కేంద్ర రాష్ట్ర-ప్రభుత్వ విధానాలతో రైతాంగానికి తీవ్ర నష్టం

“వరి సాగు విషయంలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న ప్రభుత్వాలు జాబితాలో ఉన్న పంటలను పండించలేని దుస్థితి నేడు రైతు బంధు పథకం తో మిగతా పధకాలకు తూట్లు వరి పండే భూములలో వేరే పంట ఎలా వేయాలి సరైన ప్రణాళిక లేని ప్రభుత్వ విధానాలు” – రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి
మహబూబాబాద్, నేటిధాత్రి: పంట నష్టపరిహారం అందలేదు గ్రామాలలో రైతులు వారి వారి సమస్యలు సరైన ముందుచూపు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఆరుగాలం కష్టపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టిపిసిసి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అవినాష్ రెడ్డి అన్నారు. రైతాంగ సమస్యలను గ్రామ గ్రామాన తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న టువంటి రచ్చబండ కార్యక్రమం లో మహబూబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో నెంబర్ వార్డు ఈదుల పూస పల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన రైతాంగ సమస్యల మీద ఒక బలమైన టువంటి రైతు ఉద్యమాన్ని నిర్మించడం కోసం రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుండి రైతులను కాపాడడం కోసం రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ధరణి కార్యక్రమం వల్ల చాలామంది రైతుల భూములు నష్టపోయారని తెలిపారు. వరి సాగు విషయంలో ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారు అని అన్నారు.

ఒకరు ధాన్యం పందించందని అని ఒకరు వద్దని అనడంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారని అని తెలిపారు . జాబితాలో ఉన్నటువంటి పంటలను పండించినా కూడా మద్దతు ధర కల్పించలేని దుస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. రైతుబంధు సాకుగా చూపి వ్యవసాయ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు మిల్లర్లు కలిసి రైతులు తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నారు. వరి పండే పంట భూములలో వరి తప్ప వేరే పంట సాగు చేయలేని దుస్థితి ఉన్నా కూడా వరి సాగు చేయవద్దు అనడం ఏంటని ప్రశ్నించారు. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులకు ఇబ్బందులు కలగకుండా చేస్తుందని అన్నారు.సీనియర్ నాయకులు మురళి నాయక్ మాట్లాడుతూ మిల్లర్లు తరుగు పేరుతో రైతులను తీవ్రంగా నష్ట పరుస్తున్నారని అన్నారు. అలాగే పండించిన పంట డబ్బులు ఎకౌంట్లో పడ్డాక బ్యాంకు వారు రుణాలు ఉన్నాయని డబ్బులను కట్ చేసుకుని మిగతా డబ్బులు చెల్లిస్తున్నారని అన్నారు. దీంతో రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట రుణాలు వచ్చేవని కానీ ఇప్పుడు రుణమాఫీ లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే ఈ ప్రాంతంలో మిర్చి సాగు ఎక్కువగా ఉన్నందున లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా పంట సరిగా రాలేదన్నారు. ఒక్కొక్క రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు. దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాగైనా మిర్చి సాగు చేసిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ లో రైతుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిపారు. వెన్ను శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మిర్చి సాగు పంట ఎక్కువ సాగు చేశారని వారు లక్షల్లో నష్టపోయారన్నారు తెలిపారు. మిర్చి సాగు రైతులకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మిర్చి సాగు పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి , బెల్లయ్య నాయక్,పీసీసీ సభ్యులు దస్రు నాయక్, తండ వెంకటేశ్వర్లు, రజినీకాంత్, నునావత్ రాధ వెన్నం లక్ష్మారెడ్డి, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి మహేందర్ రెడ్డి, కత్తి స్వామి, రమేష్ నాయక్, రమేష్ ముఖ్య నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సినిమా ధియేటర్ యాజమాన్యం

ఘనపూర్ స్టేషన్ (జనగాం) నేటిధాత్రి
ఘనపూర్ మండల కేంద్రం లోని మహాలక్ష్మి ధియేటర్ యాజమాన్యం ఆగడాలకు హద్దే లేదు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న యాజమాన్యం, దీనిపై స్పందించిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ మాట్లాడుతూ థియేటర్ యాజమాన్యం పైన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ధియేటర్ లో ఏసీ అని చెప్పి కనీసం ఫ్యాన్లు కుడా లేవని గతంలో మొదటి, రెండవ, మూడువ, తరగతలు చొప్పున ధరలు ఉండేవి అలా కాకుండా మొత్తం అన్ని కేటగిరీ కి ఒక్కటే ధర టికెట్ల కు వంద రూపాయలు మాత్రమే అని దాదాపు రెండు సంవత్సరాలనుండి పెట్టారు అలాగే గత రెండు సంవత్సరములు నుండి 100 కంటే ఎక్కువ 150 రూపాయలు ధర పెంచడం జరిగింది. రెండు సంవత్సరాలనుండి వంద రూపాయలు ఉండేది పుష్ప సినిమా నుండి నూట యేబది రూపాయల (150) వరకు తీసుకుంటున్నారు ఇప్పుడు R R R సినిమా నుండి 175 వరకు తీసుకుంటాం అంటున్నారు.

యాజమాన్యం వారిని అడిగితే ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ధరలు పెంచుతున్నామని RRR సినిమాకు నూట డెబ్బది ఐదు రూపాయలు (175) వరకు పెంచుతామని చెబుతున్నారు. ఇది ప్రజలపై పెను భారమే అవుతుందని వారన్నారు. ఒక పక్క కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో థియేటర్ యాజమాన్యం మరోసారి ప్రజల పై పెనుభారం మోపే విధంగా ప్రయత్నిస్తుంది ప్రజల ఆరోగ్యం పట్ల కువైట్ డెల్టా ప్లస్ ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు ఇస్తుంటే కనీసం శానిటైజర్ గాని సోషల్ డిస్టెన్స్ గాని మాస్కు ధరించి వస్తున్నారా ప్రజలు లేరా అని చూడకుండా ప్రజలు అనారోగ్యం పాలవుతుంటే ధియేటర్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ముఖ్యంగా తాగునిరు లేకపోవడం శానిటేషన్ చేయకపోవడం మూత్రశాలలు శుభ్రపరచి కుండా కనీసం చేతులు కడుక్కోవడం కోసం గాని నీటి సదుపాయాలు లేవు ఏసీ కాదు కదా కనీసం ఫ్యాన్లు కుడా లేకపోవడం విడ్డూరంగా ఉందని దోమలు దురవాసన వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తెరాస ప్రభుత్వం ధియేటర్ యాజమాన్యలకు వంత పడుతుంది ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ధియేటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని లేకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తాము అని అని అవసరమైతే ప్రజల కొరకు ధర్నా ను చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని థియేటర్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నాము, ఈ కార్యక్రమంలో కోటి ఎల్లయ్య, శ్రీనివాస్, రాములు, రాజేష్, రాజు, సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు

కేంద్రంపై పోరుకు దుబ్బాక నుంచే తొలి అడుగు

చేనేత పై జిఎస్టి రద్దు చేసే దాకా పల్లె పల్లెనా ధర్నాలు చేస్తాం కేంద్రం మెడలు వంచుతాం చేనేతలకు అండగా ఉంటాం : చేనేత మహాధర్నాలో ఎమ్మెల్సీ రమణ

