చేసింది చెప్పుకోలేరు! చెప్పాల్సింది ప్రచారం చేసుకోరు!!

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయి.

కరంటు కొరత లేదు,కోత లేదు…

నిరంతర విద్యుత్‌ తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు…

ఏ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ జరిగింది లేదు…..

తెలంగాణలో పెరిగిన భూగర్భ మట్టాలు మరెక్కడా లేవు….

తెలంగాణ వ్యాప్తంగా నీటి జాడల పరవళ్లు గతంలో లేవు…

రైతు బంధు ఏ రాష్ట్రంలో లేదు…

రైతు భీమా మరే రాష్ట్రంలో లేదు…

ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు…

కళ్యాణ లక్షి సరికొత్త విప్లవం….

పార్టీ ప్రచారం చేయదు…నాయకులకు తీరిక లేదు..

టిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఏం చేస్తుందో జాడే లేదు….

సిఎంఓ నుంచి వచ్చే వార్తలే తప్ప ఐఅండ్‌ పిఆర్‌ చేస్తున్నదేమీ లేదు…

ఉద్యమ కాలంలో వున్న ఊపు కార్యకర్తలలో ఇప్పుడెందుకు లేదు?

టి న్యూస్‌ చెప్పదు….నమస్తే తెలంగాణ రాయదు…

ప్రభుత్వ పనితీరును చెప్పేవారే కరువు…

హైదరాబాద్‌,నేటిధాత్రి: పావల పని చేస్తే రూపాయి ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం సరైన ప్రచార విధానం అవలంభించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులను ప్రచారం చేసుకోకపోవడం వల్ల ప్రతిపక్షాలు చెప్పే విషయాలే జనం నిజాలని నమ్మే పరిస్ధితి ఎదురుకానున్నది. ఈ విషయంలో టిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సోషల్‌ మీడియా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ప్రతిపక్షాలకు చెందిన సోషల్‌ మీడియా వున్నంత దూకుడు టిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా లేకపోవడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని అధ్భుతమైన సంక్షేమ పధకాలు తెలంగాణలో మాత్రమే అమలౌతున్నాయి. దేశమంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధకాలు దేశమంతా ఆదర్శంగా తీసుకుంటోంది. కాని టిఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకోవం లేదు. ఇక కరంటు గురించి చెప్పాల్సి వస్తే మనం చూస్తున్న నిరంతరం విద్యుత్‌ దేశంలోని అన్ని రాష్ట్రాలలో అమలు కావడంలేదు. తెలంగాణ రాక మందు తెలంగాణలో కరంటు అన్నది ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో…రోజులో ఎంత సేపుంటుందో తెలియని పరిస్ధితి. అలాంటి అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్న కాలం. ఒక దశలో పరిశ్రమలకు పవర్‌ హాలీడే ప్రకటించిన కాలం నుంచి నేడు గృహఅవసరాలకు, పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి సైతం 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా అన్నది తెలంగాణలో తప్ప మరెక్కడా లేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్ర కేసిఆర్‌ సాధించిన అధ్భుతమైన విజయం. 

తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సంక్షేమఫ్రభుత్వం. రైతు బంధు ప్రభుత్వం. దేశంలో ఎక్కడా రైతు బంధు వంటి పధకం లేదు. ఒక్క తెలంగాణలోనే అమలు జరుగుతోంది. రైతుకు పెట్టుబడి సాయం అన్నది చరిత్రలోనే ఒక వినూత్నమైన కార్యామ్రకం. మరి అలాంటి పధకం అమలు అన్న దానిపై విపరీత వ్యాఖ్యలు చేసే ప్రతిపక్షాలను తిప్పికొట్టాల్సిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా విభాగం చూస్తూ ఊరుకుంటుందే కాని, దీటైన సమాధానాలు ఇవ్వడం లేదు. పేదింటి అమ్మాయి పెళ్లి విషయంలో ఇబ్బందులు రాకుండా, బాల్యవిహావాలను అరికట్టడంలో కళ్యాణ లక్ష్మి పధకం ప్రశంసలు అందుకుంటోంది. ఇలాంటి పధకం ఒకటి అమలు చేయొచ్చని నిరూపించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఒకనాడు నీటిగోస తెలంగాణలో గుక్కెడు మంచినీటికి సైతం అల్లాడిన రోజులున్నాయి. సాగు నీటికి కష్టమే…తాగు నీటికి కష్టమే…అలాంటి తెలంగాణలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదుర్కొన్న రోజులున్నాయి. కాని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే, ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెరువుల పునరుద్దరణ చేపడతారని ఎవరూ ఊహింలేదు. అసలు తెలంగాణలో ఇంత తొందరగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడం, 46వేల చెరువులు బాగు పడడం అన్నది కలలో కూడా ఊహించినవి కాదు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు అన్న పదమే వినపడని రోజులు చూశాం…అలాంటిది చెరువులు ఎండిపోయిన కాలం చూశాం… కాని నేడు ఏ ఊరుకెళ్లినా ఎండాకాలంలో కూడా చెరువులు కళకళలాడుతున్నాయి. దాంతో తెలంగాణ వ్యాప్తంగా భూగర్భజలాల విపరీంగా పెరగడంతో నీటికరువు అన్నది ఎనాడో తీరిపోయింది. ఎండమావుల్లాంటి తెలంగాణ చెరువులు నేడు ఏడాది పొడవునా నీటితో నిండి వుంటున్నాయి. ఎప్పటికప్పుడు గోదావరి జలాలతో చెరువులు నింపుతూనే వున్నారు. ఇవన్నీ ప్రజలు కనిస్తున్నా, ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూనే వుంటాయి. ఇక పించన్ల విషయానికి వస్తే ఒకప్పుడు ఉమ్మడి రాష్టంలో నెలకు రూ.75 చొప్పున జన్మభూమి అనే కార్యక్రమం ఆరునెలల కోసారి అందజేసేవారు. అయితే ఊరిలోని అందరికీ ఇచ్చేవారు కాదు…ఊరికి ఒకరికో ఇద్దరికో తప్ప కనీసం పదుల సంఖ్యలో కూడా పింఛన్లు అందేవి కాదు. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి రూ.200 ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ పింఛన్లును నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో ప్రచారం చేసుకునేది. మరి నేడు తెలంగాణలో రూ.2116 ఇస్తున్నారు. సమారు 47 లక్షల మందికి ఈ లబ్ధి జరుగుతోంది. దివ్యాంగులకు రూ.3500 ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడి కార్మికులకు కూడా పించన్లు ఇస్తున్నారు. ఒంటరి మహిళలకు ప్రత్యేకంగా అందజేస్తున్నారు. మరి ఇన్ని రకాలా పించన్లు అందిస్తున్నా ప్రచారం చేసుకోవడంతో టిఆర్‌ఎస్‌ వెనుకబడే వుందనిచెప్పక తప్పదు.

ఏమీ చేయలేని, అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఏ ఒక్కటీ అమలు చేయడంలేని కాంగ్రెస్‌, బిజేపిలు మాత్రం సోషల్‌ మీడియా ప్రచారంలో మాత్రం దూసుకుపోతున్నాయి. నిజాలను అబద్డాలు చేయడంల ఆరితేరిపోతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రచారం చేయాల్సిన ఐఅండ్‌ పిఆర్‌ ఏం చేస్తున్నదనేది పెద్ద ప్రశ్న. ప్రభుత్వానికి సంబంధించి వార్తలు అందించలేదు. సెంట్రల్‌ గవర్నమెంటుకు సంబంధించిన వార్తలపై ఎప్పటికిప్పుడు పిఐబి మీడియా రిలేషన్‌ మెంటైన్‌ చేసిన దాంట్లో కనీసం పదో వంతు కూడా ఐఆండ్‌ పిఆర్‌ పని చేయడంలేదు. రాష్ట్రంలో వున్న అనేక చిన్నా, చితక, పెద్ద పత్రికలకు కోట్లాది రూపాయలు ప్రకటనల కోసం ఖర్చు చేస్తోంది. కాని ఏ పత్రికలో ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయో కనీసం చూసుకునే తీరిక కూడా ఐఆండ్‌ పిఆర్‌ శాఖ అధికారులకు లేదు. చిన్న, మీడియం వందల పత్రికల్లో కూడా ఒకటే బ్యానర్‌ వుంటుంది. అవే వార్తలుంటాయి. ఆ పత్రికలకు గ్రేడ్‌లు ఇచ్చి మరీ నెల నెల లక్షలాది రూపాయలు ప్రకటనలు ఇస్తున్నారు. ప్రభుత్వ వార్తలు తప్పనిసరిగా వుండాలన్న నిబంధనలు పెట్టడం లేదు. ప్రభుత్వానికి సంబంధిచిన వార్తలు అందజేయలేరు. రోజూ పత్రికలను తిరగలేయలేరు. పత్రికలకు వార్తలు అందించలేరు. ఇక కమీషనర్‌ ఎప్పుడొస్తారో…ఎప్పుడు రారో..తెలియదు? కనీసం మీడియాకు అందుబాటులో వుండే అవకాశమే లేదు. రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్‌ వినోద్‌కుమార్‌ లాంటి వాళ్ల పోన్లు కూడా లిఫ్ట్‌ చేయలేనంత బిజీగా కమీషనర్‌ వుంటాడు…ఇలా అయితే ప్రభుత్వానికి సంబంధించిన ప్రచారం ఎలా జరగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసే తెలంగాణ అధికార మాసపత్రిక ఎంత మందికి చేరువౌతుందో కూడా తెలియని పరిస్ధితి. సిఎంవో నుంచి వచ్చే వార్తలు తప్ప ఐండ్‌ పిఆర్‌ నుంచి వార్తలు పంపడమే వదిలేశారు…టిఆర్‌ఎస్‌ అధికార పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ ప్రభుత్వ పధకాలను నిత్యం రాయదు…టిన్యూస్‌ చెప్పదు…

ఇదిలా వుంటే టిఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది కార్యకర్తలున్నారు. కాని ఆ కార్యకర్తలు కూడా టి న్యూస్‌ను సబ్‌స్రైబ్‌ చేసుకోలేదు. అసలు మొత్తం కార్యకర్తలు టిన్యూస్‌ను సబ్‌స్రైబ్‌ను చేసుకొని, వాటి నుంచి వచ్చే వార్తలను షేర్లు చేస్తే టిఆర్‌ఎస్‌కు తిరుగుంటుందా? ఎదురుంటుందా? అయినా గతంలో వున్నంత దూకుడు ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారంలు నమ్ముతున్నారే గాని, దేశంలో ఎక్కడా లేని పధకాలు అమలు చేస్తున్నామని వారు ప్రచారం చేసుకోలేపోతున్నారు. నాయకులు చూస్తే అలా వున్నారు….కార్యకర్తలు ఇలా వున్నారు..సోషల్‌ మీడియా ఎందుకు వుందో అర్ధం కాదు….ఇన్ఫర్మేష్‌ డిపార్లుమెంటు ఏం చేస్తుందో తెలియదు….. ఎవరేం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు అంటే ఫైర్‌ బ్రాండ్స్‌ అన్నంత దూకుడుతో వుండేవారు. పార్టీ కోసం అంతగా పనిచేసేవారు. కాని ఇప్పుడు పార్టీ అధికారంలో వున్నా, అనేక సంక్షేమ పధకాలు అమలౌతున్నా, ప్రతిపక్షాలను తిప్పికొట్టులేకపోతున్నారు. నాయకులు తమకు వచ్చే సోషల్‌ మీడియా మెస్సేజులు చూసుకోవడానికి కూడా తీరికలేదన్నట్టుంటున్నారు. అదే ప్రతిపక్షాలు లేని బలాన్ని సోషల్‌ మీడియాలో చూపిస్తున్నాయి. ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం పార్టీ మీద వుంది…అయినా చలిస్తారో లేదో చూడాలి….

సెల్ఫ్‌ గోల్‌ రాజగోపాల్‌!

మునుగోడును మెడకు చుట్టుకుంటున్నాడు…

తనను తాను అతిగా ఊహించుకుంటున్నాడు…

తమది బ్రాండ్‌ అన్న భ్రమలోనే వున్నాడు

కాంగ్రెస్‌ వల్ల తాను గెలవలేదన్నంత దాకా వెళ్తున్నాడు…

సొంత పార్టీ మీద ఎప్పటికప్పుడు బురద జల్లుతూనే వున్నాడు…

కాంగ్రెస్‌ కు రాష్ట్రంలో సీన్‌ లేదంటున్నాడు….

వీలు చిక్కినపుడుల్లా బిజెపికి కన్ను గీటుతున్నాడు…

కమలంలో చేరిపోవాలని చెప్పకనే చెబుతున్నాడు….

గతం వెలుగులు భవిష్యత్తులో అని కలలు గంటున్నాడు…

ఎన్నుకున్న ప్రజలకు సేవ చేయలేక ప్రభుత్వంపై నిందలేస్తున్నాడు…

గోడమీద పిల్లి వాటం రాజకీయం చేస్తున్నాడు…

గెంటేస్తే పోదామనుకుంటున్నాడు…

మునుగోడును కారువశం చేయనున్నాడు…

గెలుపు నల్లేరు మీద నడకైనప్పుడు ఎల్లకాలం రాజకీయాలు ఇలాగే వుంటాయని కొందరు భ్రమపడుతుంటారు. దాని పర్యవసానమే తెలంగాణ రాగానే తమ్ముడు ఓడిపోయాడు…అన్న గెలిచాడు…తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్న ఓడిపోయాడు…తమ్ముడు గెలిచాడు…కాని వారిలో మార్పు రాలేదు…అతి విశ్వాసంలో తేడా రాలేదు…ఏలాగైనా…ఏదో రకంగా మేమే గెలుస్తున్నాం…మాకే ప్రజల మద్దతు వుందన్న ఆలోచనతో గోడమీది పిల్లి వాటం రాజకీయాలు చేయడం అలవాటు చేసుకుంటున్నన్నారు. దాంతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సెల్ప్‌ గోల్‌ చేసుకుంటున్నాడు. అతి విశ్వాసం ఎప్పుడో అప్పుడు నిండా ముంచేస్తాయన్నది తెలుసుకోలేకపోతున్నాడు…సరిగ్గా ఇప్పుడు ఆయన అదే పరిస్ధితుల్లో చిక్కుకున్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనంతగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. నియోజకవర్గం అభివృద్ధి మాత్రమే కోరుకుంటున్నానంటాడు? అందుకోసం రాజీనామాకైనా వెనుకాడనంటాడు? తెలంగాణ ప్రభుత్వం తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదంటాడు? అనేక సార్లు అసెంబ్లీలో పోరాటం చేశానంటాడు…? బిజేపికి వెళ్తున్నట్లు ఓ వైపు సంకేతాలిస్తాడు? నేను వెళ్తానని మీకేమైనా చెప్పానా? అంటాడు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద యుద్దం చేసే శక్తి బిజేపికే వుందంటాడు…బిజేపే గెలుస్తుంటాడు…? బిజేపికి ఎప్పుడు వెళ్తున్నారంటే…నేనెప్పుడు చెప్పానంటాడు…? అప్పుడే తాను రాజీనామా చేయాలనుకుంటే మీడియాకు చెప్పే చేస్తానంటాడు… తన రాజీనామా ఒక చారిత్రక సత్యంగా నిలిచిపోవాలంటాడు? ఇలా పరి పరి విధాలుగా మాట్లాడి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి చేసుకుంటున్నాడు. పూర్తిగా ఊబిలో దిగిపోయే పరిస్ధితి తెచ్చుకుంటున్నాడు…తన రాజకీయ జీవితాన్ని తానే చేజేతులా చెడగొట్టుకుంటున్నాడు…ఎప్పటికప్పుడు మీన మేషాలు లెక్కబెడుతూ, రాజకీయాన్ని గందరగోళం చేసుకుంటున్నాడు. 

అసలు రాజగోపాల్‌రెడ్డి ఏం చేయాలనుకున్నాడు? అన్నదానిపై ఆయనకే స్పష్టత లేనట్లుంది అన్నది మాత్రం అందరికీ అర్ధమౌతోంది. కాని ఆయనకే అర్ధం కాకుండాపోతున్నట్లుంది. అయినా అది ప్రజలకు చెప్పడంలో మాత్రం పూర్తిగా విఫలమౌతున్నట్లే లెక్క. హుజూరాబాద్‌ ఎన్నికల సమయానికి ముందే ఆయన బిజేపిలోకి వెళ్తున్నట్లు, బిజేపికి తానే ప్రత్నాయ్నామన్నంత ప్రచారం చేసుకున్నాడు. తాను బిజేపిలోకి వెళ్తే ముఖ్యమంత్రి అభ్యర్ధిని నేనే అంటూ ఆయన చెప్పినట్లు కూడా అనేక ఆడియోలు బైటకు వచ్చాయి. కాకపోతే వాటిని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు బిజేపిలో ఈ పరిస్ధితి లేదు. బండి సంజయ్‌ నాయకత్వం రాలేదు. ఈటెల రాజేందర్‌ పార్టీలో చేరలేదు. దుబ్బాక రఘునందన్‌ ఇంకా అప్పటికి ఎమ్మెల్యే కాలేదు…ఆ సమయంలో తనకు తానుగా బాగానే ఊహించుకున్నాడు. కాని ఇప్పుడు రాజగోపాల్‌కు అక్కడ అంత సీన్‌లేదు. దాంతో బిజేపిలో చేరిక కోరికను ఆపుకోలేక, కాంగ్రెస్‌ లో ఇమడలేక పోతున్నట్లున్నాడు. . ఓ దశలో రాజగోపాల్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో కూడా చేరిపోతారన్నంత ప్రచారం కూడా జరిగింది. కాని ఎప్పటికప్పుడు రాజగోపాల్‌ తిప్పుతున్న వంకలు, ఇక్కడే కొనసాగుతున్నాయి. అడుగులు ముందుకు పడలేకపోతున్నాయి. ఆఖరుకు ఎవరూ నమ్మని పరిస్ధితిని తెచ్చుకుంటున్నారు. 

అన్న కోసం త్యాగమా? లేక తనకు తాను కొత్త రాజకీయమా? అన్నది కూడా తెలాల్సివుంది. కోమటి రెడ్డి వెంకటరెడ్డిది పిపిసి పదవి చేపట్టాలన్నది బలమైన కోరిక. కాని ఆ కోరిక కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి చేరికతో తీరలేదు. ఇప్పట్లో తీరే అవకాశం కనిపించడంలేదు. కాకపోతే రేవంత్‌ను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేసే ఎత్తుగడలు మాత్రం వేయడం మానుకోవడంలేదు. మొన్నది దాకా అన్న వెంకటరెడ్డి . రేవంత్‌రెడ్డికి వ్యతిరేక పాత్ర పోషిస్తూ వచ్చాడు. ఆ పాత్రనుంచి వెంకటరెడ్డి ఈ మధ్య తప్పుకున్నాడు. అది పాత్రను తమ్ముడి పోషిస్తున్నాడు. సొంత పార్టీని ఏకేస్తున్నాడు. ఏకంగా రేవంత్‌రెడ్డిని క్రిమినల్‌ రాజకీయాల చేసేవాడంటూ తీవ్ర పదజాలం వాడాడు. దాంతో కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేగినట్లే అన్నంద దూరం వెళ్లిపోయాడు. ఇంతకీ రాజగోపాల్‌ చెబుతున్న మాటల్లో , చేస్తున్న చేతల్లో ఎక్కడా పొంతన లేదు.

తనకు తన నియోజకవర్గ ప్రజల అభివృద్దే తనకు ముఖ్యమంటాడు. ప్రభుత్వం మునుగోడుపై శ్రద్ద పెట్టడం లేదంటాడు. తాజాగా మునుగోడు అభివృద్ధిపై ప్రభుత్వం స్పందిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తనను రాజకీయంగా ఎదుర్కొలేక ఎత్తుగడలు వేస్తున్నారని కొత్త కథలు అల్లేస్తున్నాడు. సరే ఒక వేళ తప్పని పరిస్ధితుల్లో రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసి, బిజేపిలో చేరితే ఉప ఎన్నిక వస్తే పరిస్ధితి ఏమిటన్నది కూడా ప్రజల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో బిజేపి దూకుడుగా వుందన్న భ్రమలో రాజగోపాల్‌ వున్నాడు. ఒక వేళ పార్టీ మారి, మళ్లీ మునుగోడులో రాజగోపాల్‌ గెలిచి చేసేదేముంటుంది? రాష్ట్రంలో అధికారంలో వున్న టిఆర్‌ఎస్‌ పార్టీ అదే పంధాను కొనసాగిస్తుంది. బిజేపి నుంచి రాజగోపాల్‌ పోటీచేస్తే ఈటెల రాజేందర్‌ సహకరిస్తాడా? అన్నది కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం….ఎందుకంటే రేవంత్‌ రెడ్డికి, ఈటెల రాజేందర్‌కు వున్న సాన్నిహిత్యం తెలిసిందే…హుజారాబాద్‌లో పార్టీని ఓడిపోయినా ఫరవాలేదు..ఈటెల గెలిస్తే చాలు అన్నంతగా…! రేవంత్‌ సహకరించాడన్నది అందరూ చెప్పుకునే మాటే…ఇలాంటి సమయంలో బిజేపిలో రాజగోపాల్‌ చేరినా ఈటెల రాజేందర్‌ సహాకారం అన్నది రిక్తహస్తమే అవుతుంది. పరోక్షంగా ఆయన సహకారం కాంగ్రెస్‌ వైపే వుంటుంది. రేవంత్‌కు సహకరించేలా వుంటుంది. రేవంత్‌ను ఉమ్మడి నల్గొండలో హీరోను చేయాలన్నంతగా వుంటుంది. కొమటిరెడ్డి బ్రదర్స్‌ను జీరో చేయాలన్నంత దాకా సాగుతుంది. 

