ధర్మసాగర్, నేటిధాత్రి:
గర్భిణీలు, బాలింతలు, పిల్లలు మంచి పోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడే మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారని సోమదేవరపల్లి సర్పంచ్ తోట మంజుల అన్నారు. శనివారం సోమదేవరపల్లి అంగన్వాడీ కేంద్రం-2 లో అక్షరాబ్యాసం, చేతుల పరిశుభ్రత, పోషకాహార ప్రదర్శనలు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ తోట మంజుల హాజరై మాట్లాడుతూ మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడే పూర్తి ఆరోగ్యం గా ఉండగలమని అన్నారు. ఎంపీటీసీ లక్క సునీత మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ అరుణ, అంగన్వాడీ టీచర్ రజిత, ఎఎన్ఎం విజయ, ఆశ రజిత, గోనెల శ్రీనివాస్, మధుకర్, రాజయ్య, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
జమ్మికుంట పట్టణంలోని 14వ వార్డు ఆబాది జమ్మికుంటలో కౌన్సిలర్ భోగం సుగుణ వెంకటేష్ తో కలిసి జమ్మికుంట పట్టణ ఇంచార్జ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిండ్రు. ఈ సందర్భంగా ఆయా ఓటర్లను కలుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి తెరాస అభ్యర్థికే ఓటు వేయాలని అభ్యర్థించిండు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలపాలని కోరారు. టీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు బాగున్నాయని టీఆర్ఎస్ కే తమ ఓటు అని వార్డు ప్రజలు చెప్పారన్నారు. వార్డులో ఉన్న సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని చెప్పామన్నారు. పలువురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం అందజేశామన్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారికి ఆయా డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో పొడేటి అనిల్, ఇంచార్జులు,యువజన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ లోని ఒమేగా హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న మాజీ నల్లబెల్లి మండల ఎంపిపి కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్ ను శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్పత్రికి చేరుకొని పరామర్శించారు అలాగే శ్రీనివాస్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి యాజమాన్యని అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, నల్లబెల్లి మీడియా ఇంచార్జ్ గుమ్మడి వేణు తదితరులు ఉన్నారు.
పెద్ద మొత్తంలో పక్కా రాష్ట్రానిది తరలించేందుకు సిద్ధంగా రేషన్ బియ్యం.
పక్కా సమాచారంతో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న తహసిల్దార్ సివిల్ సప్లై అధికారులకు సమాచారం.
ఇంటి యజమాని తో పాటు మరో వ్యక్తి పై కేసు నమోదు .
మహాదేవపూర్ నేటిధాత్రి:
కొన్ని దశాబ్దాల క్రితం మహదేవ్పూర్ నుండి పక్క రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని గ్రామాల్లో ముఠాలుగా మారి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి తరలించి లక్షల రూపాయలను సొమ్ము చేసుకునే వారు గత కొన్ని సంవత్సరాల క్రితం రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి రేషన్ బియ్యం సరఫరా తో పాటు వాహనదారులను కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తూ కఠిన నిబంధనలు చేపట్టడంతో నాలుగు ఐదు సంవత్సరాల నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణా సద్దుమణిగి ఉన్నప్పటికీ మరోసారి అక్రమ రేషన్ బియ్యం రవాణా కు సూరారం గ్రామం నుండి పునాదులు వేస్తూ రేషన్ బియ్యం రవాణా కు సంబంధించిన మరో డాన్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో నీ సూరారం గ్రామానికి చెందిన సూరం మహేష్ అదే వ్యక్తి కి సంబంధించిన ఇంట్లో పెద్ద మొత్తంలో పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అంత రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధంగా ఉండటం తో స్థానికులు శుక్రవారం అర్ధరాత్రి తహసిల్దార్ శ్రీనివాస్ కు సమాచారం ఇవ్వడంతో మహేష్ పాత ఇంటిలో సోదాలు జరిపి ఇంటికి తాళం వేసి ఉండటంతో గ్రామస్తుల సమక్షంలో తాళం పగులగొట్టి చూడగానే పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం సంచులలో అలాగే నేలపై రేషన్ బియ్యం ఉండడంతో తహసిల్దార్ శ్రీనివాస్ స్థానిక రేషన్ డీలర్ కు పర్యవేక్షణ నిమిత్తం సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించే వరకు తమ ఆధీనంలో తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. తహసిల్దార్ సమాచారం మేరకు శనివారం రోజున సివిల్ సప్లై డి టి ముస్తఫా సూరారం గ్రామానికి చేరుకొని అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉన్న సూరం మహేష్ పాత ఇంటితోపాటు మహేష్ నివసిస్తున్న ఇంటిని సైతం తనిఖీ చేయడం జరిగింది సూర్య మహేష్ పాత ఇంట్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం అదే గ్రామానికి చెందిన గంగారపు రమేష్ అనే వ్యక్తి కిరాయికి ఉంటూ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి తరలించడం జరుగుతుందని అక్రమ రవాణా కొరకు కొనుగోలు చేసిన రేషన్ బియ్యం ముప్పై ఏడు కింటల్ నరేష్ అన్న బియ్యం స్వాధీనం చేసుకో బడిందని 76 బస్తాలలో రేషన్ బియ్యాన్ని నిలువ చేయడం జరిగిందని అక్రమ రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వ్యక్తి గంగారపు రమేష్ తో పాటు ఇంటి యజమాని సూరం మహేష్ లపై 6ఏ కేసులు నమోదు చేసి బియ్యాన్ని స్థానిక డీలర్ కు అందజేసినట్లు సివిల్ సప్లై అధికారి ముస్తఫా తెలిపారు.
పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కు డాన్ ఎవరు:-
దశాబ్దాల తరబడి అక్రమ రేషన్ బియ్యం సరఫరా ఆగిపోయిందని అనుకుంటున్న సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో అంత రాష్ట్రానికి రేషన్ బియ్యాన్ని సరఫరా చేసేందుకు సూరారం లో సిద్ధంగా ఉన్న ఆ రేషన్ బియ్యం కొనుగోలు అక్రమ రవాణా చేయడంలో ఎవరి పాత్ర ఉంది ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయడం గంగారపు రమేష్ కు సాధ్యమవుతుందా గంగారపు రమేష్ వెనుక మరో పెద్ద తలకాయ ఏదైనా ఉందా మళ్లీ అక్రమ రేషన్ బియ్యం రవాణా సూరారం గ్రామం నుండే పురుడు పోసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఒకేసారి తెలుగులోకి పెద్దమొత్తంలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి రెవెన్యూ మరియు పోలీసు శాఖ నిఘా భోజనం చేసి అంబటిపల్లి అంతరాష్ట్ర వంతెన నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తులు కోరుతున్నారు.
ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ డా. గుగులోతు శంకర్ నాయక్ పర్యటించారు, తాడ్వాయి మండలం లోని గిరిజనుల ఆరాధ్య దైవం అయిన మేడారం సమ్మక్క సారలమ్మ లను అధికారిక లాంచనాలతో అమ్మవార్లను సతి సమ్మేతంగా దర్శించకున్నారు.
అనంతరం వాజేడు లోని బొగత జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లా ప్రకృతి అందాలను పరవశింప జేసీ ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచుతున్నాయని ఆయన అన్నారు. అనంతరం లక్నవరం అటవీ ప్రాంతంలోని రోప్ బ్రిడ్జ్ అందాలను తిలకించారు. లక్నవరం సరస్సు లో బోటింగ్ అద్బుతం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అయా మండలాల తహశీల్దార్ లు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు కాటారం మండలములోని కొత్తపల్లి,అంకుశాపూర్ , చిదినేపళ్లి , రేగులగూడెం, కాటారం గ్రామ పంచాయతీ పరిధిలోని గారేపల్లి స్పెషల్ కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులను అడిషనల్ కలెక్టర్ దివాకరన్ సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ కేంద్రాలు మంచిగా నడిపిస్తున్నందుకు ఎంపీడీవో పెద్ద ఆంజనేయులు, కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామారావులను అడిషనల్ కలెక్టర్ అభినందించారు.శనివారం పన్నెండు వందల డబ్భై తొమ్మిది మందికి ఫస్ట్, సెకండ్ దోషులు వేసినట్లు డాక్టర్ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ డాక్టర్ శ్రీరామ్, మండల ప్రత్యేక అధికారి అక్బర్ అలీ,కాటారం కార్యదర్శి షేగీర్ ఖాన్, వీఆర్వో బండి శ్రీనివాస్, ఆరోగ్య కేంద్రం సిబ్బంది రాజు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకి చెందిన సంతోషం బ్రహ్మ రెడ్డి(50)అనే రైతు గుండ్రాత్ పల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యారు. మహాదేవపూర్ మండలం అన్నారంలో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద విషయము స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం బ్రహ్మరెడ్డిని హాస్పిటల్ తరలించారు.