నేటి ధాత్రి,దుబ్బాక:
చేనేత వస్త్ర రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన 12 శాతం జీఎస్టీ ని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ డిమాండ్ చేశారు.జిఎస్టి పెంపునకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరాటానికి చేనేతలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత రంగంపై 12 శాతం జీఎస్టీ విధింపును నిరసిస్తూ గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నిర్వహించిన చేనేత మహాధర్నాలో ఎమ్మెల్సీ ఎల్.రమణ పాల్గొని మాట్లాడారు.స్వాతంత్ర పోరాటంలో చరఖాను ఆయుధంగా చేసుకుని మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్రం సాధించారని తెలిపారు.అంతటి ప్రాధాన్యం కలిగిన చేనేత వస్త్ర రంగంపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 5 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీని విధించడాన్ని టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు.నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుండి చేనేత రంగానికి చెందిన 6 సంక్షేమ పథకాలను రద్దు చేశారని విమర్శించారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో
చేనేతల ఆత్మహత్యలు ఉండేవని నేడు సీఎం కేసీఆర్ కృషితో చేనేతలకు చేతినిండా పని కల్పిస్తున్న ఘనత కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.వస్త్ర రంగంపై జిఎస్టి పెంపును నిరసిస్తూ రాష్ట్ర మంత్రులు కేటీఆర్,హరీష్ రావు లు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు.డిసెంబర్ 31లోగా జిఎస్టి ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో జనవరి1 నుండి పల్లె పల్లెనా చేనేతలతో కలిసి కేంద్రం మెడలు వంచుతామని హెచ్చరించారు.త్వరలో నిర్వహించబోయే హ్యాండ్లూమ్ మార్చ్ కు దుబ్బాక నుండే తొలి అడుగు పడనుందన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, రాజమౌళి తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బూర మల్లేశం,పద్మశాలి యువజన సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీధర్,పద్మశాలి సంఘం సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కాముని రాజేశం,జడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు కూరపాటి బంగారయ్య, నందాల శ్రీజ శ్రీకాంత్,లోంక రాజవ్వ లచ్చయ్య,దుబ్బాక పట్టణ పద్మశాలి,నీలకంఠ సంఘాల అధ్యక్షులు బింగి రవి,మర్గల సత్యానందం,మున్సిపల్ కౌన్సిలర్లు, పిఎసిఎస్ చైర్మన్ షేర్ల కైలాస్,దుబ్బాక చేనేత కార్మికులు,టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

దుబ్బాక సీపీఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశo

దుబ్బాక సీపీఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశo గురువారం దుబ్బాక మండల కేంద్రంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఎండీ. అబ్బాస్ హాజరయి మాట్లాడుతూ దుబ్బాక ప్రాంతంలో చేనేత వస్త్ర పరిశ్రమ పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నదని దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్ట కొట్టే విధంగా జిఎస్టి నీ 12 శాతం పెంచడం ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన చేనేతపై 70 సంవత్సరాల కాలంలో ఎక్కడ వస్త్రాలపై సుంకo లేదని,ఈరోజు చేనేత పైన జిఎస్టి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చేనేత రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరియు రాష్ట్రంలో బిజెపి నిరుద్యోగ సమస్యపైన నిరాహార దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఏడు సంవత్సరాల కాలంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగులను తొలగించిన దుర్మార్గమైన చరిత్ర బిజెపి పార్టీదని విమర్శించారు. దేశంలోని రైతుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.

వెంటనే ఐకేపీ కొనుగోలు ద్వారా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి భవిష్యత్తులో కూడా రైతుల పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగం కేంద్ర ప్రభుత్వం పై సంవత్సరం కాలంపాటు పోరాటం చేసి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం జరిగిందని మరియు విద్యుత్ సవరణ బిల్లును కూడా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ధనవంతులకు అప్పగించే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజా,కార్మిక,రైతు వ్యతిరేక విధానాలను మానుకొని ప్రజల కోసం పని చేయాలని లేనియెడల రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అర్, శశిధర్,జి.భాస్కర్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎస్. నవీన, రుద్రారం సిపిఎం పార్టీ ఎంపీటీసీ కే.మంజులత,సిపిఎం పార్టీ దుబ్బాక మండల నాయకులు దేవయ్య,మహేందర్ రెడ్డి,కొంపల్లి భాస్కర్, బత్తుల రాజు, శంకర్,స్వామి,దేవయ్య, యాదవరెడ్డి,మోహన్ రెడ్డి,మానస,మౌనిక తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

మహబూబాబాద్, నేటిధాత్రి: గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని దిశ చైర్మన్ మాలోత్ కవిత ఆదేశించారు. గురువారం స్థానిక ఐ.ఎం.ఎ. హాలులో జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ప్రజాప్రతినిధుల తోనూ అధికారులతోనూ నిర్వహించారు.మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ చైర్ పర్సన్ మాలోత్ కవిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా 37 అంశాలపై అంశం వారీగా వైద్యం, జాతీయ ఆరోగ్య మిషన్, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, మధ్యాహ్న భోజనం, ఉపాధి హామి, పెన్షన్ లు, ప్రధాన మంత్రి సడక్ యోజన, జాతీయ రహదారులు విద్యుత్ పథకాలపై సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, డోర్నకల్ శాసన సభ్యులు డి.ఎస్. రెడ్యా నాయక్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎంపిపి బయ్యారం చేపురి మౌనిక, చిన గూడూరు పద్మ వల్లూరి,ధంతలపల్లి ఉమ వలదారి, డోర్నకల్ దరంసోతు బాలు, గంగారాం సువర్ణ పాక సరోజన, గార్ల ఎం. శివాజీ, గూడూరు బాణోతు సుజాత, కెసముద్రం వి. చంద్ర మోహన్, కొత్తగూడ బనోతు విజయ, కురవి గుగులోతు పద్మావతి, మహబూబాబాద్ భూక్యా మౌనిక, మరిపెడ గుగులోత్ అరుణ, టెకుల సుశీల, నెల్లికుడురు ఎర్రబెల్లి మాధవి, పెద్ద వంగర ఈదూరి రాజేశ్వరి, తొర్రూరు తూర్పాటి చిన అంజయ్య, మునిసిపల్ చైర్మన్ రామచంద్రయ్య, మహబూబాబాద్ పాల్వాయి రామ్ మోహన్ రెడ్డి, డోర్నకల్ వీరన్న, మరిపెడ సింధు కుమారి, నామినేటెడ్ మెంబర్ లు సర్పంచ్ లు బట్టు శ్రీనివాస్ నవీన్, సుష్మ గౌడ్, అజ్మీరా రజిత, ఆనంద్, మమత, ఎన్. జి. ఓ. ప్రతినిధులు పివి. ప్రసాద్, పి. శ్రీనివాస రెడ్డి జడ్పీటిసి లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ రైతులను సన్మానించిన మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య, ఆదేశానుసారం జనగామ జిల్లా ఘనపూర్ స్టేషన్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, ఆధ్వర్యంలో పలువురు ఆదర్శ రైతులను శాలువా కప్పి సన్మానించి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం కార్యక్రమాన్ని బట్టి గుజ్జరి రాజు, మాట్లాడుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వాలపై రైతాంగం ఉద్యమించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉద్యమ కేరటాలని మనకు ఉద్యమాలు కొత్తేమీ కాదని కేంద్ర ప్రభుత్వం పై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. అదే విధముగా రైతుల పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేసిందన్నారు. ఉడకబెట్టిన బియ్యాన్ని కొనం అనే సాకుతో రైతులను ఆయన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన ప్రతి పంటలను రైతులు అమ్ముకునే విధంగా చట్టాలు చేసి, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే స్వేచ్ఛ ఇవ్వాలన్నారు.

అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతాంగం కష్టాలు వారు ఎదురు కొంటున్న నష్టాలన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, రైతు సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు.అంతేకాకుండా దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ప్రభుత్వాలు ప్రోత్సహించి, వారికి అండగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి జీవన్ కుమార్, స్టేషన్ ఘనపూర్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, మార్కెట్ డైరెక్టర్లు బత్తుల రాజన్ బాబు, పెంతల రాజ్ కుమార్, చల్లారపు శ్యామ్ సుందర్, చిగురు సరిత-ఆంజనేయులు, సుప్రియ, పిఏసిఎస్ డైరెక్టర్ తోట సత్యం, శివునిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు బాలరాజు, ఏసుబాబు మార్కెట్ సిబ్బంది, రైతులు, హామలీలు పాల్గొన్నారు.

మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.