ఇదిలా వుంటే పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో ఈటెల రాజేందర్‌ సిఎం మీద పోటీ చేస్తానన్నాడే గాని ఏ పార్టీ నుంచో అన్నది చెప్పలేదని సరికొత్త సందేహం ప్రజల మీదకు వదిలేశారు. దీనికి సమాధానం చెప్పాల్సిన ఈటెల రాజేందర్‌ కూడా ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యను ఖండిరచలేదు. అవునని కూడా చెప్పలేదు. బిజేపి నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడన్నది రేవంత్‌ రెడ్డి ఎలా ప్రకటిస్తాడన్నదానిని అంతర్లీనంగా అర్ధం చేసుకుంటే ఈటెల కూడా బిజేపిలో సంతోషంగా లేడన్నది తేలిపోయినట్లే లెక్క. హుజూరాబాద్‌ ఎన్నికల్లో కౌషిక్‌ రెడ్డి ఓట్లు కూడా ఈటెలకే పడ్డాయి. కౌషిక్‌ టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం వల్ల కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటు అన్నది మార్పిడి జరిగిందనేది సుస్పష్టం. అక్కడ కాంగ్రెస్‌ ఓట్లు టిఆర్‌కు పడేలా కౌషిక్‌ రెడ్డి కూడా పూర్తి స్ధాయిలో ప్రచారం చేయనట్లే అనేది స్పష్టం. ఒక్కసారి అక్కడ గెల్లు శ్రీను గెలిస్తే, ఇక కౌషిక్‌కు రాజకీయ భవిష్యత్తు అంధకారమే…! అంటే ఎంతో సానుభూతి పొందిన ఈటెల రాజేందర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో అంత ఆషామాషీగా గెలవలేదు. పెట్టాల్సినంత ఖర్చు పెట్టాడు. టిఆర్‌ఎస్‌లో వున్నా కౌషిక్‌ సహాకారం అందలేదు. కాంగ్రెస్‌ఓట్లు ఆ పార్టీకి ఉపయోపడలేదు. అందరూ కలిసి ఈటెలను గెలిపించే ప్రయత్నం చేశారే గాని, బిజేపి మూలంగా ఈటెల గెలవలేదు. ఈ సంగతి రాజగోపాల్‌కు అర్ధం కానట్లుంది. ఈటెల గెలుపు మాత్రమే రాజగోపాల్‌ చూస్తున్నాడు..అది బిజేపి గెలుపనుకుంటున్నాడు. లోలోన జరిగిన రాజకీయం తెలిసికూడా తన ఆట ఒక వేళ రాజగోపాల్‌ ఆడగినా అది స్వయంకృతాపరాధమే అవుతుందనేది మాత్రం సత్యం. ఇక ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ను కాదని బిజేపికి రాజగోపాల్‌ వెళ్తే కాంగ్రెస్‌ ఊరుకుంటుందా? ముఖ్యంగా రేవంత్‌ తన రాజకీయం చేయకుండా ఊరుకుంటాడా? హుజూరాబాద్‌లో పోయిన పరువు నిలబెట్టుకోవాలని చూడడా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు, అటు కోమటిరెడ్డి, ఇటు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల రాజకీయం ఆట కట్టించాలని చూస్తున్న రేవంత్‌కు ఇది మంచి సువర్ణావశం కాదా? మునుగోడులో రాజగోపాల్‌ రాజీనామా చేసి,బిజేపినుంచి పోటీ చేస్తే పోగొట్టుకున్న చోట కాంగ్రెస్‌ సీటు కోసం ఆరాటపడదా? రేవంత్‌ హుజూరాబాద్‌లో చేసిన అస్త్ర సన్యాసం ఇక్కడ చేస్తాడా? రేవంత్‌రెడ్డికి కూడా ఇదిమంచి అవకాశం…తనను తాను నిరూపించుకునేందుకు రాజగోపాల్‌ ఇచ్చే బహుమానం…? రాజగోపాల్‌ సెల్ఫ్‌ గోల్‌తో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం…! ఎంతో కొంతనైనా కాంగ్రెస్‌ ఓట్లు సాధించి, రెండో స్ధానంలో నిలిచినా అది సక్సెస్‌ అయినట్లే…మునుగోడు సీటు కారుకు అప్పగిస్తే కారు జోరుకు ఇక ఎవరూ బ్రేకులు వేయలేరు…భవిష్యత్తు కూడా కారుదే అని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినట్లే చూడు…!

మీరైతైనే మాకు ఓకే!

మీరే కావాలి… మీరే రావాలి.

 

 కొన్ని సార్లు రాజకీయాలలో అరుదైన సంఘటనలు ఎదురౌతుంటాయి…నాయకులను ఆశ్చర్య పరుస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ నాయకుడికి‌ పట్టలేని సంతోషాన్ని కల్గిస్తుంటాయి.‌ ఇంత కాలం ప్రజల మనసుల్లో ఎంత గూడుకట్టుకొని వున్నానో అన్న ఆనందం ఆ నాయకుడికి జీవితాంతం

గుర్తుంటుంది. జ్ఞాపకమై జీవితం మరింత గొప్పగా కనిపిస్తుంది. అలాంటి ఘటన ఒకటి స్టేషను ఘన్ పూర్ లో జరిగింది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆశ్చర్యపర్చింది. తనపై ప్రజలకు వున్న ఆప్యాయత మరో సారి తెలుసుకున్నట్లైంది

 కాకపోతే కడియం శ్రీహరికి ప్రేమను ఎంత చూపించాలో…మాకు నాయకుడిగా మీరెందుకు రావడం లేదని నిలదీసినంత పని చేశారు…నువ్వే మా నాయకుడివి అని అక్కడున్న మహిళలు ముక్తకంఠంతో చెప్పేశారు…ఈ సారి ఎన్నికల సమయంలో మీకోసం రండి…మేం గుండెల్లో పెట్టుకొని గెలిపించుకుంటాం…మరెవరికో మాత్రం ప్రచారానికి వద్దు అనేశారు…మీరు గతంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఇప్పటికీ కనిపిస్తోంది… మీరే మళ్లీ వస్తే మా కాలనీలు వెలుగుతాయన్నారు… నాయకుడిని చూస్తే ప్రజలకు సంతోషం కలగాలి. నాయకుడు ఎదురైతే స్వేచ్చగా మాట్లాడగలగాలి. ఎదురైన ప్రజలను చూసి నాయకుడు ఎలా చిరునవ్వుతో పలకరిస్తాడో, ప్రజలు కూడా అలాగే ఆహ్వానించే పరిస్థితులు నాయకుడే సృష్టించుకోవాలి. అందుకోసం ఎంతో శ్రమించాలి. ఎంతో సేవ చేయాలి. ఎంతగానో ప్రజలతో మమేకమై వుండాలి. వారి ఆపదలో అండగా నిలవాలి. వారి సంతోషంలో పాలు పంచుకోవాలి. అప్పుడు ఆ నాయకుడు ఎక్కడ కనిపించినా ప్రజలు ఆప్యాయత కనబర్చుతారు…అబ్బురపడతారు…అలాంటి అరుదైన సన్నివేశం అందరు నాయకులు కోరుకునేదే! కానీ అందరికీ సాధ్యమయ్యేది కాదు..

మరో పదేళ్లయినా ప్రజానాడి పట్టలేరు?

`తెలంగాణలో రెండు పార్టీలకు చోటే లేదు?

`అటు సఖ్యత లేదు…ఇటు బలం లేదు?

`జిల్లాల్లో నాయకత్వాలకే దిక్కు లేదు?

`ఒకరినొకరు కొట్లాటకే సమయం సరిపోవడం లేదు?

`కాంగ్రెస్‌ వి కాలక్షేప రాజకీయాలు?

`బిజెపిలో లుకలుకలు?

`కేంద్రంలో అధికారంలో వుండి రాష్ట్రానికి మేలు చేయలేరు?

`అధికారం యావ తప్ప ప్రజల ఆలోచనలకు దగ్గర కావడం లేదు!

`అభివృద్ధి అంతా గజ్వేల్‌ లోనే జరిగిందంటారు?

`గజ్వేల్‌ లో మేమే గెలుస్తామంటారు?

`సిద్దిపేట, సిరిసిల్లలకే నిధులన్నీ అంటారు?

`అక్కడ జెండా ఎగరేస్తామంటారు?

`పొంతన లేని ప్రకటనలు?

`ప్రజా క్షేత్రంలో దిక్కులేని ప్రతిపక్షాలు!

`సర్వేల పేరుతో సరికొత్త నాటకాలు?

`నిజాలు కనిపించకుండా కళ్లు మూసుకుంటున్నారు?

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేకుండాపోయి ఇప్పటికే ఎనమిదేళ్లవుతోంది. తెలంగాణ వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన నుంచి ప్రతిపక్షాలకు ఏం చేయాలో తోచుకుండాపోయింది. అప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హమీల అమలులో దేశంలో ఎక్కడా లేని పధకాల అమలుతో ప్రజలు ప్రతిపక్షాలను నమ్మే పరిస్ధితి లేకుండాపోయింది. కనీసం ప్రజలు నమ్మేందుకు సరైన వివాదం చూపించే పరిస్దితి కూడా ప్రతిపక్షాలకు లేదు. తెలంగాణ వచ్చిన వెంటనే మూడు నుంచి ఆరు నెలల్లో మొత్తం తెలంగాణలో కరంటు సమస్య తీరిపోయింది. అంతగా తీరుతుందిన ఎవరూ కల గనలేదు. రోజులో కనీసం 12గంటలైనా కరంటు వస్తే చాలు అనుకున్న సందర్భం నుంచి నిరంతరం కరంటు సరఫరా అన్నది ఒక్క తెలంగాణలోనే… ఇది ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణలో తెచ్చిన తొలి విప్లవంగా చరిత్రలో నిలిచిపోనున్నది. ఇలా మొదలైన పనులు మరుసటి ఏడాది వరకు పరుగులు పెట్టాయి. తెలంగాణలో ఊహంచిన విధంగా ఎండల్లో కూడా చెరువులు కళకళలాడాయి. వాగులకు మళ్లీ నడకలు మొదలయ్యాయి. గోదావరి జలాలు తెలంగాణ పల్లెలకు పరుగుపరుగున వచ్చాయి. తొలి ఏడాదిలోనే సుమారు 15వేలకు పైగా మిషన్‌ కాకతీయతో పల్లెలకు మళ్లీ పూర్వవైభం తెచ్చారు. మూడేళ్లలో 45వేల చెరువులకు పూర్వ కళ, జళ కల వచ్చేంది. వానా కాలంలో వరద నీటికి నిండే చెరువులను సైతం గోదావరి జలాలతో నిండుతాయని ఏ తెలంగాణ వాది కూడా ఊహించలేదు. ఎందుకంటే చెరువులు నింపకం అన్నది ఒకటి వుంటుందని, అది తెలంగాణలో జరగుతుందని కలలో కూడా కనగనలేదు. అలా అనేక సంక్షేమ పధకాలు అమలౌతున్నాయి. పల్లెలు పచ్చని పైటను కప్పుకున్నాయి. పొలాలకు నిరంతరం నీరందుతోంది. నిరంతరం కరంటు అందుతోంది. రైతుకు దిగాలు లేకుండాపోయింది. పంటలు ఎండిపోతాయన్న దిగులు లేకుండా పోయింది. రైతుకు పెట్టుబడి అన్నది గతంలో ఎవరూ అమలు సంగతి పక్కన పెడితే ఆలోచన కూడా చేసింది లేదు. అన్ని వర్గాల ప్రజల్లో ఎంతో సంతోషం నిండివుంది. గతంలో ప్రతి పార్టీ రైతు గురించి మాట్లాడేదే గాని రైతుకు పెట్టుబడి భరోసా కల్పించింది లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం వైపు దేశమంతా చూస్తోంది. ఏ రాష్ట్రంలో లేని అనేక పథకాలతో దేశమంతా ఆకర్షిస్తోంది. 

మరి ఇలాంటి సమయంలో ఇప్పుడున్న పరిస్ధితుల్లో ప్రజలకు ప్రతిపక్షాలు చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు అమలౌతున్న ప్రతి సంక్షేమ పథకం అమలు చేస్తామన్న మాట తప్ప మరో మాట చెప్పలేరు. అలాంటప్పుడు ప్రతిపక్షాలను నమ్మే పరిస్ధితి అసలే లేదు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఏదో చెప్పాలని చూసింది. కాని ప్రజలు నమ్మలేదు. ఆ పార్టీని విశ్వసించలేదు. అసలు తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటే లేదు. పైకి ఆ పార్టీలు గాయిగాయి చేస్తూ,అనవసర ప్రచారం చేసుకున్నా, ప్రజలు నమ్మే పరిస్ధితి లేదు. అసలు ఆ పార్టీలలో సంస్ధాగతంగా వారిలో వారికే సఖ్యత లేదు. బిజేపిలో తాజాగా అసలు గ్రూపులైన బండి సంజయ్‌, మంత్రి శ్రీనివాస్‌లలో ఒకరికి చెక్‌ పెట్టారు. మంత్రి శ్రీనివాస్‌కు పంజాబ్‌ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. కాని ఇప్పటికే బిజేపిలో అనేక పవర్‌ పాయింట్‌ కేంద్రాలున్నాయి. అవన్నీ బండి సంజయ్‌ దూకుడుకు ఎలా కళ్లెమేయాలని చూస్తున్నాయి. ఇదిలా వుంటే ఎంత సేపు బండి సంజయ్‌ ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టే రాజకీయం తప్ప, నిర్మాణాత్మక రాజకీయం అనుసరించడం లేదు. పైగా ఏది పడితే అదిమాట్లాడడం తప్ప, సైద్దాంతికతో, ఏదైనా సబ్జెక్ట్‌ మీద అవగాహనతో మాట్లాడిరది లేదు. గత మున్సిపల్‌ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో వరదల సమయంలో బండ్లు కొట్టుకుపోయిన వారికి కొత్త బండ్లు ఇస్తామన్నాడు. ఇచ్చారా? తూచ్‌ అన్నారు…ఆ మధ్య కేంద్రమే మొత్తం ధాన్యం సేకరిస్తుందన్నాడు. డబ్బు దండోరా వేశాడు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్దనుంచి వడ్లు కొనుగోలు చేయాలని ధర్నా చేశాడు. అంటే ఆయన కేంద్రాన్ని ఒప్పించి వడ్లు కొనుగోలు చేసే బాధ్యత నాది అని తప్పుకున్నాడు. ఇలాంటి నాయకులను మరోసారి ప్రజలు నమ్ముతారా? అంతే కాకుండా పార్టీలోనే అసలు నాయకత్వ సఖ్యతలేదు. అసలు బిజేపికి క్షేత్రస్ధాయిలో బలమే లేదు. ఓ వైపు దేశంలో ధరల మోత మోగుతోంది. బ్యాంకులు విధిగా ఇవ్వాల్సిన చెక్‌ బుక్‌ మీద కూడా జిఎస్సీ వేయడం అంటే ఏమిటో కేంద్ర ప్రభుత్వ పాలకులకే తెలియాలి. ఇది కూడా బిజేపి ఎలా సమర్ధించుకుంటుందో ఎన్నికల మందు ప్రజలు నిలదీస్తే ఏం సమాదానం చెబుతారు? ఆఖరుకు పెరుగు పాకెట్‌ మీద కూడా జిఎస్టీ వేసేశారు. పిల్లల నోట్‌ బుక్స్‌ మీద, ఆఖరుకు ఇంక్‌ మీద కూడా జిఎస్టీ విధించడం…పిల్లలు వాడుకునే షార్పునర్‌ను కూడా వదలకుండా వసూలు చేసి, మాకే ఓటు వేయండని ఎలా అడుగుతారన్నది త్వరలో తేలుతుంది. 

ఇక కాంగ్రెస్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఓ కుదుపు కుదిపేసినట్లే లెక్క. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి నాయకత్వంలో ఇష్టంగా పనిచేయలేకపోతున్నామని మీడియా ముఖంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా పిపిసి పదవి అన్నది శాశ్వతం కాదు..ఎప్పుడైనా మారొచ్చు అంటూ కూడా ప్రకటించాడు. అసలు ఇప్పటికే పార్టీకి ప్రజల్లో వున్న బలం కాస్త హరించుకుపోతుంటే, ఎన్నికల దాకైనా సఖ్యత చూపలేకపోవడం ఆ పార్టీకి నేతల వ్యక్తిగత రాజకీయాలకు నిదర్శనం. ఇదిలా వుంటే అటు కాంగ్రెస్‌, ఇటు బిజేపి చేసే కొన్ని వింతైన వాదనలు ప్రజల చేత చీ అనిపించుకోకతప్పదనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఓడిస్తాం…మంత్రి కేటిఆర్‌ను ఓడిస్తాం…అంటూ, మరోవైపు తెలంగాణ సంపద అంతా అటు గజ్వెల్‌లో, ఇట సిద్దిపేట, సిరిసిల్లలో ఖర్చు చేస్తున్నారంటూ విమర్శిస్తుంటారు. అంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకన్నా, ఈ మూడు నియోకవర్గాలు ఎంతో పురగోతిలో వున్నాయని ప్రతిపక్షాలు ఒప్పుకున్నట్లే. మరి అలాంటి చోట అంత పెద్దఎత్తున అభివృద్ధి సాగిస్తే ప్రజలు ఆ నియోజకవర్గాలలో ప్రతిపక్షాలను ఆదిరిస్తారా? ఏ నమ్మకంతో ప్రతిపక్షాలకు ఓట్లేసారు. సుమారు 45 ఏండ్లపాటు కాంగ్రెస్‌ పరిపాలన చేసింది. ఆఖరుకు తెలంగాణ ఇవ్వడానికి ముందు కూడా కాంగ్రెస్సే పరిపాలన చేసింది. మరి గజ్వెల్‌ను రాష్ట్రంలో ఎందుకు అభివృద్ధి చేయలేదు. తెలంగాణకు ముందు, ఇప్పుడు ఒక్కసారి గజ్వెల్‌ను చూస్తే ఎవరికైనా కళ్లు జిగేల్‌ మనాల్సిందే…! పైగా గజ్వెల్‌ పరిసర ప్రాంతాలు కూడ ఎంత అభివృద్ది చెందాయో అందరికీ తెలుసు. అలాంటి నియోజకవర్గంలో ప్రతిపక్షాలను నమ్మి ప్రజలు చేజేతులా అభివృద్ధి నిరోధకలుగా మారుతారా? అంతటి అభివృద్ధిని కాదనుకొని తెలంగాణ సాధకులు, ప్రగతి రథసారధుకుడైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఓడిస్తామని ప్రతిపక్షాలు పగటి కలలు గనడమే వాటి సంకుచిత రాజకీయానికి నిదర్శనం. ఆరేళ్ల పాటు మంతి పదవిలో కొనసాగినా, కనీసం డబుల్‌ బెడ్‌ రూంలు కూడా పూర్తి చేయని ఈటెల రాజేందర్‌ను గజ్వెల్‌ ప్రజలు నమ్ముతారనుకోవడం హాస్యాస్పదం కాదా? ఇదే దారిలో కాంగ్రెస్‌ కూడా పనికి రాని వ్యాఖ్యలు చేస్తూ పొద్దు బుచ్చుకుంటోంది. సరిగ్గా ఏడాది కాలంలో ఎన్నికలు జరిగే అవకాశం వుంది. ఇప్పటికీ ఏ నియోజక వర్గంలో ఎవరు నాయకులో ఆ పార్టీలే తేల్చలేకపోతున్నాయి. కనీసం తమ నాయకులు వీళ్లని చెప్పుకోలేకపోతున్నాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేసేందుకు అవసరమైన నాయకులే లేరు. కాని మేక పోతు గాంభీర్యం తప్ప ప్రతిపక్షాలకు చెప్పుకోవడానికి మాటలు లేవు…వారికి అధికారం అప్పగిస్తే కొత్తగా వాళ్లు చేసేదేమీ లేదు. నీళ్లు, నిధులు, నియామాకాలలో అన్నీంటినీ సమదృష్టితో పూర్తి చేస్తూ, అనేక సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవడం ఈసారే కాదు, మరో పదేళ్లు ప్రతిపక్షాలకు కష్టమే!

