాళ్లకైనా తెలంగాణ విడిపోతుందని తెలిసే, తెలంగాణ నిధులన్నీ ఆంధ్రకు తరలించుకున్నారు. తెలంగాణలో పైసా ఖర్చు పెట్టకుండా, సీమాంధ్రలో వెలుగులు నింపుకున్నారు…తెలంగాణకు ద్రోహం చేస్తూనే వచ్చారు…కలిసి వున్నన్ని రోజులు వాళ్లు పచ్చగా వుంటూ, తెలంగాణను ఎండబెట్టారు…ఇప్పుడు వాళ్లు ఎండుతూ పచ్చగైన తెలంగాణను చూసి కుళ్లుకుంటున్నారు…మళ్లీ సమైక్యం పేరుతో నక్కల రాగం అందుకుంటున్నారు…తోడేళ్లలలా కాచుకు కూర్చుకుంటున్నారు…బిజేపితో కొత్త ఎత్తులకు తెరలేపి, ఆడా వుంటాం…ఈడా వుంటాం….తెలంగాణలో ఎన్టీఆర్‌ను దింపుతాం…సీమాంధ్రలో లోకేష్‌కు పట్టం…పేరుతో రామోజీరావుతో బిజేపి సరికొత్త రాజకీయం మొదలుపెట్టింది….తెలంగాణ ఇవ్వడమే ఇష్టం లేని బిజేపి, మునుగోడులో గెలిచి తెలంగాణ రాజకీయాలను అస్ధిరం చేయాలని చూస్తోంది…! ప్రతి తెలంగాణ వాది మళ్లీ అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది…మునుగోడులో ముంచాలని చూస్తున్న వారిని తరిమితే తప్ప…తెలంగాణ వైపు ఇక చూడకుండా వుండలేరు…టిఆర్‌ఎస్‌తో పెట్టుకుంటే రాజకీయాలు చేయలేమని తెలిసొచ్చేలా చేస్తే తప్ప, అనైతిక రాజకీయాలు ఆపలేరు…!

అమెరికా మిచిగాన్ సాగినా లో ఘనంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వేడుకలు

ఉత్తరమెరికా లోని మిచిగాన్ స్టేట్, సాగినా లో సాయిబాబా విగ్రహ వాయు ప్రతిష్ట చాలా ఘనంగా  వైభవంగా జరిగింది.

మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్ట కార్యక్రమం లో అఖండ దీపారాధన, అంకురార్పణ, పంచగవ్య ప్రాషణ, వాస్తు మంటపారాధన ల తో పాటు,

సాయిబాబా, దత్తాత్రేయ మరియు నవగ్రహ హోమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమాలన్నీ “బ్రహ్మశ్రీ” భాగవతుల యుగంధర శర్మ (కూచిపూడి) గారి ఆధ్వర్యం లో ముగ్గురు పూజారులు నిర్వహించారు.

విగ్రహ ప్రతిష్ట లో భాగంగా శ్రీ యుగంధర శర్మ గారు అలంకరించిన సర్వతో భద్రమండల సకల దేవతారాధన విశేషంగా ఆకట్టుకున్నాయి. శర్మ గారు హొమారాధనలో పాల్గొన్న భక్తులకు సంస్కృతం లోని వేద మంత్రాలను తెలుగు లో అనువదించడం చాలా అభినందనీయం.

మూడు రోజుల పాటు సాయి నామ కీర్తనలు, మంత్రోచ్చారణతో సాయి సమాజ్ ఆఫ్ సాగినా ప్రతిధ్వనించింది.  జనవరి లో కేవలం నలుగురు స్నేహితులు కలిసి ప్రారంభించిన సాయి బాబా ధ్యాన మందిరం ఎనిమిది నెలల్లో దేవాలయం గా రూపు దిద్దుకునేందుకు చాలా ఆనందంగా ఉందని సాయి సమాజ్ ఆఫ్ సాగినా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మురళీ గింజుపల్లి అభిప్రాయ పడ్డారు. ఈ ఆలయ నిర్వహణ లో ప్రతి రోజు సహకరించిన శ్రీనివాస్ వేమూరి, హరిచరణ్  మట్టుపల్లి, శ్రీధర్ గింజుపల్లి, సాంబశివరావు, కొర్రపాటి, లీలా పాలడుగు, లక్ష్మి మట్టుపల్లి మరియు కృష్ణ జన్మంచి ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ సాయి బాబా విగ్రహం ను తన స్వంత ఖర్చులతో రాజస్థాన్ నుంచి తెప్పించిన శ్రీ వేమూరి నీలిమ-శ్రీనివాస్ దంపతులకు భక్తులందరు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. ఇంకా డాక్టర్ గింజుపల్లి మాట్లాడుతూ, ఇక్కడ ప్రతి గురువారం ప్రవాస భారతీయులందరు కలిసి భక్తి శ్రద్దలతో  సాయిబాబా హారతులు మరియు భజనలు నిర్వహిస్తున్నామని,ప్రతిష్టాత్మక  కార్యక్రమం ఇంత వైభవం గా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ఉన్న పదిహేడు వేల చదరపు అడుగుల స్థలం లో భవిష్యత్తు లో ఉత్తర అమెరికా లోనే అతిపెద్ద సాయిబాబా ఆలయం నిర్మించే ఆలొచన లో ఉన్నామన్నారు. మూడు రోజుల ప్రతిష్ట కార్యక్రమం లో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం, సాయంత్రం సుమారు మూడు వందల మందికి అన్నదానం నిర్వహించారు.  అన్నదాన కార్యక్రమాన్ని శ్రీమతి నీలిమ శ్రీనివాస్ వేమూరి, సెల్వి విష్ణు కుమార్, తనూజ శ్రీనివాస్ వడ్డమాని, మోనికా మహేష్ భుతి, పల్లవి అమిత్ షహసానె, రోహిణి జితేంద్ర వైద్య, శుభ రఘు మెల్గిరి, కల్పన మురళీ తమ్మినాన, సుజని మురళీ గింజుపల్లి, హేమమాలిని మహేష్ సమతం మరియు నికిత రాహుల్ గుప్త నిర్వహించారు. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో మిచిగన్ లో స్థిరపడ్డ  భారత సంతతి వైద్యులు డాక్టర్ కె.పి. కరుణాకరన్-లక్ష్మి, రఘురాం సర్వేపల్లి, నరేంద్రకుమార్, కిశోర్ బాబు- సామ్రాజ్యం కొండపనేని, సుబ్బారావ్-వాణి శ్రీ చావలి, సుబ్రహ్మణ్యం-సుందర యాదం,అనిరుధ్-విద్య భండివార్, విజయా రావ్ ల తో పాటు డెట్రాయిట్, ఫ్లింట్, గ్రాండ్ రాపిడ్స్, మిడ్ ల్యాండ్, బేసిటి, సాగినా, కెనడా ల నుండి సుమారు ఐదు వందల మంది ప్రవాస భారతీయులు హజరయ్యారు.  సుపరిచయ సుప్రసిద్ధ గాయకుడు మనో గారు ఈ వేడుకలకు హాజరయ్యారు.  సుమారు ఎనిమిది వందల భక్తులు భక్తి శ్రద్దలతో పాల్గొని ఘనంగా మూడు రోజుల వేడుకలు సమాప్తమైనది.

ఉండి వెలగబెట్టిందేమీ- పోయి సాధించిందేమీ!!

`చెప్పుకోవడానికి పాత చరిత్ర తప్ప మిగిలిందేమీ!

`ఇప్పటికీ అదే చరిత్ర-దాన్ని చెప్పుకోకపోతే పూట గడవదు!

`పదే పదే పాత రోజులు చెప్పుకుంటే తప్ప మనుగడ లేదు…

`కాదని పోయినా పాత నీడ ఎక్కడా దొరకడం లేదు.

`కొత్త చోటులో అంత విలువ లేదు…

`గుర్తింపు దేవుడెరుగు…

`అప్పుడు తొందరపడ్డారు….

`ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు….

`అహం మింగిన రాజకీయంలో కొట్టుకుపోతూనే వున్నారు.

`నిలకడ లేని రాజకీయాలు కోరి కోరి తెచ్చుకున్నారు….

`అక్కడే వున్నా బాగుండేది…కనీసం చెప్పుకోవడానికి చరిత్రైనా మిగిలేది!

`ఇప్పుడు అదీ లేదు…ఇదీ లేదు!

`నాలుగు రోజులు పోతే ఈ మాత్రం రాజకీయం కూడా వుండదు!

`అంతే…చే జేతులా చేసుకున్నది…చెడగొట్టేదాకా వదలదు!

`చరిత్ర గతిలో కొత్త భవిష్యత్తుకు చోటే లేదు!

`పాతది గాయమనుకున్నారు…కొత్తది విషమని తెలిసి మింగేశారు!

`మింగలేక కక్కలేక కిక్కురు మనకుండా వున్నారు.

`నోరుకు పని చెప్పిన చోట నుంచి నోటికి కుట్టేయించుకునేదాకా!

తృప్తి లేని రాజకీయ జీవితానికి అన్నీ అసంతృప్తులే అని సామెత. తనకు దక్కాల్సినంత దక్కడం లేదన్నదే నిరంతరం మదిలో తపన పేరుకుపోతుంది. తమకు తాము ఎక్కువగా ఊహించుకునేవారికే ఇది ఎక్కువగా ఎదురౌతుంది. రాజకీయాలో అవకాశాలు కూడా ఓ అధ్భుతమే…అదృష్టమే…అది దక్కకపోతే తమను తాము నిందించుకోవాల్సిందిపోయి, ఎదుటి వారి మీద నిందలేసి ఏదో సాధించిన వారు ఎవరు లేరు? ఎంత సేపు ఇతరుల మీద నెపం నెట్టేయడానికి చేసే ప్రయత్నం తప్ప తమ ప్రయత్న లోపం గుర్తెరగరు. ఇదే చాలా మందికి శాపంగా మారుతోంది. అలా తమను తాము ఎంతో గొప్పగా ఊహించుకొని, ఎవరెస్టు శిఖరమంత ఎత్తనుకొని, ఆగమేఘాల మీద ఆవేశపడి కోరికోరి కష్టాలు తెచ్చుకున్నవారే ఎక్కువ. అలాంటి వారిలో టిఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిపోయిన నేతల్లో ఈ మనస్తత్వం ప్రస్పుటంగా కనిపిస్తుంది. వాళ్లు ఏదో ఒక పార్టీ పంచన వుంటే తప్ప నిలవలేరు. గెలవలేరు. కాని వారి గెలుపు, నాయకత్వ పటిమ మొత్తం వారి సొంతమనుకుంటారు. అలాంటి వారిలో టిఆర్‌ఎస్‌లో ఎంతో వెలుగు వెలిగి, ఆ పార్టీ నుంచి బైటకు వెళ్లి, గుడ్డిదీపమైన వాళ్లే ఎక్కువ. అలాంటి వారు కొద్దిగా ఓపిక పడితే వారికి ఎంతో రాజకీయ భవిష్యత్తు వుండేది. కాని చేజేతులా చేసుకున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. చెప్పుకోలేనంత అక్కసు నింపుకున్నారు. దాన్ని వెల్లగక్కుతున్నారే గాని, లోలోన మాత్రం మధనపడాల్సినంత మధనపడుతున్నారు. 

