విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య

విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య

భూపాలపల్లి నేటిధాత్రి:
గణపురం(ము) మండలం చేల్పూర్ జడ్ పి ఎస్ ఎస్ పాఠశాల లో ఆర్ డి టి సేవా సంస్థ అధ్వర్యంలో విద్యార్థులకు 30 ఉచిత సైకిళ్ల జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆర్ డి టి సేవా సంస్థ జిల్లా ఇన్చార్జ్ సుబ్బారావు చేతుల మీదుగా సైకిళ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేల్పూర్ సర్పంచ్ నడిపెల్లి.మధుసూదన్ రావు చేల్పూర్ ఎంపిటిసిలు చెన్నూరి.రమాదేవి మధూకర్ పొనగంటి .సుధర్మ మల్హర్ రావు ఉప సర్పంచ్.రజియా డీఈవో ఎంఈఓ హెచ్ఎం జుమ్ము నాయక్ మాజీ ఎంపిటిసి దాసరి రవీందర్ మాజీ పిఎసిఎస్ చైర్మన్ పిన్నింటి.మాధవరావు సొసైటీ డైరెక్టర్లు బల్గూరి.బాబురావు రామదాసు.రాజు టిఆర్ఎస్ యువజన నాయకులు చెన్నూరి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

నిత్యం ఇదే తంతు: ఎట్లా సార్

మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా) (నేటిధాత్రి):

ప్రతి మనిషికి జీవితంలో తాను చేసేది కరెక్ట్ అని భావిస్తారు. ఎదుటివారు ఏమైతే నాకేంటి అనే ఆలోచన. ఈ మాటలకు ఉదాహరణ మల్కాజిగిరి నియోజకవర్గం జిహెచ్ఎంసి కార్యాలయం పరిధిలోని కొంతమంది వ్యవహరిస్తున్న తీరు. జిహెచ్ఎంసి కార్యాలయం పక్కన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నిత్యం పేద ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తోంది. అయితే ఈ ఆస్పత్రికి చేరుకోవాలంటే జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట అడ్డగోలుగా నిలిపిన వాహనాలు దాటుకుని, అలాగే ఇరుకు సందుల్లో నిర్వహిస్తున్న వారాంతపు సంతను దాటుకుని ఆస్పత్రికి చేరుకోవాలి. ఆ సమయంలో రోగికి ఏమైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. పలుమార్లు స్వచ్ఛంద సంస్థలు ట్రాఫిక్ సిబ్బందికి ఈ సమస్య విన్నవించిన, కేవలం ఆ సమయాన హడావిడి చేసి ట్రాఫిక్ సిబ్బంది తమ చేతులు దులుపుకుంటున్నారు. ఎక్కడో రోడ్లపై వాహనాలు ఆగితే చాలాన్ విధించే ట్రాఫిక్ సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రికి వచ్చే దారిలో అడ్డగోలుగా వాహనాలు నిలిపే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలు స్వచ్ఛంద సంస్థలు అడగకనే అడుగుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ సిబ్బంది మరియు జిహెచ్ఎంసి అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే దారిలో ఎటువంటి వాహనాలు నిలప కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేద ప్రజలు కోరుతున్నారు.

రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి అమానుషం

టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటగిరి సతీశ్ గౌడ్

భూపాలపల్లి నేటిధాత్రి:
టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు “రేవంత్ రెడ్డి ” ఇంటిపై కొంత మంది టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరగింది
ఈ సందర్బంగా కోటగిరి సతీశ్ మాట్లడుతూ
రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి అప్రజాస్వామికం కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతే ఏ ఒక్కరు కూడా మిగలరు . ప్రజాస్వామ్య బద్దంగా పోరాడితే అప్రజాస్వామికంగా దాడి చేస్తారా
ప్రజాస్వామ్య బద్దంగా పోరాడడమే కాంగ్రెస్ పార్టీ సంస్రృతి
టీఆర్ఎస్ కార్యకర్తల గుండాగిరికి భయపడలేదు
ఉద్యమ సమయంలో కాంగ్రెస్ తలుచుకుంటే ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త మిగిటుండేది కాదు
కాంగ్రెస్ దమ్మేంటో ఎన్నికల్లో చూపిస్తాం లేదంటే ఇప్పుడే ఎన్నికలు పెట్టండి
| తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ గుండాలు అప్రజాస్వామికంగా దాడిచేయడం సిగ్గుచేటుగా ఉందని, తెలంగాణ రాష్ట్ర సాదనలో భాగంగా జరుగిన ఉద్యమ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా మిగిలి ఉండేవారు కారని దూయబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజాస్వామ్య బద్ధంగా న్యాయం జరగాలని పోరాడుతున్న రేవంత్ రెడ్డిపై పెరుగుతున్న ఆధరణ చూసి ఓర్వలేక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావ్, అతని తనయుడు కల్వకుంట్ల తారకరామారావ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడికి దించారని ఇంతటి అన్యాయానికి ఒడిగట్టిన పాపం ఊరికేనే పోదని అన్నారు.- టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష నేతలపై విరుచకపడి దాడీలు చేయడమే ముఖ్యమనుంకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడీ ఏంటో చూపించక మానదని అన్నారు కార్యక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రాన్ని ఏలడం కాదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే దృక్పదంతో కాగ్రెస్ పార్టీ పోరాడుతుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మింగుడుపడక అప్రజాస్వామిక కార్యక్రమాలు చేస్తున్నారని ఇందుకుగా కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగు దాడి చేస్తే ఎందుకు పనికి రాకుండా పోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వైనాల రవీందర్. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండ శ్రీకాంత్. సోషల్ మీడియా స్టేట్ వైస్ చైర్మన్ యాంసాని నాగరాజు. బ్లాక్ కాంగ్రెస్ సభ్యులు నాంపల్లి వీరేశం. బొంపల్లి రవీందర్. గొల్లపల్లి వెంకన్న. బోల్లికొండ చిన్న రాజయ్య. శాస్త్రాల సుధాకర్. బిక్కిన సంపత్ రావు. శ్రీను.ఖాదర్.కిట్టు. దుగ్యాల రమేష్. బొల్లి పైడి. యువజన కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజుల రాజు. మచ్చ ప్రభాకర్. అడగని వీర గోపాల్. పండుగ రమణ. సుధాకర్. పంజాల వెంకటేష్. గజ్జి రాజేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

దళిత క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

కరీంనగర్ జిల్లా,జమ్మికుంట, నేటిధాత్రి :

దళిత క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వారి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలోని హనుమాండ్లపల్లిలో బుధవారం నూతనంగా నిర్మించిన బాప్టిస్ట్ చర్చిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కులాలు, మతాల వారిని సమ దృష్టితో చూస్తున్నారన్నారు. కెసిఆర్ నాయకత్వంలో సెక్యులర్ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. అందరి స్థితిగతులను మరింత మెరుగుపర్చేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చిలు, ఆలయాలు, మసీదుల నిర్మాణాలు, వాటి మరమ్మత్తులు, అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఇస్తున్నదన్నారు. దళిత క్రిస్టియన్ల డిమాండ్లు, బంధు పథకాన్ని వర్తింపజేయాలనే కోరిక గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తమని చెప్పారు. క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తున్నదన్నారు. పేద వారికి దుస్తులు అందజేస్తున్నం, హైదరాబాద్ లో రెండు ఎకరాలలో 10 కోట్లతో క్రిస్టియన్ భవన్ నిర్మాణం జరుపుతున్నం అన్నారు. క్రిస్టియన్ల శ్మశాన వాటికల కోసం హైదరాబాద్ పరిసరాలలో 65 ఎకరాలు కేటాయించినం, పనులు కూడా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మునిసిపల్ ఛైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, బాప్టిస్ట్ చర్చి అధ్యక్షుడు డేవిడ్ శాంతరాజు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, కౌన్సిలర్లు పోనగంటి మల్లయ్య, పోనగంటి విజయలక్ష్మీ, టిఆర్ఎస్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, తాళ్లపల్లి సరళ, పాస్టర్లు తాల్లపల్లి జాషువా, జయకర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

కమిషనర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న పోలీసులు

రాయపర్తి(వరంగల్ రూరల్)నేటి ధాత్రి:

సెప్టెంబర్ 22 రాయపర్తి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జి సురేష్. కానిస్టేబుల్ బోట్ల రాజు. కత్తుల శ్రీనివాస్. గడ్డం రమేష్. చిదిరాల రమేష్. బండారి మహేందర్ లు తమ విధి నిర్వహణలో ప్రతిభ కనబరచినందుకు గాను గుర్తించి బుధవారం హన్మకొండ హెడ్ క్వాటర్ లో వరంగల్ కమిషనర్ తరుణ్ జోషి చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రాలను అందుకున్నారు కమిషనర్ తరుణ్ జోషి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న వారు తమ భాద్యతను పెంచిందని ఆనందం వ్యక్తం చేసారు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

