
ఫాతిమానగర్ లో బైకును ఢీకొన్న కారు -ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
కాజీపేట, నేటిధాత్రి: కాజీపేట పట్టణంలోని ఫాతిమానగర్ జంక్షన్ లో బైకును ఓ కారు వెనుకాల నుంచి వచ్చి ఢీకొన్న సంఘటన బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట నుండి హనుమకొండ కు ఇద్దరు విద్యార్థులు బైకుపై వెళ్తున్నారు. బైకు ఫాతిమానగర్ జంక్షన్ దగ్గరకు రాగానే వెనుక నుండి అతివేగంగా వచ్చిన కారు బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగా దెబ్బలు తాకాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స…