టిఆర్‌ఎస్‌లో వున్నప్పటి విలువకు ఇప్పుడున్న విలువను చూసుకుంటూ, కుమిలిపోతున్నారు. అలాంటి వారిలో ఒకప్పటి సిద్ధిపేట ఎంపిగా తెలుగుదేశం నుంచి గెలిచి, తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌తో కలసి టిఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యే, మంత్రి అయిన విజయరామారావు రాజకీయం ఇదే కోవకు వస్తుంది. ఎంతో నమ్మకంతో ఆయనపై వున్న విశ్వాసంతో విజయరామారావుకు కేసిఆర్‌ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి పోటీ చేయించారు. గెలిపించారు. 2004లో అప్పటి కాంగ్రెస్‌పార్టీ వైఎస్‌ ప్రభుత్వంలో టిఆర్‌ఎస్‌ భాగస్వామ్యమైన సందర్భంలో విజయరామారావును మంత్రిని చేశారు. తెలంగాణ విషయంలో నాడు అప్పటి మంత్రి ఎం. సత్యనారాయణ రావు చేసిన సవాలు ఓ వైపు, కేంద్రం తెలంగాణ విషయంలో చేస్తున్న జాప్యానికి నిరసనగా టిఆర్‌ఎస్‌ మంత్రులు ప్రభుత్వం నుంచి బైటకు వచ్చారు. కొంత కాలానికి అప్పటి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. మళ్లీ ఎన్నికల వెళ్లారు. దాదాపు 16 నెలల పాటు మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చినా, ఉద్యమ పార్టీలో వున్నా విజయరామారావు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో లేని రాజకీయం నెరిపారు. దాంతో ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో విజయరామారావు ఓడిపోయారు. 

అసంతృప్తిని నిండా నింపుకున్నారు. మళ్లీ ఇక ఎన్నికల్లో గెలిచింది లేదు. తన వ్యక్తిగత నాయకత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే యత్నంలో భాగంగా ఆయన ఉద్యమ నాయకుడైన కేసిఆర్‌ మీద అనవసర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తనకు ప్రాదాన్యత దక్కడం లేదన్న ఆలోచనతో పార్టీ వీడారు. అంతే తప్ప ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆయనను పక్కనపెట్టలేదు. ఇక చేయాల్సినంత రాజకీయ విన్యాసం చేస్తూ వచ్చారు. ప్రజల్లో చులకనయ్యారు. తెలంగాణ వాదులంతా నమ్మిన కేసిఆర్‌ దీక్షను కూడా పలుచన చేసే వ్యాఖ్యలు చేస్తూ, ఇటీవల ఆయనపై వున్న నమ్మకాన్ని కూడా మరింత పోగొట్టుకుంటూ, తనకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ మనసును సంతృప్తిపర్చుకుంటున్నాడు. ఇదే దారిలో మరో నాయకుడు వున్నారు. వికారాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌. ఆయనకు కూడా కేసిఆర్‌ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. కాని ఆయన కూడా దాన్ని నిలుపుకోలేదు. కాకపోతే ఆయనకు టిఆర్‌ఎస్‌ నుంచి దూరమయ్యాననే బాధ ఇప్పటికీ తొలుస్తున్నట్లే కనిపిస్తుంది. కాకపోతే ఎక్కడైనా బైట సభల్లో జనాన్ని చూసి చెప్పే మాటలకు, వ్యక్తిగత ఇంటర్యూల సమయంలో చెప్పే విషయాలకు చాలా తేడా చూపిస్తుంటాడు. పైకి ఎన్ని మాట్లాడుకున్నా, లోలోన తన మధనపడుతున్నట్లే కనిపిస్తుంటారు. కాని ఇప్పుడు మధనపడి ప్రయోజనం లేదు. కాలం కరిగిపోయాక ఆలోచించి వృధా! మరో ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌. నిజానికి ఉద్యమ సమయంలో ఒక అధికారిగా ఆయనకు కేసిఆర్‌ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత కల్పించారు. కేసిఆర్‌ కేంద్ర మంత్రిగా వున్న సమయంలో ఏమేం జరిగాయన్న వాటిని చెబుతూ, తనకు ఇచ్చిన ప్రాదాన్యతను గురించి గొప్పగానే చెప్పుకుంటారు. ఇక ప్రజారాజ్యం పార్టీ విషయంలో జరిగిన సంప్రదింపులకు కూడా తననే ముందు పెట్టాడని కూడా చెప్పుకుంటారు. 

అంత ప్రాదాన్యతనిచ్చిన కేసిఆర్‌ను ఎందుకు వీడాల్సివచ్చిందన్నదానికి మాత్రం స్పష్టమైన సమాధానం వారిలో లేదు. అంటే ప్రతీసారి తనకు పదవి ఇవ్వకపోవడమే తనకు జరిగిన అన్యాయమన్నది వారి మనసులో గూడుకట్టుకొని వుందన్నది మాత్రం బైట పెడుతుంటారు. తెలంగాణ ఉద్యమసమయంలో వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియెజవర్గ ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చారు. ఎమ్మెల్సీగా గెలిచారు. దిలీప్‌కుమార్‌ దురదృష్టం ఇక్కడ కూడా వెంటాడిరది. నాడు తీసిన లాటరీలో దిలీప్‌ కుమార్‌కు రెండేళ్ల సమయమే వచ్చింది. అయినా మళ్లీ కేసిఆర్‌ టిక్కెట్‌ ఇచ్చారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. గెలిచారు. కాని కొన్ని హద్దులు దాటారు. పార్టీకి దూరమయ్యారు. తన అహానికి బానిసై పార్టీని దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడా ప్రాధాన్యత లేక విలవిలలాడుతున్నాడు. ఇక మొన్నటికి మొన్న పార్టీకి దూరమైన వారిలో మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామీ గౌడ్‌. ఆయనకు పార్టీలో ఎనలేని ప్రాదాన్యతనిచ్చారు. ఉద్యోగిగా రిటైర్‌ అయిన తర్వాత వెంటనే ఎమ్మెల్సీని చేశారు. ఉద్యమ సమయంలో ఆయనపై ఉమ్మడి ప్రభుత్వం కక్ష్య కట్టిందని తెలిసి, ఎమ్మెల్సీని చేశారు. అప్పటి ప్రభుత్వం నుంచి ముప్పు తప్పించారు. ఇది మాత్రం స్వామి గౌడ్‌కు గుర్తులేదు. ఆయనపై అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు కూడా వున్నాయి. ఉద్యోగుల ఇంటి స్ధలాల గోల్‌ మాల్‌ కూడా ఆయన నెత్తిన పడిరది. ఆయన వల్ల నష్టపోయినట్లు ఎంతో మంది ఉద్యోగులు కూడా భహిరంగంగానే విమర్శలు చేశారు. కాని ఉద్యమకారుడిపై ప్రభుత్వం కక్ష్య కట్టిందని గ్రహించి, కేసిఆర్‌ ఆయనకు 2012లోనే ఎమ్మెల్సీని చేశారు. అంటే ఆయనకు ఎంత ప్రాధాన్యత దిక్కిందో అర్దం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ వచ్చాక, తొలి మండలి చైర్మన్‌గా స్వామీ గౌడ్‌కు అవకాశం కల్పించారు. చరిత్రలో స్దానం కల్పించారు. కాని అది ఆయన నిలుపుకోలేదు. మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేదని అసంతృప్తికి లోనయ్యారు. పార్టీనుంచి బైటకు వెళ్లిపోయారు. 

బిజేపిలో చేరారు. చేతులు కట్టుకొని కూర్చుకున్నారు. చెప్పుకోవడానికి గతం తప్ప వర్తమానం ఏమీ లేదు. భవిష్యత్తు ఎలా వుంటుందో అన్నది ఇప్పుడేం చెప్పుకునేటట్లు లేదు. ఇక రాములమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణ కోసం కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు వదలుకొని తెలంగాణ ఉద్యమంలో చేరింది. తల్లి తెలంగాణ అని రాజకీయ పార్టీ ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమ ఐక్యత కోసం టిఆర్‌ఎస్‌లో తన పార్టీని విలీనం చేసింది. అక్కడ కూడ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పాత్రను పోషించింది. కాని తర్వాత ఏం జరిగిందన్నదానిపై ఆమెకు కూడా పెద్దగా క్లారిటీ లేకుండాపోయింది. తనను పార్టీలో పొగబెడుతున్నారని అనుకున్నారు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌లో చేరారు. అక్కడా ఇమడలేకపోయారు. బిజేపి తీర్ధం పుచ్చుకున్నారు. పుట్టింటికి వెళ్లినంత సంతోషంగా వుందన్నారు. తాజాగా మళ్లీ బిజేపిలో కూడా తన పరిస్ధితి ఏమీ మారలేదన్న సంకేతాలు పంపారు. అంటే భూమి గుండ్రంగానే వుందన్న సంగతి గుర్తుకొచ్చే సరికి పుణ్యకాలం పూర్తయినట్లే కదా? లేడీ అమితాబ్‌ అని పేరు సంపాదించిన రాములమ్మకు బిజేపిలో కేంద్ర స్ధాయిలో ప్రాధాన్యత కల్పించాలి. కాని అక్కడా గుర్తింపు లేదు. ఇక్కడా గుర్తింపు లేదు. పార్టీలోకి ఆహ్వానించిన సమయంలో కొంత పార్టీ ప్రాధాన్యత కల్పించినట్లు కనిపించినా, ఇప్పుడు పార్టీలో ఆమెకు పెద్దగా ప్రాదాన్యం లేకుండాపోయిన విషయం ఆమె మీడియాతో పంచుకోవడంతో ఇతర పార్టీలలో వారికి ప్రాధాన్యత అన్నది మేడి పండులాంటిదే అన్నది అర్ధమైపోయిందన్న తెలుస్తోంది. 