ఘనంగా కేటీఆర్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా

యువనాయకుడు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి

హనుమకొండ జిల్లా : పరకాల నియోజకవర్గంలోని పరకాల మున్సిపల్ కార్యాలయంతో పాటు కామారెడ్డిపల్లె గ్రామంలో గ్రామ

టి.ఆర్.ఎస్.పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, టి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన పరకాల ఎమ్మెల్యే *శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు*…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… యువనాయకుడు, తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నేత టి.ఆర్.ఎస్.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి , మొక్కలు నాటారు. స్వల్ప గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ గారు తొందరగా కోలుకోవాలని నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు , పరకాల మండల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు…

తూర్పులో ప్రగతి పరుగులు

నాలుగేళ్లలో రూ.3840 కోట్లతో అభివృద్ధి పనులు

అటు రాజకీయం… ఇటు అభివృద్ధిలో తూర్పు ఫస్ట్‌…బెస్ట్‌.

టిఆర్‌ఎస్‌ కు కంచుకోటగా మార్చిన ఎమ్మెల్యే నరేందర్‌…

నన్నపనేని చిత్తశుద్ధికి నిదర్శనం…

అందరినీ కలుపుకుపోతూ….

వైరి వర్గాలలోనూ మంచి మార్కులు కొట్టేస్తూ….

సమన్యాయం…రాజకీయంతో నరేందర్‌ ప్రయాణం….

కోవిడ్‌ సమయంలో 25 వేల మందికి వితరణ….

ఇంత పెద్ద ఎత్తున సేవ చేయడం సామాన్యమైన విషయం కాదు….

పార్టీ పనుల సక్సెస్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ నన్నపనేని…

సభల నిర్వహణలో పక్కా ప్రణాళికలు….

పదకొండు ఎన్నికలలో బాధ్యతలు సక్సెస్‌ ఫుల్‌…

ప్రజా జీవితం…ఉద్యమం, రాజకీయం సమతూకంతో అందరి మన్ననలు…

రెండోసారి నరేందర్‌ గెలుపు పక్కా….

తరం మారిన రాజకీయాల్లో కొత్త కొత్త నాయకత్వాలొచ్చాయి. తెలంగాణలో నూతన నాయకత్వ బాధ్యతలొచ్చాయి. పాలనలో కొత్త పుంతలొచ్చాయి. ఒకనాడు తమ ప్రాంత అభివృద్ధికోసం పరాయి పాలకుల వద్ద మొరపెట్టుకోవాల్సివచ్చేది. కాని నేడు తెలంగాణ ఉద్యమకారుడు, సాధకుడైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో

పనిచేసి,ఉద్యమంలో మమేకమైన ఎంతో మంది నాయకుల అంకితభావంలో తెలంగాణ ప్రగతి పరుగులు పెడుతోంది. అందులో వరంగల్‌ తూర్పు ఒకటి. నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో అభివృద్ధి వెల్లివిరుస్తోంది. ప్రగతి పరుగులు పెడుతోంది. నాయకులంటే గతంలో లాగా చూద్దాం…చేద్దాం అని చెప్పే రోజులు పోయాయి. పట్టుబట్టి మరీ పనులు చేసే నాయకులొచ్చారు. ఉద్యమంలో నరనరాన తెలంగాణ వాదాన్ని నింపుకున్న వారు నాయకులు కావడంతో తాము కలలు గన్న తెలంగాణ ఆవిష్కరణ కోసం పనిచేస్తున్నారు. దగ్గరుండి క్షణం తీరిక లేకుండా, ప్రజా జీవితంలో ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేస్తున్న నాయకులున్నారు. అందులో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ ఒకరు. అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక్క మెతుకు ముట్టుకొని చెప్పొచ్చు. నన్నపనేని నరేందర్‌ లాంటి ఉద్యమ కారుడు కరోనా సమయంలో తన ప్రజలను ఎలా కళ్లల్లో పెట్టుకొని చూసుకున్నాడో తెలుసుకుంటే చాలు. కరోనా మూలంగా తన ప్రజలు ఎవరూ అన్నమో రామచంద్రా అని బాధపడకూడదని కొన్ని నెలల పాటు సుమారు 25వేల కుటుంబాలకు ఆయన నిత్యావసర వస్తువులు సరఫరా చేశారంటేనే ప్రజలంటే ఆయనకు ఎంత ప్రాణమో అర్ధం చేసుకోవచ్చు. ఇంతగా తన నియోజకవర్గ ప్రజలకు సేవలందించిన నాయకులు ప్రతిపక్షాలలో లేరు. గత తరం నాయకుల్లో కూడా లేరు. కాని యువతరం ప్రతినిధిగా, నవరతం నాయకుడిగా తన ప్రజల యోగక్షేమాలు చూసుకునే నాయకుడిగా నన్నపనేని కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలవడం ఇప్పటికీ ప్రజలు ఎంతో గుర్తు చేసుంటుంటారు. ఆయనే మమ్మల్ని ఆడుకున్నాడని సగరవ్వంగా చెప్పుకుంటారు. ఏ నాయకుడు ఎదురైనా ప్రజలు నన్నపనేని ఔదార్యాన్ని చెబుతుంటారు. అటు సామాజిక కార్యక్రమాలు, ఇటు పార్టీకి సేవలు, ప్రజా ప్రతినిధిగా ప్రజలకు అవసమైన అభివృద్ధి పనులు, వారి వ్యక్తిగత పనులు, వైద్య సేవలు ఇలా నిత్యం ప్రతి క్షణం ప్రజల కోసం తపించే నాయకుడిగా నరేందర్‌కు పేరుంది. ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకునే నాయకుడిని అదే ప్రజలు కూడా అంతే విధంగా గుండెల్లో పెట్టుకుంటారని చెప్పడానికి తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ ను చెప్పుకోవ్చు. 

2018లో ఎమ్మెల్యే అయిన నన్నపనేని నరేందర్‌ పదవీ కాలంలో రెండు సంవత్సరాల కాలం కరోనా మహమ్మారితోనే గడిచిపోయింది. అయినా ఏ ఒక్కనాడు ఆయన ప్రజలకు దూరంగా లేడు. నిత్యం ప్రజల మధ్య తిరుగుతూనే వున్నాడు. ప్రజలకు సేవ చేసే కార్యమ్రంలోనే నిమగ్నమయ్యాడు. పేదలకు సేవ చేసేందుకు అసవరమైన అన్ని చర్యలు తీసుకున్నాడు. వారికి ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూసుకున్నాడు. 25వేల కుటుంబాలను కాపాడుకున్నాడు. ఇక మిగిలిన రెండు సంవత్సరాల కాలంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు, మంత్రి కేటిఆర్‌తో ఆయనకు వున్న సత్సంబంధాల మూలంగా అతితక్కువ సమయంలోనే తన అనేక పనులు పూర్తి చేశారు. అందులో అన్ని డివిజన్లలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్ధ ఏర్పాటుతో ఇన్నేళ్ల చరిత్రలో వరంగల్‌లో కాలనీలలో నీరు నిలిచింది లేదు. అంత పకడ్భందీగా పనులు చేయించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పనులు పూర్తి చేస్తున్నారు. సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో వరంగల్‌లో కొత్త బస్టాండ్‌ ఏర్పాటు చేయడంజరిగింది. ప్రస్తుతం వరంగల్‌ నగరానికే తలమానికం కానున్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కూడా శరవేగంగా సాగిపోతోంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఏర్పాటు కోసం శ్రమించడమే కాకుండా, భవననిర్మాణం కోసం భూమి చదును కూడా తన సొంత నిధులు వెచ్చించిన ఎమెల్యే నన్నపననేని నరేందర్‌.  

ఉద్యమ కాలంలో వరంగల్‌ నగర అధ్యక్షుడిగా పార్టీపరమైన నిర్ణయాలను ఎప్పటికిప్పుడు అమలు చేయడంతోపాటు, ఉద్యమాన్ని ఉర్రూతలూగించడంతో తన వంతు పాత్రను పోషించడంతో నన్నపనేని పార్టీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు అత్యంత సన్నిహితుడు కాగలిగాడు. ఒకానొక దశలో నన్నపనేని నరేందర్‌ అనార్యోం పాలయ్యారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో బీజీగా ఉండే ఉద్యమ సమయంలోకూడా నిత్యం నన్నపనేని నరేందర్‌ ఆర్యోగంపై వాకబు చేసేవారు. ఇది నన్నపనేనిని ఎంతో కదిలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యమకారులు, పార్టీ నాయకులున్నారు. అంత మందిలోనూ తనపై ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ప్రత్యేకమైన ఇష్టమన్నది ఈ ఒక్క సంఘటనతోనే తేలిపోయింది. అందుకే నన్నపనేని నరేందర్‌ పార్టీ ఏది చెబితే అదే చేస్తూ వచ్చారు. నిజానికి 2014లోనే నన్నపనేని నరేందర్‌కు ఎమ్యెల్యే టిక్కెట్‌ రావాల్సివుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సూచన మేరకు వదులుకున్నారు. ఆ తర్వాత నన్నపనేని మేయర్‌ అయ్యారు. రాష్ట్రంలోనే వరంగల్‌ నగరంలో పారిశుద్య నిర్వహణ, స్వచ్ఛ సర్వేక్షణ్‌ అమలులో అనేక అవార్డులు సంపాదించారు. ఏకంగా రాష్ట్రపతి అవార్డు కూడా వరంగల్‌కు తెచ్చిపెట్టారు. నిత్యం పేరుకుపోయే చెత్తతో కంపోస్టు ఎరువు తయారీ చేసే సరికొత్త ఆవిష్కరణకు నరేందర్‌ మేయర్‌గా వున్న కాలంలోనే శ్రీకారం జరిగింది. ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలలో ఈ కార్యక్రమం చేపట్టడం కోసం ఒక చట్టం తేవడం జరిగింది. గతంలో వరంగల్‌ నగరంలో మంచినీటి సరఫరా అనేక ఇబ్బందులు వుండేది. కాని నరేందర్‌ మేయర్‌ అయ్యాక రెండురోజులకోసారి నీటి సరఫరాతో వరంగల్‌ ప్రజల దాహార్తి తీర్చారు. 

ఇక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే నరేందర్‌ చూపిన రాజకీయ చాణక్యం ఎంతో గొప్పది. పార్టీకి ఎంతో మేలు జరిగింది. మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాసకు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టడంతో కీలకపాత్ర పోషించడం జరిగింది. తన నియోకజవర్గ పరిధిలోని మున్సిపల్‌ టిక్కెట్ల కేటాయింపులో ఎంతో చాకచక్యమైన పంపకాలతో అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. సిపిఎం పార్టీనుంచి టిఆర్‌ఎస్‌లోకి రావడం వల్ల వారికి బోగి సురేష్‌, పల్లం రవి, సోమిశేట్టి ప్రవీణ్‌ మూడు సీట్లు ఇచ్చారు. కొండా మురళి ప్రధాన అనుచరులైన ఇద్దరు జారటి రమేష్‌, కేడల జనార్ధన్‌లకు కూడా టిక్కెట్లు ఇచ్చారు. వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన నిష్కమల అరుణ సుధాకర్‌కు కూడా ప్రాదాన్యమిచ్చి టిక్కెట్‌ ఇవ్వడం జరిగింది. ఇక ఉద్యమ కారులు దామోదర్‌ యాదవ్‌, సిద్దం రాజు, మరుపల్లె రవి, ఎలగం సత్యనారాయణ, సురేష్‌ జోషి, బస్కుల బాబు, కావేటి కవిత, విజయభాస్కర్‌రెడ్డి, గుండేటి నరేందర్‌ కేటాయించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన అధ్యక్షురాలు పోషాల పద్మకు టిక్కెట్‌ ఇచ్చారు. బిజేపి నుంచి పార్టీలో చేరిన గందె కల్పన, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ దిడ్డి కుమార స్వామి, సీనియర్‌ నాయకుడు ఓణి బాస్కర్‌, మైనార్టీ కోటా కింద ఎండి. పుర్కాన్‌లకు ఇచ్చారు. మాజీ ఎమ్మెలే, మాజీ మంత్రి బస్వరాజు సాయర్య కోడలు శిరీషకు అవకాశం కల్పించారు. అయినా బస్వరాజు సారయ్య తమ తమ్ముళ్లను పార్టీకి వ్యతిరేకంగా రంగంలోకి దింపారు. కాపు సామాజిక వర్గం సురేష్‌, పద్మ శాలి సామాజిక వర్గం రామతేజ్వనికి ఇచ్చి అన్ని వర్గాలకు, సామాజిక వర్గాలకు న్యాయంచేశారు. ఇంత మందికి టిక్కెట్టు కేటాయింపులతో తన అనుచరుడైన మోడే ప్రవీణ్‌కే టిక్కెట్టు ఇచ్చుకోలేకపోయారు. తనకు తానే రాజీకయంగా త్యాగం చేసినంత పనిచేశారు. మోడే ప్రవీణ్‌ అనే అనుచరుడికి టిక్కెట్‌ ఇవ్వలేకపోయాడు. మోడే ప్రవీణ్‌కు ఇవ్వాలనుకున్న సీటును పల్లం రవికి ఇవ్వడం జరిగింది. గుండు పూర్ణ వల్ల ఓ సీటు ఓటమి తప్పలేదు. మరో వైపు ఎలగం సత్యనారయణ వంద ఓట్ల ఓడిపోవడానికి కారణం ఎవరో ప్రజలకు తెలుసు. ఇలా మున్సిపల్‌ ఎన్నికల్లో తన నియోజకవర్గ పరిధిలో వున్న 24 సీట్లలో 20 సీట్లు కారుకు గెలిపించుకొని, తనపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. తర్వాత కాలంలో బిజేపి నుంచి గెలిచిన వారిని కూడా టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించి, కారుకు మరోసారి తిరుగులేదని నిరూపించారు. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలైనా, మున్సిపల్‌ ఎన్నికలైనా, స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నిలైనా ముందుగా పార్టీ గుర్తించేది నన్నపనేని నరేందర్‌. ఆయనకు ఎక్కబ ఇన్‌చార్చి బాద్యతలు అప్పగించినా అక్కడ సక్సెస్‌. అలా స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికలు, మహబూబాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికలు, జిహెచ్‌ఎంసి ఎన్నికలు ఇలా ఏ ఎన్నికలైనా నన్నపనేనికి బాధ్యతలు అప్పగించాల్సిందే….ఇలా ఆయన సుమారు 11 ఎన్నికల సమయాల్లో కీలకభూమిక పోషించారు. పార్టీని గెలిపించారు. ఇక రాజకీయ సభ నిర్వహణ అంటే కూడా ముందుగా గుర్తొచ్చేది కూడా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేనే…ఆయన ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో నిర్వహించిన మూడు సభలు సూపర్‌ సక్సెస్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేత, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ చేత శబాష్‌ అనిపించుకున్నారు. ఇలా పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా వాటిని విజయవంతం చేసి, సక్సెస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నరేందర్‌ పేరు పొందారు. అటు ప్రజలు, ఇటు పార్టీని రెండిరటీనీ సమన్వయం చేసుకుంటూ, పార్టీ బలోపేతానికి పాల్పడుతూ, తన నాయకత్వాన్ని మరింత పదిలం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన నియోజకవర్గంలో కారు తప్ప మరో పార్టీకి చోటు లేకుండా చేశారు. ఇలా ముందుచూపుతో రాజకీయం చేయడంలో కూడా నరేందర్‌ ఆరితేరాడు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ టిక్కెట్‌ నరేందర్‌కే…! ఎవరైనా అత్యాశకు పోతే నిరాశే మిగులుతుంది. ఎందుకంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే కాదు, ప్రభుత్వ పథకాల అమలులోనూ, అభివృద్ధి పనులు అమలు చేయడంలోనూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే నరేందర్‌ ముందున్నాడు. ఇక దళిత బంధు వంటి పథకం అమలులో ఆయన చూపిన చొరవ ఎంతో గుర్తింపు తెచ్చింది. ఎక్కడా ఎలాంటి వివాదం లేకుండా దళిత బంధు అందేలా ప్లాన్‌ చేశారు..అందరిచేత ప్రశంసలందుకుంటున్నారు. ఈ విజయాలు, పథకాల అమలుతో వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికలంటే డబుల్‌ మెజార్టీ సాధించి, వచ్చే ప్రభుత్వంలో నన్నపనేని నరేందర్‌ మంత్రిగా చూడాలన్నదే నియోకవర్గ ప్రజల అభిప్రాయం. ఆయన అనుచరుల, అభిమానుల కోరిక…అది నెరవేరాలని కోరుకుందాం..!

కడుపులోనే ఖతం!

`ఆడపిల్ల పుట్టొద్దా! అసలు బతకొద్దా!?

`కడుపులో పడడమే ఆడపిల్ల చేసుకున్న నేరమా?

`వరంగల్‌ జిల్లా కేంద్రంగా విచ్చలవిడిగా బ్రూణ హత్యలు!

`ఇటీవల అబార్షన్‌ వికటించి మహిళ మృతి!

`వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలిసింది?

`నిత్యం పదుల సంఖ్యలో అబార్షన్లు?

`ఓ ప్రాథమిక చికిత్స కేంద్ర నిర్వాహకురాలి నిర్వాకం?

`మూడు సార్లు జైలుకెళ్లొచ్చినా ఆపని వ్యాపారం?

`లక్షలకు లక్షలు వసూలు?

`అబార్షన్‌ వికటించి, ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి చేర్ఛినా దక్కని మహిళ ప్రాణం?

`వీటన్నింటికీ చక్రం తిప్పుతున్నదెవరు?

`పురిటిలోనే ఆడపిల్లలను ఆగం చేస్తున్నారు?

`కడుపులోనే పసికందుల ప్రాణాలు తీస్తున్నారు?

`ఇదో పెద్ద రాకెట్‌…?

`హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు అందరూ సంప్రదించేది ఆ మహిళనే!

`తెలంగాణ వ్యాప్తంగా వందలాది ఆసుపత్రులకు ఆమెతో లింకులే?

