అత్యాచార నిందితుడి ని వెంటనే ఉరితీయాలి

కాజీపేట, నేటిధాత్రి:
సభ్య సమాజం తలదించుకునే విధంగా సైదాబాద్ సింగరేణి కాలనీ లో చిన్నారిపై అత్యాచార ఘటనకు పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి ఉరితీయాలని కార్పోరేటర్లు విజయశ్రీ రజాలీ, జక్కుల రవిందర్ యాదవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీని తీసి చిన్నారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున 6 సంవత్సరాల పసిపాపను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో పసిపిల్లలకే రక్షణ కరువైతే మహిళల పరిస్థితి ఏమిటని ఆవేదనను వ్యక్తం చేశారు. టీపీసీసీ కార్యదర్శి సయ్యద్ రజాలీ మాట్లాడుతూ సీఎం కేసిఆర్ కు వెనుకబడిన వర్గాలు, దళితులూ, గిరిజనులపై ఎంత ప్రేమ ఉందో ఈ ఘటన ద్వారా స్పష్టమైందని అన్నారు. మహిళలు చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా చర్యలు చేపట్టి మహిళా చట్టాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలనీ లేని పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి రాజధాని నడిబొడ్డున ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో సందెల విజయ్ కుమార్, కాసర్ల నగేష్, మహేందర్ రెడ్డి,మద్దెల శోభారాణి, గుర్రపు కొటేశ్వర్, బైరబోయిన రమేష్, పెద్దపల్లి విజయ్, మానస, అర్చన, తబ్బు, మాతంగి నర్సింగ్, షారుఖ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!