మరో ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌ అయిన దాసోజు శ్రమణ్‌. ఆయనకు టిఆర్‌ఎస్‌లో వున్నంత కాలం ఎంతో ప్రాధాన్యత వుండేది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమ సమయంలో డిల్లీకి వెళ్లిన ప్రతి సందర్భంలోనూ దాసోజును వెంటబెట్టుకొని వేళ్లేవారు. కేసిఆర్‌ ఎంత కాలం డిల్లీలో వుంటే అంత కాలం ఆయనను కూడా డిల్లీలో వుండేవారు. కొన్ని వందల సార్లు డిల్లీ పర్యటనల్లో దాసోజు కేసిఆర్‌ వెంటే వున్నారు. అంతటి ప్రాధాన్యతనిచ్చారు. అది ఆయన గొప్పదనంగా దాసోజు శ్రమణ్‌ అనుకున్నారు. తనకు ఎనలేని ప్రాధాన్యత కేసిఆర్‌ కల్పిస్తున్నారని అనుకోలేదు. దాంతో తనలోని అహాం బైటకు వచ్చింది. నేనింత కొట్లాడిన నాకు టిక్కెట్టు ఇవ్వరా? అని మధిపోరాటం ఆయనలో మొదలైంది. 2014లో అవకాశం రాలేదన్న కోపం ఆయనను పార్టీకి దూరం చేసింది. ఆ సమయంలో కొద్ది ఓపిక ఆయనకు వుంటే ఈ రోజు పార్టీలో ఎంతో క్రియాశీలకపాత్రలో వుండేవారు. ఇదే సమయంలో కర్నె ప్రభాకర్‌ లాంటి నాయకుడు ఎంతో లౌక్యంతో మొదిలారు. ఆయనకు ఎమ్మెల్సీగా తర్వాత కాలంలో అవకాశం దక్కించుకున్నారు. దాసోజు కూడా కొద్దిగా ఓపిక తెచ్చుకొని కొన్ని రోజులు అసంతృప్తికి కళ్లేమేస్తే పోయింది. గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నాడు. తనను తానుగా పార్టీ నుంచి బైటకు వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీకి ఐదారేళ్లు సేవ చేశాడు. అక్కడ కూడా అసంతృప్తిని భరించలేక బిజేపిలో చేరారు. అక్కడేమైనా వుందా? అక్కడ ఆ మాత్రం కూడా గౌరవం లేకుండాపోయింది. ఆయననను పట్టించుకున్నవారు లేకుండాపోయారు. కనీసం కాంగ్రెస్‌లో వున్నా ఏదో ఒక ప్రాధాన్యత వుండేది. ఏకంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీదే మాట్లాడితే మరింత ప్రాధాన్యత కల్గుతుందనుకున్నాడు. నాలుగు రోజులు మీడియా హడావుడిలో కనిపించి, ఇప్పుడు కనీసం తన మాటకు విలువ లేకుండా చేసుకున్నాడు. ఇలా ఇంకా చాలా మంది వున్నారు. కేసిఆర్‌ మీద అలిగి వెళ్లిన వాళ్లు, ఎన్ని పార్టీలు తిరిగినా, టిఆర్‌ఎస్‌లో అనుభవించినంత స్వేచ్ఛ ఎక్కడా లేక, ఇప్పుడు చింతిస్తున్నారు…మళ్లీ టిఆర్‌ఎస్‌ చెంతకు చేరేందుకు తహతహలాడుతున్నారు. కాని పుణ్యకాలం ఏనాడో వెళ్లిపోయంది. ఎక్కాల్సిన రైలు ఒక జీవితం కాలం లేటు అన్న సామెతను గుర్తు చేసుకునే రాజకీయం జీవితానికి ఎదురెళ్లి కోరి కోరి తెచ్చుకున్నారు…లేని గొప్పదనపు చట్రంలో ఇరుక్కుపోయారు… తమకు తామే పద్మవ్యూహాన్ని పన్నుకొని బైటకు రాలేకపోతున్నారు.

ఏది సత్యం! ఏదసత్యం!?

ఒక మాట- రెండు నాలుకలు.

క్లారిటీ ప్లీజ్‌ మంత్రి షెకావత్‌!?

కాళేశ్వరంపై పార్లమెంటు లో ఇచ్చిన సమాధానం అబద్దమా?

తాజాగా చేసిన వ్యాఖ్యలు నిజమా?

ఆ మాటేదో పార్లమెంటులో ఎందుకు చెప్పలేదు?

మునుగోడు ఉప ఎన్నికలను దృష్టిలో అబద్దాలు చెప్పడం భావ్యమా?

పార్లమెంటు లో చెప్పింది అబద్దమని ప్రకటించండి?

దేనికైనా నిజం ముఖ్యం!

అబద్దాలతో ఎల్లకాలం నమ్మించలేరు!

చెప్పే మాట, వేసే అడుగులో నిజముండాలి. నిజాయితీ వుండాలి. రాజకీయ నాయకులైతే సిద్ధాంతాలను అనుసరించి వుండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మ ప్రభోదం కూడా నిజమే చెప్పగలగాలి. కాని ఏ ఎండకాగొడుగు పట్టే రాజకీయాలు ఈ మధ్య నాయకులకు బాగా అలవాటైపోతున్నాయి. గతంలో ఎప్పుడు చెప్పుకున్నా కూడా నాయకులు చెప్పిన మాట మీద నిలబడరు అనే వారే కాని, మభ్యపెట్టే అబద్దాలు ఆడరని అనుకునేవారు. కాని ఈ తరం రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయాయనే చెప్పాలి. లేకుంటే పార్లమెంటులో చెప్పే మాటలకు, బైట చెప్పే మాటలకు తేడా ఎందుకుంటుంది? తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ మాట్లాడిన మాటలు వింటే విచిత్రమనిపిస్తుంది. తెలంగాణలో ఎంతో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గతంలో అనేక సార్లు పార్లమెంటులో ప్రస్తావన వచ్చింది. కాంగ్రెస్‌ ఎంపిలు, బిజేపి ఎంపిలు అనేక సార్లు దీనిపై పార్లమెంటులో ప్రస్తావించారు. ప్రశ్నల రూపంలో కూడా అడిగారు. కేంద్రం ప్రభుత్వం అనేక సార్లు రాత పూర్వక సమాధానం కూడా చెప్పింది. అంతే కాదు తాజాగా కూడా నిజామాబాద్‌ ఎంపి అరవింద్‌ ఒకసారి, కాంగ్రెస్‌ పార్టీ పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు, మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికూడా పార్లమెంటులో ఈ ప్రశ్నను లేవదీశారు. అప్పుడు కూడా కాళేశ్వరంలో ఎలాంటి అవకతవకలు జరగలేదనే సమాధనం సూటిగా స్పష్టంగా ఇదే గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమాధానం చెప్పారు. దాంతో బిజేపి, కాంగ్రెస్‌ వాళ్లు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారం అని అనేక సార్లు తేలిపోయింది. అదేమిటో గాని తాజాగా అదే కేంద్ర మంత్రి కాళేశ్వరంలో అవకతకలు జరిగాయని అన్నారు. ఇదేం విచిత్రమో ఎవరికీ అర్ధం కాలేదు. గతంలో కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలోని టిఆర్‌ఎస్‌ పాలన భేషుగ్గా వుందని కితాబిచ్చినవాళ్లే అందరూ. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరధలను ప్రశంసించిన వాళ్లే…కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను పొగిన వాళ్లే…కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడిన వాళ్లే…ఇప్పుడు కొత్త రాగం అందుకోవడం వింతగా వుంది. అంటే గతంలో గజేంద్ర సింగ్‌ షెకావత్‌తోపాటు, ఇతర కేంద్ర మంత్రులందరూ చెప్పిన మాటలు నిజమా? తాజాగా చెబుతున్న మాటలు అబద్దమా? పార్లమెంటులో అధికార సమాచారం ఇచ్చిన కేంద్ర మంత్రులు చెప్పిన మాటలు అబద్దమా? ఇప్పుడు బైట చెబుతున్న మాటలు నిజమా? ఏది నిజం? ఏది అబద్దం? మునుగోడు ఉప ఎన్నికల్లో అలా చెప్పకపోతే మునిగిపోతామని కాళేశ్వరం మీద బాధ్యత కల్గిన కేంద్ర పెద్దలు ఇలా చెప్పడం సబబేనా అన్నది చర్చ రాష్ట్రంలో జరగుతోంది.

కేంద్రంలో కూడా ఈ చర్చకు ఆస్కారమేర్పడిరది. పవిత్రమైన పార్లమెంటులో చెప్పిన మాటలకు, బైట చెప్పిన మాటలకు పొంతన లేకపోతే బిజేపి నాయకులు చెప్పే మాటల్లో ఏది నిజమో! ఏది అబద్దమో!! తెలుసుకోవడం ఆ పార్టీ నేతలకు కూడా ఇబ్బందే అవుతుంది. ఇప్పటికే మునుగోడు విషయంలో బిజేపి పులి మీద స్వారీ చేస్తోంది. అక్కడ బలం లేదని తెలిసినా, పార్టీ బలంగా లేదని తెలిసినా రాజగోపాల్‌ను చేర్చుకొని, నిన్నటిదాకా వచ్చిన క్రెడిట్‌ను చేజేతులా గంగలో కలుపుకునే స్వయంకృతాపరాధం బిజేపినే చేస్తోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇది బిజేపికి ఎప్పటికీ మంచిది కాదు. నిజానికి బిజేపి దక్షిణాదిలో పాగా వేయాలంటే ఆయా రాష్ట్రాల ప్రగతికి తోడ్పాటునందించాలి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి. పాలమూరు`రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేయాలి. ఈ మధ్య ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. ఆ విషయం గురించి ఆలోచించి సాయం అందిస్తామని చెప్పి, పాజిటివ్‌ ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సిన సమయంలో రాష్ట్ర ప్రాజెక్టులకు మోకాలడ్డుతూ ఎన్నికల్లో గెలవాలని చూస్తే ప్రజలు స్వాగతిస్తారా? ఇప్పటికే దిక్షణాదిపై బిజేపి శీత కన్ను వేసిందన్న వాదన బలంగా వున్నదే. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణకు ప్రధాన శత్రువు ప్రధానే అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నదే…మరి అలాంటి సమయంలో కూడా రాష్ట్రానికి తాము మేలు చేసే ప్రయత్నంలోనే వున్నామని నిరూపించుకోవాల్సిన తరుణంలో ఇంకా కోడి గుడ్డు మీద ఈకలు పీకే రాజకీయాలే చేస్తామంటూ తెలంగాణ ప్రజలు అంత తొందరగా బిజేపిని నమ్ముతారని మాత్రం అనుకోలేం…! ఇప్పటికైనా రాష్ట్ర బిజేపి నాయకులు నిజం చెబుతున్నారా? అబద్దాలు చెబుతున్నారా? వారి మాటలను నమ్మి కేంద్ర పెద్దలు ఏం మాట్లాడాలన్నది విశ్లేషించుకొని మాట్లాడితే ఎంతో బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

మునుగోడు బడుగులకిస్తే ఒప్పుకోం?

మునుగోడు బడుగులకిస్తే సహించం? రెడ్డి నేతల రహస్య సమాలోచనలు!

కాంగ్రెస్‌లో ఉన్నత వర్గాల సామాజిక వర్గాల ఐక్య సమావేశం?