కొత్తగూడ, నేటి ధాత్రి : ఈరోజు అఖిల భారత రైతుకూలీ సంఘం ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా కార్యవర్గం పిలుపులో భాగంగా ఏ ఐ కె ఎం ఎస్ కొత్తగూడ మండల కార్యవర్గం ఆధ్వర్యంలో మండలంలోని గుంజేడు, మైలారం తండా, చింతగట్టు తండా, హనుమాన్ తండా, రౌతు గూడెం తండా, లడాయిగడ్డ ,రామన్నగూడెం, వేలుబెల్లి గ్రామాలలో ప్రతినిధి బృందం సందర్శించి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా నాయకులు మరియు మండల అధ్యక్ష కార్యదర్శులు గుగులోతు యాదగిరి మాట్లాడుతూ మండలంలోని మిర్చి పంటను సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మిర్చి తోట లో తామర పురుగు రోగం తెల్లదోమ రసం పీల్చే పురుగు పచ్చపురుగు ఎండు తెగులు తదితర చీడపీడల వైరస్ ల తో ఈ సంవత్సరం మిర్చి రైతులను ఇప్పటికే 90% మిర్చి తోటలు నిలువునా ఎండిపోయాను అని ఎన్ని మందులు కొట్టినా తెగుళ్లు అదుపు కావడం లేదని రైతులు దిగులు చెందుతూ మనోధైర్యం కోల్పోతున్నారని వారు అన్నారు.

ఈ యొక్క తెగుళ్లను ప్రకృతి విపత్తు గా ప్రభుత్వం భావించి నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి ఒక లక్ష రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా మిర్చి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, కల్తీ లేని పురుగు మందులు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రైతులు బుర్క సూరయ్య, బెల్లి సుధాకర్, లావుడియ సుమన్ , అజ్మీర తిరుపతి, లింగంపల్లి సత్యం, గుంజ దుర్గయ్య ,బిజ్జ వెంకటలక్ష్మి ,రామదన్, సత్యనారాయణ, నర్సిరెడ్డి, కొమురం న ఉప్పలయ్య, ప్రభాకర్ ,రవీందర్, జాముల రాజు, గట్టి నాగేశ్వరరావు, లక్ష్మన్న ,కొమురయ్య, సంజీవ రావు ,భూక్య సారయ్య, గుగులొతుశ్రీను, చెన్నయ్య, సామల నాగరాజు, పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న

శేరిలింగంపల్లి ( నేటి ధాత్రి) కొలువులపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ గారు మరియు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి .ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలపై మొండి వైఖరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో, నిరుద్యోగ భృతి హామీ అమలు లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు.

ఈ తెరాస ప్రభుత్వం నిరుద్యోగులు ఉద్యోగుల భర్తీ గురించి మాట్లాడకుండా, కేంద్రాన్ని ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడటం చాలా సిగ్గుచేటు, ఈ అబద్ధలు మాట్లాడుతూ ప్రజలని మభ్యపెట్టి మోసంచేసే ఈ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు,నిరుద్యోగులే తగినబుద్ధి చెప్తారు అన్ని అన్నారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటే.. ఈనాడు ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్ని అన్నారు. ఇకనైనా ఆత్మహత్యలు ఆగాలి. నిరుద్యోగులకు అండగా ఉంటామనే భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అన్ని అన్నారు. లక్ష ఉద్యోగాలంటూ, త్వరలో నోటిఫికేషన్లంటూ ఓట్లు దండుకొని గద్దెనెక్కి జాబ్ నోటిఫికేషన్లు ఇయ్యకుండా గడీల్లో రాక్షసానందం పొందుతున్న తెరాస ప్రభుత్వం అన్ని అన్నారు.

నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నా అవేవి పట్టనట్టు, సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు ,రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సమగ్ర నోటిఫికేషన్ సాధించడం లక్ష్యంగా బండి సంజయ్ గారు నిరుద్యోగ దీక్ష చేపెట్టారు అన్ని అన్నారు . ఈ దీక్షలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ తరుణ్ చుగ్, మాజీ ఎంపీ శ్రీమతి విజయశాంతి,ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్‌, మంత్రి శ్రీనివాస్ , పలువురు సీనియర్ నాయకులు ,రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున తరలివచ్చిన బిజెపి శ్రేణులు, కార్యకర్తలు ,యువకులు, నిరుద్యోగులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఓట్లుంటేనే ఓదార్పులా” “నేటిధాత్రి” కథనానికి “కడియం” స్పందన

*గత ఏడాది తల్లి, పది రోజుల క్రితం తండ్రి…*

*తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయి అనాధలుగా మిగిలిన పసిపిల్లలు*

*అన్ని రకాలుగా పిల్లలను ఆదుకుంటామని కడియం ప్రకటన*

*ఐనవోలు* గ్రామానికి చెందిన చిన్నారులు *ప్రణయ్, నందులపై “నేటిధాత్రి” దినపత్రికలో వచ్చిన కథనానికి తెలంగాణ మాజీ ఉప  ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ “కడియం శ్రీహరి” స్పందించారు*. అనాధలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పారు. గత ఏడాది జూన్ లో కన్న తల్లి చనిపోయింది. గత పది రోజుల క్రితం తండ్రి చనిపోవడంతో పిల్లలు అనాధలయ్యారు. జరిగిన *సంఘటన తెలియగానే నేటిధాత్రిలో ఆ పిల్లలుపై ఈ రోజు  ‘ఓట్లుంటేనే ఓదార్పులా” అనే కథనం ప్రచురించడం జరిగింది. ఆ వార్తను చూసిన కడియం శ్రీహరి ఆ పిల్లలకు సంబంధించి అన్ని రకాల సహాయసహారాలు అందించేందుకు ముందుకొచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు.* ఆ పిల్లల విషయంలో మరింత మంది మానవతా హృదయులు ముందుకొస్తే వారి జీవితం తెగిన గాలిపటం కాకుండా వుంటుంది. *నిరుపేదలైన దళిత పిల్లలను ఆదుకోవాల్సిందిగా “నేటిధాత్రి” మనవి.

26న ఇల్లందులో జరుగు నిర్మాణ జనరల్ బాడీ ని జయప్రదం చేయండి; కే సారంగపాణి

(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)గుండాల,నేటిధాత్రి: కార్మిక హక్కులను హరించే విధంగా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని “భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కే సారంగపాణి పిలుపునిచ్చారు. బుధవారం మణుగూరులో ఐ ఎఫ్ టి యు ముఖ్య కార్యకర్తలతో మల్లి కంటి రాము అధ్యక్షతన జరిగిన సమావేశం లో సారంగపాణి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుండి కార్మిక హక్కులను చట్టాలను రద్దు చేయడానికి కుట్రపూరితంగా ప్రయత్నిస్తోందని అందులో భాగంగానే గతంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లు గా కుదించి. కార్మిక వర్గ హక్కులను హరించి కార్పొరేట్ కంపెనీలకు బహుళజాతి సంస్థలకు బడా పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, సింగరేణి, రైల్వే, విద్యుత్ , బ్యాంకులు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను వారికి అప్పగించి ప్రైవేట్ పరం చేయుటకు సిద్ధమైందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసే ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఈపీఎఫ్ , ఇతర బెనిఫిట్స్ అమలు చేయాలని , అసంఘటిత రంగంలోని హమాలి, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గ్రామపంచాయతీ లో పనిచేసే కార్మికులకు పిఆర్సిప్రకారం వేతనాలు చెల్లించాలని, గ్రామ పంచాయతీలలో మల్టీ పర్పస్ విధానాన్ని తొలగించాలని అన్నారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, భవిష్యత్ పోరాటాలను కర్తవ్యాలను రూపొందించుకునేoదుకు ఈనెల 26 న ఇల్లందులో జరిగే భారత కార్మిక సంఘాల సమాఖ్య( ఐ ఎఫ్ టి యు) జిల్లా నిర్మాణ జనరల్ బాడికి కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి య జిల్లా నాయకులు కందగట్ల సురేందర్ , మోత్కూరి మల్లికార్జున్, మణుగూరు ఏరియా నాయకులు మలికంటి రాము, డి విక్రమ్ , బట్టా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