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

బృణ హత్యలు…ఇంకా ఎంత కాలం విందాం…ఎంత కాలం చెప్పుకుందాం…ఇంకా ఏ ఆటవిక సమాజంలో బతుకుతున్నాం….? రాజుల కాలం నుంచి వింటూనే వున్నాం…ఇంకా భ్రూణ హత్యలు చేస్తూనే వున్నాం…ఇంకెంత కాలం…ఆడ..మగ తేడాలు…! ఆడపిల్ల పుట్టడమే నేరమా? ఆడపిల్ల కడుపులో పడడమే శాపమా? ఆడ పిల్ల పుట్టొదా? పుట్టినా బతుకొద్దా? బతికి రేపటి తరానికి దారి చూపొద్దా… ఈ ప్రపంచానికి మానవ మనుగడను అందించించొద్దా? అయినా ఒక జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు? మూగ జీవాలను చంపడమే నేరమైన మన సమాజంలో కళ్లు తెరవని పసిగుడ్డును కర్కషంగా అత్యంత ఫాషవికంగా చిద్రం చేయడానికి మనసెలా వస్తోంది? ఒక ఆడపిల్లను చంపడం అంటే అమ్మను చంపడం కాదా? అమ్మలేకుండా ఈ సృష్టి వుంటుందా? ఈ సృష్టిలో అమ్మలేకుండా ఏ జీవైనా పురుడుపోసుకుంటుందా? సృష్టికి మూలమైన అమ్మనే పురిటిలోనే నులిమి, నలిపి చంపడం పాపం కాదా? ఆపదలు వస్తే అమ్మా అని కొలుస్తాము…అడ్డంకులు ఎదురైతే దేవతలకు పూజలు చేస్తాము..కాని ఆడపిల్ల మన ఇంట్లో పడుతుంటే వద్దనుకుంటాము? మగ సంతామనే కావాలి…ఎంత మంది మగాళ్లు పుట్టిన ఫరవాలేదు…కాని ఆడపిల్ల మాత్రం వద్దనుకునే సమాజం, తనను తానే నాశనంచేసుకుంటోంది….బృహత్యలు చట్టరిత్యా నేరం: 

మన దేశంలో గర్భస్ధ లింగనిర్దారణ పరీక్షలు చట్టరిత్యా నేరం. పిసి.పిఎన్‌డిటి. ఆక్ట్‌ 1994 ప్రకారం గర్భధారణ, పూర్వ గర్భస్ధ పిండ నిర్ధారణ పరీక్షలు చేసే వారికి, చేయించుకునే వారికి కూడా శిక్షలున్నాయి. మూడు సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తారు. ఇవే కాకుంగా లింగనిర్ధారణ పరీక్షల విషయంలో వరకట్న వ్యతిరేక శాసనాలు…నిశేద చట్టం 1961 ప్రకారం లింగనిర్ధారణ పరీక్షలు నేరం.అమాయక ప్రజలు బలహీనతలను ఆసరాగా చేసుకొని, ప్రాణాలు నిలపాల్సిన చేతులతో ప్రాణాలు తీస్తున్నారు. ఆడ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఓ వైపు పెద్ద ఎత్తున పెట్టబడిపెట్టి పెద్ద పెద్ద ఆసుపత్రులు ఏర్పాటు చేసుకున్న వాళ్లు, మరో వైపు వైద్యం సరిగ్గా తెలియకపోయినా డాక్టర్లుగా చెలమణీ అయ్యేవాళ్లు ఓ రాకెట్‌గా ఏర్పాటె ఈ దుర్మాగర్గం నెరుపుతున్నారు. ప్రజల బలహీనతలతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ కోట్లాది రూపాయల ప్రాణం ఖరీదు వ్యాపారం సాగిస్తున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా అందుకు కేంద్రంగా నడుస్తోందంటే వైద్య వృత్తి ఎంత దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

లింగనిర్ధారణ పరీక్షలు చేయడమే నేరమైనప్పుడు తప్పని పరిస్ధితుల్లో చేయొచ్చన్న చిన్న లొసుగును కూడా వాడుకుంటూ ఇలా ఆడపిల్లల జీవితాలు పిండ దశలోనే పిసికేస్తున్నారు..పాపాలు మూటగట్టుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే తాజా వెలుగులోకి వచ్చింది. ఓ జంటకు ఇప్పటికే ఇద్దరమ్మాయిలున్నారు. ఆ ఇద్దరితో ఆ జంట సరిపెట్టేకుంటే బాగుండేది. కాని కొడుకు కావాలి. పున్నామన నరకం నుంచి బైట పడేయాలన్న మూఢ నమ్మకం మన దేశంలో ఎంతో మంది జీవితాలను అర్ధాంతరంగా తనువు చాలించేలా చేస్తోంది. మరోసారి గర్భం దాల్చిన అమ్మాయికి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దాంతో మళ్లీ ఆడపిల్ల అని తేలింది. అప్పటికే సమయం కూడా మించిపోయినా ఆ పిండం వుంచుకోకూడదని ఆ కుటుంబం భావించింది? కాసుల కక్కుర్తి కోసం ఎలాంటి ఆబార్లన్లైనా చేయగలిగిగే వాళ్లు కూడా జిల్లాలో తయారయ్యారు. అలాంటి వారిలో ఓ జంట వైద్య వృత్తిని అడ్డుపెట్టుకొని ప్రాణాలను కూడా తోట కూర కాడల్లా తుంచేసే కార్యక్రమాలు గత కొంత కాలంగా సాగిస్తున్నారు. ఇప్పటికే వైద్య వృత్తిని అడ్డం పెట్టుకొని అడ్డమైన పనులు చేస్తున్న మహిళపై మూడు క్రిమినల్‌ కేసులు నమోదై వున్నాయి. మూడు సార్లు జైలు జీవితం కూడా అనుభవించింది. అయినా సరే ఇలాంటి భ్రూణ హత్యలు చేయడం ఆపడం లేదు. కొన్ని సార్లు ఈ ఆఫరేషన్‌ వికటించి, తల్లి ప్రాణాలు కూడా కోల్పోయేందుకు కారణం కావడం జరుగుతూనే వుంది. ఈ నిపుణురాలుకాని, వైద్య విద్యతో సంబంధం లేకపోయినా నకిలీ అవతారమైన ఆ మహిళా వైద్యురాలికి జిల్లాలోని అనేక ఆసుపత్రులతో సంబంధాలున్నాయి. ఇలా వికటించిన కేసులు ఆయా ఆసుపత్రులకు పంపించడం మేలు జరిగితే ఆయా కుటుంబాలనుంచి లక్షలు వసూలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఒక వేళ ఏదైనా ఆపరేషన్‌లో తేడా జరిగి, మహిళల ప్రాణాలు కోల్పోతే వారికి నష్ట పరిహారం చెల్లించి మరీ కేసులు నమోదు కాకుండా చూసుకుంటున్నారు. నిత్యం పదలు సంఖ్యలో అబార్షన్లు చేసుకుంటూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులతో కలిసి వాటాలు పంచుకుంటున్నారు. ఏటా కొన్ని కోట్ల రూపాయాల నేరమైన దందాను సాగిస్తున్నారు. 

తాజాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే ఓ మహిళకు సదరు నేరస్ధురాలైన వైద్యురాలు ఆపరేషన్‌ చేసి పిండాన్ని తీసే ప్రయత్నం చేశారు? ఏం జరిగిందో గాని రక్త స్రావం ఎక్కువ కావడంతో ఆమెను వరంగల్‌లోని ఓ పేరు మోసిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఎంతో రక్తం పోయిన మహిళకు ఆ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్న క్రమంలో గుండెకు సంబంధించిన సమస్య ఎదురైంది? దాంతో వెంటనే తేరుకున్న ఆ ఆసుపత్రినుంచి ఆ మహిళను మరో ఆసుపత్రికి తరలించారు. కాకపోతే అక్కడ చికిత్స అందుతున్న సమయంలోనే ఆ మహిళ ప్రాణాలుపోయాయి. దాంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ మహిళను పంపించేసి ఆసుపత్రులు, వైద్యురాలి ముసుగులో వున్న కిలేడి చేతులు దులుపుకున్నారు…ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు. మొగ్గలోనే ఓ పసి ప్రాణాన్ని తుంచేశారు…ఇద్దరు అమ్మాయిలను అనాధలను చేశారు…? ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలకు దిక్కెవరు? ఓ అమాయపు జంట ఆశలను ఆసరాగా చేసుకొని ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న తల్లికి నిర్లక్ష్యంగా వైద్యం చేసి, పిండాన్ని తీసేసే క్రమంలో ఆమె ప్రాణం తీశారు. ఇద్దరు అమ్మాయిలు అనాధలను చేశారు.. వారి ఆలనా,పాలనా ఎవరు చూస్తారు? వారి జీవితాలకు ఎవరు భరోసా కల్పిస్తారు. సహజంగా ఇలాంటి సందర్భంలో ఏ డాక్టరైనా కడుపు తీయించుకోవడం నేరమన్న సంగతైనా చెప్పాలి. ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదని వారిలో చైతన్యం నింపాలి. ప్రాణాలు నిలిపే వైద్య వృత్తిలో వుంటూ కాసులకు కక్కుర్తి పడే వాళ్లు తయారు కావడంతో ఇలాంటి దుర్మార్గాలు దర్జాగా సాగుతున్నాయి. ఎక్కడో ఒకటి వెలుగులోకి వస్తున్నా, వాటిని కరెన్సీ కట్టల మాటున దాచేస్తున్నాయి. జిల్లా వైద్య శాఖ ఏం చేస్తోంది? నిద్ర పోతోందా?

ఇలా భ్రూణ హత్యలు విచ్చలవిడిగా జరుగుతుంటుంటే, అయాకుల ప్రాణాలు తోడేస్తుంటే, కడుపులోనే పిండాలను చిదిమేస్తుంటే ఏం చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన వెలుగులోకి ఇన్ని రోజులైనా వైద్య శాఖ ఎందుకు కదలడంలేదు. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ఇలాంటి దుర్మార్గాలు నిత్యం జరుగుతుంటే మంతి ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు ఆమెకు ఈ సంఘటన తాలూకు వివరాలు తెలిశాయా? లేదా? ఒక వేళ తెలిస్తే మంత్రి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదన్నది కూడా ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా దోషులను గుర్తించండి. తప్పు చేసిన వారిని పట్టుకోండి. నేరం చేసిన వారిపై కేసులు నమోదు చేయండి. అన్యాయం పాలైనా ఆ కుటుంబాన్ని ఆదుకోండి. భవిష్యత్తులో భ్రూణ హత్యలు చేయడానికి ఏ డాక్టరైనా భయపడేలా చర్యలు తీసుకోండి…హెచ్చరికలు జారీ చేయండి. ఇంతటి దుర్మార్గానికి కారణమైన ఆసుపత్రుల లైసెన్పులు రద్దు చేయండి? వైద్యలు లైసెన్పులు కూడా సస్పెండ్‌ చేయండి? ఆసుపత్రులమీద నిరంతర నిఘా ఏర్పాటు చేయండి. ఆడపిల్లను బతికించండి…!

ఆగని టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు..

అధిక ధరలు, జీఎస్టీ భారాలు తగ్గించాలని డిమాండ్ 

నిరసనలతో అట్టుడుకిన పార్లమెంట్

ఢిల్లీ, జూలై, 22:

కేంద్రం పెంచిన ధరలు, జీఎస్టీ భారాలపై టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు శుక్రవారం కూడా కొనసాగాయి. పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ప్ల కార్డులతో నిరసనకు దిగారు.

అధిక ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఇతర విపక్ష పార్టీల ఎంపీలు కూడా తమ నిరసన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్‌సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, నేతకాని వెంకటేష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములు, దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదిగో ఆధారం! రాజీనామాకు ఎప్పుడు సిద్ధం!?

`ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ విసిరిన ఛాలెంజ్‌ కు ఇవిగో సాక్ష్యాలు?

`సవాలు విసిరి మరీ రిజిస్ట్రేషన్‌ శాఖను చిక్కుల్లోకి నెట్టిన సబ్‌ రిజిస్ట్రార్‌!

`పరోక్షంగా శాఖకే సవాలు విసిరిన వైనం?

`పై అధికారుల చేతగాని తనాన్ని ఎద్దేవా చేసినంత ఉదంతం?

`తన అవినీతికి పట్టుకోలేకపోయారని ఎగతాళి చేసినంత పనిచేసిన సబ్‌ రిజిస్ట్రార్‌?

` అవినీతికి అడ్డాగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం మార్చి ప్రైవేటు వ్యక్తుల జోక్యం తేటతెల్లం?

` ఇప్పుడైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా? లేదా!

` ఇన్ని సాక్ష్యాలను మరుగున పడేసిన విచారణ అధికారులు కూడా దోషులే?

`పత్రికలన్నీ కథనాలు రాసినా స్పందన లేని అధికారులు ఇప్పుడేం చెబుతారు?

`ఎవరీ బిక్షపతి?

`అతనికి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి సంబంధం ఏమిటి?

`లాగిన్‌ ఐడి అతని చేతికెలా వచ్చింది?

`ప్రైవేటు వ్యక్తులకు లాగిన్‌ ఐడి ఇవ్వడం నేరం కాదా?

`సబ్‌ రిజిస్ట్రార్‌ ను ఇంత కాలం వెనకేసుకొచ్చిన వాళ్లది కూడా తప్పే?

`ఏళ్లకేళ్లు తిష్ట వేసుకొని సబ్‌ రిజిస్ట్రార్‌ చేసిన తప్పులకు రుజువులివి!

`తప్పులు చేసి, నేటిధాత్రి మీద నిందలేస్తే ఊరుకుంటామా?

`ఇంతకన్నా రుజువులేం కావాలి?

`ఇప్పటికైనా విచారణ మొదలుపెడతారా? మీనమేషాలే లెక్కిస్తారా!

`నేటిధాత్రి చేతిలో సబ్‌ రిజిస్ట్రార్‌ అక్రమాల చిట్టాలు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ములుగులో సబ్‌ రిజిస్ట్రార్‌ చేసిన అక్రమాలకు నిరదర్శనం. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారని చెప్పడానికి సాక్ష్యం. అక్రమాలు చేసినట్లు కనిపిస్తున్న దృశ్యం…ప్రైవేటు వ్యక్తికి లాగిన్‌ ఐడి కూడా ఇచ్చినట్లు తేట తెల్లం…బైట పడిన వ్యక్తి నామదేయం…ఇప్పుడేం చెబుతారు? ప్రకటించినట్లే సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగం నుంచి తప్పుకుంటారా? తప్పు జరిగిందని ఒప్పుకుంటారా? అయినా బుకాయించడానికి కొత్త దారులు వెత్తుక్కుంటారా? తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారా? అంతా తూచ్‌ అంటారా? ఇవన్నీ కల్పితాలంటూ కొత్త రాగం అందుకుంటారా? జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాక కూడా బుకాయిస్తే సరిపోదు…తాను తప్పు చేయలేదంటే ఎవరూ ఒప్పుకోరు…? అతి విశ్వాసం అనర్దాలకు దారి తీస్తుంది. ఒక తప్పు వంద తప్పులను చేసేందుకు ఆస్కారమిస్తుంది. ఇంత కాలం ఏ అధికారులైతే సబ్‌ రిజిస్ట్రార్‌ను వెనకేసుకొచ్చారో…వాళ్లును కూడా ఒక్క మాటతో సబ్‌ రిజిస్ట్రార్‌ దోషులను చేసినట్లే లెక్క. ఎందుకంటే తాను ఎలాంటి తప్పు చేయలేదని పై స్ధాయి అధికారులకు కూడా తెలుసున్నంతగా గొప్పగా తనను తాను చిత్రీకరించుకున్నారు. అంటే పెద్దల ఆశీస్సులు తనకు మెండుగా వున్నాయని, తానేం తప్పులు చేసినా చూస్తూ ఊరుకున్నారని చెప్పకనే చెప్పినట్లైంది. పైగా తనపై వచ్చిన ఆరోపణలపై కూడా జరిగిన విచారణల్లో కూడా తప్పేం లేదని తేలినట్లు కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ చెప్పుకున్నారు. అంటే విచారణ కోసం వచ్చిన అధికారులు కూడా పొరపాటు చేశారని చెప్పినట్లే లెక్క. ఒక వేళ విచారణ చేసిన అధికారులకు సబ్‌ రిజిస్ట్రార్‌ లాగిన్‌ ఐడి ప్రైవేటు వ్యక్తికి ఇచ్చినట్లు కనిపెట్టలేకపోయారా? బైటపట్డా ఆమెను వెనకేసుకొచ్చారా? ఆమెకు క్లీన్‌ చీట్‌ ఇచ్చారా? అంటే విచారణ చేపట్టే అధికారులకు కూడా ఆమె ఇక్కడ ఇరికించేసినట్లే లెక్క. తాను చేసిన అక్రమాలన్నింటిలో పై స్ధాయి అధికారుల పాత్ర కూడా వుందని స్వయంగా సబ్‌ రిజిస్ట్రారే వెల్లడిరచినట్లైంది. ఓ వైపు సవాలు విరుసురుతూనే మరో వైపు ఎన్ని తప్పులు చేసినా వెకనేసుకొచ్చిన అధికారులకు కూడా ముప్పు తెచ్చేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ వెనకాడడం లేదన్నది కూడా తేలిపోయింది. తను తప్పించుకునేందుకు ముందే మార్గం సుమగమం చేసుకుంటూ, ప్రతి దాంట్లో పైస్ధాయి పెద్దలను ఇరికిస్తూ వచ్చారన్నది తేటతెల్లమైంది. ఇప్పుడు ఉన్నతాధికారులు ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. 

ఇంతకీ బిక్షపతి ఎవరు? 

ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాయలంలో ప్రభుత్వ ఉద్యోగా? ప్రైవేటు వ్యక్తా? సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగి కాని వ్యక్తిపేరు డాక్యుమెంట్లలోకి ఎలా చేరింది? బిక్షపతి ప్రైవేటు వ్యక్తి అయితే కార్యాలయంలో విధులెలా నిర్వర్తించారు? ఆయనను ఎవరు రిక్రూట్‌ చేసుకున్నారు? ఎలా విధులు అప్పగించారు? ప్రభుత్వమేమైనా కాంట్రాక్టు పద్దతిన తీసుకున్న ఉద్యోగా? అయినా రిజిస్రేషన్‌ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగులకు అంత స్వేచ్ఛ వుంటుందా? లాగిన్‌ ఐడిని ఉపయోగించేంత శక్తి వుంటుందా? ఇదంతా సబ్‌ రిజిస్ట్రార్‌ కనుసన్నల్లో జరగుకుండా వుంటుందా? సబ్‌ రిజిస్ట్రార్‌కు తెలియకుండా లాగిన్‌ ఐడి తెలుస్తుందా? ఓపెన్‌ అవుతుందా? ఒక ప్రాంతానికి చెందిన భూమలైన స్ధిరాస్ధులు, ప్రభుత్వ ఆస్ధులు, స్థలాలు, ముఖ్యంగా అటవీ భూముల నిర్వహణ జరిగే ప్రాంతంలో బాధ్యతాయుతమైన సబ్‌ రిజిస్ట్రార్‌ ఎంత అంకితభావంతో వుండాలి. ఎంత కర్తవ్య దీక్షతో వుండాలి. అది వదిలేసిన కార్యాలయాన్ని ఎవరి చేతిలోనే పెట్టేసి, జరగాల్సిన అక్రమాలకు కేంద్రంగా మార్చేసి తానేమీ ఎరగను? తనేం తప్పు చేయలేదు? తప్పు చేస్తే ఇంత కాలం ఎలా వుంటాను? అంటూ కొత్త పల్లవి అందుకోవడమే కాదు…తన తప్పులు నిరూపిస్తే ఉద్యోగం మానుకుంటానని కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రకటించారు…

ఒక మంచి పని చేయడానికి ఎంత దూరమైనా వెళ్లొచ్చు. 

ఎంత సేవైనా చేయొచ్చు…ఇది ఎవ్వరూ కాదనలేరు. ఎంత దూరమెళ్లినా, ఎవరికీ అన్యాయం చేయకుండా వుంటేనే ఏ సేవకైనా అర్ధం పరమార్ధం వుంటుంది. దోసెడు దోచుకున్నట్లు ఆరోపణలు కంటి ముందుకనిపిస్తున్నా, పిడికెడు పెట్టి కొండంత ప్రచారం చేసుకుంటుంటే ప్రజలు గుర్తించలేరా? పెట్టే పిడికెడు కష్టపడి సంపాదించింది కాదు…పేదలను కష్టపెట్టి దోచుకున్నదాంట్లో నుంచి మెతుకులు విదిలిస్తే గమనించలేరా? పెట్టిన పిడికెడుకు పుట్టెడు ప్రచారం చేసుకుంటే సరిపోదు…దోచుకున్న దోసెడుకు కూడా సమాధానం చెపాల్సి వస్తుంది? పవిత్రమైన ఉద్యోగ నిర్వహణలో వుంటూ, ప్రజల భూములకు రక్షణగా నిలవాల్సిన కుర్చీలో కూర్చొని ఆ భూములకే ఎసరు పెడుతుంటే జనానికి తెలియకుండా పోతుందా? పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగితే కనిపించదా? జనం దగ్గర దోచుకోవడానికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్‌ దాచుకున్నదేమీ లేదు? కర్తవ్యం గంగలో కలిపి, చెంచా నైవేద్యం చేతిలో పెట్టి నాకిస్తా..? అందిన కాడికి దోచేస్తా…భూములను చెరపట్టేవారికి అండగా వుంటా? అంటే జనం సహిస్తారా? తానేమీ తప్పు చేయలేదంటూనే తనపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఏదో విచారణ చేపట్టి, క్లీన్‌ చీట్‌ ఇచ్చినట్లు చెప్పుకున్నా బాగుండేది? 

