`ఉద్యమ పార్టీగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత.
`బడుగు నేతలకు అత్యంత గౌరవం.
`బిఆర్‌ఎస్ బాటలోనే అన్ని పార్టీలు.
`కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడలు.
`రెడ్డి రాజ్య స్థాపన బీరాలు.
`బడుగులను పక్కనపెట్డే కుట్రలు.
`బిజేపిలో అదే వైఖరి?
`ప్రతిపక్షాలలో కనిపించని బడుగుల గుర్తింపు.
` ఒక్క బిఆర్‌ఎస్ లోనే అసలైన అత్యంత గౌరవం.
`ఉద్యమ వేదిక నుంచే బడుగులకు పెద్ద పీట.
`తెలంగాణ సమాజమంతా ముక్త కంఠంతో చెప్పేది ఒక్కటే.
`అన్ని వర్గాల సంక్షేమం కోరేది ఒక్క బీఆర్‌ఎస్ పార్టీనే.
`బిఆర్‌ఎస్ అంటే బడుగులకు బాసట.
` బిఆర్‌ఎస్ పార్టీయే తెలంగాణ కు కొండంత అండ.
`ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వమే తెలంగాణ కు శ్రీరారక్ష.
హైదరబాద్,నేటిధాత్రి:
రాజకీయ పార్టీలు రాజకీయమే చేయాలి. కాని సైద్దాంతిక రాజకీయాలు చేయాలి. ప్రజలకు మేలు చేసే రాజకీయాలు చేయాలి. ఓడ ఎక్కెదాకా ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అనేలా వుండకూడదు. అందులోనూ కుల, మత రాజకీయాలు అసలే చేయొద్దు. దురదృష్టమేమిటంటే దేశంలో ప్రధాన స్రవంతి పార్టీలైన బిజేపి, కాంగ్రెస్‌లో చేసేది ఇదే. అందుకే కాంగ్రెస్ పార్టీ కులాల వారిగా రాజకీయాలు చేస్తే, బిజేపి మత పరమైన రాజకీయాలు చేస్తుందన్న అపవాదు వుండనేవుంది. ఈ రెండు పార్టీలు ఈ రెండు నమ్ముకున్నా, ఓట్ల కోసమే బడుగులను వాడుకుంటూ వస్తున్నాయి. కాని ఏనాడు బుడుగులుకు ఈ రెండు పార్టీలు పెద్ద పీట వేసింది లేదు. బుడుగులసామాజిక వర్గాలకు న్యాయం చేసింది లేదు. వారిని ఆర్ధికపరంగా ముందుకు తీసుకొచ్చింది లేదు. వారికి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించే పధకాలు అందించింది లేదు. కాని మన స్వతంత్ర దేశంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాతే అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందుతున్నాయి. అన్ని రకాల సంక్షేమ పధకాలు అందించబడుతున్నాయి. కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రమే దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అందులో దళిత బంధు, గిరిజన బంధు, పోడు పట్టాలు, బిసిలు లక్ష సాయం, రైతుబంధు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పధకాలు ప్రజలకు అందుతున్నాయి. దానికి తోడు రాజకీయంగా కూడా బడుగులకు పెద్ద పీట వేస్తున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్. బిఆర్‌ఎస్‌లో వున్నంత మంది బడుగులనేతలు మరే పార్టీలో లేరు. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా కీలకస్ధానాల్లో వున్నారు. భవిష్యత్తులో బిఆర్‌ఎస్ మాత్రమే బడుగుల నేతలకు మరింత ప్రాదాన్యతనివ్వనుంది.
జనం కోసం ఆలోచించలేని పార్టీలు కూడా ఓట్లకోసం జపం చేస్తుంటారు
. ఎన్నికలు దగ్గర పుడుతున్నప్పుడే వాళ్లు గుర్తుకొస్తుంటారు. ఆ క్షణం దాటిందంటే మేమంటే మేమే..మాకు మేమే అన్నట్లు వ్యవహరించడంలో కాంగ్రెస్, బిజేపిలు ఒకరిని మించి మరొకరు నాటకాలు ఆడడంలో ఆరితేరిపోయారు. అందుకే తెలంగాణ సమాజం బిఆర్‌ఎస్‌ను ఆదిరిస్తూ వస్తోంది. బిఆర్‌ఎస్‌నే గెలిపిస్తూ వస్తోంది. బిఆర్‌ఎస్ మాత్రమే బడుగుల ప్రయోజనాలు కాపాడుతుందన్న నమ్మకం బలంగా వుంది. బిఆర్‌ఎస్ కేవలం బడుగులే కాదు, అగ్రవర్ణాల పేదలకు కూడా మేలు చేయడంలో ముందుంది. ప్రజలు అంతగా బిఆర్‌ఎస్‌ను గుండెల్లో పెట్టుకోవడం ఇష్టం లేని జాతీయ పార్టీలు, కులాల కుంపట్లు రగిలించేందుకు గత మూడు,నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే వున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్‌రెడ్డి అధ్యక్షుడయ్యాక తెలంగాణలో కుల రాజకీయాలకు, ముఖ్యంగా రెడ్డి రాజకీయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు.