హైదరాబాద్‌లో రహస్యంగా చర్యలు?

రాత్రికి రాత్రే హైదరాబాద్‌ చేరుకున్న జిల్లాల నేతలు?

మునుగోడు అయితే పాల్వాయి శ్రవంతికే ఇవ్వాలని కొందరి డిమాండ్‌?

రేవంత్‌ రెడ్డి బడుగుల వైపు అడుగులేస్తున్నట్లు తెలియగానే అలెర్టు?

ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు సై అంటున్న నేతలు?

రేవంత్‌ రెడ్డిని మరింత ఉక్కిరిబిక్కిరి చేయాలని రెడ్డి సామాజిక వర్గ నేతలు?

మునుగోడులో పట్టుమని 10వేలు లేని రెడ్డి ఓటర్లు?

మూడు పార్టీలు చీల్చుకుంటే మిగిలేది మూడు వేలు?

అయినా ఎంతో ధీమాతో వున్న రెడ్డి నేతలు?

వారిలో వున్న ఐక్యత బడుగు నేతల్లో లేదా?

అందరం కలిసి సహకరించుకుందామని బడుగు నేతలు ఏకతాటిపైకి రాలేరా?

కాంగ్రెస్‌లో రెడ్డి రాజ్యం సాగాల్సిందేనా?

మునుగోడులో బడుగు నేతలకు టిక్కెట్టు ఇస్తే మేం సహించం…మేం సహకరించం? మేం వారి తరుపున ప్రచారం చేయం? అవసరమైతే తిరుగుబాటు జెండా ఎగరేస్తాం? ఏకంగా పిపిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డినైనా ఇరుకున పెడదాం…ఎట్టిపరిస్ధితుల్లో మునుగోడులో కొత్తగా పార్టీలోకి చేరిన బడుగు నేతలకు టిక్కెట్టు ఇస్తే సహించేది లేదు? ఇదంతా ఎవరో అంటున్న మాట కాదు…కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లమని చెప్పుకునే కొంత మంది ఉన్నత సామాజిక వర్గానికి చెందిన నేతలు చేస్తున్న హడావుడి. చెబుతున్న మాటల సందడి. కలసి ఐక్యతా రాగం ఆలపిస్తున్న నేతల మాటలవి. ఎట్టిపరిస్ధితుల్లోనైనా మునుగోడులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకే ఇవ్వాలి. అందులో మునుగోడు మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె శ్రవంతికే ఇవ్వాలని పట్టుబడుదామని ఐక్యతా రాగం వినిపిస్తున్నారు. 

మునుగోడులో కనిపిస్తున్న మసలానికి ఎక్కడో అక్కడ పుల్‌ స్టాప్‌ పెట్టాలంటే ఆధిపత్య రాజకీయాలకన్నా, బడుగుల టిక్కెట్టు ఇస్తే బాగుంటుందని రేవంత్‌రెడ్డి ఆలోచించినట్లు తెలుస్తోంది. అందుకోసం ఇటీవల కొత్తగా పార్టీలోకి వచ్చిన తెలంగాణ ఉద్యమకారుడైన చెరుకు సుధాకర్‌ గౌడ్‌కు వైపు మొగ్గు చూపుతున్నట్లు కొంత ప్రచారం సాగుతోంది. మరో వైపు ఒక వేళ చెరుకు సుధాకర్‌ కొత్తగా పార్టీలోకి చేరారన్నదే అభ్యంతరమైతే తెలంగాణ జర్నలిస్టు నాయకుడుగా గుర్తింపు వున్న పల్లె రవికుమార్‌కు ఇస్తే ఎలా వుంటుందన్నది కూడా చర్చలో వున్నట్లు తెలుస్తోంది. ఆయననైతే ప్రశ్నించేవారు వుండకపోవచ్చు అన్న అంచనాతో రేవంత్‌ ఆలోచించినట్లు సమాచారం. అయితే మనం ఇలాగే ఆలస్యం చేసినా, చూస్తూ ఊరుకున్నా రేవంత్‌ రెడ్డి తన ఇష్టమైన రాజకీయాన్ని ఆడేందుకు ఎత్తుగడలు వేస్తాడని ఉన్నత సామాజిక వర్గ నేతలు అనుకుంటున్నారట. అందుకే తెలంగాణలో వివిధ జిల్లాల్లో బలమైన నేతలుగా వున్న రెడ్డి, వెలమ సామాజికవర్గ నేతలు కొందరు గురువారం హైదరాబాద్‌లో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. జిల్లాల నుంచి నాయకులు ఉదయమే హైదరాబాద్‌ చేరుకుంటే కొందరు నిన్ననే చేరుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాళ్లంతా ఓ హోటల్‌లో గురువారం సుధీర్ఘ మంతానాలు జరిపినట్లు చెప్పుకుంటున్నారు. ఆఖరకు మనలో మనుకు ఎవరికిచ్చినా సరేగాని, బడుగు నేతలకు ఇస్తే ఇక మునుగోడు మన చేతిలో వుండదన్న నిర్ణయానికి కూడా వచ్చారట. మొన్న జరిగిన చండూరు సభకు అవసమైన నిధులు సమకూర్చిన నేత వైపు కూడా పిపిసి అధ్యక్షుడు రేవంత్‌ కొంత మొగ్గు వున్నట్లు కూడా తెలుస్తోంది. అదే నిజమైతే ఆయన కూడా పైకి బడుగుల రాగం జపించి, పార్టీలో ఒత్తిడిని ముందుపెట్టి మళ్లీ రెడ్డిలకే టిక్కెట్టు కట్టబెట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. మునుగోడు చేజారొద్దంటే రెడ్డిలంతా ఏకతాటిపై వుండాలన్న సమ్మతిలోనే వున్నట్లు చెప్పుకుంటున్నారు.

ముందే తెలిసి కుంపటి మొదలుపెట్టిన నేతగా మర్రి శశిధర్‌రెడ్డితో కూడా మునుగోడు నేతల కంటే ముందే ఆయన కూడా నోరు విప్పారంటున్నారు. నిజానికి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓసారి పరిశీలిస్తే, రేవంత్‌ రెడ్డి పార్టీలోని అసమ్మతి, కోవర్టు నేతల గురించి మాట్లాడి చాలా కాలమైంది. పైగా హోంగార్డులన్న మాట కూడా వారం రోజులు దాటిపోయింది. మరి ఇప్పుడు సడన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి ఎందుకు తెరమీదకు వచ్చారన్నది కూడా తెలియాల్సివుంది. తెలంగాణ, ఆంధ్రప్రాంతాలు కలిసిన నాడు పెద్ద మనుషుల ఒప్పందంలో కీలక భూమిక పోషించిన నాయకుడు చెన్నారెడ్డి. అలాంటి నాయకుడు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోలేదు. అయినంత మాత్రాన మర్రిచెన్నారెడ్డి పార్టీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 1978, 1989 రెండుసార్లు పార్టీ ప్రెసిడెంటుగా వుండి రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా చెన్నారెడ్డిది. అలాంటి నాయకుడికి కూడా పట్టుమని రెండుసార్లు ఏడాది కాలం కూడా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోనివ్వలేదు. కాంగ్రెస్‌లో చీలిక వస్తే, ఇందిరా గాంధీకి సపోర్టుగా నిలిచి, పార్టీని గెలిపించిన నాయకుడు. చెన్నారెడ్డికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినా ఆయన ఆఖరు వరకు కాంగ్రెస్‌లోనేవున్నారు. ఇలా శశిధర్‌రెడ్డిలాగా ఏనాడు పార్టీమీద మాట్లాడలేదు. చెన్నారెడ్డి మీద వున్న గౌరవంతో శశిధర్‌రెడ్డికి కూడా కాంగ్రెస్‌లో ఎంతో ప్రాధాన్యత కల్పించింది. మంత్రిగా అవకాశం కల్పించింది. యూపిఏ ప్రభుత్వంలో సుమారు ఎనమిదేళ్లు ఆయనకు కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్ధ వైస్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించి గౌరవించింది. మరి అలాంటిపార్టీని వదిలేసే ఆలోచన చేస్తున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

ఇలా అగ్ర కుల నేతలు తమకు రాజకీయం అనుకూలమైతేనే కొనసాగుతాం… పెత్తనమంతా మాకే ఇస్తేనే కాంగ్రెస్‌లో వుంటాం ..లేకుంటే మా దారి మేం చూసుకుంటాం!…బడుగులను మా నెత్తిన పెడితే ఊరుకోమన్నంత రాజకీయాలు చేస్తుంటే కూడా బడుగు నేతలు సైలెంటుగా వుండడం కూడా సరైంది కాదు. మొన్నటిదాకా అద్దంకి దయాకర్‌ను ఎంత వేపుకు తినాలో అంత వేపుకుతిన్నారు. ఆయనను ఏకంగా పార్టీ నుంచి పంపిస్తే తప్ప తాను కాంగ్రెస్‌ గురించి ఆలోచించనని వెంకటరెడ్డి తెగేసి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. ఇప్పుడు ఇతర రెడ్డి నేతలు మునుగోడు బడుగులకిస్తే ఊరుకోమంటున్నారు. అంటే కాంగ్రెస్‌లో రెడ్డి రాజ్యమే కొనసాగాలా? బడుగులకు టిక్కెట్టు ఇస్తే సహకరించలేరా? అసలు పట్టుమని మునుగోడులో పది వేల మంది ఓట్లు లేని రెడ్డి నేతలే ఇంతగా ఐక్యత ప్రదర్శిస్తుంటే, 2లక్షల 40వేల ఓటర్లలో మెజార్టీ ఓట్లన్నీ కలిగి వున్న బడుగు నేతల్లో ఎంత ఐక్యత వుండాలి. ఇప్పటికైనా బడుగు నేతలు విభేదాలు మాని, ఐక్యత కనబర్చితే తప్ప, మునుగోడులో బిసిల నాయకత్వం చెల్లుబాటు కాదు…ఆలోచించుకోండి!

చెరుకువైపే కాంగ్రెస్‌ మొగ్గు!

బడుగుల రాజకీయాలే మునుగోడులో మేలు

ఉద్యమ కారుడు, పిడి ఆక్ట్‌ ఎదుర్కొని జైలు జీవితం అనుభవించిన నాయకుడు చెరుకు

గౌడ్‌లను అణచి వేశారన్న చోటే నిలబెట్టాలని రేవంత్‌ నిర్ణయం

బడుగుల ఐక్యతతో గట్టెక్కాలని రేవంత్‌ తాపత్రయం!

సరికొత్త రాజకీయానికి తెరతీయాలని ఆలోచన

హుజూరాబాద్‌ లో ఈటెల ఆత్మ గౌరవం ఇక్కడ చెరుకుతో కాంగ్రెస్‌ కు అనుకూలం…

రెడ్డి, రెడ్డి మధ్య బిసితో గెలవాలని పద్మవ్యూహం పన్నుతోన్న కాంగ్రెస్‌

టిఆర్‌ఎస్‌, బిజేపిలు పునరాలోచన పడేలా కాంగ్రెస్‌ ఎత్తు!