కాని ఓ ఎవరో ఒక వ్యక్తి విచారణ చేసి, తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని సర్టిఫికెట్‌ ఇచ్చాడని చెప్పుకోవడంలోనే డొల్లతనం బైటపడిరది. పైగా కార్యక్రమాలలో ఎమ్మెల్యే సీతక్క చేసే సేవా కార్యాక్రమాలలో పాలు పంచుకుంటూ, ఆమెతోపాటు వెళ్లినంత మాత్రాన సబ్‌రిజిస్ట్రార్‌ చేసేది కూడా సేవే అని ఎవరూ అనుకోవడం లేదు. అంతే కాదు సీతక్కతో పాటు వెళ్లి, సేవ చేస్తున్నట్లు కనిపించడం కూడా పెద్దఎత్తున ప్రచారానికి వాడుకోవడం జరుగుతుంది. ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగులు వితరణల్లో పాల్గొన్నప్పటికీ బైటకు ప్రచారం చేసుకోవడం కనిపించదు. కాని సబ్‌ రిజిస్ట్రార్‌ చేసే గోరంత సాయానికి కొండంత ప్రచారం అన్నది అందరూ చెప్పుకునే మాటే…ఇక ఇటీవల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం సాక్షియగా జరుగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటీ బైటకు వస్తుండడంతో దివంగత తన తండ్రిని ముందు పెట్టుకొని సానుభూతి ప్రయత్నం కూడా వదలుకోవడం లేదు. తన తండ్రిని నక్సలైట్లు చంపారని సబ్‌ రిజిస్ట్రారే చెప్పుకుంటుంటోంది? మరో వైపు తనపై మావోయిస్టు సానుభూతి పరురాలన్న ముద్ర వేయాలని చూస్తున్నారని ఆరోపణలు చేస్తోంది? ఒక ఉద్యోగి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా నేరమే…గతంలో ఎంతో మంది ఉద్యోగులను కూడా పోలీసు వ్యవస్ధ విచారణ చేసిన సందర్భాలు ములుగు ప్రాంతాల్లోనే కోకొల్లలు…! అసలు ఆ మాట నోటినుంచి వెలువడి ఉద్యోగులను కూడా విచారించకుండా పోలీసులు వదల్లేదు..ఇది చరిత్ర. అంతే కాదు తన తండ్రి కమ్యూనిస్టుగా చెప్పుకుంటూనే తన తండ్రిని నక్సలైట్లు చంపారని చెప్పడం నిందలో భాగమా? గొప్ప కోసమా? అలాంటప్పుడు తాను సానుభూతి కోసం చెప్పుకోవడంలో అర్ధమేమిటి? ఒక వ్యక్తి నక్సలైట్లకు వ్యతిరేకంగానో, లేక పోలీసులకు అనుకూలంగానో, పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నవారిని మాత్రమే నక్సలైట్లు చంపేవారని చెప్పుకునేవారు…మరి తన తండ్రి కమ్యూనిస్టు అని తెలిసినా తర్వాత నక్సలైట్లు చంపారంటే ఏదో బలమైన కారణం లేకుండానే జరిగిందా? అయినా గతం తాలూకు సంఘటనలను కూడా అడ్డం పెట్టుకొని ఉద్యోగ నిర్వహణ వదిలేసి, సేవ కార్యాక్రమాల పేరు చెప్పి, అక్రమాలు చేస్తుంటే కూడా మీడియా చూస్తూ ఊరుకోవాలా…? ప్రశ్నించకూడదు? అక్షరం రాయకూడదు? తనకు వ్యతిరేకంగా రాస్తే నిందలేస్తా? లేకుంటే కేసులు నమోదు చేయిస్తా? అనగానే సరిపోదు…మీడియా తన కర్తవ్యం నుంచి పారిపోదు…మీడియా అన్నది సజీవమైన ఒక వ్యవస్ధ…వ్యక్తులు భయపేట్టాలని చూస్తూ వణికేదు…బెనికేది కాదు…ప్రజా స్వామ్యానికి నాలుగో స్ధంభం…దాన్ని కూడా కలుషితం చేస్తా…నేను చేసే తప్పులన్నీ ఒప్పులని రాయించుకుంటా? అనుకుంటే అక్షరాలెవరికీ బానిసలు కాదు…? ప్రశ్నలకు ప్రతిరూపాలు…అన్యాయాలను ఎదిరించే అస్త్రాలు!

సారయ్య శల్య సారధ్యం!?

`పదవి ఇచ్చి గుర్తించినా పార్టీకి పని చేయని వైనం?

`పరోక్షంగా పదే పదే నన్నపనేనిపై అసత్య ప్రచారం?

`హుజూరాబాద్‌ ఎన్నికలలో చేసిందేమీ లేదు?

`వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలలో కిరికిరి రాజకీయం?

`టిఆర్‌ఎస్‌ కు లోలోన వ్యతిరేక ప్రచారం?

`మున్సిపల్‌ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సారయ్య ఇద్దరు తమ్ముళ్లని,అనుచరుడుని పోటికి దించిన వైనం?

`పార్టీలో ఎగదోసే ఎత్తుగడలు?

`ఆయన వల్ల ఎవరూ టిఆర్‌ఎస్‌ లో చేరింది లేదు?

`ఉన్న వాళ్లనే సాగనంపే వ్యవహారం మామూలుగా లేదు?

`పార్టీలో అలకలు, లుకలుకలకు ఆజ్యం?

`తూర్పును అస్థిర పర్చడమే అసలు లక్ష్యం?

 

కాలమెప్పుడూ మనదే కాదు…ఎప్పుడూ మనకే అనుకూలం అసలే కాదు…కాలం అనుకూలించినంత కాలమే మనది…మనది కాని కాలం కోసం పరుగులు పెట్టినా లాభముండదు. ఇది తెలియక కొందరు, తెలిసినా కొందరు భ్రమల్లో వుంటూ కాలం అనుకూలత కోసం ఆరాపడుతుంటారు…ఇతరులను ఆగం చేసే ప్రయత్నం చేస్తూ వుంటారు…అలాంటి వారి వరసలో బస్వరాజు సారయ్య చేరిపోయినట్లున్నాడన్నది తూర్పులో జరుగుతున్న ప్రచారం. సారయ్య బలహీన వర్గాల నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చిన అదృష్టవంతుడు. ఇంత వరకు బాగనే వుంది. కాని సొంత పార్టీలో కుంపటిరేపే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టిడంతో ఆయన అసలు నిజస్వరూపం బైట పడుతోంది? తెలంగాణ ఉవ్వెత్తున సాగుతున్నంత కాలం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో వున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు…ఇక్కడే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి. 

 

అది ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయం. తెలంగాణ ఉద్యమమే లేకుంటే బస్వరాజు సారయ్యకు మంత్రి పదవే దక్కేది కాదు…ఈ మాట ఎవరో అన్నది కాదు…స్వయంగా జయశంకర్‌ సార్‌ ఆయనతో అన్న మాట. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటాన్ని నీరుగార్చే క్రమంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేకు కాస్త ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మంత్రులను చేశారు. అయితే అప్పటికే ఉమ్మడి వరంగల్‌ నుంచి తిరుగులేని నేతగా, మరొకరికి అవకాశం ఇవ్వొద్దన్నంతగా పొన్నాల లక్ష్యయ్య మంత్రాంగం నడిపినా ఉద్యమం పుణ్యమా అని బస్వరాజు సారయ్య మంత్రి అయ్యారు. అయితే అదే సమయంలో తెలంగాణ ఉద్యమకారులు బస్వరాజు సారయ్యను మంత్రి పదవి తీసుకోవద్దని పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో తెలంగాణ వాదులనుంచి వస్తున్న సూచనలను కాదనలేక, మంత్రి పదవి వదులుకోలేక జయశంకర్‌ సార్‌ వద్దకు వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. పనిలో పనిగా ఒక బిసి నాయకుడినైన తనను ఇలా ఉద్యమ కారులు అడ్డుకోవడం బావ్యం కాదని జయంశంకర్‌ సార్‌ ముందు సారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఒక్క మాట చెబితే తెలంగాణ వాదులు, ఉద్యమ కారులు తాను మంత్రి పదవిని స్వీకరించడంపై అభ్యంతరాలు తగ్గుతాయని వేడుకున్నాడు. దాంతో జయశంకర్‌ సార్‌ ఓపెన్‌ స్టేట్‌ మెంట్‌ ఇవ్వడం జరిగింది. సారయ్య కాకపోతే మరో ఎమ్మెల్యే మంత్రి అవుతాడు…మనది వ్యవస్ధ మీద పోరాటమే తప్ప వ్యక్తుల మీద కాదని జయశంకర్‌ సార్‌ ఉద్యమ కారులను నచ్చజెప్పడంజరిగింది. అయినా ఆయన ఏనాడు జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలకలేదు. ఇక సకల జనుల సమ్మె కాలంలో మంత్రికి తమ సేవలను ఆపేస్తున్నట్లు కూడా నాడు మంత్రుల ఇళ్లలలో సేవలందించే ఉద్యోగులు కూడా ప్రకటించడం గమనార్హం. ఇలా తెలంగాణ కోటాలో మంత్రి పదవిని తెలంగాణకు అనుకూలంగా పని చేయలేదన్నది జనం అభిప్రాయం. అయినా టిఆర్‌ఎస్‌ ఆయనను అక్కున చేర్చుకున్నది. పార్టీలో కలుపుకున్నది. 

నాటి నుంచి మళ్లీ తూర్పు మీద కన్నేశాడు…2016లో టిఆర్‌ఎస్‌లో చేరిన బస్వరాజు సారయ్య 2018 ఎన్నికల్లో టికెట్‌ ఇస్తారని అనుకున్నాడు. కాని పార్టీ సరైన సమయంలో సముచిత స్ధానం కల్పిస్తుందని భరోసా ఇచ్చింది. ఆ ఎన్నికల్లో నన్నపనేని నరేందర్‌కు పార్టీ టిక్కెట్‌ ఇచ్చింది. ఇది ఇష్టంలేని సారయ్య ఆయనకు ప్రచారం చేసిందిలేదన్నది పార్టీలో చెప్పుకునే మాట. పైగా ఆయన లోలోన పార్టీకి వ్యతిరేకంగానే పనిచేశారని కూడా చెప్పుకోవడం విన్నదే…అయినా పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిచింది. కాని ఆయనతీరులో మార్పు రాలేదన్నది పార్టీ నేతల అభిప్రాయం. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎమ్మేల్యే నన్నపనేని మూడు నెలల పాటు అక్కడే వుండి ప్రచారం సాగిస్తే, సారయ్య తూతూ మంత్రంగా తప్ప పనిచేసిందేమీ లేదు. పైగా ఆయన వ్యతిరేక ప్రచారమే సాగించినట్లు కూడా గుసగుసలున్నాయి. ఇదిలా వుంటే నన్నపనేని ఎదుగుదలను తట్టుకోలేక గతంలో తనతో ఎన్నికల వైరంలో ఎదురెరుదు పోటీ చేసిన నాయకులతో కూడా సంబధాలు నెరుపుతూ తూర్పులో ఓ అలకలు, లుకలుకలు సృష్టించే ప్రయత్నం సారయ్య చేస్తున్నాడన్నది పార్టీ శ్రేణుల ప్రధాన ఆరోపణ. అసలు తూర్పులో ఎక్కడా ప్రతిపక్షం అన్నది మచ్చుకైనా లేదు. కాని పార్టీలోనే వున్న ఇతర నేతలను ఉసిగొల్పే ప్రయత్నం నిరంతరం చేస్తున్నాడనేది ప్రధాన ఆరోపణ. 

గతంలో వైరి పక్షమైనా, ఇప్పుడు స్వపక్షంలో కలిసి సాగుతూ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తావా? చెప్పు? ఇక్కడ కాకపోతే మరో పార్టీ ఏదైనా సరే టిక్కెట్టు ఇపిస్తా…? దగ్గరుండి గెలిపిస్తా? అంటూ ఓ నాయకుడికి లేనిపోనివి చెబుతూ వస్తున్నాడట. సారయ్య చెప్పిన సూచనలు ఏమీ ఆ నాయకుడు పట్టించుకోకపోకపోయినా పదిమందిలో కాబోయే ఎమ్మెల్యే అంటే పదే పదే చెప్పుకుంటూ ఆయనలో లేని పోని ఆశలు ఎంతో రేపాలని చూస్తూనే వున్నాడట. ఎలాగైనా తూర్పులో కలకలం రేపాలన్నదే సారయ్య మనసులో నాటుకున్నదని దాని కోసమే ఇదంతా చేస్తున్నాడని కార్యకర్తలు భహిరంగంగానే చెప్పుకుంటున్నారు….ఇదిలా వుంటే మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కడా సారయ్య ప్రచారం చేసినట్లు పెద్దగా కనిపించింది లేదు. తన కోడలుకు మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ బిఫామ్‌ తీసుకొని, తమ్ముళ్లను మాత్రం టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయించారన్నది ప్రపంచానికి తెలిసిన విషయమే..! అయినా ఎమ్మెల్యే నన్నపనేని ఎన్నికలను తన భుజాన వేసుకొని 20 స్ధానాలు గెలిపించుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు కరోనా సమయంలో ఓ తెరాస కార్పోరేటర్‌ మరణించడం జరిగింది. ఆ ఉప ఎన్నికలో అతని భార్య టిఆర్‌ఎస్‌ తరుపున పోటీచేసింది. సానుభూతితో ప్రతిపక్షాలేవీ ఆమెపై పోటీకి సిద్ధపడలేదు. కాని బస్వరాజు సారయ్య సోదరుడు పోటీచేయడం జరిగింది. బస్వరాజు సారయ్య తమ్ముడిని పోటీనుంచి తప్పించే ప్రయత్నం అసలే చేయలేదు. పైగా తమ్ముళ్లతో తనకు మాటలు లేవని దాటేశారన్నది భహిరంగ రహస్యమే…ఇలా పార్టీకి కూడా ఇబ్బందికరమైన పరిస్ధితి తెచ్చాడన్నది నాయకుల వాదన…

 

పార్టీలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య దూరం పెంచి, తూర్పులో కలకలం రేపాలన్నదే సారయ్య ప్రధాన లక్ష్యం? అందుకోసం సారయ్య ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఇద్దరు జోతిష్యులతో మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ సమచారం. సారయ్య అదే పనిగా ఎగదోస్తున్న సదరు నాయకుడి జాతకంలో ఎమ్మెల్యే అయ్యే ఛాన్సులున్నాయా? అన్నదానిపై తొలుత ఓ జ్యోతిష్యుడిని సారయ్య సంప్రదించడం జరిగింది. కాని ఆ అవకాశాలు లేవని జ్యోతిష్యుడు చెప్పడంతో మరో జ్యోతిష్యుడిని కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సదరు నాయకుడికి ఇప్పట్లో ఆ ఛాన్సు లేదని చెప్పినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ నేతను పార్టీ దూరం చేసే కంకణం సారయ్య కట్టుకున్నట్లే తెలుస్తోందంటున్నారు. ఎలాగైనా ఆయనను పార్టీకి దూరం చేసి, నన్నపనేనికి వ్యతిరేకంగా రంగంలో దించాలన్న పట్టుదలతో సారయ్య వున్నట్లు స్పష్టమౌతోందని నాయకులు చెప్పుకుంటున్నారు. కాకపోతే సదరు నాయకుడికి కారు పార్టీని కాదని వెళ్లడం గాని, ఇతర పార్టీలో చేరడం గాని సుతారం ఇష్టం లేదు. కాని ఆయన కుటుంబంలో కూడా కలతలు సృష్టించేలా రాజకీయాలు నెరిపి, చివరికి పార్టీలోనే చిచ్చు పెట్టే ఎత్తుగడలు సారయ్య వేస్తూనే వున్నాడనేది తెలుసున్న విషయం. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదని బిజేపి నుంచైనా టిక్కెట్టు ఇప్పించే బాధ్యత నాదని, కాంగ్రెస్‌లో దయాసాగర్‌తో చెప్పైనా టిక్కెట్టు ఇప్పిస్తానంటూ ఆ నాయకుడి మీద సారయ్య తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇలా పార్టీలో చీలకలకు కారణం కావడం కోసం, తన రాజకీయ భవిష్యత్తును మరింత ఊహించుకొని నియోకజవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారనేది అందరూ అంటున్న మాటే…ఇక తన తమ్ముళ్లతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకుంటుంటే, సారయ్య తమ్ముళ్లు మాత్రం మా అన్న పదవిలో ఆరేళ్లుంటారు…ఎమ్మెల్యే పదవి ఐదేళ్లే…అప్పుడు చూసుకుంటామని కార్యకర్తలను సారయ్య తమ్ముళ్లు బెదిరించడం కూడా జరుగుతున్నట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఇలా తిన్నింటి వాసాలు లెక్కబెడుతూ, అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అక్కున చేర్చుకొని అవకాశం కల్పించినా, సుడిగుండాలు సృష్టించడం మానుకో సారయ్య అంటూ నాయకులు, కార్యకర్తలు హితవు పలుకుతున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుందో, ఎటు దారి తీస్తుందో అన్నది ఆసక్తిగా మారిందన్నది నాయకుల మాట…!

తూర్పులో వి(పక్ష)ష బీజం?

సీఎం నివేదికలో అసలు విషయాలు వెలుగులోకి…

తూర్పులో కారుకు ఎదురులేకుండా చేసిన కేసిఆర్‌…

అది గమనించలేక రాజకీయం చేస్తున్న గులాబీ నేతలు…

విపక్ష నేతల చేరిక ఘట్టం ఒక వ్యూహం….

ప్రతిపక్షాల నిర్వీర్యం ఏనాడో పరిసమాప్తం…

మళ్ళీ విపక్షపు విషభీజాలు నాటుతున్నదెవరు?

 

కేసిఆర్‌ పన్నిన పద్మవ్యూహం చెడగొడుతున్న వాళ్లెవరు?

తూర్పులో కలకలం రేపుతున్నదెవరు?

విపక్షానికి ఓటు లేని చోట స్వపక్షంలో చిచ్చుకు కారకులెవరు?

తూర్పు మీద కన్నుతో మేఘాలు కమ్ముతున్నదెవరు?

తూర్పు లో ఏం జరుగుతుందో అంతా గమనిస్తున్న కేసిఆర్‌!

తూర్పులో కాకరేపుతున్న కలకలంపై ఎక్స్‌ క్లూజివ్‌…

ఒకరు పేర్చుకుంటే పోతే, ఎవడో ఒకడు కూల్చాలని చూస్తాడని సామెత. అలాంటి సంఘటనలు తెలంగాణలోని పలు నియోజకవర్గాలలో కనిపిస్తున్నట్లు తేటతెల్లమౌతోంది. గత ఇరవై రెండు సంవత్సరాలుగా పార్టీకి ఒక్కో ఇటుక పేర్చుతూ తిరుగులేని శక్తిగా, నియోజకవర్గాలలో ఎదరులేని శక్తిగా బలమైన పునాదుల మీద టిఆర్‌ఎస్‌ను ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్మితం చేసుకుంటూ వస్తున్నారు. ఒకనాడు ఏ జిల్లాలో ఏ మూలనో అని ఎద్దేవా చేసిన వాళ్లు ఇప్పుడు ఏ మూల వెత్తుక్కోవాలో అర్ధం కాని పరిస్ధితుల్లో ప్రతిపక్షాలున్నాయి. గతంలో టిఆర్‌ఎస్‌ గెలుస్తూ వచ్చిన నియోకజవర్గాలతోపాటు, గత ఎన్నికల్లో గెలిచిన టిఆఆర్‌ఎస్‌ ఇలాకాల్లో ప్రతిపక్షాలన్న మాటకు చోటు లేకుండాపోయింది. అలా పార్టీ నిర్మాణం చేయడం అన్నది బృహత్తర కార్యక్రమం. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసిఆర్‌ చేసిన రాజకీయ చాణక్యం, పన్నిన పద్మవ్యూహాలు అర్ధం కాక ఇప్పటికీ ప్రతిపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా ప్రతిపక్షాలకు ఎక్కడా చోటు లేకుండా, ఓటు వేసేవారు లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. అలాంటి నియోజకవర్గాలలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తూర్పు వరంగల్‌ స్ధానం ఒకటి. ఆ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చేసిన రాజకీయయంత్రాంగ మంత్రాగంలో వీరిసిన పాచికలు ఆశామాషీ కాదు. అసలు తూర్పు నియోజకవర్గంలో ప్రతిపక్షానికి స్ధానమేలేదు. అలా చాలా నియోజకవర్గాలను కారుకు కంచుకోట చేశారు. ఆ కంచుకోటలో తూరు నియోజకవర్గం కూడా వుంది. కాని ఇటీవల ఆ తూర్పు నియోజకవర్గంలో తుఫాను రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసి ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన తాను వేసిన పద్మవ్యూహం ప్రతిపక్షాలు చేధించకుండా తీర్చిదిద్దితే, స్వపక్షంలోనే కొందరు విపక్షానికి దారులు తెరవడాన్ని గ్రహించారు. తూర్పులో దూళి కణం కూడా పక్కకు కదలకుండా చేయాలన్న లక్ష్యంతో కేసిఆర్‌ పక్కా ప్రణాళిక ఏనాడో రచించారు. అది అర్ధంకాని కొందరు జిత్తులు వేయాలని చూస్తున్నట్లు కూడా వెలుగులోకి వస్తోంది. 