నెక్కొండ, నేటిధాత్రి:
నెక్కొండ మండలం అప్పల రావు పేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బూరుగుపల్లి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గణిత శాస్త్ర ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులను బృందాలుగా విభజించి గణితశాస్త్రంలో క్విజ్ పోటీ నిర్వహించారు . ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనడానికి రామానుజన్ జీవితమే నిదర్శనం అన్నారు. తొలి దశలో ఆశించిన ఫలితాలు రాకున్నా విద్యార్థులు నిరుత్సాహం చెందకుండా ముందుకు సాగితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ సౌభాగ్య లక్ష్మి , యాకయ్య భూలక్ష్మి ,యాకూబ్ పాషా,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా అన్ని విధాల లాభాలు

నర్సంపేట, నేటిధాత్రి : భూములు లేని పాడి రైతులు, మత్స్యకారులు, గొల్ల కురుములు కూడా రైతులేనని వారికి ఏదోవిధంగా ఆర్ధిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకురావడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డు (కేసిసి) అంటే రైతులకు ఏటిఎం లాగా ఉపయోగపడుతుందని అలాగే వాటి వలన అనేక విధాలుగా లాభాలు పొందవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్, నర్సంపేట రూరల్, మున్సిపాలిటీకి చెందిన మత్స్యకారులకు, గొర్రెలు, మేకల పెంపకందారులకు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసిసి) ప్రాముఖ్యత దరఖాస్తు విధానం నర్సంపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్యాంపెయిన్ లో లబ్దిదారులకు కేసిసి లకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భూములు లేని పాడి రైతులు, మత్స్యకారులు, గొల్ల కురుములు కూడా రైతులేనని వారికి ఏదోవిధంగా ఆర్ధిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకురావడం జరిగింది.

కిసాన్ క్రెడిట్ కార్డు అంటే రైతులకు ఏటీఎం లాగా ఉపయోగపడుతుందని, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 25 వేల నుండి రూ.లక్ష 60 వేల వరకు కేవలం 7 శాతం వడ్డితో బ్యాంకు ఋణం పొందే అవకాశం ఉంది. ఈ 7 శాతం వడ్డీలో సగం అంటే 4 శాతం వడ్డీని మీకు మద్దతుగా గవర్నమెంట్ వారు తిరిగి బ్యాంకర్లకు చెల్లిస్తుంది. అంటే కేవలం 30 పైసల వడ్డీ మాత్రమే లబ్దిదారులపైన పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ భూములపై క్రాప్ లోన్ తీసుకున్న వారికి కేసిసి కార్డ్ వర్తించదని ప్రధానంగా రైతు దరఖాస్తు పెట్టిన 15 రోజుల నుండి 30 రోజులలో బ్యాంక్ లోన్ ఖచ్చితంగా ఇవ్వాలిసిందే తేల్చి చెప్పారు.

అర్హులైన 2500 మంది మత్స్యకారులు, పాడి రైతులకు, గొర్రెల, మేకల కాపారులను సొసైటీల ద్వారా గుర్తించి లబ్దిదారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ గుర్తింపు కార్డ్ అనేది కిసాన్ క్రెడిట్ కార్డుకు ముఖ్యమైనది అన్నారు. దరఖాస్తులో ఏదైనా లోపం ఉండి నిరాకరించబడితే దానికి సంబందించిన కారణాన్ని మెస్సేజ్ రూపకంలో దరఖాస్తుదారునికి పంపిస్తారని గతంలో బ్యాంక్ ల ద్వారా క్రాప్ అప్పు తీసుకొని సరిగ్గా కట్టని వారి దరఖాస్తులు మాత్రమే తిరస్కరించబడుతాయని, కెసిసి కార్డు పొందిన వ్యక్తికి రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుందని తెలుపుతూ, ఎవరెవరూ ఏఏ వృత్తులలో ఉంటారో వారికి ఆ వృత్తిలో పెట్టుబడి కింద ఆర్థిక సహాయం చేయడమే కేసిసి కార్డు ముఖ్య ఉద్దేశం అని ఎమ్మెల్యే వివరించారు. ఆర్థికంగా పేదరికంలో ఉండి వృత్తిని నమ్ముకున్న రైతులకు కేసీసీ కార్డు ఒక వరం లాంటిదని, కార్డును నియోజకవర్గంలోని అర్హులైన రైతులందరూ సద్వినియోగ పరుచుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ఎమ్మార్వోలు, ఎంపిడివోలు, పశు సంవర్థక శాఖ జెడి, ఏడీలు, యూనియన్ బ్యాంక్ ఎల్దిఎం , జిల్లా మత్స్య శాఖాధికారి, పీఏసిఎస్ చైర్మన్లు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, అర్ఎస్ఎస్ కన్వీనర్లు, క్లస్టర్ భాద్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

హెల్మెట్స్ బ్యాగ్ లు టీ షర్ట్ లు పంపిణీ

నేటిధాత్రి కొండపాక : కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామంలో గత 15 రోజుల నుండి నెక్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ లకు భవన నిర్మాణ కార్మికులకు శిక్షణ ఇచ్చి హెల్మెట్స్ బ్యాగ్ లు టీ షర్ట్ లు పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి గా కుకునూరుపల్లి సర్పంచ్ పోల్కంపల్లి జయంతి నరేందర్ హాజరై మాట్లాడుతూ ఇట్టి శిక్షణ కాలంలో రోజుకు 300 రూపాయలు చొప్పున స్టైపండ్, మధ్యాహ్న భోజనం ,హెల్మెట్స్ బ్యాగ్ ఫైండ్ అవుట్ టీషర్ట్ , ట్రైనింగ్ ముగిసిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు ఇట్టి కార్యక్రమాన్ని లేబర్ కార్డు ఉన్నవారు కుకునూరుపల్లి పరిసర గ్రామ ప్రాంతాల వాళ్ళు వినియోగించుకోవాల్సిన కోరుచున్నాము అన్నారు.

కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, సెంటర్ ఇన్చార్జ్ మరియు స్టాఫ్ మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది

దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా – రాస్తారోకో

చిట్యాల, నేటిధాత్రి: దళితుడిని కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు నేటి వరకు చేయకపోవడం తో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో చిట్యాల చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది అని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని ధర్నా, రాస్తారోకో నిర్వహించడం జరిగిందని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య అన్నారు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతి నగర్ గ్రామానికి చెందిన పర్లపెల్లి మహేందర్ మాదిగను బిసి యాదవ్ కులానికి చెందిన బొంకూరి రాజయ్య మరియు కుమారుడు కుమార్ తండ్రి కొడుకులు ఇద్దరు కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని నవంబరు 14నాడు పిర్యాదు చేసిన నేటి వరకు ఎఫ్ఐర్ నమోదు చేయుటకు జాప్యం చేయడం వల్ల కేసును తప్పు దారి పట్టించి బాధితులకు అన్యాయం జరుగే అవకాశం ఉందని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ శాంతి నగర్ లో జరిగిన సంఘటనపై సరియైన సాక్షాలు ఉన్న ప్రజాప్రతినిధుల మాటలు నమ్మి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయకుండా తప్పు దారి పట్టించి దళితుడికి అన్యాయం చేయాలని చూడటం బాధాకరమన్నారు. ఇట్టి సంఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గారికి అదనపు జిల్లా ఎస్పీ శ్రీనివాసులు గారికి పిర్యాదు చేసిన, ఎస్సీ ఎస్టీ కమీషనర్ హెల్ప్ లైన్ లో పిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజాప్రతినిధులకు దళితులంటే ఎందుకు అంత చిన్న చూపు? దళితులు ఎన్నికల్లో మీకు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు.? సరియైన సాక్షాలు ఉన్న సంబంధించిన పోలీసు అధికారులు ఎఫ్ఐర్ నమోదు ఎందుకు చేయడం లేదని అన్నారు. అందుకే దళిత బహుజనులకు రాజ్యాధికారం ఎంతో అవసరమని అన్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్సై కృష్ణ ప్రసాద్ గారు నేను వచ్చిన తర్వాత సంఘటన జరుగుతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేస్తానని అనడం సరి కాదని ఆయన అన్నారు. భారత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితుడిని కొట్టిన బొంకూరి రాజయ్య భూమి పట్టా దారుడు, భూమికి అతనికి ఎలాంటి సంబంధం లేదని అతనికి సహకరించి అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేస్తామని చెప్పి చేయకుండా దళితుడైన మహేందర్ కు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని, లేనిపక్షంలో భాదితునితో పాటు దళిత సంఘాలము ఆందోళన కార్యక్రమాలు దశల వారీగా భారీ ఎత్తున జిల్లా, రాష్ట్రశశ వ్యాప్తంగా చేపడుతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు.

కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలి దళితుడైన పర్లపెల్లి మహేందర్ కు న్యాయం చేయాలి. పిర్యాదు దారుడు పర్లపెల్లి మహేందర్ పై, సాక్షులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సంబంధించిన అధికారులకు తెలియజేయుచున్నాము. మా డిమాండ్లు పరిష్కరించే వరకు ప్రతి రోజు ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని తెలియజేయుచున్నాము.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు పర్లపెల్లి కుమార్ కట్కూరి రాజేందర్ జన్నే నరేష్ శనిగరపు శ్రీనివాస్ పర్లపెల్లి శ్రీ కాంత్ మొలుగూరి రాకేష్ పిర్యాదు దారుడు పర్లపెల్లి మహేందర్ కుటుంబ సభ్యులు పర్లపెల్లి సమ్మయ్య సమ్మక్క బంగారి రాణమ్మ తదితరులు పాల్గొన్నారు.

దళితుల భూ సమస్యపై మంత్రి ఎర్రబెల్లి మౌనం వీడాలి : కేవీపీఎస్

పాలకుర్తి:(జనగామ) నేటిధాత్రి
మండలంలోని మంచుప్పుల గ్రామానికి చెందిన దళితుల భూములు స్ధానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు తెలియకుండానే కబ్జాకు గురై అక్రమ రిజిస్ట్రేషన్ లు అయ్యాయా అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జాటోత్ ఇందిరలు మండిపడ్డారు. దళితులను ఆదుకుంటామని ఎన్నికల లో మాయ మాటలు చెప్పి దళితుల ఓట్లను వేయించుకోని ఇప్పుడు దళితుల భూములను కబ్జా చేస్తున్న అధికార పార్టీ నాయకులకు అండగా ఉంటూ ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండడంలో మతలబేంటో చెప్పాలని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దళిత ద్రోహిఅని అన్నారు. దళితుల భూ సమస్యపై మంత్రి ఎర్రబెల్లి మౌనం వీడాలని డిమాండ్ చేశారు.

దళితుల భూములను కబ్జా దారులకు కట్టబెట్టిన తహశీల్దార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం పాలకుర్తి మండలకేంద్రములో గత 8 రోజులుగా తమ పట్టా భూములకు రక్షణ కల్పించాలని దీక్షలు చేస్తున్న దళితుల పోరాటానికి సంఘీభావంగా మండల కేంద్రములో కేవీపీఎస్ ఆధ్వర్యములో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్ధార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఇండ్ల స్థలాల పోరాట నాయకులకు పూలదండలు వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టా కాగితాలు వున్న 52 దళిత కుటుంబాలకుఇండ్ల స్థలాల భూమినికబ్జా కోరులకు కట్టబెట్టిన తహశీల్ధార్ విజయభాస్కర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని దళితుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే జోక్యం చేసుకొని దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 1993 లో ప్రభుత్వం దళితుల 52 కుటుంబాలకు ఇండ్ల స్థలాల కోసం ఆనాటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూమిని ప్రస్తుత సర్పంచ్, ఉప సర్పంచ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తో కుమ్మక్కై కబ్జా చేశారని, తక్షణమే ఆ భూమిని ఇప్పించాలని తహశీల్ధార్ ను డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల కోసం పట్టాలు పంపిణీ చేసిన భూములను హద్దులు నిర్ణయించి దళితులకు ఇవ్వాలన్నారు.

రెవిన్యూ అధికారులు వైఫల్యం వల్ల దళితులకు అన్యాయం జరిగిందన్నారు తహశీల్ధార్ నలుగురికి అక్రమ పట్టాలు చేయడం శోచనీయమన్నారు ఫలితంగా భూమి కబ్జా అయిందని అన్నారు. ఇప్పుడు అధికారులు కబ్జా దారులకు అనుకూలంగా మాట్లాడటం ఆందోళన కరం అన్నారు. ఈ భూమి లో సగం డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఇచ్చిందన్నారు నిర్మాణం అయిన తర్వాత ఆ ఇండ్లు బిసి లకు ఇస్తాం, ఎస్సీ లకి ఇవ్వమని అధికారులు అనడం కులవివక్ష ను అమలు చేయడమే అన్నారు. పట్టాలు వున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇండ్లు ఇవ్వమని చెప్పడం అట్టుడుకు పేదలను మోసం చేయడమే అన్నారు.

ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు తూటి దేవదానం,బొట్ల శేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పల్లెర్ల లలిత, టిడీపీ మండల అధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న, జిల్లానాయకులు యాదగిరి, బహుజన కులాల ఐక్య వేదిక వ్యస్థాపక అధ్యక్షులు గుమ్మడిరాజుల సాంబయ్య,ద్రవిడ బహుజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు చేరిపల్లి ఆనంద్,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, ఘనపురం ఎల్లయ్య,పసలాది ఉపేందర్,భూపోరాట నాయకులు రమేష్ బాబు, వెంకన్న,ఎల్లమ్మ,యాకమ్మ, లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు

టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రోళ్ల శ్రీనివాస్

*కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు..*

ఉమ్మడి మెదక్ జిల్లాకు ఈ అవకాశం ఇవ్వడం సంతోషకరం..

ఇంతకు మునుపు తన దైన శైలిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా అద్భుతంగా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారు.


అదే రీతిలో ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ ఎం ఎస్ ఐడీసీ. అలాంటి సంస్థకు ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎర్రోళ్ల శ్రీను కు నా అభినందనలు.
సాధారణంగా మనకు ప్రభుత్వ ఆస్పత్రులలో బిల్డింగ్ లు, మెడికల్ డివైసెస్, ఎక్స్ రేలు, టెస్టింగ్ ల్యాబ్ లు, ఇంజక్షన్లు, బెడ్లు మాత్రమే ఆస్పత్రుల్లో కనిపిస్తాయి. కాని అవి సమకూరడానికి శ్రమించేది, సమకూర్చేది టీఎస్ఎంఎస్ఐడీసీ సంస్థనే.

ఆస్పత్రుల భవన నిర్మాణా పనులు, అవసరమైన ఫర్నిచర్, మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, వైద్యానికి అవసరమైన కాటన్, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఎక్విప్మెంట్ నిర్వహణ, శానిటైజెషన్, ఆస్పత్రుల భద్రతకు అవసరమైన సెక్యూరిటీ ఏర్పాట్లు, వైద్యో ఆరోగ్య శాఖకు అవసమరైన అన్ని సదుపాయాలు కల్పించేది ఈ సంస్థ ద్వారానే. ఒక్క మాటలో చెప్పాలంటే సూది నుండి సీటీ స్కాన్ మిషన్ వరకు సమకూర్చేది ఈ సంస్థే.

మహబూబ్ నగర్,సిద్దిపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలు టీఎస్ఎంఎస్ఐడీసీ నిర్మించింది.
సిరిసిల్లలో నర్సింగ్ కాలేజీని నిర్మించింది. ఎం.ఎన్. జే క్యాన్సర్ ఆసుపత్రిలో మాడ్యులర్ ధియెటర్ నిర్మాణ పనులు ఈసంస్థ ద్వారానే జరుగుతున్నాయి.