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ములుగు ప్రతినిధి:నేటిధాత్రి:
గణేశ నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం రోజున వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దిశ నిర్దేశం మేరకు వినాయక నిమజ్జనాన్ని విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గారు ఒక ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు. ఈ యొక్క నిమజ్జనానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ఈ యొక్క నిమజ్జనాన్ని జరుపుకోవాలసిందిగా కలెక్టర్ అన్నారు.
జిల్లా రెవెన్యూ మరియు పోలీసు యంత్రాంగానికి సంబంధిత గణేష్ మండళ్ల అసోసియేషన్ మెంబెర్స్, ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ అన్నారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి సేవాలాల్ సేన పెద్దపల్లి,జయశంకర్ జిల్లాల కన్వీనర్ అంగోత్ రాజునాయక్ డిమాండ్
మల్హర్రావు నేటిదాత్రి: హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ లో 6 సంవత్సరాల పసికందు గిరిజన బిడ్డ చిన్నారి చైత్ర ను అత్యాచారం చేసి,హత్య చేసిన కిరాతకున్ని కఠినంగా శిక్షించాలని రాజు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంఘటన జరిగి 5 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ పెద్దలు గానీ, కనీసం గిరిజన మంత్రి మహిళ అయి ఉండి కూడా నేటి వరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించి కా పోవడం బాధాకరం
రాష్ట్రంలో ఇంత గోరం జరుగుతున్నా కనీసం గిరిజన MLA లు గాని MP లు గాని మంత్రులు, ప్రజా ప్రతినిధులు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు వీళ్ళని గిరిజన సమాజం ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు
అత్యాచారం, హత్య, పోక్సో చట్టాల కింద తక్షణమే విచారణ పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీస్ శాఖ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఖమ్మంలో మరియమ్మ కుటుంబానికి ఇచ్చినట్టుగానే ఈ కుటుంబానికి కూడా 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగం అమ్మాయి తండ్రికి ఇవ్వాలని మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఒక ప్రకటనలో రాజు నాయక్ డిమాండ్ చేశారు
సింగరేణి కాలనీ లో గుడుంబా, డ్రగ్స్ వ్యాపారం ఒక మాఫియా లాగా తయారై విచ్చలవిడిగా అమ్ముతున్న ఇక్కడ ఎక్సైజ్ అధికారులు కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో దళిత, గిరిజనుల పై దాడులు, అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.
సినిమాలు, టీవీలు ,మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నా విచ్చలవిడి అశ్లీలత అరికట్టడంలో సెన్సార్ బోర్డు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు
కాజీపేట, నేటిధాత్రి:
సభ్య సమాజం తలదించుకునే విధంగా సైదాబాద్ సింగరేణి కాలనీ లో చిన్నారిపై అత్యాచార ఘటనకు పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి ఉరితీయాలని కార్పోరేటర్లు విజయశ్రీ రజాలీ, జక్కుల రవిందర్ యాదవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీని తీసి చిన్నారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున 6 సంవత్సరాల పసిపాపను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో పసిపిల్లలకే రక్షణ కరువైతే మహిళల పరిస్థితి ఏమిటని ఆవేదనను వ్యక్తం చేశారు. టీపీసీసీ కార్యదర్శి సయ్యద్ రజాలీ మాట్లాడుతూ సీఎం కేసిఆర్ కు వెనుకబడిన వర్గాలు, దళితులూ, గిరిజనులపై ఎంత ప్రేమ ఉందో ఈ ఘటన ద్వారా స్పష్టమైందని అన్నారు. మహిళలు చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా చర్యలు చేపట్టి మహిళా చట్టాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలనీ లేని పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి రాజధాని నడిబొడ్డున ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో సందెల విజయ్ కుమార్, కాసర్ల నగేష్, మహేందర్ రెడ్డి,మద్దెల శోభారాణి, గుర్రపు కొటేశ్వర్, బైరబోయిన రమేష్, పెద్దపల్లి విజయ్, మానస, అర్చన, తబ్బు, మాతంగి నర్సింగ్, షారుఖ్, తదితరులు పాల్గొన్నారు.