అసలు కేసిఆర్‌ ఆదినుంచి వేసిన ప్లాన్‌ ఎంతో ఆసక్తికరం. వరంగల్‌ తూర్పు అన్నది ఉమ్మడి వరంగల్‌కు ఒక సెంటిమెంటు. తెలంగాణ ఉద్యమానికి వరంగల్‌ ఒక పెద్ద దిక్కు. అలాంటి వరంగల్‌లో కారుకు తప్ప మరో పార్టీకి చోటు దక్కడం దుర్లభం. తూర్పులో కారుకు భవిష్యత్తులో ఎలాంటి ఎదరు లేకుండా ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేశారు. ఇది చాలా మంది గులాబీ నేతలకు ఎందుకు అర్ధం కావడం లేదో తెలియడం లేదు. ఒక వేళ తెలిసినా కూడా పార్టీలో వుంటూ ఎదురు తిరగలేక, పక్కవారిని ఎదగోసే రాజకీయాలు చేస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా తూర్పును పూర్తి స్ధాయి గులాబీ మయం చేయడానికి సిఎంసి కేసిఆర్‌ నాటి విపక్ష నేతలందరినీ కారులోకి చేర్చుకున్నారు. వారికి తగిన ప్రాదాన్యత కూడా కల్పించారు. విపక్ష నేతలను గులాబీ గూటికి చేర్చడం అన్నది ఒక ఘట్టంగా కనిపించినా, అదొక రాజకీయ వ్యూహం. ఈ వ్యూహాం చేధించడం అన్నది ఎవరి తరం కాదు. నాటి ప్రతిపక్షాల నిర్వీర్యంతో అక్కడ వారికి మళ్లీ చిరురు తొడకుండా చూసుకుంటూ వస్తున్నారు. కాని కేసిఆర్‌ పన్నిన పద్మవ్యూహం చేధించలేక చెడగొట్టే ప్రయత్నాలు కొందరు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. తూర్పులో కలకలం రేపి రాజకీయం తన వైపు తిప్పుకుందామని కొందరు చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది. విపక్షానికే చోటు లేని చోట స్వపక్షంలోనే కొందరు చిచ్చు రేపి చలికాచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు సమచారం. ఈ విషయాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ వరంగల్‌ తూర్పు నియోకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టిపెట్టారు. ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గ పరిధి రాజకీయాలను తెలుసుకుంటున్నారు. అందుకోసం ప్రభుత్వ ఇంటలిజెన్స్‌ వ్యవస్ధను పూర్తిగా నమ్మకుండా, కొంత మంది వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు రహస్యాలు తెలుసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ఇంటలిజెన్స్‌ అన్నది ఆ నియోజకవర్గంలోని సొంత నాయకుల ఆలోచనలు పూర్తిగా పసిగట్టకోవచ్చు. లేకుంటే మంత్రుల స్ధాయి వివరాలు బైటకు పూర్తిగా చెప్పలేకపోవచ్చు. అందువల్ల ప్రత్యేకమైన నిఘా వ్యవస్ధతో వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు? అన్న విషయాలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తున్నాయి. ఎమ్మెల్యే నన్నపనేనిని ఎవరు డిస్టర్బ్‌ చేయాలని చూస్తున్నారో వారి వివరాలు కూడా ఎప్పటికప్పుడు సిఎంకు చేరుతున్నాయి. 

తూర్పు నుంచి గతంలో గెలుస్తూ వచ్చిన బస్వరాజు సారయ్య లాంటి వారిని ఓడిరచేందుకు 2014 ఎన్నికల్లో కొండా సురేఖకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత బస్వరాజు సారయ్య టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే భవిష్యత్తులో ఆయనకు టిక్కెట్‌ లేదనే అర్ధం. ఇక గత ఎన్నికల్లో అనూహ్యంగా తెరమీదకు వచ్చి కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి మంచి ఓట్లు సాధించిన వద్దిరాజు రవిచంద్ర కారెక్కారు. ఆయన నాయకత్వ పటిమ, ప్రజల్లో ఆయనకు వున్న పేరు, వ్యాపారవేత్తగా వున్న గుర్తింపు, వితరణశీలిగా ప్రజల్లో వున్న గౌరవంతో ఆయనను ముఖ్యమంత్రి కేసిఆర్‌ టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. పార్టీలో చేర్చుకున్నారు. ఇటీవల ఆయనకు రాజ్యసభ కూడా ఇచ్చారు. వద్దిరాజు రవిచంద్రకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే కాదు, ఖమ్మంలోనూ ఆయనకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. ఇటు వ్యక్తిగతంగా, ఇటు సామాజిక పరంగా కూడా ఆయనకు మంచి గుర్తింపు వుంది. తెలంగాణ కాపు సామాజిక వర్గ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఉత్తర తెలంగానలో బలమైన నాయకుడుగా కూడా ఆయన పార్టీ తయారు చేయాలని చూస్తోంది. వద్దిరాజు రవిచంద్రను పార్టీలోకి తీసుకున్నప్పుడు అందరూ తూర్పు వరంగల్‌ వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధి అనుకున్నారు. కాని ఏదో ఒక నియోజకవర్గానికి వద్దిరాజును పరిమితం చేయడమే అవుతుంది. టిఆర్‌ఎస్‌లో ఇంత కాలం బిసిలకు ప్రతినిధిగా ప్రచారం జరిగిన ఈటెల రాజేందర్‌ స్ధానాన్ని వద్దిరాజు రవిచంద్రతో భర్తీ చేయాలన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన. ఆయనను ఉత్తర తెలంగాణలోని బిసిలందరికీ ప్రతినిధిగా వుండడమే ఆయనకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత అన్న ఆలోచనతో తాజాగా రాజ్యసభకు పంపడం జరిగింది. అలా ఆయన తూర్పు నియోకరవర్గంతోపాటు, ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌,ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల నాయకత్వం పనికొస్తుంది. వద్దిరాజు రవిచంద్ర మూలంగా తెలంగాణలోని అనేక నియోజకవర్గాలలో కారుకు మరింత బలం చేకూరే అవకాశం వుంది. ఇలా నాయకులకు సరైన గుర్తింపు నిస్తూ, వారి సేవలను వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకొని హాట్రిక్‌ సాధించి, తెరాసకు తిరుగులేదని మరోసారి నిరూపణ కాబోతున్న తరుణమిది. 

ఇలా బలమైన నేతలు కూడా తూర్పులో వుండడం కారుకు ఎదురు లేకుండా వుంటుందనేది ఇంత కాలం అనుకుంటున్న మాట. కాని ఇటీవలే కొంత మంది నేతలు కూడా తూర్పు టిక్కెట్టు ఆశిస్తూ నియోజకవర్గంలో కొంత ఇబ్బందికరమైన పరిస్ధితులు సృష్టించాలని చూస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర స్ధాయిలో కీలక భూమిక పోషించిన ఆ నాయకుడు కారెక్కడంతో గతంలోనే కీలకమైన గుర్తింపు, స్ధానం కల్పించారు. కాకపోతే హవా సాగిన చోటే, ఏ హవా లేకుండా పోవడం ఆ నాయకుడికి సుతారం నచ్చడం లేదట…పైగా తమ ముందు ఎదిగి ఎమ్మెల్యేగా నన్నపనేని కనిపించడం కూడా ఆ నాయకుడికి అసలే నచ్చడం లేదట…ఒక రకంగా చెప్పాలంటే మళ్లీ నన్నపనేని గెలవడం ఆయనకు ఇష్టం లేదట…అందుకు స్వపక్షంలోనే విపక్షాన్ని సృష్టించి, ఎగదోసే కుట్రకు తెరతీసినట్లు తెలుస్తోంది…ఎవరా నేత…ఏమిటా కథ! రేపటి సంచికలో…

తెలంగాణ ఎంపీల నిరసన

“నేటిధాత్రి” న్యూఢిల్లీ

దేశంలో ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ప్ల కార్డులతో నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ ఎంపీలు

సీఎం చేతుల మీదుగా ‘సాధన’ ఆవిష్కరణ

నేటిధాత్రి హనుమకొండ

రోడ్లు మరియు భవనాల శాఖ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రూపొందించిన పత్రికా వ్యాసాల సంకలనం ‘సాధన’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్

 సోమవారం ఉదయం హన్మకొండలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విశ్లేషించిన తీరు గొప్పగా ఉందన్నారు. ఇలాంటి మరెన్నో పుస్తకాలను రచించాలని మెట్టు శ్రీనివాస్ గారిని అభినందించారు. పుస్తక రచయిత, టీఎస్ఆర్డిసి చైర్మన్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక అంశాలతోపాటు రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సంపదను ప్రజలనే కేంద్రబిందువుగా చేసుకొని పంపిణీ చేస్తూ అమలవుతున్న విధానాలను ప్రజలకు చేరువ చేయడమే ఈ సాధన పుస్తక ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు ఈ సందర్భంగా అభినందించారు. మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరిగిన ఈ పుస్తక విష్కరణ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , బండా ప్రకాష్ , తక్కెళ్లపల్లి రవీందర్ రావు , బస్వరాజు సారయ్య , మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు , ఎమ్మెల్యే వొడితెల సతీష్ , మేయర్ గుండు సుధారాణి , జడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్ , గండ్ర జ్యోతి , కార్పొరేషన్ల చైర్మన్లు బండా శ్రీనివాస్ , వాసుదేవరెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డి , వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు , కుడా చైర్మన్ సుందర రాజు , మారినేని రవీందర్ తదితరులు పాల్గొన్నారు

తొలి రోజే.. చారిత్రక రోజు

– ఎంపీగా పార్లమెంట్ లో అడుగిడిన వద్దిరాజు

– తొలిరోజే రాష్ట్రపతి ఎన్నికల్లో దక్కిన ఓటు

– సీఎం కేసీఆర్ కల్పించిన అదృష్టమన్న ఎంపీ

నేటిధాత్రి న్యూఢిల్లీ

భారత అత్యున్నత ప్రజాస్వామిక వేదిక అది.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎందరో రాజకీయ

ఉద్ధండులు ఆ వేదికకు ప్రాతినిధ్యం వహించారు.. అక్కడ జరిగిన అనేక చారిత్రక పరిణామాలకు అలనాటి యోధాను యోధులంతా ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. అలాంటి ఉద్ధండుల సరసన చోటు దక్కించుకున్న వద్దిరాజు రవిచంద్ర మరోసారి చరిత్రకెక్కారు. ఖమ్మం జిల్లా నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ.. ఆయన సోమవారం పార్లమెంటులో అడుగు పెట్టిన తొలిరోజే.. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు దక్కించుకున్నారు. దీంతో ఆయన ఒకే రోజున రెండు చారిత్రక సంఘటనల్లో నమోదయ్యారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు నేతృత్వంలో సహచర ఎంపీలతో కలిసి రవిచంద్ర పార్లమెంట్ భవన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన జీవితంలో ఒకే రోజు రెండు అత్యున్నత చారిత్రక సంఘటనలు జరగడం అదృష్టంగా భావిస్తున్నానని ఎంపి వద్దిరాజు పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం కేసిఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మూడు వారాలు లోపు మొదటి స్లాబ్

మంత్రి హరీష్ రావు

 

నేటిధాత్రి వరంగల్

 

త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తాం

ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వర్యులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ 

రాష్ట్ర చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి,శాసనసభ్యులు నన్నపనేని నరేందర్

ప్రజలను కాపాడేది సమస్యలు తీర్చేది సీఎం కేసీఆర్ ఏ

వరదలు తెలంగాణలో వస్తే బిజెపి నాయకులు గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు

కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి ఎప్పుడు రావాలని ఎదురు చూస్తున్నారు

ప్రజల సమస్యల్ని పట్టించుకునేది ఒక్క తెరాస ప్రభుత్వమ

మన్నె గోవర్ధన్ రెడ్డి

నేటి ధాత్రి: హైదరాబాద్

ఖైరతాబాద్ నియోజకవర్గం

వెంకటేశ్వర కాలని డివిజన్ లో పలు బస్తీలు మరియు కాలనీలలో వర్షానికి పాడైన రోడ్లు, నాలాలు మరియు వాటర్ సప్లై లో ఇబ్బంది ఉన్న ప్రదేశాలను సందర్శించి సంబంధిత శాఖ అధికారులతో

మాట్లాడి త్వరితగతినా సమస్య పరిష్కరించాలని సూచించిన ఖైరతాబాద్ నియోజకవర్గం టి ఆర్ యస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి మరియు శ్రీమతి మన్నె కవిత గోవర్ధన్ రెడ్డి .

ఉపేక్షిస్తే లాభం లేదు! వేటేస్తేనే మేలు!?

అవకాశవాదులను సాగనంపాల్సిందే!

ఎన్నికల ముందు తలనొప్పులు తెచ్చేవారిని దూరం పెట్టాల్సిందే!

పార్టీ నిరంతర ప్రవాహం….

పార్టీ పురుడపోసుకున్న నాటి నుంచి వచ్చేవారు వచ్చారు…

వెళ్లేవారు వెళ్లిపోయారు…

రాజకీయాల్లో హత్యలుండవు…ఆత్మహత్యలే అన్నది నిజం…

ఎన్నికల మందు ప్రశాంతత పార్టీకి ఎంతో అవసరం….

పంటి కింద రాళ్లను పక్కన పెట్టాల్సిందే…

పక్క పార్టీల వైపు చూస్తున్నవారిని పంపేయాల్సిందే…

తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకున్న నాటి నుంచి నేటి దాకా వచ్చే వాళ్లు వచ్చారు..వెళ్లే వాళ్లు వెళ్లారు…మధ్యలో వదిలేసి వెళ్లి మళ్లీ వచ్చి చేరిన వారున్నారు..ఇంకా వెళ్లేందుకు అదును చూసుకుంటున్నవాళ్లు వున్నారు…పంటి కింద రాయిలా మారిన వాళ్లుకూడా వున్నారు…పక్క పార్టీల వైపు చూస్తున్న వారూ వున్నారు…రాజకీయ పార్టీ అన్నది నిరంతర ప్రవాహం…అది కొత్త నీరును చేర్చుకుంటూ వెళ్తుంది…అంతే కాని ఆగిపోయేది కాదు..స్వార్ధ పరులు ఎల్ల కాలం ఒకే దగ్గర వుండరు…అంకిత భావం వారిలో ఎప్పుడూ కనిపించదు. ఎప్పటికప్పుడు దారుల వెతుక్కుంటూ వుంటారు…ఎంత ప్రాధాన్యమిచ్చినా చంకన పెట్టుకున్నా జారి పోయేందుకే సిద్ధంగా వుంటారు….అలాంటి వాళ్లు ఎంత కాలం వున్నా పార్టీకి ప్రయోజనం లేదు. అత్యాశను వదలుకోరు…అంతా నాకే అనుకుంటారు…తనకు తాను గొప్పగా ఊహించుకుంటారు…అలాంటి వాళ్లు ముందు ఎవరూ ముందుకు వెళ్లొదు..పదవులు అందుకోవద్దు…ఇతరులు ఎదుగుతుంటే చూడలేరు…ఇలాంటి మనస్తత్వం వున్న వారు పార్టీకే ప్రమాదరకంగా మారుతారు…ఇతరల పాత్రలు కూడా తమకే కావాలని కుత్సితాలు పన్నుతుంటారు…ప్రజలు తిరస్కరించినా పదవులు కోరుతుంటారు…తీరకపోతే పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టే కుట్రలకు తెరతీస్తుంటారు..అలాంటి ప్రతి పార్టీలోనూ వుంటారు…కాకపోతే అధికార పార్టీలో కాస్త ఎక్కువ మోతాదులో వుంటారు…కాని మరీ మితిమీరిన ఆశలతో పార్టీకి తీరని నష్టం చేకూర్చుతుంటారు…అవసరమైతే పార్టీకి కష్టం తెచ్చిపెట్టే కుతంత్రాలు కూడా చేస్తుంటారు…అలాంటి వారితో ఏ పార్టీకైనా జాగ్రత్త…అవసరం…

                             పైకి ప్రశాంతంగా సాగుతున్నట్లు కనిపించే నీటి కాలువలో వేగమంతా అడుగులోనే వుంటుంది….పైకి ఎంతో పచ్చగా వున్న చెట్టు వేరులోనే పురుగు చేరుతుంది. కాలువ ముంచుతుంది. చెట్టు పుట్టిపోతుంది. పైనంతా ప్రశాంతంగానే కనిపిస్తున్నా లోలోన వేరు పురుగులు చేరి వృక్ష్యాన్ని తింటున్నట్లు పార్టీలో కొందరు వ్యక్తులు నిత్య అసమ్మతి వాదులుగా తయారై, పార్టీకి చేటు చేస్తున్నారు. పార్టీ ఆశ్రయంతో పైకొచ్చి, రాజకీయంగా వెలుగులోకి వచ్చి, అందివచ్చిన పదవులు అందుకొని, కోట్లుకూడేసుకొన్నవాళ్లు చాలా మందేవున్నారు. ఇప్పుడు వాళ్లు పార్టీకి నష్టం చేయడానికి కూడా వెనుకాడడం లేదు. నిజాలు గ్రహించే స్ధితిలో అలాంటి నాయకులు లేరు. ప్రజలతో సంబంధాలు పెద్దగా లేవు. ఎంత సేపు తాను…తన పదవి…తన రాజకీయం ఇంతే…ఇలాంటి నేతలు పైన పటారం లోన లొటారం లాంటి పార్టీలలో చేరేందుకు, కండువాలు మార్చేందుకు రెడీ అంటున్నారు. 

                  మాకు పదువులిస్తారా? లేక దూకమంటారా? టిక్కెట్లు ఇస్తారా? లేదంటే ప్రతిపక్షపార్టీల వైపు చూడమంటారా? అన్నట్లు భహిరంగ సంకేతాలే ఇస్తున్నారు. అలాంటి వారు ఎవరో పార్టీకి కూడా పూర్తిగా తెలుసు. ఒకనాటి వారి జీవితాలు వారికి గుర్తులేదు. నిన్నటి రోజులు మర్చిపోయారు. రేపటి రోజులపై ఆశలు పెంచకుంటూ కలలు గంటున్నారు. ఒక వేళ వారి కలలు నెవరవేరాలంటే కాస్తో, కూస్తో కొంత సమయం ఆగాలి. కాని వారికి అంత ఓపికలేదు. మిడిమిడి జ్ఞానంతో నేతలైనప్పుడు ఇంతకన్నా వాళ్లు ఎక్కువ ఆలోచించేలేరు. పార్టీ ప్రయోజనాల కోసం వారు పాటుపడరని తేలిపోయింది. అయినా వారిని ఉపేక్షించడం వల్ల తాము బలవంతులమని, సమర్ధులమని, తాము లేకపోతే పార్టీకి ఇబ్బందులున్న భ్రమల్లో తేలియాడుతున్నారు. పార్టీకి చేటు తెస్తున్నారు. ఇలాంటి వారు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకొకరున్నారు. వారి సంగతి తెలుసు. వారి రాజకీయ పరిజ్ఞానం తెలుసు. ప్రజల్లో వారికున్న బలం తెలుసు. తెరాస జెండా కింద బతికిన వారు కూడా జెండాముందు కాలరెగిరేస్తామంటున్నారు. 

                      అలాంటి వారిపై పార్టీ వేటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా వేచి చూసి సమయం ఇవ్వడమే నష్టదాయకంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే వెంటనే అలాంటి నాయకులపై పార్టీ ఎప్పుడో దృష్టిపెట్టింది. అలాంటి నాయకుల్లో మేయర్‌గా పనిచేసిన బొంతు రామ్మోహన్‌ ముందు వరసలో వున్నట్లు తెలుస్తోంది. ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ ప్రాదాన్యతనిచ్చారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే జీవితాంతం పార్టీకి విధేయుడుగా వుంటాడని నమ్మారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎవరూ ఊహించిన పదవిని బొంతు రామ్మోహన్‌కు ఇచ్చారు. కాని ఆ పదవి కాలం పూర్తి కాకముందే కొత్త పదవిమీద బొంతు రామ్మోహన్‌ ఆశలు పెంచుకున్నాడు. గత ఎన్నికల్లోనే పార్టీని బ్లాక్‌ మెయిల్‌ చేసినంత పనిచేశాడు. ఒక పదవి చేసిన వారు ప్రతి సారి పదవి కావాలనుకోవడం తప్పు కాదు…కాని సమయం సందర్భం వుంటాయి. కాలం కూడా కలిసి రావాలి.  

               తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పటికీ పార్టీకి సేవ చేస్తూ ఎలాంటి పదవులు అందని వారు కూడా వున్నారు… అయినా వాళ్లు పార్టీ కోసమే పనిచేస్తున్నారు. కాని కొందరు పదవులు అందుకొని కూడా మళ్లీ మళ్లీ తమకే పదువులు కావాలిన అత్యాశ వున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో వున్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఎన్టీఆర్‌ కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ వచ్చాడు. కాని ఆయనకు ఎమ్మెల్యే సీటు రావడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా వున్నంత కాలం ఆయనకు పార్టీ టిక్కెట్టు దక్కలేదు. అంతే కాదు ఆయన హైదరాబాద్‌ మేయర్‌ గా పనిచేసినా ఎమ్మెల్యే టిక్కెట్టు కావాలనుకున్నప్పుడు పార్టీ ఇవ్వలేదు. ఎదరుచూశాడు.పార్టీ నుంచి పిలుపు కోసం మేయర్‌ అయిన తర్వాత కూడా పదేళ్లు ఎదరు చూశాడు. అదీ పార్టీ కోసం నాయకులకు వుండే నిబద్దత. అంతే కాని మేయర్‌గా పనిచేస్తూనే నాకేం తక్కువ అని ఎమ్మెల్యే సీటు కోరి అబాసుపాలైనా, పార్టీని ఇబ్బందులకు గురిచేసినా పార్టీ బొంతు రామ్మోహన్‌ను కడుపులో పెట్టుకున్నది. మరోసారి కూడా ఆయన సతీమణికి అవకాశం కల్పించింది. ఇలా ఒకసారి పదవులు పొందినవారు వెంటనే పదవుల కోసం ఎదరు చూసిన వారు తెలుగు రాజకీయ చరిత్రలో చాలా మందే వున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు మేయర్‌గా పనిచేసి, తెలుగుదేశంపార్టీ కోసం జీవితం త్యాగం చేసిన బంగి అనంతయ్య అంటే ఎంతో ఫేమస్‌. కాని ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇప్పటికీ రాలేదు. అలా అని ఆయన పార్టీని కాదనలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సినీ నటుడు, మాజీ ఎంపి. మురళీ మోహన్‌కు టిటిడి చైర్మన్‌ పదవి చేపట్టాలని కోరిక. కాని ఆ కోరిక ఈనాటికి తీరలేదు. అలా అని ఆయన పార్టీ వదిలేయలేదు. ఇలా పదవులు రానంత మాత్రాన పార్టీకి ద్రోహం చేసే యోచన చేస్తూ స్వార్ధపూరిత రాజకీయాలు చేయడం అలవాటు చేసుకున్నవారిని పక్కన పెట్టడమే కరక్టు. 