టిఆర్‌ఎస్‌ అన్ని సర్వేలలో మొదటి వరుసలో వుంది…కూసుకుంట్లకు ఇవ్వకుంటే..నే!?

కాంగ్రెస్‌ నిర్ణయం తో మునుగోడు ఎటు మలుపు తిరిగేనో…

హైదరాబాద్‌,నేటిధాత్రి: ఓ వైపు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతున్నా, మరో వైపు ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ముందు బిజపి, టిఆర్‌ఎస్‌లను రెచ్చగొట్టి, తమకు తామే ఏదో సంక్షోభంలో వున్నట్లు వాతావరణం సృష్టించి, మునుగోడులో పద్మవ్యూహం పన్నేలా వుంది. అందుకు మునుగోడులో బడుగుల రాగం అందుకునేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇటీవలే కాంగ్రెస్‌పార్టీలో పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌ సమక్షంలోనే తన ఇంటిపార్టీని సైతం విలీనం చేస్తూ, చెరుకు సుధాకర్‌ గౌడ్‌ చేరారు. అప్పటికే ఆయనకు ఒక ముందస్తు హమీ కూడా లభించినట్లే కనిపిస్తోంది. అయితే తాజాగా మూడు నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మాజీ ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్‌ సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశానికి చెరుకు ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ సమయంలోనే తన భావాలను కూడా చెరుకు సుధాకర్‌ మీడియాతో పంచుకున్నారు. పరోక్షంగా తనకే సీటు అన్నది ఒక రకంగా చెప్పకనే చెప్పేశారు. ఆ మరునాడే చెరుకు సుధాకర్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చురకలు కూడా అంటించారు. అంటే తనను పార్టీ గుర్తించిందని చెప్పకనే చెప్పినట్లైంది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే బడుగులు ఏకతాటి మీదకు రావాలన్న సమావేశాలు కూడా ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. మొత్తంగా నల్లగొండ కాంగ్రెస్‌ రాజకీయమంతా ఓ వైపు వెంకటరెడ్డికి ప్రాధాన్యతనిస్తున్నట్లే పైకి కనిపిస్తున్నా, లోలోన ఎలా ఆయనకు చెక్‌ పెట్టాలన్నదానిపై ముమ్మర కసరత్తు జరుగుతోంది

రాజగోపాల్‌రెడ్డి వెళ్తున్నాడని తెలిసినా, ఆయన గత మూడేళ్లుగా బిజేపిపాట పాడుతున్నప్పటికీ వెంకటరెడ్డి ఏనాడు ఆపే ప్రయత్నం చేయలేదు. కనీసం తమ్ముడికి సూచించినట్లు కూడా దాఖలాలు లేవు. ఇదిలా వుంటే దేశమంతా కాంగ్రెస్‌ పార్టీ గత కొంత కాలం నిరసన కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడుతోంది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతోపాటు, రాహుల్‌ గాంధీని సైతం ఈడి. గంటల కొద్దీ కూర్చోబెట్టి విచారణ చేపట్టింది. దీనిపై దేశం మొత్తం కాంగ్రెస్‌ పార్టీ భగ్గుమన్నది. ఎక్కడిక్కడ దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిపింది. సాక్ష్యాత్తు డిల్లీలో కూడా కాంగ్రెస్‌ పార్టీపెద్దఎత్తున నిరసన చేపట్టింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిల్లీలో వున్నా, పార్లమెంటు సమావేశాలకు హజరౌతున్నా, కాంగ్రెస్‌తో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదు. ఎక్కడా ఆయన కనిపించలేదు. కాని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కలిసినేందుకు నిత్యం ఆయన పడిగాపులు పడ్డాడని మాత్రం తేలిపోయింది. ఇటు రాష్ట్రానికి వచ్చాక కూడా ఆయన కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన తిరంగా ర్యాలీలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించలేదు. కాంగ్రెస్‌ శ్రేణులు చేపట్టిన ర్యాలీలలో ఆయన పాల్గొనలేదు. కాని తమ్ముడి విషయంలో తనను రకరకాలుగా కాంగ్రెస్‌ శ్రేణులు తిడుతున్నాయంటూ, తాను మనస్తాపానికి గురైనట్లు మాత్రం ప్రకటించుకుంటూ వస్తున్నారు. అసలు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అన్నది ఒక్క కోమటి రెడ్డి సోదరులకేనా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం తాను వెంకటరెడ్డి విషయంలో మాట్లాడిన ప్రతి మాటను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. పైగా భేషరుతుగా క్షమాపణ కూడా చెబుతున్నట్లు వెల్లడిరచారు. తాను కరోనాతో బాధపడుతున్నా, పార్టీలో జరుగుతున్న చర్చకు పుల్‌ స్టాప్‌ పెట్టాలని, వెంకటరెడ్డి పార్టీ కోసం పని చేయాలని కోరుకుంటున్నట్లు కూడా రేవంత్‌ చెప్పాడు. ఇక ఆయనతోపాటు చండూరు సభలో తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని, క్షమించమని అద్దంకి దయాకర్‌ ఇప్పటికే పలు మార్లు చెప్పడం జరిగింది. అయినా మనసు కరగని వెంకటరెడ్డి తెగేదాకా లాగుదామనే చూస్తున్నాడు. ఇక్కడ తెగిపోతే గాని ఆయన పార్టీ మారేందుకు అవకాశం రాదు…సందర్భం కనిపించదు. అందుకే తాను పార్టీలోనే వుంటానంటూ ఓ వైపు సన్నాయి నొక్కులు నొక్కుతూనే, మరో వైపు పార్టీ గురించి శల్య సారధ్యం వహిస్తున్నాడు. కాంగ్రెస్‌పార్టీకి దళితులను దూరం చేసే కుట్రను చేస్తున్నాడు. ఇది కాంగ్రెస్‌ పార్టీ గమనించింది. ముఖ్యంగా రేవంత్‌ రెడ్డికి కూడా తత్వం బోధపడిరది. అద్దంకి దయాకర్‌ వెంట పెద్దఎత్తున మాల మహానాడు నాయకులు వున్నారు. ఆ వర్గం ఆయనకు అండగా నిలబడిరది. అలాంటి నాయకుడిని కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేస్తే దళితులు దూరమౌతారన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎత్తుగడ. అది పరోక్షంగా అటు బిజేపికిగాని, ఇటు టిఆర్‌ఎస్‌కు గాని ఉపయోపడితే చాలు అన్నంతగా ఆయన రాజకీయం చేస్తున్నారన్నది అర్దమౌతోంది. అందుకు రేవంత్‌ కొత్త ఎత్తుగడలు వేస్తున్నాడు. మునుగోడులో ఎలాగైన కోమటిరెడ్డి బ్రదర్స్‌ చేతిలో రాజకీయంగా బలైన కులంగా గౌడ సామాజికవర్గ నేతలంతా వారిపై కత్తికట్టారు. ఇదే సరైన అదును అనుకొనే రేవంత్‌ కొత్తగా మునుగోడు బరిలో చెరకు సుధాకర్‌ను తెరమీదకు తేవాలని చూస్తున్నట్లు స్పష్టమౌతోంది. ఎక్కడైతే గౌడ్‌లను కోమటిరెడ్డి సోదరులు గౌడ్‌ల నాయకత్వాన్ని అణచి వేశారో అక్కడే ఆ సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తే, కోమటిరెడ్డి సోదరుల హవాను పూర్తిగా తగ్గించినట్లౌవుంది. వెంకటరెడ్డికి కూడా పొగ పెట్టినట్లౌతుంది. వెంకటరెడ్డి నోటి దూల కూడా ఎంత దూరం తేవాల్నో అంత దూరం తెచ్చి ఒంటరిని చేసేస్తుంది. దాని వల్ల పార్టీలో చాలా మంది నేతలు సంతోషిస్తారనేదికూడా ఓ చర్చ జోరుగానే సాగుతోంది. 

చెరుకు సుధాకర్‌ గౌడ్‌ ఒకప్పుడు టిఆర్‌ఎస్‌లో కీలకభూమికపోషించిన ఉద్యమ కారుడే. ఆ పార్టీ పోలిట్‌ బ్యూరోసభ్యుడుగా కూడా కొనసాగాడు. కాకపోతే ఆయనపై పిడియాక్ట్‌ నమోదు చేసిన తర్వాత ఆ పార్టీ తనపై చూపించాల్సినంత శ్రద్ద చూపించలేదన్న మనస్తాపం చెరుకు సుధాకర్‌ గౌడ్‌లో గూడుకట్టుకొని వుంది. వరంగల్‌ జైలులో కఠినమైన కాగారాశిక్షను అనుభవించారు. ఏడాదికి పైగా ఆయన జైలు జీవితం గడిపారు. ఆగష్టు 31 1961లో జన్మించిన చెరుకు సుధాకర్‌ ఎబిబిఎస్‌ చేశారు. విద్యార్ధి దశలోనే ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశారు. 1997 నుంచి మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరి మరింత ఉద్యమానికి తోడుపడ్డాడు. అయితే టిఆర్‌ఎస్‌ తనకు టిక్కెట్టు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన సొంతంగా ఇంటిపార్టీ పెట్టుకున్నారు. 2021లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. మొదట హైదరాబాద్‌లో తన వైద్య సేవలు మొదలుపెట్టిన చెరుకు సుధాకర్‌ తర్వాత నకిరేకల్‌, నల్గొండ, చౌటుప్పల్‌లలో నవ్య సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. మొదట పార్శిగుట్టలో పీపుల్స్‌ క్లినిక్‌ మొదలుపెట్టి, బర్కత్‌ పురాలో మరో క్లినిక్‌ ఏర్పాటు చేసి, తర్వాత తన వైద్య సేవలు జిల్లాలకు విస్తరించారు. నల్లగొండలో పేదల వైద్యుడిగా పేరు గాంచాడు. అలాంటి నేత తెలంగాణ ఉద్యమపోరాటంలో నిమగ్నమయ్యాడు. తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉద్యమం కోసం పనిచేశారు. ఇప్పుడు ఆయనను మునుగోడులో కాంగ్రెస్‌పార్టీ బరిలో దింపాలని చూస్తోంది. 