ధర్మసాగర్,నేటిధాత్రి:
డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నారాయణగిరి గ్రామ సర్పంచ్, ధర్మసాగర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి కోరారు. బుధవారం నారాయణగిరి గ్రామపంచాయతీలో జనరల్ బాడీ మీటింగ్ ను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏ ఒక్క ఇంటికి నీటి సమస్య రాకుండా చూడడంతో పాటు, అవసరమున్న ప్రతి ఇంటికి పైప్లైన్ నిర్మాణం చేసి మంచినీరు అందిస్తామని అన్నారు. గ్రామపంచాయతీ ఆధీనంలో ఉన్న రెండు బావులకు నూతనంగా ఓడల నిర్మాణం జరుగుతుందని, గ్రామంలో అవసరమున్న కాలనీ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం కోసం అంగీకారం తెలపడం జరిగిందని తెలిపారు. నారాయణగిరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు, మౌలిక వసతులు కల్పించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధిపధంలో నడిపించడానికే జనరల్ బాడీ మీటింగ్ ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రఘు, వార్డు మెంబర్లు వల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి, గంటె సరిత, కొలను సుమలత, పసునూరి రవి, గంటె లింగమూర్తి, వల్లపురెడ్డి జనార్దన్ రెడ్డి, కారోబార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పదని పొలం ఉమాదేవి అన్నారు.
భీమదేవరపల్లి రెడ్డి సంఘం శ్రీ గణనాయక నవరాత్రి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు మార్పాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా వచ్చిన పొలం ఉమాదేవి ఈ కార్యక్రమానికి హాజరై అన్నదానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి.రాజేందర్ రెడ్డి మహిపాల్ రెడ్డి.భూపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి మరియు రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఎలాంటి డీజే లకు అనుమతి లేదు.
గూడూరు సిఐ రాజి రెడ్డి. కొత్తగూడ, నేటి ధాత్రి.
గణేష్ నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని గూడూరు సీఐ రాజి రెడ్డి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ నిమజ్జనం రోజు రహదారులపై ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటూ నిమజ్జనం చేయాలని తెలిపారు. ఈ పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదు. ఎవరైనా డీజేలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈత రాని పిల్లలకు నిమజ్జనం రోజు తీసుకెళ్లకూడదు. కోవిడ్-19 నిబంధనలు ప్రార్థిస్తూ శాంతియుత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా కొత్తగూడ, గంగారం మండల ప్రజలకు తెలియజేశారు.
వీణవంక మండలం లోని చల్లూరు గ్రామ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో బుడగ జంగాల కాలనీ వాసులతో నారదాసు లక్ష్మణరావు ముచ్చటించి వారి సమస్యలపై అడిగి తెలుసుకుని దళిత బందు పై ఉన్నటువంటి అపోహల పై వారితో ముచ్చటించి అవగాహనను కల్పించడం జరిగింది. దళిత బందు అనేది ప్రతి దళిత కుటుంబానికి చేరే విధంగా ప్రయత్నంలోనే తెలంగాణ గవర్నమెంట్ కెసిఆర్ ప్రత్యేక చొరవతో కంకణం కట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఏలాంటి అపోహలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరికి దళిత బంధు అందుతుందని వారితో చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొదిల జ్యోతి రమేష్ ఎంపిటిసి సవితా మల్లయ్య మాజీ సర్పంచ్ జక్కు నారాయణ గౌడ్ పిఎసిఎస్ డైరెక్టర్ ముదిగంటి శ్యాంసుందర్ రెడ్డి మరియు. నెక్కొండ ఇన్చార్జులు సోమయ్య సారంగపాణి. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.