                 తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీకి చేటు తెచ్చేందుకు కంకణం కట్టుకున్న వారందరినీ పక్కన పెడితే తప్ప లాభం లేదు. కొల్లాపూర్‌ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలుచేశారు. తన వర్గం అంటూ పార్టీకి వ్యతిరేకంగా కౌన్సిలర్లును నిలబెట్టారు. ఆనాడే ఆ నాయకుడిపై వేటు వేస్తు ఇప్పుడు ఈ బెదిరింపులు వుండేవి కాదు…ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగానే వుంది. ఇలాంటి వారి పార్టీకి ప్రయోజనం అన్నది ఎప్పుడూ వుండదు. అలాంటి వారు తమకు తాముగానే అసమ్మతి వాదులుగా ముద్రలేసుకుంటుంటారు.. పార్టీ పరపతిని దిగజార్చుతుంటారు.. అందుకే వారిని దూరం పెట్టడం ఎంతో మంచిది…ఇదే ఆలోచన ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది….వారి పని అయిపోయినట్లే,చర్యలు తప్పవనే వాఖ్యలే వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలకు పెద్దగా బలం లేదు. ప్రజల్లో వారిపై నమ్మకం లేదు. పదేళ్లుగా వారు నిర్ధిష్టమైన ప్రతిపక్ష పాత్ర పోషించింది లేదు. అరవైఏళ్ల గోసనుంచి విముక్తి కావించి, ప్రజా సంక్షేమ రాజ్య నిర్మాణం చేసి, ప్రగతికి తెలంగాణను చిరునామాను చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ప్రజలక వున్న నమ్మకం అంతా ఇంకా కాదు. ఇంకా ఎన్నేళ్లైనా చెక్కుచెదిరేది కాదు. ఈ ఎన్నికలే కాదు, భవిష్యత్తులో కూడా ప్రతిపక్షాలకు ఆశలేలేవు. కాని తన్నింటి వాసాలు లెక్కబెట్టే కొందరు ప్రతి పక్షాల అసత్య ప్రచారాలను చూసి పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ మారుతామని పరోక్ష సంకేతాలిస్తున్నారు. టిఆర్‌ఎస్‌ భుజ్జగిస్తుందన్న భ్రమల్లో తేలియాడుతున్నారు. అధికార తెరాసను వదిలి ప్రతిపక్షాలలోకి వెళ్లే పదవులు వస్తాయన్న గ్యారెంటీ లేదు. ఆ పార్టీలలో నాయకత్వ లేమిని తాము తీర్చుతామన్న ఆశల్లో వెళ్లినా, జనం ముఖం చూస్తారన్న నమ్మకం లేదు. కూడారన్న సంగతి తెలిసి కూడా బురద రాజకీయమే రంజుగా వుంటుందనుకునేవారు ఎంత కాలమైనా మారరు…వారిని పార్టీ వదులుకోక తప్పదు…కొత్త తరం ఆవిష్కరణ జరక్క తప్పదు…

డోర్నకల్‌ కవితకే…!

కుటుంబ సభ్యులు కూడా కవితవైపే…!

వారసత్వం ఆడపిల్లకే…!

చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవం!

ప్రజల కోసం శ్రమించే తత్వం…

పార్లమెంటు సభ్యురాలిగా అదనపు ప్రాధాన్యం….

నిత్యం ప్రజలతో మమేకం…

ఈసారి మంత్రి అయ్యే అవకాశం…

డోర్నకల్‌ అభివృద్ధికి కవిత గెలుపు ఎంతో బలం..

సమాజంలో ఉన్నత వర్గాల రాజకీయాలు వేరు…సమజానికి దూరంగా, మైదాన ప్రాంతాలకు ఆవల, మరో ప్రపంచంగా కనిపించే గిరిజన ప్రాంతాలలో రాజకీయాలు వేరు…ఇక్కడి ప్రజలు ఎంతో అమాయకులు. స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్నా, ఇంకా వారి జీవితాల్లో పూర్తి స్ధాయి వెలుగులు నిండిరది లేదు. సమాజంలో అందరితో సమానంగా బతుకుతున్నది లేదు. ఇప్పటికీ వారి ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం పూర్తి స్ధాయిలో వుండదు. వైద్య సదుపాయాలు అందడం జరగదు. విద్య, వైద్యం పూర్తి స్ధాయిలో కల్పన ఇంకా కలగానే మిగులుతున్న రోజులు…ఈ పరిస్ధితి దేశ వ్యాప్తంగా వున్నదే…అలాంటి ప్రాంతాల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకులు అతి కొద్ది మంది మాత్రమే వున్నారు. గిరిజన జీవితాలకు అండగా నిలిచి వారు తక్కువగానే వున్నారు. ఇప్పటికీ మెజారిటీ గిరిజనులు కొండలు, కోనలు, చెట్టూ, పుట్టను నమ్ముకొని, అడవి తల్లి నీడన జీవితాలు గడుపుతున్నారు. అలాంటి వారి జీవితాలు రాత్రికి రాత్రి మార్చడం ఎవరి వాల్లా కాదు..అలాగని వదిలేసే విషయం కాదు…అందువల్ల ఆయా ప్రాంతాల అభివృద్ధి అన్నది జరగాలంటే వారి జీవితాల మీద అవగాహన ఒక్కటే వుంటే సరిపోదు…వారి జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు నిరంతరం తపించే, శ్రమించే నాయకత్వం కావాలి. ఆ చిత్త శుద్ది నాయకుడిలో వుండాలి. ఆ లక్షణాలు వుండి, ఇప్పటికీ ఆ ప్రజలతో మమేకమైన వున్నవారు…అలాంటి వారిలో రెడ్యా నాయక్‌ , మాలోతు కవితలాంటి వారు వున్నారు. 

అందరూ ఊహిస్తే అవి రాజకీయాలెలా అవుతాయని రాజుల కాలంలోనే చెప్పుకునేవారు. వేసే అడుగులు, రాజకీయ ఎత్తుగడలు అన్నవి అవతలి వారికి అనువుగా వస్తే ఏముంటుంది మజా! ఊహించని దెబ్బలు కొట్టడంలోనే వుంది అసలు చాణక్యత. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎలాంటి ఎత్తులు వేస్తారన్నది ఎవరికీ అంతుపట్టనిది…అందుకే ప్రతిపక్షాలకు ఎన్నేళ్లు గడిచినా నిద్ర పట్టనిది…లక్ష్యం ఒక వైపు చూపించి, బాణం మరో వైపు సంధించింది ఊహించని దెబ్బ కొట్టడంతో కేసిఆర్‌ దిట్ట….అందుకే ఉద్యమ కాలం నుంచి ఆయన అనుసరించిన వ్యూహాలలో కొత్తదనం కనిపించకపోయినా, ఫలితాలు మాత్రం దిమ్మతిరిగేలా వుంటాయి. అందుకే ఎన్నికలంటే ప్రతిపక్షాలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదిర్శస్తున్నా…కేసిఆర్‌ ఎటు వైపు నుంచి ఎటు రాజకీయం సందిస్తారన్నది ఎవరికీ అర్ధం కానిది…అంతు చిక్కనిది…అలాంటి రాజకీయం కూడా డోర్నకల్‌లో సరికొత్త వ్యూహాన్ని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారా? అన్న చర్చ పెద్దఎత్తున జరుగుతున్నదే…అందరూ అంచనాలు వేస్తున్నదే…? అయితే ఆసారి డోర్నకల్‌ నుంచి అందరూ టిఆర్‌ఎస్‌ నుంచి రెడ్యానాయక్‌ రాజకీయ వారసుడిగా రవిచంద్రనాయక్‌ పోటీ చేస్తారని అనుకుంటున్నారు. కాని డోర్నకల్‌ నుంచి మహాబూబాబాద్‌ ఎంపి. మాలోతు కవితను రంగంలోకి దింపడానికి కారు పార్టీ సమాయత్తమౌతుంది. ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ తీయడానికి గులాబీ పార్టీ సరికొత్త వ్యూహాన్ని అనుసరించనుంది. 

డోర్నకల్‌ నియోజకవర్గం ఆది నుంచి రెడ్యానాయక్‌ కుటుంబానికి కంచుకోట. అక్కడి నుంచి రెడ్యానాయక్‌ 1989 నుంచి 2009లో తప్ప వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం కూడ వుంది. సీనియర్‌ ఎమ్మెల్యేగా, డోర్నకల్‌ నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ ఆయనకు మంచి పేరుంది. రాష్ట్ర స్ధాయి నేతగా మంచి గుర్తింపు వుంది. సుధీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో, ప్రజా సేవలో వుండడమే ఎంతో గొప్ప విషయం. అలాంటిది ప్రజా ప్రతినిధిగా మూడుదశాబ్ధాలపాటు ప్రజల మన్ననలు పొందుతూ గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకు ఒక నాయకుడికి తన జీవితం కన్నా, తన ప్రజల జీవితం మీద మక్కువ ఎక్కువ వుండాలి. వారి అభివృద్ధి కోసం ఆలోచనలు వుండాలి. నిరంతరం ప్రజల్లో వుండాలి. రాజకీయ ఎత్తుగడలను సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తుండాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే దూర దృష్టి కావాలి. ప్రజలు కోరుకున్న రీతిన రాజకీయం చేయాలి. ప్రగతివైపు తన నియోజకవర్గాన్ని పరుగులు తీయించాలి. అప్పుడు తప్ప నాయకుడికి సుధీర్ఘమైన ప్రజా ప్రతినిధిగా ప్రజల దీవెనలు అందడం దుర్లభం. కాని రేడ్యానాయక్‌ ప్రజలను గుండెల్లో పెట్టుకొని వారి కోసం పనిచేయడం ఒక ఎత్తేతే, ఆయనను కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకోవడం వల్లనే ఐదుసార్లు గెలవగలిగారు. అలాంటి గుణం పునికి పుచ్చుకున్న వారసురాలు మాలోతు కవిత. చిన్న తనంలోనే ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం మహబూబాబాద్‌ ఎంపిగా ప్రజలకు సేవలందిస్తున్నారు. గతంలో మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాను ఎమ్మెల్యేగా వున్న సమయంలోనే ఆ ప్రాంతాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారు. ఇప్పుడు కనిపిస్తున్న అనేక అభివృద్ధి కార్యాక్రమాలు ఆమె చలవతోనే మొదలైనవే…వాటి ఫలాలు నేడు ప్రజలకు అందుతున్నవి…అలాంటి కవిత…ఈసారి ఎమ్మెల్యేగా అందరూ మహబూబాబాద్‌ నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్నారు…మెజార్టీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు…కాని ఆమెను పార్టీ డోర్నకల్‌ నుంచి పోటీ చేయించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఎంతో బలంగా వుంది. అలాగే బలమైన నాయకత్వాలు కూడా వున్నాయి. అలాంటి నాయకత్వాలలో ఆధిపత్య పోరును ఎగదోసి, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలని చూస్తున్నాయి. కాని వారి ఆశలు నెరవేరని రాజకీయాలు నెరపడంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌దిట్ట. అందుకే రెడ్యానాయక్‌కు కాకుండా డోర్నకల్‌ నుంచి పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవితను పోటీచేయించాలని చూస్తున్నారు. దాంతో అటు మహాబూబాబాద్‌, ఇటు డోర్నకల్‌ రెండూ మళ్లీ గులాబీ పార్టీ ఖాతాలోనే వుంటాయి. అయితే రెడ్యా నాయక్‌ కుటుంబంనుంచి కూడా ఆయన కుమారుడిని డోర్నకల్‌ నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాని వాటికి ప్రత్యేకమైన దృవీకరణ లేదు. టిఆర్‌ఎస్‌ అధిష్టానం మాత్రం కవితనే ఎంపిక చేయాలని, ఎన్నికల్లో గెలిపించుకోవాలని చూస్తోంది. 

చిన్న వయసులోనే మాలోతు కవిత రాజకీయాల్లోకి రావడమే కాదు, తన తండ్రి ప్రజలతో ఎలా మమేకమౌతున్నారన్నదానిని చిన్నప్పటినుంచి గమనిస్తూ వస్తోంది. ఉన్నత విద్యావంతురాలైన కవిత ప్రజల ఆలోచనా విధానం తెలుసు. వారి అవసరాలు తెలుసు. సమాజ శ్రేయస్సు కోసం తానేం చేయాలన్నది తెలుసు. తన సామాజిక వర్గ సమస్యలు తెలుసు. ఎన్నేళ్లు గడిచినా వారికి పూర్తి స్ధాయి గుణాత్మక మార్పులు ప్రభుత్వాలు ఎందుకు తీసుకురావడం లేదో తెలుసు. అందుకు ఒక్కొమెట్టు ఎలా వారి ప్రయోజనాల కోసం ప్రగతి దారులు వేయాలో కవితకు తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే తన గిరిజనం కోసం ఎంతో చేయాలన్నదే రాజకీయంగా ఆమె ఆశయం. అన్ని వర్గాల ప్రజల్లాగా వాళ్లు కూడా నాగరిక సమాజం చూడాలి. అనుభవించాలి. అడువుల్లో వున్నా, పట్టణ సౌకర్యాలు వారికి అందాలి. అందుకు చాల కృషి జరగాలి. ప్రభుత్వాలు వారి కోసం ఇప్పుడు కేటాయిస్తున్న నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. ప్రత్యేక సబ్‌ ప్లాన్‌ల ద్వారా నిధులు కేటాయిస్తున్నా, అనుకున్న ప్రయోజనాలు నెరవేరడం లేదు. అయితే ఇంకా ప్రభుత్వంతో కొట్లాడి గిరజన సమాజానికి మేలు చేసేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన ప్రణాళికలు ఎన్నొ అవసరమనేది కవిత ఆలోచన. 

ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధి అయిన మాలోతు కవిత ఆ ప్రజల కోసమే నిరంతరం ఆలోచిస్తుంది. వారి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రజలను ఆమె గుర్తు పడతారు…ఒక్కసారి కవితను కలిసి వ్యక్తి ఎన్ని రోజుల తర్వాత కనిపించినా పేరు పెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి ఆమె సొంతం. అందుకే ఆమె తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఏ పనులు జరిగాయన్నదానిపై కూడా ఆమెకు పూర్తి స్ధాయి అవగాహన వుంటుంది. ఇక పేదల పాలిట ఆమె పెన్నిధి అని అంటుంటారు. ఇక రాజ్యాంగం, చట్టం, చట్ట సభల వ్యవహారంలో ఆమెకు సంపూర్ణమైన అవగాహన కూడా వుంది. వెనుకబడిన ప్రాంతమైన మహబూబాబాద్‌ జిల్లా పరిధిలోని ప్రజలు సిఎం రిలీఫ్‌ ఫండ్‌ విషయంలో ముందుగా మాలోతు కవితనే ఆశ్రయిస్తారు. ఏ పని కావాలన్నా ముందు ఆమెనే సంప్రదిస్తారు. కవితది లౌక్యం తెలిసిన ముక్కుసూటి తనం. ఏ విషయంలోనూ దాపరికం వుండదు. మంచిని మంచీ అని, చెడును చెడు అని చెప్పడానికి కూడా వెనుకాడని మనస్తత్వం. ప్రజలు నిత్యం రకరకాల సమస్యలతో ఆమె వద్దకు వస్తుంటారు. అయితే అందులో జరగని పనులు కూడా కొన్ని సార్లు ప్రజలు తెస్తుంటారు. అలాంటప్పుడు వారిని మభ్యపెట్టడమో, పది సార్లు తిప్పుకోవడమే ఎట్టిపరిస్ధితుల్లోనూ చేయరు. తన వద్దకు వచ్చిన ఆ పని అవుతుందనుకుంటే ఆలస్యం చేయరు. కాని పనిని వెంటనే చెప్పేస్తారు. నిజాలు వివరిస్తారు. ఎంతసేపైనా వారికి ఓపికతో సమాధానం చెబుతారు. అందుకే ఈ విషయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలు కూడా ఆమె వెళ్లి తమ సమస్యలు చెబుతుంటారు. వచ్చినవారిలో తన నియోజకవర్గ ప్రజలు కాదన్నది కూడా ఆమె చూడరు. ఎవరొచ్చినా వారి సమస్యపరిష్కరించకుండా వుండలేరు. అలా తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించుకున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలే మెండుగా వున్నాయి. ఈసారి మాలోతు కవిత పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయించాలని పార్టీ కూడా ఆలోచిస్తోంది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిస్తే మాత్రం కచ్చితంగా మాలోతు కవిత మంత్రి కావడం ఖాయం. మహాబూబాబాద్‌ జిల్లాకు మహార్ధశ రావడం తధ్యం….

నో ఫైర్‌ సేఫ్టీ!?

దొరలెవరు? దొంగలెవరు?

ఎలాంటి సర్టిఫికేషన్‌ లేని ఆసుపత్రులు, విద్యా సంస్థలు!

సర్టిఫికెట్లు ఇవ్వలేదని అధికారులు?

ఉన్నట్లు నమ్మిస్తున్న ఆసుపత్రులు, విద్యా సంస్థలు?

ఆన్‌ లైన్‌ అప్లికేషన్లు, భోగస్‌ సర్టిఫికెట్లు?

రోహిణిలో ఫైర్‌ ఆక్సిడెంట్‌ మర్చిపోయారా?

కళ్యాణ లక్ష్మి షాపింగ్‌ మాల్‌ కథ కంచికేనా?

ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా?

ప్రమాణాలు గాలికొదిలి, ప్రాణాలు పోగొడతారా?

ఆసుపత్రులా, నరకానికి తెరిచిన ద్వారాలా?

విద్యా సంస్థల్లో పిల్లల ప్రాణాలకు భరోసా ఎలా?

వ్యాపారం తప్ప, ప్రాణాలకు విలువే లేదా?

భయం లేని తనంతో ఇరుకు భవనాలలో ఆసుపత్రులు?

ఏ ఒక్క ఆసుపత్రి సేఫ్టీగా లేదు?

విద్యా సంస్థల్లో సౌకర్యాలు లేవు?

అంతా గోల్‌ మాల్‌ గోవిందం?

ప్రజల ప్రాణాలతో చెలగాటం?

వెలుగు చూస్తున్న భయంకరమైన నిజాలు?

పట్టింపు లేని అధికారులు?

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రులకు వెళ్తున్నారా? ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆలోచనతో నరక కూపాలకు దారులు వెతుక్కుకుంటున్నారా? పెద్దాసుపత్రులు ఎన్ని పైసలు ఖర్చైనా సరే అనుకుంటున్నారా? పైపైన మెరుగులు చూసి మోసపోతున్నారా? ఆసుపత్రి చూస్తే ఎంతో పెద్దదిగా వుందని భ్రపడుతున్నారా? భరోసా మీద లెక్కలేసుకుంటున్నారా? ఒక్క క్షణం ఆగండి! అవి ఆసుత్రులు కాదు…నరకానికి నకళ్లు…నరకలోకానికి దారులు…! ద్వారాలు తెరిచిన వైకుంఠదామాలు? బతికుండానే చితిమంటలు పేర్చే స్మశానాలు…అదృష్టం బాగుండి…వైద్యం కోసం వెళ్లినా, ప్రాణం నయమైనా, భూమ్మీద నూకలు బాగుంటే గాని, క్షేమంగా ఇల్లు చేరలేరు? అయినవాళ్లను కళ్లారా చూసుకోలేరు.. ఏ మాత్రం కిందమీదైనా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రాణాలతో చూసుకోలేరు…అంతా బాగుందనుకున్న సమయంలోకూడా అంతా బూడిదైపోవచ్చు…ఇది కథ కాదు…ఆసుత్రుల్లో జరిగుతున్న అగ్ని ప్రమాదాల పరిణామాలు…బతికుండగానే నిప్పుల పాలై, అరుపులు, ఆర్ధనాదాలు పెట్టుకుంటుంటే ప్రాణాలు పోతుంటే సజీవ సాక్ష్యాలుగా, బూడిద రూపాలుగా మారిన బతుకులెన్నో…వున్నాయి..? ఇవి ఆసుత్రుల సంగతి….

ఇక బడుల సంగతి మరీ ఘోరం….

పిల్లల భవిష్యత్తు మీద గంపెడాశలతో, మార్కెట్లో ప్రచార పటాటోపాన్ని చూసి, వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారా? లక్షల రూపాయలు పోయినా ఫరవాలేదు…పాఠాల గురించి ఆలోచిస్తున్నారే గాని, మీ పిల్లల ప్రాణాల గురించి ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా? ఆ బడులు ఎంత వరకు సేప్టీ అన్నవి తెలుసుకుంటున్నారా? అడ్మిషన్ల కోసం వెళ్లినప్పుడు ఫీజులు గురించి అడిగి తెలుసుకుంటున్నారే గాని, మా పిల్లల్ని చేర్పిస్తే, ఎంత వరకు బడి సురక్షితమని, తమ పిల్లలు క్షేమమని తెలుసుకుంటున్నారా? గొర్రెలు దూరినట్లు దూరి, లక్షలు లక్షలు చెల్లించి పిల్లల ప్రాణాలపై ఆశలు వదులుకుంటున్నారా? ఎంత సేపు ర్యాంకెంత? వారి చదువెంత? భవిష్యత్తులో అమెరికా దూరమెంత? అందుకు అయ్యే ఖర్చెంత? అంటూ లెక్కలేసుకుంటున్నారే గాని, బడి బాగుందా? బడి నిర్మాణం నాణ్యతా ప్రమాణాలున్నాయా? అన్న కనీస అవగాహన తల్లిదండ్రులకు వుంటుందా? ఇవేవీ మనకే పట్టడం లేదు? ఇక యాజమాన్యాలకేం పడుతుంది? వారికి భయమేముంటుంది? అధికారులకెలా పడుతుంది? పుట్టగొడుగుల్లా…పిట్ట గూడుల్లా…గాలి కూడా సరిగ్గా దూరని గదులతో, అంతస్థుల మీద అంతస్ధులుగా కట్టిన బడిలో చదివిస్తున్నారు..చదవు కొంటున్నారు…ప్రమాదాలు జరిగినప్పుడు కడుపుకోతలు మిగిల్చుకుంటున్నారు…జీవితాంతం జీవచ్చవాలుగా బతుకుతున్నారు…

   మరి షాపింగు మాల్స్‌…పండగలు…పబ్బాలు…శుభ కార్యాలు…

కొద్ది రోజుల్లో ఇంటి నిండా ఆనందాలు…సంతోషాలు…బంధువులు..కొత్త బంధుత్వాలు…పెళ్లిళ్లు…పేరంటాలు…పుట్టిన రోజులు ఇలా వేడుకల కోసం కొత్త బట్టలు, ఇతర సామాన్లు కొనుగోలు కోసం షాపింగులకు మాల్స్‌కు వెళ్తున్నారు…? కాని అడుగు వేసేప్పుడు తొలి మెట్టులోనే ధరలు తక్కువట? అని ముచ్చట్లు పెట్టుకుంటామే గాని, అడుగు లోపల పెట్టినంత సులువుగా బైట పడతున్నారా? అన్నది ఆలోంచికుంటున్నారా? లేదు…అందరూ వెళ్తున్నారు…మేం వెళ్తున్నాం…ఇంతే…మనలో చాలా మంది ఆలోచన అంతే…అంత దూరం వరకే….? ఎవరు మారాలి? ఎవరు మార్చాలి? ఎవరిది తప్పు? ఎవరిది లోపం? ఎవరిది పాపం? ఎవరిది నేరం? రా…రామ్మంటూ అందమైన లోకం కనిపించినంత అందంగా భవనం వుంటే చాలా? దానిలో సౌకర్యాల కల్పనతోపాటు, ప్రమాదాలు జరక్కుండా ప్రమాణాలున్నాయా? ఇది ఎవరు తెలుసుకోవాలి? జనమా? ప్రభుత్వమా? ఇవేవీ ఆయా శాఖలకు పట్టవా? జనం చచ్చిపోతున్నా…కదలరా? 

  అధికారులు ఏం చేస్తున్నారు? భవనాల నిర్మాణం దగ్గర నుంచే నిర్లక్ష్యం?

 ఏ భవనం ఎలాంటి అవసరాలకు ఉపయోగించాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించకుండా పర్మిషన్లు ఇవ్వడం? చేతులు తడుపుకోవడం…ఆపై దులుపుకోవడం? ఇదేనా బాధ్యత కల్గిన అధికారులు చేయాల్సింది? రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్ధితి. ముఖ్యంగా హన్మకొండ, వరంగల్‌ జిల్లాల సంగతే చూస్తే, తాజాగా విచిత్రమైన సందర్భం కనిపిస్తోంది. గతంలో హన్మకొండ బస్టాండ్‌ పరిసరాల్లో కనిపించే లాడ్డింగ్‌లన్నీ ఆసుపత్రులైపోయాయి? అసలు ఒక ఆసుపత్రి ఏర్పాటుకు ఎన్ని రకాల నియామాలు అమలు చేయాలన్నదానిపై కూడా ఎవరికీ అవసరంలేదు. ఎంతో కాలం దూరం వెళ్లాల్సిన పనిలేదు. ఆ మధ్య రోహిణీ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలు మన కళ్లముందే వున్నాయి. అయినా ఏ ఒక్క అధికారి కదిలింది లేదు. ఆసుపత్రులు సందర్శించింది లేదు. వాటిని మూసేసింది లేదు…మరి అవి ఎలా నడుస్తున్నాయి? ఇరుకైన స్థలాలు…ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగడానికి కూడా అవకాశం లేని బిల్డింగుల్లో పెద్ద పెద్ద ఆసుపత్రుల నిర్వహణ జరగడం జనాలకు ప్రాణగండం కాదా? ఎంతో పేరున్న ఆసుపత్రి అని కలరింగులిచ్చుకునే రోహిణీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగితే ఎంత పెద్ద నష్టం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగు చేసుకుందామని వచ్చి రోహిణీలోచేరి, వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని అగ్నిప్రమాదం మూలంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు? మరి అలాంటి ఆసుపత్రి మీద తీసుకున్న చర్యలేమిటో ఇప్పటి వరకు తెలియదు? జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారి ఏం చేశాడో తెలియదు? ఏం రిపోర్టు ప్రభుత్వానికి అందించాడన్నది ఎవరకీ తెలియదు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు బాదితుల పక్షాన నిలవాల్సిన అధికారి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నదానిపై ప్రశ్నించిన ప్రభుత్వ పెద్దలు లేరు? ఆ అధికారిపై చర్యలు లేవు? కాని ఆ అధికారి ఇచ్చిన రిపోర్టు మూలంగా మళ్లీ ఆసుపత్రికి అనుమతి ఎవరిచ్చారన్నది తెలియదు? ప్రజలకు ఏమీ తెలియదు? ప్రభుత్వానికి ఏమీ తెలియదు? కాని ఆసుపత్రి నడుస్తుందన్నది అందరికీ తెలుసు. ప్రజలు ప్రాణాలు అగ్ని ఆహుతి అయ్యాయని తెలుసు. మొత్తం మీద ఆసుపత్రి వర్గాలు పెద్దలను ప్రసన్నం చేసుకున్నారన్నది తెలుసు….

   మాకేం తెలియదు…అంటూ చేతులు దులుపుకోవడం మాత్రమే తెలిసిన ఫైర్‌ డిపార్టు మెంటు ఏం చేస్తోంది? 

ఎలా సర్టిఫికెట్లు జారీ చేస్తోందని నేటిధాత్రి ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్‌ లాంటి నగరాల్లో మున్సిపల్‌ ఫైర్‌ విభాగం, జిల్లా ఫైర్‌ విభాగమంటూ విడదీసి చోద్యం చూస్తున్నారు…ఏదైనా ఘటన జరిగితే మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు…? నెల నెల ఆసుపత్రుల నుంచి మమాళ్లు తీసుకుంటున్నారు? చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదిలా వుంటే హన్మకొండ, వరంగల్‌ జిల్లాల్లో వున్న ఆసుపత్రుల నిర్వాహాకులు ప్రభుత్వ అధికారుల సంతకాలు, స్టాంపులు కూడా తయారు చేసుకొని, ఏకంగా సర్టిఫికెట్లు కూడా తయారు చేసుకొని, ఆన్‌లైన్‌ సర్టిఫికెట్లు పొందుతున్నట్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా సర్టిఫికెట్లు తయారౌతున్నాయన్న సంగతి ఫైర్‌ డిపార్టుమెంటుకూ తెలుసు….కాని కదిలేవారేరీ…పట్టుకునేవారేరీ…కేసులు నమోదు చేసేవారేరీ? అందరూ అందరే…నెల నెల తమకు అందాల్సినవి అందుతున్నాయా? లేదా అన్నది అధికారులు చూసుకుంటున్నారు? మా జోలికి రాకుండా వుంటున్నారని ఆసుపత్రి వర్గాలు చెల్లింపులు చేసి చేతులు దులుపుకుంటున్నారు? ప్రమాదాలు జరిగినప్పుడు చూసుకుందామన్న నిర్లక్ష్యంగ వ్యవహరిస్తున్నారు? రోహిణీ లాంటి అంత పెద్ద ప్రమాదం జరిగితే ఏం జరిగింది? మనకేం జరుగుతుందన్న నమ్మకంతో ప్రజల ప్రాణాలతో చెలగామాడుతున్నారు…అలాంటి ఆసుపత్రులు…విద్యా సంస్ధలు…షాపింగ్‌ మాల్స్‌…ఆయా శాఖల పనితీరు….అధికారుల అలసత్వాలు…నిర్లక్ష్యాలపై మీ నేటిధాత్రిలో త్వరలో వరస కథనాలు…భయంకరమైన నిజాలు…అరచేతిలో ప్రజలు ప్రాణాలు….కాసుల కక్కుర్తిలో అధికారులు…వారి బాగోతమంతా ఇక వరుసగా….!

ఖాకీ వనంలో కీచకులా!?

 

`పోలీసు ఉద్యోగం పవిత్రమైంది.

`పాపపు పనులు చేసేవారిని పట్టుకునేది.

`అన్యాయాలు చేసేవారిని అడ్డుకునేది…

`నేరస్ధులును గుర్తించి సమాజాన్ని రక్షించేది

`ప్రజలకు శాంతి భద్రతలు అందించేంది

`అందరిలో బతుకు భరోసా కల్పించేంది

`ఆపదలో వున్నవారిని కాపాడేది…

`అనుక్షణం ప్రజల యోగక్షేమాల కోసం పనిచేసేది…

`ప్రాణాలకు తెగించి, ఇతరుల ప్రాణాలు రక్షించేది…

`ధైర్య సాహసాలతో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేది…

`కీచకులైన వారిని ఉపేక్షిస్తే వ్యవస్ధకే మచ్చది?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రజల తొలి ప్రభుత్వం పోలీస్‌ స్టేషన్‌. ప్రజలకు ధైర్యం పోలీస్‌ స్టేషన్‌. ప్రజలకు భరోసా పోలీస్‌ స్టేషన్‌. ఇదీ ప్రజల్లో పోలీసు వ్యవస్ధ మీద వుండే నమ్మకం. విశ్వాసం. పోలీసు వ్యవస్ధ వుండడంతోనే ప్రజలు ప్రశాంతంగా వుండగలుగుతున్నారు. హాయిగా జీవిస్తున్నారు. అందుకే పోలీసు వ్యవస్ధ ఎంతో బాధ్యతాయుతమైంది. పోలీసు ఉద్యోగం ఎంతో పవిత్రమైంది. ఖాకీ దుస్తుల మాటున కరుకైన కాఠిణ్యం కనిపించినా, కనికరమనే హృదయం దాగి వుండాలి. పాపపు పనులు చేసేవారిని పట్టుకోవాలి. తప్పులు జరక్కుండా చూసుకోవాలి. సమాజానికి రక్షణగా వుండాలి. సమాజంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తొక్కే తొలి గడప పోలీస్‌ స్టేషన్‌. అక్కడ మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని నిలబెట్టాలి. పేద, ధనిక అనే బేధం లేకుండా అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్ధది. అన్యాయాలు చేసేవారిని అడ్డుకునేది. నేరస్ధులను గుర్తించేది. వారికి శిక్షలు పడేలా చేసేది. సమాజంలో తప్పులు జరక్కుండా చూసేది. మరి అలాంటి వ్యవస్ధలో కొందరు చేస్తున్న తప్పుల మూలంగా మొత్తం వ్యవస్ధమీదే నమ్మకం పోయేలా చేసుకుంటున్నారు. ఎంతో పవిత్రమైన ఉద్యగం చేస్తూ అపవిత్రమైన పనులు సాగిస్తున్నవారు కూడా వున్నారంటూ నిత్యం అనేక వార్తలు వస్తున్నాయి. ఎక్కడో అక్కడ పోలీసుల వ్యవస్ధలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా వుంటున్నారు. ఇది కూడా నిత్య కృత్యమైపోతోంది. అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసులు. అమాయకులపై పోలీసుల ప్రతాపం అంటూ ఎప్పుడూ వింటున్నదే…ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, మరోపార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయడం తెలిసిందే..ఇవన్నీ ఉద్యోగ నిర్వహణలో కొన్ని జరిగేవే అనుకోవడం కూడా పరిపాటే…అలాంటిది ఆడ పిల్లల మీద అత్యాచారాలు చేయడం, మహిళలన బెదిరించడం, మోసం చేయడం కూడా అలవాటు చేసుకుంటున్నారా? గతంలో సినిమాల్లో తప్ప పోలీసులు లాకప్‌లో మహిళలను ఇబ్బందులు పెట్టినట్లుగాని, అత్యా చారాలు చేసినట్లు బైట విన్నవి లేవు. కాని తాజాగా కొందరు పోలీసు అధికారుల వ్యవహారం మొత్తం పోలీసు వ్యవస్ధమీదే అనుమానపు చూపులు చూసేదాకా వచ్చింది. సమాజం మొత్తం ఓ ఇద్దరు పోలీసులు చేసిన నీచాన్ని ఎండగుడూతూ పోలీసు వ్యవస్ధను వేలెత్తి చూపిస్తోంది. 

                            పోలీసు అధికారులంటే ఉన్నత విద్యావంతులు

 సమాజం చదువున్న వారు. సమాజాన్ని అర్ధం చేసుకున్నవారు. మంచి చెడులు తెలిసిన విజ్జులు. వెలుగు చీకట్లను విశ్లేషణ చేయగలిగేవారు. ఎంతో కఠినమైన శిక్షణ పూర్తి చేసుకొని అంకిత భావంతో ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తిస్తుంటారు. శిక్షణ అనంతరం తన కర్తవ్య నిర్వహణపై ప్రతిజ్ఞ చేసి వచ్చేవారు. ప్రజలకు మేలు చేస్తానని, అమాయకులకు అండగా నిలుస్తామని, అన్ని వర్గాలకు ఒకే రకమైన న్యాయం అందిలే చేస్తానని శపథం చేసి వస్తారు. రాజ్యాంగం గురించి తెలిసి వాళ్లు, చట్టాల మీద పూర్తి స్ధాయి అవగాహన కల్గినవాళ్లు పోలీసు అధికారులు. పోలీసు ఉద్యోగం చేయాలని కోరుకునేవారిలో కూడా కొన్ని ప్రత్యేకమైన గుణగణాలు కూడా వుంటాయని ఒక పరిశోధనలో తేలింది. తమకు ఆ వృత్తి పట్ల మమకారం, ప్రజలకు సేవ చేసే అవకాశం, సమాజంలో గౌరవమైన జీవితం ఇలా కొన్ని విషయాల్లో కలలు గని పోలీసు ఉద్యోగం ఎంచుకుంటారని అంటారు. మరి అంతటి ఉన్నత స్ధాయి ఆలోచనలు వుండేవారిలో భరితెగింపు ఎలా ఆవాహిస్తోంది? తప్పులు చేయడం మానవ సహజం అన్నది పోలీసు శాఖలోనూ వుంటుందా? నీచపు పనులు చేయడం మొదలు పెట్టాక, అవివేకులకు, ఎంతో వివేవకవంతులైన విజ్ఞులకు తేడా లేదా? తప్పులు చేసేవారిని పట్టుకొని వారికి ఎలాంటి శిక్షలు వేయాలో కూడా కేసులు నమోదు చేసే పోలీసులు అవే తప్పులు చేయడంలో అర్ధమేమిటి? ఏ తప్పు చేసినా డిపార్టుమెంటు కాపాడుతుందన్న నమ్మకమా? లేక నన్నెవరూ ఏమీ చేయలేరన్న అహాంకారమా? ఖాకీ దుస్తులు వేసుకున్నదే తమకు అన్యాయాలు, అక్రమాలు చేయడానికి లైసెన్సు దొరికినట్లు ఊహించుకోవడమా? ఓ వైపు నీచపు పనులు మరోవైపు, వందల కోట్ల రూపాయలు ఆర్జన అనేది ఒక సిఐకి ఎలా సాధ్యం? ఎంత మందిని ఇబ్బందులకు గురి చేస్తే అన్ని కోట్లు సంపాదిస్తారు…ఓ వైపు అక్రమ సంపాదనలు, మరో వైపు మహిళలపై అత్యాచారాలు చేయడానికి కూడా కొందరు ఎందుకు వెనకాడడం లేదు? 

                           ప్రపంచంలో ఏ దేశంలోనైనా మహిళలకు రక్షణ అన్నది ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం

అందుకు పోలీసు వ్యవస్ధ, న్యాయ వ్యవస్ధలకు ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు కూడా వున్నాయి. మహిళా రక్షణ కోసం అనేక చట్టాలున్నాయి. ఆకతాయిగా అమ్మాయిలను టీజ్‌ చేసినా అది నేరమే…అలాంటిది ఒక సిఐ మహిళ కణతపై సర్వీసు రివాల్వర్‌ పెట్టి మరీ అత్యాచారం చేయడం అంటే కంచే చేను మేసినట్లు కాదా? అందుకేనా ఆ పోలీసు అధికారి ఉద్యోగం చేస్తున్నది? గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు సదరు సిఐ మీద అనేకం వున్నాయని కూడా అంటున్నారు. సమాజంలో అత్యాచారానికి పాల్పడిన వారిపై అనేక కఠిన చట్టాలు తెచ్చారు. అందుకు ఎవరూ మినహాయింపులు కాదు. గతంలో వరంగల్‌లో ఓ అమ్మాయి మీద ఆసిడ్‌ దాడి చేసిన యువకులను ఎన్‌ కౌంటర్‌ చేశారు. ఈ మధ్య దిశ కేసులోనూ అదే జరిగింది. మరి అలాంటిది ఓ పోలీసు అధికారి పూర్తి సృహతోనే నేరం చేశాడు. కక్ష్య పెంచుకొని ఇబ్బందులకు గురి చేశాడు. భర్తను కేసుల్లో ఇరికిస్తానని బెరించాడు? ఆమె చెప్పినట్లు వినకపోతే బ్రోతల్‌ కేసు నమోదుచేస్తానని బెరించారని చెబుతున్న తర్వాత కూడా విచారణ పేరుతో కేవలం సస్పెన్షన్‌ చేయడం అంటే అర్ధమేమిటన్న ప్రశ్న సమాజం నుంచి ఉత్పన్నమౌతోంది. వెంటనే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలి? అలా చేయకపోవడం మూలంగానే పోలీసుల్లో కూడా విచ్చలవిడి తనం పెరుగుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఆ మధ్య అమాయకులైన వారిపై ధర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసు అధికారిని కమీషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేసిన గంటలోనే మరో పోస్టింగ్‌ ఇచ్చారన్న ఆరోపణలు వుండనే వున్నాయి. ఇక మల్కాజిగిరి స్టేషన్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఓ మహిళను ప్రేమించి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవమే నేరం. అయినా ప్రేమించిన అమ్మాయిని ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు..నా కోసమే వుండాలన్నంత వికృతానికి దిగజారుతుంటే ఎవరు బాధ్యులు. అంటే ఖాకీ దుస్తుల మాటన ఏమైనా చేయొచ్చన్నంత విపరీతం వారిలో ఎందుకు పెరిగిపోతోంది. సమాజానికి రక్షణ కల్పించాల్సిన వ్యవస్ధలోనే ఇన్ని లోపాలు వుంటే, ప్రజల రక్షణ బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తిస్తారన్న భరోసా ఎలా వస్తుంది? ప్రెండ్లీ పోలీసింగ్‌ అంటే అర్ధం ఇదేనా? అని ప్రశ్నింస్తున్న సమాజానికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వమా? పోలీసు వ్యవస్ధా!!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version