ఈ విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఓ వేదిక మీద పంచుకున్నారు. గతంలో రెడ్డి సంఘాల సమాఖ్యలను ఏకం చేసే పని ఆయన పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసినప్పుటి నుంచే మొదలుపెట్టాడు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలైన రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ పార్లమెంటుకు పోటీ చేశాడు. ఆ సమయంలో ఆయన ఆ పార్లమెంటు పరిధిలోని రెడ్డి కులస్ధులతో అనేక ధఫధపాలుగా సమావేశాలు నిర్వహించారు. దాంతో మల్కాజిగిరి ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన పిపిసి. మీద కన్నేసి, పిసిసి. అధ్యక్షుడు అయిన తర్వాత రెడ్డి ఐక్య వేధిక సమావేశం పరోక్షంగా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన చేసి వ్యాఖ్యలు ఇప్పటికీ తెలంగాణ సమాజం మర్చిపోదు. ఎందుకంటే రెడ్డి అంటే కనీసం పది ఎకరాల స్థలం వుండాలి. వాళ్లు రాజకీయంగా ఎదగాలి. రెడ్డి రాజకీయం ఉమ్మడి రాష్ట్రంలో లాగా కీలకపాత్ర పోషించాలంటే మనమంతా ఏకం కావాలి. ఒక్కతాటిపై రావాలి. ఇతర పార్టీలలో వున్నవారిని ఎలాగైనా కాంగ్రెస్‌లోకి తెప్పించే ప్రయత్నం చేయాలి. అంటూ ఆయన అనేన విషయాలు చెప్పాడు. ఇప్పుడు అదే ఆ పార్టీలో అనుసరిస్తూ వస్తున్నాడు.
బడుగు నేతలను ఎక్కడిక్కడ పక్కన పెడుతూ, కేవలం రెడ్డి నాయకత్వాన్నే ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
ఇటీవల కాంగ్రెస్‌లో చేరుతున్న వారి లిస్టు చూస్తే కేవలం రెడ్డి నాయకులే కనిపిస్తున్నారు. ఎక్కడా ద్వితీయ శ్రేణి నాయకులుగా బడుగులను ప్రోత్సహించడం లేదు. తాజాగా ఆలేరుకు సంబంధించిన కాంగ్రెస్ నేతుల గాంధీభవన్‌కు న్యాయం చేయాలని వస్తే వారందరినీ సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరించారు. గతంలో ఏ పిపిసి. అధ్యక్షుడు ఇలా మాట్లాడిన సందర్భాలు లేదు. గతంలో ఏఐసిసి. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓటింగ్‌లో సాక్ష్యాత్తు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ లాంటి వారు గాంధీభవన్ ముందు దర్నా చేయాల్సిన రావడం దురదృష్టకరం. అదే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిత్యం పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఏదో రకంగా విమర్శిస్తూనే వుంటాడు. కొన్ని సార్లు దూషించిన సందర్భాలున్నాయి. మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసే వ్యాఖ్యలు ఎలా వుంటాయో తెలంగాణ సమాజానికి తెలియంది కాదు. ఆయన కూడా నిత్య అసమ్మతి వాదిగా రేవంత్‌ను ఎప్పుడూ ఎదిరిస్తూనే వుంటాడు. ఇటీవల తాజాగా కూడా అమెరికాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో ఎవరూ స్పందించపోయినా, అందరికన్నా ముందు స్పందించి తప్పని నిర్ధారించింది ఆయనే. అంటే రెడ్డిలో నిత్య అసమ్మతి వాదులున్నప్పటికీ రెడ్డి నేతలపై ఎలాంటి చర్యలు వుండవు.