హుజూరాబాద్‌ ఈటెల రాజేందర్‌ పోషించిన ప్రచార పర్వం ఇప్పుడు చెరుకు సుధాకర్‌ చేత కాంగ్రెస్‌ పార్టీ అదే ఆత్మగౌరవాన్ని అడ్డంపెట్టుకొని ఎన్నికలను ఎదుర్కొవాలని చూస్తోంది. ఉద్యమకారుడైన చెరుకుకు టిక్కెట్టు ఇవ్వడం వల్ల కాంగ్రెస్‌లో ఇప్పటికే ఆశావహులను ఒక్కసారిగా చల్లార్చినట్లైవుంది. కోమటిరెడ్డి సోదరులు బిసిలను అణచివేస్తే, రేవంత్‌ నాయకత్వంలో అదే బడుగులకు ఆత్మగౌరవం నిలుపుతున్నారనే సంకేతాలు వెళ్లేలా చూసుకుంటున్నారు. చెరకు సుధాకర్‌కు టిక్కెట్టు ఇవ్వడం వల్ల ఆ నియోజకవర్గంలో వున్న మొత్తం బిసిల ఓట్లు గుంపగుత్తగా కొల్లగొట్టొచ్చనేది కాంగ్రెస్‌ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఎందుకంటే బిజేపి ఎలాగైనా రాజగోపాల్‌రెడ్డికే టిక్కెట్టు ఇవ్వాల్సివుంటుంది. టిఆర్‌ఎస్‌ ఇప్పటికే కూసుకుంట్లకు ప్రకటించినంత పనిచేస్తోంది. కాని ఆయనకు నియోజవకవర్గంలో పెద్దఎత్తున వ్యతిరేకత కనిపిస్తున్నట్లు కూడా రాజకీయ వాతావరణం తయారైంది. దాంతో టిఆర్‌ఎస్‌కూడా అంతర్మధనంలో పడేలా కాంగ్రెస్‌ ఎత్తుగడలకు శ్రీకారం చుట్టినట్లు అర్దమౌతోంది. మరి టిఆర్‌ఎస్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? లేక కూసుకుంట్ల వైపు మొగ్గు చూపుతుందా? అన్నది కొంత కాలం ఆగితే గాని స్పష్టత రాదు. కాకపోతే కాంగ్రెస్‌ వేసే బిసి పాచిక మాత్రం పారుతుందన్న నమ్మకం చాలా మంది వ్యక్తంచేస్తున్నారు. ఈ మధ్య ఆత్మ సాక్షి అనే ఓ సంస్ధ నిర్వహించిన సర్వేలో టిఆర్‌ఎస్‌కు 44శాతం ఓట్లు పోలయ్యే అవకాశం వుందని తేల్చింది. అది కాపాడుకోవాలంటే టిఆర్‌ఎస్‌ తన నిర్ణయంలో మార్పు తీసుకుంటే , మాత్రం కారు జోరుకు అడ్డుకట్ట ఎవరూ వేయలేరు. లేకుంటే హస్తం పాచిక పారొచ్చు. బిజేపి కథ కంచికి చేరొచ్చు.

బడుగులను తొక్కేయడమే రెడ్డి రాజకీయమా?

కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయం` గౌడ్‌లకు రాజకీయ సంకటం!

`కోమటి రెడ్డి సోదరులు ఎంచుకున్న మార్గం అదేనా?

`బడుగులను ఎదకుండా చేయడమే బ్రాండ్‌ ఇమేజా?

`పేదలకు అన్నం పెట్టినట్లు చెప్పి, నాయకులకు సున్నం పెట్టడం ఏం నీతి?

`ఎదురుగా ఎంత మంది రెడ్డి నేతలున్నా సరే…బడుగులు లీడర్లు కావొద్దా?

`నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఎంత మంది గౌడ నేతలకు భవిష్యత్తు లేకుండా చేశారో గుర్తుందా?

`ఒక్కసారి రెడ్డి నాయకుడైతే మర్రి చెట్టు లా పాతుకుపోవాల్సిందేనా?

`వాళ్ల కింద బడుగులు బక్కచిక్కి పోవాల్సిందేనా?

`తెలంగాణ లో ఎంతకాలం ఆధిపత్య రాజకీయాలు?

నీతులు చెప్పడం గొప్ప కాదు..ఆచరించి చూపడం గొప్ప. కుడిచేత్తో పెట్టి, ఎడమచేత్తో మొత్తే నాయకులు చాలా మంది రాజకీయాల్లో కనిపిస్తారు. అందులో తెలంగాణలో నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరులు కనిస్తారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. సహజంగా రాజకీయాల్లో ఒక్కసారి రెడ్డి రాజకీయం ఆధిపత్యం మొదలైతే అక్కడ ఇతర బడుగుల సామాజిక వర్గాలు బలపడడం అన్నది జరిగే ముచ్చటే లేదు! అలా బాగు పడ్డ సందర్భాలులేవు. ఇలా వారి దారిని రహదారి చేసుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లాకుచెందిన ఎంతో మంది బలమైన బిసి నేతలను కూడా ఎదుకుండా చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ పట్టువదలని విక్రమర్కుల్లా పని చేశారని తెలుస్తోంది. ఎప్పుడైతే డీ లిమిటేషన్‌లో అప్పటి ఉమ్మడి జిల్లాలకే పరమితమైన పార్లమెంటు స్ధానాల్లో కొన్ని మార్పులు జరగడం కూడా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు బాగానే కలిసి వచ్చింది. అంతే కాకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ హయాం నుంచి వారు ఆడంది ఆటపాడిరది పాటగా సాగుతూ వస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో వారు జనగామ నియోజవర్గంలో పొన్నాల లక్ష్మయ్యను ఓడిరచాలని శతవిధాల ప్రయత్నించారు. ఆ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలోనే పొన్నాలకు ఓట్లకు వచ్చిన ఓట్లకంటే భువనగిరి ఎంపిగా రాజగోపాల్‌రెడ్డికి వచ్చిన ఓట్లు ఎక్కువ. పెద్దఎత్తున క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. అంటే పరోక్షంగా పొన్నాల హావా తగ్గించాలని చూశారు. కాని ఆయన తక్కువ మెజార్టీతో బైపటడ్డారు. తర్వాత కూడా అటు కోమటిరెడ్డి సోదరులు, పొన్నాల మధ్య ఎప్పుడూ కోల్డ్‌ వార్‌ సాగుతూనే వుండేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆలేరు నియోజకవర్గం ఒకప్పుడు బడుగులకు పెద్ద పీట వేస్తూ వచ్చేది. అక్కడ ఐదుసార్లు వరసగా మోత్కుపల్లి నర్సింహులు గెలుస్తూ వచ్చారు. ఆయనను కూడా సాధ్యమైంత మేర తెలుగుదేశంలో నెగలకుండా చేస్తూ వచ్చిన వారిలో ఎలిమినేటి మాధవరెడ్డితోపాటు, ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డి కూడా ఆలేరు రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపుతూ వచ్చారు. ఇంతలో వచ్చిన తెలంగాణ ఉద్యమంలో ఆలేరు నుంచి నగేష్‌ రెండుసార్లు గెలిచారు. 2009 ఎన్నికల్లో బిక్షమయ్య గౌడ్‌ గెలిచారు. ఆయన రాజకీయం ఒక్కసారిగా దూసుకొచ్చిన నాయకుడు. ఆయనను కూడా రాజకీయంగా తొక్కేయంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ కీలకపాత్ర పోషించారనే ప్రచారం విసృతంగా సాగుతోంది. మొత్తంగా కోమటిరెడ్డి సోదరులు ఏ పార్టీ నాయకులైనా సరే గౌడ్‌ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ అణచివేసే ఎత్తుగడలే ఎక్కువ వేశారన్నది స్పష్టమౌతోంది. తెలంగాణ వస్తుంది… జిల్లాల విభజన జరుగుతుందన్న ఆలోచన అప్పట్లో ఎవరికీ లేదు. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వున్నంత కాలం నల్లగొండ జిల్లా రాజకీయాలు తమ కనుసన్నల్లోనే నడవాలని కోమటిరెడ్డి బ్రదర్స్‌ బలంగా బావించారు. దాని పర్యవససానమే గౌడ నేతలను రాజకీయంగా ఎదకుండా చేశారనేది ప్రచారం జరుగుతోంది. 

తెలంగాణ ఉద్యమంలో కీలకభూమికపోషించి, వైద్యుల జేఏసి ద్వారా తెలంగాణ ఉద్యమానికి బూరనర్సయ్య గౌడ్‌ ఎంతో తోడ్పాడు పడ్డాడు. బూర నర్సయ్య గౌడ్‌ను రాజకీయంగా ఎదకుండా చేయడంతో పాటు, మధుయాష్కీగౌడ్‌ను భువనగిరి వైపు చూడకుండా ఏక కాలంలో ఇద్దరు నాయకులు రాజకీయ జీవితం సమాధి చేయడంలో కోమటి రెడ్డి సోదరులు సక్సెస్‌ అయ్యారు. 2014 ఎన్నికల్లో భువనగిరి నియోజక వర్గం నుంచి సమారు 2లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిచిన బూర నర్సయ్యగౌడ్‌ను ఎలాగైనా ఓడిరచాలని కోమటిరెడ్డి బ్రదర్స్‌ చేసిన రాకీయం కళ్లమందే కనిపిస్తోంది. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డితో సంప్రదింపులు జరిగి, బూరనర్సయ్యగౌడ్‌ను ఓడిరచారనేది ప్రధాన అరోపణ. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఇప్పుడు పెద్దఎత్తున హల్‌ చల్‌ చేస్తోంది. భువనగిరిలో బూరనర్సయ్య గౌడ్‌ను ఓడిరచడంలో ఫైళ్ల శేఖర్‌రెడ్డి చేసిన సహాకారానికి రాజగోపాల్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపనట్లు వున్న వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇలా బూర నర్సయ్య గౌడ్‌ రాజకీయాన్ని తుంచేయడంలో కోమటి రెడ్డి సోదరులు చేసిన రాజకీయం గౌడ సామాజికవర్గంలో ఒక అలజడిని సృష్టించింది. అంతే కాకుండా నిజామాబాద్‌ మాజీ ఎంపి. మధుయాష్కీ గౌడ్‌ గత ఎన్నికల ముందు భువనగిరి నుంచి పోటీ చేయాలని ఎంతో ఆశించారు. ఆయనను ఎట్టి పరిస్ధితుల్లోనూ భవనగిరి రాకుండా చేసి, ఎమ్మెల్యేగా ఓడిపోయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టి భువనగిరి నుంచి పోటీ చేశారు. నల్లగొండ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదని అంతకు ముందు ఎమ్మెల్యే ఎన్నికల్లో తేలిపోయింది. దాంతో భువనగిరి నియోజకవర్గం ఎంచుకొని మధుయాష్కీ గౌడ్‌ను భువనగిరికి దూరం చేశాడు. జనగామ నియోజవర్గంలో రుద్రమదేవీ మాక్స్‌ సొసైటీ అనే దానికోసం ఓ భవనం ఏర్పాటు చేసి, అక్కడే ఓ అనాధాశ్రమం ఏర్పాటు చేసి, అక్కడి రాజకీయాలను కూడా పూర్తిగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ గుప్పిట్లోకి తీసుకొన్నారు. దాన్ని పదేపదే ప్రచారం చేసుకోవడమే కాకుండా, పొన్నాల లాంటి నాయకుడిని కూడా రాజకీయంగా అణచివేయడంలో కృతకృతులయ్యారు. 