తెలంగాణ వైద్య విధాన పరిషత్తు కు సంబంధించిన 14 ఆస్పత్రుల అప్ గ్రేడేషన్, 83 ఆస్పత్రులను బలోపేతం చేయడం లో ఈ టీఎస్ఎంఎస్ఐడీసీ కీలకంగా పని చేసింది.
19 హబ్ అండ్ స్పోక్ మోడల్ డయాగ్నోస్టిక్ సేవలు అందించే కేంద్రాలు, 8 మినీ హబ్ లను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది.

ఇక కరోనా సమయంలో దేశంలోనే కరోనా టెస్ట్ కిట్స్, పీపీఈ కిట్స్, ఆక్సిజన్ , కరోనా మందులు, రెమిడెసివర్ తీవ్రంగా ఉన్నప్పటికీ టీఎస్ఎంఎస్ ఐడీసీ సంస్థ ఎంతో చాకచక్యంగా వాటిని సేకరించి ఎంతో మంది కరోనా బాధితుల ప్రాణాలు కాపాడడంలో కీలకంగా వ్యవహరించింది. బ్లాక్ ఫంగస్ కి కూడా మనం మందులు సరఫరా చేశాం. ఎంతో మంది వ్యాధిగ్రస్థులకు సేవలందించి కాపాడుకున్నాం.
ఆసుప‌త్రుల్లో అత్యాధునిక వైద్య ప‌రిక‌రాల‌ను ప్ర‌భుత్వం స‌మ‌కూర్చుతున్న‌ది. మొత్తం రూ. 150 కోట్ల‌తో వివిధ ఆసుప‌త్రుల్లో అత్యాధునిక సిటీ, ఎంఆర్ఐ, పిఇటి స్కాన్ మిష‌న్ల‌ను ఏర్పాటు చేసింది.
గుండె స‌మ‌స్య‌లున్న వారిని కాపాడుకునేందుకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, ఎంజీఎంల‌లో, ఖ‌మ్మం, ఆదిలాబాద్ ఆసుప‌త్రుల్లో విలువైన క్యాథ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నాం. టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా వీట‌న్నింటిని స‌మ‌కూర్చుకుంటున్నాం.

ఆరోగ్య తెలంగాణ గా తెలంగాణ రాష్ట్రం మారాలన్నది సీఎం కేసీఆర్ గారి కల. పేషంట్లకు త్వరిత గతిన ఆరోగ్య పరీక్షలు, మందులు అందించే ఒక గొప్ప బాధ్యత ఇప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద ఉంది. తను చురుకుగా ఉండి, తన సంస్థను మరింత ముందుకు సమర్థవంతంగా నడుపుతూ, వందకు వంద శాతం తన బాధ్యతలను నిర్వర్తించి కేసీఆర్ గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను.

జయముఖీలో ముగిసిన డిజైనింగ్ సోలార్ సిస్టమ్ వర్క్ షాప్

మండలంలోని ముగ్ధుము పురం గ్రామంలోని జయముఖీ ఇంజనీరింగ్ అటానమస్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే ట్రైనింగ్ ప్రోగ్రాం “డిజైనింగ్ సోలార్ సిస్టమ్ వర్క్ షాప్”మంగళవారం రోజున కళాశాల ఆవరణలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం& ఐ.ఈ.ఈ.ఈ పెస్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం స్. ఏ.ఈ ఇండియా మరియు గ్రీన్ వేయిన్ ఎనర్జీ టెక్నాలజీస్ సంయుక్త ఆద్వర్యంలో విజయవంతంగా ముగిసింది ముఖ్య అతిథి కళాశాల ప్రిన్సిపాల్ వాగ్దేవి గ్రూప్స్ ప్రెసిడెంట్, ట్రెజరీ ,విభాగ అధిపథులు ఈ కార్యక్రమన్ని ప్రారంభం చేశారు.

ముఖ్య అతిధిగా పాల్గొన్న పురుషోత్తం చారీ, గ్రీన్ వేయిన్ ఎనర్జీ టెక్నాలజీస్ మానేజర్ మాట్లాడుతూ రేనేవాబుల్ విద్యుత్ ఉత్పత్తి, నియంత్రణ పై ప్రయోగాత్మకంగా విద్యార్థులచే అవగాహన కల్పించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. యం. లోకనదరావు మాట్లాడుతూ విద్యార్థులం దరూ రెండు రోజులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు అభినం దించారు.వాగ్దేవి కళాశాలల ప్రెసిడెంట్ శ్రీ సీ.హెచ్ నరసింహ రెడ్డి మరియు ట్రెజరీ జీ.శంకర్ రెడ్డి ,ఈ శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న వారికి సర్టిఫికేట్ ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం లోకనాధ్ రావు ,వాగ్దేవి కళాశాలల ప్రెసిడెంట్ శ్రీ సీ.హెచ్ నరసింహ రెడ్డి , ట్రెజరీ శ్రీ.జీ.శంకర్ రెడ్డి ,డీన్ అకడమిక్ హమీద్ పాషా.,వైస్ ప్రిన్సిపాల్ డా.పీ.శ్రీనివాస రావు, ఈ.ఈ.ఈ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ రజనీ కుమార్, మెకానికల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ యం. జవహర్ మరియు ప్రోగ్రాం కో ఆర్డనేటర్స్ కే. శ్రీదేవి మరియు సీ.హెచ్ జీవన్ రెడ్డి, ప్రొఫెసర్ రంజిత్ ,కళాశాల వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు , దేశంలోని వివిధ రాష్ట్రాల కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

భాద్యతలు ఇవ్వడమే ఆలస్యం ‘ప్రక్షాళనలో మునిగిన మంత్రి హరీష్‌

హైదరాబాద్‌ , నేటిధాత్రి : రాజకీయాలన్నాక ప్రతిపక్షాలు అదును చూసి రాజకీయ వ్యూహాలు పన్నుతూనే అధికార పార్టీ నాయకులు చిక్కుకోవాలని చూస్తూనే ఉంటాయి. అలా మంత్రి హరీష్‌రావు మీద ప్రతిపక్షాలు చేసే కుట్రలు కొత్తేమీ కాదు. వారి వార్తలు ఏనాడు నిజమైన దాఖలాలు లేవు. ఎప్పటికైనా నెరవేరకపోతాయా అనుకునే కలలు తీరేవి కాదు.ఎందుకంటే మంత్రి హరీష్‌రావు లక్ష్యశుద్ధి, చిత్తశుద్ది, లక్ష్యసిద్ధి ఎవరికీ తెలియదు. ఆయన ఆశలు, ఆశయాలు వేరు. అన్నీంటినీ కాదనుకొని తెలంగాణ కోసం త్యాగం చేసిన హరీష్‌ జీవితం వేరు. ఇవన్నీ ప్రపంచానికి తెలిసినా, ఎప్పటికప్పుడు మసిబూసి మారేడు కాయ చేయాలని ప్రతిపక్షాలు కుటలు పన్నుతూనే వుంటాయి. ఎప్పుడూ కొత్త ఎత్తుగడలు వేస్తూనే వుంటాయి. తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్న వేళ 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ పదహారు సీట్లకు గాను, ఏడు మాత్రమే గెలిచింది. అదే సమయంలో హరీష్‌రావు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ను కలవడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రి అవాయింటు మెంటు ఖరారైనట్లు వచ్చిన సమాచారం మేరకే కలిసిన సందర్భమది. అది కాస్తా పెద్ద వివాదమైంది. అసలు నిజమేమిటో కేసిఆర్‌కు తెలుసు. హరీష్‌రావుకు తెలుసు. కాని హదీష్‌రావు కన్నీరు పెట్టుకునేంత దాకా అసత్య ప్రచారం సాగింది. సిద్దిపేటలో మహిళా డిగ్రీ కాలేజీ కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ను హరీష్‌రావు కలవడం జరిగింది. అంతే నాటి సీమాంధ్ర మీడియా, కాంగ్రెస్‌ పార్టీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. నాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో వుండే రవిచంద్ర ఈ నాటకం ఆడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ దగ్గరకు వెళ్తూ ఉత్త చేతులతో వెళ్లడమెందుకని రవిచంద్ర తెలివిగా హరీష్‌రావుచేతికి బొకే అందించడం జరిగింది. అందులో కూడా రాజకీయ కుయుక్తి వుంటుందని తెలియని హరీష్‌రావు బొకే వైఎస్‌కు అందించారు. అది ఫోటోలు తీసి అప్పటికప్పుడు మీడియాకు అందించి ఒక్కసారి తెలంగాణలో రాజకీయ కుదుపుకు ప్రయత్నించారు. కాని క్షణాల్లో దాన్ని తిప్పికొట్టి, జరిగిందేమిటో ప్రపంచానికి చెప్పి తెలంగాణ ద్రోహుల కుట్రను ఎదుర్శొన్న ధీశాలి హరీష్‌రావు. అంటే నాడు ఉద్యమ నాయకుడైనా కేసిఆర్‌ను రాజకీయంగా దెబ్బకొట్టలేక, ఉద్యమం నుంచి దూరం చేయలేక తెలంగాణ (ప్రజల్లో ఆయన నింపుతున్న చైతన్యం చూడలేక ఏన్నో కుట్రలు పన్నారు. అందులో భాగంగా ముందు హరీష్‌రావుకు దూరం చేయాలని చూశారు. కాని కుదరలేదు. ఎందుకంటే మంటత్రి హరీష్‌రావు అంటే కేసిఆర్‌కు ఉండే అనుబంధం గొప్పది.అది తెలియక రాజకీయ గందరగోళాన్ని సృష్టించాలని ఎప్పటిప్పుడూ చేస్తూనే వచ్చారు.