రామన్నపేట నేటిదాత్రి: యాదాద్రి జిల్లా

రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి పిలుపు మేరకు సుభాష్ సెంటర్లో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం అప్రజాస్వామికం గజ్వేల్ సభ చూసి ఓర్వలేక కెటిఆర్ దాడులు చేయడం సరైనది కాదని హుజూరాబాద్ లో ఓడిపోతామని భయంతో ఎన్నికలు వాయిదా వేసిన రు తెలంగాణలో ప్రజాస్వామ్యం దారుణంగా ఉందని వారు మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాల్వెర్ అశోక్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జమీరోద్దిన్ జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ సభ్యులు మహమ్మద్ అజీమొద్దీన్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఎజాజ్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు భ ర్ల స్వామి తుమ్మలగూడెం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు సింగబోయిన గణేష్ మండల కాంగ్రెస్ నాయకులు మహేశ్వరం అశోక్ మహ్మద్ మహబూబ్ అలీ మొహమ్మద్ సలీం ఇర పెళ్లి రమేష్ అంజయ్య మధు సోమయ్య నర్సింహా తదితరులు పాల్గొన్నారు

ఆదమరిస్తే అంతే….

 వాహనదారులకు తప్పని తిప్పలు
పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధులు
నెక్కొండ, నేటిధాత్రి: నిత్యం ఎంతో రద్దీగా కనిపించే రోడ్లు ప్రధాన రహదారులు ఇప్పుడు గుంతల మయం తో ఏ రోడ్డు పైన ఏ రంద్రం ఉందో ఊహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి వాటికి తోడుగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ఆర్ అండ్ బి అధికారుల పనితీరు తోడుకావడంతో వాహనదారులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే నిత్యం ఎంతో జనంతో రద్దీగా ఉండే ప్రధాన మార్గమైన నర్సంపేట నెక్కొండ రహదారి నుండి వరంగల్ కు వెళ్ళు మార్గం అయినటువంటి దీక్షకుంట, సీతారాంపురం , హరిచంద్ర తండా ,ముదిగొండ వెళ్లే రోడ్డు మార్గం అకాల వర్షాల కారణంగా పూర్తిగా శిథిలావస్థకు గురైంది. నర్సంపేట ప్రధాన రహదారి నుండి దీక్షకుంట కు వెళ్ళు మార్గంలో నీ మంగలి తండా వద్ద ఆర్ అండ్ బి రోడ్డుకు రంద్రాలు పడడంతో నిత్యం నెక్కొండ కు వెళ్లే ప్రజలు వాహనదారులు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందికి గురి అవుతున్నారు. కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా ఆర్ అండ్ బి అధికారులు తమ రోడ్డు వైపు కూడా చూడలేదని కేవలం అధికారులు ప్రభుత్వ జీతానికి తప్ప ప్రజా సమస్యలు పట్టించుకునే వారు కాదు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక నాలుగు గ్రామపంచాయతీలకు చెందిన రైతులకు విద్యార్థులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అయ్యా గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం నెక్కొండ నర్సంపేట కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇకనైనా ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని స్థానికులు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగం పై అవగాహన సదస్సు

నేటిధాత్రి కమలాపూర్:

కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో మంగళ వారం పంగిడిపల్లి గ్రామంలో వినియోగదారులకు ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బ్యాంకు అధికారి సాయి బాబు,నాబార్డ్ కోఆర్డినేటర్ మల్లారెడ్డి మాట్లాడుతూ బ్యాంకులో పొదుపులు,రుణ సౌకర్యాలు, బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న

ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, జీవనజ్యోతి భీమా యోజన,అటల్ పెన్షన్ యోజన,ఇతర భీమా సౌకర్యాలపై వివరించారు. ఏటీఎం కార్డు లో వినియోగంలో జాగ్రత్తలు మొబైల్ బ్యాంకింగ్,గూగుల్ పే, ఫోన్ పే లాంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ అవగాహన కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు అపర్ణ, రాము,గ్రామ సర్పంచ్ చెలిక శ్రీనివాస్,గ్రామ యువకులు,రైతులు,బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఆహార భద్రతా చట్టం

– అంగన్‌వాడీలు, రేషన్ షాపుల తనిఖీ
– ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందాలనేదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం
– రాష్ట్ర పుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి
ధర్మసాగర్, నేటిధాత్రి:
రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని పుడ్‌ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి అన్నారు. బుధవారం ధర్మసాగర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన అమలు తీరు, రేషన్‌ డీలర్ల ద్వారా అందుతున్న సేవలను ఫుడ్‌ కమిషన్‌ చైర్మెన్ పరిశీలించారు.