ఇదిలా వుంటే తాముండే నల్లగొండ నియోజకవర్గంలో బడుగులు ముఖ్యంగా గౌడ సామాజిక వర్గ నేతలు ఎదకుండా చేశారంటూ కోమటిరెడ్డి సోదరులు రాజకీయ తోడేళ్లు అంటూ పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం హయాంలో నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలలో పెద్దఎత్తున గౌడ సామాజిక వర్గం ఎదిగింది. రాజకీయంగా బలమైన పునాదులు పడ్డాయి. కాని వాటిని కూకటివేళ్లతో పెకిలించి, గౌడ నాయకత్వాలను ఎక్కడిక్కడ తుంచేయడంతో కోమటిరెడ్డి సోదరులు నిమగ్నమైన బడుగులు నాయకత్వాలను నాశనం చేశారని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా సుంకర మల్లేష్‌ గౌడ్‌ అనే నాయకుడిని చెప్పుతో కొట్టించి అవమానించి ఆయన రాజకీయ జీవితం సమాధి చేశారని చెప్పుకుంటున్నారు. నల్లగొండ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన పుల్లెంల వెంకటనారాయణ గౌడ్‌ రాజకీయంగా అంతకు మించి ఎదకుండా చేయడంలో విజయం సాధించారు. ఆయనను రాజకీయాలకు దూరం చేశారు. వంగాల స్వామీ గౌడ్‌ అనే నాయకుడికి రాజకీయం లేకుండా చేశారు. నకిరేకల్‌లో చెరుకు సుధాకర్‌ గౌడ్‌ రాజకీయంగా ఎదకుండా చేయడంలో కూడా కోమటిరెడ్డి సోదరులు సక్సెస్‌ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకర్‌ది ప్రత్యేకపాత్ర. ఆయన చేసిన త్యాగం తెలంగాణ ఉద్యమంలో ఎంతో విలువైంది. ఏకంగా పిడి ఆక్ట్‌ కింద అరెస్టైన ఏకైక నేత. సుమారు రెండు సంవత్సరాలు వరంగల్‌ జైలులో జీవితం గడిపారు. ఆయన ఉన్నత విద్యావంతుడు. పేదల వైద్యుడు కూడా. అలాంటి నాయకుడిని రాజకీయంగా ఎదకుండా చేశారు. తాజాగా ఆయన కాంగ్రెస్‌ చేరడాన్ని, ఆయను చేర్చుకోవడాన్ని కోమటిరెడ్డి సోదరులు జీర్ణించుకోవడంలేదు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యంగా కూడా ఆపాదించుకోవచ్చు. నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్యను ప్రోత్సహించాల్సివచ్చినా, ఆయన ఎమ్మెల్యే కాగానే కోమటిరెడ్డి బ్రదర్స కబంద హస్తాలనుంచి ఎంతో తెలివిగా తప్పించుకున్నారు. సొంత నాయకత్వం మీద దృష్టిపెట్టుకున్నారు. ఆయన టిఆర్‌ఎస్‌ చేరిన సమయంలో ఆయనను కూడా పెద్దఎత్తున బద్‌నాం చేశారు. రాజకీయంగా భవిష్యత్తు నిచ్చన తమకు అన్యాయంచేశారని ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రజలకు చిరుమర్తి లింగయ్య చేసింది కరక్టే అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. తిప్పర్తి జడ్పీటీసి తుండు సైదులు గౌడ్‌ తమ కనుసన్నల్లోనుంచి లేకుండా ఎదుగుతున్నాడని ఆక్రోశించి, ఆయన రాజకీయ జీవితాన్ని చిదిమేశారు. ఆయనపై కేసులు నమోదు చేయించి అక్రమ కేసుల్లో ఇరికించారని తెలుస్తోంది. భవనగిరిలో పచ్చిమట్ల శివరాజ్‌ గౌడ్‌ ను రాజకీయంగా తొక్కేశారు. సూర్యాపేటలో ధనుంజయ్‌ గౌడ్‌ను ఎదగకుండా చేశారు. నల్లగొండలో మల్లయ్యను రాజకీయంగా కోలుకోకుండా చేశారు. మాదగోని శ్రీనివాస్‌ గౌడ్‌ పరిస్ధితి కూడా అలాగే చేశారని ఆరోపణలున్నాయి. గౌడ్‌ నాయకులను తొక్కుకుంటూ కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎదిగారనేది ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. ఈసారి గౌడ సామాజిక వర్గమంతా ఏకమైన కోమటిరెడ్డి సోదరుల రాజకీయంతో ఆడుకోవాలని డిసైడ్‌ అయినట్లు సమాచారం.

బడుగులకు నోరుండొద్దా!?

ఆఖరుకు అద్దంకే అడ్డంకా!?  

శ్రవణ్‌ ను సాగనంపి సాధించిందేమిటి?

రేవంత్‌ తో చెడి శ్రవణ్‌ దూరం!

కోమటి రెడ్డి కోపానికి అద్దంకి బలి?

ఏ పార్టీ లోనూ చెల్లుబాటు కాని బడుగుల మాట

అద్దంకి క్షమాపణ చెప్పినా వదిలేయరా?

రేవంత్‌ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వారిలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి లేడా?

అలా అయితే జగ్గారెడ్డి మీద ఎన్ని సార్లు చర్యలు తీసుకోవాలి?

ఇప్పటికీ వెనక్కి తగ్గని జగ్గారెడ్డి?

అద్దంకి అంటే అంత అలుసైపోయాడా?

నల్గొండ ఏమైనా గుత్తకు తీసుకున్నారా?

దేశంలో 75 వసంతాల స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ…కాంగ్రెస్‌లో బడుగులకు నోరు లేకుండా చేస్తున్నారు…పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమనే మాటలు కేవలం ఉన్నత వర్గాల నేతలకే అని రుజువు చేస్తున్నారు? బడుగులకు మాట్లాడితే చాలు వారి నోరు ఎలా మూయించాలో అన్నది వెంటనే నిర్ణయం తీసుకుంటున్నారు? పేదవాడి కోపం పెదవి చేటు అని పూర్వ కాలం నుంచి అంటున్నదే…చెప్పుకుంటున్నా…ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో నిజం చేస్తున్నారు. అంతే కాదు అసలు బడుగు నేతలు మాట్లాకుండా నోరు నొక్కేస్తున్నారు. నోరు కుక్కెస్తున్నారు…ఒక రకంగా చెప్పాలంటే కుట్టేస్తున్నారు. నోరు దాటి మాటలు రాకుండా చేస్తున్నారు. నాలుకను మడతపెడుతున్నారు. మారు మాట మాట్లాడకుండా చేస్తున్నారు. ఒక వేళ పెదవి దాటి పెద్ద మాట మాట్లాడితే చాలు…పార్టీలో కూడా వుండకుండా చేస్తున్నారు. రాజకీయాలు చేయకుండా చేస్తున్నారు? పార్టీలో కొనసాగకుండా సస్పెండ్‌ చేసేదాక ఉన్నత వర్గాల నేతలు బీష్మించుకు కూర్చుకుంటున్నారు. ఇంతకీ అద్దంకి చేసిన తప్పేమిటి? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది? పార్టీ లైన్లోనే ఆయన మాట్లాడాడు. పార్టీకి నష్టం జరగొద్దనే చెప్పాడు. కాకపోతే దాన్ని కొంత కటువుగా చెప్పాడు. ఆయన వాడిన పదం ఎన్నడూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాడందా? రేవంత్‌ రెడ్డి మాట్లాడందా? తెలంగాణలో ఆ పదం అందరూ మాట్లాడేదే? కాకపోతే భహిరంగంగా అందరూ బుద్దిమంతులే..! 

చండూరు సభలో ప్రజలను చూసిన సంబరమో! పార్టీగకి ప్రజాభినం తగ్గలేదన్న ధైర్యమో! కోమటి రెడ్డి బ్రదర్స్‌ పార్టీకి దూరమైనా ప్రజల్లో పార్టీకి ప్రజాదరణ తగ్గలేదన్న సంతోషమో గాని అద్దంకి పరిధి దాటే మాట్లాడాడు? అనుకుందాం? కాని ఆయన ఒకటికి నాలుగు సార్లు క్షమాపణ చెప్పాడు. అదంతా మీడియాలో కనిపిస్తున్నదే…! అద్దంకి చెప్పే క్షమాపణలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాధ కనిపించడం లేదట! ఇది మరీ విచిత్రంగా వుంది. మొగుడు కొట్టిందానికి కాదు గాని, తోడి కోడలు నవ్వినందుకు ఎక్కువ బాధపడిరదని ఓ సామెత. అచ్చం కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ కూడా అలాగే వుంది. వెంకటరెడ్డి దృష్టిలో అద్దంకి దయాకర్‌ చాలా చిన్న నాయకుడే…! ఆ అద్దంకి మీద అంత గద్దింపు అవసరమా? అద్దంకి దయాకర్‌ ఇప్పటికే పదే పదే క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయినా అంత కక్షెందుకు? ఆయనను సస్పెండ్‌ చేయించాలన్న పట్టుదల ఎందుకు? పెద్ద మనసు చేసుకొని క్షమించొచ్చు కదా? మరి రేవంత్‌ రెడ్డి కూడా ఈ విషయంలో పట్టీపట్టనట్లు మాట్లాడడం కూడా బడుగులకు అన్యాయం చేయడానికి ఆ సామాజిక వర్గమంతా ఎప్పుడూ సిద్దంగానే వుంటుందన్న పరోక్ష సంకేతాలు పంపడం కాదా? నిన్నటి దాకా పార్టీలో రేవంత్‌ను సీనియర్లంతా తూర్పారపడుతున్నా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన నేతల్లో అద్దంకి దయాకర్‌ ఒకరు. ఆయన మొదటినుంచి రేవంత్‌కు అనుకూలంగానే వున్నారు. ఆ అనుకూలంలోనే రేవంత్‌ నాయకత్వాన్ని సవాలు చేసిన వారి గురించి ఓ మాట పరుశంగా మాట్లాడాడు. అది కూడా తప్పేనా? నిజానికి ఇంత కాలం రేవంత్‌ అండ చూసుకొనే అద్దంకి దయాకర్‌ స్వేచ్ఛగా మాట్లాడగులుతున్నాడన్న ఆలోచన అందరిలోనూ వుంది. మరి అలాంటి అద్దంకి దయాకర్‌ను రేవంత్‌కాపాడుకుంటాడా? లేక పార్టీలో అద్దంకే అడ్డంకి అన్నట్లు వ్యహరిస్తాడా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిత్యం రేవంత్‌రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నేతల కోసం పార్టీలో అండగా వున్న అద్దంకి దయాకర్‌ను దూరం చేసుకొని, రెడ్డి, రెడ్డి ఒకటే అన్న సందేశం పంపుతారా? అన్నది కూడా తెలియాల్సివుంది. 