2018  తర్వాత మంత్రి హరీష్‌రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో దాన్ని కూడా చిలువలు పలువలు చేసింది. కేసిఆర్‌కు, హరీష్‌రావుకు దూరం పెరిగితే మాకు లాభమని ఎత్తుగడలు వేసింది. అదీ కుదరలేదు. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒకరకమైన వివాదాలు తెరమీదకు తేవడం అన్నది చూస్తూనే వున్నాం. మంత్రి హరీష్‌రావు వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం కూడా చూస్తూనే వున్నాం. తన జీవితం టిఆర్‌ఎస్‌ కంటే ముందు కేసిఆర్‌తో ముడిపడివుంది. అలాంటి కేసిఆర్‌ను కాదనుకునే పరిస్థితి హరీష్‌రావుకు ఏనాడు ఉండదు. తన జీవితాన్ని ఇంతగా తీర్చిదిద్దిన తండ్రి లాంటి నాయకుడిని దూరం చేయాలని కుట్రలు చేస్తూనే వుంటారు. ఆ మాయలో ఎవరూ పడిపోవద్దని, తనకు చెడ్డపేరు తేవొద్దని ఆయన అభిమానులకు కూడా హరీష్‌రావు చెబుతుంటారని ఆయన అనుచరులు అంటున్నారు.

 గతానికి విన్నంగా కొత్త కుట్రలు?

 గతంలో ప్రతిపక్షాలు చేసిన కుట్రలు ఫలించలేదు. కొత్తగా కుట్రలు తెరమీదకు తేవాలని చూశారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలను కొత్త అస్త్రాన్ని చేసుకున్నారు. ట్రబుల్‌ షూటర్‌కు ట్రబుల్స్‌ అని కొత్త ప్రచారం మొదలు పెట్టారు. అదే హరీష్‌రావు, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఓడించినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎలా సాధ్యమైందని ముక్కున వేలేసుకున్నారు. మంత్రి హరీష్‌రావు చాణక్యాన్ని పైకి ప్రశంసించకపోయినా, ఆయన ఎత్తుగడలను అంచనావేయడం కష్టమనుకున్నారు. కాని దుబ్బాకతో హరీష్‌రావు మీద విషం చిమ్మడం మొదలుపెట్టారు2018 ఎన్నికల తర్వాత చాలా కాలం పాటు హరీష్‌రావును దూరం పెట్టారన్న ప్రచారం మరీ విపరీతంగా చేశారు. హరీష్‌రావు మళ్లీ మంత్రి కాగానే కొంత కాలం ఊరుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో మళ్లీ కొత్తకుట్రలకు తెరతీశారు. ఓడిపోయే స్థానాలకు మంత్రి హరీష్‌రావును పంపుతున్నారంటూ, ఎనలేని ప్రేమలను ప్రదర్శిస్తూ, దుష్టనీతిని చూపించుకున్నారు. ఇప్పుడు మళ్లీ పాత కథను ముందుకు తెస్తూ హుజూరాబాద్‌ విషయంలోనూ అదే విషం చిమ్మారు. అయినా వారి పప్పులు ఉదకలేదు. ఆనక మంత్రి హరీష్‌రావుకు అదనంగా వైద్య ఆరోగ్యశాఖను అప్పగించడంతో కొత్త పంథాను (ప్రతిపక్షాలు ఎంచుకున్నాయి. కొత్త వాదనకు తెరలేపాయి.

ఆరోగ్యశాఖపై అటు అపోహలుఇటు హరీష్‌ పై సానుభూతి పవనాలు

 ఇక ఈటెల రాజేందర్‌ తర్వాత హరీష్‌రావును పక్కన పెట్టేందుకే అచ్చిరాని ఆరోగ్యశాఖను కట్టబెట్టారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అందుకు కొన్ని విషయాలను ఉటంకిస్తూ లేని పోని, వితందవాదాలు చేస్తున్నారు. పుటలకు పుటలు వార్తలు వండించి పత్రికల్లో వార్చుతున్నారు. కనిపించని కుట్రలకు తెరతీస్తున్నారు. గతమంటూ, వర్తమానమంటూ లేని

పోని విషయాలు ముందుకు తెస్తున్నారు. ఈసారి మంత్రి హరీష్‌రావు ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా చూస్తున్నారు. కాని అది జరిగేది కాదు. ఆయన ఎప్పుడూ బెదిరిపోలేదు.

 ప్రస్తుత తరుణంలో కీలక బాధ్యతలు

 ప్రతి దాన్ని ఓ సవాలుగా స్వీకరించే తత్వం వున్న నాయకుడు హరీష్‌రావు. హరీష్‌రావు అంటేనే అంకితభావానికి పేరు. అలాంటి నాయకుడు ఉద్యమమైనా, పోరాటమైనా,

అభివృద్ధి అయినా అన్నింటినీ సమపాళ్లలో చూడడం ఆయనకు అలవాటు. అందుకే ఆయనను పనిరాక్షసుడు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఎప్పుడు సిద్ధిపేటలో వుంటాడో, ఎప్పుడు హైదరాబాద్‌లో వుంటాడో, ఎప్పుడు గజ్వల్‌లో అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటాడో ఎవరికీ తెలియదు. తెల్లారే సరికి సిద్దిపేటలో వుంటాడు. అర్ధరాత్రి హైదరాబాద్‌ చేరుకుంటాడు. ఎప్పుడు తింటాడో, ఎప్పుడు క్షణం కునుకు తీస్తాడో అన్నది ఎవరికీ అర్ధం కానిది. అలాంటి నాయకులు చాలా అరుదు. ఇప్పుడే కాదు ఉద్యమ నాయకుడిగా ఆయన తెలంగాణ జెండా ఎత్తుకున్న నాటినుంచే ఇది అలవాటు చేసుకున్నాడు. అది ఆయన విజయాలకు ఎంతో తోద్చడుతోంది. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నీటి పారుదల శాఖ మంథత్రిగా ఆయనే చేసిన సేవలు ఉజ్వల కీర్తిని అందించాయి. ఓ వైపు మిషన్‌ కాకతీయ పనులు, మరో వైపు సాగు నీటి ప్రాజెక్టులు. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో అక్కడే హరీష్‌రావు నిద్రలు చేసిన రోజులు కూడ అనేకం వున్నాయి. ఎండనక, వాననక అక్కడే వుంటూ, పనులన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అధికారులతో సమీక్షిస్తూ కొత్త చరిత్ర సృష్టించాడు. నాలుగేళ్లలో ఒక బహుళార్ధక ప్రాజెక్టుకు మించిన ప్రాజెక్టును దగ్గరుండి పూర్తిచేయించాడు. కేసిఆర్‌ కలలు నెరవేర్చాడు. కేసిఆర్‌ కలల రూపాన్ని ఆవిష్కరించాడు. ఏకంగా నాటి గవర్నర్‌తో హరీష్‌రావు కాదు, కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు. అదీ హరీష్‌రావు. అలాంటి హరీష్‌రావుపై ఎన్ని కుట్రలు చేసినా విఫలమౌతున్నాయని, తాజాగా ఆరోగ్యశాఖపై కొత్త వాదనలు తెస్తున్నారు.

