ద్విచక్ర వాహనం అదుపుతప్పి రైతుకి తీవ్ర గాయాలు

కాటారం నేటిదాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకి చెందిన సంతోషం బ్రహ్మ రెడ్డి(50)అనే రైతు గుండ్రాత్ పల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యారు. మహాదేవపూర్ మండలం అన్నారంలో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద విషయము స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం బ్రహ్మరెడ్డిని హాస్పిటల్ తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!