ఈ సందర్భంగా తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ 2011 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ఆహార భద్రతా చట్టంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతోపాటు హక్కులకు భంగం కలుగకుండా చూడడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు. చట్టం అమలు తీరు, లబ్ధిదారుల సమస్యలపై ప్రత్యక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. వాటిని ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులు పరిష్కరించాలని ఆదేశించామన్నారు. ప్రతి విద్యార్థికీ పౌష్టికరమైన ఆహారం అందించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సరైన పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. మెనూ ప్రకారం సరుకులు, గుడ్డు, పాలు అందించాలన్నారు. రేషన్‌షాపుల్లో ఏఏ కార్డు ద్వారా ఎన్ని కిలోల బియ్యం ఇవ్వాలో అంతే ఇవ్వాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ చంద్ర ప్రసాద్, జిల్లా పరిషత్ కోఆప్టెడ్ మెంబర్ జుబేదాలాల్ మహ్మద్, ఎంపీటీసీలు రొండి రాజు, జాలిగపు వనమాల, బొడ్డు శోభ సోమయ్య, ఎమ్మార్వో రాజు, పీడీ సబిత, శ్రీనివాస్, ఎంపీడీవో జవహర్ రెడ్డి, అంగన్వాడీ సూపర్ వైజర్ అరుణ, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మహా ధర్నాను జయప్రదం చేయండి

టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్ పిలుపు…

మహబూబ్ నగర్, నేటిధాత్రి: హైద్రాబాద్ లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర నేడు తలపెట్టిన మహా ధర్నాను జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిపక్ష పార్టీల శ్రేణులు హాజరై మహా ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు కలిసి మహాధర్నా ను నిర్వహిస్తున్నారని సాదిక్ పేర్కొన్నారు. దరిమిల మహాధర్నా లో ప్రజల సమస్యలు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు . ధరల పెరుగుదల. పొడు భూములు.వ్యవసాయ రైతాంగ సమస్యలపై. ధరణి సమస్యలు.భునిర్వాసితులు.కరోన వైరస్ నుండి చనిపోయిన వారి కుటుంబాల కోసం.పెట్రోల్ డీజిల్ ధరల పెంపు.తదితర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. మహాధర్నా లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ జాతీయ రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు పాల్గొంటారని సాదిక్ ఈ సంధర్బంగా పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సాదిక్ తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కెసిఆర్ పెద్దపీట

హైదరాబాద్( పాలకుర్తి), నేటి ధాత్రి:

అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నారని

రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ, సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పాలకుర్తి మండలంలోని శాతాపురంలో పలు సిసి రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన, చెన్నూరులో గ్రామపంచాయితీ భవనం, రైతువేదిక ల ప్రారంభోత్సవం, పెద్ద తండా(బి) లో గ్రామ పంచాయితీ లను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… అన్ని కులాలు, వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నారు. దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కరోనా కష్ట కాలం అభివృద్ధికి ఆటంకంగా మారింది. అయినా సీఎం కెసిఆర్ తన చాణక్యం తో అభివృద్ధి, సంక్షేమం లను ఆపలేదు. ఇంత కష్ట కాలం లో కూడా దళితులకు దళిత బంధు ఇస్తున్నాం. పేదలకు ఇండ్లు ఇస్తున్నాం. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నదన్నారు.

కేంద్ర సహకారం లేకున్నా, సాగునీరు, 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, రుణాల మాఫీ సహా పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ప్రజల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం దేశంలో లేదు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ, ప్రజలు సహకరించాలి. అన్ని గ్రామాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి. కరోనా ను కనిపించకుండా చేయాలి. ప్రజలంతా భాగస్వాములు కావాలి. అని మంత్రి ప్రజలకు ఉద్బోధించారు.

ఈ రోజు నిరుపేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక సీఎం కెసిఆర్ గారు నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రానివాళ్లు బాధపడొద్దు. త్వరలో భూమి వున్న వాళ్లకు డబ్బులు ఇచ్చి మరీ ఇల్లు కట్టిస్తాం…అన్నారు.

కొందరు నాయకులు రాజకీయం చేస్తూ…కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.వాళ్లకు అన్ని తెలుసు. రైతు వేదికలు రైతులను సంఘటిత పరుస్తోంది. సీఎం కేసిఆర్ స్వయంగా రైతు కాబట్టే రైతుల మేలు కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీ లాంటి పథకాలు ప్రవేశపెట్టి రైతును రాజు ను చేశారు. ఎవరూ ఊహించని దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళితులకు ఆరాధ్య దైవం గా కెసిఆర్ మారారు. ఊరిలో నిజమైన పేదోల్లు దళితులు అందుకే వాళ్లకు 10 లక్షలు ఇస్తున్నాం. ముందుగా దళితులు, తరువాత ఎస్ టీ లు, బీసీ లకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తాం. అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

కరోనా వల్ల మనం చాలా నష్టపోయాం అయినా అందరికీ పథకాలు అందిస్తున్నాం. గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు అందరూ ఉపయోగించుకొని కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవాలి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

18 ఏళ్ళు దాటినా ప్రతిఒక్కరు వాక్సిన్ వేసుకోవాలి

గుండాల( భద్రాద్రి కోత్తగూడేం), నేటిధాత్రి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆల పల్లి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి వాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వ ప్రాథమిక వైద్యరాలు కందుల సంధ్యారాణి అన్నారు, అనంతరం వారు మాట్లాడుతూ శనివారం అనంతోగు, జిన్నెల గూడెం,తీర్ల పురం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని వైద్య సిబ్బంది మీకు అందుబాటులో మీ గ్రామాలకు వస్తున్నారని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అదే క్రమంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డెంగ్యూ, మలేరియా విష జ్యరాలు ప్రభాలే ప్రమాదం ఉన్నందున ఇంటి పరిషరా ప్రాంతాల్లో డ్రైనేజీ ప్రదేశాలలో నిలవరదన్నారు వ్యాక్సిన్ అందరూ వేసుకునేలా గ్రామాలలో ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు ప్రోత్సహించే విధంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మంక్కిడి నరేష్, ఏఎన్ఎం పెండకట్ల రమణ, ఆశా వర్కర్లు చంద్రకళ,విజయలక్ష్మి,కావేరి శిరోమణి,సావిత్రి,సునీత,చుక్కమ్మ సుగుణ,తదితరులుపాల్గొన్నారు

24 గంటల్లో 255 కరోన కేసులు

హైదరాబాద్‌ నేటిధాత్రి :

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 255 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 329 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్‌ బారినపడి ఒకరు మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,63,281కి పెరిగింది. 6,54,230 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారితో ఇప్పటి వరకు 3,903 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,148 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 52,244 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 70, ఖమ్మంలో 21, కరీంనగర్‌లో 20 కేసులు రికార్డయ్యాయి.

మహా దీక్షను విజయవంతం చేయాలి

కేయూ క్యాంపస్ నేటిధాత్రి:
సెప్టెంబర్ 22న తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల మహా దీక్షని విజయవంతం చేయాలి ఆని
కాకతీయ యూనివర్సిటీ అతిథిగృహంలో విద్యార్థి నాయకుడు కళ్లేపల్లి ప్రశాంత్ అధ్యక్షతన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో మహా దీక్ష కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ
తక్షణమే రాష్ట్రంలో అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలో కాళీగా ఉన్న టీచింగ్ నాన్-టీచింగ్ మరియు ఎస్సీ ఎస్టీ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు, యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని
అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ లను రెగ్యులరైజ్ చేసి వాటికి రెగ్యులర్ పోస్టుల మంజూరు చేయాలని కోరారు.

భక్తులు జాగ్రత్తలు పాటిస్తూ గణేష్ నిమజ్జనాలు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా ఆనందంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య జిల్లా ప్రజలను ఒక ప్రకటనలో కోరారు. వర్షాకాలం కాబట్టి ఈ మధ్య కురిసిన అధిక వర్షాల వలన జిల్లాలోని అన్ని వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని చెరువులు, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండి ఉన్నందున ఆదివారం నాడు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎస్ఐ, మండల ప్రత్యేక అధికారులు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని, కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో అధిక సంఖ్యలో గణేశుని ప్రతిమలు నిమజ్జనం జరుగుతాయి కాబట్టి అక్కడ జిల్లాస్థాయిలో జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డిఓ, జెడ్పీ సీఈవో, జిల్లా హార్టికల్చర్ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి, డిఎస్పి, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులను ప్రత్యేకంగా నియమించి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని గోదావరిలో నీరు అధికంగా ఉన్నందున బ్రిడ్జి పై నుండి మాత్రమే వినాయకులను నిమజ్జనం చేయడానికి అనుమతి ఉంది కాబట్టి ఎవరు వినాయకుల నిమజ్జనం కోసం నేరుగా గోదావరి నది వద్దకు వెళ్లరాదని అన్నారు. ప్రభుత్వ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ వాహనాలను నడుపుతూ తోటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో అనుమతి మేరకు తక్కువ మంది మాత్రమే వాహనాలలో ప్రయాణిస్తూ క్షేమంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువత సంయమనం పాటిస్తూ పోలీస్ అధికారుల సూచనలను సలహాలను తు.చ తప్పకుండా పాటిస్తూ covid 19 నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గణేష్ నిమజ్జనంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version