హరీష్‌రావు నీటి పారుదల శాఖ మంత్రి అయ్యేదాకా అసలు ఆ శాఖ మంత్రులు ఏం చేస్తారన్నది పెద్దగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే గత నలభై ఏళ్లలో ఎంతో మంది భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసినా, వాళ్లు చెరువులు, కుంటల దగ్గర నీటి సవ్వడులు మాత్రమే చూశారు. హరీష్‌రావు నీటి పరుగులు చూపించాడు. గలగల పారుతున్న కాలువలు చూపించాడు. ప్రతి ఊరులో నిండిన చెరువులు చూపించాడు. చెరువులు ఎండాకాలంలో మత్తులు దుంకేలా చేశాడు. మండు వేసవిలో చెరువుల్లో నీళ్లు చూపించాడు. పల్లెల్లో పచ్చదనం చూపించాడు. పచ్చటి పంటపొలాలకు మళ్లీ వేధిక చేశాడు. కొత్తగా ఆవిష్కరించిన చెరువులు చూపించాడు. తెలంగాణ చెరువుల్లో మాయమైన చేపలను చూపించాడు. మత్స్య పరిశ్రమకు మళ్లీ తెలంగాణలో జీవం పోయడంతో కీలక భూమిక పోషించాడు. ఇప్పుడు కూడా ఆరోగ్యశాఖలో అదే చేయబోతున్నాడు. గతంలో ఏం జరిగిందో ప్రజలు మర్చిపోయేలా చేస్తాడు. కొత్త తరం ఆరోగ్యకల్పనలో నూతన ఆవిష్కరణలు చూపిస్తాడు. సహజంగానే తన నియోజకర్ణ్ల ప్రజలైనా, ఇతరులెవరైనా సరే…. ఆయనకు ఒక్క మెసేజ్‌ పెడితే చాలు వెంటనే స్పందించడం ఆయనకు అలవాటు. కరోనా సమయంలో ఓ జర్నలిస్టు అన్నాహరీషన్నానన్ను కాపాడు అంటూ పెట్టిన మెసేజ్‌తో కదిలి ఆ జర్నలిస్టును కాపాడిని ఘనత హరీష్‌రావుది. ఆయన నియోజకవర్గంలోని ప్రతి ఇంటిలో ఏదో ఒక సాయం కనిపిస్తుంది. ఆయనకు నియోజక వర్గంలోని ఏ కార్యకర్త సమాచారం అందినా సరేక్షణాల మీద వారికి వైద్య సేవలు అందిస్తుంటారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో కరఠరోన బాధితులకు పోషకవిలువలున్న కిట్‌ను అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అలాంటి హరీష్‌రావు ఆరోగ్యశాఖ మంత్రి అయితే ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. కొత్త చర్విత లిఖించవచ్చు. పేదలు ఎంతో భరోసాగా వుండొచ్చు. ఆయన సిద్ధిపేటలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయించాడు. వెటర్నరీ కాలేజీ కూడా ఏర్పాటు జరగనున్నది. ఆరోగ్యశాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, నీటి పారుదల శాఖ అంటే హరీష్‌రావు అని ఎలా నిరూపించాడో, ఆరోగ్యశాఖ అంటే కూడా హరీష్‌రావు అని కొన్ని తరాలు చెప్పుకునేలా చేస్తాడనడంలో సందేహంలేదు. కరోనా మూడో తరంగం వస్తుందేమో అన్న సూచనలు అందుతున్న తరుణంలో హరీష్‌రావు కు ముఖ్యమంత్రి అదనపు బాధ్యతలు అప్పగించడంలో ఆయన సామర్థ్యమే కొలమానంగా తీసుకున్నారని చెప్పడంలో సందేహంలేదు. పైగా హుజూరాబాద్‌ ఫలితాల తర్వాత హరీష్‌రావు ప్రాభవం తగ్గుతుందని ఆశించని వారికి కునుకులేకుండా పోయింది. ఏది ఏమైనా తెరాస జెండాను (గ్రామ (గ్రామాన ఎగురవేశాడు. తన నియోజకవర్ల ప్రజల గుండెల్లొ నిండిపోయాడు. అలాంటి హరీష్‌రావుపై పనిగట్టుకొని చేసే కుట్రలు ఎప్పటికైనా ప్రచారాలుగా మాత్రమే మిగిలిపోతాయి. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు హరీష్‌రావుకు మెండుగా ఉన్నాయి.

 

 

నేడే బహుజన సమాజ్ పార్టీ చలో మానుకోట కార్యక్రమం

మహబూబాబాద్, నేటిధాత్రి: బహుజన రాజ్యాధికారాని కై హలో బహుజన చలో మానుకోట నేడు జరగబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ మహబూబాద్ జిల్లా ఇంచార్జ్ దార్ల శివరాజ్ , అసెంబ్లీ అధ్యక్షులు తప్పెట్ల, చాణక్య, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పాల్వాయి బుచ్చిరాములు పిలుపునిచ్చారు.మంగళవారం గ్రామ, గ్రామాలు తిరిగి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ…బుధవారం 22న బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగ మహబూబాబాద్ యశోద గార్డెన్ లో బహుజన రాజ్యాధికార సంకల్పసభకు వస్తున్నందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలు అధికసంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

భారతదేశంలో రాజ్యాధికారంలో బహుజనులకు తగిన భాగస్వామ్యం లేదు బహుజనులు మమేకమై బహుజన రాజ్యం కోసం కృషి చేయాలని డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకత్వం లో బహుజనులకు న్యాయం జరుగుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు పాల్గొని కార్యక్రమన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రైతుల సంక్షేమమే బిజెపి ప్రభుత్వ ధ్యేయం :

రేగొండ నేటిధాత్రి :
రేగొండ, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రజాసంక్షేమం రైతుల సంక్షేమం పట్ల ఎప్పుడు నిబద్ధతతో ఉంటుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్నఅన్నారు.రేగొండ మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి అధ్యర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సందర్బముగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపన్న మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం, నిజాంనిరంకుశత్వం పాలన సాగిస్తుందని, ధర్నాల పేరట కెసిఆర్ రైతులను మోసం చేస్తూ వ్యవసాయ రంగాన్ని కూని చేస్తూ రైతులను మాయమాటలతో మోసం చేస్తున్నాడు అనిఅన్నారు. రైతుల జీవితాలతో ఆడుకున్న ఏప్రభత్వంమనుగడసాగించలేదు అని అన్నారు .

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిశిధర్ రెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలులో తెరాస ప్రభుత్వం మోసంచేస్తూఢిల్లీలోఒక్కమాట గల్లీలో ఒక్క మాటతో తెలగాంణ ప్రజల ను మోసం చేస్తూ , భారత ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ తగలబెట్టడం సిగ్గు చేటు అని బీజేపీ కార్యకర్త మీద దాడి చేయండి అని చెప్పడం కెసిఆర్ దిగజారుడుకు నిదర్శనము అని వారుఅన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముడుపు అశోక్ రెడ్డి, సుంకరి మనో హర్, గాలిఫ్, బీజేపీ మండల ప్రధానకార్యదర్శి పెండల రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు కిరణ్,ఎస్టీ మార్చ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version