గతంలో కూడా కాంగ్రెస్ కల్చర్ ఇలాగే వుండేది.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్ని దశాబ్ధాల పాటు పార్టీలో నిత్యం ఏదో ఒకటి రగిలిస్తూనే వుండేవారు. 1989లో చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసింది కూడా వైఎస్సే అని సాక్ష్యాత్తు చెన్నారెడ్డే అసెంబ్లీలో ప్రకటించారు. అంటే వారి రాజకీయం కోసం ఎవరైనా ఇబ్బందులకు గురి చేసేందుకు వెనకాడని తత్వం వున్నా సరే రెడ్డి అంటే చాలు ఏమనరు? ఇక అదే వైఎస్ . రాజశేఖరెడ్డి మరో ముఖ్య మంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని పదేపదే ఇరుకున పెట్టేవారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక జనార్ధన రెడ్డి బార్యకు మంత్రి పదవి ఇచ్చారు. మరో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డితో సభలో చెప్పులు విసిరేయించినట్లు వైఎస్‌పై ఆరోపణలున్నా ఆయనను పార్టీ వెనకేసుకొచ్చింది. ఆఖరుకు కోట్ల విజయభాస్కరరెడ్డి తన రాజీనామా లెటర్‌ను ఎప్పుడూ జేబులో పెట్టుకొని వుంటూ వుండేవారని అంటుంటారు. అంటే వాళ్లకు వాళ్లే కొట్లాడుకుంటున్నట్లు నటిస్తూ, బడుగుల సానుభూతితో ఓట్లు సంపాదించి, అధికారంలోకి రావడం రెడ్డి నేతలకు అనాదిగా వస్తున్న అలవాటే. ఇప్పుడూ రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. మిగతా రెడ్డి నేతలు కూడా అదే అనుసరిస్తున్నారు. కాని అదే కాంగ్రెస్‌లో ఎవరైనా బిసిలు, ఎస్సీ, ఎస్టీలు నోరు తెరిస్తే చాలు వాళ్లను క్షణాల్లో పార్టీ నుంచి సాగనంపే కార్యక్రమం క్షణాల్లో జరుగుతుంది. ఓట్లు రెడ్డిలవి, సీట్లు బడుగులవి అంటూ కాంగ్రెస్ మీద వున్న అపవాదే ఇప్పటికీ అమలౌతోంది.
తాజాగా బిజేపి కూడా అదే వర్గంలో చేరిపోయింది.
తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో బిజేపి అధ్యక్షులుగా ఎంతో మంది రెడ్డి నేతలే పనిచేశారు. అందులో ఏ ఒక్కరు బిజేపికి బలం పెంచలేదు. కాని వాళ్లు మాత్రం బలపడుతూ వచ్చారు. వారిలో ఒక్క లక్ష్మణ్ తప్ప మరో బిసి నేత కనిపించరు. ఆయన కూడా ఒకేసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు. గతంలో కూడా బిజేపికి రెండుసార్లు కిషన్‌రెడ్డి అధ్యక్షుడుగా పనిచేశాడు. కాని పార్టీ కి వచ్చిన ఊపులేదు. గెలుపు లేదు. కాని ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు గతంలో ఎన్నడూ లేనంతగా బిజేపిని నిత్యం లైమ్‌లైట్‌లో వుంచిన నాయకుడు బండిసంజయ్. ఆయన ను కూడా ఇప్పుడు పక్కనపెట్టారు. మళ్లీ బిజేపిని రెడ్డినేత చేతులో ్లనే పెట్టారు. కాని మళ్లీ మరో బిసినేతకు ఇవ్వలేదు. ఎందుకంటే బిసి నేతలు ఎదగడం ఏ రెడ్డి సామాజిక వర్గ నేతలకు ఇష్టం వుండదు. తాజాగా బండి సంజయ్ ఇదే విషయాన్ని తన అనుచరులతో చెప్పుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తనపై క్షక్ష కట్టి మరీ దింపేశారని చెప్పుకున్నాడని అంటుంటారు. ఇలా పైకేమో బడుగుల గురించి బాష్యాలు చెబుతూ, పార్టీ సంగతికొచ్చేసరికి బడుగులను దూరంపెట్టడమే బిజేపి అంతర్గత స్వామ్యమని మరోసారి తెలిపోయింది.