అతిరక్త హీనతతో బాధపడుతున్న విద్యార్థులను జిల్లా ఆసుపత్రి లేదా ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయాలి

ఆరోగ్య శ్రీ కింద రిజిస్ట్రేషన్ లు పెంచాలి

బర్త్ ప్లానింగ్ పై ఫోకస్ పెట్టీ అన్నీ కాన్పులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా:నేటిధాత్రి 

సిరిసిల్ల లో తీవ్రరక్త హీనతతో బాధపడుతున్న విద్యార్థులను రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (RBSK) బృంద సభ్యులు స్క్రీనింగ్ ద్వారా గుర్తించిన వెంటనే

జిల్లా ఆసుపత్రి లేదా ఏరియా ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం రిఫర్ చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

మోడరేట్ లక్షణాలతో బాధపడుతున్న వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా చికిత్స అందేలా చూడాలన్నారు.

శనివారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ లో వైద్య ఆరోగ్య శాఖ పథకాల పై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

జిల్లాలో బర్త్ ప్లానింగ్ పై వైద్యాధికారులు

ప్రత్యేక ఫోకస్ అన్ని 

కాన్పులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చూడాలనీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

సాధారణ ప్రసవాలు పెంచేందుకు తొలి కాన్పులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

క్రమం తప్పకుండా పురోగతి పై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అన్నారు.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కనీసం ఒక్క స్టాఫ్ నర్స్ అయిన ఉండేలా చూడాలని జిల్లా వైద్యాధికారి నీ ఆదేశించారు.

పూర్తి స్థాయిలో క్ష‌య వ్యాధి (టిబి) నిర్మూల‌నే లక్ష్యంగా నిర్ధేశించుకుని టిబి ప‌రీక్ష‌లు విరివిగా చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిగా చేయాల్సిన స్ఫుటం పరీక్షల లక్ష్యాలను నిర్దేశించుకుని సకాలంలో పూర్తి చేయాలన్నారు. తక్కువ పరీక్షలు జరుగుతున్న చోట వెంటనే క్యాంపులను నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

టిబి వ్యాధిబారిన ప‌డినవారికి ప్ర‌భుత్వం ‘‘నిక్ష‌య్ పోష‌ణ యోజ‌న’’ కింద అందించే 

ఆర్థిక సహాయం వ్యాధి బాధితులు అందరికీ అందేలా చేయాలన్నారు.

ఇప్పటికే ఎన్క్వాస్ గుర్తింపు కోసం బృంద పరిశీలన కొనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తి అయినందున… త్వరలో బృంద పరిశీలన అంబేద్కర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొదురుపాకలలో PHC లలో కూడ జరగనన్న దృష్ట్యా పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి పరిశీలన సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అలాగే రెండో దశలో లింగన్నపేట, నేరెళ్ల, బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నేషనల్ క్వాలిటీ అస్సూరెన్సు స్టాండర్డ్స్  (NQAS) గుర్తింపు కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించి నిధులు మంజూరైనందున ఆ దిశగా పనులను గుర్తించి సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు.

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆసుపత్రులలో ఏమైనా మెడిసిన్ కొరత ఉన్న, వేతనాలు పెండింగ్ బకాయిలు ఉంటే చెప్పాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలకు పరిష్కారం చూపుతానన్నారు.

ఎల్లారెడ్డిపేటలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన రెండు ఎకరాల స్థలం లేకపోవడం వల్ల నిర్మాణ పనులు ప్రారంభించ లేక పోతున్నామని వైద్యాధికారులు సమావేశంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తేగా వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత తాసిల్దార్ జయంత్ తో మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆసుపత్రి నిర్మాణం కోసం గుర్తించాలని సూచించారు.

గంభీరావుపేట, ఎల్లారెడ్డి పేట ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారించి ఆసుపత్రులను బలోపేతం చేసే దిశగా వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఏమైనా మైనర్ రిపేరు లుంటే తనకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు.

ఆరోగ్య శ్రీ కింద రిజిస్ట్రేషన్ లు పెంచాలి*

జిల్లా ఆస్పత్రితో పాటు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ప్రతిరోజు అడ్మిషన్ల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నప్పటికీ ఆ మేరకు 

ఆరోగ్య శ్రీ క్రింద కేసుల కింద నమోదు కావడం లేదని అందుకు గల కారణాలు ఏంటి అని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రావు వేములవాడ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మహేష్ , ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ అభిలాష్ లను ప్రశ్నించారు.

ఆరోగ్య శ్రీ క్రింద కేసుల కింద కేసులు పెరిగి చికిత్స అందిస్తే సంబంధిత ఆసుపత్రులకు ఇన్కమ్ జనరెట్ అవుతుందని చెప్పారు. ద్వారా మరిన్ని మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు సమంత నిధులను వెచ్చించే అవకాశం చేకూరుతుందన్నారు.

స్థానికంగా ఉండాల్సిన జిల్లా ఆరోగ్యశ్రీ బృంద కోఆర్డినేటర్ కరీంనగర్ లో ఉండడం వల్ల జిల్లాలో ఆశించిన మేర రిజిస్ట్రేషన్లు కావడం లేదని వెంటనే ఆరోగ్యశ్రీ బృంద కోఆర్డినేటర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉంటూ PHC, ఏరియా, జిల్లా ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ కేసుల కింద రిజిస్ట్రేషన్ లను పెంచాలన్నారు.

ఏమైనా గ్యాప్ ఉంటే వెంటనే గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించే సమావేశాలలో కూడా జిల్లా ఆరోగ్యశ్రీ బృంద కోఆర్డినేటర్ తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా డిప్యూటీ వైద్యాధికారులు డా శ్రీ రాములు, డా. రజిత, MCH ప్రోగ్రాం అధికారి డా మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *