‘బోరా’ సాబ్ కబ్జా కహాని
రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చి వరంగల్‌లో స్థిరపడిన కుటుంబం రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ భారీగానే వెనకేసుకున్నారు. వ్యాపారాలు చేసి అలసిపోయారో ఏమో తెలియదు. కానీ ఇంకా సంపాదించాలంటే రియల్‌ఎస్టేట్ రంగం సరైన వేదిక అనుకున్నారు ఆ రంగంలోకి అడుగుపెట్టారు. వ్యాపారాలు చేసుకోవడం తప్పులేదు, రియల్‌ఎస్టేట్ కూడా తప్ప కాదు. కానీ వచ్చిన చిక్కల్లా కబ్జాలు చేయడమే. ఆ కబ్జా భూముల్లో అక్రమ వెంచర్లు వేసి అప్పనంగా దండుకుందామనుకోవడమే సరిగ్గా ఇదే జరుగుతుంది. గీసుగొండ మండలంలోని గొర్రెకుంట, ధర్మారం మధ్యలో రాజస్థానీ అయినా జెపి బోరా అనే వ్యక్తి ఈ కబ్జాకు తెరలేపాడు. ఊరచెరువు శిఖం భూమిని, ప్రభుత్వ భూమిని, గొర్రెకుంట ప్రాంతానికి చెందిన దళితుల భూమిని కబ్జా చేసి అక్రమ వెంచర్‌కు శ్రీకారం చుట్టాడు. ఇది తప్ప కదా అని ‘నేటిధాత్రి’ ప్రశ్నిస్తే మీకు ఫిర్యాదు చేసిన వారిని కేసు వేసుకోమనండి అంటూ తలబిరుసు సమాధానం చెప్తున్నాడు. స్థానికంగా కొంతమంది యువకులను చేరదీసి డబ్బు ఆశచూపి తన చుట్టూ తిప్పుకుంటూ ఇప్పటికే కోట్ల రూపాయలు వెనకేసాడని జెపి బోరాపై ఆరోపణలు ఉన్నాయి.
( జెపి బోరా కబ్జా కహానిపై సమగ్ర కథనం త్వరలో…)