ఇప్పటికే దాసోజు శ్రవణ్‌ పార్టీ విడిచి వెళ్లిపోయాడు. సరే ఆత్మాభిమానం చంపుకోలేక పార్టీని వదిలాడనేది ఓ ప్రచారం. కాదు…లెక్కల్లో తేడాలే దాసోజును బైటకు పంపే పొగ పెట్టేలా చేసిందనేది మరో వివాదం..! రేవంత్‌కు అండగా వున్న నేతల్లో దాసోజు శ్రవణ్‌ కూడా ఒకరు. పార్టీలో సీనియర్లంతా రేవంత్‌ను గుక్కతిప్పుకోండా చేస్తున్న సమయంలోనూ అండగా నిలిచిన నేతల్లో దాసోజు కూడా వున్నాడు. పార్టీ పరమైన విషయాల్లో చాలా వరకు రేవంత్‌రెడ్డికి చేదోడువాదోడుగా దాసోజు వున్నాడనేది కూడా నిజం. కాకపోతే పార్టీని అడ్డంపెట్టుకొని రేవంత్‌ ఎంచుకున్న కొన్ని ప్రైవేటు అంశాలే దాసోజును బైటకు వేళ్లేలా చేశాయన్న ప్రచారం పార్టీలో కూడా బాగానే జరుగుతోంది. రియలెస్టేట్‌ విషయాలేవైనా ముందు దాసోజుతో రేవంత్‌రెడ్డి ఓ మూడు నాలుగు రోజులు ప్రస్తావించేలా చేసేవాడు? తర్వాత నేరుగా రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగేవాడు? ఆ విషయంలో కొంత కాలం సఖ్యత బాగానే సాగినట్లుంది? కాకపోతే జూబ్లీహిల్స్‌లో రెడ్‌ ఫోర్టు అక్భర్‌ చెందిన స్ధలం విషయంలోనే ఇద్దరికీ మధ్య చెడిరదనేది ఓ వాదన. పైకి ఎంతో మాట్లాడగలిగే దాసోజు ఈ విషయంలో అసలు విషయం చెప్పలేక కూడా నోరు కట్టేసుకున్నాడనేది కూడా చెప్పుకుంటున్నారు. గుట్ట, గుడి వివాదంలో దాసోజు వెలుగులోకి తెచ్చిన తర్వాత రేవంత్‌ రంగంలోకి దిగారు. అక్కడ జరిగిన లావాదేవీల్లో దాసోజుకు మొండి చేయి మిగిలిందని తెలుస్తోంది? అప్పటినుంచి ఆయనను రేవంత్‌ దూరం పెడుతూ వచ్చాడన్నది కూడా చర్చలో వున్న మాట? అంటే రేవంత్‌ చెప్పిందల్లా? మాట్లాడడానికి పనికొచ్చిన దాసోజు వాటా కోరుకోవడం తప్పైపోయిందా? బైట వారి మీద పనికొచ్చే వాయిస్‌ రేవంత్‌ ముందు మాట్లాడడానికి పనికిరాకుండాపోయిందా? దాసోజు వెళ్తుంటే ఎందుకు ఆపలేపోయారు? గతంలో ఎమ్మెల్యేలు వెళ్తుంటే ఆపలేకపోయారని మాట్లాడిన వారు దాసోజు వెళ్తుంటే ఎందుకు సంప్రదింపులు జరపలేదు. అంటే ఆయన అవసరం పార్టీకి చాలైందా? ఉద్యమకారుడైన దాసోజును కాదని పార్టీలోకి కొత్తవారిని తెచ్చి ఆయనకు పొగ పెట్టడం కరక్టేనా? నిజానికి రేవంత్‌కన్నా ముందు నుంచి పార్టీకోసం నోరేసుకొని ఎంతో పనిచేసిన నాయకుడు దాసోజు. కాని ఆయన మాటే చివరికి ఆయనకు పనికి రాకుండాపోయింది? ఆయన రాజకీయానికి అడ్డంకిగా మారింది? ఇదేనా కాంగ్రెస్‌ పార్టీలో బడుగులకు వున్న విలువ అన్నది తేల్చాల్సింది ఎవరు?

తాజాగా చెరుకు సుధాకర్‌ కూడా మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై చెరుకు సుధాకర్‌ కూడా స్పందించారు. చెరుకు సధాకర్‌ ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తన తెలంగాణ ఇంటిపార్టీని కూడ కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. తెలంగాణ ఉద్యమంలో పిడి. యాక్టు కింద అరెస్టైన ఏకైక నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన నాయకుడు చెరుకు సుధాకర్‌. ఆయన కూడా మునుగోడు టిక్కెట్టు ఆశిస్తున్నాడు. ఇటీవల పార్టీ కూడా ఆయనతో చర్చించింది. కాకపోతే కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆయనపై చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో కలకలం సృషించాయి. దాంతో తాను రాజకీయాలు మొదలుపెట్టిన నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగులు కూడా వేసుకోలేదని చెరుకు సుధాకర్‌ చురకలంటించారు. ఇలా బడుగుల నేతలను ఎక్కడికక్కడ నోరు మూయించే కార్యక్రమం కాంగ్రెస్‌ పార్టీలో విజయవంతంగా కొనసాగుతోందని కూడా చెప్చొచ్చు. ఇదిలా వుంటే నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులు ఎంత మంది గౌడ సామాజిక వర్గ నాయకుల రాజకీయ జీవితాలతో ఆడుకున్నారో వివరాలు కూడా వెల్లడిస్తూ పెద్ద ఎత్తున వారిపై విసృత ప్రచారం సాగుతోంది. బాధితుల పేర్లతో సహా మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి వ్యతిరేకులు బాగానే ప్రచారం చేస్తున్నారు. 

                        ఎక్కడ అద్దంకి దయాకర్‌ తన డిమాండ్లను ముందు పెడతాడో అన్న అనుమానంతో ముందే మల్లు రవి, బెల్లయ్య నాయక్‌ లాంటి వారిని పంపి, పార్టీ ఒక వేళ క్రమశిక్షణా చర్యలు చేపట్టినా కొంత సంయమనంతో వుండాలని సూచించడమేనా? బడుగులకు మాటకు వున్న విలువ. అద్దంకి దయాకర్‌ తెలంగాణ వచ్చాక, కాంగ్రెస్‌ పార్టీ కోసం ఎంతో శ్రమిస్తూ, ఏకంగా ఓ సినిమా కూడా నిర్మాణం చేస్తున్నాడు. పార్టీకోసం శ్రమిస్తున్నాడు. తెలంగాణ ఉద్యమకారుడు. ఉమ్మడి రాష్ట్రంలోనే మాల మహానాడు అధ్యక్షుడుగా పనిచేసిన నాయకుడు. గత ఎన్నికల్లో తుంగతుర్తి నియోకవర్గం నుంచి విజయం ముద్దాడేదాకా వెళ్లి తక్కువ ఓట్లతో ఓటమి పాలైన నాయకుడు. ఒక దశలో అద్దంకి దయాకర్‌ గెలిచాడన్న వార్తలు కూడా వచ్చిన సందర్భం. అలాంటి నేతను దూరం చేసుకోవడం కూడా పెద్ద పని కాదని కాంగ్రెస్‌ నిరూపించుకుంటుందా? ఇప్పటికే వి. హనుమంత రావు లాంటి సీనియర్‌ నాయకుడి మాటకూడా కొంత కాలంగా మూగబోయినట్లే కనిపిస్తోంది. మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య లాంటి వారి మాట కూడా పెద్దగా ఎక్కడా వినిపించకుండాపోతోంది. అంటే పార్టీలో నోరేసుకుంటే ఉన్నత సామాజిక వర్గ నేతలు ఎంత మాట్లాడినా తప్పుకాదు. వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు వుండవు. ఆ దిశగా ఆపార్టీ ఆలోచన కూడా చేయదు. పార్టీలైన్‌ పరిధి దాటి మాట్లాడే ఉన్నత సామాజిక వర్గ నేతలకు అన్నీ మినహాయింపులే కాని, బడుగులకే సన్నాయి నొక్కులా? మాటలకు పరిధులా? నోరు మూసేయడాలా? ఇంకెన్ని రోజులు ఉతన్నతవర్గాల ఆధిపత్యం. ఓట్లు బగుడులవి…సీట్లు ఉన్నత వర్గాలవి…? ప్రశ్నించేవారి బడుగులు బైటకు…ఉన్నతవార్గలే పాలకులు…ఇదేనా నీతి…ఇంకా ఎంతకాలమీ దుర్నీతి!?

శాయంపేటలో ఫ్రీడం ర్యాలీ

*ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి*

పొలిటికల్ ప్రతినిధి, నేటిధాత్రి: స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శాయంపేట మండల కేంద్రంలో ఫ్రీడమ్‌ రన్‌ ర్యాలీని ప్రారంభించిన వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75ఏళ్ళు

పూర్తిచేసుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు భారత స్వతంత్ర వజ్రోత్సవాల పేరిట ఉత్సవాలను ఘనంగా చేపట్టాలని నిశ్చయించింది. ఆగస్ట్ 8న ఈ వజ్రోత్సవ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించగా ఆగస్ట్ 22వరకు కొనసాగనున్నాయి. ప్రజల్లో దేశభక్తి పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలను ఈ పదిహేను రోజులు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా శాయంపేట మండల కేంద్రంలో చేపట్టిన ఫ్రీడం రన్ ర్యాలీని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు నాయకులు విద్యార్థులతో పాటు ప్రజలు భారీగా ఫ్రీడం రన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాట యోధులను గుర్తుచేసుకుంటూ ఈ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. స్వాతంత్ర పోరాట యోధులు స్పూర్తిని గుర్తచేస్తూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను భావి తరాలకు తెలియజేయాలన్నారు. విద్యార్థులు ప్రజలందరిలో దేశభక్తి పెంపొందించేందుకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెరుపు తిరుపతిరెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు అబు ప్రకాష్ రెడ్డి. సర్పంచ్ లు కందగట్ల రవి, చిట్టిరెడ్డి రాజిరెడ్డి, బొమ్మకంటి సాంబయ్య, దుంపల శ్రీలతమహేందర్ రెడ్డి, పొడిమేకల మమతసంపత్, వనమ్మవీరస్వామి, మాజీ ఎంపీపీ, శాయంపేట ఎంపీటీసీ బాసని చంద్రప్రకాష్, పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ మారేపల్లి నందం, డబ్ల్యూహెచ్ఆర్సి పరకాల జనరల్ సెక్రెటరీ మేరగుత్తి కర్ణాకర్, అధికారులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version